Adilabad Archives - https://navatelangana.com/category/adilabad/ Thu, 17 Apr 2025 09:23:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Adilabad Archives - https://navatelangana.com/category/adilabad/ 32 32 ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి… https://navatelangana.com/success-brs-silver-house-on-the-27th-of-this-month/ Thu, 17 Apr 2025 08:26:05 +0000 https://navatelangana.com/?p=547992
– ముధోల్ నియోజక వర్గ బీఆర్ఎస్ అధ్యక్షుడు కిరణ్ కొమ్రే వార్…
నవతెలంగాణ – కుబీర్ :   వరంగల్ లో ఈనెల27 న తల పెట్టిన రజతోత్సవ సభ ను విజయవంతం చేయాలని కోరుతూ ముధోల్ నియోజక వర్గ బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ కిరణ్ కొమ్రే వార్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలక నాయకలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని  పిలుపు ఇచ్చారు. మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఎన్నిలా అనిల్ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన కుబీర్ లో గురువారం ఇందుకు సంబదించిన పోస్టర్లను విడుదల చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందన్నారు. దింతో కాంగ్రెస్ ప్రభుత్వ నికి తగిన గుణపాఠం చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ లో భారీ బహిరంగ సభ  ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అదే విదంగా రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాపి కూడా రైతులకు మభ్యపెట్టాలని చూస్తున్నారు. దింతో ముధోల్ నియోజకవర్గం లో ఉన్న అన్ని మండల ప్రజలు రైతులు బీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎన్నిలా అనిల్ పి ఏ సి ఎస్ చైర్మన్ రేకుల గంగా చరణ్ ఉద్యమ కారులు పుప్ఫల పీరాజీ, బాబు, గాడేకర్ రమేష్, కే దత్తు జీవన్ మండల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
]]>
లక్షతో పాటు తుళం బంగారం ఇవ్వాలి…. https://navatelangana.com/tulum-should-be-given-along-with-lakhs/ Wed, 16 Apr 2025 10:25:22 +0000 https://navatelangana.com/?p=547405
నవతెలంగాణ – బజార్ హత్నూర్: కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్షతో పాటు తులం బంగారం కూడా లబ్ధిదారులకు అందజేయాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బుదవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 42 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116/- చొప్పున ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేతులమీదుగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రారంభించిన రూ.లక్ష తో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం తుళం బంగారం కూడా అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
]]>
గొర్రెలు మృతి చెందిన రైతుకు చెక్కు అందజేత.. https://navatelangana.com/sheep/ Tue, 15 Apr 2025 13:49:52 +0000 https://navatelangana.com/?p=546814 A check will be given to the farmer whose sheep died.నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలోని మురిమడుగు గ్రామానికి చెందిన దానవేణి రాజంకు ప్రభుత్వం ద్వారా వచ్చిన రూ.65 వేల చెక్కును మంగళవారం ఇందన్ పళ్లి ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్ ఆ రైతుకు అందించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత సంవత్సరం రాజంకు చెందిన 11 గొర్రెలపై తోడేలు దాడి చేసి చంపడంతో, ఆ రైతుకు నష్టపరిహారంగా రూ.65 వేల చెక్కును అందించామన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు గ్రామస్తులు ఉన్నారు.

]]>
అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన.. https://navatelangana.com/awareness-on-the-prevention-of-fire-hazards/ Tue, 15 Apr 2025 12:12:54 +0000 https://navatelangana.com/?p=546726
Public awareness on fire preventionనవతెలంగాణ – జన్నారం

అగ్ని ప్రమాదాలు జరిగితే సమాచారం ఇవ్వాలని జన్నారం అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ కోరారు. అగ్ని ప్రమాదాల నివారణ వారోత్సవాల సందర్భంగా జన్నారం బస్టాండ్, మార్కెట్ ఏరియా మార్కెట్ ఏరియాలో, తదితర ప్రాంతాలలో ఉన్న ప్రజలకు వ్యాపారులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు సమాచారం అందిస్తే సకాలంలో వచ్చి మంటలను ఆర్పి వేస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు. బస్టాండ్ ఏరియాలో నీటితో విద్యాసాగర్ చేస్తూ మంటలు ఆర్పే పద్ధతులపై ప్రజలకు వివరించారు. అనంతరం బస్టాండ్ తదితర ఏరియాలో వాల్పోస్టర్లను అంటించారు. అన్ని ప్రమాదాలు సంభవించే వెంటనే తమను సంప్రదించాలని కోరారు కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
]]>
విద్యార్థులు లక్ష్యం పెట్టుకొని చదవాలి.. https://navatelangana.com/students-should-read-and-read/ Tue, 15 Apr 2025 11:44:58 +0000 https://navatelangana.com/?p=546718
Students should study with a goal in mind.– అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు..

