వెల్లుల్లి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వెల్లుల్లి లేకుండా వంటలను ఊహించుకోలేం. వేపుళ్లకు, చట్నీలకు మరింత రుచిని జోడించేది ఇవే. వీటితో కేవలం రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా. వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఈ విషయం పక్కన పెడితే.. వెల్లుల్లి తొక్క తీయడం చాలా కష్టం. ఈ విషయం ప్రతిరోజూ వంట చేసేవారికి అర్థమవుతుంది. . ఒకవేళ వెల్లుల్లి తొక్క తీసేటప్పుడు దాని జిగురు గోళ్లకు కూడా అంటుకుంటుంది. ఒకటి, రెండు అయితే తీయవచ్చు కానీ.. పచ్చళ్లు పెట్టేటప్పుడు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని టిప్స్ ఉపయోగించి వెల్లుల్లి తొక్కలను ఈజీగా తీయవచ్చు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
– వెల్లుల్లి తొక్కలు ఈజీగా రావడానికి మైక్రోవేవ్ చక్కగా సహాయ పడుతుంది. మీకు ఎన్ని వెల్లుల్లి రెబ్బలు కావాలో వాటిని మైక్రోవేవ్‌లో వేడి చేయాలి. ఆ తర్వాత బయటకు తీసి.. వేళ్లతో తీస్తే తొక్క వచ్చేస్తుంది.
– ఒక వెల్లుల్లి పాయ తీసుకుని దాని చేతితో గట్టిగా ప్రెస్ చేయండి. ఆ తర్వాత మూత ఉన్న ఒక బాక్స్ తీసుకుని అందులో వెల్లుల్లి పాయల్ని వేసి గట్టిగా షేక్ చేయండి. ఇలా చేసినా వెల్లుల్లి రెబ్బలు వచ్చేస్తాయి.
– వెల్లుల్లి రెబ్బ తీసుకుని చాకుతో ప్రెస్ చేయండి. ఆ తర్వాత చేతితో ప్రెస్ చేసి తీసేస్తే.. తొక్క ఈజీగా వచ్చేస్తుంది.
– వెల్లుల్లి మీద ఉండే పొట్టు ఈజీగా రావాలంటే వాటికి ఆయిల్ రాసి.. ఎండలో ఆరబెట్టండి. ఆ తర్వాత తీస్తే.. పొట్టు ఈజీగా వస్తుంది.