Cinema Archives - https://navatelangana.com/category/cinema/ Thu, 17 Apr 2025 19:09:48 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Cinema Archives - https://navatelangana.com/category/cinema/ 32 32 అందరికీ కనెక్ట్‌ అయ్యే ‘మధురం’ https://navatelangana.com/madhuram-to-connect-to-everyone/ Thu, 17 Apr 2025 19:09:25 +0000 https://navatelangana.com/?p=548387 Uday Raj‘ఆచార్య, ఆర్‌ఆర్‌ఆర్‌ ‘ లాంటి పలు క్రేజీ చిత్రాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించి.. ‘మధురం’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు ఉదరు రాజ్‌. రాజేష్‌ చికిలే దర్శకత్వం వహించారు. వైష్ణవి సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌ టైన్మెంట్‌ పతాకంపై యం.బంగార్రాజు నిర్మించారు. ‘ఎ మెమొరబుల్‌ లవ్‌’ ట్యాగ్‌ లైన్‌తో టీనేజ్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో ఉదరు రాజ్‌ చిత్ర విశేషాలను గురించి మీడియాతో మాట్లాడుతూ, ‘చిన్నప్పట్నుంచీ చిరంజీవి పై ఇష్టం ఉండేది. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. తర్వాత ‘ఆచార్య’ షఉటింగ్‌ టైమ్‌లో ఆయన మాట్లాడటం గ్రేట్‌ ఎక్స్‌పీరియెన్స్‌. 12 ఏళ్లగా ఇండిస్టీలో ఉన్నా. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా వర్క్‌ చేశా. చాలా సినిమాల్లో బ్యాక్‌గ్రౌండ్‌ ఆర్టిస్ట్‌గా నటించాను. బంగార్రాజు సపోర్ట్‌తో ఈ చిత్రంలో హీరోగా చేశా. దర్శకుడు రాజేష్‌ చికిలేతో నాకు ఎప్పట్నుంచో పరిచయం ఉంది. ఆయన ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్‌ అయ్యాను. నైంటీస్‌ బ్యాక్‌డ్రాప్‌ స్టోరీ ఇది. పదవ తరగతి అమ్మాయి, తొమ్మిదో తరగతి అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ. చాలా అందంగా ఉంటుంది. ఇందులో మూడు డిఫరెంట్‌ వేరియేషన్స్‌లో కనిపిస్తాను. చిన్న పిల్లాడిగా, స్కూల్‌ స్టూడెంట్‌గా, మిడిల్‌ ఏజ్‌ వ్యక్తిగా మూడు గెటప్స్‌ వేయడానికి చాలా కష్టపడ్డా. నేను చదువుకుంది జెడ్‌పీహెచ్‌ స్కూల్‌లోనే కావడంతో అప్పటి విశేషాలను గుర్తు చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. నైంటీస్‌లో స్కూల్స్‌ ఎలా ఉండేవి, అప్పటి పిల్లలు ఎలా బిహేవ్‌ చేశారనే వాటిపై కొన్ని రీసెర్చ్‌లు చేశాం. స్కూల్‌కి సైకిల్‌ వేసుకెళ్లి.. అమ్మాయి ముందు బ్రేక్‌ కొట్టడం, చేతులు వదిలేసి తొక్కడం లాంటి సీన్లతో పాటు విలేజ్‌ నేటివిటీ, వింటేజ్‌ సన్నివేశాలు అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటాయి. 90ల జనరేషన్‌కు పాత విషయాలను గుర్తుచేసేలా ఉంటుంది. దర్శకుడు రాజేష్‌ చికిలే ఈ కథను చాలా అందంగా తీర్చిదిద్దారు’ అని అన్నారు.

