క్యాబినెట్‌ విస్తరణ ఇప్పట్లో లేనట్లే: సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ – ఢిల్లీ: తెలంగాణ క్యాబినెట్‌ విస్తరణ ఇప్పట్లో లేనట్లే అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘క్యాబినెట్‌లో ఎవరుండాలనే విషయంలో పార్టీ అధిష్ఠానానిదే నిర్ణయం. నేను ఎవరి పేర్లు ప్రతిపాదించలేదు. పార్టీలో కీలక నిర్ణయాలు అధిష్ఠానం పరిధిలో ఉంటాయి. పార్టీ, పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగానే ఉంటా. వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు. పార్టీ ఇచ్చిన పనిని పూర్తి చేయడమే నా లక్ష్యం. రాహుల్‌తో నా అనుబంధంపై తెలియనివాళ్లు మాట్లాడితే నాకేంటి? నా పని చేసుకుంటూ పోవడమే నాకు తెలుసు’’ అని అన్నారు.

Spread the love