Cinema Archives - https://navatelangana.com/category/cinema/ Wed, 08 May 2024 18:57:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Cinema Archives - https://navatelangana.com/category/cinema/ 32 32 పవర్‌ఫుల్‌ కంటెంట్‌తో వృషభ https://navatelangana.com/taurus-with-powerful-content/ Wed, 08 May 2024 18:56:48 +0000 https://navatelangana.com/?p=286502 Taurus with powerful contentవీకే మూవీస్‌, శ్రీ జె పి ప్రొడక్షన్స్‌ పతాకాలపై జీవన్‌ రెడ్డి, అలేఖ్య జంటగా ఉమా శంకర్‌ రెడ్డి నిర్మాతగా, మల్లికా రెడ్డి కో-ప్రొడ్యూసర్‌గా, అశ్విన్‌ కామరాజ్‌ కొప్పాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వషభ’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌, లిరికల్‌ సాంగ్‌ లాంచ్‌ వేడుక నటుడు జయప్రకాష్‌ రెడ్డి జయంతి సందర్భంగా ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది.దర్శకులు వి.సముద్ర, రేలంగి నరసింహారావు, నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌, లయన్‌ సాయి వెంకట్‌, నటులు అజరు ఘోష్‌, శివారెడ్డి, విశ్వ కార్తికేయ, శబరి నిర్మాత మహేంద్ర తదితరులు పాల్గొని ఈ చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. నిర్మాత ఉమా శంకర్‌ రెడ్డి మాట్లాడుతూ, ’85 శాతం సినిమా పూర్తయ్యింది. దర్శకుడు ఎక్కడా రాజీ పడకుండా సినిమా చేశారు. టీమ్‌ అంతా ఎంతో సపోర్ట్‌ చేశారు. సినిమా కోసం ఎంత వరకు అయినా సరే వెళ్ళే వ్యక్తి మా హీరో. అలాగే మా హీరోయిన్‌ కూడా ఎంతో కష్టపడ్డారు. మ్యూజిక్‌ డైరక్టర్‌ ఎమ్‌ ఎల్‌ రాజా అద్భుతమైన సంగీతాన్ని సమ కూర్చారు. త్వరలో సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు వెల్లడిస్తాం’ అని అన్నారు. ‘ఈ చిత్రాన్ని ఇచ్చి మంచి పాటలు చేయడానికి సపోర్ట్‌ చేసిన దర్శక, నిర్మాతలకు ధన్య వాదాలు’ అని మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎమ్‌ ఎల్‌ రాజా చెప్పారు. కో-ప్రొడ్యూసర్‌ మల్లిక రెడ్డి మాట్లాడుతూ, ‘మా నాన్న జయంతి రోజు మా సినిమాకు సంబంధించిన పాట, ట్రైలర్‌ రిలీజ్‌ చేయడం సంతోషం. ఒక మంచి సినిమాలో పార్ట్‌ కావడం సంతోషంగా ఉంది’ అని తెలిపారు. దర్శకుడు అశ్విన్‌ కామరాజ్‌ కొప్పాల మాట్లాడుతూ,’మా ప్రొడ్యూసర్‌ ఉమా శంకర్‌ ఒక మంచి కథతో నన్ను అప్రోచ్‌ అయ్యారు. ఈ కాన్సెప్ట్‌ మీద చాలా హార్డ్‌ వర్క్‌ చేసాం. హీరో జీవన్‌ రెడ్డి సినిమా కోసం ప్రాణం పెట్టారు. సంగీతం, సినిమాటోగ్రఫీ బాగా కుదిరింది. త్వరలో మిగతా పాటలు రిలీజ్‌ చేస్తాం’ అని అన్నారు.

