Cover Page Archives - https://navatelangana.com/category/cover-page/ Sat, 20 Apr 2024 15:51:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Cover Page Archives - https://navatelangana.com/category/cover-page/ 32 32 ‘యమహో’ ‘యమహా’… https://navatelangana.com/yamaha-is-yamaha/ Sat, 20 Apr 2024 15:51:10 +0000 https://navatelangana.com/?p=273642 సాధన, శ్రమ, పరిశీలన ద్వారా తనలో అంతర్గతంగా ఉన్న సృజనాత్మకతకు సానపడితే అది ప్రకాశిస్తుంది. వెలుగులోకి వస్తుందని రుజువు చేసాడు – అమెరికాకు చెందిన ‘రాబర్ట్‌ జెఫర్సన్‌ ట్రావిస్‌ పాండ్‌’. కేవలం ‘యమహా మోటారు బైక్‌’ కి సంబంధించిన పాత విడిభాగాలైన నట్లు, బోల్టులు, స్ప్రింగులు, ఫుట్రెస్ట్స్‌, హ్యాండిల్‌ బార్‌, హెడ్‌ లైట్స్‌, బ్రేక్స్‌, చైన్‌… ఇలా తుక్కు (స్క్రాప్‌) తో జంతువులనీ, పక్షులనీ, జలచరాలను నయనానందకరంగా, వైవిధ్యభరితంగా సష్టించాడు. అద్వితీయమైన గ్యాలరీలు ఏర్పాటు చేసి వీక్షకులకి ఆనందం కలిగిస్తూ చెత్తతో కొత్త వస్తువులను క్రియేట్‌ చేయవచ్చని గేర్‌ మార్చి మరీ తెలియచేస్తున్నాడు. ‘స్క్రాప్‌’ తో కళాకృతులను సృజిస్తూ ‘క్లాప్స్‌’ని సొంతం చేసుకుంటున్నాడు ‘పాండ్‌’. ఎవరైనా ప్రేరణ పొంది మరిన్ని సరికొత్త కళాఖండాల్ని ఆవిష్కరిస్తే అంతకన్నా కావల్సిందేముంది?
– ఆనంద ‘మైత్రేయ’మ్‌, హైదరాబాద్‌

]]>
మణి(కని)కట్టు అందాలు https://navatelangana.com/wrist-charms/ Sun, 17 Mar 2024 02:24:30 +0000 https://navatelangana.com/?p=250712 ట్రెండ్‌ సష్టించాలన్నా… స్టైల్‌ ని ఫాలో అవ్వాలన్నా కుర్ర’కారు’ ఎప్పుడూ స్పీడే. దుస్తుల నుంచీ, యాక్ససరీస్‌ వరకూ కొత్త ఫ్యాషన్‌ ని ఫాలో అవుతూనే ఉంటుంది నేటి యువతరం. అమ్మాయి, అబ్బాయిల యాక్ససరీస్‌లో మరింత స్టైల్‌గా ముందుంటాయి ‘లెదర్‌ కఫ్స్‌’. బంగారం, వెండి,స్టెయిన్‌ లెస్‌ స్టీలూ, బ్లాక్‌ మెటల్‌, రబ్బర్‌ వాచీలు, బ్రేస్‌లెట్‌ స్థానంలో లెదర్‌ కఫ్స్‌ అందాలు ధగధగలాడుతున్నాయి. వీటి వెడల్పు అంగుళం నుంచి మూడు అంగుళాల వరకూ ఉంటుంది. డిజైన్ల సంగతి సరేసరి. రంగురంగులతో మెరిసిపోతుంటాయి. బ్లాక్‌ కలర్‌ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. అమ్మాయిల కఫ్‌ బ్రేస్‌లెట్లలో ఆకర్షణీయమైన బకెల్‌ లేదా లాకెట్లు అమర్చినవి ఎక్కువగా లభిస్తున్నాయి. బకెల్‌ ఉంటే అది అదనపు ఆకర్షణే. బటన్స్‌, పక్షులు, కీటకాల బొమ్మలు అందాన్ని ద్విగుణీకతం చేస్తాయి. వాచీలు కూడా కఫ్స్‌ మధ్యలో ఫిక్స్‌ చేసి ఉండటం మనం చూడొచ్చు.

