మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి డాక్టర్ అనిరెడ్డి దివేశ్ రెడ్డి
వైద్య సిబ్బందికి అభినందనీయం : సర్పంచ్ వినోదమూర్తి
నవతెలంగాణ-మంచాల
మహిళలు తమ ఆరోగ్యాల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, శ్రద్ధ వహించాలని లింగంపల్లి వాస్తవ్యులు, డాక్టర్ అనిరెడ్డి దివేష్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో స్వస్తవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అమెరికాలో ప్రముఖ గాస్ట్రో వైద్య నిపుణులు లింగంపల్లి వాస్తవ్యులు డాక్టర్ అనిరెడ్డి దివేష్ రెడ్డి అన్నారు. స్వస్థత ఫౌండేషన్ చైర్మన్ చతుర్వేది మాట్లాడుతూ మహిళలు ఎక్కువగా పనిలో ఉంటూ, ఆరోగ్యాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనీ, ముఖ్యంగా క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడమే కారణమని అన్నారు. క్యాన్సర్ అనగానే భయపడవద్దనీ, ఆదునాథన వైద్య విధానాలతో కూడా నయం చేయవచ్చని తెలిపారు. ప్రముఖ గైనాకాలజిస్ట్ సరిత మాట్లాడుతూ కొన్ని చిట్కాల ద్వారా క్యాన్సర్ వ్యాధిని పసిగట్టవచ్చని, ప్రాథమిక దశలో పసిగట్టితు నియంత్రిచవచ్చని తెలిపారు. సర్పంచ్ పేర్కా వినోదమూర్తి మాట్లాడుతూ గ్రామంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు, డిప్యూటీ వైద్యాధికారి ధరణి, మంచాల మండలం హెల్త్ ఆఫీసర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ మాన్విత, డెంటల్ వైద్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి శిరీష తదితరులు ఉన్నారు.