Antharangam Archives - https://navatelangana.com/category/antharangam/ Sat, 04 May 2024 17:12:04 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Antharangam Archives - https://navatelangana.com/category/antharangam/ 32 32 వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ https://navatelangana.com/a-thousand-conflicting-thoughts/ Sat, 04 May 2024 17:11:59 +0000 https://navatelangana.com/?p=283586 A thousand conflicting thoughtsఅనుకరించడం సులువు. స్వేచ్ఛగా ఆలోచించడమే కష్టం. ఇలా ఆలోచించే స్వభావాన్ని చేకూర్చడమే సకల విద్యల లక్ష్యం. ప్రముఖ తత్వవేత్త అన్నట్టు ”స్వతంత్రంగా ఆలోచించే శక్తి, ఎదుటివారి పట్ల సహనం, కొత్తవాటిని సష్టించుకునేందుకు అవసరమైన తష్ణ” పాదుకొల్పే రీతిలో చదువులు ఉండాలి. ఈ లక్షణాలు కలవారే మంచి వ్యక్తులుగా రూపొంది సమాజ వికాసానికి దోహదపడతారు. అప్పుడే నిర్హేతుక ఆచరణను నిరసిస్తారు. నిలదీస్తారు. ఎందుకు? ఏమిటి? ఎలా? అనే ప్రశ్నల్ని సంధించడం నేర్పగలిగే చదువులే పిల్లల మానసిక వికాసానికి సరైన దిశానిర్దేశం చేస్తాయి.
మతప్రచారకులు, మతాల్ని నమ్మేవారు మతం పట్ల అభిరుచినీ, నమ్మికనీ, నేర్పుతారు. వారికి సత్యంతో నిమిత్తం లేదు. శాస్త్రీయ ఆధారాలతో పనిలేదు. ఈ నమ్మకాల్ని ఆశ్రయించినవారు స్వతంత్రంగా ఆలోచించలేరు. అందువల్లనే లౌకిక సూత్రాలపైనే విద్యావిధానం రూపొందాలి. శాస్త్రీయ దక్పథమే ప్రాతిపదిక కావాలి. కార్యాకారణ సంబంధం మీదనే ఆధారపడి దేవుడు, మతం గురించి సైతం చర్చించాలి. వాటి నిర్హేతుకతను చూపి, సొంతంగా ఆలోచించడం ఎలానో నేర్పాలి. ఏది సత్యం, ఏదసత్యం తెలుసుకోవాలన్న జిజ్ఞాసని పిల్లల్లో ప్రోది చేయాలి.
సత్యదూరాలైన నమ్మకాల పట్ల ఆరాధనాభావం చూపేవారు స్వతంత్ర ఆలోచనకు దారులు వేయలేరు. ప్రతి దాన్ని తర్కించి ప్రశ్నించే నైజాన్ని అలవరచలేరు. కేవలం అనుకరించడం నేర్పుతారు. అనుకరించడం వల్ల సజన వికసించదు. కుతూహలం అంతరిస్తుంది. శతాబ్దాల నమ్మకాల మీదుగానే నడిచివెళతారు. దీనికి విరుద్ధంగా స్వతంత్ర భావాల్ని అలవరిచే పనిని ఒక ఉద్యమంగా నిర్వహించడం శాస్త్రీయ దష్టి గల వారి బాధ్యత. పాలకుల అసంగత, అశాస్త్రీయ విధానాల్ని ప్రశ్నించడం అనివార్య కర్తవ్యం.
తద్వారా భావాల సంఘర్షణకు, ఏది తప్పు, ఏది ఒప్పు తెలుసుకోడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సిసలైన నిజాల్ని గ్రహించడం వీలవుతుంది. ఈ క్రమాన మరోవిధంగా ఆలోచించడం కుదురుతుంది. స్వతంత్రంగా ఆలోచించినప్పుడే అనేక ఆలోచనల్ని స్వీకరించి తర్కించడం తెలుస్తుంది. ఏ విషయంలోనైనా స్వేచ్ఛగా ఆలోచించడం అలవడితే జీవితంలోనూ, సమాజంలోనూ తమకు తాముగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం. ఇతరులు తమ మీద రుద్దే నిర్ణయాల్ని తిరస్కరించి, స్వతంత్రంగా ఆలోచించి తమకు ఏది ఉచితమో అందుకు అనుగుణంగా వ్యవహరించగలరు. ఇది సమాజ వికాసానికి, వ్యక్తి వికాసానికి తోడ్పడుతుంది. ‘నూరు పూలు వికసించనీ- వెయ్యి ఆలోచనలు సంఘర్షించనీ’ అని మావో అన్నట్టు విద్యార్థులు తమ సొంత ఆలోచనలతో చదువుకో గలిగినప్పుడు మాత్రమే.. మార్కుల ఒత్తిడి నుంచి దూరం కాగలరు. తద్వారా దేశాన్ని కలవరపెడుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు కొంత మేరకైనా తగ్గవచ్చు.

]]>
యుద్ధం https://navatelangana.com/war/ Sat, 27 Apr 2024 16:32:50 +0000 https://navatelangana.com/?p=278699 యుద్ధం కొన్ని తరాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల వేల జీవితాలు తలకిందులవుతాయి. వేల సంఖ్యలో అమాయక ప్రజలు నిరాశ్రయులవుతారు. అభం శుభం తెలియని పసిపిల్లలు అనాథలవుతారు. గాజాలో జరిగిన దారుణాలు ఇంకా మన కండ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియని స్థితిలో చిన్నారులు అల్లాడుతుంటారు. భర్తను కోల్పోయి కొందరు.. భార్యను కోల్పోయి మరికొందరు.. తల్లిదండ్రులను కోల్పోయి ఇంకొందరి అందమైన జీవితాల్లో అంధకారం అలుముకుంటుంది. ఇలాంటి అభాగ్యులకు ఎంత సాయం చేసినా వారి కుటుంబీకులను అందివ్వలేరు. ప్రపంచ చరిత్రలో ఏ యుద్ధాన్ని చూసినా ఎన్నో హదయ విదారక సంఘటనలు, సంఘర్షణలు వెలుగు చూస్తాయి.
అన్నం, మందులు కావాలంటే యుద్ధం చేస్తున్నారు ఎందుకనీ? ప్రపంచ ప్రజలంతా శాంతి కోరుతుంటే యుద్ధం చేస్తున్నారు ఎందుకనీ? యుద్ధం వల్ల ఒక వ్యక్తిపై ఆధిపత్యం సాధించవచ్చు. ఒక ప్రాంతం మీద పెత్తనం చెలాయించవచ్చు. ఒక దేశాన్ని శాసించవచ్చు. కానీ దాని వెనుక జరిగే ప్రాణ, ఆస్తి నష్టాన్ని భర్తీ చేయలేం. మొదటి ప్రపంచ యుద్ధం నుండి కండ్లకు కనిపిస్తున్న వాస్తవాలివి. అందుకే యుద్ధం గెలిచినవాడి కంటే యుద్ధాన్ని ఆపినవాడు గొప్పవాడు. తాను చేసిన యుద్ధంలో జరిగిన విధ్వంశాన్ని చూసి చలించి పోయిన అశోక చక్రవర్తి ‘ఇక నేను యుద్ధం చేయను’ అని ప్రతిన బూనుతాడు. ఆధిపత్యం, అధికారానికై యుద్ధం తప్ప మరో మార్గం లేదని భావించే ఆ రోజుల్లోనే ఓ రాజు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటే నేటి ప్రజాస్వామ్య యుగంలో యుద్ధానికి కాలుదువ్వుతున్న దేశాలు, వాటిని ప్రోత్సహిస్తున్న వారు ఇంకెంత ఉన్నంతగా ఆలోచించాల్సి వుంటుంది. కానీ అలాంటి ధోరణి మచ్చుకైనా కనిపించడం లేదు.
యుద్ధం కొన్ని తరాలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల వేల జీవితాలు తలకిందులవుతాయి. వేల సంఖ్యలో అమాయక ప్రజలు నిరాశ్రయులవుతారు. అభం శుభం తెలియని పసిపిల్లలు అనాథలవుతారు. గాజాలో జరిగిన దారుణాలు ఇంకా మన కండ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఎందుకు చనిపోతున్నామో కూడా తెలియని స్థితిలో చిన్నారులు అల్లాడుతుంటారు. భర్తను కోల్పోయి కొందరు.. భార్యను కోల్పోయి మరికొందరు.. తల్లిదండ్రులను కోల్పోయి ఇంకొందరి అందమైన జీవితాల్లో అంధకారం అలుముకుంటుంది. ఇలాంటి అభాగ్యులకు ఎంత సాయం చేసినా వారి కుటుంబీకులను అందివ్వలేరు. ప్రపంచ చరిత్రలో ఏ యుద్ధాన్ని చూసినా ఎన్నో హదయ విదారక సంఘటనలు, సంఘర్షణలు వెలుగు చూస్తాయి. ఈ నెల 20వ తేదీన రఫాలో జరిగిన సంఘటనలో 17 మంది చిన్నారులు ఇజ్రాయెల్‌ బాంబులకు బలైపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం మరింత విషాదం. ఈ దారుణంలో ఇద్దరు మహిళలూ ప్రాణాలు కోల్పోయారు.
ఏడు నెలలుగా సాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో ఇలాంటి విషాదకర దృశ్యాలెన్నో. ఈ యుద్ధానికి నిరసనగా అమెరికాలో విద్యార్థులు నిరసనలు తెలుపుతుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. ఏ రెండు దేశాల మధ్యనైనా సున్నితమైన అంశాలే యుద్ధానికి దారితీస్తాయి. అలాంటి అంశాలపై ఇరు దేశాలు దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. యుద్ధానికి దారితీసే సమస్యలను ముందుగానే గుర్తించి నివారించేందుకు ప్రయత్నించాలి. మిత్ర దేశాల సలహాలు, సూచనలు పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో యుద్ధ పరిస్థితులను నివారించాలి. యుద్ధాన్ని ఆపడం వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలను అరికట్టవచ్చు. లక్షలాది మంది అమాయక ప్రజల ప్రాణాలను కాపాడవచ్చు. ఆయా దేశాల ప్రజలకు శాంతిని, స్వేచ్ఛను పంచవచ్చు. ప్రపంచ దేశాలు చొరవ తీసుకుని యుద్ధం ఆపి శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక మంది అమాయక ప్రజల జీవితాలను కాపాడుకోవాలి.
అభివద్ధి, ఆధిపత్యం పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏదో ఒకచోట యుద్ధం జరుగుతూనే ఉంది. వేలమంది అనాథలవుతున్నారు. వారికి చేయూతను అందించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంటుంది. వారికి రక్షణ, ఉపాధి, విద్య, వసతులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇరుదేశాల నడుమ శాంతి నెలకొని మరింత మంది అనాథలు కాకుండా నిలువరిద్దాం.

