కారు బీభత్సం.. స్కూల్‌ పిల్లలకు గాయాలు

నవతెలంగాణ – హైదరాబాద్‌: మధురానగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఇద్దరు స్కూల్‌ పిల్లలు, వాచ్‌మెన్‌ ఢీ కొట్టింది. అనంతరం హైమాస్ట్‌ లైట్ల స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూల్ పిల్లలు, వాచ్‌మెన్‌ ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love