6,000 ఎటిఎంల్లో క్యూఆర్‌తో నగదు ఉపసంహరణ

Cash withdrawal with QR at 6000 ATMs–  బిఒబి వెల్లడి
ముంబయి : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బిఒబి)కి చెందిన 6వేల ఎటిఎంల్లో క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత నగదు ఉపసంహరణలను అందుబాటులోకి తెచ్చినట్లు ఆ బ్యాంక్‌ వెల్లడించింది. డెబిట్‌ కార్డ్‌ లేకుండానే యుపిఐ ఆధారిత మొబైల్‌ యాప్‌ను ఉపయోగించిన నగదును పొందవచ్చని పేర్కొంది. యుపిఐ ఎటిఎంలు చాలా భద్రతతో కూడినవని బిఒబి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జయదీప్‌ దుత్తా పేర్కొన్నారు. ఈ సర్వీసును కార్డులెస్‌ క్యాష్‌ విత్‌డ్రాయల్‌గా బ్యాంక్‌లు పేర్కొంటున్నాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పిసిఐ) సహకారంతో దేశంలోనే యుపిఐ ఎటిఎంలను అందుబాటులోకి తెచ్చిన తొలి బ్యాంక్‌గా బిఒబి రికార్డ్‌ను సృష్టించింది.

Spread the love