నిజామాబాద్ లో గంజాయి పట్టివేత..

Ganja crackdown in Nizamabadనవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్ నుండి మాధవనగర్ వచ్చే మార్గంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.  ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు రెండు వాహనాలలో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ దిలీప్ ఆదివారం తెలిపారు. ఎస్ హెచ్ ఓ దీపక్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సోమిరెడ్డి సూచనల మేరకు జిల్లా ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి ఆదేశాల ప్రకారం తేది 9 న సాయంత్రం నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ దిలీప్ టీం కంటేశ్వర్ బైపాస్ నుండి మాధవనగర్ వచ్చే మార్గం లో తనిఖీలు చేయగా ఇద్దరు వ్యక్తులు రెండు వాహనాలలో గంజాయి తరలిస్తుండగా నిజామాబాద్ అసద్ బాబా నగర్ కి చెందిన సర్ఫరాజ్ ఖాన్ అనే వ్యక్తి ని అరెస్ట్ చేసి 2.1 కేజీల గంజాయి, పల్సర్ బైక్ ను సీజ్ చెయ్యడం జరిగింది అని తెలియజేశారు. ఆ వ్యక్తిని విచారించగా మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణం నుండి తీసుకొని వచ్చి ఇక్కడ అధిక లాభానికి అమ్ముతానని తెలిపాడు. మరొక కేసులో అదే మార్గంలో ఆటోలో గంజాయి తరలిస్తున్నట్టు సమాచారం మేరకు..  తనిఖీ చేయగా నిజామాబాద్ ద్వారకానగర్ కి చెందిన సాజిత్ అలీ అనే వ్యక్తి ఆటోను వదిలి పారిపోవడం జరిగింది. ఆ ఆటోలో 2.1 కేజీ ల గంజాయి లభించింది. మొత్తం రెండు కేసులలో (4.2) కేజీలు గంజాయి,1 పల్సర్ బైక్, ఒక ఆటో ను సీజ్ చెయ్యడం జరిగింది. ఈ కేసు లో సర్ఫరజ్ ఖాన్ నీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించామన్నారు. ఈ తనిఖీలలో నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ దిలీప్, ఎస్సై మల్లేష్, సిబ్బంది షబ్బీర్, ప్రభాకర్, దారి సింగ్, రవి, సంగయ్య, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love