రేపటి నుండి అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో కసరత్తు

అభ్యర్థుల ఎంపిక పై ఢిల్లీలో కసరత్తు
అభ్యర్థుల ఎంపిక పై ఢిల్లీలో కసరత్తు,
– 8 న స్క్రీనింగ్ కమిటీ భేటీ
– 9న సీడబ్ల్యూసీ,10న ఎన్నికల కమిటీ సమావేశాలు
– టికెట్ తనదే అనే ధీమాలో దామోదర్ రెడ్డి
– పట్టువీడని పటేల్ రమేష్ రెడ్డి
– ఉత్కంఠగా ఎదురు చూస్తున్న కార్యకర్తలు
నవతెలంగాణ-సూర్యాపేట
కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల వడపోత అనంతరం తుది ఎంపికకు ఢిల్లీలో తీవ్ర స్థాయిలో కసరత్తులు షురూ అయ్యాయి. ప్రధానంగా రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ అందరి అభిప్రాయాలను మోసుకొని ఏ.ఐ.సి.సి చెంతకు జాబితా ను తీసుకుని వెళ్తారు.  అనంతరం రాహుల్ గాంధీ జాబితా ఫైనల్ చేసిన తర్వాత అప్పుడు అధికారిక ప్రకటన జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రెండుసార్లు గత నెల 22, 23 తేదీల్లో కమిటీ ఛైర్మన్ మురళీధరన్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన విషయం తెల్సిందే.దాదాపు మెజారిటీ స్థానాలకు ఒక్కో పేరు ప్రతిపాదించినట్లు తెలిసింది.ఇందులో భాగంగానే నేటి నుండి అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో  కసరత్తు ప్రారంభం కానున్నది. 8 న స్క్రీనింగ్ కమిటీ భేటీ అనంతరం 9న సీడబ్ల్యూసీ,10న ఎన్నికల కమిటీ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
  ఈ క్రమంలో అభ్యర్థుల తుది జాబి తాను ప్రకటించడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. జిల్లాలో పరిశీలిస్తే సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఇద్ద రేసి నాయకుల మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు గుర్తించారు. గతంలో జరిగిన రెండు సమావేశాల్లోనూ స్క్రీనింగ్ కమిటీ దీనిపై ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయింది. ఆయా స్థానాల్లో నాయకుల పని తీరు, సర్వేల ఆధారంగా టికెట్ ఎవరికివ్వాలనే అంశంపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా ఈ నియోజకవర్గాల్లో పార్టీ ఆధ్వర్యంలో మరోసారి “ఫ్లాష్” సర్వే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్లో టికెట్లు ఆశిస్తున్న వారు అధిక శాతంలో ఉండడంతో అసమ్మతి పేచ్చు మీరు తుందనే భావనాతో  జాబితా విడుదల చేయకుండా కాంగ్రెస్ పార్టీ జాప్యం చేస్తుందనే  విమర్శలు  నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లాలో సూర్యాపేట టికెట్ హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరుగాంచిన మాజీ మంత్రి,టీపీసీసీ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి  దామోదర్ రెడ్డి టికెట్ తనదే అనే దీమా లో నిండు కుండలా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోనే వున్నారు. కాంగ్రెస్ పార్టీలో  విహనుమంతరావు, చిన్నారెడ్డి, దామోదర్ రెడ్డిలు  సీనియర్ నాయకులుగా ఉన్నారు. వీరి తర్వాతనే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి అంతా కూడా దామోదర్ రెడ్డికి జూనియర్ లే….ఈ క్రమంలో అధిష్టానాన్ని టికెట్ అడగడం, కోరడం దామన్న స్థాయి కాదని కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడుతున్నారు. యధావిధిగా నే సీనియార్టీ  కోటాలో మొదటి జాబితాలోనే పేరు ప్రకటన ఉంటుందనే నమ్మకంతో దామోదర్ రెడ్డి తోపాటు కార్యకర్తలు ఉన్నారు. టీడీపీ నుండి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి కూడా పట్టువదలని విక్రమార్కుడిలా టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. తనకు గతంలో ఢిల్లీలోని “వార్ రూమ్” లో ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ అగ్రనాయకుల వద్ద పట్టు బడుతున్నారు.ఇందులో భాగంగానే స్టీరింగ్ కమిటీ సభ్యులను పలుమార్లు కలిసి మద్దతు కోరుతున్నారు.
     ఇదిగాక వాస్తు దృష్ట్యా కలిసి రావాలనే దృక్పథంతో రమేష్ రెడ్డి హైటెక్ బస్టాండ్ ఎదురుగా ఉన్న తన నివాసాన్ని బస్టాండ్ వెనుకకు మార్చడం జరిగింది.కాగా ఢిల్లీలో మాత్రం ఇరువురికి కూడా సమాన స్థాయిలో మద్దతు ఉండడంతో అధిష్టానం “ఫ్లాష్” సర్వే ను నిర్వహించినట్లు తెలుస్తోంది. అధిష్టానానికి ఫ్లాష్ సర్వే అందించనున్న పేరే ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేటి నుండి వరుసగా మూడు రోజుల పాటు ఢిల్లీలో జరిగే సమావేశాల అనంతరం 11,12 తేదీల్లో అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉంది. వడ పోత జాబితాను అధిష్టానం ప్రకటించ కుండా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తుండడంతో ఇక్కడి నాయకులు, కార్యకర్తలలో ఉత్కంఠ నెలకొంది.
Spread the love