]]>
ఏకధాటిగా.. 10 గంటలు https://navatelangana.com/10-hours-at-a-time/ Wed, 08 May 2024 18:54:49 +0000 https://navatelangana.com/?p=286493 ఏకధాటిగా.. 10 గంటలుఅమెరికాలోని డల్లాస్‌లో సుస్వర మ్యూజిక్‌ అకాడమీని విజయవంతంగా నిర్వహిస్తున్నారు డాక్టర్‌ మీనాక్షి అనిపిండి. ఈ అకాడమీ 21వ వార్షికోత్సవాన్ని ఇటీవల ఘనంగా నిర్వహించారు. గ్రాండ్‌ సెంటర్‌ ఆడిటోరియంలో జరిగిన ఈ సంబరాల్లో తానా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్‌ ప్రసాద్‌ తోటకూర, డల్లాస్‌లో ఇండో అమెరికన్‌ కౌన్సిల్‌ సభ్యులు గోపాల్‌ పోనంగి, వ్యాపారవేత్త కిషోర్‌ కంచర్ల, శారద సింగిరెడ్డి, ప్రకాష్‌ రావు అతిథులుగా హాజరయ్యారు. సినీ గేయ రచయిత చంద్రబోస్‌, సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్‌, డైరెక్టర్‌ వీఎన్‌ ఆదిత్యతో సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
సుస్వర మ్యూజిక్‌ అకాడమీ 21వ వార్షిక సంబరాల్లో మీనాక్షి అనిపిండి తన శిష్య బందంతో 7 సిగ్మెంట్లలో దాదాపు 30కి పైగా సంప్రదాయ సంగీత కీర్తనలకు ప్రదర్శన ఇచ్చారు. 10 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ సాంస్కతిక గాన ప్రదర్శన ప్రేక్షకులందరినీ అలరించింది. ఈ వేదికపై చంద్రబోస్‌కు ‘సుస్వర సాహిత్య కళానిధి’, ఆర్పీ పట్నాయక్‌కు ”సుస్వర నాదనిధి’ అనే బిరుదులు అందించారు. కుమారి సంహిత అనిపిండి, ప్రత్యూష ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు ఆద్యంతం రక్తి కట్టించారు.

]]>
స్నేహం, జీవితానికి ప్రతిబింబం https://navatelangana.com/friendship-is-a-reflection-of-life/ Wed, 08 May 2024 18:53:03 +0000 https://navatelangana.com/?p=286478 స్నేహం,
జీవితానికి
ప్రతిబింబంహీరో సత్యదేవ్‌ నటించిన చిత్రం ‘కష్ణమ్మ’. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియే షన్స్‌ పతాకంపై కష్ణ కొమ్మల పాటి ఈ మూవీని నిర్మించారు. వి.వి.గోపాలకష్ణ దర్శకత్వం వహించారు. ఎన్నో సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్‌, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సినిమాను ఈనెల 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్‌ మీడియాతో ముచ్చటించారు.
‘విజయవాడ అంటే పాలిటిక్స్‌, రౌడీయిజం అని చెప్తారు. కానీ అది కాదు అని చెప్పే కథే ఈ కష్ణమ్మ. ఇది ముఖ్యంగా ముగ్గురు స్నేహితుల కథ. వాళ్ళ చిన్న జీవితాలు, వాళ్ళకి ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి అనుకునే ముగ్గురు ఫ్రెండ్స్‌. కానీ అలాంటి డ్రీమ్‌ చెడగొడితే వీళ్ళు ఏం చేశారు అనేదే ఈ సినిమా. దీంట్లో రౌడీయిజం, పాలిటిక్స్‌ ఏం ఉండవు. కథ మెయిన్‌ లైఫ్‌ గురించే ఉంటుంది. అయితే సందర్భానికి తగ్గట్టు హీరో బాధ నుంచి వచ్చే రివేంజ్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌ వస్తాయి. వించిపేట భద్ర క్యారెక్టర్‌ కోసం, విజయవాడ స్లాంగ్‌ కోసం, ఆ బాడీ లాంగ్వేజ్‌ కోసం, కథలో కొన్నేళ్ల తర్వాత 40 ఏళ్ళ వ్యక్తిగా, పొగరు, పగ.. ఇలాంటివి అన్ని చూపించాలి. దీరతో ఈ పాత్ర నాకు ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇప్పటివరకు చేసిన పాత్రలకు ఇది డిఫరెంట్‌. ఇక ఇది రియల్‌గా జరిగిన కొన్ని సంఘటనల నుంచి తీసుకుని, ఫిక్షనల్‌గా రాసిన పాత్ర, కథ. డబ్బులు తీసుకుని శిక్షలు మీద వేసుకోవడంలాంటి వాటితో గతంలో సినిమాలు వచ్చినా అవి సినిమాలో ఒక సీన్‌లా ఉండేవి. కానీ ఇది కథ మొత్తం అదే పాయింట్‌ మీదే తిరుగుతుంది. అలాగే ఈ సినిమాలో ఫ్రెండ్షిప్‌, జీవితం గురించి ఒక మంచి ఎమోషన్‌ ఉంటుంది. ఈ సినిమా నుంచి బయటకి రాగానే ఫస్ట్‌ మాట్లాడేది కాల భైరవ గురించే మాట్లాడతారు. చాలా ఇంటెన్స్‌ ఉన్న సంగీతం ఇచ్చాడు. పాటలు కూడా చాలా బాగా ఇచ్చాడు. నిర్మాత కష్ణ సినిమా మీద ప్యాషన్‌తో చేశారు. నాయగన్‌, ఆపద్బాంధవుడు లాంటి సినిమాలు చేయాలని ఉంది’ అని సత్యదేవ్‌ అన్నారు.

