వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ కార్యక్రమంలో కేంబ్రిడ్జ్ భాగస్వామ్యం

– భారతదేశవ్యాప్తంగా లెర్నింగ్, రీసర్చ్ ఎక్సలెన్స్‌ను ప్రోత్సహించేందుకు సిద్ధమైన ప్రణాళిక

నవతెలంగాణ హైదరాబాద్: భారత ప్రభుత్వం సంచలనాత్మక వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ (ONOS) కార్యక్రమంలో కీలక ప్రచురణకర్తలలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ఒకటి. ఇది దేశవ్యాప్తంగా విద్య, పరిశోధన నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఒక మార్పు తీసుకువచ్చే ప్రయత్నంగా పని చేస్తోంది. తన అసంఖ్యాకమైన జర్నళ్లను కేంబ్రిడ్జ్ అందుబాటును విస్తరిస్తోంది. భారతదేశ విద్యా సముదాయం అధిక-నాణ్యత కలిగిన పరిశోధన, నిపుణులు సమీక్షించిన కథనాలను వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.
భారత ప్రభుత్వం నేతృత్వంలోని వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ (ONOS), దేశవ్యాప్తంగా నాణ్యమైన స్కాలర్లు అధ్యయనం చేసే జర్నళ్లకు అందుబాటును ప్రాప్యతను నిర్ధారించేందుకు చేస్తున్న ఒక మైలురాయి లాంటి ప్రయత్నం. ఇందులో పాల్గొంటున్న 30 ప్రపంచ ప్రచురణకర్తలలో ఒకటిగా, కేంబ్రిడ్జ్ సైన్స్, టెక్నాలజీ అండ్ మెడిసిన్ మరియు హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్‌లోని 430 జర్నళ్లను వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.  భారతదేశంలో ప్రభుత్వ నిధులతో పనిచేసే 6,380 సంస్థల్లోని 1.77 కోట్లకు పైగా వినియోగదారులకు అధిక-నాణ్యత విద్య, పరిశోధన కంటెంట్‌కు వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ (ONOS) చక్కని అందుబాటును అందిస్తుంది. భారతదేశం తన వికసిత్ భారత్ 2047 దార్శనికత వైపు పురోగతిలో కీలకమైన దశలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. కేంబ్రిడ్జ్ జ్ఞానాన్ని ప్రజాస్వామ్యీకరించడం, దృఢమైన పరిశోధనా పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం అనే భారతదేశ దార్శనికతకు మద్దతు ఇచ్చేందుకు కట్టుబడి ఉంది.
భారతదేశాన్ని ఇటీవల సందర్శించిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్‌లోని అకడమిక్ పబ్లిషింగ్ మేనేజింగ్ డైరెక్టర్ మాండీ హిల్, వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ (ONOS) మరియు విద్యా వనరులను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రపంచ అభ్యాసం, పరిశోధనను ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దానితో సహా వివిధ కార్యక్రమాలను చర్చించేందుకు భాగస్వాములతో ముఖాముఖి అయ్యారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా అభ్యాసం, జ్ఞానం మరియు పరిశోధన పురోగతిని మరింతగా పెంచాలనే కేంబ్రిడ్జ్ లక్ష్యానికి వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ (ONOS) చొరవ నేరుగా మద్దతు ఇస్తుంది. విస్తృతమైన అందుబాటు అనేది ఎక్కువ పరిశోధన ప్రభావాన్ని పెంచుతుందని మేము విశ్వసిస్తున్నాము. వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ (ONOS) ఈ సూత్రాన్ని ఆచరణలో పెట్టేందుకు మాకు అనుమతిస్తుంది. స్థానిక సంస్థలతో సహకారం ద్వారా జ్ఞాన భాగస్వామ్యం, ఆవిష్కరణలను ప్రోత్సహించే సమ్మిళిత పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని మేము ఆశిస్తున్నాము. ఈ ప్రయత్నం ద్వారా దేశ పరిశోధకులు, అభ్యాసకులను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం  నిబద్ధతను మేము అభినందిస్తున్నాము’’ అని ఆమె పేర్కొన్నారు.
