Adilabad Archives - https://navatelangana.com/category/adilabad/ Wed, 08 May 2024 19:17:00 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Adilabad Archives - https://navatelangana.com/category/adilabad/ 32 32 ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం https://navatelangana.com/give-us-a-chance-and-we-will-develop-it-and-show-it/ Wed, 08 May 2024 19:16:59 +0000 https://navatelangana.com/?p=286534 – జిల్లా ఇన్‌చార్జి మంత్రి దనసరి అనసూయ
నవతెలంగాణ-లక్ష్మణచాంద
ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థి ఆత్రం సుగుణకు ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తామని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి దనసరి అనసూయ(సీతక్క) అన్నారు. నిరుపేద ఆదివాసీ మహిళకు అవకాశం ఇస్తే అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. బుధవారం మండలంలోని వడ్యాల్‌, రాచపూర్‌, బాబాపూర్‌, నర్సాపూర్‌ డబ్ల్యూ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను కలిసి పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేదల అభ్యున్నతికి ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టిన కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని కోరారు. అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీని రూ.400కు పెంచుతామని హామీ ఇచ్చారు. త్యాగల పార్టీ కాంగ్రెస్‌తో మాత్రమే అభివృద్ధి సాధ్యమన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ జంట పార్టీలని దుయ్యబాట్టారు. బీఆర్‌ఎస్‌ కు ఓటు వేస్తే మురికి కాలువలో వేసినట్లేనని పేర్కొన్నారు. గుడిలో ఉండాల్సిన దేవుడిని జెండాలపై వేసి ఊరేగింపులు చేస్తూ మత రాజకీయలకు బీజేపీ నాయకులు పాల్పడుతున్నారన్నారు. నల్ల ధనం తీసుకొస్తామని నీతులు చెప్పిన పార్టీ పదేండ్లలో చేసిందేమి లేదన్నారు. కాంగ్రెస్‌ అంటేనే సంక్షేమ పథకాల పార్టీ అని, ప్రతి ఒక్కరూ ఆదరించి చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పార్లమెంట్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ మాట్లాడుతూ తన కుటుంబం పేదల కోసం పాటు పడిన చరిత్ర అని, సేవే ద్యేయంగా కొనసాగుతామన్నారు. ధాన్యం కొనుగోలు గురుంచి రైతులు అడగగా మంత్రి స్పందిస్తూ కలెక్టర్‌కు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు వొద్నల రాజేశ్వర్‌, ఈటెల శ్రీనివాస్‌, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్‌, అట్ల రాంరెడ్డి, అట్ల రవీందర్‌ రెడ్డి, నరేష్‌ రెడ్డి, ప్రతాప్‌ రెడ్డి, చిన్న రాం రెడ్డి, సమ్మెట రవి, నగేష్‌ పాల్గొన్నారు.
శభాష్‌ సీతక్క..
రాచపూర్‌లోని చెరువులో పని చేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలవడానికి సెక్యూరిటీ, ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి సాధారణంగా ద్విచక్ర వాహనం ఎక్కి మంత్రి సీతక్క చెరువులో వెల్లడం చూసి స్థానికులు అవక్కాయ్యారు. సీతక్క అంటే నిరడంబరతకు మారు పేరని మరొక్క సారి చాటారు. ఒక మంత్రిగా ఇంతటి సాధారణ ప్రజా జీవితం అందరికి సాధ్యం కాదని జనం చర్చించుకున్నారు.