]]>
బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌ బాహుబలి చరిత్రలో కొత్త అధ్యాయం https://navatelangana.com/baahubali-crown-of-blood-is-a-new-chapter-in-the-history-of-baahubali/ Tue, 07 May 2024 16:22:59 +0000 https://navatelangana.com/?p=285728 Baahubali: Crown of Blood A new chapter in the history of Baahubali‘బాహుబలి ఫ్రాంచైజీకి నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది. ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’తో బాహుబలి చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించడం అద్భుతంగా అనిపిస్తుంది’ అని దర్శకుడు రాజమౌళి అన్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో రాబోయే బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌ యానిమేటెడ్‌ సిరీస్‌ యూనివర్స్‌ని హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్‌లో గ్రాండ్‌గా ఆవిష్కరించారు. గ్రాఫిక్‌ ఇండియా, ఆర్కా మీడియావర్క్స్‌ ప్రొడక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, విజనరీ ఫిల్మ్‌ మేకర్‌ రాజమౌళి, శరద్‌ దేవరాజన్‌, శోభు యార్లగడ్డ దీనిని నిర్మించారు. జీవన్‌ జె. కాంగ్‌, నవీన్‌ జాన్‌ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ ఈనెల 17న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ”బాహుబలి’ కోసం క్యారెక్టర్‌ ఆర్క్స్‌, ప్రీ స్టొరీ, పోస్ట్‌ స్టొరీ రాసినప్పుడు బాహుబలి యూనివర్స్‌లో ప్రేక్షకులకు చెప్పడానికి ఇంకా కథ ఉందనిపించింది. వెస్ట్రన్‌ కంట్రీస్‌లో ఒక సినిమా విజయవంతమైతే ఆ బ్రాండ్‌ అనేక మీడియమ్స్‌లో ముందుకు వెళ్తుంది. ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు. సినిమా విజయవంతమైతే అక్కడితో అయిపోతుంది. అయితే మేము ఈ విజయాన్ని కొనసాగించాలని వీర్‌ ఫిలిమ్స్‌, సిరీస్‌ ఇలా చాలా విధాలుగా ప్రయత్నించాం. ఇలాంటి సమయంలో శరత్‌ వచ్చారు. యానిమేషన్‌లో ఆయన విజన్‌ నాకు చాలా నచ్చింది. అలా వారితో అసోసియేట్‌ అయ్యాం. ఆయనతో చాలా కథా చర్చలు జరిగాయి. బాహుబలి ప్రతి పాత్రలో సోల్‌, ఎమోషన్‌ ఉంటుంది. ఆ ఎమోషన్‌ ప్రేక్షకులను గొప్పగా హత్తుకుంటుంది. ఈ యానిమేషన్‌ సిరీస్‌ని
శరత్‌ కూడా ఆ సోల్‌ పట్టుకొని అద్భుతంగా రూపొందించడం ఆనందంగా వుంది. గ్రాఫిక్‌ ఇండియా, ఆర్కా మీడియావర్క్స్‌, డిస్నీం హాట్‌స్టార్‌లతో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం’ అని ఎస్‌.ఎస్‌.రాజమౌళి చెప్పారు.

