నవతెలంగాణ – హైదరాబాద్: ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లాలోని వెంకటాపురంలో చెరువు బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. నాదం చెరువు పూర్తిగా కబ్జాకు గురైందని ఆరోపించారు. దీంతో పోచారం ఐటీ కారిడార్ పీఎస్ లో కేసు నమోదైంది.