
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తాలో గల యూనియన్ బ్యాంకు మేనేజర్ అజయ్, బ్యాంకు కస్టమర్ల యొక్క డబ్బును తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించుకున్నాడనే విషయం తెలిసిందే. ఇట్టి విషయం ఖాతాదారులకు కూడా తెలియకుండా చేశాడు. ఫిర్యాదిదారు పుల్లూరి రాకేష్ తన లోనుకి సంబంధించి షూరిటీగా పెట్టిన రూ.20లక్షల విలువ గల చెక్కులను వారికి తెలియకుండా బ్యాంకు మేనేజర్ అజయ్ నగదుగా మార్చుకుని వాడుకున్నాడని నిజామాబాద్ నాలుగో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని పోలీసులు బుధవారం తెలియజేశారు. పోలీసులు ఫిర్యాదు సేకరించిన అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం నిందితుడు అజయ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలియజేశారు.