బేగంపేట‌లో కారు బీభ‌త్సం

కారు ఢీకొని యువతి మృతి
కారు ఢీకొని యువతి మృతి

హైద‌రాబాద్: బేగంపేట‌లో ఓ కారు బీభ‌త్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న యువ‌తిని ఢీకొట్ట‌డంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వివ‌రాల్లోకి వెళ్తే.. నిజాంపేట‌కు చెందిన కే ప్రియాంక‌(31) బేగంపేట‌లోని ఓ ప్ర‌యివేటు స్టోర్‌లో ప‌ని చేస్తోంది. రోజూలాగే  ఈ రోజు ఉద‌యం కూడా ఆమె నిజాంపేట నుంచి బేగంపేట‌కు చేరుకుంది. ప్ర‌కాశ్‌న‌గ‌ర్ మెట్రో స్టేష‌న్ వ‌ద్ద ఆమె రోడ్డు దాటుతుండ‌గా.. వేగంగా వ‌చ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. తీవ్ర గాయాల‌తో బాధ‌ప‌డుతున్న ఆమెను పోలీసులు గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే బాధితురాలు మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు .. కారు డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Spread the love