Cover Page Archives - https://navatelangana.com/category/cover-page/ Sat, 05 Oct 2024 17:20:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Cover Page Archives - https://navatelangana.com/category/cover-page/ 32 32 సిత్రాలు సూడరో… ఇంటి అందానికి ‘సోఫా’నం https://navatelangana.com/sitras-are-the-sofa-for-the-beauty-of-a-pseudoro-home/ Sat, 05 Oct 2024 17:20:14 +0000 https://navatelangana.com/?p=411271 Pictures are fake... 'Sofa' for home beautyలక్షలు, కోట్లు వెచ్చించి విల్లాలు, డ్యూప్లెక్స్‌ లాంటి గహాల్లో అందుకు తగ్గ ఫర్నిచర్‌ కూడా ఉండాల్సిందే. ఈ రోజుల్లో అందరి డ్రాయింగ్‌ రూముల్లో సోఫా తప్పనిసరి ఫర్నిచర్‌ అయింది. సోఫాలంటే సాధారణంగా ఇంటికి వచ్చిన అతిధులు కూర్చుని వెళ్లిపోయే అవసరమైన ఫర్నిచర్‌గా ఉండేది. కానీ నేడు సోఫా సెట్లు ఇంటి అలంకరణలో భాగం గానూ, మన జీవన శైలిని ప్రదర్శించే ఉపకరణాలు గాను తయారయ్యాయి. తాజాగా అందుబాటులోకి లెదర్‌, కాటన్‌, జెకార్డ్‌, సిల్క్‌, వెలెనిల్‌ మెటీరియల్‌ రకరకాలైన సోఫాసెట్స్‌ వస్తున్నాయి. ఎల్‌-టైప్‌, యు-టైవ్‌ సోఫాలు ఇంటిలోనే తయారు చేసుకునే అవకాశం ఉంది. సోఫా ముందు ఏదో కొంత ఖాళీ స్థలం ఉంది. కదా అని ఏదో ఒక టేబుల్‌ వేసేస్తే సరిపోదు. సెంటర్‌ టేబుల్‌ ఎంచుకునే విధానంలోనూ కొత్త దనం కనిపించాలి. గోడకు దగ్గరగా లేదా గోడ చివరగా సోఫాను అమర్చుకోవడంవల్ల ఆ గది విశాలంగా కనిపి స్తుంది. అలా చేయడంవల్ల మధ్యలో ఎక్కువ ఖాళీ ప్రదేశం వున్నట్లు కనిపిస్తుంది.
– ఆనంద ‘మైత్రేయ’మ్‌, హైదరాబాద్‌

]]>
నీడలతో ‘క్రీడ’లు https://navatelangana.com/sports-with-shadows/ Sat, 21 Sep 2024 17:16:44 +0000 https://navatelangana.com/?p=400604 'Sports' with shadowsదీపం ఇంటికి వెలుగునిస్తుంది. మరి దాని నీడ.. ఇంటికి అందాన్నిస్తుంది. నీడనూ కళాఖండంలా మార్చేసి ఇంటిని అలంకరిస్తున్నారు సజనకారులు. అవే క్యాండిల్‌ షాడో ప్రొజెక్టర్లు.. వీటిలో నూనె దీపాలు, బ్యాటరీలతో పనిచేసే లైట్లు అలాంటివే. కొవ్వొత్తి /నూనె దీపపు కాంతిలో చేతి వేళ్లను రకరకాలు తిప్పి, గోడపై అమ్మ వేసే నీడ బొమ్మల్ని చూస్తే చిన్న పిల్లలకు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో చెప్పనక్కర్లేదు. ఈ షాడో ప్రొజెక్టర్‌ దీపపు బుడ్డీల్లో సువాసనలు వెదజల్లే నూనెను పోసి వెలిగించవచ్చు. కళ ఎంతో అందంగానూ, సహజంగానూ ఉంటుంది. కరెంటుతో, రీఛార్జబుల్‌ బ్యాటరీలతో పనిచేసే షాడో ప్రొజెక్టర్లు ఇవే ఆకారాల్లో వస్తున్నాయి. వీటి వెలుగు కూడా అచ్చం కొవ్వొత్తుల కాంతిలానే ఉంటుంది. అన్నింటికీ మించి రాత్రిపూట వీటితో ఇంటిని ఎంతో వినూత్నంగా అలంకరించుకోవచ్చు.