]]>
ఉపాధి హామీ చట్టం తెచ్చిందే కాంగ్రెస్‌ https://navatelangana.com/congress-brought-employment-guarantee-act/ Wed, 08 May 2024 19:15:27 +0000 https://navatelangana.com/?p=286527 – ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌
నవతెలంగాణ-కడెం
ఉపాధి హామీ చట్టం తెచ్చిందే కాంగ్రెస్‌ పార్టీయేనని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ అన్నారు. బుధవారం మండలంలోని కల్లెడ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలోనే ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకాన్ని అమల్లోకి తెచ్చామని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఈ పదేండ్ల పాలనలో ప్రజలకు చేసిందేమి లేదన్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేవేసి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.
సీపీఐఎంఎల్‌ ఆధ్వర్యంలో
మండలంలో వకీల్‌ నగర్‌, ధర్మాజీపేట్‌, మాసాయిపేట్‌ గ్రామాలలో ఇండియా కూటమి అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ ఖానాపూర్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు పంచుతూ బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్‌ కార్యదర్శి సునారికారి రాజేష్‌ మాట్లాడుతూ బీజేపీ పాలనలో రాజ్యాంగం, పార్లమెంటరీ, ప్రజాస్వామ్యం, ప్రజలు, రాష్ట్రాల హక్కులకై దాడులు పెరిగాయన్నారు. మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారన్నారు. బీజేపీని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థి ఆత్రం సుగుణని గెలిపించచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలలచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ నాయకులు దుర్గం లింగన్న, ఆకుల సత్యం, దొంగరి కిషన్‌, బక్కన్న పాల్గొన్నారు.
నచ్చన్‌ ఎల్లాపూర్‌లో
మండలంలోని నచ్చన్‌ ఎల్లాపూర్‌ గ్రామంలో మండల నాయకులు ఉపాధి కూలీల వద్దకు వెళ్లి బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు తుమ్మల మల్లేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్‌ ఎలక్షన్‌ నందు హస్తం గుర్తుకు ఓటు వేసి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నచ్చన్‌ ఎల్లాపూర్‌ మాజీ సర్పంచ్‌ బొడ్డు గంగన్న, సీసీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ ఖానాపూర్‌ డివిజన్‌ కార్యదర్శి సునారికారి రాజేష్‌, మండల సీనియర్‌ నాయకులు పడిగల భూషణ్‌ పాల్గొన్నారు.
ఉట్నూర్‌: మండలంలోని శాంతి నగర్‌, సేవాదాస్‌ నగర్‌, బోయవాడ, హస్నాపూర్‌, వడొని, తదితర గ్రామాల్లో కాంగ్రెస్‌ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ చేస్తున్న అభివృద్ది, గ్యారంటి పథకాలను వివరిస్తూ చేతి గుర్తుకు ఓటేయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్యాల శేఖర్‌, టేకుల శంకర్‌, జాదవ్‌ రాజేష్‌, ఎర్రదండి సుశీల్‌ కుమార్‌ పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌ రూరల్‌: ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంలోని రాంనగర్‌లో తెలంగాణ కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌ రెడ్డి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. 13న చేతి గుర్తుకు ఓటువేసి సుగుణక్క గెలిపించాలని విన్నవించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ అట్లా గోవర్ధన్‌ రెడ్డి, కో ఆప్షన్‌ మెంబర్‌ కరీం ఖాన్‌, దామోదర్‌రెడ్డి, నాగరాజు, గణపతి రెడ్డి, కొరటి ప్రభాకర్‌, ఫెరోజ్‌ ఖాన్‌, వెంకటేష్‌, రెండ్ల రాజన్న, అడెల్లు, గాలిపెల్లి నాగన్న, విశాల్‌ రెడ్డి, శ్రీకర్‌ ప్రశాంత్‌, అనిల్‌, హక్కీ పాల్గొన్నారు.
తలమడుగు: మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన రత్నాపూర్‌, చిన్నపూనగూడ, మందగూడ గ్రామాలలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గడపగడపకు ప్రచారం నిర్వహించారు. పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గోక గణేష్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌ నాయకులు కళ్యాణం రాజేశ్వర్‌, మాజీ జడ్పిటిసి బొల్లారం బాబన్న, మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌ ప్రకాష్‌రావు, మాజీ ఎంపీపీ రాము, ఎంపీటీసీలు వెంకన్న యాదవ్‌, మాధవ్‌, మాజీ సర్పంచ్‌ రఘు, జ్ఞానేశ్వర్‌, జైరాం, కాంతారావు, దత్తు, శ్రీనివాస్‌, పోశెట్టి, సూర్యభాను, మోహన్‌, దేవ్‌రావు పాల్గొన్నారు.
సిరికొండ: ఇచ్చిన హామీలను నెరవేర్చే సత్తా కాంగ్రెస్‌కే ఉందని ఆ పార్టీ నాయకుడు అశ్విన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు మండలంలోని సుంకిడి, రాయిగూడ గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆదివాసీ గూడెల్లో ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయన్నారు. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. ఆగస్టు 15లోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతుందన్నారు. రాష్ట్ర మరింత అభివృద్ధి పథంలో వెళ్లాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఇమామ్‌, నాయకులు ప్రవీణ్‌, మాధవ్‌ పటేల్‌, దేవిదాస్‌, ఇమామ్‌ పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌టౌన్‌: కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ సంజీవ్‌రెడ్డి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. బుధవారం పట్టణంలోని వార్డు 39, 40 పరిధిలోని పిట్టవాడ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేస్తూ చేతి గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు. తొలిసారి ఆదిలాబాద్‌ చరిత్రలో కాంగ్రెస్‌ మహిళ అభ్యర్థికి టికెట్‌ ఇచ్చిందని, ఆమెను గెలిపించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆత్రం సుగుణ ప్రజా సమస్యలపై అవగహన కలిగి ఉన్నారని, అలాంటి వారు పార్లమెంట్‌లో ఉంటే జిల్లాకు న్యాయం జరుగుతుందన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంబకంటి అశోక్‌, వసీం, వెంకటేష్‌ పాల్గొన్నారు.
నార్నూర్‌: ప్రజాపాలన ముందుకు సాగాలంటే, సంక్షేమ ఫలాలు పొందాలంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని ఆసిఫాబాద్‌ నియోజకవర్గ సీనియర్‌ నాయకులు గణేష్‌ రాథోడ్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని మార్కెట్‌లో ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల కరపత్రాలను అందజేశారు. కాంగ్రెస్‌ ప్రజల కోసం అమలు చేస్తున్న పథకాలను, అభివృద్ధి పనులను వివరించారు. పోడు భూముల సమస్య పరిష్కారం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం చిన్న వ్యాపారులకు జిఎస్టి విధించడంతో పాటు నిత్యావసర వస్తువులు, పెట్రో ధరలు పెంచి పేద, మధ్య తరగతి ప్రజలను, ఆదివాసీ ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాహుల్‌ గాంధీ ప్రధానిగా ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తారని తెలిపారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో వారి వెంట నాయకులు కరీమ్‌ఖాన్‌, యూసుఫ్‌ఖాన్‌, మాణిక్‌రావ్‌ ఆడే, సంతోష్‌ పటేల్‌, గోవింద్‌రావ్‌, హరిచంద్‌ నాయక్‌, రాజు ఉన్నారు.

]]>
మిగిలింది మూడు రోజులే https://navatelangana.com/only-three-days-left-2/ Wed, 08 May 2024 19:13:10 +0000 https://navatelangana.com/?p=286526 – ఎన్నికల ప్రచారానికి సమీపిస్తున్న గడువు
– ముగిసిన కాంగ్రెస్‌, బీజేపీ అధినేతల పర్యటనలు
– 9న ఆసిఫాబాద్‌లో కేటీఆర్‌ బహిరంగసభకు ఏర్పాట్లు
ఈ నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రచార సమాప్తికి ఇక మూడు రోజులే మిగిలింది. ఈ ఎన్నికల ప్రచారం 11వ తేదీ సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. ఈ మూడు రోజుల వ్యవధిలో అన్ని పార్టీల నాయకులు తమ ప్రచారాన్ని మరింత ఉదృతం చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ అధినేతలు జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో పర్యటించి వెళ్లగా, ఈ నెల తొమ్మిదో తేదీన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆసిఫాబాద్‌కు రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

