నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో చేపట్టిన కులగణన గేమ్ చేంజర్ కాబోతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంక్షేమ ఫలాలు అర్హులైన పేదలకు చేరాలంటే ప్రభుత్వం వద్ద సరైన గణాంకాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. అసలు గణాంకాలు లేకుంటే అసలైన అర్హులకు న్యాయం చేయలేమని అన్నారు. అందుకే కులగణన చేపట్టామని, ఇదొక మైలురాయిగా మిగులుతుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో ఇంటర్వ్యూలో ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.