– ఆనంద ‘మైత్రేయ’మ్‌, హైదరాబాద్‌

]]>
పగటి నక్షత్రాలు !.. https://navatelangana.com/day-stars/ Sat, 13 Jan 2024 17:36:05 +0000 https://navatelangana.com/?p=204314 పతంగుల పండుగంటే ఆనందాల మేళవింపు. సంక్రాంతి సెలవులిచ్చేస్తే పిల్లలకు మొదట గుర్తుకొచ్చేది పతంగులే.
ఆకాశమే హద్దుగా ఎదురుగాలిని ఎదుర్కొంటూ వినువీధిలోకి దూసుకుపోయే గాలిపటం ఎందరికో ఆదర్శం. శాస్త్ర, సాంకేతిక అంశాలు, ఇతర పక్షులు, ప్రకతి సోయగాలు, కార్టున్‌ బొమ్మల కైట్‌లు ఆకట్టుకుంటున్నాయి. రాత్రుళ్లు కూడా గాలి పటాలు ఎగరేస్తారు. వెలుగులు నింపుకున్న పతంగులు ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తూ కనిపిస్తాయి.
1754లో బెంజిమన్‌ ఫ్రాంక్లిన్‌ ఆకాశంలోని విద్యుత్‌ గురించి తెలుసుకునేందుకు పతంగులను వాడాడట.
ఢిల్లీ ‘దర్వాజా’ కూడా పతంగుల మార్కెట్‌కు పేరు. ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబులు పతంగుల క్రీడను బాగా ప్రోత్సహించే వారట.
క్రీస్తుపూర్వం 206లో చైనాలో హేన్‌ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావటానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతారు. ‘హేన్‌ చక్రవర్తి’కి వచ్చిన ఉపాయమే తొలి గాలిపటం.
సుమారు 400 సంవత్సరాల పూర్వం అమెరికాలోని టరెంటం ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త ఆర్‌కే తొలిసారి పతంగిని ఆవిష్కరించినట్టు చరిత్ర చెప్తోంది.
జపాన్‌లో 5నుంచి 8 అడుగుల పతంగులను ఎగురువేస్తారట. కొన్ని పతంగుల బరువు 200 కిలోలదాకా ఉంటుందిట.
పావురాళ్లు, కంచర గాడిదలు మొదలైన వాటి ద్వారానే కాకుండా పూర్వం పతంగుల ద్వారానూ తపాలా సేవలు కొనసాగినట్లు చరిత్ర చెబుతోంది.
1870లో లారెన్స్‌ హర్‌గ్రీవ్స్‌ అనే శాస్త్రజ్ఞుడు ‘బాక్స్‌ కైట్‌’ ను సిద్ధం చేసి అందులో వైజ్ఞానిక పరికరాలను అమర్చి, తద్వారా ఎన్నో పరిశోధనల్ని నిర్వహించారు.
19వ శతాబ్దంలో పతంగితో కెమెరాను జతచేసి ఎంతో ఎత్తుకు ఎగురవేసి, పై నుంచి భూమి ఫొటోలు తీశారు..
థారులాండ్‌లో పతంగులు ఎగురవేయాలంటే ’78 రకాల నిబంధనలు’ పాటించాల్సి ఉంటుంది.
బెర్లిన్‌ గోడపై నుంచి అవతలికి వెళ్ళే అవకాశం వుండడంతో భారీ పతంగులను తూర్పు జర్మనీలో నిషేధం విధించారు.
గాలిపటాలను చూడటం కంటిచూపును మెరుగుపరుస్తుందని చైనీయుల విశ్వాసం. తల బాగా పైకి ఎత్తి చూసేటపుడు నోరు కొద్దిగా తెరచుకుంటుందని, అది శరీరానికి శక్తిని ఇస్తుందని వారు నమ్ముతారు.
ప్రపంచంలో ఏదో ఒకచోట ప్రతి వారం ఒక కైట్‌ ఫెస్టివల్‌ జరుగుతుంది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోనైతే సంక్రాంతి రోజున ఏకంగా అంతర్జాతీయ పతంగుల పండగే జరుగుతుంది
పతంగుల మ్యూజియం కూడా ఉంది. జమ్మూ కశ్మీర్‌లో రాఖీ పౌర్ణమికి గాలిపటాలు ఎగరేస్తుంటారు.
అయితే పతంగులు ఎగరేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వుండాలి. ఎందుకంటే భవనాలు, మిద్దెలు, సగం నిర్మించిన గోడమీద నుండి పతంగులు ఎగరేసే వారు, వాటిని పట్టుకునే యత్నంలో ప్రమాదవశాత్తూ కింద పడే ప్రమాదముంది. విద్యుత్‌ తీగలమీద పడిన గాలిపటాలను తీసేందుకు ప్రయత్నం చేయరాదు. గాలిపటాలకు వాడే మాంజా పక్షుల కాళ్లకు చుట్టుకుని చనిపోతున్నాయి.
– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి.
8088 577 834