]]>
‘ఓదెల 2’ తాండవం మొదలైంది https://navatelangana.com/odela-2-has-begun/ Thu, 17 Apr 2025 19:08:14 +0000 https://navatelangana.com/?p=548384 Odela 2తమన్నా భాటియా లేటెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఓదెల 2’. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కి సీక్వెల్‌ ఇది. సంపత్‌ నంది సూపర్‌ విజన్‌లో అశోక్‌ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్‌, సంపత్‌ నంది టీమ్‌వర్క్స్‌పైడి మధు నిర్మించిన ఈ చిత్రంలో తమన్నా నాగ సాధువుగా అదరగొట్టారు. వేసవిలో బిగ్గెస్ట్‌ ఎట్రాక్షన్‌లలో ఒకటిగా విడుదలైన’ ఓదెల2 ‘అన్ని చోట్ల బ్లాక్‌ బస్టర్‌ రెస్పాన్స్‌ తో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. సంపత్‌ నంది మాట్లాడుతూ, ‘మేము ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసిన ఆడియన్స్‌కి థాంక్యూ. మేము ఆశించిన రెస్పాన్స్‌ ఆడియన్స్‌ నుంచి రావడం చాలా ఆనందంగా ఉంది. తమన్నా నాగ సాధువుగా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయినప్పటి నుంచే ఈ సినిమాపై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. తన పెర్ఫార్మన్స్‌ ఈ సినిమాకి హైలైట్‌గా ఉండబోతుందని మేము ముందే చెప్పాము. అది ఈరోజు ఆడియన్స్‌ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. తమన్నా, వశిష్ట సింహ మధ్య పోటాపోటీ పెర్ఫార్మన్స్‌ ఉంటుందని చెప్పాము. అది ఈరోజు ఆడియన్స్‌ విట్నెస్‌ చేస్తున్నారు. ఇది ముఖ్యంగా లేడీస్‌తో, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. ఈరోజు ఒక ప్రీమియర్‌ లాగా మొదలైంది. శుక్రవారం నుంచి ఈ సినిమా సునామీ మొదలు కాబోతుంది. శివశక్తిగా తమన్నా చేసే అసలైన రచ్చ శుక్రవారం నుంచి మొదలు కాబోతుంది. ఈ వారాంతం మీ ఫ్యామిలీతో కలిసి వచ్చి ఈ సినిమాని అద్భుతంగా ఎంజారు చేయవచ్చు. ఈ సినిమాలో సైకిల్‌ ఎపిసోడ్‌, క్లైమాక్స్‌లో వచ్చే రెండు సర్ప్రైజ్‌ ఎలిమెంట్స్‌, అలాగే మరికొన్ని సీక్వెన్స్లు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేయబోతున్నాయి. ఒక మంచి ఎక్స్పీరియన్స్‌తో థియేటర్స్‌ నుంచి బయటికి రండి. ఈ సినిమాకి చాలా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ ఉంటాయి. ఈ సినిమాని దీవించిన శివునికి, ప్రేక్షక దేవుళ్ళకి మనస్ఫూర్తిగా కతజ్ఞతలు’ అని అన్నారు. ప్రొడ్యూసర్‌ డి మధు మాట్లాడుతూ,’సుదర్శన్‌ 35 ఎంఎంలో ఈ సినిమాని ప్రేక్షకులతో కలిసి చూశాను. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా అందరికీ కనెక్ట్‌ అయింది. ముఖ్యంగా లేడీస్‌ చాలా బాగా కనెక్ట్‌ అయ్యారు. డివైన్‌ ఫుల్‌ క్యారెక్టర్‌లో తమన్నా అద్భుతంగా చేశారు’ అని అన్నారు.

