నవంబర్ 15 తర్వాత ఏపీలో ‘కుల గణన’

నవతెలంగాణ – అమరావతి: ఏపీలో కుల గణన చేయాలని ఏపీ  ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 15 తర్వాత రాష్ట్రమంతటా కులాల వారీగా అధికారిక సర్వే ప్రారంభించేందుకు కార్యచరణ సిద్ధం చేస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొని ఇంటింటా వివరాలు సేకరిస్తారు. ఇందుకోసం యాప్ రూపొందిస్తున్నారు. పారదర్శకత కోసం మొత్తం మూడు స్థాయిల్లో షాంపిళ్లను పునః పరిశీలన చేస్తారు. కాగా, ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కుల గణన ప్రారంభమైంది.

Spread the love