నవతెలంగాణ-కాగజ్‌నగర్‌
కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌, సిర్పూరు నియోజకవర్గాలలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం పరిధిలోకి వచ్చే ఈ రెండు స్థానాలలో కూడా వివిధ పార్టీల నాయకులు ముమ్మర ప్రచారం చేపట్టారు. లోక్‌సభ బరిలో ఈ స్థానం నుండి 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్యే పోటీ నెలకొని ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున సీఎం రేవంత్‌రెడ్డి ఆసిఫాబాద్‌కు వచ్చి ప్రచారం చేపట్టారు. బీజేపీ అభ్యర్థి గొడం నగేష్‌ తరపున ఆ పార్టీ అగ్రనేత అమిత్‌షా కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఇద్దరు అధినేతల బహిరంగసభలు విజయవంతం కావడంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ రెండు పార్టీలకు చెందిన స్థానిక నేతలు కూడా ప్రతిరోజు ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ కోసం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క పలు పర్యాయాలు ఈ రెండు నియోజకవర్గాలలో పర్యటించి ప్రచార సభలలో పాల్గొన్నారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో డీసీసీ అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి శ్యాంనాయక్‌, మాజీ ఎంపీపీ బాలేష్‌గౌడ్‌ తదితరులు ఆత్రం సుగుణ కోసం ప్రచారం చేపడుతుండగా, సిర్పూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి రావి శ్రీనివాస్‌తో పాటు జెడ్పీ వైస్‌ ఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు ప్రచారం చేపడుతున్నారు. తాజాగా బుధవారం మంత్రి సీతక్క సిర్పూరు నియోజకవర్గంలో పర్యటించి ఆయా ప్రచార సభలలో పాల్గొన్నారు. ఇక బీజేపీ అభ్యర్థి గొడం నగేష్‌ తరపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌ ముమ్మర ప్రచారం చేపడుతున్నారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో కొత్తపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఇటీవలే పార్టీలో చేరిన జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు ప్రచారంలో పాల్గొంటున్నారు. సిర్పూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు ప్రతీ రోజు ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన ప్రచార సభలలో పాల్గొంటున్నారు. ఈ నెల పదో తేదీన బీజేపీ రాష్ట్ర నాయకుడు చీకోటి ప్రవీణ్‌ కాగజ్‌నగర్‌లో ప్రచారానికి రానున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు తెలిపారు.
బీఆర్‌ఎస్‌కు అన్నీ తామై…
ఇక భారత రాష్ట్ర సమితి అభ్యర్థి ఆత్రం సక్కుకు ఎమ్మెల్సీ దండె విఠల్‌తో పాటు ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మిలు అన్నీ తామై ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రచారంలో పాల్గొంటుండగా, సిర్పూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దండె విఠల్‌ ప్రచారం చేపడుతున్నారు. ఈ పార్టీ నుండి ఇప్పటి వరకు రాష్ట్ర నాయకత్వం ప్రచారానికి రాలేదు. కాని తొమ్మిదో తేదీన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆసిఫాబాద్‌కు రానున్నారు. స్థానికంగా నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొననున్నారు. కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఒక పర్యాయం వచ్చి వెళ్లారు. అంతే తప్ప పెద్దగా రాష్ట్ర నాయకులు ఎవరూ ప్రచారానికి రాలేదు. కాగజ్‌నగర్‌లో సిర్పూరు పేపర్‌ మిల్లు పున:ప్రారంభంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కృషి ఉన్నందున కేటీఆర్‌ను కాగజ్‌నగర్‌కు కూడా రప్పించి బహిరంగసభ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు కూడా పెద్దగా ఈ రెండు నియోజకవర్గాలలో పర్యటించకపోవడం ఆ పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేస్తోంది.

]]>
ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపిద్దాం https://navatelangana.com/let-india-alliance-candidate-win/ Wed, 08 May 2024 19:08:57 +0000 https://navatelangana.com/?p=286519 – సీపీఐ(ఎం) నియోజకవర్గ కన్వీనర్‌ దుర్గం దినకర్‌
నవతెలంగాణ-రెబ్బెన
ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ(ఎం) ఆసిఫాబాద్‌ నియోజకవర్గ కన్వీనర్‌ దుర్గం దినకర్‌ అన్నారు. బుధవారం మండలంలోని రాంపూర్‌, నవేగాం, రాళ్ళపేట, బుద్దనగర్‌, పుంజుమేర గూడ గ్రామాలలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకోసం, వారి పక్షాన, కార్మికులు, వ్యవసాయ కార్మికుల, కూలీల పక్షాన ఎర్రజెండా నిలుస్తుందన్నారు. భూపోరాటాలు చేసి వందల ఎకరాలు పేదలకు పంచిన చరిత్ర సీపీఐ(ఎం) ఉందన్నారు. మతం పేరుతో ఓట్లు అడుగుతున్న బీజేపీనీ ఓడించాలన్నారు. ఇండియా కూటమి భాగస్వామి కాంగ్రెస్‌ అభ్యర్ధి ఆత్రం సుగుణ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గేడం టీకనంద్‌, చాపిడి పురుషోత్తం, సతిష్‌, నిఖిల్‌, తిరుపతి, మాలశ్రీ, శ్రావణి, శ్రీకాంత్‌, శివ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌: బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఉమ్మడి మోడీ ఫాసిజానీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఇండియా కూటమి అభ్యర్థినీ గెలిపించాలని సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి చాంద్‌ పాషా అన్నారు. మండలంలోని వెంకటాపూర్‌, పర్వతిపూర్‌, బలంపూర్‌ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ 10 ఏండ్ల పాలనలో దేశవ్యాప్తంగా హిందుత్వ ఫాసిస్టు శక్తులు పెట్రేగిపోయాయని, దళితులు, ఆదివాసులు, మహిళలు, మైనారిటీలపైన దాడులు, హింస పెరిగాయన్నారు. క్రిస్టియన్‌, మైనారిటీ మతాలకు వ్యతిరేకంగా హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ దేశ సమైక్యతకు, లౌకిక, ప్రజాస్వామిక విధానాలకు తూట్లు పొడుస్తు హిందువుల సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతూ హిందువుల్ని మతం మత్తులో ముంచుతుందన్నారు. ఒక వర్గానికి తాము ఏమో చేస్తున్నట్లు నమ్మ పలుకుతూ గతంలో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కుతోందన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన బీజేపీని ఓడించాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బౌరే కళ్యాణ్‌, జగజంపుల తిరుపతి, ఏఐకేఎంఎస్‌ జిల్లా కన్వీనర్‌ రత్నం పోషన్న, ఐఎఫ్‌టీయూ జిల్లా మాయకులు బండారి తిరుపతి, పీడీఎస్‌యూ జిల్లా నాయకులు శ్యామ్‌, తిరుపతి, గ్రామ నాయకులు రవీందర్‌, బాలాజీ, కొటేశ్వర్‌, రమేష్‌, జైరాం, వెంకటేష్‌, నగేష్‌ పాల్గొన్నారు.
పెంచికల్‌పేట్‌: ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. మండలంలోని దరోగపెల్లి, ఎలుకపెల్లి, ఎల్లూరు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 13న చేతి గుర్తుకు ఓటేసి ఆత్రం సుగుణక్కను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్‌ సభ్యుడు సాజిద్‌, నాయకులు సముద్రాల రాజన్న, రమేష్‌, గణపురం బాపూజీ, మాజీ సర్పంచ్‌ దేవాజీ పాల్గొన్నారు.

