Breaking News Archives - https://navatelangana.com/category/breaking-news/ Thu, 09 May 2024 02:11:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Breaking News Archives - https://navatelangana.com/category/breaking-news/ 32 32 ప్రియురాలితో గొడవ.. ఫోన్ మాట్లాడుతూ ఆత్మహత్య https://navatelangana.com/argument-with-girlfriend-committed-suicide-while-talking-on-the-phone/ Thu, 09 May 2024 02:11:13 +0000 https://navatelangana.com/?p=286803 నవతెలంగాణ – హైదరాబాద్: ప్రేమించిన యువతితో గొడవపడిన ఆమెతోనే ఫోన్‌ మాట్లాడుతూ బలవన్మరణానికి ఓ యువకుడు పాల్పడ్డాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్‌కు చెందిన ఇమ్రోజ్‌పటేల్‌(29) కొన్ని సంవత్సరాలుగా రాజేంద్రనగర్‌లోని పరమారెడ్డిహిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రయివేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఆయన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. కొన్నిరోజులుగా ఆ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ యువతి ఇమ్రోజ్‌ను దూరం పెట్టింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఇమ్రోజ్‌పటేల్‌ మంగళవారం రాత్రి తాను నివసించే ఫ్లాట్‌ నుంచి ఆ యువతికి ఫోన్‌ చేశాడు. కొద్దిసేపు మాట్లాడి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. వెంటనే ఆమె అక్కడికి దగ్గరలో ఉండే మరో స్నేహితుడికి ఫోన్లో విషయం చెప్పి ఇమ్రోజ్‌పటేల్‌ ఫ్లాట్‌కు వెళ్లాలని సూచించింది. ఆయన వెళ్లి చూడగా అప్పటికే ఇంట్లో దుప్పటితో ఉరివేసుకొని ఇమ్రోజ్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

]]>
పొట్టి ఫార్మాట్‌లో మంగోలియా జట్టు చెత్త రికార్డ్ https://navatelangana.com/mongolia-teams-worst-record-in-the-shortest-format/ Thu, 09 May 2024 02:00:51 +0000 https://navatelangana.com/?p=286800 నవతెలంగాణ – హైదరాబాద్: బౌలర్లకు కాలరాత్రులను మిగుల్చుతూ బ్యాటర్లు పండుగ చేసుకుంటున్న పొట్టి ఫార్మాట్‌లో మంగోలియా జట్టు మాత్రం చెత్త రికార్డును మూటగట్టుకుంది. గతేడాది ఆసియా క్రీడల సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆ జట్టు.. జపాన్‌తో ఆడిన రెండో టీ20 మ్యాచ్‌లో 8.2 ఓవర్లలో 12 పరుగులకే ఆలౌట్‌ అయింది. బుధవారం సానొ (జపాన్‌) వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన జపాన్‌.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన మంగోలియా.. 12 రన్స్‌కే కుప్పకూలి 205 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఆ జట్టులో ఆరుగురు బ్యాటర్లు ‘సున్నా’కే ఔటవ్వగా 4 పరుగులతో తుర్‌ సుమ్య టాప్‌ స్కోరర్‌. జపాన్‌ బౌలర్‌ కజుమొ 3.2 ఓవర్లు వేసి 7 పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ చరిత్రలో ఇది (12) రెండో అత్యల్ప స్కోరు. గతేడాది ఫిబ్రవరి ‘ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌’ను స్పెయిన్‌ 10 పరుగులకే ఆలౌట్‌ చేసింది.

]]>
నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ https://navatelangana.com/rahul-gandhi-for-telangana-today-2/ Thu, 09 May 2024 01:51:13 +0000 https://navatelangana.com/?p=286797 నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన వివరాలను తాజాగా పీసీసీ వెల్లడించింది. ఈ నలుగురు నాయకులు ఎప్పుడు ఎక్కడెక్కడ పాల్గొంటారో షెడ్యూల్‌ విడుదల చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ జన జాతర సభతో పాటు 6 గంటలకు ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో జనజాతర సభకు హాజరుకానున్నారు. ఈ నెల పదో తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడనున్నారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు నకిరేకల్‌లో జన జాతర సభకు హాజరవుతారు. పదో తేదీన ఉదయం 10 గంటలకు పఠాన్ చెరు కార్నర్ మీటింగ్‌లో సాయంత్రం 4 గంటలకు మక్తల్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. సాయంత్రం 6 గంటలకు షాద్ నగర్ కార్నర్ సమావేశంలో ప్రియాంక గాంధీలతో కలిసి సభలో సీఎం పాల్గొంటారని వెల్లడించాయి. ఈ నెల 11 న ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ, కామారెడ్డి, తాండూర్‌ సభల్లో పాల్గొంటారని పేర్కొంది.