]]>
నేలమ్మ https://navatelangana.com/nelamma-2/ Sat, 20 Apr 2024 15:48:06 +0000 https://navatelangana.com/?p=273641 Earth Day - palaparthi sandhyarani‘మానవులారా శిలాజ ఇంధనాలను మండించకండి. మనల్ని మనం చంపుకుంటూ భూమిని చంపొద్దు. ఉత్తుత్తి ప్రేమ వచనాలు వద్దు. ఆచరణలో చూపిద్దాం. దాని వల్ల మనం కోల్పోయేది ఏమీ ఉండదు మన పిసినారితనం తప్ప’ అంటారు ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త పీటర్‌ కల్మస్‌. భూమి లేకపోతే మనం ఎక్కడీ ఈ ప్రకృతే మన ఇల్లు. దీన్ని మనమే రక్షించుకోవాలి. ఈ భూగోళం మనకు వారసత్వంగా రాలేదు. దీన్ని నాశనం చేసే హక్కు మనకు లేదు. అంతే కదా… మనం ఆరోగ్యంగా ఉండాలంటే… నేల కూడా ఆరోగ్యంగా ఉండాలి. భూమి ఎంత సార వంతంగా ఉంటే అంత మంచి ఆహారం మనకు అందుతుంది. ఆహార పదార్థాల్లో పోషక విలువలు ఉండటం లేదంటే అందుకు కారణం నేల సారం కోల్పోవటమే. అందుకే…అన్నం పెట్టే నేల తల్లిని కాపాడుకోవాలసిన బాధ్యత మనందరిపై ఉంది. వజ్రాలకు ఎందుకు అంత విలువ? ఎందుకంటే అవి అరుదుగా ఉంటాయి కాబట్టి. మరి కొన్ని లక్షల సంఖ్యలో ఉండే వజ్రాలకే అంత విలువ ఉన్నప్పుడు ఈ విశ్వంలో జీవులున్న ఏకైక గ్రహంగా చెప్పుకుంటున్న భూమి ఇంకెంత విలువైనది అయివుండాలి? అసలు భూమికి మనం విలువ కట్టలేం. భూమాతకు మనం ఏం చేసినా రుణం తీరదు. అలాంటిది ప్రకృతిలో పుట్టే మనం ప్రకృతిని ఎంతో హాని చేస్తున్నాం. నేలమ్మ ప్రాధాన్యతను గుర్తించలేకపోతున్నాం. ఎన్నో రకాలుగా ప్రకృతిని హింసిస్తున్నాం. మన వల్ల నానాటికీ పెరుగుతున్న కాలుష్యమే దీనికి ప్రధాన కారణం. ఒకప్పుడు మన పూర్వీకులు పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళం. పంటలు పండించుకుని ఎలాంటి పురుగుమందులు వాడకుండా ఆర్గానిక్‌ ఫుడ్‌ని తినేవాళ్ళం. అందుకే మన తాతలు, బామ్మలు 90 ఏండ్లు వచ్చినా కూడా నడుములు ఒంగకుండా, కళ్ళజోడులు పెట్టుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటు ఎంతో ఉత్సాహంగా కాలం గడిపారు. ఒక్క మందుబిళ్ల కూడా వేసుకోకుండా ఏండ్లకేండ్లు బతికారు. కానీ నేటి తరం మారింది. గడిచిన ఈ ముఫ్పై ఏండ్లలో పంటలు, పొలాలు, రైతులు, ప్రజలు, తిండి, తిప్పలు, విధానాలు, రోగాలు ఇలా అన్నిట్లో భయంకరమైన మార్పులు వచ్చాయి. ఆర్గానిక్‌ ఫుడ్‌ కాస్తా పోయి విషం తినాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే పుట్టిన వాళ్లకు చూపు లేకుండా, క్యాన్సర్స్‌తో, రకరకాల స్కిన్‌ ఇన్ఫెక్షన్స్‌తో బతుకుతున్నారు చాలా మంది. ఇలాగే ఇంకొన్నేండ్లు ఉంటే మనుషుల మీద కొత్త కొత్త రోగాలు దాడి చేసి మరణాల రేటు పెరిగిపోయే అవకాశం చాలా కనిపిస్తోంది.
ఈ సమస్యలకు పరిష్కారం దొరకాలంటే నేలమ్మను కాపాడుకోవడమే మనముందున్న తక్షణ కర్తవ్యం. భూమిని కాపాడుకునేందుకు దిద్దుబాటు చర్యలు అత్యవరమని గుర్తించాలి. సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించి భూమి పొరల్లో కార్బన్‌ డయాక్సైడ్‌ తగ్గించి సముద్ర జలాలు అమ్లీకరణ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టాలి. ఏది ఏమైనా భూమి ఒక్కటే ప్రాణికోటికి ఉన్న ఒకే ఒక గ్రహం అనేది మరిచిపోవద్దు. ప్రతి దేశం, ప్రతి ప్రభుత్వం, ప్రతి పౌరుడు ఈ భూమి మన అందరిది అని భావించాలి. దీన్ని అందరూ కలిసికట్టుగా కాపాడుకోవాలనే గట్టి సంకల్పంతో ముందుకు వెళ్లాలి. ప్రభుత్వాలు కూడా ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి, అవసరమైతే కొత్త చట్టాలను చేసి వాటి అమలు పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించాలి. పర్యావరణ వేత్తలు, సామాజిక వేత్తలు, ప్రభుత్వేతర సంస్థలు భూ గ్రహానికి భవిష్యత్తులో సంభవించే విపత్తుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించి జరగబోయే ప్రమాదాన్ని నిలువరించాలి.

]]>
మనసే ఒక లోచనం https://navatelangana.com/mind-is-a-thought/ Sat, 13 Apr 2024 16:27:22 +0000 https://navatelangana.com/?p=269014 మనసే ఒక లోచనంమనలో ఉండి మనలను నడిపించే మనసే మన తొలిగురువు. మనసు, ఆలోచన, అంతరంగం, అంతరాత్మ… పేర్లు ఏవైనా ఇవన్నీ మనసుతో ముడిపడి ఉన్నవే. ఏ మనసు తన గురించి తాను ఆలోచించదు. తనకు సంబంధించని ఇతర అంశాల గురించే ఆలోచిస్తుంది. మన కన్నులాగే ఆ’లోచనం’ చేసేదే మనసు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే అంతరాళమే మనసు. ప్రతి మనిషి భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనసు, అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.

