నవతెలంగాణ- కౌడిపల్లి
గోవాలో జరిగిన అంతర్జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన శ్రీ వర్ధన్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. శనివారం రాత్రి గోవాలో ఆరు దేశాలకు జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో గ్రామీణ పేద కుటుంబానికి చెందిన ఐదవ తరగతి విద్యార్థి శ్రీ వర్ధన్ రెండవ స్థానం దక్కించుకున్నాడు. ఆదివారం విద్యార్థి తండ్రి అశోక్ విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ కరాటే మేజర్ డాక్టర్ కత్తిరావన్ చేతుల మీదుగా అవార్డు దక్కించుకున్నాడు. శ్రీ వర్ధన్ హైదరాబాదులోని జగదీశ్వర్ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు.గత సంవత్సరం విద్యార్థి హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో విజయం సాధించి జాతీయస్థాయికి ఎంపికై శనివారం జరిగిన ఆరు దేశాలకు సంబంధించిన కరాటే ఛాంపియన్స్ లో ద్వితీయ స్థానం దక్కించుకోవడంపై పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.