]]>
రేషన్‌ బియ్యం అక్రమ రవాణా https://navatelangana.com/smuggling-of-ration-rice/ Wed, 08 May 2024 19:07:25 +0000 https://navatelangana.com/?p=286518 – లబ్ధి పొందేదెవరు..?
– పరిశ్రమలు లేక పెరుగుతున్న నిరుద్యోగ యువత
– బడా వ్యాపారులను వదిలి చిన్నవారిపై జూలుం
నవతెలంగాణ-సిర్పూర్‌(టి)
పేదల కోసం ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న రాయితీ బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు జీవనం కోసం వాటిని అమ్ముకుంటుంటే మరి కొందరు వారి అవసరాలను ఆసరాగా చేసుకోని అధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. వీటిని ఆరకట్టాల్సిన అధికారులు బడా వ్యాపారులను వదిలి చిన్నచితకగా జీవనం సాగించేందుకు విక్రయించే వారిపై దాడులు నిర్వహించి పట్టుకుంటున్నారు. బియ్యం అక్రమంగా విక్రయించడం నేరామైనప్పటికి కుటుంబ పోషణకు తప్పడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉపాధి, ఉద్యోగం లేక యువకులు, ఇతరులు రేషన్‌ బియ్యన్ని పక్కన ఉన్న మహారాష్ట్రలో విక్రయిస్తున్నారు. భూములు లేక ఉపాధి కరువై ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేసే బియ్యాన్ని మన రాష్ట్రానికి సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రకు ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లి వారి కుటుంబాలతో మధ్య స్థాయిలో జీవనం కొనసాగిస్తున్నారు.
మహారాష్ట్రలో ప్రత్యేక దుకాణాలు
రాష్ట్రానికి ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని పోడ్సా గ్రామంలో రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా మహారాష్ట్ర వారు కొంతమంది దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ దుకాణాలకే మన రాష్ట్ర రేషన్‌ బియ్యం నిరుద్యోగులు తీసుకెళ్తుంటారు. వీరిని ఆసరాగా చేసుకొని రాజకీయ పలుకుబడి కలిగిన కొంతమంది వ్యక్తులు కూడా అమ్ముకుంటారు. ఈ రేషన్‌ బియ్యం గ్రామాల్లోని వినియోగదారుల నుండి ఇంటికి తీసుకోక రేషన్‌ డీలర్‌కే అమ్ముకుంటున్నారు. వీరి వద్దనే రేషన్‌ బియ్యం సేకరిస్తారు. బియ్యాన్ని తరలించే ద్విచక్ర వాహనాల నిరుద్యోగులు వీరి వద్ద కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు కూడా వీరి వద్దనే సేకరించి ఐచర్‌, బొలోరో వాహనాల్లో తీసుకెళ్లి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు.
బియ్యం అక్రమ రవాణాకు కారణమేంటి..?
వీరందరు ఈ అక్రమ రవాణా దందాకు పాల్పడడానికి ప్రధాన కారణం పది సంవత్సరాల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పరిపాలనలో ప్రభుత్వ శాఖలో వివిధ స్థాయిల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయకపోవడం. ఎంతోకొంత చదువుకున్న నిరుద్యోగులు ఉపాధి దొరకక, నియోజకవర్గంలో పరిశ్రమలు లేక నిరుద్యోగులు ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చేయడానికి పని లేక కుటుంబాన్ని పోషించడానికి ఇలా అక్రమ మార్గం పట్టినట్టు తెలుస్తోంది.
అధికారుల నిఘా వైఫల్యం…
రేషన్‌ బియ్యం అక్రమ రవాణ కొన్ని రోజుల నుండి కొనసాగుతున్నా నివారించడంలో సంబంధిత శాఖ అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెల ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేసే రేషన్‌ దుకాణాల్లో ఎప్పటికప్పుడు నిల్వలను పంపిణీ చేయకపోవడం, ఎవరైన సామాన్యులు ఫిర్యాదు చేస్తే తప్పా అధికారుల్లో చలనం రాదు. ద్విచక్ర వాహనాలపై రేషన్‌ బియ్యాన్ని తీసుకెళ్లే నిరుద్యోగులను పట్టుకొని మామూళ్లు ఇస్తేనే వదిలేస్తారు లేకపోతే కేసులు పెట్టి వారి ప్రతాపం చూపిస్తారు. కానీ రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులపై మాత్రం సుముఖతగా ఉంటున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వం స్పందించాలి…
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం, నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఈ ప్రాంతంలో చిన్న, మద్యతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించాలి. స్వయం ఉపాధి చేసుకొనే విధంగా నిరుద్యోగ యువతి, యువకులకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, లేకపోతే నియోజకవర్గంలో ఇప్పటివరకు రేషన్‌ బియ్యం అక్రమ రవాణ కాకుండా ఇతర మారక ద్రవ్యాలు అక్రమ రవాణాకు అడ్డాగా మారబోతుందనే భయం కూడా ఉంది. ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.

