16 వరకు వరంగల్‌ మీదుగా నడిచే పలు రైళ్ల రద్దు

Trainనవతెలంగాణ – హైదరాబాద్
ఉమ్మడి వరంగల్‌ జిల్లా మీదుగా నడిచే పలు రైళ్ల రద్దును దక్షిణ మధ్య రైల్వే మళ్లీ పొడిగించింది. సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో రోలింగ్‌ కారిడార్‌ బ్లాక్‌ కార్యాచరణ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. పనులు పూర్తికాకపోవడంతో జులై 10 నుంచి 16 వరకు రైళ్ల రద్దు కొనసాగుతుంది. ఈ మేరకు అన్ని రైల్వేస్టేషన్లకు శనివారం సమాచారం అందిందని ఓ రైల్వే అధికారి ‘న్యూస్‌టుడే’కు ధ్రువీకరించారు. రద్దయిన జాబితాలో కాజీపేట- డోర్నకల్‌(07753), డోర్నకల్‌- కాజీపేట(07754)మెము, డోర్నకల్‌- విజయవాడ(07755), విజయవాడ- డోర్నకల్‌(07756)మెము, భద్రాచలం రోడ్‌- విజయవాడ(07278), విజయవాడ- భద్రాచలంరోడ్‌(07979)మెము, సికింద్రాబాద్‌- వరంగల్‌(07462), వరంగల్‌- హైదరాబాద్‌(07463)మెము, కాజీపేట- సిర్పూర్‌ టౌన్‌(17003), బల్లార్షా- కాజీపేట(17004)రాంగిరి మెము, భద్రాచలం రోడ్‌- బల్లార్షా(17033), సిర్పూర్‌ టౌన్‌- భద్రాచలంరోడ్‌(17034) సింగరేణి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఉన్నట్లు వివరించారు. గత నెల 19 నుంచి ఈ రైళ్ల రద్దును దశల వారీగా పొడిగిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

Spread the love