]]>
పవర్‌ఫుల్‌ కథతో ‘డియర్‌ ఉమ’ https://navatelangana.com/dear-uma-with-powerful-story/ Thu, 17 Apr 2025 19:06:43 +0000 https://navatelangana.com/?p=548380 Dear Umaసుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా రూపొందించిన ‘డియర్‌ ఉమ’ చిత్రం నేడు (శుక్రవారం) రాబోతోంది. ఈ చిత్రంలో పథ్వీ అంబర్‌ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్‌ ప్రొడ్యూసర్‌గా నగేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా నితిన్‌ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్‌ మహాదేవ్‌ స్క్రీన్‌ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రచయిత, నిర్మాత, హీరోయిన్‌ సుమయ రెడ్డి మాట్లాడుతూ, ‘ తెలుగమ్మాయిలు ఇప్పుడిప్పుడే ఇండిస్టీలోకి ఎక్కువగా వస్తున్నారు. నేను ఓ అడుగు ముందుకు వేసి సినిమాని నిర్మించాను. నేను రాసిన, తీసిన షార్ట్‌ ఫిల్మ్‌కు మంచి ఆదరణ దక్కింది. ఆ తరువాత సాయి రాజేష్‌ తో మళ్లీ ‘డియర్‌ ఉమ’కు పని చేశాం. నాకు అండగా నిలిచిన మధు, చక్రవర్తిలకు థాంక్స్‌. నవీన్‌ వల్లే రదన్‌ మా ప్రాజెక్టులోకి వచ్చారు. అందరూ చూసి సినిమాని విజయవంతం చేయండి’ అని అన్నారు. పథ్వీ అంబర్‌ మాట్లాడుతూ,’ఈ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. నాకు ఎంతో సపోర్ట్‌ చేసిన టీంకు థాంక్స్‌. నా దియా చిత్రాన్ని ఇక్కడ అందరూ ఆదరించారు. సుమయ రెడ్డి ఈ చిత్రం కోసం చాలా కష్టపడింది’ అని చెప్పారు. డైరెక్టర్‌ సాయి రాజేష్‌ మాట్లాడుతూ,’ బుర్రకథ’ చిత్రానికి అసోసియేట్‌ డైరెక్టర్‌ గా పని చేశాను. అక్కడే సుమయ రెడ్డిని కలిశాను. ఆ తరువాత ఓ షార్ట్‌ ఫిల్మ్‌కి పని చేశాం. కరోనా టైంలో సుమయ రెడ్డి ఓ కథ రాశారు. అది నాకు చాలా నచ్చింది. అలా ఈ చిత్రం మొదలైంది. సమాజానికి ఓ సందేశాన్ని ఇవ్వాలని ఆమె సినిమాను నిర్మించారు’ అని తెలిపారు.

]]>
నయా క్రైమ్‌-కామెడీ ఎంటర్‌టైనర్‌ https://navatelangana.com/naya-crime-comedy-entertainer/ Wed, 16 Apr 2025 16:14:53 +0000 https://navatelangana.com/?p=547728 A new crime-comedy entertainerడైరెక్టర్‌ త్రినాథరావు నక్కిన తన అప్‌ కమింగ్‌ క్రైమ్‌-కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’తో మూవీ ప్రొడక్షన్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేయడంతోపాటు ‘కార్తికేయ -2’ వంటి చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్‌ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్‌ గొల్లమారిని కూడా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. నక్కిన నెరేటివ్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి వి.చూడమణి సహ నిర్మాత. ఈ సినిమా ఈనెల 25న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు. నిర్మాత త్రినాథ్‌ రావు నక్కిన మాట్లాడుతూ, ‘కార్తీక్‌ చెప్పిన కాన్సెప్ట్‌ నాకు చాలా నచ్చింది. తను చెప్పిన కాన్సెప్ట్‌ అసలు క్రైమ్‌ లేని ఊరు. ఒక్క కేసు కూడా ఫైల్‌ అవ్వలేదు. నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. దాన్ని బేస్‌ చేసుకుని ఒక కథ చేశాం. చోర్య పాఠం అంటే దొంగతనం చేయడానికి ట్రిక్కులు కాదు. ఒక అవసరం కోసం ఒక దొంగతనం చేయాల్సి వస్తుంది. అది చేస్తున్న ప్రాసెస్‌లో ఒక పాఠం నేర్చుకుంటాడు. ఒక టన్నల్‌ తవ్వి దాని గుండా వెళ్లే క్రమంలో జరిగే కథ. ఇది టెక్నికల్‌గా నన్ను చాలా ఇంప్రెస్‌ చేసింది. దీనికి అద్భుతమైన లవ్‌ స్టోరీ రాసాడు నిఖిల్‌. దేవ్‌ జాండ్‌ బెస్ట్‌ సాంగ్స్‌ ఇచ్చాడు. పెద్ద సినిమా విజువల్స్‌లా ఉంటాయి. ఇది ఒక డార్క్‌ కామెడీ ఫిలిం. చాలామంది డిస్ట్రిబ్యూటర్స్‌ ఈ సినిమా చూశారు. అందరూ ముక్తకంఠంతో సినిమా విజయం ఖాయమన్నారు’ అని చెప్పారు.

