నవతెలంగాణ- ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఓ బస్సు లోయలో పడిపోవడంతో ముగ్గురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. నైనిటాల్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్టు జిల్లా ఎస్ఎస్పీ తెలిపారు. ఇప్పటివరకూ 28 మందిని సురక్షితంగా వెలికి తీశామని పేర్కొన్నారు. మృతదేహాలు బయటకు తీశామని, బస్సులో ఇంకా ఒకరిద్దరు చిక్కుకుని ఉన్నారని తెలిపారు. త్వరలో వారిని కూడా బయటకు తీసుకొస్తామని చెప్పారు. ప్రస్తుతం అక్కడ రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.