]]>
PhonePe, Google Pay లావాదేవీలపై లిమిట్..! https://navatelangana.com/limit-on-phonepe-google-pay-transactions/ Thu, 09 May 2024 01:44:10 +0000 https://navatelangana.com/?p=286793

నవతెలంగాణ – హైదరాబాద్: డిజిటల్ చెల్లింపుల గురించి మనందిరికి తెలిసిందే.. స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరూ దాదాపు UPI  సేవల ద్వారా లావాదేవీలు చేస్తున్నారు UPI సేవలు..Google Pay, Phone Pe, PayTM, BHIM వంటి  వివిధ యాప్ ల ద్వారా ఆన్ లైన్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఎటువంటి లిమిట్ లేకుండా ఈ యాప్ ల ద్వారా లావాదేవీలు చేస్తు న్నా రు అయితే ఈ యాప్ ల ద్వారా నగదు బదిలీపై పరిమితులు విధించన్నట్టు తెలుస్తోంది. మన దేశంలోGoogle Pay, PhonePe, PayTM , BHIM వంటి  వివిధ యాప్ లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) సిస్టమ్ కు కనెక్ట్ చేయడం ద్వారా UPI సేవలు అందిస్తున్నారు. UPI డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), యాప్ ల వాల్యూమ్‌ను 30 శాతానికి పరిమితం చేయడానికి ప్రతి పాదిత డిసెంబర్ 31 గడువును అమలు చేయడం గురించి రిజర్వ్ బ్యాంక్‌తో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం వాల్యూమ్ క్యాప్ లేదు ..Google Pay,PhonePe మార్కెట్‌లో దాదాపు 80 శాతం వాటా కలిగి ఉన్నాయి. 2022లో ఈ యాప్ ల ద్వారా యూపీఐ చెల్లింపులను నియంత్రించేందుకు NPCI  30 శాతం మార్కెట్ క్యాప్ ను ప్రతిపాదించింది. ఈ యాప్ ల మార్కెట్ వాటాను పరి మితం చేయడానికి రెండేళ్ల గడువు ఇచ్చింది. అయితే మార్కెట్ క్యాప్ లు అమలు చేయడానికి గడువు 2023 డిసెంబర్ లో ముగిసినా..అది నెరవేరలేదు. ఈ విష యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్కెట్ క్యాప్ ను అమలు చేయడానికి సర్క్యూలర్ జారీ చేసే అవకాశం ఉంది.

]]>
చికెన్ షవర్మా తిని యువకుడు మృతి https://navatelangana.com/a-young-man-died-after-eating-chicken-shawarma/ Thu, 09 May 2024 01:38:06 +0000 https://navatelangana.com/?p=286790

నవతెలంగాణ – హైదరాబాద్: ముంబైలో దారుణం జరిగింది.  పాడైపోయిన చికెన్ తో తయారు చేసిన షవర్మా తిని 19 ఏండ్ల యువకుడు మృతి చెందాడు. ఇదే షవర్మా తిన్న మరో ఐదుగురు కూడా ఫుడ్ పాయిజన్ కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారు.  మే 3న ప్రతిమేశ్ భోక్సే అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఓ షాపులో షావర్మా తిన్నాడు. ఆ తర్వాత కడుపునొప్పితో వాంతులు చేసుకున్నాడు. మరుసటి రోజు వాంతులు ఆగకపోవడంతో అతని తల్లిదండ్రులు  చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.  అక్కడ చికిత్స  పొందతూ ప్రతిమేశ్  మృతి చెందాడు. ఈ ఘటనపై  ప్రతిమేశ్ భోక్సే కుటుంబ సభ్యులకు  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  షవర్మా షాపు నడుపుతున్న ఆనంద్ కాంబ్లే, మహ్మద్ అహ్మద్ రెజా షేక్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. షావర్మా శాంపిల్‌ను ల్యాబ్ కు  పంపారు.

