టోల్‌ప్లాజా వద్ద కారు బీభత్సం

– ముగ్గురి మృతి, ఆరుగురికి గాయాలు
ముంబయి: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతి వేగంతో దూసుకొచ్చిన ఓ కారు.. టోల్‌ప్లాజా వద్ద క్యూ లైన్‌లో ఉన్న వాహనాలను ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ముంబయిలోని వర్లీ ప్రాంతంలో గురువారం రాత్రి టోల్‌ ప్లాజా వద్ద ఆగి ఉన్న పలు వాహనాలను అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢకొీట్టింది. వర్లీ నుంచి బాంద్రావైపు వెళ్తున్న ఒక ఇన్నోవా కారు పలు వాహనాలను బలంగా ఢకొీంది. టోల్‌ ప్లాజాకు 100 మీటర్ల ముందు మొదట మెర్సిడెస్‌ కారును ఢకొీట్టిందని, ఆ తర్వాత మరో మూడు వాహనాలను ఢకొీట్టిందని డిసిపి కృష్ణకాంత్‌ ఉపాధ్యాయ వెల్లడించారు.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారని చెప్పారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మరో నలుగురి పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఆయన తెలిపారు.

Spread the love