మనలో భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనసు. మనసు లేనిదే మనిషి లేడు. మన మనసే మనకు మార్గం చూపే దీపం. పుస్తకాల నుంచి మనం పొందేది విజ్ఞానం అయితే మన మనసుతో మనం జ్ఞానాన్ని పొందుతున్నాం. మన బుద్ధికి, మన మనసుకి నిరంతరం సంఘర్షణ జరుగుతుంటుంది. మనం ఇతరుల కష్టాల్ని అర్ధం చేసుకోవాలంటే వారు చెప్పేవి మనసుతో వినాలి. మనసు బాధ పడుతున్నప్పుడు ఇంకో తోడు కావాలి. మన మనసులోని భావాల్ని అర్ధం చేసుకునే మనసు కావాలి. మనసుపై అనేక పాటలు రాసి ఆత్రేయ ‘మనసుకవి’ అని పేరు తెచ్చుకున్నారు. ఈ మనసు ఒక భోషాణం లాంటిది.
మనలో ఉండి మనలను నడిపించే మనసే మన తొలిగురువు. మనసు, ఆలోచన, అంతరంగం, అంతరాత్మ… పేర్లు ఏవైనా ఇవన్నీ మనసుతో ముడిపడి ఉన్నవే. ఏ మనసు తన గురించి తాను ఆలోచించదు. తనకు సంబంధించని ఇతర అంశాల గురించే ఆలోచిస్తుంది. మన కన్నులాగే ఆ’లోచనం’ చేసేదే మనసు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే అంతరాళమే మనసు. ప్రతి మనిషి భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనసు, అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.
ఆలోచన అనగానే మన మనసు అనే జల్లెడ మంచిని, చెడును వేరు చేసే పరికరంలాగా పనిచేస్తుంది. ఆచరణలో మాత్రం మంచిని తీసుకుని చెడును వదిలివేస్తాం. ఒక్కోసారి చెడును కూడా మంచిగా భావించి మనసు మొండికేస్తూ మంచిని విస్మరిస్తుంది. ఆ సమయంలో ఎవరి సలహాను మనసు పరిగణనకు తీసుకోదు. అయితే ఈ ఆలోచన సాధారణంగా ఒక సమస్యకు సంబంధించినదై ఉంటుంది. ఆ సమస్య మనం తలపెట్టిన ఒక నూతన కార్యం కావచ్చు. లేక గతంలో చేసిన పనుల గురించి కావచ్చు.
ఈ ఆలోచన జీవితంలో జరిగే ఒడిదుడుకుల గురించి కానీ, కొన్ని కోరికల గురించి కానీ జరుగుతుంటోంది. ఈ ఆలోచనా ప్రక్రియ మనలోపల ఉన్న మనసులోనే జరుగుతుంది. మనకు కొన్ని సందర్భాలలో ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకదు. అప్పుడు బాగా అనుభవం ఉన్న, మనకు సన్నిహితులైన వారి సలహా మనకు నచ్చితే దానిని పాటిస్తాం. ఈ ప్రక్రియ సహజంగా మన చుట్టూ జరిగేదే.
ఇక మనకు తెలియని విషయాన్ని తెలియబరిచే వ్యక్తిని ‘గురువు’ అంటారు. కేవలం మనుషులే కాదు ఒక్కోసారి ఒక సంఘటన, పశువులు, పక్షులు, కొండలు, గుట్టలు కూడా మన సమస్యకు పరిష్కారాన్ని సూచించవచ్చు. బాగా పరిశీలిస్తే అందరి అనుభవంలో ఇలాంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ప్రకృతి కూడా మనకు గురువే. కొన్ని సందర్భాల్లో మన మనసు చెప్పింది వినకుండా ప్రలోభాలకు లోనవుతాం. చుట్టూ ఉన్న పరిస్థితులు మనసుని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. రాబోయే పార్లమెంటు ఎన్నికలే చూడండీ… ఐదేండ్లు మనల్ని పాలించే నాయకులను ఎన్నుకోవల్సినది మనమే కదా! మనల్ని పాలించే సరైన వ్యక్తి ఎవరో మనం మన మనసుతో ఆలోచించాలి. ప్రలోభాలకు గురైతే మరో ఐదేండ్లు తిప్పలు పడాల్సిందే. కనుక మన మనసును కూడా మన గురువుగానే పరిగణించాలి. మనసు కూడా ఓ లోచనమే అని గుర్తించాలి. ఏదేమైనా మనలోనే ఉండి మనను నడిపించే, మనసు చెప్పినట్లే సమస్యకు పరిష్కారాన్ని, ప్రశ్నకు జవాబును తెలుసుకుంటే మనం మనంగా బతకలగుతాం.

]]>
కాలం https://navatelangana.com/period/ Sat, 06 Apr 2024 18:12:41 +0000 https://navatelangana.com/?p=263919 Timeబాల్యం, యవ్వనం, వృద్దాప్యం ఈ మూడు కాలాలు మనిషిపై చాలా ప్రభావంతమైనవి. బాల్యంలో ఆటలు ఆడుకోవడం, క్రమశిక్షణతో చదువుకోవడం చాలా ప్రధానం. దీన్ని ఆరోగ్యవంతమైన బాల్యంగా చెబుతారు. ఆటల వలన శరీరం అలసి పోతుంది. దాంతో సమయానికి తింటారు. తిన్న తిండి శక్తిగా మారుతుంది. చదువుకోవడం వల్ల విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ఏదో ఒక విషయంపై పరిశోదనాత్మక చదువు సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తుంది. అలాగే ఉద్యోగిగా మారడానికి ఉపయోగపడుతుంది. అంటే బాల్యంలో ఆడే ఆటలు శరీర ఆరోగ్యానికి, చదివే చదువులు వృత్తికి సాయపడతాయి. ఎంత శ్రద్దపెట్టి చదివితే అంత గుర్తింపు.

వ్యక్తి జీవితంలో కాలం కన్నా విలువైనది ఉండదు. ఒక వ్యక్తి సమయ పాలన పాటించడాన్ని బట్టే అతని జీవితం ఆధారపడి ఉంటుంది. చేసే పనిని తగు సమయానికి పూర్తి చేయగలిగితే దానికి విలువ ఎక్కువ ఉంటుంది. లేదంటే ఆ పనికి ఏ మాత్రం విలువ ఉండదు. ఎంత ప్రతిభ ఉన్నా అవసరానికి ఉపయోగపడకపోతే ఆ ప్రతిభా పాటవాలు నిరర్ధకమే కదా! అంటే కాలంలో ఒక వ్యక్తి ప్రతిభ, మరొక వ్యక్తి అవసరం లేక ఒక వ్యవస్థాగత అవసరంపైన ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి లేదా వ్యవస్థ సమాజంలో అవసరాలు తీర్చడానికి సేవలు అందిస్తూ ఆ సేవలకు తగినంత రుసుమును వసూలు చేస్తుంటారు. అయితే ఆ సేవలు సమయానికి ఉపయోగపడితే సదరు వ్యవస్థపైన కానీ సదరు వ్యక్తి పైన కానీ సమాజంలో నమ్మకం ఏర్పడుతుంది. అలా సదభిప్రాయం ఏర్పడితే ఆ వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఆర్ధికంగా లాభాలు గడించిందుకు అవకాశం ఉంటుంది. అంటే ఆర్ధిక పురోగతిని కాలం శాసించగలదని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మరో ముఖ్యమైన విషయం గడువులోపులో పనిని పూర్తి చేయగలిగితే అవసరాలకు అంతరాయం కలగదు.
బాల్యం, యవ్వనం, వృద్దాప్యం ఈ మూడు కాలాలు మనిషిపై చాలా ప్రభావంతమైనవి. బాల్యంలో ఆటలు ఆడుకోవడం, క్రమశిక్షణతో చదువుకోవడం చాలా ప్రధానం. దీన్ని ఆరోగ్యవంతమైన బాల్యంగా చెబుతారు. ఆటల వలన శరీరం అలసి పోతుంది. దాంతో సమయానికి తింటారు. తిన్న తిండి శక్తిగా మారుతుంది. చదువుకోవడం వల్ల విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ఏదో ఒక విషయంపై పరిశోదనాత్మక చదువు సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తుంది. అలాగే ఉద్యోగిగా మారడానికి ఉపయోగపడుతుంది. అంటే బాల్యంలో ఆడే ఆటలు శరీర ఆరోగ్యానికి, చదివే చదువులు వృత్తికి సాయపడతాయి. ఎంత శ్రద్దపెట్టి చదివితే అంత గుర్తింపు.
కష్టపడి బాల్య కాలంలో చేసే సాధన యవ్వన కాలాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే యవ్వనంలో కష్టపడి చేసే పని వృద్దాప్యంపై ప్రభావం చూపుతుంది. ఇలా ఒక కాలంలో పడిన కష్ట ఫలితం మరొక కాలంలో కనబడుతుంది. అందుకే ఏ సమయానికి ఏం చేయాలో తెలిసి ఉండాలి. అందుకు శ్రమించాలి అంటారు పెద్దలు. కాలంలో కలిగే మార్పులు వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతాయి. అయితే అంతకు ముందు ఆ వ్యక్తి చేసిన సాధన ఫలితం కాలంలో కలిగే కష్ట నష్టాలను ఎదుర్కోవడంలో ఉపయోగపడుతుంది.
ఒక వ్యక్తి వ్యాయామంతో దృఢంగా తయారయితే, ఆ దృఢత్వం అంటువ్యాధులతో పోరాడగలిగే శక్తిని ఇస్తుంది. అలాగే ఒక వ్యక్తి బాగా కష్టపడి సంపాదిస్తే తర్వాత కాలంలో కలిగే ఆర్ధిక మార్పులను ఎదుర్కోవడంలో ఆ ధనం ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి తనతోటివారికి సాయపడుతూ ఉంటే తర్వాత కాలంలో ఎదురయ్యే కష్టాలలో తన తోటివారే తనకు అండగా నిలబడతారు. ఈ విధంగా కాలం వ్యక్తి జీవితంపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుంది. అందుకే కాలాన్ని బంగారంతో పోల్చారు. అందుకే కాలం చాలా విలువైనది. ఇది ఒక మాటగా ఉండవచ్చు. ఒక సేవగా ఉండవచ్చు. ఒక సాయంగా ఉండవచ్చు. డబ్బురూపంలో ఉండవచ్చు. ఎలాగైనా ఉండవచ్చు కానీ కాలం చాలా విలువైనది అనేది మాత్రం సత్యం. అందుకే అనవసరమైన పనులతో కాలాన్ని వృధా చేయకూడదు. ఎందుకంటే కరిగిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురావడం జరిగే పని కాదు.

