ఆలయ హుండీ లెక్కింపు

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్నూర్‌ మండల కేంద్రంలోని దక్షిణ కాశి శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయ హుండిని బుధవారం ఆలయ ఈవో శ్రీధర్, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో లెక్కించారు. ఈ సందర్భంగా ఆరు నెలల కాలంలో ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలు మొత్తం 6 లక్షల 34 వేల 867 రూపాయలు స్వామి వారికి కానుకల రూపంలో వచ్చినట్ట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పునర్నిర్మాణ కమిటీ డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
Spread the love