నవతెలంగాణ – జన్నారం
విద్యార్థులు లక్ష్యం పెట్టుకొని చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని, మాజీ ఆసిఫాబాద్ ఆర్టీవో అజ్మీరా శ్యాం నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఉన్న ఏఆర్ఎస్ వికాస్ డిగ్రీ కళాశాలల, అన్యువల్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు ఇంటర్ డిగ్రీ దశ చాలా కీలకమైనది అన్నారు. ఐదు సంవత్సరాలు కష్టపడి చదివితే, 65 సంవత్సరాలు సుఖపడవచ్చన్నారు. ఈ ప్రాంతంలో చదివే పిల్లలు పేద పిల్లలే అన్నారు. పేద మద్దతు తరగతి పిల్లలు, తమ తల్లిదండ్రుల ఆశయాలను సాధించడానికి కష్టపడి చదివి  మంచి ఉద్యోగాలలో స్థిరపడాలన్నారు. కళాశాల పేరు నిలబెట్టాలన్నారు. లక్ష్యాలు నిర్దోషించుకొని చదవాలన్నారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ఆటలు పాటలు ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో విద్యార్థులతో పాటు, ఏ ఆర్ ఎస్  డిగ్రీ కళాశాల కరస్పాండెంట్, ముత్యం సతీష్, అధ్యాపకులు మోహన్ , శ్రవణ్ నాయక్ , రాజన్న తదితరులు పాల్గొన్నారు.
]]>
రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ ధ్యేయం.. https://navatelangana.com/constitutional-conservation-congress-mission/ Tue, 15 Apr 2025 10:19:02 +0000 https://navatelangana.com/?p=546616 Congress's goal is to protect the Constitution.– కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు నర్సయ్య..
నవతెలంగాణ – సారంగాపూర్
రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య అన్నారు. మంగళవారం మండలంలోని నాగపూర్, దుర్గ నగర్, రవీంద్ర నగర్ బోరింగ్ తండాల్లో మహాత్మా గాంధీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాలవేసి నివాళులర్పించి కాంగ్రెస్ పార్టీ జెండా ను ఎగురవేసి మాట్లాడారు. కేంద్రం రాజ్యాంగం మార్చే కుట్రలను తిప్పి కొట్టేందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ కార్యక్రమం చేపట్టింది అన్నారు. భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ మహాత్ముల ఆశయల అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలనలో అన్ని వర్గాల ప్రజలుకోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముత్యం రెడ్డి, నాయకులు లక్ష్మన్, భోజన్న, లక్యానాయక్, రాము, కృష్ణ, చందు, ధన్ సింగ్, రవీందర్, రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

]]>
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం https://navatelangana.com/we-will-resume-the-project-of-pranitha-chevella/ Mon, 14 Apr 2025 21:18:36 +0000 https://navatelangana.com/?p=546443 Deputy CM Bhatti Vikramarka– సంపదను ప్రజలకు పంచుతాం
– బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటై కాంగ్రెస్‌పై విషం
– ఎవరెన్ని కుట్రలు పన్నినా అభివృద్ధి ఆగదు : మంచిర్యాల సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నవతెలంగాణ-మంచిర్యాల
గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్‌ను తిరిగి ప్రారంభించి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సాగు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సోమవారం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలో అంబేద్కర్‌ విగ్రహ ఆవిష్కరణ, పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన హాజరయ్యారు. మొదటగా జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా, 650 పడకల ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం బార్సు హైస్కూల్‌ గ్రౌండ్‌ వరకు రోడ్‌ షో నిర్వహించారు. రూ.250కోట్లతో కర కట్టల నిర్మాణం, రూ.400కోట్ల విలువ గల పలు అభివృద్ధి పనులకు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. తదనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అదానీ, అంబానీ దోచుకుతింటున్న దేశ సంపదను ప్రజలకు పంచడమే లక్ష్యంగా రాహుల్‌ గాంధీ పని చేస్తున్నారన్నారు. పార్లమెంట్‌లో అంబేద్కర్‌ను అవమానిస్తూ మాట్లాడిన బీజేపీ నాయకులు.. నేడు ఆయన జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. అభివృద్ధి పనులతో మంచిర్యాల స్మార్ట్‌ సిటీగా మారుతుందన్నారు. గుడిపేటలోని ఐటీ హబ్‌ ఇండిస్టియల్‌ కారిడార్‌తో యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఆసిఫాబాద్‌ జిల్లాలో శంకుస్థాపన చేసిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విస్మరించిందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు కలిసి ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని, ఎవరెన్ని చేసినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 25 ఎకరాల్లో యంగ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌, సంక్షేమ హాస్టల్‌ విద్యార్థులకు కాస్మాటిక్‌, డైట్‌ చార్జీలు పెంచామన్నారు. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అధ్యక్షతన జరిగిన సభలో నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌, జై భీమ్‌, జై బాపు, జై సంవిధాన్‌ కార్యక్రమ ఇన్‌చార్జి రుద్ర సంతోష్‌, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మంత్రి పదవి నాకే కావాలి : పీఎస్‌ఆర్‌
తనను కాదని మంత్రి పదవి వేరే ఎవరికిచ్చినా ఆదిలాబాద్‌ జిల్లాలో రాజకీయం వేరే లెవెల్‌లో ఉంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఫైర్‌ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్న సభలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఆ కుటుంబానికి ఇప్పటికే మూడు పదవులు దక్కాయని, మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని పని చేశానని, ఇంద్రవెల్లిలో సభ, భట్టి పాదయాత్రను దగ్గరుండి విజయవంతం చేశానని అన్నారు. పాదయాత్ర సమయంలో ఏ నాయకులూ అందుబాటులో లేరని చెప్పారు. అలాంటి నాయకులకు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తారా అంటూ ప్రశ్నించారు. తన గొంతు కోసే ప్రయ్నతం చేస్తే ఊరుకోబోనని, ప్రతీకారంగా తానూ గొంతు కోసే ప్రయత్నం చేస్తానని అన్నారు. ఇలా బహిరంగ సభలోనే గడ్డం ఫ్యామిలీని ఉద్దేశించి ప్రేమ్‌సాగర్‌రావు చేసిన కామెంట్స్‌ సంచలనంగా మారాయి. ఆయన మాటలతో ఒక్కసారిగా నినాదాలు మిన్నంటాయి.
సభకు ‘కాక’ కుటుంబ సభ్యులు దూరం
మంచిర్యాలలో డిప్యూటీ సీఎం సభకు చెన్నూర్‌, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్‌, వినోద్‌, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాజరుకాకపోవడం చర్చకు దారి తీసింది. మొదటి నుంచీ మంచిర్యాలలో కాంగ్రెస్‌ సభలకు గడ్డం కుటుంబ సభ్యులు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రేమ్‌సాగర్‌రావుకు కాకా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విబేధాలపై జిల్లాలో చర్చ నడుస్తోంది. తాజాగా డిప్యూటీ సీఎం భట్టిని హెలీప్యాడ్‌ వద్దకు వెళ్లి ఆహ్వానించిన గడ్డం వినోద్‌ కార్యక్రమంలో పాల్గొనకుండా తిరిగి వెళ్లారు. సభ అయిపోయాక వివేక్‌ మంచిర్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి వెళ్లారు. ఇలా ఒకే జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల వ్యవహారశైలితో జిల్లా నేతలు తలలు పట్టుకుంటున్నారు.

