కాలువల గండ్లు పూడ్చి సాగునీరు అందించాలి..

– పాలడుగు వెంకటకృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.
నవతెలంగాణ-గోవిందరావుపేట
లక్నవరం చెరువు ప్రధాన కాలువలకు ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పడిన గండ్లను వెంటనే పూడ్చి రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ గోవిందరావుపేట గ్రామ కమిటీ అధ్యక్షులు రామచంద్రపురం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కాలువ గండ్లు పూడ్చి సాగునీరు అందించాలని 163వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలు ఉద్దేశించి వెంకటకృష్ణ మాట్లాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల లక్నవరం ప్రధాన కాలువలకు గండ్లు పడడంతో నీరు నిల్వ లేక పంట సాగుకు అందట్లేదని కావున వెంటనే కాలువల గండ్లు పూడ్చి పొలాలకు సాగు నీరు అందించి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  భారీ వర్షాల వల్ల జలాశయాలు, వాగులు, వంకలు, ఒర్రెలు నిండి భారీగా వచ్చిన వరదల వల్ల పొలాలు కోతకు గురి అయి, నాట్లు వేసిన పంట పొలాలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి అని, అలాగే పంట పొలాల్లోని మోటార్లు కూడా నీటి ఉధృతి కొట్టుకుపోయాయి అని అన్నారు. అలాగే లక్నవరం ప్రధాన కాలువలు అయిన కోట, నర్సింహుల, కోట, శ్రీ రాంపతి కాలువలు వరద ఉధృతికి గండ్లు పడి నీరు వృధా అవుతున్నాయని అన్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతుల గురించి సీతక్క  అసెంబ్లీలో ప్రశ్నించిన కూడా  ముఖ్యమంత్రి కెసిఆర్  ఎటువంటి నష్టపరిహారం అందిస్తానని ప్రకటించకపోవడం గమనార్హం అని అన్నారు. రైతుల మీద కపట ప్రేమలు నటిస్తున్న కెసిఆర్  వెంటనే లక్నవరం ప్రధాన కాలువలు పూడ్చి, లక్నవరం నీటిని వదిలి, పంటపొలాలకు సాగు నీరు అందించాలని, ఇంకా నాట్లు వేయకుండా నీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు తక్షణ పరిష్కారం చూపెట్టి, రైతులను ఆదుకోవాలని, అలాగే వరదల వల్ల నష్టపోయిన పొలాలకు నష్ట పరిహారం చెల్లించాలని, అలాగే వరదల వల్ల పొలాల్లో ఇసుక మేటలు పెట్టాయని, పంట సాగుకు పని చేయనందున ఇసుక తరలించడానికి ప్రభుత్వం వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు. యుద్ద ప్రాతిపదికన తక్షణ చర్యలు చేపట్టి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అని రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని, వరదల వల్ల నష్టపోయిన పంట పొలాలకు ఎకరానికి 30000 రూపాయల నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే తక్షణ చర్యలు చేపట్టకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని, అవసరం అయితే కలక్టరేట్ ముట్టడి చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు పాశం మాధవ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడిగా పార్వతి, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా సారయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సూడి సత్తిరెడ్డీ, మండల మహిళా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు భూక్యా రాజు, జిల్లా ప్రచార కార్యదర్శి సూదిరెడ్డి జనార్ధన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సూదిరెడ్డి జయమ్మ, జిల్లా కమిటీ సభ్యులు చాపల ఉమాదేవి – నరేందర్ రెడ్డి, గోపిదాసు రజిత, సర్పంచ్ లావుడియ లక్ష్మి – జొగ నాయక్, సామ హనుమంత రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు బద్దం లింగారెడ్డి, కంటేమ్ సూర్యనారాయణ, నాయిని వెంకన్న, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కు రణదీప్, ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, గ్రామ ఉపాధ్యక్షులు పంగ శ్రీను, కోరం రామ్మోహన్, లూకాస్, రాజబాబు, అలుగుబెల్లీ వెంకటస్వామి, గోపిదాసు వజ్రమ్మ, మోత్కూరు రమ, పెండెం తేజ, సామ నరేందర్ రెడ్డి, నన్నెబోయిన సోమయ్య, బొబ్బ ఐలు రెడ్డి, బద్దం వెంకట రెడ్డి, బద్దం అంతిరెడ్డి, వాసం బాబు, తండా కృష్ణ, బొబ్బ సత్తిరెడ్డి, బొంపెల్లి లక్ష్మి, గాజుల నారాయణ, మల్ రాజు రాము, బషీర్, తాటికాయల సుజాత తదితరులు పాల్గొన్నారు.
Spread the love