ప్లాస్టిక్‌ వ్యర్థాలకు కేరాఫ్‌ భారత్‌

Carafe Bharat for plastic waste– ప్రపంచవ్యాప్తంగా ఐదో వంతు ఇక్కడి నుంచే
– ఏడాదికి తలసరి ఉత్పత్తి 6.6 కేజీలు
– తాజా అధ్యయనంలో వల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని భయపెడుతున్న అంశాల్లో ఒకటి కాలుష్యం. మరీముఖ్యంగా, భూమిపై ప్లాస్టిక్‌ వ్యర్థాల పెరుగుదల పర్యావరణవేత్తలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. ఇది మానవ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేస్తుందని పర్యావరణ నిపుణులతో పాటు పలు అధ్యయనాలు సైతం ఇప్పటికే హెచ్చరించాయి. అయినప్పటికీ.. ప్రపంచంలో ప్లాస్టిక్‌ వాడకంలో ఎలాంటి తగ్గుదలా కనిపించలేదనీ, వీి వ్యర్థాల మొత్తం రోజురోజుకూ పెరిగిపోతున్నదని తాజా అధ్యయం తెలిపింది. ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలో అధికం భారత్‌ ుంచే వస్తున్నదని వివరించింది. అనేకమంది పరిశోధకులు నిర్వహించిన ఈ అధ్యయనం సైంటిఫిక్‌ జర్నల్‌ నేచర్‌లో ప్రచురితమైంది. ప్రపంచవ్యాప్తంగా 50 వేల మునిసిపాలిటీల నుంచి ఈ సమాచారాన్ని సేకరించారు.
ఆ రెండు కారణాలతో అధికం
ఈ అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్లాస్టిక్‌ వ్యర్థాలలో ఐదో వంతు భారత్‌ ఉత్పత్తి చేస్తున్నది. సేకరణ కాని వ్యర్థాలు, వాటిని బహిరంగంగా కాల్చటం వంటివి ప్రపంచ కాలుష్య విపత్తుకు దారి తీసే అంశాలవుతున్నాయి. అయితే, ఇవి భారత్‌లో ఎక్కువగా ఉన్నాయి. భారత్‌లో దాదాపు 53 శాతం ప్లాస్టిక్‌ కాలుష్యం సేకరణ కాని వ్యర్థాల నుంచే వస్తున్నది. డంపుయార్డులలో బహిరంగంగా కాల్చటం ద్వారా 38 శాతం నమోదవుతున్నది. భారత్‌ తర్వాతి స్థానాల్లో అత్యధిక కాలుష్య కారక దేశాల జాబితాలో నైజీరియా, ఇండోనేషియాలు ఉన్నాయి. సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ 2020-21 ఘన వ్యర్థాల నిర్వహణ నివేదికను కూడా ఈ అధ్యయనం ఉటంకించింది.
అధిక జనాభా ఎఫెక్ట్‌
భారత్‌లో అత్యధిక స్థాయిలో జనాభా అధిక వ్యర్థాలకు కారణమవుతున్నది. ఇక్కడ ఏడాదికి తలసరి ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తి దాదాపు 6.6 కేజీలుగా ఉన్నది. తలసరి ప్లాస్టిక్‌ కాలుష్యం విషయంలో భారత్‌ 127వ సథానంలో ఉన్నది. పరిశోధకుల అంచనా ప్రకారం భారత్‌లో ప్రతి ఏడాదీ 56.8 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల ఘన వ్యర్థాలను మండిస్తున్నారు. ఇందులో 5.8 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు ప్లాస్టిక్‌ కావటం ఆందోళనకరం.
పరిశోధకుల సూచనలు
ప్రపంచవ్యాప్తంగా ఈ ప్లాస్టిక్‌ కాలుష్య రక్కసిని నివారించటానికి పరిశోధకులు అనేక పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్‌ వ్యవస్థల మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపర్చాలని అంటున్నారు. ప్లాస్టిక్‌ ఉత్పత్తుల రీడిజైనింగ్‌ ద్వారా ఉద్గారాలను తగ్గించాలంటున్నారు. ముఖ్యంగా, సరైన పద్దతిలో వ్యర్థాలను సేకరించకపోవటం పెద్ద సమస్యగా మారుతున్నదనీ, ఆ విధానంలో సానుకూల మార్పులు రావాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా ప్రత్యేక చొరవను చూపి పలు అవగాహనా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని పర్యావరణవేత్తలు, నిపుణుల కోరుతున్నారు.

Spread the love