]]>
జోరుగా పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారం https://navatelangana.com/vigorous-parliamentary-election-campaign/ Wed, 08 May 2024 19:02:57 +0000 https://navatelangana.com/?p=286512 నవతెలంగాణ-సారంగాపూర్‌
మండలంలోని కౌట్ల(బి), స్వర్ణ, లింగాపూర్‌ గ్రామాలలో బుధవారం పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార సరళి వైవిధ్య భరితంగా కొనసాగింది. బార్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు అల్లూరి మల్లారెడ్డి తమ బృందంతో కలిసి మండుటెండలను సైతం లెక్కచేయకుండా కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రచారం చేపట్టారు. ఉపాధి హామీ కూలీలను ఆప్యాయంగా పలకరించి కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. 13న జరగబోయే ఎన్నికల్లో చేతు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణక్కను అందరి ఆడబిడ్డగా ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎండలో పనులు చేస్తున్న ఉపాధి కూలీలకు మజ్జిగ పంపిణీ చేశారు. ప్రచారంలో కాంగ్రెస్‌ ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బాణవత్‌ గోవింద నాయక్‌, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ చైర్మన్‌ పోతారెడ్డి, ఉప అధ్యక్షుడు కాంబ్లే సూర్యకాంత్‌, కాంగ్రెస్‌ నాయకులు, వ్యాపారవేత్త సత్యనారాయణ, మండల కాంగ్రెస్‌ ఎస్టీ సెల్‌ అధ్యక్షులు భీంరావు, నాయకుడు పోతారెడ్డి, సిపిఐ నాయకుడు ఎస్‌ఎన్‌ రెడ్డి, పౌర హక్కుల సంఘం నాయకులు బోరన్న, శశికళ పాల్గొన్నారు.

]]>
అభ్య‌ర్థు‌ల గెలుపు..నాయ‌కుల‌కు స‌వాల్‌..! https://navatelangana.com/candidates-victory-is-a-challenge-for-leaders/ Wed, 08 May 2024 19:01:52 +0000 https://navatelangana.com/?p=286508 – అభ్యర్థుల విజయానికి చెమటోడుస్తున్న నాయకులు
– ఎంపీ స్థానం దక్కించుకునేందుకు వ్యూహాలు
– క్షణం తీరికలేకుండా ప్రచారంలో నిమగం
– ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు
ఆదిలాబాద్‌ లోక్‌సభ అభ్యర్థుల గెలుపు..ఆయ పార్టీలకే కాదు..అందులోని కీలక నాయకులకు సవాల్‌గా మారింది. అభ్యర్థులు ఎవరున్నా..వారిని గెలిపించే బాధ్యతలు మాత్రం వీరు తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. ఇందుకు ఆయా పార్టీల అధిష్టానాలు సైతం ఆయా పార్టీలకు చెందిన కీలక నాయకులకే గెలుపు బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అభ్యర్థుల మాదిరిగా ప్రచారపర్వంలో వారు నిమగమైన తీరు చూస్తుంటే ఓ దశలో ఎన్నికల్లో వారే పోటీ చేస్తున్నారా..? అనే రీతిలో కనిపించడం ఇందుకు నిదర్శనకంగా కనిపిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల తరపున ప్రచారానికి ఆయా పార్టీల అగ్రనేతలు రావడం ప్రచారపర్వాన్ని హీటెక్కించగా.. ఆయా పార్టీలకు చెందిన కీలక నాయకులు క్షణం తీరికలేకుండా అభ్యర్థుల గెలుపునకు చమటోడుస్తుండటం ఆసక్తి రేపుతోంది. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న సదరు నాయకులు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారపర్వంలోనే నిమగం కావడం ఆసక్తి రేపుతోంది. వివిధ సంఘాలు, సామాజికవర్గాల వారిని కూడగట్టడం.. విజయానికి అవసరమైన వ్యూహాలు రూపొందిస్తుండటం ఆసక్తికరంగా మారుతోంది.

నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్‌ లోక్‌సభ సమరానికి సమయం దగ్గర పడింది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండగా.. పోలింగ్‌కు ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ క్రమంలో సమయం లేదు మిత్రమా అనే రీతిలో అభ్యర్థులు, ఆయా పార్టీలకు చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు అందరూ జనాల్లోనే ఉండటం ఆసక్తి రేపుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారపర్వంలోనే ఉంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సీటును ఎలాగైనా దక్కించుకొని పాగా వేయాలని కాంగ్రెస్‌ భావిస్తుండగా.. సిట్టింగ్‌ సీటును నిలుపుకోవాలని బీజేపీ అనుకుంటోంది. ఈ సీటులో విజయం సాధించడం ద్వారా పట్టు నిలుపుకోవాలని బీఆర్‌ఎస్‌ భావించడం ఆసక్తికరంగా మారింది. మూడు ప్రధాన పార్టీలు ఎవరికి వారు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పార్లమెంటుకు వెళ్లాలనే కుతూహలంతో పోటీ పడుతున్న అభ్యర్థులు ఎన్నికల్లో శ్రమించడం సహజం. కానీ వీరిని గెలిపించేందుకు ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలు కష్టపడుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. ఓ వైపు ఎండలు మండిపోతున్నా ..అస్వస్థతకు గురవుతున్నా లెక్క చేయకుండా ప్రజల్లోకి వెళ్లి ప్రచారంలో నిమగం కావడం ఆసక్తికరంగా మారింది. మరోపక్క అభ్యర్థి గెలిస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం ఉంటుందనే ఉద్దేశంతో ద్వితీయ శ్రేణి నాయకులు, ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
విజయమే లక్ష్యంగా ప్రణాళికలు..!
ఈ లోక్‌సభ స్థానాన్ని దక్కించుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు నువ్వా- నేనా అనే రీతిలో పోటాపోటీగా ప్రచారం చేపడుతున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆత్రం సుగుణను గెలిపేందుకు ఆ పార్టీ కీలక నేతలు ఆహర్నిశలు శ్రమిస్తున్నారు. ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క అభ్యర్థి గెలుపు బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. కొన్ని రోజులుగా లోక్‌సభ పరిధిలోనే ఉంటూ ఊరూరా ప్రచారం చేపడుతున్నారు. మంత్రితో పాటు ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఇటీవల పార్టీలో చేరిన ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు వారి నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ విజయానికి దోహదం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఆత్రం సక్కు పోటీలో నిలవగా.. ఈయన గెలుపు కోసం మాజీ మంత్రి, పార్టీ ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, ఎమ్మెల్యేలు అనిల్‌జాదవ్‌, కోవ లక్ష్మీతో పాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన కీలక నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. లోక్‌సభ పరిధిలో ప్రచారం నిర్వహిస్తూ అభ్యర్థి విజయం కోసం కృషిచేస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ మంత్రి గోడం నగేష్‌ బరిలో నిలవగా.. ఈయన విజయం కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, పాయల్‌శంకర్‌, రామారావుపటేల్‌, పాల్వాయి హరీష్‌బాబు శ్రమిస్తున్నారు. వీరితో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు సైతం ప్రచారపర్వంలో నిమగం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలా అభ్యర్థి విజయమే లక్ష్యంగా ఆయా పార్టీల కీలక నేతలు, ముఖ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ వర్గాల మద్ధతు కూడగడుతూ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