]]>
భారీగా తగ్గిన బంగారం ధరలు.. https://navatelangana.com/gold-prices-have-fallen-drastically-7/ Thu, 09 May 2024 01:33:52 +0000 https://navatelangana.com/?p=286786 నవతెలంగాణ – హైదరాబాద్: బంగారం ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది..బంగారం ధరలు.. భారీగా తగ్గాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు…ఇవాళ కూడా కాస్త తగ్గాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 72, 260 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 66, 240 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 84, 900 గా నమోదు అయింది.

]]>
అస్ట్రేలియాలో ఎన్నారై హత్య.. ఇద్దరు భారతీయలు అరెస్టు! https://navatelangana.com/two-indians-arrested-for-nri-murder-in-australia/ Thu, 09 May 2024 01:30:58 +0000 https://navatelangana.com/?p=286782 నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్ట్రేలియాలో హర్యానా విద్యార్థి నవ్‌జీత్ సంధూ హత్య కేసులో ఇద్దరు భారత విద్యార్థులను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. విక్టోరియా పోలీస్ హోమిసైడ్ డిటెక్టివ్‌లు మంగళవారం పరారీలో ఉన్న నిందితులు అభిజిత్ (26), రాబిన్ గార్టాన్ (27)ను అదుపులోకి తీసుకున్నారు. బాధితుడు, నిందితులు హర్యానాలోని కర్నాల్‌ జిల్లాకు చెందిన వారని తెలిసింది. ఆదివారం మెల్బోర్న్‌లోని ఓర్మాండ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఈ హత్య జరిగింది. ఆ రాత్రి సంధూను నిందితులు ఛాతిలో పొడిచి చంపేశారు. ఇంటి రెంటు విషయంలో కొందరు విద్యార్థుల మధ్య గొడవ జరుగుతుండగా సంధూ మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే హత్య జరిగిందని మృతుడి బంధువు తెలిపాడు. కాగా, నిందితులిద్దరూ అన్నదమ్ములని తెలిసింది. ఇక మెల్బోర్న్‌లో ఎంటెక్ చదువుతున్న సంధూ 2022 నవంబర్‌లో ఆస్ట్రేలియా వెళ్లాడు. సంధూది సామాన్య రైతు కుటుంబం. తల్లిదండ్రులకు అతడొక్కడే కొడుకు. కుమారుడి మరణంతో కష్టాల్లోపడ్డ తల్లిదండ్రులను ఆదుకునేందుకు ఆన్‌లైన్‌లో గోఫండ్ మీ పేజ్ ద్వారా నిధుల సేకరణ ప్రారంభించారు. ‘‘నవ్‌జీత్ సింగ్ సంధూ తెలివైన విద్యార్థి. అతడు ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాడు. ఓ వివాదంలో మధ్యవర్తిత్వం నెరపే క్రమంలో దురదృష్టవశాత్తూ కన్నుమూశాడు. తన కుటుంబ భవిష్యత్తు కోసం అతడు స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వచ్చాడు. అతడి తల్లిదండ్రులకు సంధూ ఒక్కడే కొడుకు. అతడికి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు’’ అని సంధూ గోఫండ్‌మీ పేజ్‌లో పేర్కొన్నారు.

]]>
ఓపెనర్లే ఉతికారేశారు https://navatelangana.com/the-openers-washed-out/ Thu, 09 May 2024 00:10:24 +0000 https://navatelangana.com/?p=286503 The openers washed out– ఛేదనలో హెడ్‌, అభిషేక్‌ ఊచకోత
– 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ గెలుపు
– లక్నో 165/4, హైదరాబాద్‌ 167/0
ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ ఉప్పెన. తొలుత బంతితో భువనేశ్వర్‌ కుమార్‌ (2/12) విజృంభించగా.. ఛేదనలో బ్యాట్‌తో ఓపెనర్లు ట్రావిశ్‌ హెడ్‌ (89 నాటౌట్‌), అభిషేక్‌ శర్మ (69 నాటౌట్‌) ఊచకోత ఇన్నింగ్స్‌లతో చెలరేగారు. 166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 9,4 ఓవర్లలోనే ఊదేసింది. మరో 62 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 10 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. లక్నో సూపర్‌జెయింట్స్‌ తొలుత 165/4 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్‌ 9.4 ఓవర్లలోనే 167/0 పరుగులు చేసింది.