]]>
బాల్యం నేర్పే పాఠం https://navatelangana.com/the-lesson-of-childhood/ Sat, 30 Mar 2024 17:34:08 +0000 https://navatelangana.com/?p=259131 కాలం మారే కొద్దీ అన్ని విషయాల్లో మార్పులు చోటుచేసుకుంటేనే ఉన్నాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో పురోగతిని పొందుతూనే ఉన్నాము. కానీ ప్రతి మనిషి జీవితంలో ఒక అరుదైన సమయమైన బాల్యం గురించి కొంత అశ్రద్ద పెడుతున్నాం అనేది వాస్తవం. చిన్నప్పుడు ఊళ్లో ఎంతో కల్మషం లేని ఆలోచనలతో జట్టు కట్టి స్నేహితులతో సరదాగా గడిపిన బాల్యం మనకు ఎన్నో నేర్పుతుంది. ఎలాంటి స్వార్థం లేకుండా అందరితో కలిసిపోయే కలివిడితనాన్ని నేర్పే నైజం బాల్యానిది. చిన్నతనంలో ఆడిన ప్రతి ఆట ఆలోచన సరళిని నేర్పేది. రేస్‌, చెడుగుడు అనే ఆటలు మనకు తెలియకుండానే శారీరక దారుఢ్యానికి సహయపడతాయి. కోతికొమ్మ, చిర్రగొనే, గోటీలు, చికుచికుపుల్లా, నేలా బండా ఇలా చెప్పుకుంటే పోతే ఒకటేంటి ఎన్నో రకాల ఆటలు మానసిక ఉల్లాసానికి అద్దం పట్టేవే. ఖోఖో వంటి ఒకటై ఆడిన ఆట తీరు ఐక్యతను, నాయకత్వ లక్షణాలను నేర్పేది. చిన్నతనంలో చేసిన ప్రతి పని, ఆడినా ప్రతి ఆట జీవితంలో ఒక మరుపు రాని మరువలేనిది గొప్ప అద్భుతమైన జ్ఞాపకం. కబడ్డీ లాంటి ఆటలు గెలువలనే ఆత్మవిశ్వాసాన్ని అలవాటు చేసేది. వేసవి కాలంలో చెరువు గట్టు వెంట ఒకటై కలిసి తాటి ముంజలు, ఈత కాయల వేటకు వెళ్ళి దొరికిన వాటిని సమానంగా పంచుకునే అలవాటును నేర్పేది. బావుల్లో, చెరువులో ఈతకు వెళ్లినప్పుడు వెంట ఉండి నేర్పి ముందుకు నడిపించిన నేస్తం బాల్యం.
జీవిత ప్రయాణంలో ఎన్నో నేర్చుకునే ప్రయత్నంలో ఎన్ని సార్లు విఫలం అయినా తిరిగి మళ్ళీ ప్రయత్నించే వ్యక్తిత్వం బాల్యం అప్పుడే అందించింది. నేటి ఆధునిక కాలంలో సమయపాలన లేని జీవిత చక్రంలో బాల్యం నాలుగు గోడల మధ్య బంధిగా మారింది. దిక్కుతోచని స్థితిలో బిక్కుమంటుంది. మోయలేని బరువుతో కూడిన పుస్తకాలతో భారంగా ముందుకెళ్తోంది. తోటి వారితో ఆత్మీయ నేస్తంగా కలిసి నడిచే స్నేహ మాధుర్యం తగ్గిపోతుంది. నేటి బాల్యం ఎంతసేపు ఆన్లైన్‌ గేమ్స్‌తో ఆగమవుతుంది. విజ్ఞానాన్ని పొందే క్రమంలో మనోల్లాసం కోల్పోయే పరిస్థితులు దాపరించాయి. పల్లెల్లో ఆడే ఆటలు నేడు కంటికి కనిపించనంత దూరంలో ఉండిపోయాయి. కనీసం వాటి పేర్లు కూడా కానరాకుండా ఉన్నాయి. ప్రతి ఒకరి జీవితంలో బాల్యంలో గడిపిన ప్రతిక్షణం ప్రభావం చూపుతుంది. నడక నేర్చిన ప్రయాణంలో అడుగుల తడబాటు కాలం నుండి సైకిల్‌ నేర్చుకోడానికి ప్రయత్నించిన తీరు నిశితంగా వెనుతిరిగి ఒక సారి ఆలోచిస్తే మన ఆత్మవిశ్వాసం ఎంతగొప్పదో తెలియ జేస్తుంది. అలాంటిది ఎన్నో గొప్ప గొప్ప చదువులు చదువుకుని లక్ష్యం చేరే గమనంలో ఒడిదొడుకులకు భయపడి కుంగిపోవడం దేనికి సంకేతమో ఆలోచించాలి. ఎవరైనా సరే జీవితంలో ఓడిపోయిన ప్రతిసారి బాల్యాన్ని గుర్తుచేసుకుంటే చాలు తిరిగి కొండంత ప్రేరణ పొందొచ్చు. బాల్యానికి అంతటి శక్తి ఉంది.
ఒకప్పటి బాల్యం జ్ఞానంతో కూడిన ఆటలను నేర్పేది. తెలియని గొప్ప ఆత్మ విశ్వాసాన్ని అలవాటు చేసేది. నేటి బాల్యం గంటల కొద్దీ ఆన్లైన్‌ గేమ్స్‌తో విలువైన కాలాన్ని దుర్వినియోగం చేసుకుంటూ విలువలను, స్నేహాన్ని, నేస్తం పాలిట జ్ఞాపకాలను దూరం చేసుకుంటుంది. చిన్న చిన్న విషయాలకే ఆవేశపడి అనర్థాలకు తెర లేపుతుంది. ఆలోచించే అలవాటును మరిచి పోయింది. మారుతున్న కాలంతో పాటు అన్ని విషయాల్లో అవగాహన పొందాలి దానికై శ్రమించాలి. కానీ వాటి కోసం జీవితంలో శాశ్వతంగా నిలిచిపోయే కొన్ని విలువలు నేర్పే జ్ఞాపకాలను పాతరేయకుడాదు. ఎంత సేపు మార్కులు, ర్యాంకులే కాదు మనిషి వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేసే ప్రయత్నాలు చేయాలి. దీనికై విద్యా వ్యవస్థ, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి.