]]>
రియల్‌ ఇన్సిడెంట్‌తో 100 క్రోర్స్‌ https://navatelangana.com/100-crores-with-real-incident/ Tue, 07 May 2024 16:21:32 +0000 https://navatelangana.com/?p=285725 రియల్‌ ఇన్సిడెంట్‌తో 100 క్రోర్స్‌2016లో జరిగిన ఓ రియల్‌ ఇన్సిడెంట్‌ని బేస్‌ చేసుకుని వినోదభరితంగా ‘100 క్రోర్స్‌’ చిత్రాన్ని నిర్మించారు. దివిజా కార్తీక్‌, సాయి కార్తీక్‌ నిర్మాతలుగా ఎస్‌.ఎస్‌.స్టూడియోస్‌ బ్యానర్‌ పై నిర్మించిన ఈ చిత్రానికి విరాట్‌ చక్రవర్తి రచయిత, దర్శకుడు. కళ్యాణ్‌ చక్రవర్తి.జి సహ నిర్మాతగా, వెంకట్‌ సుధాకర్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌లో దర్శకులు వీర శంకర్‌, మల్లిక్‌ రామ్‌, నిర్మాత హర్షిత్‌ రెడ్డి, నిర్మాత దామోదర ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా విచ్చేసి, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. సాయి కార్తీక్‌ మాట్లాడుతూ, ‘2016లో జరిగిన వాస్తవ కథ. ఈ మూవీ చాలా బాగా వచ్చింది. చూసిన వాళ్లంతా బాగుందని అన్నారు. ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది’ అని అన్నారు. హీరో చేతన్‌ మాట్లాడుతూ, ‘తెలుగు పరిశ్రమలోకి హీరోగా వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌’ అని చెప్పారు. ”డీమానిటైజేషన్‌లో వంద కోట్ల చుట్టూ తిరిగే కథ అని, ఫస్ట్‌ టైం సినిమాను నిర్మిస్తున్నానని సాయి కార్తీక్‌ చెప్పారు. ఆయన సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. కన్నడ పరిశ్రమ నుంచి తెలుగులోకి వస్తున్న చేతన్‌కు స్వాగతం’ అని హర్షిత్‌ రెడ్డి తెలిపారు. వీర శంకర్‌ మాట్లాడుతూ, ‘డీమానిటైజేషన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. విరాట్‌ నాకు ఎప్పటి నుంచో పరిచయం. సాయి కార్తీక్‌ ఈ చిత్రంతో మంచి లాభాలను రాబట్టుకోవాలి’ అని అన్నారు.

]]>
వైభవంగా నవతిహి ఉత్సవం https://navatelangana.com/glorious-navatihi-festival/ Tue, 07 May 2024 16:20:22 +0000 https://navatelangana.com/?p=285720 వైభవంగా నవతిహి ఉత్సవంతెలుగు చిత్ర సీమ 90 ఏళ్ల ప్రయాణాన్ని నవతిహి ఉత్సవంగా ఘనంగా నిర్వహించేందుకు మలేషియా వేదిక కానుంది. ఈ కార్యక్రమం మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)ప్రెసిడెంట్‌ విష్ణు మంచు ఆధ్వర్యంలో ఘనంగా జరగనుంది. కౌలాలంపూర్‌లోని బుకిట్‌ జలీల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్‌ స్టేడియంలో జూలై 20న ఈ వేడుకని అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలో సినిమా రంగానికి చెందిన అతిరథులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ వేడుక ప్రాముఖ్యతను వివరించడంతోపాటు దీనికి ప్రోత్సాహకరంగా నిలుస్తున్న భాగస్వాములను అందరినీ పరిచయం చేస్తూ సన్‌వే పిరమిడ్‌, సన్‌వే రిసార్ట్‌లో ప్రత్యేక సమావేశం జరిగింది. మూడు దేశాల నుండి వచ్చిన ప్రతిపాదనలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌ను మలేషియాలో నిర్వహించడం ఉత్తమమని నిర్ణయం తీసుకున్నారు. మలేషియా టూరిజం, మా, స్థానిక ఈవెంట్‌ ఆర్గనైజర్‌ ఎంసి ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో ఈ గ్లోబల్‌ వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నారు. నవతిహి ఉత్సవం కేవలం సినిమా విజయాలకు వేడుక మాత్రమే కాదు. మలేషియా ప్రజలు, తెలుగు మాట్లాడే వర్గాల మధ్య పరస్పర అవగాహన, గౌరవాన్ని పెంపొందించే సాంస్కతిక మార్పిడికి చిహ్నంగా ఈ ఈవెంట్‌ జరగనుందని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు.