]]>
ఆద్యంతం వినోదభరితం https://navatelangana.com/the-end-is-entertaining-4/ Wed, 16 Apr 2025 16:13:44 +0000 https://navatelangana.com/?p=547724 Entertaining throughoutప్రియదర్శి టైటిల్‌ రోల్‌ ప్లే చేసిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ‘జెంటిల్‌ మ్యాన్‌, సమ్మోహనం’ చిత్రాల అనంతరం ఇంద్రగంటి మోహనకష్ణ – శివలెంక కష్ణప్రసాద్‌ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ,’ఈ సినిమా 25 తేదీన రిలీజ్‌ అవుతున్నది. జెంటిల్‌మ్యాన్‌, సమ్మోహనం తర్వాత మోహన్‌ కష్ణతో మరోసారి సినిమా చేశాను. ఈ సినిమా అవుట్‌ పుట్‌ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమా హిట్‌ కావడం గ్యారెంటీ. ప్రియదర్శి, వెన్నెల కిషోర్‌, వైవా హర్ష, అవసరాల శ్రీనివాస్‌, వడ్లమాని శ్రీనివాస్‌, వీకే నరేష్‌ ఈ సినిమాకు అస్సెట్‌. ఓ మంచి ఫ్యామిలీ సినిమాను డెలివరీ చేస్తున్నాం’ అని అన్నారు. ‘నేను స్వతహాగా జాతకాలు నమ్మను. కానీ ఈ సినిమా చేసిన తర్వాత జాతకాలను నమ్మడం మొదలుపెట్టాను. సారంగపాణి జీవితంలో ట్విస్టులు ఈ సినిమాలో వినోదాన్ని పండిస్తుంది’ అని హీరోయిన్‌ రూపా చెప్పారు. దర్శకుడు ఇంద్రగంటి మోహన కష్ణ మాట్లాడుతూ, ‘క్రైమ్‌ అంశంతో కామెడీ సినిమాను అందించాం. నిర్మాత కష్ణ ప్రసాద్‌ ఎంతో ప్రోత్సాహం అందించారు. కేవలం తెలుగు నటీనటులు నటించిన అచ్చ తెలుగు సినిమా ఇది. మిమ్మల్ని అన్ని రకాలుగా మెప్పిస్తుంది’ అని అన్నారు.
‘ఇంద్రగంటితో పనిచేయాలనే కోరిక నెరవేరింది. మండు వేసవిలో చల్లని ప్రశాంతమైన వాతావరణం కలిగితే ఎంత ఆనందం ఉంటుందో.. ఈ సినిమా కూడా అలాంటి అనుభూతిని కలిగిస్తుంది. వినోదంతో కూడిన మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. తప్పకుండా థియేటర్‌లో చూడండి’ అని హీరో ప్రియదర్శి చెప్పారు. వెన్నెల కిషోర్‌ మాట్లాడుతూ,’పుష్పక విమానం’ టాకీగా వస్తే ఎలా ఉంటుందో అలా ఉండే పూర్తి వినోద భరిత చిత్రం ఇది. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది’ అని అన్నారు.
వైవా హర్ష మాట్లాడుతూ,’శ్రీదేవీ మూవీస్‌ యూనివర్సిటీ లాంటింది. కష్ణ ప్రసాద్‌ డీన్‌ లాంటి వ్యక్తి. ఇంద్రగంటి నా ఫేవరేట్‌ లెక్చరర్‌. నా క్లాస్‌ మేట్‌లో దర్శి, రూపా. నా కాలేజీలో సీనియర్‌ స్టూడెంట్‌ వెన్నెల కిషోర్‌. ఈ సినిమాలో నటించడం వల్ల లైఫ్‌ లాంగ్‌ బాండ్‌ ఏర్పడింది. వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులందరూ థియేటర్‌లో చూసి ఆనందించండి’ అని తెలిపారు.

