Childhood Archives - https://navatelangana.com/category/childhood/ Sat, 04 May 2024 17:34:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Childhood Archives - https://navatelangana.com/category/childhood/ 32 32 చెట్టు సాక్ష్యం https://navatelangana.com/tree-evidence/ Sat, 04 May 2024 17:34:21 +0000 https://navatelangana.com/?p=283607 చెట్టు సాక్ష్యంఐదవ తరగతి చదువుతున్న వినరు స్కూల్‌ నుండి రాగానే బ్యాగ్‌ని బాల్కనీలో పడేసి బాధగా ఇంట్లోకి వచ్చేడు.
”ఏమైంది వినరు అలా వున్నావు?” అని అమ్మ తలని తడుముతూ అడిగింది.
”మా కొత్త తెలుగు సార్‌ ఒక్కొక్కరిని లేపి ఒక కథ చెప్పమన్నారు. అందరూ చెప్పారు. నేను చెప్పలేక పోయాను సిగ్గేసింది” అని బదులిచ్చాడు.
”అయ్యో ఇంతేనా.. ఇంకేమోనని కంగారు పడ్డాను. ఐరాల నుండి మీ తాత వచ్చారు. రాత్రికి కథ చెపుతారు గానీ ఫ్రెష్షై రా. స్నాక్స్‌ తిని హోమ్‌ వర్క్‌ కంప్లీట్‌ చేద్దువు” అంటూ కిచెన్లోకి వెళ్ళింది.
వినరుకి ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందానని ఆతురతో త్వరత్వరగా పనులు పూర్తి చేసుకున్నాడు.
రాత్రి భోజనాలు అయ్యాక తాత, మనవడు మిద్దె మీద పడక వేసుకున్నారు. తాత పడక మీద నడుం వాల్చాడు. వినరు తాత పొట్ట మీద కూర్చోని కథ చెప్పమన్నాడు. ఉండరా చెపుతానని వక్కపలుకు నోట్లో వేసుకొని నములుతూ మనవడిని పొట్టమీద నుండి లేపి, మోకాళ్ళు మడిచి కాళ్ళపై వేసుకుని ఊయలలూపుతూ కథ చెప్పడం మొదలెట్టాడు.
రామాపురంలోని రామయ్య, సోమయ్య ఇద్దరూ మంచి మిత్రులు. వానలు కురవక కరువొచ్చి ఊరంతా ఆకలితో మాడి పోతున్నది. ఇద్దరు మిత్రులు చంద్రగిరికి పనుల కోసం వలసి పోయారు. చంద్రగిరిలో ఇల్లు కట్టేదానికి పునాదులు తవ్వే పని దొరికింది. పగలు పని చూసుకొని రాత్రిపూట చంద్రగిరికోటలో పడుకొనేవారు. ఇక మూడురోజులు పని చేస్తే వారం కూలీ ఇస్తారు. ఆదివారం పనికి సెలవు కాబట్టి ఐరాల కెళ్ళి దుడ్లు ఇచ్చి రావాలనుకున్నారు. ఐదోరోజు పునాదులు తవ్వుతుంటే లంకెబిందె దొరికింది. బిందె నిండా బంగారు ఆభరణాలు. ఎవ్వరూ చూడలేదు కాబట్టి రహస్యంగా ఓ పొదలో దాచిపెట్టారు. వారం రోజుల కూలీ దుడ్లు తీసుకొని పాతగోనె సంచిలో లంకెబిందెను దాచుకొని, చంద్రగిరిలో రైలెక్కి పాకాలలో దిగి ఐరాలకు నడవడం మొదలెట్టారు. దామలచెరువు కాడికొచ్చాక మర్రిచెట్టు నీడలో అలుపు తీర్చుకోవడానికి ఆగారు. రామయ్య అలసటతో నిద్రపోయాడు. సోమయ్యకు కుట్రబుద్ధితో నిద్రపట్ట లేదు. రామయ్య అడ్డుతొలిగించుకుంటే లంకెబిందె తన సొంతం అవుతుందని, రామయ్య గుండెలమీద బండ వేశాడు.
రామయ్య నెత్తురు కక్కుకుంటూ ”మిత్రద్రోహీ ఈ చెట్టే సాక్ష్యం నీవు ఇంతకింతకూ శిక్ష అనుభవించే తీరుతావని” అంటూ చనిపోయాడు. సోమయ్య గబగబా రామయ్య శవాన్ని పారే ఏటిలో పారేశాడు. చూస్తుండగానే రామయ్య శవం కొట్టుకు పోయింది. సోమయ్య రామాపురం వెళ్ళి ఆనందంగా బతుకుతున్నాడు.
సంవత్సరం తరువాత సోమయ్య తన పెళ్ళాంతో ఊరెళుతూ మర్రిచెట్టు దగ్గర ఆగి పకపకా నవ్వాడు. ఎందుకయ్యా నవ్వుతున్నావని అడిగిన భార్యకు రామయ్య కథ చెప్పి ”ఏదీ నోరు లేని చెట్టు సాక్ష్యం చెప్పిందా” అని పడిపడీ నవ్వాడు. సోమయ్య పెళ్ళాం పక్కింటి సీతమ్మతో ఎవ్వరికీ చెప్పొద్దు అంటూ రామయ్యకథ చెప్పేసింది. ఆనోటా ఈనోటా పడి అందరికీ తెలిసిపోయి సోమయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ”సత్యాన్ని ఎంతలోతు గోతి తీసి పాతి పెట్టినా ఏదో ఒకనాటికి బయట పడుతుంది” అని తాత కథ ముగించాడు. వినరు ఆనందంతో తాతను కౌగిలించుకుని నిద్రలోకి జారుకున్నాడు.
– సురేంద్ర రొడ్డ , 9491523570

]]>
మూగ ప్రాణులు https://navatelangana.com/dumb-creatures-2/ Sat, 20 Apr 2024 16:10:19 +0000 https://navatelangana.com/?p=273674 నరసింహపురంలోని రామయ్య తన రెండు ఎద్దులను, నాగలిని తీసుకొని పొలాన్ని దున్నడానికి బయలుదేరాడు. దారిలో ఒక ఎద్దు ఆకస్మికంగా కుప్పకూలిపోయింది. రామయ్య దాని తోకను ముట్టినప్పటికీని అది లేవలేదు. తనకు ఆరోజు అత్యవసరంగా పొలం దున్నాల్సి ఉంది. ఇంతలో దుర్గయ్య ఎద్దు ఒంటరిగా అక్కడ కనబడింది. వెంటనే రామయ్య ఎదురుగా వస్తున్న రంగయ్యతో దుర్గయ్య ఎద్దును తాను నాగలికొరకు పొలానికి తీసుకుని వెళుతున్నట్లు చెప్పమన్నాడు. రంగయ్య సరేనన్నాడు.
ఆ కుప్పకూలిన ఎద్దును అలాగే వదిలిపెట్టిన రామయ్య తన పొలానికి వెళ్లి దున్ని తిరిగి వచ్చే సమయంలో ఆ కుప్పకూలిన తన ఎద్దు అక్కడ లేదు. రామయ్య అది ఇంటికి వెళ్ళింది కాబోలు అని అనుకున్నాడు. కానీ తన ఇంటికి కూడా ఎద్దు రాలేదని అతనికి తర్వాత తెలిసింది. వెంటనే అతడు దుర్గయ్య ఇంటికి వెళ్లి అతని ఎద్దును అప్పగించి తన ఎద్దు కనిపించిందేమోనని అడిగాడు. దుర్గయ్య తాను అతని ఎద్దును చూడనే లేదని చెప్పాడు. ‘మరి తన ఎద్దు ఎక్కడికి వెళ్లినట్టు?’ అని తీవ్రంగా ఆలోచించిన రామయ్య ఆ తెల్లవార్లూ నిద్రపోలేదు. ఇలా నాలుగు రోజులు గడిచాయి. ఎద్దు జాడనే లేదు. రామయ్య ‘ఇక నేను మరొక ఎద్దును కొనాల్సిందే! లేకుంటే నాకు చాలా కష్టం, నష్టం కూడాను’ అనుకున్నాడు. ఇంతలో ఒక రోజు దుర్గయ్య అతని ఎద్దును పట్టుకుని వచ్చాడు. ”దుర్గయ్య మామా! ఈ ఎద్దు నీకు ఎక్కడ కనిపించింది?” అని అడిగాడు రామయ్య.
”నేను అడవికి పోయే దారిలో ఆ సమీపంలోనే నీ ఎద్దు ఒక చెట్టు కింద పడుకున్నది. అది కన్నీరు కారుస్తూ నాకు కనిపించింది. విచిత్రం ఏమిటంటే ఒక పెద్దపులి దాని దగ్గర నుండి వెళ్లడం దూరం నుండి గమనించాను. కానీ ఆ పులి నీ ఎద్దును ఏమీ చేయలేదు. అది నీ అదృష్టం కావచ్చు. నేను నీ ఎద్దును గుర్తించి దాన్ని తీసుకుని వచ్చాను” అన్నాడు దుర్గయ్య.
”ఔను. దుర్గయ్య మామా! నా ఎద్దుకు కాలునొప్పి ఉండేది కదా! అది అడవి సమీపానికి ఎలా వెళ్ళింది? నా పొలానికి రావడానికే అది కదల్లేదు కదా!” అని అన్నాడు రామయ్య. అప్పుడు దుర్గయ్య ”రామయ్యా! నాకు ఒకటి తోస్తున్నది. నీ ఎద్దు కాలినొప్పితో కూలబడడం నిజమే. కానీ అది ఆ నొప్పితో పని చేయలేదు కదా! అందువల్ల నీకు అది తన ముఖాన్ని చూపించలేక నెమ్మదిగా లేచి వెళ్లి అడవి సమీపానికి పోయి ఉంటుంది. అది నీకు ఉపయోగపడలేదనే బాధపడుతూ ఆ పని చేసింది కావొచ్చు. నన్ను చూడగానే అది ఏడ్చింది కూడా! ఇదిగో! ఇప్పుడు కూడా అది కన్నీరు కారుస్తూనే ఉంది. చూడు!” అని అన్నాడు. ”ఆరోజు నాకు చాలా అత్యవసరంగా పొలం దున్నవలసి ఉండడం వల్లనే నేను దాన్ని ఒంటరిగా వదిలి నా పొలానికి వెళ్లాను. ఆ తర్వాత దాన్ని పశువుల వైద్యునికి చూపించాలనుకున్నాను. కానీ ఎద్దు నాకు కనిపించలేదు” అని అన్నాడు రామయ్య.
”రామయ్యా! నేను ఒక సలహా ఇస్తాను. పశువులు కాలు నొప్పితో బాధపడినప్పుడు వాటికి విశ్రాంతి ఇవ్వాలి. అలా దాని బాధ తగ్గే వరకు వాటికి విశ్రాంతి ఇస్తే తర్వాత అవి చురుకుగా పనిచేస్తాయి. నేను అలాగే చేస్తున్నాను. నా ఎద్దుకు కూడా నాలుగు రోజుల క్రితం కాలుకు దెబ్బ తగిలి అది నడవలేక పోయింది. నిన్నటినుండే అది నడుస్తున్నది. అందువల్లనే నా ఎద్దు ఒంటరిగా మేత మేస్తూ నీ కంటపడింది. నీవు రంగయ్య మామతోని నా ఎద్దును తీసుకుని వెళుతున్నానని చెప్పినప్పుడు నేను వద్దని చెబుదామని అనుకున్నాను. కానీ నీవు అదివరకే దాన్ని తోలుకొని వెళ్లావు. సరేనని తిరిగి వచ్చిన తర్వాత నీకు ఆ సంగతి చెబుదామనుకున్నాను. అందుకే చెబుతున్నాను. అవి మూగ ప్రాణులు. వాటి బాధను మనతో చెప్పుకోలేవు కదా! అందువల్ల నీవు వాటి కాలుకు దెబ్బ తగిలినపుడు వాటికి పని చెప్పకుండా విశ్రాంతి ఇచ్చి చూడు” అని సలహా ఇచ్చాడు రామయ్య.
”సరే దుర్గయ్య మామా! నీవు చెప్పినట్లే చేస్తాను” అని అన్నాడు రామయ్య. ఆ తర్వాత అతడు దుర్గయ్య చెప్పినట్లే చేశాడు.

– సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, 9908554535

]]>
పాడుబుద్ధి https://navatelangana.com/a-waste-of-time/ Sat, 13 Apr 2024 17:02:06 +0000 https://navatelangana.com/?p=269034 పాడుబుద్ధిపినాకినీ నదీతీరంలోని ఓ మర్రి చెట్టు మీద రాములమ్మ అనే ముసలికాకి ఉండేది. ఆ చెట్టుమీదే కాకుండా పక్కనున్న చెట్ల మీద కూడా అనేక కాకులు గూళ్ళు కట్టుకొని ఉండేవి. బయట తిరిగి ఆహారం సంపాదించుకోలేని ముసలికాకి ఆ గూటికి, ఈ గూటికి వెళ్ళి.. వారికి ఆమాట ఈమాట చెప్పి, అవి పెట్టింది తిని కాలం వెళ్ళబుచ్చేది. ఒకరి విషయాలు మరొకరికి కథలు కథలుగా చెప్పేది. అలా చెప్పేటప్పుడు ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పి ఆనందించేది.
ఒకసారి ఆ మర్రిచెట్టు మీదికి ఎక్కడ నుండో ఓ కాకుల జంట వచ్చి కొత్తగా గూడు కట్టుకున్నాయి. రెండూ ఎంతో ఉత్సాహంగా కబుర్లు చెప్పుకొనేవి. ఒకటి రెండు సార్లు ముసలికాకి వాటిని పలకరించిది. కాని అవి ముసలికాకిని పట్టించుకొలేదు. అన్ని కాకులు తనకు గౌరవం యిచ్చి.. తనతో కబుర్లు చెప్పించు కుంటూవుంటే.. ఈ కొత్తజంటకు అంత పొగరా? అని లోలోపల రగిలి పోసాగింది.
ఒకరోజు ముసలికాకి పక్క కొమ్మ మీది కాకుల గూటికి వెళ్ళి, ”ఏమేవ్‌.. సుబ్బులమ్మా..! అదిగో ఆ కొమ్మ మీదున్న కొత్త కాకుల జంటను చూశావా..?” అంది.
”చూశాను. చక్కని జంట. ముచ్చటగా వున్నాయి…” చెప్పింది సుబ్బులమ్మ కాకి.
”ముచ్చటా.. నా బొందా..? ఆ మగ కాకి ఏమంత మంచిది కాదు. పొద్దున్నే రెండూ ఆహారం కోసం బయటకెళ్తాయా..! ఆడదేమో.. పాపం ఆహారం కోసం చాలాదూరంగా వెళ్తుంది. ఈలోగా మగదానికి మరో ఆడది జతవుతుంది. రెండూ.. అదిగో..ఆ గుబురు చెట్టు మీద కొమ్మల్లో చేరి ఒకటే పకపకలు, యిక యికలు. ఆ మగకాకి రెండు గూళ్ళ సంసారం చేస్తుంది…” మెల్లగా చెవిలో చెప్పింది.
”అవునా..!!” అని బుగ్గ నొక్కుకుంది సుబ్బులమ్మ.
ముసలి కాకి ఆరోజు నుండి ఈ సంగతి అక్కడక్కడా.. మిగతా గూళ్ళలో కూడా చెప్పింది. కొన్ని ముసలికాకి మాటలు నమ్మాయి. మరికొన్ని నమ్మలేదు. యెలాగైతేనేమి. ఈ మాటలు ఆనోటా.. ఈ నోటా.. పాకి ఆ జంటదాకా వెళ్ళాయి.
పుకారు నమ్మిన ఆడకాకి, మగకాకితో గొడవ పడింది. తను తప్పు చేయలేదని.. తనను నమ్మమని ఎంతగానో ప్రాధేయపడింది మగకాకి. కాని ఆడ కాకి వినిపించుకోక తన పుట్టింటికి వెళ్ళింది.
ఇదంతా గమనిస్తున్న సుబ్బులమ్మ కాకి మనసు బాధపడింది. ఇది ఆ ముసలికాకి నిర్వాహకం అని, దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకొంది. తన మగకాకితో జరిగిందంతా చెప్పింది.
అదికూడా .. ”దీన్ని ఇలాగే వదిలేస్తే మరిన్ని కాకుల సంసారాల్లో చిచ్చు పెడుతుంది. దానికి ఇప్పుడే ఏదో ఒకటి చేయాలి..” అంది.
వెంటనే తన మిత్రులైన మరికొన్ని కాకుల్తో ఈ సంగతి చెప్పింది. అది విన్న మిగతా కాకులు నిజమే మనమంతా జాగ్రత్త పడకపోతే.. మనందరి కాపురాలు కూలిపోతాయి, పదండి. ఇప్పుడే దాని సంగతి తేలుస్తాం” అని అన్నీ బయలదేరాయి.
అన్నీ కలసి.. ముసలికాకి గూడు దగ్గరకు వెళ్ళేససరికి, లోపల నుండి దాని నవ్వు వినిపించి, బయట ఆగాయి.
లోపల నుండి మాటలు వినపడ్డాయి.. ”ఏంటోరు.. నేనంటే అంత అలుసా? చెట్టుమీది కాకులన్నీ నా పెద్ద్దరికాన్ని గౌరవించి, మర్యాదలు చేస్తాయి. అవన్నీ నేను చెప్పే మాటలు వింటుంటే.. కొత్తగా వచ్చిన మీకింత పొగరా..? ఈ ముసలి కాకి రాములమ్మతో పెట్టుకుంటే ఏమవుతుందో..తెలిసిందా..? చక్కని జంటట..! అందుకే వాటి కాపురంలో చిచ్చు పెట్టాను. నా దెబ్బకి చెరో దిక్కు పట్టుకుపోయాయి. ఎవరైనా సరే.. నాతో పెట్టుకుంటే.. అంతే..!” అంటూ బిగ్గరగా నవ్వుకోసాగింది.
బయట వింటున్న కాకులకి దాని పాడుబుద్ధి అర్ధమైంది. అన్నీ లోపలకెళ్ళి, ”ముసలిదానివని దగ్గరతీసి యింత ఆహారం పెడుతుంటే.. తిని మంచిగా ఆలోచించక.. యిలా పాడుబుద్ధితో.. పక్కవారి కాపురాల్లో నిప్పులు పోస్తావా? నువ్వు ఒక్క క్షణం కూడా ఈ చెట్టు మీద వుండడానికి వీల్లేదు” తమ ముక్కులతో పొడిచి పెట్టాయి. వాటి దాటికి తట్టుకోలేక అది గూడు వదిలి పారిపోయింది.
కొన్ని కాకులు అలిగిపోయిన ఆడకాకికి వెతుక్కుంటూ వెళ్లి, దానికి అసలు విషయం చెప్పి తిరిగి తీసుకొచ్చాయి. చెప్పుడుమాటలు విని ప్రేమతో చూసుకుంటున్న తన మగ కాకిని అనుమానించినందుకు అది బాధపడింది. తమను కలిపిన మిగతా కాకులకు ఆ జంట ధన్యవాదాలు చెప్పాయి.
ఆ ముసలికాకి ఎక్కడకు వెళ్ళిందోగానీ.. మళ్లీ ఆ మర్రిచెట్టు ఛాయలకు రాలేదు.