]]>
ఘనంగా డి.ఎన్‌.ఆర్‌.ఫిల్మ్‌ అవార్డ్స్‌ https://navatelangana.com/dnr-film-awards/ Mon, 06 May 2024 19:14:57 +0000 https://navatelangana.com/?p=284977 దర్శకరత్న దాసరి 77వ జయంతిని పురస్కరించుకుని శిల్పకళావేదికలో దర్శకరత్న డి.ఎన్‌.ఆర్‌. ఫిల్మ్‌ అవార్డ్స్‌ ఘనంగా జరిగింది. సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. చిత్రసీమకు ఎటువంటి సహకారం కావాల్సినా తెలంగాణా ప్రభుత్వం ముందుంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దాసరి లెజండరీ నటుడు అవార్డు అందుకున్న మోహన్‌ బాబు మాట్లాడుతూ, ”దర్శక కులానికి గౌరవం తెచ్చిన వ్యక్తి దాసరి. ఆయన పేరిట నెలకొల్పిన అవార్డు అందుకోవడం గర్వంగా భావిస్తున్నాను’ అని అన్నారు. దాసరి లెజండరి డైరెక్టర్‌ అవార్డును దర్శకులు కోదండరామిరెడ్డి, లెజండరీ ప్రొడ్యూసర్‌ అవార్డును అల్లు అరవింద్‌, లెజండరీ డిస్ట్రిబ్యూటర్‌ అవార్డును దిల్‌ రాజు, దాసరి లెజండరి ఫిలాంత్రఫిస్ట్‌ అవార్డును నటులు మురళీమోహన్‌, లెజండరీ స్టోరీ రైటర్‌ అవార్డ్‌ను పరుచూరి బ్రదర్స్‌ తరపున పరుచూరి గోపాలకష్ణ, లెజండరీ ఎగ్జిబిటర్‌ అవార్డును సునీల్‌ నారంగ్‌, లెజండరీ లిరిక్‌ రైటర్‌ అవార్డును చంద్రబోస్‌ తరపున వారి సతీమణి సుచిత్ర చంద్రబోస్‌, లెజండరీ జర్నలిస్ట్‌ అవార్డును మాడభూషి శ్రీధర్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న దాసరి టీమ్‌ మెంబర్స్‌లో పదిమందికి పదివేలు చొప్పున నగదు సాయం అందించారు. ప్రభు, నిహారిక తమదైన వ్యాఖ్యానంతో ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.

