– కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు భగవాన్ మైనారిటీ రాష్ట్ర నాయకులు సుల్తాన్ విజ్ఞప్తి,
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ నిర్మాణం కోసం జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండే బుధవారం నాడు శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరమని కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు తమ్మే వార్ భగవాన్ అలాగే కాంగ్రెస్ పార్టీ మైనారిటీ రాష్ట్ర నాయకులు సుల్తాన్ బుధవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ లైటింగ్ నిర్మాణం పనులు ప్రారంభమైతే పాత బస్టాండ్ సమీపంలోని ఇరువైపుల గల వ్యాపార సముదాయాలు పూర్తిగా తొలగింపుకు గురి అవుతాయని అలాంటి వారికి ప్రభుత్వ స్థలంలో వ్యాపార సముదాలకు స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా వారు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిండేకు మద్నూర్ గ్రామ సర్పంచ్ కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు ఈపాటికి 161 వ జాతీయ రహదారి మండల కేంద్రం మీదుగా కాకుండా బైపాస్ మీదుగా వెళ్లడంతో మద్నూర్ మండల కేంద్రంలో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఇక సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి పనులు చేపడితే రోడ్డుకు ఇరువైపుల గల వ్యాపార సముదాయాలు పూర్తిగా తొలగిపోయి ఆస్కారం ఉన్నందున గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో గల వ్యాపార సముదాయలకు తొలగిపోతే వెంటనే ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి వాటిని నూతనంగా నిర్మింప చేయాలని వారు విజ్ఞప్తి చేశారు మద్నూర్ మండల కేంద్రంలో వ్యాపారాలు కొనసాగడమే కష్టం అవుతున్న తరుణంలో సెంటర్ లైటింగ్ ద్వారా రోడ్డుకిరువైపులా వ్యాపార సముదాయాలు పూర్తిగా తొలగింప చేయవలసి వస్తుందని కోల్పోయిన వ్యాపారులకు వెంటనే ప్రభుత్వ స్థలంలో రోడ్డుకు ఆనుకొని అనుమతులు ఇవ్వాలని వారు ఇటు సర్పంచుకు అటు ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.