]]>
మత వైశామ్యాలు రెచ్చగొడుతున్న మోడీ https://navatelangana.com/modi-is-inciting-religious-strife/ Wed, 08 May 2024 18:59:39 +0000 https://navatelangana.com/?p=286499 – బీజేపీకి ఓటు వేస్తే హక్కులు కోల్పోయినట్టే
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
– తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని భరోసా
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
మూడో సారి ప్రధాని అవుతానన్న ఆశలు పోయి ఓటమి భయంతో ప్రధాని మోడీ దేశంలో మత వైశమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ ముఖ్య నాయకుల సమావేశానికి కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ తో కలిసి హాజరయ్యారు. పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి ఆత్రం సుగుణ విజయానికి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్‌ శ్రేణులకు దశా దిశా నిర్దేశం చేశారు. ఈనెల 13న పోలింగ్‌ జరగడానికి కేవలం నాలుగు రోజులు ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా పోల్‌ మేనేజెమెంట్‌ నిర్వహించాలని సూచనలు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బీజేపీకి ఓటు వేస్తే మన హక్కులు పోతాయన్నారు. ప్రజాస్వామ్య భారత రాజ్యాంగ పరిరక్షణకు దేశ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించుకోవాల్సిన అవసరముందన్నారు. నియంతృత్వంతో రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న మోడీ ఒకవైపు, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడి దేశంలో లౌకికవాదాన్ని నిలబెట్టాలని ప్రజల కోసం పోరాటం చేస్తున్న రాహుల్‌ గాంధీ మరో వైపు ఈ ఎన్నికల సంగ్రామంలో నిలబడ్డారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర చేస్తున్న మోడీకి గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు వేర్వేరు కాదని ఈ రెండు పార్టీలు ఒకటేనని మరోసారి ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో రుజువైందన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే అవుతుందన్నారు. పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక ప్రజా వ్యతిరేక చట్టాలకు బీఆర్‌ఎస్‌ ఎంపీలు మద్దతి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒకరికొకరు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. దేశ సంపదను సంపన్నులకు వ్యాపారులకు దోచిపెట్టి బీజేపీ పార్టీ, రాష్ట్ర సంపదను దోపిడీ చేసిన బిఆర్‌ఎస్‌ పార్టీలు ఈ పార్లమెంటు ఎన్నికల్లో చేతులు కలిపి మరోసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతు భరోసా రాకుండా ఆ పార్టీలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. రైతులను తప్పుదోవ పట్టించే విధంగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఓబిసి కులగణన ద్వారా దేశ సంపద రాజ్యాధికారంలో జనాభా దమాషా ప్రకారం వారికి వాటా లభిస్తుందని రాహుల్‌గాంధీ బీజేపీ పాలకులకు పలుమార్లు విన్నవించిన పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో కుల గణన మొదలుపెట్టామని కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో కూడా కులగణన కచ్చితంగా చేపట్టి జనాభా దామాష ప్రకారంగా హక్కులు, సంపద కల్పిస్తామని వెల్లడించారు.
బీఆర్‌ఎస్‌ మోసం చేసింది
పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగు నీళ్లు ఇవ్వకుండా ఆదిలాబాద్‌ ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాణహితను విస్మరించి కాళేశ్వరం నిర్మించి ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలకు కష్టాలను చూపించిందని వివరించారు. ఎన్నికల తర్వాత ప్రాణహితను కచ్చితంగా నిర్మిస్తామని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఇక్కడ వివిధ సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్‌ హయాంలోనే నిర్మించామని గుర్తుచేశారు. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో భూములపై ఆదివాసి గిరిజనులకు ఉన్న హక్కులను ధరణి ద్వారా గత పాలకులు చిన్నాభిన్నం చేశారన్నారు. ట్రైబల్‌, నాన్‌ ట్రైబల్‌ ప్రజల భూ సమస్యలను పరిగణలోకి తీసుకొని వారికి త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఐటీడీఏలను బలోపేతం చేస్తూ వందశాతం నిధులు ఇచ్చి పూర్వవైభవం తీసుకువస్తామన్నారు.
రైతులు ఆందోళన చెందకూడదు
అకాల వర్షం, గాలి దూమారం కారణంగా నష్టపోయిన రైతులను కచ్చితంగా ఆదుకుంటామని, పంట నష్టం అంచనా వేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఎన్నికల తర్వాత పరిహారం ఇస్తామన్నారు. అకాల వర్షంతో కల్లాల వద్ద, ఐకెపి కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తామని వెల్లడించారు. ప్రశ్నించే గొంతుక ఆత్రం సుగుణను గెలిపించుకుంటే అమాయక ఆదివాసీ గిరిజన ప్రజల గళాన్ని పార్లమెంటులో వినిపిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, నిర్మల్‌ డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలచారి, ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు పాల్గొన్నారు.