]]>
శివసముద్ర జలపాతం https://navatelangana.com/shivasamudra-falls/ Sat, 19 Aug 2023 18:24:05 +0000 https://navatelangana.com/?p=79035 పాల నురగలాంటి ఈ జలపాతం పేరు శివసముద్ర జలపాతం. బెంగళూరుకి 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతం భారచుక్కి, గగనచుక్కి అనే రెండు జలపాతాల కలయికతో ఏర్పడింది. ఈ జలపాతం దగ్గర వున్న పవర్‌ స్టేషన్‌ ఆసియాలోనే మొట్టమొదటిది. ఈ జలపాతం చూడ్డానికి పర్యాటకులు వారాంతాల్లో విపరీతంగా వస్తుంటారట.

]]>
జ్ఞాపకాల పుటలే ఫొటోలు. https://navatelangana.com/photos-are-pages-of-memories/ Sat, 12 Aug 2023 18:43:18 +0000 https://navatelangana.com/?p=73836 జ్ఞాపకాల పుటలే ఫొటోలు. సంతోషం, ఆనందం, బాధ, విషాదం… సందర్భం, సంఘటన ఏదైనా సరే… ఆ క్షణాల్ని ఒడిసి పట్టుకుని ఫొటోల రూపంలో కలకాలం పదిలపరుచుకుంటాం. స్వతంత్రం పొందినప్పటి ఆనంద క్షణాలైనా, హిరోషిమా బాంబు దాడి లాంటి చేదు ఘటనలైనా ఇప్పటికీ మననం చేసుకుంటున్నామంటే దానికి కారణం ఫొటోలే. వెయ్యి పదాలు చెప్పలేనిది ఒక్క ఫొటో చెప్తుంది అంటారు. వివిధ సందర్భాల్లో బెస్ట్‌ ఫొటోగ్రఫీ అవార్డును సొంతం చేసుకున్న ఫొటోలు ఇవి.ఆగస్టు 19 ఫొటోగ్రఫీ డే సందర్భంగా… 

]]>
ఈ చెట్టుని చూశారుగా https://navatelangana.com/seeing-this-tree/ Sat, 08 Jul 2023 18:10:14 +0000 https://navatelangana.com/?p=49950 ఎంత పొడవుగా వుందో! ప్రపంచంలో అతి పొడవైన చెట్టు ఇదే. పేరు హైపర్యాన్‌. ఉత్తర కాలిఫోర్నియాలో వుంది. కోస్ట్‌ రెడ్‌ వుడ్‌ జాతికి చెందిన ఈ చెట్టు పొడవు 115.92 మీటర్లు. ఈ జాతిలో నాలుగు వందల సంవత్సరాల వయసున్న చెట్ల నుండి 1500 సంత్సరాల వయసు చెట్ల వరకు వున్నాయట. ఈ చెట్టు చుట్టుకొలత కొలవాలంటే కనీసం ఓ 25 మంది తమ రెండు చేతులు చాపితే కానీ సాధ్యం కాదు.

]]>
పూర్తిగా మంచు దుప్పటి కప్పుకుని https://navatelangana.com/completely-covered-with-a-blanket-of-snow/ Sat, 27 May 2023 19:43:53 +0000 https://navatelangana.com/?p=22913 ఎంతో సుందరంగా కనిపిస్తున్న ఈ పర్వతం సోన్‌ మార్గ్‌లోని జీరో పాయింట్‌ దగ్గర వుంది. తజివాస్‌ గ్లాసియర్‌ కు గుర్రాల దారి. సోనామార్గ్‌ అంటే ‘బంగారు పచ్చికభూమి’ అని అర్ధం. ఇది జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బాల్‌ జిల్లాలోని ఒక హిల్‌ స్టేషన్‌. గందర్‌బల్‌ టౌన్‌ నుండి 62 కిలోమీటర్ల దూరంలో రాజధాని నగరం శ్రీనగర్‌కు ఈశాన్యంగా 80 కిలోమీటర్లు (50 మైళ్ళు) దూరంలో ఉంది.