]]>
నాటకం https://navatelangana.com/the-play/ Sat, 23 Mar 2024 17:08:02 +0000 https://navatelangana.com/?p=255203 నాటకంకళాకారులకు నాటకం ఎప్పుడయితే బువ్వ పెట్టలేకపోతుందో అప్పుడు కచ్చితంగా వారు బుల్లితెర వైపో, వెండితెర వైపో చూస్తారు. అందుకని వారిని తప్పు పట్టలేం. ఒకనాటి కన్యాశుల్కం, మాభూమి, రక్తకన్నీరులా ఎగబడి చూడదగ్గ నాటకాలు ఎన్ని వస్తున్నాయన్నది కూడా ప్రశ్న. ఇటీవలి సంవత్సరాల్లో ‘పడమటి గాలి’, ‘అంబేడ్కర్‌’, ‘వేమన’ వంటి నాటకాలు ఎక్కువగా ప్రదర్శితమయ్యాయి. ఒక ఉద్యమంలా చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. ఇలా నిరంతరాయంగా ఊరుఊరునా నాటకాలు ప్రదర్శితం కావాలి. ఇందుకోసం ఊళ్ళల్లో ప్రదర్శనకు అనువైన ధియేటర్లు ఉండాలి.
నాటకం అనేక కళల సమాహారం. సంగీతం, సాహిత్యం, నటన, వేషము, భాషణం అన్నీ కలిసి, వీక్షకుల మదిని కదిలింప చేసేది నాటకమే. సజనాత్మక జీవితానికి ఆలంబన నాటకం. సకల కళారూపాల వికాసానికీ, విస్తతికీ మూలం నాటకం. విభిన్నకళల్ని తనలో ఇముడ్చుకొని విరాట్‌రూపంతో దర్శనమిస్తున్న సినిమాకు సైతం మూలం నాటకమే. తెలుగునాట సినిమా నటీనటులుగా పేరొందిన తొలితరమంతా నాటకరంగ నేపథ్యం నుంచి వచ్చినవారే. సినిమా నాటకాన్ని మింగేసిందనే మాటలో వాస్తవం లేకపోలేదు . కానీ, నాటకరంగ మూలాల్ని మరిస్తే సినిమా బతకదు అన్న మాట కూడా వాస్తవమే. ఆ మూలాల్ని గుర్తించడం, కాపాడుకోవటం బాధ్యతగా భావించాలి. తెలుగు నేల మీద నాటకం ఆడుతోంది. కానీ జన జీవితాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనంగా నాటకం లేకపోవడం విచారకరం. ప్రజల సజనాత్మక జీవితంలో ఇది ఎందుకో అంతర్భాగం కాలేదు. కొందరి అభిరుచులకే పరిమితమైంది. దీనికీ సినిమా, టీవీ, ఇంటర్‌నెట్‌ వంటి సాధనాలే కారణమని చెప్పలేం. వీటిలాగా నాటకం ప్రజల సాంస్కతిక జీవితంలో భాగం కాలేకపోవడానికి గల కారణాల్ని మాత్రం తప్పక వెతకాల్సిన అవసరం ఉంది.
పరిషత్‌ల, ప్రభుత్వాల ప్రోత్సాహంతోనే నాటకం మనుగడ సాగించదు. ‘సురభి’లా నిత్యం నాటకాల్ని ప్రదర్శించే సంస్థలుండాలి. సినిమాకు బదులుగా నాటకం చూడటానికి వెళ్ళాలనే తపన జనాల్లో ప్రోది చేయాలి. ఇందుకోసం ప్రమాణాల ఉన్నతీకరణ అవసరం. నాటకం పఠనయోగ్యం కన్నా ప్రదర్శనా యోగ్యమైందన్న విషయం గుర్తించాలి. ఆధునిక సాంకేతిక ప్రజ్ఞను ఉపయోగించుకుంటూ నాటక శిల్పం, విలువలు మెరుగుపడాలి. ఈ దిశగా విమర్శ, ఆత్మవిమర్శ అవసరం. విశ్వవిద్యాలయాల్లో రంగస్థలశాఖలున్నాయి. కాని, అవి సినిమాలకు అవసరమైన వారిని తయారు చేసే సంస్థలుగా రూపాంతరం చెందడం విషాదం. రంగస్థలశాఖలు కేవలం అలంకారప్రాయంగా కాక ప్రజ్ఞాపాటవాలతో కూడిన వారిని తయారు చేస్తే మంచిది.
శాకుంతలంలోని శ్లోక చతుష్టయంలానే దేశంలోనూ ఓ దుష్ట చతుష్టయమూ నాటకమాడుతున్నది. వారు మాటలలో. హావభావాలలో నవరసాలను పలికించగల ద్రష్టలు. విద్వేషాలను రెచ్చగొట్టటం, ఆశ్రితులకు లాభాలు చేకూర్చటం, ఉద్వేగాల ఆధారంగా మనుషుల మధ్య చిచ్చురేపటం వీరి కళానైపుణ్యాలు. ఈ నాటకంలో సత్యం హత్య చేయబడుతుంది. వాస్తవం వక్రీకరించబడుతుంది. నాటకంలో మనుషుల సారం కాక, అధికారం విలయతాండవం చేస్తుంది. అందుకే ప్రజల ముందు నాటకాలేస్తున్న వారి నిజస్వరూపాన్ని తెలుసుకుని చైతన్యమయితేనే మన బ్రతుకు పాత్ర సజావుగా కొనసాగుతుంది.
కళాకారులకు నాటకం ఎప్పుడయితే బువ్వ పెట్టలేకపోతుందో అప్పుడు కచ్చితంగా వారు బుల్లితెర వైపో, వెండితెర వైపో చూస్తారు. అందుకని వారిని తప్పు పట్టలేం. ఒకనాటి కన్యాశుల్కం, మాభూమి, రక్తకన్నీరులా ఎగబడి చూడదగ్గ నాటకాలు ఎన్ని వస్తున్నాయన్నది కూడా ప్రశ్న. ఇటీవలి సంవత్సరాల్లో ‘పడమటి గాలి’, ‘అంబేడ్కర్‌’, ‘వేమన’ వంటి నాటకాలు ఎక్కువగా ప్రదర్శితమయ్యాయి. ఒక ఉద్యమంలా చేయడం వల్లనే ఇది సాధ్యమైంది. ఇలా నిరంతరాయంగా ఊరుఊరునా నాటకాలు ప్రదర్శితం కావాలి. ఇందుకోసం ఊళ్ళల్లో ప్రదర్శనకు అనువైన ధియేటర్లు ఉండాలి. దీనికి సామాజిక, సాంస్కతిక, సాహిత్య ఉద్యమాల తోడ్పాటు తప్పనిసరి. మరీ ముఖ్యంగా ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’ లాంటి సంస్థలు ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రలోనూ ఏర్పడాలి. ఇది సంకల్పం కావాలి. నాటకరంగం ఇవాళ ఉన్న స్థితిగతులపైన విస్తతచర్చ జరగాలి. సినిమా ఉంటుంది. సినిమాతోపాటు నాటకం కూడా బతకాలి. నిలవాలి. కొనసాగాలి. నాటకమే జీవితంగా, రక్తనాళ స్పందనగా భావించే తరాన్ని తయారు చేసే దిశగా నాటకరంగంలో అనుభవజ్ఞులయిన పెద్దలు, అధ్యాపకులూ ఆలోచించాలి. ఈ వైపుగా రంగస్థలం మీద ఆరోగ్యకరమైన చర్చకు దారితీసే సంభాషణలు ఇప్పటి అవసరం.