– కైపు ఆదిశేషారెడ్డి, 9985714281

]]>
అమ్మకు కనువిప్పు https://navatelangana.com/open-your-eyes-2/ Sat, 06 Apr 2024 17:15:34 +0000 https://navatelangana.com/?p=263886 Open your eyes”అమ్మా! కొట్టవద్దే.. తట్టుకోలేక పోతున్నా. ఆపవే.. అమ్మా! రేపటి నుంచి బాగా చదువుతాను. నువ్వు చెప్పినట్లే వింటాను” నిద్రలోనే సునీల్‌ కలవరిస్తుంటే గభాలున లేచి వాడి దగ్గరకు వెళ్ళాడు రాంబాబు.
”ఏడవకు నాన్న. ఏం భయం లేదు” కొడుకు పక్కనే కూర్చుని తల నిమరాడు రాంబాబు.
రాంబాబు ఒక ప్రైవేటు ఉద్యోగి. అతడి భార్య సరోజ. వారికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి సునీల్‌ పదో తరగతి చదువుతున్నాడు. అమ్మాయి ఇందిర ఎనిమిదో తరగతి చదువుతోంది.
సమస్య ఏమిటంటే సునీల్‌ చదువులో వెనుకబడ్డాడు. పరీక్షలలో కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్‌ మార్కులు వస్తున్నాయి. వాడు ఎంత కష్టపడి చదువుతున్నా గుర్తుండడం లేదని, పరీక్షలలో రాయలేకపోతున్నానని చెబుతున్నాడు.
కొడుకు సునీల్‌కి పరీక్షలలో తక్కువ మార్కులు రావడం సరోజకి అస్సలు నచ్చడం లేదు. ఈ విషయమై విపరీతంగా బాధపడిపోతోంది. రోజూ సునీల్‌ దగ్గరే కూర్చొని చదివించడానికి నానా తంటాలు పడుతోంది. వాడిని చితకబాదుతోంది. అయినా వాడికి చదివేదేమీ బుర్రకెక్కడం లేదు.
దీంతో సరోజ ప్రతిరోజు సునీల్‌ని కొట్టడం, తిట్టడం చేస్తోంది. సునీల్‌ అయితే వాళ్ళమ్మని చూస్తే చాలు ఒణికి పోతున్నాడు. సరోజలో రోజురోజుకు కోపం పెరిగిపోయి కొడుకుని శత్రువులా చూడడం మొదలుపెట్టింది.
అదే స్కూల్లో సునీల్‌తో పాటే చదివే పిల్లలు తమ దొడ్లోంచి వెళుతుంటే వారికి సునీల్‌ కంటే మంచి మార్కులు వచ్చాయని తెలిస్తే ఆ రోజు పూనకం వచ్చినట్లు ఊగిపోతోంది. కొడుకని కూడా చూడకుండా శాపనార్థాలు పెడుతుంది.
అందుకే సునీల్‌ నిద్రలో కూడా తల్లి కొట్టే దెబ్బలు గుర్తొచ్చి భయంతో కలవరిస్తున్నాడు. రాంబాబుకి కొడుకు పరిస్థితి చూస్తే జాలేసింది.
మర్నాడు ఉదయం భార్యతో ”ఎందుకు వాడిని గొడ్డును బాదినట్లు బాదుతావు? వాడు జడుసుకుని నిద్రలో కలవరిస్తున్నాడు. నువ్వలాగే కొడుతూ పోతుంటే చదువు మాట దేవుడెరుగు.. వాడేదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమోనని భయంగా ఉంది” అన్నాడు.
సరోజ రాంబాబు మీదకు గరు మని లేచింది. ”తమరు అంతంత మాత్రం చదవబట్టే అలాంటి ఉద్యోగం తగలడింది. వీడిని సరైన దారిలో పెట్టకపోతే పెద్దయితే మీలాగే పనికిమాలిన ఉద్యోగం వస్తుంది” అంటూ నోరు మూయించింది.
రాంబాబుని ఈ విషయాలు కల్లోల పరిచాయి. వాటినే మనసులో పెట్టుకొని ఆఫీసులో సరిగ్గా పని చేయలేకపోయాడు. అది గమనించిన స్నేహితుడు రమణ విషయం ఏమిటని రాంబాబుని అడిగాడు.
ఇంట్లో కొడుకు చదువు విషయం, తన భార్య వాడిని దండిస్తున్న విషయం పూసగుచ్చినట్టు చెప్పాడు రాంబాబు.
అంతా విన్న రమణ కాసేపు ఆలోచన చేశాడు. ”మీ ఆవిడకు ఎవరంటే గురి ఉందో వారి చేత ఆమె చేస్తున్న పని తప్పు అని చెప్పించు. తప్పకుండా దారిలోకి వస్తుంది. మీ కొడుక్కి దెబ్బలు తప్పుతాయి” అని సలహా ఇచ్చాడు.
రాంబాబుకి వెంటనే ఒక విషయం గుర్తొచ్చింది. సరోజ ప్రతి గురువారం షిరిడి సాయిమందిరానికి వెళ్లి బోధనలు వింటుందని, అక్కడి గురువు గారు చెప్పే మంచి మాటలు ఆసక్తిగా విని వాటిని ఆచరణలో పెడుతుందని. అంతే! రాంబాబు ఆ సాయంత్రమే షిరిడి మందిరానికి వెళ్లి గురువు గారిని కలుసుకున్నాడు. తానెందుకు వచ్చాడో చెప్పాడు. ఆ సమస్యను పరిష్కరించమన్నాడు.
”నాయనా! నీ భార్య వచ్చినప్పుడు మాట్లాడతాను. ఆందోళన పడవద్దు” అని చెప్పి దీవించి పంపించాడు గురువుగారు.
గురువారం రానే వచ్చింది. సరోజ షిరిడి సాయి మందిరానికి వెళ్ళింది. సాయి దర్శనం చేసుకున్న తరువాత గురువుగారితో ”మా అబ్బాయి బాగా చదవడం లేదు. వాడు చెడిపోతాడని భయంగా ఉంది” అని తన బాధను ఆయనతో పంచుకుంది.
గురువు గారికి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు, పని మరీ సులువైంది.
”అమ్మా! చదువుల విషయంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. పిల్లల చదువుల విషయంలో వారు తీసుకునే శ్రద్ధ ఒక్కోసారి అనర్ధాలకు దారి తీస్తోంది. ఒకే వయసు ఉన్న పిల్లలందరికీ ఒకే రకమైన తెలివితేటలు ఉండవు. తాము ఆశించిన ఫలితాలు పిల్లల నుంచి పొందాలనుకోవడం అత్యాశ అవుతుంది. పిల్లలను భయపెట్టడం, కొట్టడం, ఒత్తిడి తీసుకురావడం వల్ల వారు బాగా చదువుతారని, మంచి మార్కులు సాధించగలరని అనుకోవడం పొరపాటు. వారి తెలివితేటలకు తగ్గట్టే మార్కులు వస్తాయి. వారికి గుర్తింపును, ప్రోత్సాహాన్ని ఇవ్వాలే తప్ప దండించడం వల్ల ప్రయోజనం ఉండదు. పిల్లలపై అతిగా ఒత్తిడి తెస్తే వారికి చదువుపై అయిష్టత ఏర్పడే అవకాశం ఉంది. వారికి జీవితంపై విరక్తి కూడా కలగవచ్చు. జీవించడానికి చదువు అవసరమే. కానీ చదివే జీవితం కాదు. చదువు లేని వారు, చదువులో వెనుకబడిన వారు ఎందరో జీవితంలో విజయాలు సాధించారు. ముందుగా నీ ఆలోచనా విధానంలో మార్పు రావాలి. అంతకంటే ముందు మీ అబ్బాయిని ప్రేమగా చూడడం అలవాటు చేసుకో. ఫలితం సంగతి దేవుడెరుగు నీ కొడుకు బెంగతో అనారోగ్యం పాలవకుండా కాపాడుకో” అని బోధించారు.
గురువు గారి మాటలతో సరోజకు కనువిప్పు కలిగింది. సునీల్‌ విషయంలో తానింతవరకు ప్రవర్తించిన తీరుకు సిగ్గు పడింది.
”అయ్యో పాపం పసివాడి మనసు ఎంత గాయపడి ఉంటుందో. వాడిని సముదాయించాలి” అనుకుని ఇంటికి బయల్దేరింది. ఆ రోజు నుండి సునీల్‌ పట్ల ఆమె తీరే మారిపోయింది.

– నారంశెట్టి ఉమామహేశ్వరరావు, 9490799203

]]>
చీమ – గడ్డి వాము https://navatelangana.com/ant-grass-weed/ Sat, 30 Mar 2024 18:23:04 +0000 https://navatelangana.com/?p=259198 పుణ్యగిరి అటవీ ప్రాంతంలో పెద్ద ఏనుగుల గుంపు ఉండేది. అందులో ఉన్న ఒక గున్న ఏనుగు విపరీతమైన అల్లరి చేసేది. ఏ జంతువునూ ఖాతరు చేసేది కాదు. దాని ప్రవర్తనకు మిగతా జంతువులన్నీ ఇబ్బంది పడేవి. ఒక రోజు గున్న ఏనుగు చెట్లను పెరికింది. చీమలపుట్టలను ద్వంసం చేసింది. చాలా చీమలు గున్న ఏనుగు కాళ్ళకింద పడి చచ్చిపొయాయి. మిగతా చీమలన్నీ తలో వైపుకు పరుగులు తీశాయి. కొంత సమయం తర్వాత అన్నీ ఒక చోట కలిశాయి. గున్న ఏనుగు బాధ పడలేక అడవిని వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాయి. పిల్లాపాపలతో కలిసి అడవిని వదిలి గ్రామం బాట పట్టాయి. దారిలో ఒక పశువుల కొట్టం కనిపించింది. అక్కడ ఒక గడ్డి వాము ఉంది. కాసేపు గడ్డివాము ప్రక్కన విశ్రమించాయి చీమలు. పుంఖాను పుంఖాలుగా వస్తున్న చీమల దండుని చూసి గడ్డివాము ఆశ్చర్యపోయింది. ”మిత్రులారా ఏమైంది అలా విచారంగా ఉన్నారు” అని అడిగింది.
”ఏం చెప్ప మంటావు? మేం అల్ప ప్రాణులం. గున్న ఏనుగు ఆగడాలు భరించలేకపోయాం” అని జరిగినదంతా చెప్పాయి. అంతా విని గడ్డివాము ఫక్కున నవ్వింది.
”ఎందుకలా నవ్వావు?” అని అడిగాయి చీమలు.
”విషపూరితమైన పాముని చంపగలిగిన మీకు ఏనుగు ఒక లెక్కా!” అంది గడ్డివాము.
”అంటే” అని సందేహించాయి చీమలు.
”గాలి వేస్తే గడ్డిపరకలమైన మేం ఎగిరిపోతాం. కానీ కుప్పగా పెడితే ఇదిగో ఇలా స్థిరంగా ఉంటాం. మేమంతా కలిస్తే గాలిని సైతం అడ్డుకుంటాం.” అంది గడ్డివాము.
ముసలి చీమకి తళుక్కున ఒక ఆలోచన తట్టింది. గండు చీమలతో ఒక సైన్యం ఏర్పాటు చేసింది. వాటికి ఏమి చెయ్యాలో చెప్పింది. ముసలి చీమ చెప్పినట్లు గున్న ఏనుగు ఎక్కడ ఉందో వెతకనారంభించాయి గండు చీమలు. ఒకచోట హాయిగా నిద్రపోతూ గున్న ఏనుగు కనిపించింది. గండు చీమలదండు మొత్తం ఏనుగు పైకి పాకి కుట్టడం ప్రారంభించింది. చీమలు ముక్కు చెవుల్లోకి దూరాయి. ఒళ్ళంతా కుట్టాయి. గున్న ఏనుగుకు కాసేపటికి వొళ్ళంతా మంట పుట్టింది. అది భరించలేక ఘీంకరిస్తూ దగ్గరలో ఉన్న ఒక నీటి మడుగులోకి దిగింది. చీమలన్నీ నీటిపై తేలియాడు ఆకుల సాయంతో ఒడ్డుకు చేరుకున్నాయి. గున్న ఏనుగు మాత్రం బురదలో కూరుకుపోయింది. బయటకు రాలేక గోల గోల పెట్టింది. గున్న అరుపులు విన్న ఏనుగులన్నీ పరుగు పరుగున మడుగు వద్దకు చేరుకున్నాయి. ”బుద్ధిగా ఉండమంటే ఉన్నావు కాదు. పీకల మీదకి తెచ్చుకున్నావు” అని తల్లి ఏనుగు తిట్టిపోసింది. అన్ని ఏనుగులు కలిసి అతికష్టం మీద గున్న ఏనుగును బయటకి తీసుకువచ్చాయి.
”నేనే గొప్ప అనుకుని మీ మాటలు పెడచెవిన పెట్టాను. బాధపడితేనే కానీ బోధపడలేదు” అని వాపోయింది గున్న.
”ఇక మీదట ఏ జీవినీ బాధపెట్టకు. బుద్ధిగా మసలుకో” అన్నాయి ముసలి ఏనుగులు.
”సరేనమ్మా బుద్ధిగా ఉంటాను” అంది గున్న.
”మనకి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చి ఒక ఆలోచన కలిగించిన గడ్డి వాముకు కృతజ్ఞతలు తెలియచేద్దాం పదండి” అంది ముసలి చీమ. పొలోమని గడ్డివాము దగ్గరికి చేరుకుని ధన్యవాదాలు తెలియచేసి అడవికి పయనమయ్యింది చీమలదండు.