]]>
భిన్న కాన్సెప్ట్‌తో భలే ఉన్నాడే https://navatelangana.com/i-am-fine-with-a-different-concept/ Mon, 06 May 2024 19:13:58 +0000 https://navatelangana.com/?p=284976 రవికిరణ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్‌ కుమార్‌ నిర్మాణంలో జె శివసాయి వర్ధన్‌ దర్శకత్వంలో హీరో రాజ్‌ తరుణ్‌ నటిస్తున్న ‘భలే ఉన్నాడే’ చిత్రానికి దర్శకుడు మారుతి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను ఆయన గ్రాండ్‌గా లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మారుతి మాట్లాడుతూ,’ఇది కాన్సెప్ట్‌ ఫిల్మ్‌.. ప్రేక్షకులని థియేటర్స్‌కి రప్పించే ఫిల్మ్‌. ఇది మన మధ్యలో జరిగే ఒక కథలా ఉంటుంది. మనిషా చాలా చక్కగా నటించింది. శివసాయి చాలా ప్యాషన్‌ ఉన్న దర్శకుడు. శేఖర్‌ చంద్ర మంచి పాటలు ఇచ్చారు. ఇద్దరు డీవోపీలు ది బెస్ట్‌ వర్క్‌ ఇచ్చారు. దాదాపు ఇండిస్టీలో ఉన్న ఆర్టిస్ట్‌లు అందరూ ఉన్నారు. తమిళ్‌ నుంచి కూడా వీటీ గణేషన్‌ లాంటి నటులు తీసుకొచ్చారు. మంచి కంటెంట్‌తో రాబోతుంది ఈ సినిమా. చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమా అవ్వబోతుంది. రెండు రీళ్ళు చూశాను. ఫ్లో చాలా బావుంది. ఈటీవీ విన్‌, ఆదిత్య మ్యూజిక్‌కి థ్యాంక్స్‌’ అని తెలిపారు. ‘టీజర్‌ మీ అందరికీ నచ్చడం ఆనందంగా ఉంది. సినిమా కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. త్వరలోనే రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేస్తాం’ అని హీరో రాజ్‌ తరుణ్‌ చెప్పారు. దర్శకుడు జె శివసాయి వర్ధన్‌ మాట్లాడుతూ,’ఇది నా మొదటి సినిమా. శేఖర్‌ చంద్ర చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. నగేష్‌ బానెల్లా వండర్‌ ఫుల్‌ విజువల్స్‌ ఇచ్చారు. ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది’ అని అన్నారు. ‘నన్ను ఎప్పుడూ ప్రోత్సహించే మారుతికి ధన్యవాదాలు. ఈ సినిమాలో షాకింగ్‌ కామెడీ ఉంటుంది. చాలా కొత్తగా ఉంటుంది. కంటెంట్‌తో ఉండే సాంగ్స్‌ ఉన్నాయి. చాలా కొత్తగా ప్రయత్నించాం’ అని మ్యూజిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌ చంద్ర చెప్పారు. నిర్మాత రవికిరణ్‌ మాట్లాడుతూ,’ఈ సినిమా చాలా బావొచ్చింది. దర్శకుడు అద్భుతంగా తీశారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు పైసా వసూల్‌ సినిమా అవుతుంది’ అని తెలిపారు.

]]>
సత్య ట్రైలర్‌ అదుర్స్‌ https://navatelangana.com/satya-trailer-adurs/ Mon, 06 May 2024 19:12:10 +0000 https://navatelangana.com/?p=284970 శివమ్‌ మీడియా నిర్మాణ సంస్థ నుండి విడుదల అవుతున్న తొలి సినిమా ‘సత్య’. ఈచిత్ర ట్రైలర్‌ సోమవారం 8 మంది దర్శకుల చేతుల మీదగా రిలీజ్‌ అయ్యింది. ఇప్పటికే రిలీజ్‌ అయిన పోస్టర్లు, టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ సినిమాని ఈనెల 10న రిలీజ్‌ చేస్తున్నట్టు చిత్ర బృందం తెలిపారు. డైరెక్టర్‌ కష్ణ చైతన్య మాట్లాడుతూ, ‘హమరేష్‌ చూడడానికి జి.వి. ప్రకాష్‌ లాంచ్‌ అయిన ప్పుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. నిర్మాత శివ మల్లాల నా కెరీర్‌ మొదలుపెట్టినప్పటి నుండి తెలుసు, నన్ను జనాలకి చూపించ డానికి ఫొటోస్‌ తీసేవారు, నా మొహమాటాన్ని కూడా దాటి శివ కోసం ఫొటోస్‌ దిగేవాడిని. ఆయనకి ఈ సినిమా పెద్ద సక్సెస్‌ తీసుకుని రావాలని కోరుకుంటున్నాను ‘సినిమాలో సరస్వతి ఉన్నారు కాబట్టి, ఈ సినిమాతో మా శివ మల్లాల కి లక్ష్మి కూడా రావాలి’ అని కోరుకుంటున్నాను అన్నారు. ‘శివ మల్లాల ఒక చిన్న ఫోటోగ్రాఫర్‌గా వచ్చి ఈరోజు ఒక నిర్మాతగా ఎదిగాడు. చాలా మంచి వ్యక్తి. అన్ని జనరేషన్స్‌ వాళ్ళతో మంచి రిలేషన్‌ మెయింటెన్‌ చేస్తాడు. చాలా తక్కువ డబ్బింగ్‌ సినిమాలు మాత్రమే విజయాన్ని అందుకుంటాయి. ఈ సినిమా విజువల్స్‌ చూస్తుంటే కచ్చితంగా సినిమా పెద్ద హిట్‌ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రభు చెప్పారు. దర్శకుడు వాలి మోహన్‌ దాస్‌ మాట్లాడుతూ, ‘తమిళంలో ఈ సినిమాని నేను ‘రంగోలి’గా తీసాను. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో శివ మల్లాల ద్వారా ‘సత్య’గా మీ ముందుకు రాబోతోంది. అందరూ చూసి మంచి సక్సెస్‌ చేస్తారని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ‘ట్రైలర్‌ లాంచ్‌ మాట చెప్పడం కోసం ఎనిమిది మంది డైరెక్టర్స్‌ వచ్చారు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. 10న ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. తమిళంలో మాదిరిగా తెలుగులో ఈ సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని నిర్మాత శివ మల్లాల చెప్పారు.