నవతెలంగాణ-హైదరాబాద్‌
ఐపీఎల్‌ 17వ సీజన్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓ అడుగు ముందుకేసింది. బుధవారం ఉప్పల్‌ స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్స్‌తో కీలక మ్యాచ్‌లో ఏకపక్ష విజయం సాధించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో టాప్‌-3లోకి చేరుకుంది. 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఉతికారేసిన హైదరాబాద్‌ కీలక నెట్‌రన్‌రేట్‌ను గణనీయంగా పెంచుకుంది. సన్‌రైజర్స్‌ ఓపెనర్లు ట్రావిశ్‌ హెడ్‌ (89 నాటౌట్‌, 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు), అభిషేక్‌ శర్మ (69 నాటౌట్‌, 27 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీలతో విశ్వరూపం చూపించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్‌ ఆయుశ్‌ బడోని (55 నాటౌట్‌, 30 బంతుల్లో 9 ఫోర్లు), నికోలస్‌ పూరన్‌ (48 నాటౌట్‌, 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించటంతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ సీమర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ (2/12) దెబ్బకు లక్నో సూపర్‌జెయింట్స్‌ 13 ఓవర్లలో 73/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకోగా.. చివరి ఏడు ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 92 పరుగులు సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఏడో విజయం కాగా.. లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఇది ఆరో పరాజయం.
ఓపెనర్లే ఊదేశారు : లక్ష్యం 166 పరుగులు. సన్‌రైజర్స్‌కు విజయంతో పాటు నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకోవటం అవసరం. విధ్వంసం, ఊచకోతకు సరికొత్త నిర్వచనం చెప్పిన సన్‌రైజర్స్‌ ఓపెనర్లు ట్రావిశ్‌ హెడ్‌ (89 నాటౌట్‌), అభిషేక్‌ శర్మ (75 నాటౌట్‌) ఆకాశమే హద్దుగా చెలరేగారు. తొలి రెండు ఓవర్లలో సాధారణంగా సాగిన ఇన్నింగ్స్‌.. మూడో ఓవర్‌ నుంచి మలుపు తిరిగింది. కృష్ణప్ప గౌతమ్‌ వేసిన ఓవర్లో ట్రావిశ్‌ హెడ్‌ విరుచుకుపడ్డాడు. మూడు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 22 పరుగులుపిండుకున్నాడు. ఆ తర్వాత రవి బిష్ణోరుకి అభిషేక్‌, హెడ్‌లు కలిసి పంచ్‌ ఇచ్చారు. రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 17 పరుగులు పిండుకున్నారు. ఇక నవీన్‌ ఉల్‌ హాక్‌కు ట్రావిశ్‌ హెడ్‌ చుక్కలు చూపించాడు. అతడు వేసిన ఓవర్లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో ఏకంగా 23 పరుగులు సాధించాడు. ట్రావిశ్‌ హెడ్‌ ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 16 బంతుల్లోనే అర్థసెంచరీ పూర్తి చేశాడు. ఇందులో బౌండరీలు మాత్రమే ఉండటం గమనార్హం. ఇక అభిషేక్‌ శర్మ సైతం ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 19 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. పవర్‌ప్లేలోనే 107 పరుగులు సాధించిన సన్‌రైజర్స్‌ ఏకపక్ష విజయం లాంఛనం చేసుకుంది. 9.4 ఓవర్లలో 167 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

]]>
అంతులేని విషం https://navatelangana.com/endless-poison/ Wed, 08 May 2024 22:40:12 +0000 https://navatelangana.com/?p=286753 Endless poison– హిందూత్వ శక్తుల గ్రూపులు, యూట్యూబర్ల కథనాలే మూలం
– ‘ఆ వర్గం’పై ప్రజల్లో ప్రతికూలత కలిగేలా తీవ్ర ప్రచారం
– ఇందుకు కవిత్వాలు, పాటలనూ వదలని కాషాయపార్టీ
– ప్రధాని మోడీ, బీజేపీ తీరుపై మేధావులు, సామాజిక కార్యకర్తల ఆగ్రహం
న్యూఢిల్లీ : గత కొన్నేండ్లుగా మోడీ పాలనలో ఒక వర్గానికి వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం సాగింది. ముఖ్యంగా, కరోనా కాలంలో ఆ వర్గం వారిని సూపర్‌ స్ప్రెడర్స్‌(కరోనా మహమ్మారి వ్యాప్తిని వేగంగా వ్యాప్తి చెందించేవారు)గా కొన్ని హిందూత్వ శక్తులు తీవ్ర ప్రచారం చేశాయి.