]]>
పెద్దపల్లిలో నువ్వా..నేనా..! https://navatelangana.com/you-are-me-in-peddapalli/ Wed, 08 May 2024 18:57:18 +0000 https://navatelangana.com/?p=286496 – ముమ్మరంగా కొనసాగుతున్న ప్రచారం
– కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశం
నవతెలంగాణ-జైపూర్‌
పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో నువ్వా నేనా అనే విధంగా ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికలకు మరో నాలుగు రోజుల వ్యవధి ఉన్నందున ప్రధాన పార్టీల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఉదయం ఆరు గంటల నుండి అర్ధరాత్రి వరకు ఓటర్లను కలిసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అభ్యర్థులను గెలిపించుకోడం కోసం స్థానిక నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అభ్యర్థుల తరపున గ్రామాల్లో గడపడపకు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఉదయం పూట ఉపాధి పనుల్లో ఉండే గ్రామీణులను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో పాటు తండ్రి చెన్నూర్‌ ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి రాత్రీపగలు తేడా లేకుండా ప్రచారం చేస్తున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ సైతం నియోజకరవ్గంలో ప్రచారం ముమ్మరం చేశారు. మరో వైపు మంత్రి శ్రీధర్‌ బాబు వంశీకృష్ణ గెలుపుకు కృషి చేస్తుండగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. వంశీ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని ఎన్నికల సభల్లో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపు కోసం సీపీఐ(ఎం) నాయకులు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి అనుకూల అంశాలు ఎక్కువగా ఉండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కన్పిస్తోంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌తో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు, చెన్నూర్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ ప్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన వారిని తిరిగి బీఆర్‌ఎస్‌లో చేర్చుకునేందుకు అనూయులతో సంప్రదింపులు జరుపుతున్నారు. తటస్థులుగా ఉన్న వారిని పార్టీలో చేర్చుకుంటూ భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా కల్పిస్తున్నారు. అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌తో పాటు కోల్‌బెల్ట్‌ ఏరియా నాయకులతో కలిసి కార్మికులను కలస్తూ కారు గుర్తుకు ఓటేసేలా ప్రచారం చేస్తున్నారు. మందమర్రి, రామకృష్ణాపూర్‌ మున్సిపాల్టీలపై ప్రత్యేక దృష్టి సారించారు. బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్‌ గెలుపును ఆకాంక్షిస్తూ పార్టీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్‌ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నేతకాని సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్‌ తన సామాజిక వర్గం ఓట్లు చీలి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

]]>
నెలాఖరుకల్లా పనులు పూర్తి చేయాలి https://navatelangana.com/the-work-should-be-completed-by-the-end-of-the-month/ Wed, 08 May 2024 18:54:20 +0000 https://navatelangana.com/?p=286487 – మంచిర్యాల డీఈఓ ఎస్‌ యాదయ్య
నవతెలంగాణ-కాసిపేట
పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు ఈ నెల 31వ తేదిలోపు పూర్తి చేయాలని డీఈఓ ఎస్‌ యాదయ్య ఆదేశించారు. బుధవారం మండలంలోని ఆయా పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. ఈ సంధర్భంగా గోండుగూడ, మహేంద్ర బస్తీ, చింతగూడ, గురువాపూర్‌ ప్రైమరీ పాఠశాలలతో పాటు తెలంగాణ మోడల్‌ స్కూల్‌, కస్తూర్భా విద్యాలయంలో పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సంధర్భంగా డీఈఓ యాదయ్య మాట్లాడుతూ నాణ్యతతో కూడిన పనులు చేపడుతూ ఈ నెలలోపు పూర్తి చేయాలని అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్లకు, పాఠశాలల హెచ్‌ఎంలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరల్‌ అధికారి చౌదరి, మోడల్‌ ప్రిన్సిపాల్‌ అందె నాగ మల్లయ్య, హెచ్‌ఎం వేణుమాదవ్‌ పాల్గొన్నారు.

]]>
అకాల వర్షం.. రైతుకు నష్టం..! https://navatelangana.com/untimely-rain-is-a-loss-to-the-farmer-2/ Wed, 08 May 2024 18:53:16 +0000 https://navatelangana.com/?p=286490 – గాలిదుమారంతో దెబ్బతిన పంటలు
– నేల రాలిన మామిడి కాయలు
– పరిహారం ఇవ్వాలని రైతుల వేడుకోలు
నవతెలంగాణ-జైపూర్‌
ఆరుగాలం పండించిన పంట చేతుకు వచ్చే క్రమంలో మంగళవారం జిల్లాలో కురిసిన వర్జానికి ఆపార నష్టం మిగిల్చింది. గాలి దుమారంతో పాటు కురిసిన వడగళ్ల వనాకు కోత దశకు వచ్చిన వైరి పైరు నేలమట్టం అయింది. యాసంగిలో సాగు చేసిన పంటలు అతలాకుతలమయ్యాయి. ప్రధానంగా వరి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లింది. జైపూర్‌ మండలలోని వివిధ ప్రాంతాల్లో వరి కోతలు పూర్తి కాగా మరి కొన్ని ప్రాంతాల్లో వరి పైరు కోతకు సిద్ధంగా ఉంది. చేతికందుతుందనుకున్న సమయంలో ప్రకృతి వైపరిత్యానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలో 366 మంది రైతులకు సంబంధించి 537 ఎకరాల్లో సాగు చేసిన వరి పంటకు నష్టం జరిగిందని అధికారులుఅంచనా వేస్తున్నారు. అదేవిధంగా భీమారం మండల పరిధిలో 50 మంది రైతులకు సంబంధించి సుమారుగా 90 ఎకరాల్లో సాగు చేసిన వరి పంటకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కిష్టాపూర్‌ నుంచి మొదలు శివ్వారం వరకు కురిసిన రాళ్లవానతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసుకున్న వరి ధాన్యం తడిసిముద్దయ్యింది. అదేవిధంగా ఉమ్మడి జైపూర్‌ మండలంలో మామిడి పంట 35 నుండి 40 శాతం నష్టం జరిగి ఉడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. జైపూర్‌ మండల పరిధిలో 1896 ఎకరాల మామిడి తోటలతో పాటు భీమారం మండల పరిధిలో 2200 ఎకరాల్లో 50 శాతం మామిడి పంట చేతికందినట్లు అధికారులు భావిస్తున్నారు. అకాలవర్షంతో పాటు బలంగా వీచిన గాలులతో వేర్లతో సహా చెట్లు పడిపోగా కొమ్మలు విరిగి చెట్టుకు ఉన్న కాతలో 90 శాతం నేల రాలింది. పంట నష్టపోయిన రైతులు తమకు పంటనష్ట పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

రాలిందంతా పగిలింది: శ్రీనివాస్‌గౌడ్‌, రైతు శివ్వారం, జైపూర్‌.
రాళ్లవానతోపాటు గాలిదుమారంతో మామిడి పంట చేతికందకుండా పోయింది. చెట్టుకున్న 90 శాతం కాయ నేల రాలి పగిలి పోయింది. పశుగ్రాసానికి తప్పామార్కెట్‌కు తరలింలే వీలులేకుండా ఉంది. ప్రతి సంవత్సరం కోత దశలో మామిడి పంటను నష్టపోవల్సి వస్తుంది. శివ్వారం, పౌనూర్‌, వేలాల గ్రామ శివారుల మీదుగా రాళ్లతో కూడిన వర్షంతో మామిడి, వరి పంటలను తీవ్రంగా నష్టపోవల్సి వచ్చింది. అధికారులు వెటనే సర్వే చేపట్టి నష్ట పరిహారం ఇచ్చే విదంగా చూడాలి.