భారతదేశం ONOS చొరవపై కేంబ్రిడ్జ్ స్పష్టమైన దృష్టిని కలిగి ఉంది. ఇది అధిక పరిశోధన చేయబడిన నిపుణులు సమీక్ష ఇచ్చిన జర్నల్స్‌ను సమానంగా, తేలికగా అందుబాటులోకి తీసుకువస్తుంది. ప్రచురణ రుసుములను తగ్గించడం ద్వారా భారతీయ పరిశోధనను ముందుకు తీసుకెళ్లేందుకు, సమగ్ర పరిశోధన పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు జాతీయ విద్యా విధానం 2020తో సమలేఖనం చేస్తుంది. కేంబ్రిడ్జ్ తన జర్నల్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, విద్యా పురోగతికి మద్దతు ఇవ్వడం, ఉత్పత్తిని పెంచడం ద్వారా భారతీయ పండితులకు సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. చివరికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలో దేశం  స్థానాన్ని మరింత ముందుకు తోడ్కొని వెళ్లనుంది.
‘‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ (ONOS) అనేది భారతదేశ ఉన్నత విద్యా రంగానికి గేమ్-ఛేంజర్” అని దక్షిణాసియాలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ అండ్ అసెస్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ రాజమణి అన్నారు. ‘‘ఈ ప్రయత్నంలో భాగం కావడం మాకు గర్వంగా ఉంది. ఇది తదుపరి తరం పరిశోధకులకు సాధికారత కల్పిస్తుంది. భారతదేశం  సంచలనాత్మక ఆవిష్కరణల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేస్తుంది. భారత ప్రభుత్వంతో ఈ అనుబంధం కేంబ్రిడ్జ్ దశాబ్దాలుగా అధ్యయనం చేసిన జ్ఞాన సంపదను పంచుకోవడానికి మాకు వీలు కల్పిస్తుంది.” అని వివరించారు.
వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ (ONOS) ద్వారా, భారతీయ విశ్వవిద్యాలయాలు కేంబ్రిడ్జ్ నుంచి ఎంపిక చేసిన ఘనమైన జర్నల్స్‌కు అందుబాటు కల్పిస్తాయి. వాటిలో జర్నల్ ఆఫ్ ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇండస్ట్రియల్ అండ్ ఆర్గనైజేషనల్ సైకాలజీ, ఆక్టా న్యూమెరికా, బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ, ఎపిడెమియాలజీ అండ్ సైకియాట్రిక్ సైన్సెస్, యూరోపియన్ సైకియాట్రీ, ఎపిడెమియాలజీ అండ్ ఇన్ఫెక్షన్, జర్నల్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ తదితరాలు ఉన్నాయి.
వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ (ONOS) దాని భాగస్వామ్యం ప్రభావాన్ని పెంచేందుకు, కేంబ్రిడ్జ్ దేశవ్యాప్తంగా విద్య, పరిశోధనా సమాజానికి మద్దతు ఇచ్చేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కార్యకలాపాల శ్రేణిని ప్లాన్ చేస్తోంది. వీటిలో స్కాలర్ల కమ్యూనికేషన్‌ను మెరుగుపరచేందుకు రూపొందించిన ప్రచురణ వర్క్‌షాప్‌ల శ్రేణి, ప్రచురణను సులభతరం చేసేందుకు, పరిశోధకుల సముదాయాన్ని బలోపేతం చేసేందుకు రచయిత సేవలపై మార్గదర్శకత్వం తదితరాలు ఉన్నాయి. ఈ విభిన్న కార్యకలాపాలను ఏకీకృతం చేయడం ద్వారా, భారతదేశం వ్యాప్తంగా జ్ఞాన-భాగస్వామ్యం, విద్యా వృద్ధి కోసం బలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యాన్ని కేంబ్రిడ్జ్ కలిగి ఉంది. కేంబ్రిడ్జ్ ప్రస్తుతం సైన్స్, టెక్నాలజీ అండ్ మెడిసిన్ మరియు హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్‌లోని విషయాలను కవర్ చేసే 430 కన్నా ఎక్కువ నిపుణులు-సమీక్షించిన అకడమిక్ జర్నళ్లను ప్రచురిస్తోంది. ఇవి 190 కన్నా ఎక్కువ దేశాలలో ఉనికిని, విస్తృత శ్రేణి ప్రచురణలతో, ఈ సంస్థ ప్రపంచ జ్ఞాన మార్పిడిని సులభతరం చేస్తూ, సరిహద్దుల మధ్య వంతెనగా వ్యవహరిస్తూ, సజావుగా అంతర్జాతీయ సహకారాన్ని అనుమతిస్తుంది.

Spread the love