]]>
మాట https://navatelangana.com/word/ Sun, 17 Mar 2024 00:51:09 +0000 https://navatelangana.com/?p=250654 మాట భావ వ్యక్తీకరణకు మార్గం. మాటే మనిషి సంస్కారాన్ని తెలియజేస్తుంది. అందుకే ‘వాక్కు వ్యక్తిత్వానికి వాచక రూపం’ అంటారు పెద్దలు. కొంతమంది ఆలోచించి మాట్లాడితే, కొంతమంది మాట్లాడిన తరవాత ఆలోచిస్తారు. దాన్ని సరి చేసుకునేందుకు నానా పాట్లు పడతారు. కాలు జారితే తీసుకోవచ్చు. నోరు జారితే తీసుకోలేం. పెదవి దాటితే పృథ్వి దాటుతుందని నానుడి. అది అక్కడితో ఆగక చిలవలు పలవలై వ్యాప్తి చెందుతుంది. అందుకే ఎవరితో, ఎవరి గురించి, ఏది, ఎందుకు, ఎలా, ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు, అసలు మాట్లాడవలసిన అవసరం ఉందా అని ఆలోచించుకుని మాట్లాడాలంటాడు సోక్రటీస్‌. మాటల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మీయత, నమ్మకం ఉట్టిపడాలి. విషయం సూటిగా స్పష్టంగా ఉండాలి. లేకపోతే అపార్థాలకు దారి తీస్తుంది. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. మాటే చిక్కుల్లో పడేస్తుంది. అదే మాట చిక్కుల్లో నుంచి బయట పడేస్తుంది. చెప్పదలచుకున్న విషయాన్ని కఠినంగా కాకుండా మృదువుగా చెప్పాలి. వ్యవహారాల్లో అన్నదమ్ములైనా కచ్చితంగా నిర్మొహమాటంగా మాట్లాడాలి. మిత్రులు సమ వయస్కులతో వ్యాఖ్యలతో సరదాగా, భార్యతో చతురోక్తులతో, కవి మిత్రులతో రసస్ఫోరకంగా, పెద్దలతో వినయంగా సూటిగా పొదుపుగా, పిన్నలతో ఆదరంగా ప్రోత్సాహకరంగా, నూతన పరిచయస్తులతో మర్యాదగా మాట్లాడాలి. సొంతలాభం కోసం వుత్త మాటలు చెప్పకూడదు. ఉత్తర ప్రగల్బాలు పలక్కూడదు. ఉత్తమమైన మాట ఒక్కటి చెప్పినా ఫాయిదా వుంటుంది. చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా మాట్లాడేప్పుడు కచ్చితంగా ఉండాలి. ఆచితూచి మాట్లాడాలి. ముఖ్యంగా ఒక విషయంలో మాట ఇస్తున్నామంటే ఇచ్చిన మాటని నెరవేర్చే గుణాన్ని అలవరుచుకోవాలి. కాస్త అటుఇటయినంత మాత్రాన కొంపలు మునుగుతాయా అనే నిర్లక్ష్యం తగదు. కొన్ని విషయాల్లో చెప్పుకోదగిన నష్టాలు ఉండకపోవచ్చు. కానీ మాట మీద నిలబడే వారు కాదని ఎదుటివారు అంచనా వేసే వీలుంటుంది. మాటకు విలువ లేని చోట, మనోభావాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తుల దగ్గర మౌనమే ఉత్తమం. మాట్లాడే విషయం మీద అవగాహన లేనప్పుడు మౌనమే శ్రేయోమార్గం. నోటి దురుసుతనం, ఆధార రహిత అనాలోచిత నిందారోపణలు, అసూయాగ్రస్త అపవాదులు, వివేచన లేని వాగ్వివాదాలు సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తాయి. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో మాటలకు ఎంతో విలువ వుంది. ప్రభావితశక్తితో కూడిన మాటలు పెనుప్రకంపనలు సృష్టిస్తాయి. చిన్న మాట గొప్ప మార్పుకు దారితీయవచ్చు. కొన్నిసార్లు చిన్న మాటనే అశాంతినీ, కల్లోల్లాన్నీ ప్రేరేపించవచ్చు. అందుకని ఏమరుపాటున ఉండకూడదు. మరీ ముఖ్యంగా కొన్ని వందల, వేలమంది తమని గమనిస్తున్నారని తెలిసినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. మర్యాదల్ని అతిక్రమించకూడదు. మాటలు తూలకూడదు. మనం చెప్పాలనుకున్నది ఎదుటివారిని నొప్పించకుండానే సూటిగా, పదునుగా, కచ్చితంగా చెప్పడం మంచిది. మన మాటల్లో ఆవేశకావేశాల కన్నా నిజాయితీ, నిండైన విశ్వాసం కనిపించాలి. అప్పుడే మన మాటలకు సానుకూల స్పందన వస్తుంది. అంతే కానీ, మనకు నచ్చని మాటలు మాట్లాడితే వారిని మాటలతోనే మానసికంగా హింసించడం నేటి రాజకీయ అవసరంగా మారిపోయింది. మాట్లాడుతూ పోతుంటే మనకు తెలిసిందే పునరావతం అవుతుంది. వింటుంటే ఎన్నో కొత్త విషయాలు, ఇతరుల అభిప్రాయాలు తెలుస్తాయి. ఏ విషయాన్నీ పూర్తిగా వినకుండా నిర్ణయానికి రాకూడదు. అనుమానాలు ఉంటే సౌమ్యంగా నివృత్తి చేసుకోవాలి.

]]>
ఓటమి నుండి పాఠాలు https://navatelangana.com/lessons-from-defeat/ Sat, 09 Mar 2024 16:39:54 +0000 https://navatelangana.com/?p=245291 ఓటమి నుండి పాఠాలు‘ఏడు ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కానీ.. ఎనిమిదోసారి విజయం మనదేనన్న కసితో ముందుకెళ్లాలి’ అని. ఇప్పుడు మనందరం ఉపయోగించుకుంటున్న విద్యుత్‌ బల్బు తయారీ కోసం థామస్‌ అల్వా ఎడిసన్‌ పడిన తపన దీనికి ఓ చక్కని ఉదాహరణ. విద్యుత్‌ బల్బు నుంచి వెలుతురు చూసేందుకు థామస్‌ ఎడిసన్‌ దాదాపు 3,000 ప్రయత్నాల్లో విఫలమయ్యారు. అయినా ఆయన తన ప్రయత్నాలను ఆపలేదు. ఆఖరికి అనుకున్నది సాధించారు.
ఓటమి… ఇది లేకపోతే విజయం లేదు. విజయం విలువ తెలియాలంటే ఓటమి తప్పని సరి. నిజం చెప్పాలంటే పరాజయాలు మన జీవితంలో భాగం. వాటిని చూసి మనం భయపడాలా? అవి పలకరిస్తే కుంగిపోవాలా? ఈ ప్రశ్నలకు సమాధానం మనందరికీ తెలుసు. కానీ అంగీకరించడానికి చాలా ఇబ్బంది పడతాం. పసి ప్రాయంలో ఒక్క అడుగు వేయలేక కిందపడ్డ వాళ్లే.. నేడు ఎవరెస్టు శిఖరాన్ని తమ కాళ్లకింద చూసుకుని ఆనందిస్తున్నారు. కనుక పరాజయాలు ఉన్నది మనకు పాఠం నేర్పటానికే. ప్రస్తుతం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న వ్యక్తులు చాలామంది అలాంటి పాఠాలు నేర్చుకున్నవారే.
జే.కే. రౌలింగ్‌ రాసిన హ్యారీ పోటర్‌ నవల ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనసవం లేదు. కానీ.. హ్యారీ పోటర్‌ మొదటి నవల 12 సార్లు తిరస్కరణకు గురైంది. అయినా ఆమె ఏ మాత్రం కుంగిపోలేదు. పైగా ఆ తిరస్కరణలే రౌలింగ్‌కు పాఠం నేర్పాయి. అలాగే అమెరికన్‌ రచయిత స్టీఫెన్‌ కింగ్స్‌ రచించిన మోస్ట్‌ పాపులర్‌ నవల క్యారీ 30 సార్లు తిరస్కరణకు గురైంది. ఇలా వైఫల్యాలు విజయానికి మార్గం చూపుతాయి. శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు తమ అనుభవపూర్వకంగా చెప్పే మాట ఇది.
అందుకే పెద్దలు అంటారు ‘ఏడు ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కానీ.. ఎనిమిదోసారి విజయం మనదేనన్న కసితో ముందుకెళ్లాలి’ అని. ఇప్పుడు మనందరం ఉపయోగించుకుంటున్న విద్యుత్‌ బల్బు తయారీ కోసం థామస్‌ అల్వా ఎడిసన్‌ పడిన తపన దీనికి ఓ చక్కని ఉదాహరణ. విద్యుత్‌ బల్బు నుంచి వెలుతురు చూసేందుకు థామస్‌ ఎడిసన్‌ దాదాపు 3,000 ప్రయత్నాల్లో విఫలమయ్యారు. అయినా ఆయన తన ప్రయత్నాలను ఆపలేదు. ఆఖరికి అనుకున్నది సాధించారు.
వాల్ట్‌ డిస్నీ స్థాపించిన తొలి యానిమేషన్‌ సంస్థ న్యూమాన్‌ లాఫ్‌-ఓ-గ్రామ్‌. 1920లో ఆ సంస్థ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదురైంది. ఎంతగా అంటే కనీసం అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు తినేందుకు తిండి లేక కడుపు నింపుకునేందుకు బలవంతంగా కుక్క మాంసాన్ని తినేవాడట వాల్ట్‌ డిస్నీ. అలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న ఆయన 1966లో చనిపోయే నాటికి దాదాపు 32 వేల కోట్ల రూపాయలు సంపాదించారు.
ఇవన్నీ వ్యక్తిగత విజయాలు. అలాగే సమాజంలో సామూహిక విజయాల కోసం తపించే ఉద్యమకారులు సైతం ఎందరో ఉన్నారు. మహిళలు సమానత్వం కోసం, హింసలేని సమాజం కోసం ఏండ్లుగా పోరాడుతూనే ఉన్నారు. శ్రామికులు శ్రమకు తగ్గ వేతనం కోసం అడుగుతూనే ఉన్నారు. కానీ సాధించలేకపోతున్నారు. అయినా పట్టు సడలకూడదు. పోరాటం ఆపకూడదు. విజయం వచ్చే వరకు అలుపు లేకుండా పోరాడుతూనే ఉండాలి.
పైన చెప్పుకున్న ఉదాహరణల్లో తమ విజయం కోసం వ్యక్తులే కుంగి పోకుండా పోరాడుతున్న తరుణంలో సమూహాలు అలసిపోరాదు. ప్రజలు స్పందించడం లేదనో, పోరాటానికి కదలడం లేదనో వారిని నిందించరాదు. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రజలను చైతన్యం చేయడం కాస్త కష్టమే. కానీ పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తధ్యం. కనుక మరింత పదునైన నినాదాలతో అడుగులు ముందుకే వేయాలి. సమరయోధులు దేశానికి స్వాతంత్య్రం కోసం అలుపెరుగక రెండు వందల ఏండ్లు పోరాటం చేశారు. కనుకే ఇప్పుడు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం. కనుక పోరాటం కొన్నిసార్లు విఫలం కావొచ్చు. అయితే వైఫల్యం తర్వాత వచ్చే గెలుపు ఇచ్చే కిక్కే వేరు. ఆ కిక్కు కోసం.. మధ్య మధ్యలో పలకరించే పరాజయాల నుంచి వీలైనన్ని కొత్త విషయాలు, పాఠాలూ నేర్చుకుంటూ సాగిపోవాల్సిందే.