బీజేపీ అనుకూల మీడియా, యూట్యూబ్‌ ఛానెళ్లు సైతం ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాయి. ఆ మతానికి వ్యతిరేకంగా కొన్ని కథనాలను తయారు చేసి సమాజంలోకి వదిలి ప్రజల మెదళ్లలో విషబీజాలు నాటే ప్రయత్నాలను చేశాయి. ముఖ్యంగా, ఇందుకు హిందూత్వ శక్తుల మత సమావేశాలు, వాట్సప్‌ సందేశాలు, యూట్యూబ్‌ ఛానెళ్లు, ‘హిందూత్వ’, హిందూ జాతీయవాదాన్ని ప్రచారం చేసే విధంగా పాటలు, కవిత్వాలను రూపొందించే గాయకులు, వ్యక్తులు మూల వనరులుగా ఉన్నారు.
ఇక లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మాత్రం కొన్ని వారాలుగా ఆ వర్గం మైనారిటీలపై బీజేపీ విషం చిమ్ముతున్నది. ముఖ్యంగా, ప్రధాని హౌదాలో ఉన్న మోడీనే ఇందుకు కేంద్ర బిందువయ్యారు. బీజేపీ, ప్రధాని చేసే ప్రచారాల తీరును మేధావులు, సామాజికవేత్తలు తప్పుబడుతున్నారు. ముఖ్యంగా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఆ వర్గానికి చెందిన వ్యక్తులకు మద్దతుగా ఉంటుందనీ, హిందువులు మాత్రం తమ పండుగలను స్వేచ్ఛగా జరుపుకోవటానికి అవకాశాలుండవనీ, ఆ వర్గం వారు ఆదివాసీ, గిరిజనుల భూములను ఆక్రమిస్తారని హిందూత్వ గ్రూపులు పలు సమావేశాలు, సోషల్‌ మీడియా ఖాతాల్లో ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఈ హిందూత్వ గ్రూపుల ప్రచారానికి బలం కల్పించేది ప్రధాని హౌదాలో మోడీ చేస్తున్న విషపూరిత ప్రసంగాలేనని మేధావులు, సామాజిక కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
‘ల్యాండ్‌ జిహాద్‌’ అంటూ ఆరోపణలు
ఆ వర్గం మైనారిటీలు చేసే ఏ పనినైనా సంఘవిద్రోహ కోణంలోనే చూసే ధోరణిని అలవాటు చేసుకున్న హిందూత్వ శక్తులు.. వాటినే ప్రజల్లోకి తీసుకెళ్లి తప్పుదారి పట్టిస్తున్నాయి. మహారాష్ట్రలో భూములను ఆక్రమించుకోవటానికి ఆ వర్గం వారు కుట్ర పన్నుతున్నారని ఏడాది నుంచి హిందూత్వ శక్తులు నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. దీనిని ‘ల్యాండ్‌ జిహాద్‌’గా అభివర్ణించాయి. తమిళనాడు, కేరళ, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణ వంటి బీజేపీయేతర రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఆ మైనారిటీ వర్గానికి అవసరమైన భూమిని, నిధులను కేటాయించినా.. బీజేపీ శ్రేణులు, హిందూత్వ శక్తులు ఆ చర్యలను తీవ్రంగా తప్పుబడుతూ విపరీత ప్రచారాలు చేస్తున్నాయి.
ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం కోసం ఏ రాష్ట్రానికి వెళ్లినా.. ఆ మైనారిటీ వర్గాన్ని మాత్రం టార్గెట్‌ చేయకుండా ఉండలేకపోతున్నారు. జార్ఖండ్‌ పర్యటనలోనూ.. జేఎంఎం-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎలాంటి తనిఖీలు లేకపోవటంతో ”చొరబాటుదారులు” వస్తున్నారనీ, ఓటు బ్యాంకు కోసం ఈ పార్టీలు ఏమైనా చేస్తాయని మోడీ ఆరోపణలు గుప్పించారు. ఈ చొరబాటుదారులు ఆదివాసీల భూములను లాక్కొంటారనీ, జార్ఖండ్‌లోని సంతల్‌ పరజ్ఞ వంటి ప్రాంతాల్లో మహిళలకు భద్రత లేదని ప్రధాని చెప్పటం గమనార్హం.
