టెట్‌ పరీక్షకు అభ్యర్థులు సకాలంలో హాజరు కావాలి

Candidates should appear for the TET exam on time– సెప్టెంబర్‌ 15న గంట ముందుగా
– పరీక్షా సెంటర్‌కు చేరుకోవాలి : కలెక్టర్‌
నవతెలంగాణ-భూపాలపల్లి
సెప్టెంబర్‌ 15న ఉదయం 9.30 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2-30గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించే టెట్‌ పరీక్షకు హాజరయ్యే అభ్య ర్థులు సకాలంలో ముందస్తుగా పరీక్షా సెంటర్లకు చేరుకో వాలని జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉదయం 8.30 గంటల నుండి 9-30 వరకు, మధ్యాహ్నం 1.30 గంట నుంచి 2-30 గంటల వరకు పరీక్షా సెంటర్‌ లోనికి అను మతి ఉంటుందని అన్నారు. సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితిలో అనుమతి ఉండదని, అభ్యర్థులు గమనించి పరీక్షా సమయానికి ముందస్తుగా వచ్చి ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు. హాల్‌ టిక్కెట్‌ పై ఫోటో/సంతకం లేని అభ్యర్థులు గెజిటెడ్‌ అధికారితో ధృవీకరించిన 3 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలను జిల్లా విద్యాశాఖ అధికారితో కౌంటర్‌ సైన్‌ చేయించి హజరు కావాలని అన్నారు. జిల్లా లో 6 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 1421 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 1178మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు.
సమన్వయంతో పనిచేయాలి
ములుగు : టెట్‌ ఎగ్జామ్స్‌ రాసే విద్యార్థులకు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు సమ న్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఈనెల 15వ తేదీన టెట్‌ పరీక్ష నిర్వహణలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కళాశాల (పరీక్షకేంద్రం)ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలో 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసామని అన్నారు. ఉదయం నిర్వహించే మొదటి పరీక్షకు 1892 మంది అభ్య ర్థులు, మధ్యాహ్నం నిర్వహించే రెండవ పరీక్షకు 1295 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని తెలిపారు. విద్యాశాఖ అధికారులు హాల్‌ టికెట్లు డౌన్లోడ్‌ చేసుకునేలా విద్యార్థులకు సూచనలు ఇవ్వాలని అన్నారు. విద్యాశాఖ కార్యాలయంలో హెల్ప్‌ డేస్‌ ఏర్పాటు చేసి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని అన్నారు. ప్రశ్న పత్రాల తరలింపు, పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. ఆయా శాఖల అధికారులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. నిమిషం నిబంధన అమలులో ఉన్నదని అన్నారు. అదనపు కలెక్టర్‌ డీఎస్‌ వెంకన్న, డీఈఓ పాణీని, ప్రిన్సిపల్‌ బి వెంకన్న, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఫర్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ అప్పని జయదేవ్‌, తదితరులు పాల్గొన్నారు.
టెట్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి
టెట్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ డీఎస్‌ వెంకన్న సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 15న జిల్లాలో నిర్వహించనున్న టెట్‌ పరీక్ష సంసిద్ధత కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా లోని టెట్‌ పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్మెంటల్‌ ఆఫీసర్లు, రూట్‌ ఆఫీసర్లు, కస్టోడియన్లు, హాల్‌ సూపరింటెండెంట్‌లకు కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పరీక్ష నిర్వహణ సిబ్బందితో సహా అభ్యర్థులు ఎవరు కూడా సెల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌ పరీక్ష కేంద్రంలోకి తీసుకు రావొద్దన్నారు. అభ్య ర్థులు పరీక్ష కేంద్రాల వివరాల కోసం డీఈఓ కార్యాల యంలో ఏర్పాటు చేసిన టెట్‌ సెల్‌ హెల్ప్‌ డెస్క్‌ నెంబర్‌ 9010008345ను సంప్రదించాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఫర్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ అప్పని జయదేవ్‌, డీఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love