]]>
పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ https://navatelangana.com/a-solid-action-entertainer-4/ Sun, 05 May 2024 17:21:58 +0000 https://navatelangana.com/?p=284226 పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌హీరో ఆనంద్‌ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం ‘గం..గం..గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాను హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదరు శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్‌ దేవరకొండ తన కెరీర్‌లో చేస్తున్న ఫస్ట్‌ యాక్షన్‌ మూవీ ఇది కావడం విశేషం. ఈ నెల 31న ఈ సినిమా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని సెకండ్‌ సింగిల్‌ ‘పిచ్చిగా నచ్చాశావే’ను మల్లారెడ్డి కాలేజ్‌ విద్యార్థుల సందడి మధ్య రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ, ‘మీ అందరినీ చూస్తుంటే నేను చెన్నైలో చదువుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. ఆనంద్‌ దేవరకొండ మంచి ఫ్రెండ్‌, రియల్‌ లైఫ్‌లోనూ హీరో. ఈ సినిమాలో ఆనంద్‌ క్యారెక్టర్‌ మీ రియల్‌ లైఫ్‌లో ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లా ఉంటుంది. ఈనెల 31న మీ ముందుకు వస్తున్నాం. మూవీని తప్పకుండా చూడండి’ అని తెలిపారు. ‘ఇదొక మంచి క్రైమ్‌ కామెడీ మూవీ. మీరు మీ ఫ్యామిలీస్‌తో కలిసి ఎంజారు చేసేలా సినిమా ఉంటుంది. మా మూవీని మిస్‌ కాకండి’ అని దర్శకుడు ఉదరు శెట్టి చెప్పారు. హీరో ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ, ”బేబి’ సినిమాలో ఎంత ఏడ్చారో ఈ సినిమాలో నన్ను చూసి అంత నవ్వుతారు. స్క్రిప్ట్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. ట్విస్ట్స్‌, టర్న్స్‌ ఉంటాయి. క్రైమ్‌, కామెడీ, యాక్షన్‌తో మీరంతా ఈ మూవీని బాగా ఎంజారు చేస్తారు’ అని అన్నారు.

]]>
రియల్‌స్టోరీతో రాజుయాదవ్‌ https://navatelangana.com/rajuyadav-with-realstory/ Sun, 05 May 2024 17:20:58 +0000 https://navatelangana.com/?p=284223 రియల్‌స్టోరీతో రాజుయాదవ్‌జబర్దస్త్‌ ఫేమ్‌ గెటప్‌ శ్రీను ‘రాజు యాదవ్‌’తో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్‌, చరిష్మా డ్రీమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లపై కె. ప్రశాంత్‌ రెడ్డి, రాజేష్‌ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈనెల 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. హీరో తేజ సజ్జా ముఖ్య అతిధిగా హాజరై ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు. హీరో గెటప్‌ శ్రీను మాట్లాడుతూ,’దర్శకుడు కష్ణమాచారి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఉదరు చాలా మంచి విజువల్స్‌ ఇచ్చారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ బ్లాక్‌ బస్టర్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. సురేష్‌ బొబ్బిలి అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. నిర్మాత ప్రశాంత్‌ చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు’ అని అన్నారు. ‘ఈ సినిమా ఒక రియల్‌ స్టొరీ. చాలా సహజసిద్ధంగా ఈ సినిమాని తీశాం. ప్రేక్షకులు కొత్త అనుభూతి వుంటుంది. ఎమోషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆకట్టుకుంటాయి. ఈనెల 17న అందరూ రాజు యాదవ్‌ చూసి, సినిమాని పెద్ద హిట్‌ చేయాలి. ఫ్యామిలీ అంతా కలసి చూసే సినిమా ఇది’ అని దర్శకుడు కష్ణమాచారి చెప్పారు.

