– భూపాలపల్లి డిపో మేనేజర్ ప్రథమ్‌రెడ్డి
నవతెలంగాణ-మహాదేవపూర్
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం నుంచి భూపాలపల్లి వరకు ఎక్స్ ప్రెస్ సర్వీస్ ప్రారంభించడం జరిగిందని భూపాలపల్లి డిపోమేనేజర్ ప్రథమ్‌రెడ్డితెలిపారు ఉదయం 6:30 నిముషాలకు కన్నాయిగూడెం మండల కేంద్రం నుంచి భూపాలప ల్లికి 11గంటలకు వెళ్లడం జరు గుతుంది. మళ్ళీ 11:30గంటలకు భూపాలపల్లి నుంచి బయలుదేరి 2:40గంటలకు కన్నాయిగూడెం చేరుకుం టుంది. మళ్ళీ 2:50గంటలకు నిముషాలకి కన్నాయిగూడెం నుంచి భూపాలపల్లి కి 6గంటలకు చేరుకోవడం జరుగు తుంది. మళ్ళీ భూపాలపల్లి నుంచి 6:25గంటలకు బయ లుదేరి 9:30 కన్నాయిగూడెం చేరుకుంటుంది. రాత్రి కన్నా యిగూడెంలో హాల్టింగ్ చేయడం జరుగుతుందని. ఇట్టి బస్సు సదుపాయంను ప్రజలు వినియోగించుకోవాలని అన్నారు. మారుమూల గ్రామలైన భూపాలపల్లి జిల్లాలోని సూరారం అంబటిపల్లి, పెద్దంపేట, పలిమేల మండలం లోని ముకునూరు, పంకెన, సర్వాయిపేట, దమ్మూరు, నీలం పల్లి, ముకునూరు, ములుగు జిల్లాలోని తుపాకులగూడెం, లక్ష్మి పురం, తదితర గ్రామాలను, రెండు జిల్లాల మధ్య ఈ బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చిన డిపో మేనేజర్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. తమ గ్రామాల్లోకి ఎక్స్ ప్రెస్ బస్సు రావడం మొదటి సారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సౌకర్యం ద్వారా కన్నాయిగూడెం వెళ్ళడానికి సమయం చాలా తగ్గిందని, ఇంతకు ముందు వయా భూపా లపల్లి, ఘనపూర్ క్రాస్, జంగాలపల్లి గుండా ఏటూరు నాగారం వెళ్లి తర్వాత కన్నాయిగూడెం వెళ్ళేవాళ్ళమని, ఇప్పుడు ఆ బాధ తప్పిందని చెబుతున్నారు. ప్రజలు ఎవ్వరు కూడా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించొద్దని, ఆర్టీసీ సేవలను వినియోగించు కోవాలని అన్నారు.