]]>
‘అగ్రహారంలో అంబేద్కర్‌’ https://navatelangana.com/ambedkar-in-the-agrahara/ Wed, 16 Apr 2025 16:11:49 +0000 https://navatelangana.com/?p=547720 'Ambedkar in Agraharam'రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 135వ జయంతి సందర్భంగా ‘అగ్రహారంలో అంబేద్కర్‌’ సినిమా ఫస్ట్‌ లుక్‌ని లాంచ్‌ చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌ లాంచ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ అధికారపక్ష ఎమ్‌.ఎల్‌.సి అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ, ‘ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో పురస్కారాలు అందుకున్న ఈ చిత్రాన్ని రామోజీ – లక్షమోజి ఫిల్మ్స్‌ పతాకంపై మంథాని కష్ణచైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. హీరో కూడా ఆయనే కావడం విశేషం. మెల్లగా మరుగున పడుతున్న అంబేద్కర్‌ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు పూర్తి సమయ సహకారాలు అందిస్తాం. మన దేశ రాజ్యాంగ సష్టికర్త అయిన అంబేద్కర్‌ను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, ప్రతి స్కూల్‌లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరుతున్నాను’ అని అన్నారు.
ఇంకా ఈ వేడుకలో దర్శకులు చంద్రమహేష్‌, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సంతోషం సురేష్‌, సీనియర్‌ హీరో రాంకి, తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీస్‌ చైర్మన్‌ హరి గోవింద ప్రసాద్‌, మేకర్స్‌ ఆఫ్‌ మిల్క్‌ షేక్స్‌ సి.యి.ఓ రాహుల్‌, రాయల్‌ రిడ్జ్‌ ప్రాపర్టీస్‌ సి.యి.ఓ శ్రీవికాస్‌, సివిల్‌ కోర్ట్‌ జడ్జి సురేష్‌, అంబేద్కర్‌ యాక్టివిస్ట్‌ అనిత, సినిటేరియా మీడియా వర్క్స్‌ అధినేత వెంకట్‌ బులెమాని పాల్గొని, ఈ సినిమా అసాధారణ విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ చిత్రాన్ని సినిటేరియా మీడియా వర్క్స్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, కుల మత ప్రాంత, వర్గ వైషమ్యాలకు అతీతంగా సమాజ స్థాపన కోసం కషి చేసిన అంబేద్కర్‌కు గొప్ప నివాళిగా ఈ చిత్రాన్ని ఎన్నో వ్యయప్రయాసలతో తెరకెక్కించామని హీరో, ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ మంథాని కష్ణచైతన్య తెలిపారు.

]]>
‘బిల్లా రంగ బాషా’ షూటింగ్‌ ప్రారంభం https://navatelangana.com/billa-ranga-basha-shooting-start/ Wed, 16 Apr 2025 16:10:24 +0000 https://navatelangana.com/?p=547717 'Billa Ranga Bhasha' shooting beginsభారతీయ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ కొత్త శకానికి నాంది పలుకుతూ ‘బిల్లా రంగ బాషా’ షూటింగ్‌ బుధవారం ప్రారంభమైందని మేకర్స్‌ తెలిపారు. కిచ్చా సుదీప్‌ హీరోగా, అనుప్‌ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2209 ఎడి ఫ్యూచర్‌లో సెట్‌ చేయబడిన, ఇంతకు ముందెన్నడూ చూడని సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించ నుంది. గ్రాండ్‌ స్కేల్‌లో ఈ సినిమా భారతీయ సినిమా రంగం నుంచి సైన్స్‌ ఫిక్షన్‌ కథ చెప్పడంలో ఒక అడ్వంచర్‌ జర్నీని సూచిస్తోంది. బ్లాక్‌ బస్టర్‌ సినిమా ‘హనుమాన్‌’ మేకర్స్‌ ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాణంలో అద్భుతమైన స్టార్‌ పవర్‌, టెక్నికల్‌ వాల్యూస్‌లో ఈ సినిమా న్యూ బెంచ్‌ మార్క్‌ని క్రియేట్‌ చేయనుంది. కాన్సెప్ట్‌ వీడియో, లోగో రివీల్‌కు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత ఈ గ్రేట్‌ విజన్‌ని స్క్రీన్‌ పైకి తీసుకురావడానికి టీం సిద్ధమౌతోంది. ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని ఎగ్జైటింగ్‌ అప్డేట్స్‌ మేకర్స్‌ త్వరలో తెలియజేయనున్నారు.