– కాశీ విశ్వనాథం పట్రాయుడు, 9494524445

]]>
ప్రియమైన అమ్మ https://navatelangana.com/dear-mother/ Sat, 23 Mar 2024 17:33:51 +0000 https://navatelangana.com/?p=255242 ప్రియమైన అమ్మతరగతి గదిలో పిల్లలంతా కేరింతలు కొడుతూ, గొడవ చేస్తుండగా సుందరం మాస్టారు తరగతి గదిలోకి ప్రవేశించారు. ఒక్కసారిగా తరగతి అంతా నిశ్శబ్దంగా మారింది. సుందరం మాస్టారు గొంతు సరిచేసుకొని కళ్లజోడు పైనుండి చూస్తూ ”ఏమిటర్రా పిల్లలూ! ఇప్పటి దాకా తెగ మాట్లాడేస్తున్నారు .. దేని గురించి?” అంటూ పాఠ్యపుస్తకాలు తీయండి అన్నారు
పిల్లలంతా నీరసంగా ”అలాగే మాస్టారూ..!” అంటూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ సమయం ఎప్పుడు అయిపోతుందా అన్నట్లు గోడ గడియారం వైపు చూస్తూ పుస్తకాలు తెరిచారు. ఇది గమనించిన సుందరం మాస్టారు వారిలో ఉత్సాహం నింపడానికి ”ఈ రోజు పాఠాలు మీరు చెప్పండిరా పిల్లలూ” అన్నారు.
పిల్లలంతా ఏమీ అర్థం కానట్టు అమాయకంగా చూస్తూ ఉన్నారు
”ఏమిటర్రా! మీరు అలా నా ముఖంవైపు చూస్తున్నారు. మొదలు పెట్టండి” అన్నారు. వారిలో విఘ్నేష్‌ భయం భయంగానే చిన్నగా లేచి మాస్టారు! ”మేమా..? మరీ…. మరీ” అంటూ ఏమి చెప్పాలి అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు.
వాడి చూపుకి అర్థం తెలిసిన సుందరం మాస్టారు ”మీరు ఏదీ చెప్పినా వింటాను .. అది మీ కథైనా, మీకు తెలిసిన కథైనా. నీ గురించైనా, మీ అమ్మ గారి, నాన్నగారి గురించైనా… ఇలా ఏదైనా మీ ఇష్టం” అన్నారు మాస్టారు
”మరీ… పాఠం సంగతో” అన్నాడు విఘ్నేష్‌.
”గొప్ప గొప్ప వారి జీవితచరిత్రలే కదా మనం పాఠాలుగా చెప్పుకునేదీ.. వారు చేసిన కషి గురించి, వారి జీవితం నుండి మనం నేర్చుకోవలసిన మంచి, ఇలా మీకు తెలిసిన, చూసిన లేదా చేసిన ఏదైనా మంచి గురించి చెప్పండి” అన్నారు సుందరం మాస్టారు.
”అలాగైతే నేను చెప్తా మాస్టారూ..” అంటూ రవి పైకి లేచాడు
వాడి ఉత్సాహానికి మురిసిపోయి సంతోషంతో ”చెప్పు” అన్నారు సుందరం మాస్టారు.
”అమ్మ తెలుగు భాషలో ఒక తియ్యని పదం. అమ్మ చాలా విషయాలు నేర్పిస్తుంది. మనకు గురువులు బడిలో చదువు నేర్పిస్తే అమ్మ మనకు తన ఒడిలో చదువు, సంస్కారం నేర్పిస్తుంది. అందుకే ఆది గురువు అమ్మ. ఎంతమంది పిల్లలున్నా అమ్మ ప్రేమలో లోపం, లోటు ఉండదు.
అమ్మ తన జీవితంలో చేసిన పొరపాట్లు మనం చేయకూడదని ముందు జాగ్రత్తలు చెబుతుంది. అమ్మ తనకు ఇష్టమైనవి మన కోసం త్యాగం చేసి, మన ఆనందం కోరుకుంటుంది. మనల్ని మంచిదారిలో నడిపిస్తుంది. అమ్మ తన మధురమైన గొంతు ద్వారా మనకు సష్టిలోని అన్నింటినీ పరిచయం చేస్తుంది. మనతో కొట్లాడుతూ మనపై నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ. అన్నం వద్దని మారాం చేస్తే బుజ్జగించి, బ్రతిమిలాడి తన 5 వేళ్ళను ప్రేమగా మార్చి మనకు గోరుముద్దలు తినిపిస్తుంది. చిన్నప్పుడు మనకి అమ్మ విలువ తెలియదు కానీ ఒక్కసారిగా అమ్మ లేకపోతే అప్పుడు తెలుస్తుంది మనకి అమ్మ విలువ ఏంటో. అమ్మ మనల్ని తిడితే మనకి కోపం వస్తుంది. కానీ ఒకసారి ఆలోచిస్తే తప్పు మనదే అనిపిస్తుంది. అమ్మ కోపంలో బాధ్యత ఉంటుంది. మనం అల్లరి చేస్తే గాని అమ్మ మనల్ని తిట్టదు. మనకి ఏదైనా దెబ్బ తగిలితే మనం అమ్మా అని అంటాం. అమ్మ మన దగ్గర లేకపోయినా అమ్మకి ఆ కేక వినిపిస్తుందంట. మనం బడికి వెళ్లేటప్పుడు మన అమ్మ దూరంగా నిలబడి నవ్వుతూ టాటా చెబుతుంటే ఆ నవ్వుని చూసి సంతోషించని బిడ్డ ఈ లోకంలో ఎక్కడైనా ఉంటాడా?
మనం అమ్మను గౌరవించాలి. మనం బాగా చదువుకుంటే, పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకుంటే మన అమ్మ చాలా ఆనందిస్తుంది. మన ఎదుగుదలే తల్లికి నిజమైన సంతోషాన్ని ఇస్తుంది. మనల్ని హీరోగా భావించే ఒకే ఒక్క వ్యక్తి అమ్మ. మనం అమ్మకు పనులలో సహాయపడాలి. మన పనులను అమ్మ పై వేయకూడదు. నేనంటే మా అమ్మకు చాలా ఇష్టం. ఇంతే మాస్టారు” అన్నాడు రవి . పిల్లలంతా గట్టిగా చప్పట్లు కొట్టారు .
”విన్నారుగా పిల్లలూ! ఈ సృష్టిలో అమ్మ ప్రేమ ఒక్కటే కల్మషం లేనిది. అలాగే కల్మషం లేని మనస్సు పిల్లలది. మీరు కూడా అమ్మ మనసుని కష్టపెట్టకుండా చూసుకుంటారు కదూ!” అని అన్నారు సుందరం మాస్టారు.
పిల్లలందరు సంతోషంతో ”చూసుకుంటాం మాస్టారు” అన్నారు. ఈలోగా బడి గంట మోగింది. సుందరం మాస్టారు తరగతి గది బయటకు నడిచారు. పిల్లల మనసు ప్రేమతో నిండింది.
ధూళిపాళ్ళ లిఖిత్‌ సాయి
6 వ తరగతి.

