– డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ వి. విజయలక్ష్మి
నవతెలంగాణ-కొందుర్గు
కొందుర్గు మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇండియన్ క్యాన్సర్ సొసైటీ, మాగ్నా కార్ట ఫౌండేషన్, ఎల్‌జీ వారి సహకారంతో షాద్‌నగర్ డివిజన్ డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ వి.విజయలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం క్యాన్సర్ స్క్రీనింగ్ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో కొందుర్గు మండలం, చౌదరిగూడెం మండలంలోని 142 మందికి పరీక్షలు నిర్వహించారు. విజువల్ ఇన్‌ఫెక్షన్ ఆఫ్ ది సర్వీస్ (వీఐఏ) పరీక్ష ద్వారా పదిమంది స్త్రీలను గుర్తించి, హైదరాబాద్‌లోని క్యాన్సర్ ఆస్పత్రి ఎంఎన్‌జీకి రిఫెర్ చేశారు. మరో ఐదుగురు మహిళలకు బ్రెస్ట్‌లో గడ్డలను గుర్తించి, వారిని కూడా హైదరాబాద్ క్యాన్సర్ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరికి ఓరల్ క్యాబిటి సస్పెక్టెడ్ క్యాన్సర్ గుర్తించి వారిని కూడా హైదరాబాద్ ఎమ్.ఎన్.జి ఆస్పత్రికి రిఫర్ చేశారు. అని మిగతా జనరల్ ఇబ్బందులు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి, మందులు అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్. అమృతజోసెఫ్, డాక్టర్ నిఖిత, డాక్టర్ హరికిషన్, డాక్టర్.రాఘవేందర్, ఎంఎల్‌హెచ్‌పీ వైద్య అధికారులు శ్వేత, బిందు, ఝాన్సీ , సరిత, హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు, డీపీఎంవో వెంకటేశ్వర్లు, పీహెచ్‌ఎన్ లుదియా, ఎంపీహెచ్‌వోలు శ్రీనివాసులు, మున్వార్, స్టాఫ్ నర్స్ సునీత, విజయ, సంధ్య, ల్యాబ్ టెక్నీషియన్స్ వెంకటముని, పరమేశ్వర్, ఫార్మసిస్ట్ గోపాలకృష్ణ, హెల్త్ అసిస్టెంట్స్ రాఘవులు, అశ్వక్, ఏఎన్‌ఎమ్‌లు, ఆశలు గ్రామస్తులు పాల్గొన్నారు.