నవతెలంగాణ-హైదరాబాద్ : పారిస్ ఒలింపిక్స్‌లో తనపై అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వేసిన పిటిషన్‌పై తీర్పు వాయిదా పడింది. ఈ వ్యవహారంపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (కాస్)ను ఆమె ఆశ్రయించగా.. తీర్పును ఈనెల 16కు వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే వాదనలు విన్న కాస్.. శుక్రవారం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ఈ తీర్పు భారత్‌కు అనుకూలంగా వస్తే వినేశ్‌కు రజత పతకం ఇవ్వాల్సి ఉంటుంది. ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటంపై క్రీడాభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురైన విషయం తెలిసిందే.