]]>
‘మధురం’ ఘన విజయం సాధించడం ఖాయం https://navatelangana.com/madhuram-is-guaranteed-to-be-a-solid-success/ Wed, 16 Apr 2025 16:09:04 +0000 https://navatelangana.com/?p=547714 'Madhuram' is sure to be a huge successఉదయ్ రాజ్‌, వైష్ణవి సింగ్‌ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌ టైన్మెంట్‌ పతాకంపై రాజేష్‌ చికిలే దర్శకత్వంలో యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం ‘మధురం’. ఎ మెమొరబుల్‌ లవ్‌ అనేది ట్యాగ్‌ లైన్‌. టీనేజ్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ చాలా ప్లెజెంట్‌గా ఉంది. మంచి ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌తో బంగార్రాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం మధురమైన విజయం సాధించి హీరోగా ఉదరు రాజ్‌కి, దర్శకుడిగా రాజేష్‌కి మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటూ టీమ్‌ అందరికీ ఆల్‌ ద బెస్ట్‌’ అని చెప్పారు. అనంతరం అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను మేకర్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్‌, రఘు కుంచె, దర్శకులు విజరు కుమార్‌ కొండా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్పీ పట్నాయక్‌ మాట్లాడుతూ, ‘ట్రైలర్‌ చాలా బాగుంది. ఇలాంటి ప్రయోగాత్మక ప్రేమకథలు రూపొందించడం కత్తిమీద సాములాంటిది. కానీ ట్రైలర్‌ చూశాక ఎమోషన్‌ బాగా వర్కవుట్‌ అయ్యిందని అనిపించింది. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందని నమ్ముతున్నా’ అని అన్నారు. రఘుకుంచె మాట్లాడుతూ ”ఈ చిత్రంలోని పాటలన్నీ మధురాతి మధురంగా ఉన్నాయి. ట్రైలర్‌ కూడా చాలా బాగుంది. 90స్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన చిత్రాలన్నీ పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్‌ లవ్‌ స్టోరీకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాంటి కంటెంట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఉదరు రాజ్‌ హీరోగా మరిన్ని పెద్ద సినిమాలు చేయాలి. తనతోపాటు టీమ్‌ అందరికీ మంచి బ్రేక్‌ రావాలని కోరుకుంటున్నా”అని అన్నారు.

]]>
నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించండి https://navatelangana.com/take-a-look-at-the-nominations-objectively/ Wed, 16 Apr 2025 16:06:52 +0000 https://navatelangana.com/?p=547713 Examine nominations impartiallyరాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌కు అందిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులకు ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌ రాజు కోరారు. మంగళవారం ఎఫ్‌డిసి సమావేశ మందిరంలో జ్యూరీ ఛైర్మన్‌, నటి జయసుధ అధ్యక్షతన గద్దర్‌ అవార్డ్స్‌ జ్యూరీ సమావేశం జరిగింది.
ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజ్‌గా తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎఫ్‌డిసి ఛైర్మన్‌ దిల్‌ రాజు మాట్లాడుతూ,’తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను కోరుతున్నాను. జ్యూరీలో నిష్ణాతులైన వారిని ప్రభుత్వం నియమించింది. 14 ఏండ్ల తర్వాత ప్రభుత్వం చలన చిత్ర అవార్డ్స్‌ను ఇస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్రాల అవార్డ్స్‌కు ఇంత స్పందన రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ అవార్డుల నామినేషన్ల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా వ్యవహరించాలి’ అని తెలిపారు.
