నవతెలంగాణ – హైదరాబాద్: కులగణన సర్వే 30% పూర్తయినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కులగణన సర్వే ఎవరికీ వ్యతిరేకం కాదని, సర్వేలో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడగట్లేదని చెప్పారు. కులం వివరాలు చెప్పడం ఇష్టం లేకపోతే 999 ఆప్షన్ ఉంటుందని తెలిపారు. అయితే ఎన్యూమరేటర్లను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.