బటర్ మష్రూమ్స్ రుచికరమైన, పోషక విలువలతో కూడిన ఆహారం. వీటిలో పుష్కలంగా ఉండే ప్రోటీన్‌లు, విటమిన్‌లు, ఖనిజాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. ప్రోటీన్ శాతం పెంచుకోవడానికి బటర్ మష్రూమ్స్ ఉత్తమమైన ఆహారం. వీటిలో అధిక ప్రోటీన్‌తో పాటు తక్కువ కేలరీలు, ఇతర పోషకాలు సమద్ధిగా ఉంటాయి. కనుక బటర్ మష్రూమ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇప్పుడు బటర్ మష్రూమ్స్‌లోని పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
తక్కువ క్యాలరీలు, కొవ్వు : బటర్ మష్రూమ్స్ తక్కువ క్యాలరీలు, కొవ్వును కలిగి ఉండటం వల్ల, బరువు తగ్గాలని చూసేవారికి ఇది సరైన స్నాక్.
ప్రోటీన్ : మష్రూమ్స్‌లో ఉండే ప్రోటీన్ కండరాలకు అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తుంది.
విటమిన్లు : విటమిన్ డి, విటమిన్ B1 (థయామిన్), B2 (రిబోఫ్లావిన్), B3 (నియాసిన్), B5 (పాంటోథెనిక్ ఆమ్లం), విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తి ఉత్పత్తి, మెదడు ఆరోగ్యానికి ఎంతో అవసరం.
ఖనిజాలు : సెలీనియం, పొటాషియం, కాపర్, ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు అందుబాటులో ఉంటాయి. సెలెనియం యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఫాస్ఫరస్ ఎముకల ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు : శరీరాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఫైబర్ : మష్రూమ్స్‌లో ఉండే ఆహార ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మంచి పేగు ఆరోగ్యాన్ని ప్రమోట్ చేస్తుంది.
ఇంట్లో తయారు చేయడం వల్ల ప్రయోజనాలు
తక్కువ కేలరీలు, కొవ్వు : ఇంట్లో తయారు చేసినప్పుడు, అదనపు నూనెలు, సోడియం ఉపయోగించకుండా తయారు చేయవచ్చు.
ఆరోగ్యకరమైన పదార్థాలు: నాణ్యమైన పదార్థాలను ఉపయోగించి, రుచిని మెరుగుపరచడానికి ఆరోగ్యకరమైన మసాలాలు వాడవచ్చు.
హైజీన్: ఇంట్లో తయారు చేయడం వల్ల ఆహారం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
బయట తినే అలవాటు వల్ల ప్రభావాలు
అధిక కేలరీలు, కొవ్వు : బయట తినేటప్పుడు అధిక నూనె, సోడియం ఉపయో గించే అవకాశం ఉంది.
అనారోగ్యకరమైన పదార్థాలు: కొన్ని రెస్టారెంట్లు తక్కువ నాణ్యమైన పదార్థాలను ఉపయోగించవచ్చు.
హైజీన్ సమస్యలు : బయట తినేటప్పుడు ఆహారం శుభ్రంగా ఉండకపోవచ్చు
ఆరోగ్యానికి హాని కలిగించే స్నాక్ అలవాట్లను నివారించడం
బటర్ మష్రూమ్స్ ఆరోగ్యకరమైన స్నాక్ అయినప్పటికీ, వాటిని ఆరోగ్యకరమైన విధంగా తయారు చేయడం ముఖ్యమైనది. వీటిని ఎక్కువగా నూనె లేదా వెన్నలో వేయించటం గ్రిల్ చేయడం, మానుకొని రోస్ట్, ఉడకబెట్టి చేయడం లేదా తక్కువ నూనెతో చేయడం మంచిది
చిన్నపిల్లలు, పెద్దవారు తరచుగా ఎక్కువ కేలరీలతో కూడిన ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను తినడం వల్ల స్థూలకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. ఇలాంటి అనారోగ్యకరమైన అలవాట్లకు బదులుగా పోషక విలువలతో కూడిన ఇంట్లో తయారు చేసుకునే బటర్ మష్రూమ్స్ వంటి స్నాక్స్‌ను తీసుకోవడం ఉత్తమం.
పోషక విలువలు
పోషక విలువల పట్టిక(Nutritive Value Table)
పోషక మూలకం 100గ్రా. పరిమాణం
కాలరీస్ (Calories) 250-300 కేలరీలు
ప్రోటీన్(Protein) 6-10 గ్రాములు
కొవ్వు (ఫ్యాట్) (Fat) 10-15 గ్రాములు
కార్బోహైడ్రేట్లు (Carbohydrates) 30-40 గ్రాములు
విటమిన్ A 500-700 ×ఖ
విటమిన్ C 5-10 మి.గ్రా.
విటమిన్ D 0.5-1 మైక్రోగ్రామ్
విటమిన్ B1 (తియామిన్) 0.1-0.2 మి.గ్రా.
విటమిన్ B2 (రిబోఫ్లేవిన్) 0.05-0.1 మి.గ్రా.
విటమిన్ B3 (నియాసిన్) 0.5-1 మి.గ్రా.
కాల్షియం(Calcium) 50-100 మి.గ్రా.
Dr.Prathusha. Nerella
MD( General Medicine) CCEBDM; CCGDM; NLP; FID
Senior General Physician, Positive Psychologist certified Nutritionist, Diabetes And Lifestyle Expert, Pranic Healer Chiief Holistic Health Consultant And Medical Director @ Praveha General, Diabetes And Lifestyle Clinic – A Holistic Centre With Integrated Approach. Ph: 8897684912/040-49950314