‘సినీ నటి జయసుధ ఛైర్మన్‌గా 15 మందితో గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డ్స్‌ జ్యూరీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ అవార్డ్స్‌కు అన్ని కేటగిరీలకు కలిపి 1248 నామినేషన్లు అందాయి. ఈ నెల 21వ తేదీ నుండి నామినేషన్ల స్క్రీనింగ్‌ ప్రక్రియ జరుగుతుంది. ఈ అవార్డులకు గాను వివిధ క్యాటగిరిల ఎంట్రీలకు వచ్చిన నామినేషన్ల స్క్రీనింగ్‌ ప్రక్రియ గురించి సభ్యులతో చర్చించాం. ఈ పురస్కారాలకు వ్యక్తిగత క్యాటగిరిలో 1172, ఫీచర్‌ ఫిలిం, బాలల చిత్రాలు, డెబ్యూ చిత్రాలు, డాక్యుమెంటరీ/ లఘుచిత్రాలు, ఫిల్మ్‌ క్రిటిక్స్‌, పుస్తకాలు తదితర క్యాటగిరిలలో 76 దరఖాస్తులు వచ్చాయి. జ్యూరీ సభ్యులందరూ ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారు’ అని తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా.ఎస్‌.హరీష్‌ చెప్పారు.

]]>
ఈనెల 18న నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ రీరిలీజ్ https://navatelangana.com/my-autograph-sweet-memories-release-on-the-18th-of-this-month/ Wed, 16 Apr 2025 03:34:53 +0000 https://navatelangana.com/?p=547219 My Autograph Sweet Memories' re-release on the 18th of this monthనవతెలంగాణ – హైదరాబాద్: ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ సినిమా రీరిలీజ్ అవుతుండటంపై మాస్ మహారాజా రవితేజ ఇన్‌స్టాలో స్పెషల్ స్టోరీని పోస్ట్ చేశారు. ‘నేను చేసిన సినిమాల్లో నా ఆటోగ్రాఫ్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది నా మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈనెల 18న ఈ చిత్రం మళ్లీ థియేటర్లలో విడులవుతోంది. బిగ్ స్క్రీన్‌పై ఆ మధుర జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసుకుంటారని ఆశిస్తున్నా’ అని ఆయన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.

]]>
ప్రేక్షకుల అంచనాలకు మించి.. https://navatelangana.com/beyond-the-expectations-of-the-audience/ Tue, 15 Apr 2025 17:46:05 +0000 https://navatelangana.com/?p=546980 తమన్నా నాగసాధుగా నటించిన చిత్రం ‘ఓదెల 2’. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కి ఇది సీక్వెల్‌. సంపత్‌ నంది సూపర్‌ విజన్‌లో అశోక్‌ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్‌, సంపత్‌ నంది టీమ్‌వర్క్స్‌పై డి.మధు నిర్మించారు. హెబ్బా పటేల్‌, వశిష్ట ఎన్‌ సింహ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 17న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ,’ఈ టీజర్‌ చూడగానే ‘అరుంధతి, అమ్మోరు’ సినిమాలు చూసిన ఫీలింగ్‌ వచ్చింది. సంపత్‌ నందితో ఏడాదిగా ట్రావెల్‌ చేస్తున్నాను. తమన్నా ఆయనతో నాలుగు సినిమాలు చేశారంటే మామూలు విషయం కాదు. తను వండర్ఫుల్‌ ఆర్టిస్ట్‌. రెండు దశాబ్దాలుగా హీరోయిన్‌గా ఉండడం మామూలు విషయం కాదు. ఒక మాస్‌ సినిమాకి ఎలా అయితే ఆడియన్స్‌ వెయిట్‌ చేస్తారో ఈ సినిమా కోసం ఆడియన్స్‌ అంతా ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్స్‌ అదిరిపోతాయని నాకు స్ట్రాంగ్‌ ఫీలింగ్‌. ఈ సమ్మర్‌కి ఇదే బ్లాక్‌ బస్టర్‌ అవుతుందని నా నమ్మకం’ అని తెలిపారు.