ఆదివాసీ మహిళలను ఒక వర్గం పురుషులు వివాహం చేసుకొని, వారి భూములను ఆక్రమిస్తున్నారనే పరోక్ష ఆరోపణలను ఆయన చేశారు. అయితే, ఇందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలూ లేకుండానే ప్రధాని హౌదాలో మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. హిందూత్వ శక్తులు, గ్రూపుల కుట్ర కథనాలనే మోడీ తన బాధ్యతను విస్మరించి వినిపిస్తున్నారని మేధావులు, సామాజిక, మైనారిటీ హక్కుల కార్యకర్తలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
పాటలు, కవిత్వాలను కూడా ఆ వర్గంపై విషం చిమ్మటానికి ఉపయోగిస్తున్నాయి హిందూత్వ శక్తులు, బీజేపీ శ్రేణులు. రోహతక్‌కు చెందిన ఒక గాయకురాలు కవి సింగ్‌.. ఆర్టికల్‌ 370 రద్దుపై మోడీని పొగుడుతూ.. ఒక వర్గం ప్రజలను మాత్రం దేశద్రోహులు, చొరబాటుదారులుగా, ఎక్కువ మంది పిల్లలను కనేవారిగా వర్ణిస్తూ పాటను రూపొందించటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నదని మేధావులు చెప్తున్నారు.

]]>
హర్యానాలో రాజకీయ సంక్షోభం https://navatelangana.com/political-crisis-in-haryana/ Wed, 08 May 2024 22:35:43 +0000 https://navatelangana.com/?p=286750 Political crisis in Haryana– మెజారిటీ కోల్పోయిన బీజేపీ సర్కార్‌
– ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలు జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌
– కుర్చీ వదలబోనన్న సీఎం సైనీ
చండీఘర్‌ : హర్యానాలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ శిబిరంలో చేరడంతో హర్యానా రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం 88 మంది సభ్యులున్న రాష్ట్ర శాసనసభలో బీజేపీకి 43 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. ప్రభుత్వం మైనారిటీలో పడినందున వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉదరు భాన్‌ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కు లేదని అన్నారు. ఇదిలావుండగా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన ముగ్గురు స్వతంత్రులు రోతక్‌లో ప్రతిపక్ష నేత భూపేందర్‌ సింగ్‌ హూడాతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న విషయాన్ని రాష్ట్ర గవర్నరుకు తెలియజేశామని వారు చెప్పారు.
బీజేపీకి మద్దతు ఇస్తున్న 43 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు స్వతంత్రులు కూడా ఉన్నారు. అవసరమైతే ప్రభుత్వానికి వ్యూహాత్మక మద్దతు ఇస్తామని నలుగురు సభ్యులున్న జన్‌నాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) చెబుతోందని బీజేపీ అంటోంది. అయితే తాము ప్రతిపక్ష నేత భూపేందర్‌ సింగ్‌ హూడాకే మద్దతు ఇస్తామని జేజేపీ నేత దుష్యంత్‌ చౌతాలా తేల్చి చెప్పడంతో బీజేపీ ఆశలు అడియాసలయ్యాయి. జేజేపీ మార్చిలోనే బీజేపీ ప్రభుత్వం నుండి బయటికి వచ్చింది. నాయబ్‌ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్‌ ముందుకు వచ్చిన పక్షంలో తాము మద్దతు ఇస్తామని జేజేపీ స్పష్టం చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్‌ మాత్రమేనని దుష్యంత్‌ చౌతాలా చెప్పారు. రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్ధ్యం నాయబ్‌కు లేదని