]]>
మోసగాళ్లతో జాగ్రత్త https://navatelangana.com/beware-of-scammers/ Sat, 09 Mar 2024 17:27:47 +0000 https://navatelangana.com/?p=245327 Beware of scammers– పుప్పాల కష్ణమూర్తి
ఊటుకూరు గ్రామంలో నివసించే దీనయ్య అనే జాలరి వద్ద ఓ నల్ల కుక్క ఉండేది. ఉదయమే వల తీసుకొని చెరువుకు వెళ్లి చేపలు పడుతుంటే, ఒడ్డున ఉండి రొట్టెకు, బుట్టకు కాపలా కాసేది. కాకులు, గద్దలు అటు వైపు వస్తే వెంటపడి తరిమేది. మనుషులు వస్తే, గట్టిగా అరిచేది. కుక్క కాపలా కాస్తుందనే ధైర్యంతో బట్టలు, బుట్ట, రొట్టె ఒడ్డు మీద పెట్టి చెరువు లోనికి వెళ్లి వేట చేసేవాడు. వలకు పడ్డ చేపల్ని, ఒడ్డుకు తెచ్చి దులిపి, తాటాకు బుట్టలో వేసేవాడు. తిరిగి వలతో చెరువులోకి వెళ్లేవాడు. తన ముందు చేపల బుట్ట ఉన్నా, అన్నం నుంచి మాంసం వాసన వస్తున్నా ఆ కుక్క ముట్టుకునేది కాదు. దీనయ్య మధ్యాహ్నం అన్నానికి వచ్చి, చెట్టు కింద కూర్చొని తింటూ, కుక్కకు కొంత పెట్టేవాడు. మాంసం అయితే బొక్కలు వేసేవాడు. సంతోషంగా తినేది. సాయంత్రం చేపలు పట్టడం పూర్తికాగానే బుట్టలోని చేపల్లో కొన్ని చిన్న చేపలు తీసి కుక్క ముందు వేసేవాడు. అది ఆనందంగా తోక ఊపుకుంటూ తిని, యజమాని వెంట ఇంటికి వెళ్ళేది.
ఓ రోజు ఊర కుక్క ఒకటి చెరువు వైపు వచ్చింది. అది గతంలో కొమరయ్య కుక్క. గొర్రెల మందకు కాపలా కాసేది. ఓనాడు యజమాని మందని కుక్కకు అప్పజెప్పి, ఊళ్లోకి వెళ్లి వచ్చేసరికి గొర్రె పిల్లను చంపి చక్కా తినేసింది. చూసిన కొమరయ్య దాన్ని నాలుగు బాది వెళ్ళగొట్టాడు. దానితో పక్క ఊరికి పారిపోయి ఆహారం వెదుక్కుంటూ వచ్చింది. ఆవారాగా తిరుగుతూ, బజార్ల వెంట దొరికింది తింటూ కడుపు నింపుకోసాగింది. దానికి చెరువుగట్టున కాపలా కాస్తున్న నల్ల కుక్క అమాయకంగా కనిపించింది. నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళసాగింది.
”నా దగ్గరకు రాకు. మా యజమాని ఆహారానికి, తను పట్టే చేపలకు కాపలా ఉన్నాను. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో” అని అరిచింది నల్లకుక్క. చెరువులో దీనయ్య వెనక్కు చూసి, ”నా కుక్క దాన్ని తరిమేస్తుందిలే” అనుకున్నాడు.
”నిజంగా నువ్వు ఎంత తెలివి తక్కువ దానివి, చక్కటి చేపల్ని శుష్టుగా తిని, కోరిక తీర్చుకోక కాపలాకాస్తున్నావా? నీవు ఎంత నమ్మకంగా పనిచేసినా, మీ యజమాని, పనికిరాని చేపలే నీకు వేస్తుంటాడు . ఇంకా ఆహారం అంటావా… తాను కడుపు నిండా తిని, మిగిలింది పిరికిడు పెడతాడు . జీవితంలో ఒక్కసారన్నా కడుపునిండా చక్కటి చేపల్ని తిను. మీ యజమాని తినే ఆహారాన్ని తిని చూడు. ఎంత రుచిగా ఉంటుందో! మీ యజమాని వచ్చి అడిగితే, నేను పిట్టల్ని తోల బోయేసరికి నక్క వచ్చి తిని పోయిందని చెప్పు” అని ఉపాయం చెప్పింది. ఇదేదో బాగానే ఉందనిపించింది నల్లకుక్కకు. ‘పెద్ద చేపలు ఎప్పుడూ తినలేదు. ఎప్పుడూ పరక పిల్లలే వేస్తుంటాడు. దీనయ్య భార్య కోడి కూర వండి కట్టింది. తినక ఎన్ని రోజులు అయిందో..?’ మనసులో ఆలోచించసాగింది.
”ఇంకేం ఆలోచించకు. ఇద్దరం చక్కగా తిందాం. కోరిక తీర్చుకుందాం. ఒకవేళ మీ యజమాని నిన్ను వెళ్లగొడితే, నా వెంట రా. స్వేచ్ఛగా తిరుగుతూ, చక్కటి ఆహారం తిందాం” అని ఊరకుక్క బుట్టని కిందకి నెట్టింది. అందులోని చేపలు బిల బిలా వెలుపలికి వచ్చాయి. రెండు కుక్కలు వాటిని చక్కగా తినసాగాయి. దీనయ్యకు ఏదో అనుమానం వచ్చి వెనక్కు చూశాడు. ఇంకేముంది … రెండు కుక్కలు కలిసి చక్కగా చేపల్ని తినసాగాయి. దీనయ్య పెద్దగా కేక పెడుతూ, ఒడ్డుకు పరిగెత్తుకు రాసాగాడు. తను వచ్చేసరికి చేపల్ని గబగబా తినేసాయి. పట్టరాని కోపంతో కట్టె తీసుకొని, రెండు కుక్కల్ని వెంట పడి బాది దూరంగా వెళ్ళగొట్టాడు. తన అన్నాన్ని, బుట్టను పక్కనున్న చెట్టు కొమ్మకు కట్టి, తిరిగి చెరువులోకి వెళ్లాడు వల తీసుకొని.
ఊర కుక్క వెంట వెళ్ళిన నల్ల కుక్కకు, ఉదయం కాగానే ఆకలి అయింది. యజమాని వద్ద ఉంటే పొద్దున్నే చద్దన్నం పెట్టేవాడు. ఊర కుక్కను అడిగింది. అది నేరుగా చెత్తకుండీ వద్దకు తీసుకుపోయింది. ”అందులో ఏమన్నా ఆహారం ఉంటదేమో… వెతికి తీసుకో..” అన్నది. చెత్తంతా కెలకగా దానికో ఎండిపోయిన రొట్టె ముక్క దొరికింది. వెలుపలకు తీసి తినబోయే సరికి, ఊర కుక్క దాని మీద కలబడి, రొట్టె ముక్కను గుంజుకుని తినసాగింది.
”ఇది అన్యాయం. నన్ను యజమాని నుంచి దూరం చేసింది కాక, రొట్టె ముక్కను గుంజుకుంటావా?” అన్నది కోపంగా. ”నిన్ను వెంట తీసుకొచ్చింది నేను. ముందు నా ఆకలి తీరిన తర్వాతే నువ్వు ఆహారం తినాలి. అయినా ఎవరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేయడమేనా? నీ దగ్గర చేపలు ఉండటం చూసి, బురిడీ కొట్టించి చేపలు తిన్నాను. యజమాని రావడం కాస్త ఆలస్యం అయితే, ఆ కోడి మాంసం కూర కూడా తినేవాడిని” అన్నది ఊరకుక్క.
”యజమానిని మోసగించినందుకు, నాకు తగిన శాస్తి జరిగింది” అని, ఊర కుక్కను వదిలేసి గ్రామంలోకి వెళ్లింది. ఆకలితో, తలుపు తెరిచి ఉన్న ఓ ఇంటిలోకి చొరబడింది. కనపడ్డ అన్నం కుండలో మూతి పెట్టి తినసాగింది. ఇంతలో ఇల్లాలు వచ్చి చూసింది. కోపంతో చేతిలోని గంజిని కుక్క మీదకు విసిరింది. కుక్క ఒళ్లంతా కాలింది. కుయ్యో … మొర్రో …. మంటూ బజార్లోకి పరుగు తీసింది. కాలిన ఒళ్ళు నాలుకతో నాక్కుంటూ .. బడి గేటు పక్కన పడుకుంది.
పాఠశాల వదిలిపెట్టగానే ఇంటికి వస్తున్న, దీనయ్య కొడుకు బాలయ్య కుక్కని చూశాడు. ‘ఇది మా కుక్క . మీద ఎవరో వేడినీళ్లు పోసినట్లుంది’ అని ప్రేమగా కుక్క దగ్గర కూర్చొని, తల మీద చేయి వేసి దువ్వాడు. అది కన్నీరు కార్చింది. ”మన ఇంటికి వెళదాం రా. నాన్న నిన్ను ఏమీ అనకుండా చూచే పూచీ నాది” అని కుక్కతో అన్నాడు.
బాలయ్య మాటలు అర్థం చేసుకున్నట్లు, వెంట వెళ్ళింది. దీనయ్య కోపంతో కట్టెతో కొట్టబోయాడు. కానీ కొడుకు అడ్డు వస్తూ, ”చాలా మంచి కుక్క నాన్న. నన్ను చిన్నప్పుడు, నీటిలోంచి కాపాడింది. వేరే కుక్క మాటలు విని, చేపలు తిని ఉంటుంది. ఇంకెప్పుడూ అలా చేయదులే” అని సర్ది చెప్పాడు. దీనయ్య కొడుకు మాటలకు కరిగిపోయాడు. పెరుగు కలిపిన అన్నాన్ని తెచ్చి, కుక్క ముందు పెట్టాడు. అది గబగబా తినేసింది. కాలిన గాయాల మీద, తండ్రి కొడుకులు కలిసి బర్నాల్‌ మందు రాశారు. ”ఇంక నేను బతుకుతాను. జీవించినంత కాలం, యజమానికి సేవ చేస్తాను. చెప్పుడు మాటలు విని, ఈ కుటుంబాన్ని దూరం చేసుకోను” అని గట్టిగా నిర్ణయించుకుంది.

]]>
చిన్న వయసు.. పెద్ద మనసు https://navatelangana.com/young-age-is-big-mind/ Sat, 02 Mar 2024 19:49:34 +0000 https://navatelangana.com/?p=240350 Young age. Big mindఅమ్మా! నేను స్కూలుకి వెళుతున్నా .. టైమయింది అన్నాడు హితార్థ్‌. చిన్నా .. ఈరోజు నువ్వు స్కూలుకి వెళ్లొద్దు. నాతోపాటు ఆస్పత్రికి రావాలి అన్నది తల్లి. స్కూలుకి వెళ్లొద్దు అనే మాట తల్లి నోట వినగానే ఎగిరి గంతేశాడు. దేనికమ్మా! వెళ్లొద్దు అంటున్నావు అడిగాడు హితార్థ్‌. నీ చిట్టి తమ్ముడు ఉధీర్ణ్‌ కు ఏడాది నిండింది కదా! ఈరోజు ప్రభుత్వాసుపత్రికి వెళ్లి టీకా వేయించాలి. నాన్నకు ఆఫీసులో మీటింగు ఉంది. పొద్దునే బయలుదేరి వెళ్లారు. అందుకే తోడుగా నిన్ను రమ్మంటున్నా అన్నది తల్లి. తమ్ముడిని నేను ఎత్తుకుంటానమ్మా! సంతోషంగా అన్నాడు. వద్దు .. నువ్వు సరిగ్గా వాడ్ని ఎత్తుకోలేవు. ఇప్పుడు నువ్వు చదివేది మూడో తరగతి. నాలుగులోకి వచ్చాక ఉధీర్ణ్‌ ను ఎత్తుకోవచ్చు అన్నది తల్లి. తల్లి మాటలు హితార్థ్‌ను నిరుత్సాహపర్చాయి.
తల్లి ఇంటికి తాళం వేసింది. ఇంతలో ఆటో పక్కన ఆగింది. హితార్థ్‌ తల్లితో కలిసి ఎక్కాడు. అమ్మా! తమ్ముడు భలే ముద్దొస్తున్నాడు. కాసేపు నా ఒళ్లో కూర్చోబెట్టు అన్నాడు. ఆటోలో ప్రయాణిస్తూ అలా చెయ్యకూడదు. ఇంటికి వెళ్లాక నీ ఒళ్లో కూర్చోబెడతాను అన్నది తల్లి. హితార్థ్‌ సంతోషంతో తమ్ముడు ఉధీర్ణ్‌ బుగ్గలు నిమిరాడు. తల్లి హితార్థ్‌ను దగ్గరకు తీసుకుంది. ఇంతలో ఆసుపత్రి వచ్చింది. తల్లి ఆటో దిగి ఉధీర్ణ్‌ను భుజం మీద వేసుకుంది. హితార్థ్‌ కూడా ఆటో దిగాడు. నువ్వు నాకు చెప్పకుండా ఎటూ పోవద్దు. ఎవరు పిలిచినా వెళ్లొద్దు. నా చెయ్యి వదలకూడదు అన్నది తల్లి. అలాగే అన్నాడు హితార్థ్‌. ఓపీ రాయించుకోటానికి తల్లి లైనులో నిలబడగా వెనకాలే హితార్థ్‌ కూడా నిలబడ్డాడు. ఓపీ రాయించుకున్నాక చీటీ తీసుకుని సంబంధిత పిల్లల వైద్యుని సంప్రదించింది హితార్థ్‌ తల్లి. అక్కడ నర్సు వైద్యుని సలహా మేరకు పరీక్షించి టీకా వేసింది. సూది తగలగానే ఉధీర్ణ్‌ గుక్కపట్టి ఏడవటం ప్రారంభించాడు. తమ్ముడు ఏడుస్తుంటే హితార్థ్‌ కూడా ఏడవటం ప్రారంభించాడు. తల్లి ఒకవైపు ఉధీర్ణ్‌ను సముదాయిస్తూనే హితార్థ్‌ను దగ్గరకు తీసుకుంది. వైద్యుడు వేసిన టీకాకు పిల్లవాడికి జ్వరం వస్తుందని భయపడవద్దని చెప్పారు. జ్వరం తగ్గకపోతే సిరప్‌ వాడమని ఓపీ చీటి మీద రాశారు. ఇంతలో పిల్లలు ఏడుపు ఆపారు. ఉధీర్ణ్‌ను భుజాన వేసుకుని హితార్థ్‌ చేయి పట్టుకుని మందులు ఇచ్చే ప్రదేశానికి బయలుదేరింది. మందులు పంపిణీ చేసే ప్రదేశంలో రెండు లైన్లు ఉన్నాయి. పురుషుల లైను రద్దీగా ఉండగా, మహిళల లైనులో తక్కువ మంది ఉన్నారు. హితార్థ్‌ తల్లి మందుల కోసం మహిళల లైనులో నిలబడింది. హితార్థ్‌ ఓ పక్కన నిలబడ్డాడు. ఇంతలో పురుషుల లైనులో తొక్కిసలాట ప్రారంభమైంది. అంతవరకు లైనులో ముందు వరుసలో నిలబడ్డ ఓ వృద్ధుడిని కొందరు పక్కకు తోసేశారు. దాంతో ఆ వ్యక్తి కింద పడ్డాడు. అతను పైకి లేవాలని ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటం లేదు. అతని చేతిలోని మందుల చీటి ఫ్యాన్‌ గాలికి దూరంగా పడింది. హితార్థ్‌ పరుగును వెళ్లి చీటి తెచ్చి తాతా! తీసుకో అని ఇచ్చాడు. బాబూ! దాహం వేస్తుంది అన్నాడు వృద్ధుడు. హితార్థ్‌ పరుగున తల్లి దగ్గరకు వెళ్లి బాటిల్‌ తెచ్చి మూత తీసి తాతా! తాగు అంటూ ఇచ్చాడు. ఆ వృద్ధుడు గబగబా నీళ్లు తాగి తేరుకున్నాడు. హితార్థ్‌ వైపు కృతజ్ఞతగా చూస్తూ లైను దగ్గరకు వెళ్లాడు.
ప్రతి ఒక్కరూ వృద్ధుని వెనక్కి తోసేశారు. కొందరేమో ఆయన వయసును కూడా గుర్తించలేదు. పైగా ఇప్పుడే వచ్చి ముందు నిలబడతావా! అని మాటలు తూలారు. వృద్ధుడు ఎంత ప్రయత్నించినా ముందుకు పోలేక పోతున్నాడు. చివరకు చేతగాక ఒక బల్ల మీద కూర్చొన్నాడు. ఇదంతా చూస్తున్న హితార్థ్‌కు వృద్ధుడి పరిస్థితి జాలనిపించింది. మెల్లగా దగ్గరకు వెళ్లాడు. తాతా! ఏం కావాలి? అని ప్రశ్నించాడు.
బాబూ! ఉదయం అనారోగ్యంగా ఉంటే ఇక్కడకు వచ్చి డాక్టరుకి చూపించుకున్నాను. మందులు రాశారు. వాటి కోసం ఈ అవస్థ. లైనులో నిలబడలేకపోతున్నాను. ఎవరూ సాయం చేయటం లేదన్నాడు వృద్ధుడు.
తాతా! నీ మందుల చీటి నాకివ్వు.. తెచ్చిస్తా అన్నాడు హితార్థ్‌. వృద్ధుడు ఇచ్చిన చీటీ తీసుకుని తల్లి వద్దకు వెళ్లాడు. అమ్మా! ఇది దూరంగా బల్లపై కూర్చొన్న తాత మందుల చీటి. మందులు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. అందరూ తోసేస్తున్నారు. ఎలాగైనా మందులు ఇవ్వాలమ్మా! అన్నాడు. సరే చీటీ ఇవ్వమనగా హితార్థ్‌ ఇచ్చాడు. ముందువరుసకు చేరుకున్న ఆమె మొదట ఉధీర్ణ్‌ మందులు తీసుకుంది. ఆ తర్వాత వృద్ధుడు మందులు కూడా తీసుకుంది. అవి హితార్థ్‌కి అందించగా పరుగున తీసుకెళ్లి తాతా! అంటూ చేతిలో పెట్టాడు. వృద్ధుడు హితార్థ్‌ ను ఉద్దేశించి నా ఆయుష్షు కూడా పోసుకుని నిండునూరేళ్లు చల్లగా ఉండు అని దీవించాడు. ఇతరులను ఆదుకోవాలనే ఆలోచన హితార్థ్‌లో రావటంతో తల్లి సంబరపడింది. అనంతరం ఆటోలో ఇంటి బాట పట్టారు.

– తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర, 9492309100

]]>
గుహలో గొర్రెలు https://navatelangana.com/sheep-in-the-cave/ Sat, 24 Feb 2024 17:25:40 +0000 https://navatelangana.com/?p=235124 గుహలో గొర్రెలుడేరాకండ్రిగ గ్రామంలో సుభద్రక్క అనే గొర్రెల కాపరి ఉండేది. రోజూ గొర్రెలను తోలుకుని ఊరి పక్కనే ఉన్న నిశ్శంకుదుర్గం అడవికి వెళ్ళేది. సాయంత్రం దాకా అడవిలోనే ఉండి వాటిని మేపుకుని ఇంటికి తిరిగి వచ్చేది.
ఆమె మందలో రెండు పొగరుబోతు గొర్రెలు ఉండేవి. సుభద్రక్కకి తన దగ్గర ఉండే గొర్రెలన్నిటినీ మేపడం ఒక ఎత్తయితే ఈ రెండింటినీ మేపడం మరో ఎత్తు.
ఓ ఆదివారంనాడు మందతోటి పన్నెండేళ్ళ కొడుకు కుబేరుణ్ణి తీసుకుని అడవికి వెళ్ళింది.
సుభద్రక్క కొన్ని గొర్రెలను మేపుతూ పెద్దగుట్ట మీదకి వెళ్ళింది. కుబేరుడు కూడా కొన్ని గొర్రెలను తోలుకుని చిన్న గుట్టమీదకి వెళ్ళాడు.
సాయంత్రం దాకా బాగా మేపారు. ఇంటికి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. బయలుదేరేముందు గొర్రెలను లెక్కవేసేది సుభద్రక్కకు అలవాటు. అలా లెక్క వేస్తున్నప్పుడు ఆ రెండు పొగరుబోతు గొర్రెలు ఎక్కడికో తప్పించుకుని వెళ్ళినట్లు గుర్తించింది.
ఆ విషయాన్ని కొడుకుతో చెప్పింది. ఇద్దరూ కలిసి వెదికారు. గుట్ట ఎక్కి చూశారు, చెట్టు ఎక్కి చూశారు. ఎక్కడా కనిపించలేదు. అవి నిశ్శంకుదుర్గంలోని గుహల్లో దాక్కొన్నట్లు వారికి అర్థమయ్యింది. గుహల లోపలికి వెళ్ళాలంటే చీకటిగా ఉండటంతో ఇద్దరూ లోపలికి వెళ్ళడానికి సాహసించలేదు.
”కొద్దిసేపైతే చీకటి పడుతుంది. వాటిని వెదికేది చాలా కష్టం. పులో, సింహమో వచ్చి వాటిని తినేసి పోతే ఏమి చేసేదిరా భగవంతుడా!” అని సుభద్రక్క బాధపడింది.
”కష్టాలు కలకాలం ఉంటాయా? సమస్య అన్నాక పరిష్కారం లేకుండా ఉంటుందా?” అని అమ్మకి ధైర్యం చెప్పినాడు కుబేరుడు.
‘గొర్రెలను ఎలా పట్టుకోవాలా?’ అని ఆలోచనలు చేసినాడు. గుహ మొదటికి పోయి అగ్గిపుల్లలు వెలిగించి గొర్రెల కోసం వెదికాడు. అవి అగుపించలేదు. గొర్రెలాగా అరిచినట్లు ‘బ్యా… బ్యా…’ అని అరుస్తూ గుహల చుట్టూ తిరిగాడు. అయినా అవి బయటికి రాలేదు.
బాగా తిరగడంతో అలసిపోయి కొంచెంసేపు పడుకుందామనుకున్నాడు. చెట్టు కింద అమ్మ ఒడిలో పడుకున్నాడు. చల్లటి గాలికి చెట్టు ఆకులు రాలాయి. అప్పుడు తల ఎత్తి చెట్టును చూశాడు. అది అవిశాకు చెట్టు. వెంటనే అతడికి ఓ ఆలోచన వచ్చింది.
‘మన గొర్రెలు తిండికి తిమ్మరాజులు, పనికి పోతురాజులు కదా, వాటికి అవిశాకు అంటే ఇష్టం కదా. ఈ ఆకుల్ని కోసి గుహల ముందర పెడదాం. వాటిని తినడానికైనా అవి బయటికి వస్తాయి’ అని అనుకున్నాడు. అమ్మకు విషయం చెప్పాడు. అమ్మ కూడా ‘సరే’ అంది.
గబగబా చెట్టెక్కి కొమ్మలు విరిచి కింద వేశాడు. వాటిని తీసుకెళ్ళి సుభద్రక్క గుహల ముందు పరచింది.
గుహల్లో దాక్కొని ఉన్న గొర్రెలకు అవిశాకు వాసన తగిలింది. కొంచెంసేపు మేకపోతు గాంభీర్యంతో గమ్మున ఉండిపోయాయి. అయితే ఎక్కువసేపు ఉండలేక ఓ గొర్రె అవిశాకు కోసం బయటికి వచ్చింది. దాని వెనుకే ఇంకో గొర్రె కూడా వచ్చేసింది.
వాటికోసమే ఎదురు చూస్తున్న అమ్మాకొడుకులిద్దరూ లటుక్కున ఆ గొర్రెలను పట్టుకుని మందలోకి చేర్చారు. ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకుంది సుభద్రక్క. కొడుకు తెలివికి సంబరపడింది.
చింత చెట్టునుంచి చింత కొమ్మ విరిచి దాంతో వాటిని నాలుగు దెబ్బలేశాడు కుబేరుడు.
ఇద్దరూ మందను తోలుకుంటూ, లేత చింతకాయలు తింటూ ఇంటికి చేరారు.
– ఆర్‌.సి.కృష్ణస్వామిరాజు, 9393662821