]]>
జై బాపు జై భీమ్ జై సంవిధాన్ https://navatelangana.com/jai-bapu-jai-bhim-jai-sampan-2/ Mon, 14 Apr 2025 12:51:42 +0000 https://navatelangana.com/?p=546143
నవతెలంగాణ – సారంగాపూర్: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమకి సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో సోమవారం  కాంగ్రెస్ పార్టీ నియోజకర్గ కో ఆర్డినేటర్ అఫ్సర్ యూసుఫ్ జహి హాజరై.. మహాత్మా గాంధీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు..  రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, మహత్మ గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ల గురించి వివరించారు వారి సేవలను కొనియాడారు వారు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూపాయనించాలని అన్నారు.ఎఎంసి చైర్మన్ ఆద్వర్యంలో అన్నదానం నిర్వహించారు. అలాగే మండలంలోని ఆయా గ్రామాల్లో అంబేద్కర్ సంఘాల ఆద్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రంలో  మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది గారు,మండల అధ్యక్షులు భోల్లోజి నర్సయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పోతారెడ్డి,అహ్మద్ ముక్తార్,ప్రశాంత్, దన్ సింగ్,నాయకులు సింగం బోజగౌడ్, భోజన్న ,రమేష్,లింగారెడ్డి , సత్యం,రాము, లస్మన్న, శెఫిక్ ,సురేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
]]>
 అంబేద్కర్ ప్రపంచ మేధావి..   https://navatelangana.com/%e0%b0%85%e0%b0%82%e0%b0%ac%e0%b1%87%e0%b0%a6%e0%b1%8d%e0%b0%95%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%aa%e0%b0%82%e0%b0%9a-%e0%b0%ae%e0%b1%87%e0%b0%a7%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf/ Mon, 14 Apr 2025 10:41:09 +0000 https://navatelangana.com/?p=545940 నవతెలంగాణ – జన్నారం
అంబేద్కర్ ఓ ప్రపంచ మేధావి అని అతని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు భరత్ కుమార్ ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ముందుగా పంచశీల జెండాను ఆవిష్కరించారు. అనంతరం బస్టాండ్ నుంచి, పాత పెట్రోల్ పంప్ వరకు డిజె సౌండ్ లతో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ  అంబేద్కర్  మహిళల హక్కుల కోసం పోరాడారు. ఉద్యోగుల పని వేళలు, సమాన పనికి సమాన జీతం విధానాన్ని ప్రవేశపెట్టేందుకు పార్లమెంట్ లో వాదనలు వినిపించారన్నారు. న్యాయవాది, ఆర్థికవేత్త, ఆయన ఆలోచనలో నుంచే ఆర్బీఐ పుట్టిందన్నారు.  ఆయన రాసిన పుస్తకాలు చదివితే అప్పుడే ఇంత ముందుచూపుతో రాశారా? అనిపిస్తుంది. మనీ, హ్యూమన్ ఫిలాసఫీ పుస్తకాలు.. రాజ్యంగ రచనా కమిటీకి ఛైర్మన్ ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించారు. అందుకే ప్రపంచం ఆయనని మేధావి అని కీర్తించే స్థాయికి చేరారన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు బోర్లకుంట ప్రభుదాస్ తాళ్లపల్లి రాజేశ్వర్ జాడి గంగాధర్, మామిడిపల్లి ఇందయ్య, గడ్డం శ్రీనివాస్, గవ్వల శ్రీకాంత్ కొండుకూరి  ప్రభుదాస్ టిఆర్ఎస్ మండల, గుర్రం రాజారాం రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు ముజాఫర్ అలీ ఖాన్ బిజెపి మండలాధ్యక్షుడు, గుండవరపు మధుసూదన్ రావు ఎన్ఎంవిఎస్ రాష్ట్ర సాయిని ప్రసాద్ నేత, దూమల రమేష్  ఈర్నాల గంగన్న,   గుర్రం మోహన్ రెడ్డి కోడూరు చంద్రయ్య, దాముఖ కరుణాకర్, రత్నం లక్ష్మణ్, నందు నాయక్ ఉపాధ్యాయులు గోపాల్, రాజన్న, రామటేంకి శ్రీనివాస్ ప్రకాష్ నాయక్, మున్వరాలి ఖాన్, ఫజల్, ప్రవీణ్ కుమార్, నరసింహులు, రత్నం లక్ష్మణ్, రియాజుద్దీన్, అజారుద్దీన్, రత్నం లక్ష్మణ్ వివిధ సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతిని మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా జరుపుకున్నారు.