– ఆనంద ‘మైత్రేయ’మ్‌, హైదరాబాద్‌

]]>
కాగితపు ‘కళ’లు https://navatelangana.com/paper-arts/ Sat, 31 Aug 2024 16:16:45 +0000 https://navatelangana.com/?p=380750 Paper 'art'క్విల్లింగ్‌ ఆర్ట్‌. ఖాళీ సమయాల్లో అద్భుతమైన కళాకృతులు చేయడానికి ఇదొక మార్గం. దీన్నే పేపర్‌ ఫిలిగ్రీ అనీ కూడా పిలుస్తారు. టర్కీ దేశపు ఇస్తాంబుల్‌ నగారానికి చెందిన ‘సెన రూన’ అనే అమ్మాయి చేతిలో రూపుదిద్దుకున్నవే ఈ కాగితపు కళారూపాలు. మొదట సరదాగా కాగితంతో బొమ్మలు చేసినా తర్వాత తనకి వచ్చిన గుర్తింపు, ప్రోత్సాహంతో చేస్తున్న ఉద్యోగం వదిలి పూర్తి స్థాయిలో ‘క్విల్లింగ్‌ పేపర్‌ ఆర్ట్‌’లో మునిగిపోయింది. ఇంటిని అలంకరించే ఫ్రేమ్స్‌, వాల్‌ హ్యాంగింగ్స్‌, ఫ్లవర్స్‌, పిల్లల బొమ్మలు వంటివి క్విల్లింగ్‌ లేదా ఫిలిగ్రీ ఆర్ట్‌ విధానంలో తయారు చేసి ప్రస్తుతం రెండు చేతులా సంపాదిస్తోంది. ‘కాస్త సమయాన్ని వచ్చించగిగితే అందమైన కళాకృతులను తయారు చేసుకోవచ్చు.
– ఆనంద మైత్రేయమ్‌

]]>
అభిరుచికి ‘కొమ్ము’ కాసే అందాలు https://navatelangana.com/horny-charms-for-passion/ Sat, 17 Aug 2024 15:05:37 +0000 https://navatelangana.com/?p=368269 Beauties that 'horn' the tasteహార్న్‌ అండ్‌ బోన్‌ క్రాఫ్ట్‌ అనేది పర్లాకిమిడి కళాకారుల సాంస్కతిక వారసత్వం. ఆవు కొమ్ములు, గేదెల కొమ్ములు, స్టాగ్‌ కొమ్ములను ఉపయోగిస్తారు. క్లుప్తంగా చెప్పాలంటే నీటిలో నానబెట్టిన తర్వాత కొమ్ము చెక్కబడుతుంది. ఆకతి కోసం, చెక్కిన ముక్కలు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతకు వేడి చేయబడతాయి. మొదట ఇసుక పేపర్‌తో, ఆపై తడి కష్ణ ఆకులతో రుద్దడం చేస్తారు. కొమ్ము మెరిసే వరకు పాలిషింగ్‌ కొనసాగుతుంది. పూర్తిగా నీటితో శుభ్రం చేసి ఎండబెట్టిన తర్వాత వీటిని ఆవు పేడ బూడిద లేదా బొగ్గు బూడిదతో మరింత పాలిష్‌ చేస్తారు. లైమ్‌స్టోన్‌ పేస్ట్‌ లేదా వైట్‌ వార్నిష్‌ని వర్తింపజేయడం వల్ల కావలసిన ప్రాంతాలను హైలైట్‌ చేస్తుంది. చివరగా కొబ్బరి నూనెను కళాఖండం అంతటా పూయడం వల్ల
అందమైన మెరుపు వస్తుంది.
– ఆనంద ‘మైత్రేయ’మ్‌, హైదరాబాద్‌