ఫొటో : నాంపల్లి సుజాత

]]>
భిన్నత్వంలో ఏకత్వం. https://navatelangana.com/unity-in-diversity/ Sat, 27 May 2023 16:46:45 +0000 https://navatelangana.com/?p=22795 వారణాసి భిన్నత్వంలో ఏకత్వం.
దాన్ని కళ్ళారా చూడడం
వొక చారిత్రాత్మక అనుభూతి.
– భార్గవ
95819 53939

]]>
రెయిన్‌బో పర్వతాలు https://navatelangana.com/rainbow-mountains/ Sat, 20 May 2023 20:30:16 +0000 https://navatelangana.com/?p=16903 ఇంధ్రదనస్సును తలపించే ఈ పర్వతాల పేరు కూడా రెయిన్‌బో పర్వతాలే.
ఇవి చైనాలోని గాన్సూ ప్రాంతంలోని జాంగే దన్‌షా నేషనల్‌ పార్క్‌లో వున్నాయి.
చైనాలోని జాంగే దన్‌షా నేషనల్‌ పార్క్‌లోని రెయిన్‌బో పర్వతాలు ఇవి.
ఈ ప్రాంతం 2009లో యునెస్కోవారి గుర్తింపు పొందింది.

]]>
వారధి https://navatelangana.com/the-bridge/ Sat, 20 May 2023 17:47:22 +0000 https://navatelangana.com/?p=16739 ఈ గతానికి భవిష్యత్‌ కు వారధి లాంటివాడు ఫొటోగ్రాఫర్‌.
ఫొటో అంటే చరిత్రను రికార్డ్‌ చేయడమే నా దృష్టిలో..
– బసాడ సంపత్‌, 7032132593

]]>
ధోలావిర… https://navatelangana.com/%e0%b0%a7%e0%b1%8b%e0%b0%b2%e0%b0%be%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b0/ Mon, 28 Nov 2022 23:05:33 +0000 https://dev.navatelangana.com/?p=1052

ధోలావిర… సింధు లోయ నాగరికతతో ముడిపడి ఉన్న భారతదేశంలోని అత్యంత ప్రముఖ పురాతన ప్రదేశం, రెండు అతిపెద్ద హరప్పా నాగరికతలలో ఒకటి. అంతేకాదు, మన ఉపఖండంలో 5వ అతిపెద్దది. 4500 ఏండ్ల కిందటి ఈ ప్రదేశాన్ని గుజరాత్‌లోని కుచ్‌ జిల్లా బచావు తాలూకా ఖాదిర్‌బెట్‌లో 1968లో కనుగొన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో మన దేశంనుంచి ఎంపికైన వాటిలో నలభయ్యవ స్థానంలో ఉంది.

]]>
Great Indian Festival: 80 శాతానికి పైగా డిస్కౌంట్.. రూ.7 వేల స్మార్ట్‌వాచ్ రూ.1,199కే కొనేయండి! https://navatelangana.com/great-indian-festival-80/ Fri, 23 Sep 2022 04:57:49 +0000 https://dev.navatelangana.com/?p=665


Amazon Sale | చేతికి మంచి స్మార్ట్ వాచ్ ఒకటి కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తున్నాయి. స్మార్ట్ వాచ్‌లపై కళ్లుచెదిరే డీల్స్ సొంతం చేసుకోవచ్చు.
Amazon Offers | స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలని భావించే వారికి శుభవార్త. అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో (Amazon) సూపర్ ఆఫర్లు లభిస్తున్నాయి. వివిధ కంపెనీలకు చెందిన స్మార్ట్ వాచ్‌లపై (Smartwatch) భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కస్టమర్లకు ఈ ప్రయోజనాలు పొందొచ్చు. ఈ సేల్ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు.
బోట్ వేవ్ లైట్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 6,990గా ఉంది. అయితే దీన్ని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా కేవలం రూ. 1,199కే కొనుగోలు చేయొచ్చు. అంటే ఏకంగా 83 శాతం తగ్గింపు లభిస్తోందని చెప్పుకోవచ్చు. కొనుగోలుదారులు రూ. 5,700కు పైగా ఆదా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌పై కేవలం ఈ ఒక్క ఆఫర్ మాత్రమే అందుబాటులో ఉంది. మరే ఇతర ప్రయోజనాలు కూడా అందుబాటులో లేవు

]]>