‘ఈ సినిమా సంపత్‌, మధు కోసం గొప్పగా ఆడాలని కోరుకుంటున్నాను. 20 ఏళ్లుగా ఎన్నో ప్రొడక్షన్స్‌లో పనిచేశాను. కానీ ఇంత ప్యాషన్‌ ఉన్న ప్రొడ్యూసర్‌, క్రియేటర్స్‌ చాలా అరుదుగా ఉంటారు. ఈ సినిమాలో భాగం కావడం అదష్టంగా భావిస్తున్నాను. శివశక్తి పాత్ర, ఈ సినిమా నా కెరీర్లో చాలా స్పెషల్‌’ అని హీరోయిన్‌ తమన్నా భాటియా చెప్పారు.
డైరెక్టర్‌ సంపత్‌ నంది మాట్లాడుతూ,’ఈ సినిమాకి వచ్చిన బజ్‌ చూస్తుంటే భయం వేస్తుంది. డైరెక్టర్‌ అశోక్‌ వెరీ పాజిటివ్‌ సోల్‌. తనకి మంచి జరగాలని ఈ ఫ్రాంచెజ్‌ స్టార్ట్‌ చేశాను. నిర్మాత మధు లేకపోతే ఈ కథ లేదు. ఆయన వల్లే ఈ జర్నీ సాధ్యమైంది. ఒక గొప్ప థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇది. ఈ సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్‌ చేయదు. ఇది నా గ్యారెంటీ’ అని అన్నారు.
‘ఈ సినిమాని మొదలు పెట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో, పూర్తి చేసినప్పుడు కూడా అంతే ఎంజారు చేస్తూ వర్క్‌ చేసాం. ఇది మా సంపత్‌ నంది వల్లనే సాధ్యపడిందని భావిస్తున్నాను. మంచికి, చెడుకు మధ్య జరిగే యుద్ధం ఈ సినిమా. ఆడియన్స్‌ అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుంది’ అని నిర్మాత డి మధు చెప్పారు. డైరెక్టర్‌ అశోక్‌ తేజ మాట్లాడుతూ,’ మధు, సంపత్‌ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఎప్పుడు చూడని విజువల్స్‌ ఇందులో ఉన్నాయి. తప్పకుండా చూడండి’ అని తెలిపారు.

]]>
‘తు మేరా లవర్‌..’ సందడి షురూ https://navatelangana.com/thu-mera-lover/ Tue, 15 Apr 2025 16:46:49 +0000 https://navatelangana.com/?p=546958 Ravi Teja, Sri Leela, Mass Jatara, Dhamakaరవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్‌ జాతర’. ఇది రవితేజ నటిస్తున్న 75వ చిత్రం. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి గీతంగా ‘తు మేరా లవర్‌’ను విడుదల చేశారు. ప్రోమోతోనే అందరి దష్టిని ఆకర్షించిన ఈ గీతం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూశారు. తాజాగా విడుదలైన ఈ పాట ఒక్కసారి వినగానే శ్రోతలకు అభిమాన గీతంగా మారిపోతోంది. ‘ధమాకా’ జోడి రవితేజ-శ్రీలీల అందరి అంచనాలను అందుకునేలా, అద్భుతమైన కెమిస్ట్రీతో మరోసారి మ్యాజిక్‌ చేశారు. భీమ్స్‌ సిసిరోలియో ఈ గీతాన్ని అద్భుతంగా స్వరపరిచారు. భాస్కరభట్ల సాహిత్యం మాస్‌ మెచ్చేలా ఉంది. రవితేజ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఇడియట్‌’లోని ఐకానిక్‌ చార్ట్‌బస్టర్‌ ”చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే” పాటకు ట్రిబ్యూట్‌గా మలిచిన ఈ పాట అభిమానులకు విందు భోజనంలా ఉంది. దీనిని ఒక ప్రత్యేకమైన సంగీత నివాళిగా మార్చడానికి నిర్మాతలు ఏఐని ఉపయోగించి దివంగత సంగీత దర్శకుడు చక్రి స్వరాన్ని తిరిగి సృష్టించడం విశేషం.

]]>