]]>
కాఫీతోనూ బొమ్మ’లాటే’ https://navatelangana.com/like-a-toy-with-coffee/ Sat, 03 Aug 2024 16:19:33 +0000 https://navatelangana.com/?p=355982 Toy 'latte' with coffeeకాఫీ కప్పులో వివిధ కళాత్మక రూపాలను పాల నురగతో ఆవిష్కరించడాన్నే ‘లాటే ఆర్ట్‌’గా పిలుస్తారు. ఇటలీలో మొదటగా వెలుగులోకి వచ్చిన లాటే -ఆర్ట్‌ అమెరికాకు విస్తరించింది. లాటే ఆర్ట్‌ కోసం ఉపయోగించే కాఫీకి మాత్రం ముందుగా డికాషన్‌ పోసి అనంతరం ఒక పొరలా పాల నురగను పరుస్తారు. ఆ పైన క్రీమ్‌ లేదా మిల్క్‌ చాక్లెట్‌లను పోస్తారు. అనంతరం వాటిపై వివిధ రకాల ఆకృతులను ఆవిష్కరిస్తారు. కాఫీ కప్పును కళాత్మకంగా తీర్చిదిద్దే లాటే ఆర్ట్‌లోనూ రెండు ముఖ్యమైన రకాలున్నాయి. అవి ఫ్రీ పౌరింగ్‌, ఎచింగ్‌. కాఫీ కప్పుపై క్రీమ్‌లేదా మిల్క్‌ చాక్లెట్‌లను పోసిన తరువాత ఒక పాత్రలో పాల నురగను తీసుకొని దాన్ని కాఫీ కప్పుపై ఒక ఆకృతిలో వచ్చేలా పోయడమే ఫ్రీ పౌరింగ్‌. కాఫీ కప్పుపై పరిచిన క్రీమ్‌పై ఒక సన్నటి టూత్‌పిక్‌ లేదా పదునైన కొన ఉన్న ఏదైనా వస్తువుతో వివిధ ఆకృతులను ఆవిష్కరించడాన్ని ‘ఎచింగ్‌’ గా పిలుస్తారు. ‘ఐ లవ్‌ యూ’ అని కాఫీపై రాయించి కొందరు ప్రపోజ్‌ చేస్తుంటే, ప్రేయసి బొమ్మను కాఫీపై వేయించే వారు మరి కొందరు. అందుకే ప్రస్తుతం ‘లాటే ఆర్ట్‌’లో నైపుణ్యం వారికి కాఫీ షాప్‌లలో డిమాండ్‌ ఎక్కువగా ఉంది.
– ఆనంద ‘మైత్రేయ’మ్‌, హైదరాబాద్‌

]]>
కేకో కేక!.. https://navatelangana.com/keko-keka/ Sat, 20 Jul 2024 16:56:09 +0000 https://navatelangana.com/?p=343584 Keko Keka!..ఆడుతూ.. పాడుతూ.. ఆనందోత్సాహ ఘడియలను ఆస్వాదించాలన్న ప్రజల ఉత్సాహం కేకులు, పండ్లు, పూల బొకేలకు విపరీతమైన డిమాండ్‌ సష్టించింది. ఎంగేజ్‌మెంట్‌, రిటైర్‌మెంట్‌, పండుగలు, పర్వదినాలు, వార్షికోత్సవాలు, వసంతోత్సవాలు ఇలా వేడుక ఏదైనా కేకు ఉండాల్సిందే. పండుగలు, పిల్లల అభిరుచిని బట్టి వివిధ రకాల కేకులు తయారు చేయడానికి తయారీదారులు ఆసక్తి చూపుతున్నారు. పిల్లల డ్రీమ్‌ క్యారెక్టర్లు, ట్రైన్‌, బస్‌, విమానం, పడవ, వివిధ రకాల బొమ్మలు, జంతువులు, మనుషులు, పక్షులు, గార్డెన్‌లు, జలాశయాలు, పుష్పాలు, స్విమ్మింగ్‌పూల్స్‌, వాహనాలు, బహుళ అంతస్తులు ఇలా ఒక్కటని కాదు, అనేక రకాల కేకులు ఇప్పుడు సర్వసాధారణం అయ్యాయి. వేడుకలను దష్టిలో పెట్టుకుని ఆయా విశేషాలు ప్రతిబింభించేలా, ఇష్టమైన తారల పుట్టిన రోజుకు వారి బొమ్మలతో కూడిన కేకులు వంటివి సర్వసాధారమయ్యాయి. సరదాతో పాటు రికార్డుల కోసం, నలుగురినీ ఆకర్షించాలనే ఉద్దేశ్యంతోనూ తయారు చేస్తున్న కేకులు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
– ఆనంద ‘మైత్రేయ’మ్‌, హైదరాబాద్‌

