గౌతమ్ సవాంగ్ కుమారుడిపై కేసు!

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీ మాజీ డీజీపీ, ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ కుమారుడు డేవిడ్ సవాంగ్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఓ పబ్ గొడవలో సవాంగ్ కుమారుడిపై కేసు నమోదైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రోడ్ నెం.10 వద్ద ఓ పబ్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ అమ్మాయి విషయంలో సమద్, సిద్ధార్థ వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ గొడవలో డేవిడ్ సవాంగ్… సమద్ వర్గంలో ఉన్నాడు. సమద్, డేవిడ్ సవాంగ్ స్నేహితులని తెలుస్తోంది. ఈ రెండు గ్రూపుల మధ్య కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి. అయితే బుధవారం రాత్రి జరిగిన ఘటనలో కొట్టుకునే వరకు వెళ్లారు. ఈ దాడిలో సిద్ధార్థకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సమద్, సిద్ధార్థ గ్రూపులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోగా… జూబ్లీహిల్స్ పోలీసులు కేసు మోదు చేశారు. గౌతమ్ సవాంగ్ వంటి ఉన్నతస్థాయి ఐపీఎస్ అధికారి కుమారుడు ఈ గొడవలో ఉండడంతో మీడియాలో దీనికి విశేష ప్రాధాన్యత ఏర్పడింది.

Spread the love