]]>
వినదగు నెవ్వరు చెప్పిన… https://navatelangana.com/listen-to-what-nevru-said/ Sat, 02 Mar 2024 19:09:44 +0000 https://navatelangana.com/?p=240314 మాటా మాటా పెరిగిపోయినప్పుడు మధ్యలో ‘చూడూ…’ అంటాం. అంటే దాని అర్థం చూడమని కాదు. బాగా వినమని. వినడమే కాదు, పాటించమని. మామూలుగా వినడానికి(హియరింగ్‌).. వినిపించుకోవడానికి(లిజనింగ్‌) మధ్య చాలా తేడా ఉంటుంది. వట్టినే ఆలకించడం మొదటిది. విని, జీర్ణించుకొని, వీలైనంతగా ఆచరణలో పెట్టడం రెండోది. ఆ మాటకొస్తే, అలా వినడం గొప్ప కళ. ఆ విద్య ఓ పట్టాన పట్టుబడదు. కేవలం చెవి ఒగ్గడం కాక మనసును సిద్ధపరచి విషయాన్ని గ్రహించాలి. మనసులో ఇంకించుకోవడాన్ని ఆకళించుకోవడం(ఆర్ట్‌ ఆఫ్‌ లిజనింగ్‌) అంటారు. ఇతరులు చెప్పేది వినడం నాయకత్వ లక్షణం. చాలామంది వింటున్నట్టు కన్పిస్తారు. కానీ వారి మనస్సు ఎక్కడో విహారిస్తూ వుంటుంది. ఇది తరగతి గదుల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా చాలామంది ఇలా కన్పిస్తూ వుంటారు. సగం విని సగం వినకపోవడం వల్ల మరీ ప్రమాదం. ఏకాగ్రతతో విన్న విషయాలు జ్ఞానాన్ని ఇస్తాయి. ఎదుటి వ్యక్తులు చెబుతున్న మాటలని వినడం వల్ల ఆ వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి అవకాశం వుంటుంది. కొంతమంది చాలా శ్రద్ధగా వింటారు. ఆ చెప్పిన విషయంలోని లోటుపాట్లని చెప్పగలుగుతారు. వినే పద్ధతి అలవర్చుకుంటే చాలా విషయాల్లో అవగాహన ఏర్పడుతుంది. వినడం వేరు. విన్నదాంట్లో మంచిని గ్రహించడం వేరు. అలా చక్కగా విని ఆకళించుకోవలసినవిషయాలెన్నో ఉంటాయి.
ఉరుములు, వాహనాల మోతలు, కేకలు, బాజాభజంత్రీలు, మైకుల్లో పాటలు.. ఇలా ఎన్నో మన ప్రమేయం లేకుండా, మనకు వినాలన్న శ్రద్ధ లేకపోయినా వినిపించే శబ్దాలు. ఇలాంటివి వినపడలేదని సందేహమొస్తే మాత్రం వినికిడి లోపమేమోనని సందేహించాలి. అయితే ఏం విన్నావో వివరించమని అడిగినపుడు పాఠమైనా, ప్రసంగపాఠమైనా నాకు సరిగా వినపడలేదు అని చెప్తే మాత్రం వినపడక కాదు వినిపించుకోలేదని సందేహించాల్సి వస్తుంది. వారికి వినాలన్న ఆసక్తికన్నా విషయంపై అనాసక్తతే విశదమవుతుంది. యథాలాపంగా వినడం కాక చెవులు రిక్కించి వినడంలోనే అవగాహన మెరుగుపడుతుంది. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అని పదే పదే మనం వింటున్న నేటి రోజుల్లో ఆకళింపు చేసుకోవాలనే తపనతో వినడం ఈ నైపుణ్యానికి తొలిమెట్టు. కుటుంబ సభ్యులతోనైనా, కళాశాలలోనైనా, ఉద్యోగంలోనైనా వినేటపుడు మెళకువలు పాటించకపోతే మీతో మాట్లాడుతున్న వ్యక్తులకు మీ పట్ల ఉదాసీసనత కలిగి వారి అనుభవాలు, అనుభూతులు మీతో పంచుకోడానికి ఇష్టపడరు. విలువలు, విజ్ఞానం, విశేషాలతో నిండినది జీవనవేదం. దీనిని సరియైన మానసిక పరిణతితో అర్థం చేసుకోవాలంటే వినడం కాదు వినిపించుకోవడం ముఖ్యం. విశ్వరూపాన్ని సూక్ష్మరూపంలో దర్శించే దార్శనికత పెంపొందాలంటే చిన్న చిన్న విషయాలనైనా శ్రద్ధగా వింటే ప్రోది చేసుకున్న విషయ వివరణంతా విజ్ఞానరాశిగా మారుతుంది. ఇతరుల మాటలకు అడ్డుపడకుండా, ఒకేసారి అందరు మాట్లాడకుండా ఉంటే వినాలనున్నవారి ఉత్సుకత పెంపొంది విషయం శ్రవణ మకరందమవుతుంది.
‘వినడాన్ని విస్మరించిన సమాజం మాట్లాడుతోంది… మాట్లాడుతోంది… వినడం మానేసి, తనదే పైమాట కావాలని ఆరాటపడుతూనే ఉంది. ఇలా అయితే సమాజం బాగుపడేదెలా?’ అని ప్రశ్నిస్తున్నారు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌. ప్రస్తుత సమాజంలో వినికిడి కళకు క్షీణదశ నడుస్తోంది. చెప్పేవారే తప్ప వినేవారు లేరిప్పుడు. చెప్పిన మాట వినకపోవడం- పసిపిల్లల పెంకితనం. దాంతో పెద్ద పేచీ లేదు. చెప్పినా మాట వినకపోవడం పెద్దల్లో దుర్గుణం. అది సమాజానికి చేటు. నిజమే! కేవలం చెవులతోనే కాదు, ఒక్కోసారి హదయంతోనూ వినవలసి ఉంటుంది. అప్పుడే మాటల్లో బయటపడని గుండె ఊసులను, వాటి మూగ బాసలను గ్రహించే వీలుంటుంది. వినికిడి కళ పరమార్థం నెరవేరుతుంది!

]]>
దర్జీ https://navatelangana.com/a-tailor/ Sat, 24 Feb 2024 16:40:34 +0000 https://navatelangana.com/?p=235093 దర్జీ
”మర్యాదల టేపు కొలతలతో
విలువల అంబరాన్ని కలిపికుట్టి
మనిషికి సిగ్గు కప్పే దర్జీ” అంటారు ప్రముఖ కవి రావి రంగారావు.
నిజమే కదా! మనకు టైలర్‌ అనగానే చెవిలో పెన్సిలు, చేతిలో కత్తెర, మనిషి దేహపు కొలతలను తీసుకోవడానికి టేపు, సైజుల వారీగా కొన్ని కుట్టిన బట్టలు.. పక్కన కుప్పలుగా ఉన్న దృశ్యం మన మనోయవనికపై ప్రత్యక్షమౌతుంది. కొంచెం పోష్‌గా, సిటీలలో షాపులలో గాజుతలుపుల మధ్య, అలమార్లలో- హ్యాంగర్లకు తగిలించిన గుడ్డలు గుర్తుకొస్తాయి. అనేక సినిమాల్లో స్త్రీల ఇంట్లో కుట్టు మిషనుపై టకటకా బట్టలు కుట్టేస్తూ, తమ పిల్లలను పెంచి, పెద్ద చేసిన ఉదంతాల ఇతివృత్తాలు ఎన్నో. వాస్తవ జీవితంలోనూ అవి వాస్తవాలే.
బట్టను కత్తిరించి, కలిపి కుట్టి ఓ రూపు తెచ్చేది దర్జీలు.. ఆ దుస్తులు మనిషికి దర్జాను తీసుకువస్తాయి. ఇలా ఓ మనిషికి బట్టలతో హుందాతనాన్ని తీసుకువచ్చేది దర్జీలే. ఒకప్పుడు టైలర్‌ అంటే.. టైగర్‌! ఆ వీధికి రారాజు అన్నట్టే! కుట్టు మిషన్‌ మీద కూర్చుని, పట్టుదలతో పని మొదలు పెడితే.. నేత వస్త్రం మీద ముగ్గేసినట్టే. దర్జీ దర్జాయే వేరు. ఊరి సర్పంచ్‌ వచ్చినా లేవడు. ఏంతటి వారైనా ఆయన ముందు విధేయంగా నిలబడాల్సిందే. చేయి ఎత్తమంటే ఎత్తాలి. దించమంటే దించాలి. పండుగలు, శుభకార్యాల సమయంలో వారికి చేతినిండా పని ఉండేది. తిందామన్నా తీరిక ఉండేది కాదు. కాల క్రమంలో రెడీమేడ్‌ దుస్తుల రాకతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. మార్కెట్‌లోకి వస్తున్న కొత్త కొత్త ఫ్యాషన్‌లకు అనుగుణంగా బట్టలు కుట్టే నేర్పు ఉన్నా.. రెడీమేడ్‌ దుస్తుల వల్ల వారికి ఆదరణ తగ్గుతూ వస్తోంది.
బ్రాండెడ్‌ దుస్తుల హవా మొదలైన తర్వాత అతని ఘనత మసకబారింది. తెగిపోయిన కుట్లు వేసివ్వడానికే పరిమితం అయ్యాడు. ఆల్టరేషన్‌కే అంకితమైపోతున్నాడు. బతుకుల్లో మాత్రం దర్జా మాయమవుతోంది. రెడీమేడ్‌ దుస్తుల రాకతో ఉపాధి కరువైంది. కుల వృత్తినే నమ్ముకున్నవారి పరిస్థితి దయనీయంగా మారింది. చాలామంది బతుకుదెరువు కోసం తెలంగాణ వాసులెందరో గల్ఫ్‌బాట పడుతున్నారు. కొందరు ఇతర పనులను వెతుక్కుంటున్నారు. దర్జీల బతుకుల్లో దర్జా లేదిప్పుడు… ఒక నాడు దర్జాగా బతికిన వాడు నేడు కార్పొరేట్లకు కూలీగా మారిపోయాడు.

