పాస్‌పోర్టు స్కామ్‌లో 24 మందిపై కేసులు

నవతెలంగాణన్యూఢిల్లీ: ప‌శ్చిమ బెంగాల్‌ గ్యాంగ్‌ట‌క్‌లో ఉన్న సుమారు 50 ప్ర‌దేశాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. పాస్‌పోర్టు కేసులో ఆ త‌నిఖీలు జ‌రుగుతున్నాయి. నకిలీ ప‌త్రాలు చూపించి పాస్‌పోర్టులు జారీ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కేసులో మొత్తం 24 మందిపై కేసు బుక్ చేశారు. గ్యాంగ్‌ట‌క్‌లో ఉన్న ఓ అధికారితో పాటు మ‌రో మ‌ధ్య‌వ‌ర్తిని అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్‌లో మాత్రం 24 మంది పేర్ల‌ను చేర్చారు. ఈ జాబితాలో 16 మంది అధికారులు కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. లంచాలు తీసుకుని అన‌ర్హుల‌కు పాస్‌పోర్టులు జారీ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కోల్‌క‌తా, సిలిగురి, గ్యాంగ్‌ట‌క్‌తో పాటు మ‌రికొన్ని న‌గ‌రాల్లో సీబీఐ సోదాలు జ‌రుగుతున్నాయి.

Spread the love