నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ఉమ్మడి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ప్రతిపాదించిన అభ్యర్థిగా హనుమంతు యాదవ్ గెలుపు కోసం మంగళవారం నాడు పార్టీ సీనియర్ నాయకులు చౌలవార్ హనుమాన్లు స్వామి ఆధ్వర్యంలో యువకులు మద్నూర్ ఉమ్మడి మండలంలోని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలంలోని మాదన్ ఇప్పర్గా, ఇలేగావ్, ఎనబోరా, ధోతి, తదితర గ్రామాల్లో ముమ్మరంగ పర్యటిస్తూ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ నాయకులను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాదన్ ఇప్పర్గా గ్రామ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉమాకాంత్ పటేల్ అదేవిధంగా ఇలేగావ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గౌస్ పటేల్ ఎనబోరా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు యూనిస్ పటేల్ దోతి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మద్నూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువకులు బండి వార్ హనుమాన్లు కర్రేవార్ అనిల్ ఆయా గ్రామాల యువకులు తదితరులు పాల్గొన్నారు.