]]>
అక్షర నివాళి..! https://navatelangana.com/a-literal-tribute/ Sat, 08 Jun 2024 15:53:44 +0000 https://navatelangana.com/?p=310315 Ramoji-Raoతెలుగు భాషకు ఉషోదయం
తెలుగు వెలుగుకు మహోదయం
అన్ని రంగాలో ఘనాభ్యుదయం
రామోజీరావు గారు చెరుకూరి
వినూత్న వాణిజ్యాలలో విజయ భేరి..!
మధ్య తరగతి ప్రజలకు మెరుగైన మార్గదర్శి
తెలుగు పత్రికా ప్రపంచంలో వెలుగొందుతున్న దీర్ఘదర్శి
చిత్ర రంగాలలో అలుపెరుగని మహా మహర్షి
ప్రియమైన రుచులకు నోరూరించే అభిరుచి
మయుడికే ఉన్న మతిని పోయేలా
స్వయం కృషితో దివ్య తేజస్సుగా
హైదరాబాద్‌లో నిర్మించిన ఫిల్మ్‌ సిటీ .!
రాజకీయాలకు కొత్త భాష్యం రచించగల విదురుడు
వర్తమాన రాజకీయాలను శాసించే చండ శాసనుడు
కృష్ణా జిల్లాలో ఉదయించిన చిన్ని రామోజం
వసుధ యంతా విస్తరించె మహా వృక్షమై..!
ఆయన ప్రగతి కిరణాలు జగతిలో తిమిర సంహరణాలు ..!!.!
– జి.సూర్య నారాయణ, దివిసీమ.

]]>
‘యమహో’ ‘యమహా’… https://navatelangana.com/yamaha-is-yamaha/ Sat, 20 Apr 2024 15:51:10 +0000 https://navatelangana.com/?p=273642 సాధన, శ్రమ, పరిశీలన ద్వారా తనలో అంతర్గతంగా ఉన్న సృజనాత్మకతకు సానపడితే అది ప్రకాశిస్తుంది. వెలుగులోకి వస్తుందని రుజువు చేసాడు – అమెరికాకు చెందిన ‘రాబర్ట్‌ జెఫర్సన్‌ ట్రావిస్‌ పాండ్‌’. కేవలం ‘యమహా మోటారు బైక్‌’ కి సంబంధించిన పాత విడిభాగాలైన నట్లు, బోల్టులు, స్ప్రింగులు, ఫుట్రెస్ట్స్‌, హ్యాండిల్‌ బార్‌, హెడ్‌ లైట్స్‌, బ్రేక్స్‌, చైన్‌… ఇలా తుక్కు (స్క్రాప్‌) తో జంతువులనీ, పక్షులనీ, జలచరాలను నయనానందకరంగా, వైవిధ్యభరితంగా సష్టించాడు. అద్వితీయమైన గ్యాలరీలు ఏర్పాటు చేసి వీక్షకులకి ఆనందం కలిగిస్తూ చెత్తతో కొత్త వస్తువులను క్రియేట్‌ చేయవచ్చని గేర్‌ మార్చి మరీ తెలియచేస్తున్నాడు. ‘స్క్రాప్‌’ తో కళాకృతులను సృజిస్తూ ‘క్లాప్స్‌’ని సొంతం చేసుకుంటున్నాడు ‘పాండ్‌’. ఎవరైనా ప్రేరణ పొంది మరిన్ని సరికొత్త కళాఖండాల్ని ఆవిష్కరిస్తే అంతకన్నా కావల్సిందేముంది?
– ఆనంద ‘మైత్రేయ’మ్‌, హైదరాబాద్‌

