పాతబస్తీ రెయిన్ బజార్‌లో కారు బీభత్సం..

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో మరో ఘటన వెలుగు చూసింది.. తాజాగా ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది. మితిమీరిన వేగంతో ఒక్కసారిగా కారు దూసుకొచ్చింది. పాతబస్తీ రెయిన్ బజార్‌లో మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగింది. అతివేగంతో వాహనదారుడిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు మైనర్లకు కూడా గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షత గాత్రులను ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మైనర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Spread the love