]]>
ఒకేసారి రెండు సినిమాలు షూరు https://navatelangana.com/two-movies-at-the-same-time/ Sun, 05 May 2024 17:19:58 +0000 https://navatelangana.com/?p=284219 ఒకేసారి రెండు సినిమాలు షూరు‘డైరెక్టర్స్‌ డే’ సందర్భంగా ఇద్దరు కొత్త దర్శకులను పరిచయం చేస్తూ ఈస్ట్‌ వెస్ట్‌ ఎంటర్టైనర్స్‌ సమర్పణలో రెండు సినిమాల షూటింగ్స్‌ ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఖుషి టాకీస్‌ బ్యానర్‌ పై ‘సీత ప్రయాణం కష్ణతో’ అనే చిత్రం, మహీ మీడియా వర్క్స్‌ బ్యానర్‌ పై ‘త్రిగుణి’ చిత్రం లాంఛనంగా ముహూర్తం షాట్‌తో మొదలయ్యాయి. ఈ రెండు చిత్రాల ముహూర్తం షాట్స్‌కి తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్‌ కెమెరా స్విచ్‌ ఆన్‌ చేయగా, దర్శకులు దాసరి మారుతి తొలి క్లాప్‌ కొట్టారు.
ఆ తర్వాత ఈ రెండు చిత్రాల తొలి పోస్టర్లను లాంచ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విరాట పర్వం దర్శకుడు వేణు ఉడుగుల, తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌, డార్లింగ్‌ స్వామి, రుద్రాపట్ల వేణుగోపాల్‌, రామ్‌ రావిపల్లి తదితరులు పాల్గొన్నారు.
ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే సన్నివేశాలతో నడిచే ఫ్యామిలీ డ్రామా కథాంశంతో రానున్న ‘సీత ప్రయాణం కష్ణ’తో అనే సినిమాలో నాయకానాయికలుగా రోజా ఖుషి, దినేష్‌ నటిస్తున్నారు. వీరితో పాటు అనుపమ, సుమంత్‌, వైభవ్‌ తదితరులు నటిస్తున్నారని దర్శకుడు దేవేందర్‌ చెప్పారు. ‘త్రిగుణి’ సినిమాలో హీరోగా కుషాల్‌, ఒక ప్రత్యేక పాత్రలో రోజా ఖుషి నటిస్తుండగా, మిగిలిన పాత్రలకు అందరూ కొత్త నటీనటులనే పరిచయం చేస్తున్నామని చిత్ర దర్శకుడు వైతహవ్య వడ్లమాని తెలిపారు. సీత ప్రయాణం కష్ణతో చిత్రానికి సినిమాటోగ్రఫీ:రవీంద్ర, సంగీతం: హనుమాన్‌త్సవటపల్లి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చెర్రీ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: రుద్రపట్ల వేణుగోపాల్‌, చీఫ్‌ అడ్వైజర్‌: రామ్‌ రావిపల్లి, నిర్మాత: రోజా భారతి, డైరెక్టర్‌ : దేవేందర్‌. త్రిగుణి చిత్రానికి సినిమాటోగ్రఫీ:సలీం, సంగీతం: హనుమాన్‌ త్సవటపల్లి, నిర్మాత: మహేశ్వరి, కథ: వంశీ, డైరెక్టర్‌ : వైతహవ్య వడ్లమాని.

]]>