]]>
మణి(కని)కట్టు అందాలు https://navatelangana.com/wrist-charms/ Sun, 17 Mar 2024 02:24:30 +0000 https://navatelangana.com/?p=250712 ట్రెండ్‌ సష్టించాలన్నా… స్టైల్‌ ని ఫాలో అవ్వాలన్నా కుర్ర’కారు’ ఎప్పుడూ స్పీడే. దుస్తుల నుంచీ, యాక్ససరీస్‌ వరకూ కొత్త ఫ్యాషన్‌ ని ఫాలో అవుతూనే ఉంటుంది నేటి యువతరం. అమ్మాయి, అబ్బాయిల యాక్ససరీస్‌లో మరింత స్టైల్‌గా ముందుంటాయి ‘లెదర్‌ కఫ్స్‌’. బంగారం, వెండి,స్టెయిన్‌ లెస్‌ స్టీలూ, బ్లాక్‌ మెటల్‌, రబ్బర్‌ వాచీలు, బ్రేస్‌లెట్‌ స్థానంలో లెదర్‌ కఫ్స్‌ అందాలు ధగధగలాడుతున్నాయి. వీటి వెడల్పు అంగుళం నుంచి మూడు అంగుళాల వరకూ ఉంటుంది. డిజైన్ల సంగతి సరేసరి. రంగురంగులతో మెరిసిపోతుంటాయి. బ్లాక్‌ కలర్‌ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. అమ్మాయిల కఫ్‌ బ్రేస్‌లెట్లలో ఆకర్షణీయమైన బకెల్‌ లేదా లాకెట్లు అమర్చినవి ఎక్కువగా లభిస్తున్నాయి. బకెల్‌ ఉంటే అది అదనపు ఆకర్షణే. బటన్స్‌, పక్షులు, కీటకాల బొమ్మలు అందాన్ని ద్విగుణీకతం చేస్తాయి. వాచీలు కూడా కఫ్స్‌ మధ్యలో ఫిక్స్‌ చేసి ఉండటం మనం చూడొచ్చు.

– ఆనంద ‘మైత్రేయ’మ్‌, హైదరాబాద్‌

]]>
పగటి నక్షత్రాలు !.. https://navatelangana.com/day-stars/ Sat, 13 Jan 2024 17:36:05 +0000 https://navatelangana.com/?p=204314 పతంగుల పండుగంటే ఆనందాల మేళవింపు. సంక్రాంతి సెలవులిచ్చేస్తే పిల్లలకు మొదట గుర్తుకొచ్చేది పతంగులే.
ఆకాశమే హద్దుగా ఎదురుగాలిని ఎదుర్కొంటూ వినువీధిలోకి దూసుకుపోయే గాలిపటం ఎందరికో ఆదర్శం. శాస్త్ర, సాంకేతిక అంశాలు, ఇతర పక్షులు, ప్రకతి సోయగాలు, కార్టున్‌ బొమ్మల కైట్‌లు ఆకట్టుకుంటున్నాయి. రాత్రుళ్లు కూడా గాలి పటాలు ఎగరేస్తారు. వెలుగులు నింపుకున్న పతంగులు ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తూ కనిపిస్తాయి.
1754లో బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌ ఆకాశంలోని విద్యుత్‌ గురించి తెలుసుకునేందుకు పతంగులను వాడాడట.
ఢిల్లీ ‘దర్వాజా’ కూడా పతంగుల మార్కెట్‌కు పేరు. ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబులు పతంగుల క్రీడను బాగా ప్రోత్సహించే వారట.
క్రీస్తుపూర్వం 206లో చైనాలో హేన్‌ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావటానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతారు. ‘హేన్‌ చక్రవర్తి’కి వచ్చిన ఉపాయమే తొలి గాలిపటం.
సుమారు 400 సంవత్సరాల పూర్వం అమెరికాలోని టరెంటం ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త ఆర్‌కే తొలిసారి పతంగిని ఆవిష్కరించినట్టు చరిత్ర చెప్తోంది.
జపాన్‌లో 5నుంచి 8 అడుగుల పతంగులను ఎగురువేస్తారట. కొన్ని పతంగుల బరువు 200 కిలోలదాకా ఉంటుందిట.
పావురాళ్లు, కంచర గాడిదలు మొదలైన వాటి ద్వారానే కాకుండా పూర్వం పతంగుల ద్వారానూ తపాలా సేవలు కొనసాగినట్లు చరిత్ర చెబుతోంది.
1870లో లారెన్స్‌ హర్‌గ్రీవ్స్‌ అనే శాస్త్రజ్ఞుడు ‘బాక్స్‌ కైట్‌’ ను సిద్ధం చేసి అందులో వైజ్ఞానిక పరికరాలను అమర్చి, తద్వారా ఎన్నో పరిశోధనల్ని నిర్వహించారు.
19వ శతాబ్దంలో పతంగితో కెమెరాను జతచేసి ఎంతో ఎత్తుకు ఎగురవేసి, పై నుంచి భూమి ఫొటోలు తీశారు..
థారులాండ్‌లో పతంగులు ఎగురవేయాలంటే ’78 రకాల నిబంధనలు’ పాటించాల్సి ఉంటుంది.
బెర్లిన్‌ గోడపై నుంచి అవతలికి వెళ్ళే అవకాశం వుండడంతో భారీ పతంగులను తూర్పు జర్మనీలో నిషేధం విధించారు.
గాలిపటాలను చూడటం కంటిచూపును మెరుగుపరుస్తుందని చైనీయుల విశ్వాసం. తల బాగా పైకి ఎత్తి చూసేటపుడు నోరు కొద్దిగా తెరచుకుంటుందని, అది శరీరానికి శక్తిని ఇస్తుందని వారు నమ్ముతారు.
ప్రపంచంలో ఏదో ఒకచోట ప్రతి వారం ఒక కైట్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోనైతే సంక్రాంతి రోజున ఏకంగా అంతర్జాతీయ పతంగుల పండగే జరుగుతుంది
పతంగుల మ్యూజియం కూడా ఉంది. జమ్మూ కశ్మీర్‌లో రాఖీ పౌర్ణమికి గాలిపటాలు ఎగరేస్తుంటారు.
అయితే పతంగులు ఎగరేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వుండాలి. ఎందుకంటే భవనాలు, మిద్దెలు, సగం నిర్మించిన గోడమీద నుండి పతంగులు ఎగరేసే వారు, వాటిని పట్టుకునే యత్నంలో ప్రమాదవశాత్తూ కింద పడే ప్రమాదముంది. విద్యుత్‌ తీగలమీద పడిన గాలిపటాలను తీసేందుకు ప్రయత్నం చేయరాదు. గాలిపటాలకు వాడే మాంజా పక్షుల కాళ్లకు చుట్టుకుని చనిపోతున్నాయి.
– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి.
8088 577 834