]]>
అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ.. https://navatelangana.com/the-discovery-of-posters-of-firefighters/ Sun, 13 Apr 2025 12:23:41 +0000 https://navatelangana.com/?p=545419 Firefighters' Week posters unveiled.నవతెలంగాణ – జన్నారం
అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి నిర్వహిస్తున్న వారోత్సవాల పోస్టర్లను మండల ఏఎంసీ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆదివారం అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఆవిష్కరించారు. ముందుగా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, ను జన్నారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముజాఫర్ అలీ ఖాన్, ను నాయకులు మిక్కిలినేని రాజశేఖర్ ను శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ వారోత్సవాల్లో భాగంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీ ఖాన్ నాయకులు మిక్కిలినేని   రాజశేఖర్, తాళ్ల పెళ్లి  రాజేశ్వర్ ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.
]]>
ఎమ్మెల్యే బొజ్జకు ఘన సన్మానం.. https://navatelangana.com/mla-bozza-is-a-solid-honor/ Sun, 13 Apr 2025 11:54:01 +0000 https://navatelangana.com/?p=545388 A great honor for MLA Bojja..నవతెలంగాణ – జన్నారం
నేతకాని సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ కు ఆదివారం ఉట్నూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జన్నారం పట్టణానికి చెందిన నేతకాని సంక్షేమ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తాళ్లపల్లి రాజేశ్వర్, మాట్లాడుతూ.. నేతకాని కులానికి చెందిన  జన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్గా, ధర్మారం గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మీనారాయణ, ఆదిలాబాద్ ఆర్టిఏ మెంబర్గా, ఉట్నూరు పట్టణానికి చెందిన దూట రాజేశ్వర్ కు అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఖానాపూర్ నియోజకవర్గం లో నేతకాని సమాజాన్ని గుర్తించి, వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని  ఎమ్మెల్యేని కోరుతున్నామన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెమొంటోను అందించారు. కార్యక్రమంలో, జన్నారం ఎఎంసి చైర్మన్, దుర్గం లక్ష్మి నారాయణ , ఆర్టిఏ నెంబర్ దూట రాజేశ్వర్, నాయకులు నరసయ్య, నేతకాని సంక్షేమ సంఘం జన్నారం మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి వెంకటయ్య, నాయకులు బండారి స్వామి, దుర్గం శంకర్, తదితర నేతకాని సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.
]]>
మహిళా సంఘం అధ్యక్షురాలుగా బ్యారప్ లక్ష్మి  https://navatelangana.com/barrap-lakshmi-as-president-of-womens-association/ Sat, 12 Apr 2025 12:54:56 +0000 https://navatelangana.com/?p=544798
Byrap Lakshmi becomes the president of the women's associationనవతెలంగాణ – కుబీర్
మహిళా సంఘాలను అభివృది పరిచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని మహిళా సంఘ అధ్యక్షరాలు బ్యారప్ లక్ష్మి అన్నారు. శనివారం మండలంలోని ఫార్డి బి గ్రమైక్య సంఘం 1 సభ్యుల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.ఈ సందర్బంగా గ్రమైక్య మహిళా సంఘ సభ్యులందరు కలసి నూతన కార్య వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఇందులో అధ్యక్షరాలుగా బ్యారప్ లక్ష్మి ఉప అధ్యక్షురాలుగా అతగాలే కంత బాయి కార్యదర్శిగా గాయక్ వాడ్ జ్యోతి కోశాధికారిగా గుమ్మల లావణ్య మిగితా మంది సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్ను కున్నాట్లు అధ్యక్షురాలు తెలిపారు. దింతో సంఘం సభ్యులకు రుణాలు అందించి వారికి ఆర్థికంగా మరింతగా అభివృది చెందెల కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో సీసీ దత్తత్రి సి ఏ సాయినాథ్ మహిళా సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు.
]]>