నవతెలంగాణ – హైదరాబాద్ : ఈ నెల 18న సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది. వరద నష్టం, కొత్తవారికి పెన్షన్ల మంజూరు, ఇతర పథకాల అమలు, ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. అన్ని శాఖల అధికారులు క్యాబినెట్‌లో చర్చించాల్సిన అంశాలను ఈ నెల 15వ తేదీలోగా పంపాలని సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశించారు.