గవర్నర్ ప్రసంగానికి క్యాబినెట్ ఆమోదం

గవర్నర్ ప్రసంగానికి క్యాబినెట్ ఆమోదం

నవతెలంగాణ హైదరాబాద్‌: తెలంగాణ క్యాబినెట్ భేటీ (TS Cabinet Meeting) ముగిసింది. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Governor Tamilisai Soundararajan) ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం లభించింది. గవర్నర్‌ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై క్యాబినెట్‌ భేటీలో చర్చించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ప్రసంగం కావడంతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే దానిపై సుమారు గంటన్నరపాటు చర్చ జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉంది.. రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందనే అంశాలతో గవర్నర్‌ ప్రసంగం ఉండనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని ప్రభుత్వం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మిగతా నాలుగు గ్యారంటీల అమలుపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. అనంతరం గవర్నర్‌ ప్రసంగాన్ని ఆమోదిస్తూ క్యాబినెట్‌ తీర్మానం చేసింది.

Spread the love