]]>
పిసినారి నక్క https://navatelangana.com/pissed-fox/ Sat, 17 Feb 2024 17:31:00 +0000 https://navatelangana.com/?p=230485 పిసినారి నక్కఒక అడవిలో ఒక పిసినారి నక్క వుండేది. అది మూటలు మూటలు సంపాదిస్తా వున్నా, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టేది కాదు. అర్ధ రూపాయ మిగులుతాది అంటే ఐదు మైళ్ళు అయినా నడుచుకుంటా పోయేరకం. ఒకసారి ఆ నక్క చూసుకోక ఒక అరటిపండు తొక్క మీద కాలేసింది. అంతే… సర్రునజారి కింద పడింది. పడడం పడడం ఒక పెద్ద రాయిమీద పడడంతో కాలు కలుక్కుమంది. పైసలు ఖర్చు పెట్టడం ఇష్టం లేక వేడినీళ్లతో కాపడం పెట్టుకుంది. అమృతాంజనం బాగా పట్టించి దానంతట అదే తగ్గుతుందిలే అనుకొంది. కానీ నొప్పి కొంచెం కూడా తగ్గకపోగా సాయంకాలం అయ్యేసరికి మరింతగా పెరిగి వాపు వచ్చింది. దాంతో నొప్పికి తట్టుకోలేక భయపడి డాక్టర్‌ దగ్గరికి పోయింది.
డాక్టర్‌కు ఆ నక్క పీనాసితనం గురించి బాగా తెలుసు. ఇంతకుముందు కూడా డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా రెండుసార్లు ఎగ్గొట్టింది. దాంతో ”చూడడానికి ఒక వంద రూపాయలు, మందులకు ఒక వంద రూపాయలు… మొత్తం రెండువందల రూపాయలు అక్కడ పెడితే చూస్తాను. లేదంటే లేదు” అని మొగమాటం లేకుండా మొహమ్మీదనే చెప్పాడు. పిసినాసి నక్క ”రెండు వందలా మరీ ఎక్కువ. ఏదో ఇరవై రూపాయలు అయితే ఇస్తాను” అంది.
ఆ మాటలతో డాక్టర్‌కు చిర్రెత్తుకొచ్చింది. ”ఇరవై రూపాయలకు మందులు కాదు కదా కనీసం ఆ మందులపై ఉన్న కాగితం కూడా రాదు. పో ఇక్కనుంచి. నన్ను విసిగించక” అన్నాడు కోపంగా. డాక్టర్‌ ముందు వరుసగా మందుల సీసాలు ఉన్నాయి. వాటిపై జలుబు మందులు, నొప్పి మందులు, జ్వరం మందులు… ఇలా అవి దేనికి వాడతారో వాటి పేర్లు రాసి వున్నాయి.
దొంగనక్క కన్ను ఆ మందులపై పడింది. అదే సమయంలో ఒక కుందేలు కుంటుకుంటూ డాక్టర్‌ దగ్గరికి వచ్చింది. డాక్టరు వంగి ఆ కుందేలు కాలును చూస్తావుంటే దొంగనక్క ఇదే సందనుకొని లటుక్కున మూత తెరిచి నాలుగు నొప్పి తగ్గే మాత్రలు తీసి జేబులో వేసుకొని ”సరే డాక్టర్‌… ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు. ఇంటికిపోయి తీసుకొని మరలా వస్తా” అంటూ అక్కడి నుంచి సంబరంగా బయటికి వచ్చింది. కానీ నక్క మందులు తీయడం కుందేలు చూసి డాక్టర్‌ కు చెప్పింది. డాక్టర్‌ బయటికి వచ్చి గట్టిగా ఆగమని నక్కను పిలిచాడు. కానీ నక్క వినపడనట్లుగా వెనక్కి తిరిగి చూడకుండా కుంటుకుంటా వేగంగా ఇంటికి వెళ్ళిపోయింది.
ఇంటికి పోయాక ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదని సంబరపడుతూ ఒక మాత్ర తీసి వేసుకుంది. అరగంట దాటాక దాని కడుపు గుడగుడగుడ మనసాగింది. గంట దాటేసరికి కడుపులో సునామీలు మొదలయ్యాయి. చెంబు తీసుకొని బయటకురికింది. అరగంటకోసారి ఉరకడం ఉరకడం కాదు. నీరసంతో అడుగు తీసి అడుగు వేయలేకపోతోంది.
అంతలో కుందేలు అక్కడకు వచ్చింది. ”నక్క మామా… ఆ సీసాలో ఉన్నవి నొప్పి తగ్గే మాత్రలు కాదంట. ఎవరైనా తెలియకుండా దొంగతనం చేస్తే బుద్ధి రావడానికి డాక్టర్‌ అన్ని సీసాలలోనూ బేదులు పెట్టే మాత్రలు వుంచాడంట. జాగ్రత్త. నీకు చెప్పమన్నాడు” అని అసలు విషయం చెప్పి వెళ్ళిపోయింది.
నక్క ఏడుపు మొహంతో బేదులు తగ్గడానికి మెంతులు కొన్ని తిందామని డబ్బా కోసం గూట్లో చేయి పెట్టింది. అక్కడ ఒక తేలు వుంది. అది చేయి పెట్టడం ఆలస్యం టపీమని వేలుమీద ఒక్కటి వేసింది. అంతే చేయి సుర్రుమనేసరికి అదిరిపడి ఎగిరి కిందపడింది. ఒకపక్క చేయి నొప్పి, మరొక పక్క కడుపునొప్పి, ఇంకొకపక్క కాలు నొప్పి… తట్టుకోలేక గిలగిలా కొట్టుకుంటా వుంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి ఉరుక్కుంటా పోయి డాక్టర్‌ను పిలుచుకొని వచ్చారు.
డాక్టరు ఆ దొంగనక్కనున చూసి ”చూడు… ఇంత రాత్రిపూట అదీగాక ఇంటికి వచ్చి చూస్తున్నా కాబట్టి నాకు ఐదు వందలు ఫీజు ఇవ్వాలి. అలాగే మూడు నొప్పులు తగ్గడానికి మూడు రకాల మాత్రలకు మరొక ఐదు వందలు. మొత్తం వెయ్యి ఇస్తానంటే వైద్యం మొదలుపెడతా.. లేదంటే లేదు” అంది.
పిసినాసి నక్క ఆలోచిస్తా వుంటే ”దాచిపెట్టాల్సిన చోట దాచిపెట్టాలి. ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చుపెట్టాలి. అంతేగానీ ప్రతిచోటా పిసినాసితనం పనికిరాదు. సచ్చినాక ఈ మూటల్లో ఒక్క రూపాయి గూడా నీ వెంట రాదు. ఇలాగే ఇంకాసేపు వుంటే నొప్పి ఎక్కువై సచ్చినా చస్తావు” అంటూ చుట్టూవున్న జంతువులన్నీ తలా ఇంత గడ్డి పెట్టాయి.
నక్క తన పిసినాసితనానికి సిగ్గుపడుతూ డాక్టర్‌ చేతిలో వెయ్యి రూపాయలు పెట్టింది.
– డా||ఎం.హరికిషన్‌, 94410 32212

]]>
మార్గ దర్శి https://navatelangana.com/guide/ Sat, 10 Feb 2024 18:07:01 +0000 https://navatelangana.com/?p=225517 మార్గ దర్శి”నాన్నా, మీ స్నేహితుడు దుర్గయ్య అంకుల్‌ కథారచయిత కదా, ఆ అంకుల్‌ బంధువుల పెళ్లి కోసం రేపు మన ఊరు వస్తున్నట్టు చెప్పారు. ఒకసారి మన ఇంటికి తీసుకొస్తారా” తొమ్మిదవ తరగతి చదువుతున్న నా కూతురు సృజన అడిగింది.
”ఎందుకు” అడిగాను.
”ఆ అంకుల్‌ దగ్గర కథలు ఎలా రాయాలో అడిగి తెలుసుకొంటాను” అంది సృజన.
”చూడమ్మా, కథలు కాకరకాయలు అంటూ సమయం వృథాచేయవద్దు. చదువుపైన శ్రద్ద వహించు. ఇప్పుడు చదువులో అరవై నుంచి డెభై శాతం మార్కులు మాత్రమే తెచ్చుకొంటున్నావు. ఆ మార్కులు సరిపోవు. చదువు పూర్తయ్యాక ఎన్ని కథలైనా రాయి” అన్నాను
”ముందు నీ చదువులగురించి ఆలోచించు. తరువాత కథలు చూడు. నీకంతగా తీరిక ఉంటే నాకు వంట పనుల్లో సాయం చేయి” అంది నా భార్య.
”అమ్మా…! నువ్వు చెప్పిన పనులు ఎప్పుడైనా చేయకుండా వున్నానా?” అలిగి అక్కడి నుండి వెళ్లిపోయింది సృజన.
కొన్ని నెలలు గడిచాయి.
ఆ రోజు ఆఫీసులో వున్నప్పుడు సెల్‌ ఫోను రింగ్‌ కాగానే తీసుకొన్నాను.
”హలో బాగున్నావా రా? ఇప్పుడు ఎక్కడ వున్నావు” అంటూ దుర్గయ్య ఫోనులో అడిగాడు.
” ఆఫీసులో వున్నాను దుర్గయ్యా” అన్నాను
”ఒరేరు, మొదట నీకు కంగ్రాట్స్‌ చెప్పాలి. ఈ మధ్య బాల రచయితల వెనుక ఎక్కువగా బడి మాష్టారులు మార్గదర్శిగా వుంటున్నారు. తల్లిదండ్రులు ఎక్కువగా ప్రోత్సహించడం లేదు. నీవు మీ అమ్మాయి సృజన రచయిత కావడానికి నీవే మార్గదర్శి అనుకొంటున్నాను. బాలల కథల పోటీలో మీ అమ్మాయికి రెండవ బహుమతి వచ్చింది” అన్నాడు
”సారీ దుర్గయ్యా , ఆరునెలల క్రితం రచనల విషయమై మా సృజన నిన్ను అడగాలనుకొంది. నేనే వ్యతిరేకించాను ఆ తరువాత సృజన నా దగ్గర రచనల గురించి మాట్లాడ లేదు. నీవు మీ బడిలో బాలల రచయితలను ప్రోత్సహిస్తూ మార్గదర్శి అయినట్లు, ఇక్కడ బడిలో మాస్టారు ఎవరో మా సృజనకు మార్గదర్శిగా ప్రోత్సహించారు. ఇప్పుడే వెళ్లి ఆ మాస్టారు ఎవరో తెలుసుకొని కృతజ్ఞతలు తెలుపుకొంటాను” సంతోషంతో అన్నాను.
– ఓట్ర ప్రకాష్‌ రావు, 09787446026 