కానీ, లగ్జరీ సెగ్మెంట్‌లో మాత్రం.. టైలర్‌ కుట్టు మిషన్‌ చక్రం తిప్పుతూనే ఉన్నాడు. షర్టు.. అక్షరాలా పదివేల రూపాయలు. ప్యాంటు.. పద్దెనిమిదివేలా ఐదొందలు, జాకెట్‌.. నలభై ఐదువేలు. సూటు.. డెబ్బై వేలకు తగ్గదు. ఇవన్నీ ధరలు కాదు. కుట్టు కూలీలు. ‘లగ్జరీ టైలర్స్‌’కు సమర్పించుకోవాల్సిన బిల్లులు. ఒకవైపు బ్రాండెడ్‌ రెడీ-టు-వేర్‌ సెగ్మెంట్‌ దూసుకుపోతున్నా.. లగ్జరీ టైలర్ల హవా కొనసాగుతూనే ఉంది. ఈ ‘లగ్జరీ టైలర్లు.. పాత రూల్స్‌కు పాతరేస్తారు. కొత్త డిజైన్స్‌కు జాతర చేస్తారు. డిజైనింగ్‌లో ఆడ, మగ అంతరంగం తగ్గిస్తారు. దుస్తుల్లో వ్యక్తిత్వం ప్రతిబింబించేలా చూస్తారు’ అంటారు నవతరం టైలరమ్మలు. పాతతరం టైలర్లు బ్రాండింగ్‌ను పట్టించుకోలేదు. ఈ తరం దర్జీ బాబులు ఆ విషయం మీద బాగా దష్టి పెడుతున్నారు. కస్టమర్లు కూడా ప్రయోగాలను ఇష్టపడుతున్నారు. అదే సమయంలో.. అలనాటి మహారాజులను, జమీందార్లను తలపించే సంప్రదాయ వస్త్రాలకూ ఆదరణ పెరుగుతున్నది. ఆ పాతకొత్తల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు మనవాళ్లు. సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తూ, కుట్టుపనికి ఆధునిక టెక్నాలజీని కూడా జోడించాల్సిన అవసరం వచ్చింది.
”రైతుతో పోటీ పడగలిగినవాడు/ ఈ ప్రపంచంలో టైలరొక్కడే/ రైతు రాయి వస్త్రాన్నిస్తే టైలరు దాన్ని శిల్ప సంస్కారంగా మారుస్తాడు…/ హైబ్రిడ్‌ కన్నా దేశీయ ఆహారం మేలు/ మిల్లు డ్రస్సుల కన్నా మిషను బట్టలు హాయి…” అని కవి అన్నట్టు చేనేతకు చేయూత ఇస్తున్నట్టు దర్జీలకు ఆదరణ పెరగాలి.

]]>
పుస్తకం https://navatelangana.com/the-book/ Sat, 17 Feb 2024 16:26:46 +0000 https://navatelangana.com/?p=230432 పుస్తకంపుస్తక పఠనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెదడు సరిగా శిక్షణ పొందేలా పుస్తక పఠనం సహాయపడుతుంది. మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఒంటరి తనాన్ని, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరచడంలో పుస్తకం కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి పుస్తక పఠనంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి. ఇటీవల చాలా వరకు గ్రంథాలయాలు శిథిలావస్థకు చేరినట్టు చూస్తున్నాం.
‘చిరిగిన చొక్కానైనా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు గురజాడ అప్పారావు. పుస్తకానికి అంతటి శక్తి ఉంది మరి. ఒక మంచి పుస్తకం వేయి మంది మిత్రులతో సమానం అన్నారు మరో మహానుభావులు. ఇలా పుస్తక గొప్పతనం గురించి ఎందరో మహానుభావులు తెలియజేశారు. పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు. అయితే హస్తభూషణమే కాదు మన మస్తిష్కంలో ఉత్పన్నమయ్యే ఆలోచనలను బయట పెట్టి అందరితో పంచుకునే మార్గం పుస్తకం. పుస్తకం మూడరక్షరాల పదమే. అయినా ఎంతో మంది కలలకు ఆధారం. సామాన్యుని ఆయుధం. అందమైన అక్షరాలు, పదాల పలకరింపుతో పాఠకుడిని తనలో లీనం చేసుకుంటుంది. ఒంటరితనంలో తోడుగా ఉండి స్నేహహస్తాన్ని అందిస్తుంది. పుస్తకం నోరులేని ఉపన్యాసకురాలు. అందుకే సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా పుస్తకానికి ఉన్న వన్నె తగ్గలేదు. ఇది ఎన్నటికీ తగ్గేది కాదు. కాబట్టే ప్రతి ఏటా పుస్తక ప్రదర్శనశాలలు పెద్ద ఎత్తున జరుగుతూనే ఉన్నాయి.
అయితే ఈ డిజిటల్‌ యుగంలో కొన్ని మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో పిల్లలు అన్నం తినమని మొండి కేస్తే చందమామను చూపించే వారు. లేదంటే అందమైన బొమ్మల పుస్తకాలు చూపించేవారు. కానీ నేటి తరం పిల్లలు ఏడ్చినా, విసిగించినా, అన్నం తినకుండా మారాం చేసినా చేతిలో స్మార్ట్‌ఫోన్‌ పెట్టేస్తున్నారు. దీని వల్ల పిల్లల ఎదుగుదలలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. చిన్నతనంలోనే ఎదుగుదల మందగించడం, కళ్లద్దాలు రావడం వంటివి జరుగుతున్నాయి. అలాగే అరచేతిలో ప్రపంచాన్ని చూపించే స్మార్ట్‌ఫోన్‌ ఉండడంతో పుస్తకాలు చదివే వారి సంఖ్య రాను రాను తగ్గిపోతున్నది. చిన్నప్పటి నుండే పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు ఇవ్వడంతో వారిలో పఠనాసక్తి తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తప్పులేదు కానీ దానికి బానిసలుగా మారడం మాత్రం తప్పే.
పుస్తకం లేని ఇల్లు ఆత్మలేని శరీరం వంటిది అన్నారు పెద్దలు. దీన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. పుస్తక పఠనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెదడు సరిగా శిక్షణ పొందేలా పుస్తక పఠనం సహాయపడుతుంది. మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఒంటరి తనాన్ని, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏకాగ్రతను మెరుగుపరచడంలో పుస్తకం కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి పుస్తక పఠనంపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలి. ఇటీవల చాలా వరకు గ్రంథాలయాలు శిథిలావస్థకు చేరినట్టు చూస్తున్నాం.
ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి కలిగేలా ప్రభుత్వాలు గ్రంథాలయాలను మెరుగుపరచాలి. వాటికి అవసరమైన నిథులు కేటాయించాలి. కొత్త కొత్త పుస్తకాలు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలి. ముఖ్యంగా పాఠశాల పిల్లలు ప్రతి వారం వాటిని సందర్శించేలా ఆదేశాలు జారీ చేయాలి. అలాగే పాఠశాలలు, కాలేజీల్లో కచ్చితంగా గ్రంథాలయం ఏర్పాటు చేయాలి. తరగతులతో పాటు రీడింగ్‌ అవర్‌ని కూడా వారి టైం టేబుల్లో తప్పక ఉండేలా చూడాలి. ఎన్ని డిజిటల్‌ పరికరాలు ఉన్నా అవి పుస్తకంతో సరితూగవని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. వారికి పుస్తకాల విలువ తెలిజేసేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించినప్పుడు వారికి స్ఫూర్తి నింపే పుస్తకాలు బహుమతులుగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెరుగుతుంది. a

]]>