సుమారు 40 శాతం మామిడి పంటకు నష్టం: తిరుపతి, ఉధ్యానవ శాఖ అధికారి.
ఉమ్మడి జైపూర్‌ మండలంలో కురిసిన అకాలవర్షంతో సాగులోని మామిడి పంట సుమారు 40 శాతం నష్టం వాటిలి ఉండవచ్చు. దాదాపుగా 50 శాతం మామిడి పంట చేతికందింది. మిగిఇ ఉన్న యాభై శాతంలో అత్యధికంగా పంటకు నష్టం జరిగినట్లు గుర్తించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంటలకు జరిగిన నష్టాన్ని గుర్తించేందకు క్షేత్రస్థాయి నివేధికలు సిద్ధం చేస్తున్నాం.

నష్టం అంచనా వేస్తున్నాం: మార్క్‌గ్లాడ్సన్‌, వ్యవసాయ అధికారి.
మంగళవారం కురిసిన వడగళ్ల వానతో పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నాం. ప్రాథమికంగా సేకరించిన సమాచారాన్ని అధికారులకు నివేధించి ప్రభుత్వ నిర్ణయం మేరకు పూర్తి స్థాయిలో నివేధికలు తయారు చేయనున్నాం. ఆలస్యంగా సాగు చేసిన వరి పంటలకు నష్టం జరిగింది. ఉమ్మడి జైపూర్‌ మండలంలో 650 నుండి 700 ఎకరాల్లో సాగు చేసిన వరి పంటకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యక్తిగతంగా క్షేత్రస్థాయి రిపోర్టు తీసుకోవల్సి ఉంది.

ప్రతి ఏటా ఇదే గోస: సందెల తిరుపతి, రైతు ఆర్కెపల్లి, భీమారం
ప్రతి సంవత్సరం ప్రకృతి ప్రకోపానికి గురి కావల్సి వస్తోంది.. వర్షం పాక్షికంగా కురిసినా గాలి వేటు పంటలను అతలాకుతలం చేసింది. నలువైపుల నుండి బలంగా వీచ్చిన గాలిదుమారంతో ఇటు నుండి అటు నుండి వరి పైరు పడిపోయింది. పైరు కోయాలనుకున్నా హార్‌వేస్టర్‌ పంటికి అందేటట్టు లేదు..మనుషులతో కోపియ్యాలంటే ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తుంది…నిలాటు పొలాన్ని గంటలో కోసే హార్‌వేస్టర్‌ పడిపోయిన పొలంలో రెండు గంటలు కోయాల్సి వస్తోంది. గాలివేటుకు పడిపోయిన పంట పొలంలో దిగుబడి శాతం తగ్గడమే కాకుండా హార్‌వేస్టర్‌ చార్జీలు అదనంగా నష్టపోవల్సి వస్తుంది.

]]>
గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించండి https://navatelangana.com/gaddam-vamsikrishna-wins-with-huge-majority/ Wed, 08 May 2024 18:50:42 +0000 https://navatelangana.com/?p=286469 నవతెలంగాణ-నస్పూర్‌
సీపీఐ బలపరిచిన పెద్దపల్లి పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం చెన్నూర్‌ ఎంఎల్‌ఏ గడ్డం వివేక్‌ వెంకటస్వామితో కలిసి శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్కె-6 గనిలో నిర్వహించిన గేట్‌ మీటింగ్‌లో మాట్లాడారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానవల్ల దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, లాభాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసీ, టెలిగ్రామ్‌, సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తుందని విమర్శించారు. కార్మికులను కట్టు బానిసలుగా చేసి 12 గంటల పని దినాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పేదల కోసం ప్రజల కోసం కాకుండా పెట్టుబడిదారులైన ఆదాని, అంబానీల కోసం పని చేస్తున్నారని అన్నారు. గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను లూటీ చేసిందని, కార్మికులకు ఏ విధంగా న్యాయం చేయలేదన్నారు. పైగా సింగరేణి సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మార్చారని కనీసం సింగరేణి కార్మికులకు కోలిండియాలో అమలవుతున్న, సింగరేణి సంస్థలో అధికారులకు యాజమాన్యం చెల్లిస్తున్న పెర్క్స్‌ పై ఆదాయ పన్ను మినహాయింపు కూడా చేయలేని వారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని కార్మికులను ఓట్లు అడుగుతున్నారని వారు ఈ సందర్భంగా ప్రశ్నించారు. సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఎన్నికల అనంతరం కచ్చితంగా పెర్క్స్‌ పై ఐటి మినహాయింపు, సొంత ఇంటి పథకం అమలు, నూతన బొగ్గు బావులు తదితర సమస్యలను వెంటనే పరిష్కారం చేస్తామని, కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకష్ణ భారీ మెజార్టీతో గెలిపించాలని వివేక్‌ వెంకటస్వామి కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య, సీపీఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి సదానందం, శ్రీరాంపూర్‌ బ్రాంచ్‌ కార్యదర్శి ఎస్‌కె బాజీ సైదా, బ్రాంచ్‌ సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్‌, గొర్రె నర్సయ్య, సంఘం సదానందం, అఫ్రోజ్‌ ఖాన్‌, మురళి చౌదరి, బిర రవీందర్‌, గునిగంటి నర్సింగరావు, కుమారస్వామి, రామ్‌ చందర్‌, బాలసాని లక్ష్మణ్‌, కారుకూరి నగేష్‌, మహేష్‌, అడ్డు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

]]>