చైనా మాంజలు అమ్మితే కేసులు: ఎస్సై భువనేశ్వర్ 

Cases of sale of Chinese manjas: SSI Bhubaneswarనవతెలంగాణ – జుక్కల్
మండలంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని పతంగులు అమ్మై వ్యాపారస్తులు చైనా మాంజాలను అమ్మితే కఠినమైన చర్యలతో పాటు కేసు నమోదు చేయడం జరుగుతుందని జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని పతంగుల దుకాణంలో తనిఖీలు చేపట్టారు. దుకాణ యజమానులకు వారికి పలు సూచనలు చేశారు. చైనా మాంజాలు అమ్మ వద్దని నాణ్యమైన మాంజాలు దేశి రకమివి మాజాలు అమ్మకాలు నిర్వహించాలని,  ప్రజలకు  ఎటువంటి ఇబ్బంది కలగకుండా పతంగులు, మాంజాల వ్యాపారాలు చేసుకోవాలని  సూచించారు. ఒకవేళ చైనా మాంజూలు అమ్మినట్టు మా దృష్టికి వస్తే వారిపైన కఠిన చర్యలతో పాటు చెట్టరీత్య చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తో పాటు జుక్కల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love