]]>
ప్రతిభకి పట్టం https://navatelangana.com/the-title-of-talent/ Sat, 03 Feb 2024 17:51:58 +0000 https://navatelangana.com/?p=220272 ప్రతిభకి పట్టంఅసిక్నీ నదీతీరాన ఏనుగు ఒక గురుకులాన్ని నడుపుతోంది. ఆ అడవిలోని సమస్త పశుపక్ష్యాదుల పిల్లలూ అక్కడే విద్యనభ్యసించేవి. మృగరాజు కుమారుడైన యువకిశోరం కూడా అక్కడే చదువుకునేది. ఏనుగు ఉత్తమ గురువని ప్రసిద్ధి పొందటంతో ఇరుగుపొరుగు వనవాసులు కూడా తమ బిడ్డలను అక్కడే చేర్చి, చదివించేవి. ఆశ్రమంలోని విద్యార్ధులలో ఒక జింకపిల్ల అత్యుత్తమ ప్రతిభ కనబరిచేది. ఎప్పుడూ ప్రథమ స్ధానంలో ఉత్తీర్ణత సాధించి, గురువు ప్రశంసలు, సహాధ్యాయిల అభినందనలు అందుకునేది. ఇది పిల్ల సింహానికి కంటగింపుగా మారింది. దానికి ఎప్పుడూ ద్వితీయ స్ధానమే లభించేది. ఎంత ప్రయత్నించినా, పైచేయి సాధించలేక పోవటంతో జింక మీద ఈర్ష్య, గురువు మీద అనుమానం కలిగాయి. దానికి నక్కపిల్ల చెప్పుడు మాటలు ఆజ్యం పోసాయి.
”మిత్రమా! నువ్వు కాబోయే మహారాజు. అన్ని విషయాలలో అగ్రగామిగా ఉండాలి. అప్పుడే తగిన విలువ, గౌరవం దక్కుతాయి. లేకపోతే నీతో పాటు, మహారాజుకీ చిన్నతనం అవుతుంది. కాబట్టి ఇప్పుడే గురువు పక్షపాత బుద్ధిని నిలదీయాలి” అంటూ నూరిపోసింది. తన మనసుకు నచ్చిన మాటలు చెప్పిన నక్కపిల్లని మెచ్చుకుని, సరాసరి గురువుని సమీపించి ఇలా అంది పిల్ల సింహం… ”గురువర్యా! నేను ఎంత ప్రయత్నించినా జింకపిల్లని అందుకోలేక పోతున్నా! అహోరాత్రులు కృషి చేసి చదివినా అగ్రస్ధానం ‘అందని ద్రాక్ష’ గా మారింది. కాబోయే మహారాజుని కాదని, ఒక సామాన్యమైన జింకపిల్లపై మీరు శ్రద్ధ చూపించటం భావ్యం కాదు” అంది. ఆ దుడుకు మాటలకి ఏనుగు మనసులో నొచ్చుకున్నా, వెంటనే తేరుకుని ”నాయనా! విద్యార్జన విషయంలో పేదా, ధనిక తేడాలు ఉండవు. చిన్నా,పెద్దా తారతమ్యాలు లేవు. ‘శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం’ అన్నారు పెద్దలు. కాబట్టి జింకపిల్ల చూపించినటువంటి ధ్యాస నువ్వు కూడా కనబరిస్తే ప్రధమస్ధానం నీకే దక్కుతుంది” అంది. కానీ ఆ మాటలు పిల్ల సింహాన్ని సమాధానపరచ లేకపోయాయి.
”లేదు గురువర్యా! నేను నిద్రాహారాలు మాని, కఠోర దీక్షతో చదువుతున్నాను. అయినా నాకు తగిన ఫలితం అందలేదు. కావాలంటే నక్కపిల్లని అడగండీ” అంది. వెంటనే నక్కపిల్ల ”నిజమే! గురువర్యా! పిల్లసింహం ఏకాగ్రతతో చదువుతూ పరిసరాలను, మరిచిపోతుంటే, నేనే గుర్తు చేసి, వేళకి ఆహారాన్ని అందిస్తున్నాను” అంది వంతపాడుతూ. ఏనుగు భారంగా నిశ్వసించి ”నాయనా! స్వీయ లోపంబులెరుగుట పెద్ద విద్య’ అని లోకోక్తి. నీ బలహీనత ఎరుగక తొందరపడి మాట్లాడుతున్నావు” అంది. పిల్ల సింహం అయోమయంగా చూసి, ”ఏమిటా లోపం గురువర్యా” అంది.
”నువ్వు మిగిలిన అంశాలలో మెరుగ్గానే ఉన్నా, ఒక్క లెక్కలలో మాత్రం చాలా బలహీనంగా ఉన్నావు. గణితంలో మరింత సాధన పెంచాలి. దానికి ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలి” అంది చిరునవ్వుతో.
పిల్లసింహం బుద్ధిగా తలాడించి ”అలాగే గురువర్యా!” అంటూ అప్పటినుండి ప్రత్యేక తరగతులకు హాజరు కావటం ప్రారంభించింది. ఎలాగైనా జింకపిల్లని అధిగమించాలనే కృత నిశ్చయంతో కఠోర శ్రమ చేసింది. కానీ జింకపిల్లపై ఆధిక్యం సాధించలేక పోయింది. విచిత్రమేమిటంటే జింకపిల్ల ప్రత్యేక తరగతుల అవసరం లేకుండా మామూలుగానే చదువుతోంది. దానితో పిల్ల సింహం కుంగిపోయి ”మిత్రమా! నేనిక చదువు చాలించాలను కుంటున్నాను” అంటూ నిర్వేదంగా పలికింది. నక్కపిల్ల ఓదార్చుతూ ”బాధ పడకు మిత్రమా! రాబోయే అర్ద సంవత్సరపు పరీక్షలలో నువ్వు గురుకులానికే ప్రధముడిగా నిలుస్తావు. నామీద భారం వేసి, నిశ్చింతగా చదువు. నేను చూసుకుంటాను” అంటూ భరోసా ఇచ్చింది. ఆ మాటలకు పిల్లసింహం ఊరడిల్లి మళ్ళీ సాధన చేయసాగింది.
కొన్ని దినాలకు పరీక్ష వచ్చింది. నక్కపిల్ల ఇచ్చిన మాట నిలబెట్టు కుంటుందనే ధీమాలో పిల్లసింహం ఉంది. అన్నట్టుగానే తన బాధ్యత నెరవేర్చింది నక్కపిల్ల. జింకపిల్ల వ్యాహ్యాళికి పోయి వస్తున్న మార్గంలో రెండు నక్కలు కాపు కాసాయి. రాగానే దురుసుగా ”నువ్వు ఈ పరీక్షలు రాయటానికి వీలులేదు!” అంటూ దౌర్జన్యం చేసాయి. జింకపిల్ల దీనంగా చూసి ”పరీక్ష రాయకపోతే చదువు వృధా అవుతుంది. అయినా నేను రాయటం వల్ల మీకేంటి నష్టం?” అంది. నక్కలు వికటంగా నవ్వి ”గురుకులంలో ఎప్పుడూ నువ్వే ప్రధమ స్ధానంలో నిలుస్తున్నావు. ఎవరికీ అవకాశం రానీయటం లేదు. నిన్ను అడ్డు తొలగిస్తే కాబోయే రాజైన పిల్లసింహం అగ్రస్ధానం సాధిస్తుంది” అన్నాయి. జింకపిల్ల విస్మయపడి ”గొప్ప స్ధానాన్ని కష్టపడి సాధించాలి గాని, ఇలా అడ్డదారులు తొక్కికాదు” అంది.
”అవన్నీ మాకు తెలియవు. నువ్వు మర్యాదగా చెప్పినట్టు చేస్తావా? లేదా?” అంటూ గద్దించాయి నక్కలు. జింకపిల్ల ”నన్ను పరీక్ష రాయనివ్వండి!” అంటూ ప్రాధేయపడటంతో నక్కలు ఆగ్రహంతో దాడి చేసాయి. తీవ్రంగా కొట్టి కొన ఊపిరితో వదిలి వెళ్ళి పోయాయి.
జింక పిల్ల రానందుకు నక్కపిల్ల సంతసించింది. ఈసారి పరీక్షల్లో ప్రధమ శ్రేణిలో నిలిచి, తన చిరకాల వాంఛ నెరవేరటం ఖాయమని హాయిగా నిట్టూర్చింది పిల్లసింహం. ఎప్పుడూ పరీక్షలు మానని జింకపిల్ల, ఈసారి రాయకపోవటంతో ‘ఏమి జరిగిందోన’నే ఆందోళనకి గురైంది ఏనుగు. పరీక్ష పూర్తయ్యాక నక్కపిల్ల, పిల్లసింహం ప్రవర్తన గమనించి కీడు శంకించింది. మిగిలిన విద్యార్ధులతో వెదికించింది. చివరికి ఒక కాకి, జింకపిల్లని కోనేటికి పోయే దారిలో కనుగొంది. దాని కబురు విని హుటాహుటిన అక్కడికి చేరి, స్పహతప్పి పడి ఉన్న జింకపిల్లని చూసి, ఆశ్రమానికి తీసుకొచ్చి వైద్యం చేయించింది. కోలుకున్న జింక జరిగింది పూసగుచ్చటంతో ఆగ్రహానికి గురైన ఏనుగు, సరాసరి మృగరాజుని చేరి, జరిగిన దురంతంపై ఫిర్యాదు చేసింది.
సంగతి విన్న మృగరాజు మండి పడింది. పిల్ల సింహం ‘నాకేమీ తెలియద’ని వాదించింది, మొదట బుకాయించినా, తర్వాత భయపడిన నక్కపిల్ల ”మా గురువర్యులు ప్రశ్నా పత్రాన్ని జింకపిల్లకి ముందే వెల్లడించి, ప్రథమ స్ధానం పొందటానికి సాయం చేస్తున్నారు. కష్టపడి చదువుతున్న యువరాజు ద్వితీయ స్ధానంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అందుకే ఇలా చేసాను” అంటూ ఆరోపణ, సమర్దనా మిళితం చేసింది. అది విన్న గురువు ఏనుగు ఆవేదన చెందింది. మృగరాజు కాసేపు తల పంకించి ”సరే! ఇందులో నిజానిజాలు ఇప్పుడే తేలుస్తాం. గురువర్యా! తక్షణం వీరిద్దరికీ చిన్న ప్రశ్నాపత్రం తయారు చేసి ఇవ్వండి. మా సమక్షంలో రాస్తారు” అంది. వెంటనే ఏనుగు అలా చేయగానే పిల్లసింహం, జింకపిల్ల పరీక్ష రాసాయి. అందులో జింక పిల్లకి తొంభైశాతం, పిల్ల సింహానికి ఎనభై శాతం ఫలితాలు వచ్చాయి. దాంతో నక్కపిల్లా, పిల్లసింహం సిగ్గుతో తలదించుకున్నాయి.
మృగరాజు ఆగ్రహంతో లేచి ”నేరం రుజువైనందున చేసిన నక్కపిల్లకి, ప్రేరేపించిన యువరాజుకీ మన అడవి చట్టం ప్రకారం కఠిన దండన…” అంటుంటే ఏనుగు అడ్డుపడింది. ”మహారాజా! తెలియక తప్పు చేసిన చిన్న పిల్లలని క్షమించండి. మరోసారి ఇలా జరగదని నేను భావిస్తున్నాను” అని విన్నవించింది. ఆ విజ్ఞాపనని అయిష్టంగా మన్నించిన మహారాజు ”ప్రతిభని ప్రోత్సహించాలి గాని, పాడు చేసి పైకి రావాలని ప్రయత్నించ కూడదు. ఇంతటి ఉత్తమ విద్యార్ధిని గౌరవించటం మనకి ఎంతో గర్వకారణం అవుతుంది. మా తదనంతరం యువరాజు పరిపాలనలో మహామంత్రి పదవిలో జింక పిల్లని నియమిస్తాం” అంటూ వాగ్దానం చేసింది. అది విన్న కొలువుకూటం హర్షాతిరేకంతో పులకించింది.
– డా||కౌలూరి ప్రసాదరావు, 7382907677

]]>