అన్నారు. తాను బలహీనుడినని ఆయన అంగీకరించారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని జేపీపీతో పాటు అభరు సింగ్‌ చౌతాలా నేతృత్వంలోని ఐఎన్‌ఎల్‌డీ, స్వతంత్ర ఎమ్మెల్యే బల్‌రాజ్‌ కుందు కూడా గవర్నర్‌కు లేఖలు రాయాలని ఉదరు భాన్‌ సూచించారు. ఇదిలావుండగా బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు స్వతంత్ర ఎమ్మెల్యేలు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్పీకర్‌ జ్ఞాన్‌ చంద్‌ గుప్తా తెలిపారు. ప్రతిపక్షాల డిమాండ్‌పై నిర్ణయం తీసుకోలేమని చెప్పారు. ఇప్పటికి కూడా బీజేపీకి 40, కాంగ్రెస్‌కు 30, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఆరుగురు స్వతంత్ర సభ్యులు ఉన్నారని వివరించారు. హెచ్‌ఎల్‌పీ, ఐఎన్‌ఎల్‌డీ పార్టీల నుండి ఒక్కొక్క సభ్యుడు ఉన్నారని అన్నారు. మరోవైపు తన ప్రభుత్వం కొనసాగుతుందని, ఎలాంటి సమస్యలు లేవని ముఖ్యమంత్రి నాయబ్‌ సైనీ ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా తమకు 47 మంది సభ్యుల మద్దతు ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ మీడియా కార్యదర్శి ప్రవీణ్‌ ఆగ్రే చెప్పుకొచ్చారు. అయితే శాసనసభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఇప్పట్లో లేదు. ఎందుకంటే ఫిబ్రవరి 23న సైనీ ప్రభుత్వంపై భూపేందర్‌ సింగ్‌ హూడా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తాజాగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే ఆరు నెలల వ్యవధి అవసరం. అయితే ఇది బలపరీక్షకు సంబంధించిన అంశం కాదని, నైతికతకు సంబంధించినదని హూడా చెప్పారు.

]]>
ఓటింగ్‌కు దూరం పెండింగ్‌ సమస్యలే కారణం https://navatelangana.com/distance-to-voting-is-due-to-pending-issues/ Wed, 08 May 2024 22:25:48 +0000 https://navatelangana.com/?p=286743 ఓటింగ్‌కు దూరం పెండింగ్‌ సమస్యలే కారణం– గుజరాత్‌లో ఎన్నికలు బహిష్కరించిన మూడు గ్రామాల ప్రజలు
– డిమాండ్లు నెరవేర్చకపోవటంతో
– మరి కొన్ని గ్రామాల్లో పాక్షికంగా బహిష్కరణ
అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని మూడు గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది ఓటర్లు లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ను బహిష్కరించారు. అనేక ఇతర గ్రామాల వారు ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోవటంతో ఎన్నికల ప్రక్రియకు పాక్షికంగా దూరంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం మేరకు బరూచ్‌ జిల్లాలోని కేసర్‌ గ్రామం, సూరత్‌ జిల్లాలోని సనాధార, బనస్కాంత జిల్లాలోని భఖారీ ఓటర్లు ఓటింగ్‌ను పూర్తిగా బహిష్కరించగా.. జునాగఢ్‌ జిల్లాలోని భట్గాం గ్రామం, బోడోలి, మహిసాగర్‌ జిల్లాలోని కుంజర గ్రామాలు దీనిని పాక్షికంగా బహిష్కరించాయి. సనాధార గ్రామం బార్డోలి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ 320 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం.. స్థానిక పోల్‌ అడ్మినిస్ట్రేషన్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిని ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ.. 320 మంది ఓటర్లలో ఎవరూ ఓటు వేయకపోవటం గమనార్హం.
