నవతెలంగాణ-హైదరాబాద్ : రేషన్‌కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను తొలగించేందుకే ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిందన్న ప్రచారాన్ని డిప్యూటీ సీఎం భట్టి ఖండించారు. ‘సర్వే ఆధారంగా పాలన, ప్రణాళిక రూపకల్పన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయాలు ఉంటాయి. సర్వే పూర్తయ్యాక సామాజిక వర్గాల వారీగా ప్రజల స్థితిగతులపై వివరాలను బహిర్గతం చేస్తాం. మేధావులు, అన్నివర్గాల అభిప్రాయాలతో కులగణన ప్రశ్నలు రూపొందించాం’ అని వెల్లడించారు.