13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు..

By Electionనవతెలంగాణ – హైదరాబాద్
లోక్‌సభ ఎన్నికల హడావుడి ముగిసింది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలను భర్తీ చేసే పనిలోపడింది. ఈ నేపథ్యంలో మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించింది. బీహార్ (1), పశ్చిమ బెంగాల్ (4), తమిళనాడు (1), మధ్యప్రదేశ్ (1), ఉత్తరాఖండ్ (2), పంజాబ్ (1), హిమాచల్ ప్రదేశ్‌ (3) రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జులై 10న ఎన్నికలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. జూన్‌ 14న గెజిట్‌ విడుదల చేయనున్నట్లు తెలిపింది. జూన్‌ 21వ తేదీ శుక్రవారం ఎన్నికల నామినేషన్‌కు ఆఖరి తేదీ అని పేర్కొంది. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన, 26వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపింది. జులై 13న కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Spread the love