ప్రచారం సమాప్తం…

– మూగబోయిన మైకులు, డప్పు చప్పులు
– అమల్లోకి ఎన్నికల అంక్షలు
– 30న పోలింగ్‌..డిసెంబర్‌ 3న కౌంటింగ్‌
ఎన్నికల ప్రచారం సమాప్తం. గడిచిన మూడు నెలలుగా గ్రేటర్‌ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ప్రతి బస్తీ, కాలనీలలో అన్ని పార్టీలు వివిధ రూపాల్లో తమ ఎన్నికల ప్రచారంతో హౌరేత్తించాయి. మైకులు సందడి, డప్పు చప్పులు, ప్రచార రథాలు, కళాకారుల ఆట పాటలతో ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపు లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు. మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి ఎన్నికల ఆంక్షలు అమలులోకి వచ్చాయి. దీంతో నగర వీధులు ఒక్కసారిగా మూగబోయాయి.
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎన్నికల ప్రచారం సమాప్తం. గడిచిన మూ డు నెలలుగా గ్రేటర్‌ పరిధిలోని 24 నియో జక వర్గాల్లో ప్రతి బస్తీ, కాలనీలలో అన్ని పార్టీలు వివిధ రూపాల్లో తమ ఎన్నికల ప్రచారంతో హౌరేత్తించాయి. మైకులు సందడి, డప్పు చప్పులు, ప్రచార రథాలు, కళాకారుల ఆట పా టలతో ఆయా పార్టీల అభ్యర్థులు గెలుపు లక్ష్యం గా ప్రచారం నిర్వహించారు. మంగళ వారం సాయంత్రం 5గంటల నుంచి ఎన్నికల ఆంక్షలు అమలులోకి వచ్చాయి. దీంతో నగర వీధులు ఒక్కసారిగా మూగబోయాయి. ఇదిలావుంటే సంక్షేమ పథకాలు తమ పదేండ్ల అభివృద్ధే నినా దంగా అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ బరిలోకి దిగ గా.. బీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ ఓటమే లక్ష్యంతో పాటు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కాం గ్రెస్‌, సీపీఐ(ఎం), బీజేపీ, ఇతర పార్టీలు ప్రచా రం సాగించాయి. డబ్బు, మత రాజకీయలను ఓడించండి.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీపీఐ(ఎం), ఆ పార్టీ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో గెలిపించాలనే నినాదంతో సీపీఐ (ఎం) ముందుకొచ్చింది. ఇతర పార్టీలు సైతం తమదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగించాయి.
విమర్శలు..ప్రతి విమర్శలతో ప్రచారం
ఇదిలావుంటే ఓటర్లను ఆకర్షించేందుకు ఒక్కొ పార్టీ ఒక్కొ విధంగా ప్రచారాన్ని నిర్వహి ంచాయి. ఇందులో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ నుంచి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు మొత్తం ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ కూడా ప్రచా రంలో వూహ్యాత్మకంగా వ్యవహరించింది. కాం గ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థుల గెలుపు కోసం రాహు ల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున్‌ ఖర్గే, కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం శివ కుమార్‌, ఇతర మంత్రులతో పాటు ఇతర ముఖ్యనేతలతో ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా సీపీఐ, టీజేఎస్‌ అధ్యక్షులు కోదం డరాం సైతం కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సీపీఐ(ఎం) ముషీరాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.దశరథ్‌ గెలుపు కోసం ఆ పార్టీ కేంద్ర పోలి ట్‌ బ్యూరో సభ్యులుబి.వి.రాఘవులు, సుభాషిని అలీ, కేంద కమిటీ సభ్యులు బి.వెంకట్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య, డిజి.నర సింహారావు, ఇతర ముఖ్య నాయకులుతో పాటు నగర నాయ కులు విసృత్తంగా ప్రచారం చేశారు. అలాగే బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షా, యోగి అధిత్యనాథ్‌, ఇతర కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల మం త్రులు సైతం ప్రచారం చేపట్టారు. ఇలా మొ త్తంగా అన్నీ పార్టీలు విమర్శలు, ప్రతివిమ ర్శలతో తమ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించా యి. ఈ నేపథ్యంలో అసలు యుద్ధానికి తేర లేచింది. ఈ నెల 30న పోలింగ్‌, డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ జరగనుంది. దీంతో రాష్ట్రంలోని ప్ర ధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐ, బీజేపీ, ఎంఐఎం, బీఎస్పీ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థుల భవిష్యత్తు ఎంటో తేలిపోనుంది. అలాగే ఏ పార్టీ అధికారంలోకి వ స్తుందనే విషయం డిసెంబర్‌ 3న తెలియనుం ది. ఇదిలావుంటే పోలింగ్‌తో పాటు కౌంటింగ్‌ కోసం ఈసీ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. హైద రాబాద్‌ జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌, డిప్యూటీ డీఈవో, జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రశాంతమైన వాతవారణంలో ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకోనే విధంగా భద్రత ఏర్పాట్లు పూర్తిచేశామని నగర పరిధిలోని మూడు కమిషనరేట్ల పోలీసు ఉన్నతాధికారలు తెలియజేశారు.

Spread the love