సీనియర్ ఐపీఎస్ కు బెదిరింపులు..కుమార స్వామిపై కేసు నమోదు

నవతెలంగాణ-హైదరాబాద్ : కేంద్ర మంత్రి కుమార స్వామి, అయ‌న కుమారుడు నిఖిల్‌పై బెంగ‌ళూరు పోలీసులు కేసు న‌మోదు చేశారు. అక్రమ మైనింగ్ అనుమతుల మంజూరు కేసులో దర్యాప్తు చేస్తున్నత‌న‌ను కుమార స్వామి బ‌హిరంగంగా బెదిరించార‌ని ఆరోపిస్తూ సిట్ చీఫ్, ADGP చంద్రశేఖర్ ఈ ఫిర్యాదు చేశారు. త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డ‌మే కాకుండా క‌ర్ణాట‌క క్యాడ‌ర్‌ నుంచి మరో క్యాడర్‌కు బదిలీ చేయిస్తాన‌ని బెదిరించిన‌ట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Spread the love