]]>
శివసముద్ర జలపాతం https://navatelangana.com/shivasamudra-falls/ Sat, 19 Aug 2023 18:24:05 +0000 https://navatelangana.com/?p=79035 పాల నురగలాంటి ఈ జలపాతం పేరు శివసముద్ర జలపాతం. బెంగళూరుకి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతం భారచుక్కి, గగనచుక్కి అనే రెండు జలపాతాల కలయికతో ఏర్పడింది. ఈ జలపాతం దగ్గర వున్న పవర్‌ స్టేషన్‌ ఆసియాలోనే మొట్టమొదటిది. ఈ జలపాతం చూడ్డానికి పర్యాటకులు వారాంతాల్లో విపరీతంగా వస్తుంటారట.

]]>
జ్ఞాపకాల పుటలే ఫొటోలు. https://navatelangana.com/photos-are-pages-of-memories/ Sat, 12 Aug 2023 18:43:18 +0000 https://navatelangana.com/?p=73836 జ్ఞాపకాల పుటలే ఫొటోలు. సంతోషం, ఆనందం, బాధ, విషాదం… సందర్భం, సంఘటన ఏదైనా సరే… ఆ క్షణాల్ని ఒడిసి పట్టుకుని ఫొటోల రూపంలో కలకాలం పదిలపరుచుకుంటాం. స్వతంత్రం పొందినప్పటి ఆనంద క్షణాలైనా, హిరోషిమా బాంబు దాడి లాంటి చేదు ఘటనలైనా ఇప్పటికీ మననం చేసుకుంటున్నామంటే దానికి కారణం ఫొటోలే. వెయ్యి పదాలు చెప్పలేనిది ఒక్క ఫొటో చెప్తుంది అంటారు. వివిధ సందర్భాల్లో బెస్ట్‌ ఫొటోగ్రఫీ అవార్డును సొంతం చేసుకున్న ఫొటోలు ఇవి.ఆగస్టు 19 ఫొటోగ్రఫీ డే సందర్భంగా… 

]]>