కంటోన్మెంట్‌లో యుువత కోసం కేఫ్‌ పాలిటిక్స్‌

– నూతన కార్యక్రమాన్ని నిర్వహిస్తున క్రిశాంక్‌
నవతెలంగాణ-కంటోన్మెంట్‌
యువత సమస్యలను పరిష్కరించేందుకు వారికి రాజకీయ అవగాహన కల్పించేం దుకు తెలంగాణ ఖనిజ సంపద కార్పొరేషన్‌ చైర్మెన్‌ క్రిశాంక్‌ ‘కేఫ్‌ పాలిటిక్స్‌’ పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు .కంటో న్మెంట్‌ యువకులు సమస్యలను తెలుసుకుంటూ వారికి ఉద్యోగ అవకాశాల విషయం పై, యువత ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై చర్చించేందుకు ఈ కార్యక్రమాన్ని వేదికగా ఏర్పాటు చేశారు. యువత సమస్యలే కాకుండా వారికి రాజకీయాలపై అవగాహన కల్పించేందుకు కూడా వేదిక ఉపయోగపడే విధంగా మన్నె క్రిశాంక్‌ ప్రయత్ని స్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ వారం ఓ బస్తి ఎంచుకొని అక్కడ యువత కోసం ఈ కార్యక్ర మానికి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ వేదిక ద్వారా యువతకు ఉన్న సమస్య తెలుసుకోవడమే తన ప్రధాన లక్ష్యమని, అలాగే ఈ కేఫ్‌ పాలిటిక్స్‌ కార్యక్రమ ఉద్దేశం అని పేర్కొన్నారు. విద్యావంతులైన యువకుల అన్ని రకాల సమ స్యలు, బహుళజాతి కంపెనీలలో ఉపాధి అవకాశాలు గురిం చి చర్చించుకోవడం కోసం ఇదొక వేదికగా యువత ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. ‘కేఫ్‌ పాలిటిక్స్‌’ అనేది నా హృదయానికి దగ్గరగా ఉన్న కార్యక్రమం అన్నారు. కేఫ్‌ పాలిటిక్స్‌ కార్యక్రమంలో యువత స్థానిక సమస్యలు, రాజకీ యాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగావకాశాలు, కమ్యూని కషన్‌ స్కిల్స్‌ ప్రాముఖ్యతపై యువతకు అవగాహన కలుగుతుందని అన్నారు.

Spread the love