పటాన్‌ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బఖ్రీ గ్రామంలోని దాదాపు 300 మంది ఓటర్లు.. తమ గ్రామ పంచాయతీ విభజనకు నిరసనగా సమిష్టిగా ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించు కున్నారు. ఎంతగా ఒప్పించే ప్రయత్నాలు చేసినా.. వారు తమ ఓటు హక్కును వినియోగించుకోకూడదనే నిర్ణయానికే బలంగా కట్టుబడి ఉన్నారు. తెల్లవారుజాము నుంచే పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసి పోలింగ్‌ అధికారులు వేచి చూసినా గ్రామస్తులు ఓటింగ్‌కు రాలేదు. తమ గ్రామ పంచాయతీ విభజనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి భరత్‌సింగ్‌ దాభి కూడా గ్రామానికి చేరుకుని ఎన్నికల ప్రక్రియలో భాగం కావాలని అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
భరూచ్‌ జిల్లాలోని కేసర్‌ గ్రామంలో దాదాపు 350 మంది ఓటర్లు కూడా తమ ఓటు వేయకూడదనే నిర్ణయంపై ఐక్యంగా ఉన్నారు. ఏ ఒక్కరూ ఓటు వేయకుండా పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. ప్రజలు తమ ఓట్లను బహిష్కరించడం ఇదేం తొలిసారి కాదు. నదిపై వంతెన నిర్మించాలని పలుమార్లు డిమాండ్‌ చేసినా ప్రభుత్వం నెరవేర్చకపోవటంతో గతంలో కూడా ఇలాగే చేశామని స్థానికులు తెలిపారు. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు గాను 25 స్థానాలకు మంగళవారం ఒకే దశలో పోలింగ్‌ జరిగింది. సూరత్‌ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకున్న విషయం తెలిసిందే.

]]>
మోడీ పాలనలో బ్రిటీష్‌ రాజ్‌ లాంటి పరిస్థితులు https://navatelangana.com/conditions-like-british-raj-under-modi-regime/ Wed, 08 May 2024 22:23:45 +0000 https://navatelangana.com/?p=286729 మోడీ పాలనలో బ్రిటీష్‌ రాజ్‌ లాంటి పరిస్థితులు– ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే సంస్థలన్నీ నిర్వీర్యం : ప్రియాంక గాంధీ
లక్నో : ప్రధాని మోడీ హయాంలో దేశంలో బ్రిటిష్‌ రాజ్‌ తరహా పరిస్థితులు నెలకొంటున్నాయనీ, ప్రభుత్వ విధానాలతో కోటీశ్వరులకే మేలు జరుగుతున్నదని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ విధానాలు పేదలను దృష్టిలో ఉంచుకుని రూపొందించటం లేదనీ, కోటీశ్వరులకు మేలు చేసేలా తయారైందని చెప్పారు. నేడు భారత్‌లో అసమానత పరిస్థితి దారుణంగా ఉన్నదని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయని ఆమె గుర్తు చేశారు. తన సోదరుడు, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ పోటీ చేస్తున్న యూపీలోని రారుబరేలీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ కార్యకర్తలను ఉద్దేశించి ”ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే అన్ని సంస్థలు.. మీడియా, పార్లమెంటు వంటివి నిర్వీర్యమవుతున్నాయి. మహాత్మాగాంధీ, పండిట్‌ నెహ్రూ ప్రజల హక్కులను బలోపేతం చేసేందుకు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ప్రజల హక్కులను హరించే స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పడే రోజు వస్తుందని వారికి తెలియదు” అని ఆమె కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోట్లాది ప్రజల జీవితాలను మార్చే రిజర్వేషన్‌ లాంటి వ్యవస్థను కల్పించే రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. భాష, ప్రవర్తన, చర్యలు నాసిరకంగా ఉన్న వ్యక్తి నేడు ప్రధాని కుర్చీపై కూర్చోవటం దేశ దౌర్భాగ్యమని ఆమె అన్నారు. ”మేము ఎల్లప్పుడూ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తాం. అభివృద్ధి చెందిన, సంపన్నమైన రారుబరేలీ గురించి కలలు కన్నాం. మాకు అవకాశం వచ్చినప్పుడు, మేము రారుబరేలీలో ఉపాధి, అభివృద్ధి అవకాశాలను సృష్టించాం. కానీ మోడీ ప్రభుత్వం మేము ప్రారంభించిన అనేక ప్రాజెక్టులను మూసివేసింది” అని ప్రియాంక గాంధీ అన్నారు.
రారుబరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ఈనెల 20న పోలింగ్‌ జరగనున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఇక్కడ నుంచి 5,34,918 ఓట్లతో గెలుపొందారు. ఆమె సమీప ప్రత్యర్థి దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌ 3,67,740 ఓట్లను సాధించి బలమైన పోటీనిచ్చారు. రాహుల్‌ గాంధీ 2004 నుంచి 2019 వరకు లోక్‌సభలో పొరుగున ఉన్న అమేథీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019లో ఆయన బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిని చవి చూశారు.

]]>