Cover Story Archives - https://navatelangana.com/category/cover-story/ Sat, 19 Apr 2025 16:35:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Cover Story Archives - https://navatelangana.com/category/cover-story/ 32 32 వేసవి శిబిరాలు జ్ఞాన ఫ‌లాల తోట‌లు https://navatelangana.com/summer-camps-gardeners-of-gnostic-fala/ Sat, 19 Apr 2025 16:35:31 +0000 https://navatelangana.com/?p=549351 Summer camps are gardens of knowledge.పిల్లలకు వేసవి సెలవులు వచ్చేశారు! వెన్నంటనే వేసవి శిక్షణా శిబిరాలు వచ్చేస్తున్నారు. తామరతంపరలా పుట్టుకువచ్చే ఈ సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ల వల్ల పిల్లలు కాదు తల్లిదండ్రులు ఎక్కువ జాగ్రత్త పడాలి. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్‌ ప్రపంచంలో పిల్లల్ని కూడా ఓ సరుకులా (కమోడిటి) వాడుకుని సొమ్ము చేసుకుందామనుకునే ప్రబుద్ధులు ఎక్కువుగా తయారవుతున్నారు.
ఆధునిక జీవన శైలిలో ఉమ్మడి కుటుంబ సంస్కృతి దెబ్బతింటుంది. పిల్లల్ని ప్రేమగా పట్టించుకునేవారు కరువైపోతున్నారు. తల్లిదండ్రులు ఉద్యోగాలు, వృత్తులు, ఉపాధి రీత్యా తమ పనుల వెంట పరుగు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇంటివద్దే పిల్లల్ని కనిపెట్టుకుని ఉండే పరిస్థితి ఏ కొందరి తల్లులకు మాత్రమే దక్కుతున్నది. తల్లిదండ్రులు ఇద్దరూ పనులకు వెళ్తే మరి పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? సెలవులు ఇచ్చినప్పుడు ఏం చేయాలి?
అదిగో అప్పుడే పిల్లల కోసం మేం వున్నాం అంటూ సమ్మర్‌ క్యాంప్‌లు పుట్టుకొస్తున్నాయి. కేవలం పిల్లలను కనిపెట్టేందుకే సమ్మర్‌ క్యాంపులా? లేక తమ పిల్లలు తోటిపిల్లలతో కలిసి ఆనందంగా గడిపేందుకా అనేది ప్రాథమికంగా ఆలోచించుకోవాలి.
ఈ సమ్మర్‌ క్యాంపులు లెక్కలు, ఇంగ్లీషు, సైన్స్‌, ఐఐటి కోచింగ్‌లు ఇచ్చే ట్యూషన్‌ సెంటర్స్‌ వంటివి అయితే పిల్లలు మళ్లీ ఇబ్బంది పడే పరిస్థితి వుంటుంది. టెన్త్‌, ఇంటర్‌ చదివిన పిల్లలు కెరీర్‌ కోసం ప్రత్యేక శ్రద్ధ పెడుతూ అలాంటి కోచింగులు తీసుకుంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మిగతా తరగతుల పిల్లల్ని కూడా అదే విధంగా బలవంతంగా ఆ పరుగు పందెంలో (ర్యాట్‌ రేస్‌) గెలవాలనే కోరికతో పంపడం సరికాదు.
సెలవులు వచ్చాయంటే పిల్లలకు అదో ఆటవిడుపు. ఆడుకోవాలి, పాడుకోవాలి. ముఖ్యంగా లలిత కళలపై దృష్టి పెట్టాలి. అవి పిల్లల సమగ్ర వికాసానికి తోడ్పడతాయని తల్లిదండ్రులు గ్రహించాలి. లలితకళలంటే సాహిత్యం, సంగీతం, నాట్యం (నాటకం), చిత్రలేఖనం, శిల్పం మొదలైనవి. పిల్లల హృదయం మొద్దుబారకుండా ఈ లలిత కళలు ఉపకరిస్తాయి. జ్ఞానేంద్రియాలను (కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, మెదడు) చురుకుగా పనిచేయిస్తాయి. సున్నితంగా స్పందించడం, సృజనాత్మకంగా ఆలోచించడం నేర్పిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా నలుగురితో కలిసి ఈ కళలు నేర్చుకోవడం వలన పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయి.
చాలామంది పెద్దలు, టీచర్లు, తల్లిదండ్రులు ఇక్కడే పొరబడుతున్నారు. చదువు, జ్ఞానం రెండూ ఒకటేనని అనుకుంటున్నారు. చదువు వేరు, జ్ఞానం వేరు. పాఠశాలలకు, కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు వెళ్లడం చదువుకోవడం జీవితంలో ఓ మార్గం, ఓ పార్శ్వం మాత్రమే. కానీ అదే సంపూర్ణ జ్ఞానం కాదు. పుస్తకాల ద్వారా తెలుసుకునేది పరోక్ష జ్ఞానం. వచ్చేది అక్షర జ్ఞానం. కానీ ప్రతి మనిషికి పుట్టినప్పటి నుండి జ్ఞానం వస్తుంది (నాలెడ్జ్‌ కేం ఫ్రం సెన్సస్‌). చూడడం, వినడం, మాట్లాడడం, వాసన చూడడం, రుచులను గమనించడం, స్పర్శించడం, రాయడం వీటన్నింటివల్ల జ్ఞానం వస్తుంది. జ్ఞానం వృద్ధి చెందుతుంది. జీవితంలో విద్యాలయాల్లో చదువు, పరీక్షల వల్ల కలిగే జ్ఞానం కేవలం పదిశాతం మాత్రమే. మిగిలిన 90 శాతం జ్ఞానం ఇంద్రియాలను చక్కగా పనిచేయించడం వల్ల లభిస్తుంది. తత్సంబంధిత పునాది మన విద్యావ్యవస్థలో లోపించింది.
నేడు చదువు కేవలం ప్రశ్నలకు జవాబులు బట్టీపట్టి, పరీక్షల్లో రాసి మార్కులు, ర్యాంకులు పొందే స్థాయికి మాత్రమే పరిమితమైపోయింది. అందుకే పిల్లలకు చదువు అంటే పాఠాలు అర్థమైనా అర్థం కాకపోయినా బట్టీపట్టే యంత్రంలా మారాల్సిన దుస్థితి ఏర్పడింది.
పైగా ఇప్పుడు పులిమీద పుట్రలా పిల్లలకు సెల్‌ఫోన్‌లో ఆన్‌లైన్‌ కోచింగ్‌లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కలిసి కూర్చోవడం, సబ్జెక్టు గురించి మాట్లాడుకోవడం, లోతుగా చర్చించడం పూర్తిగా కనుమరుగైంది.
పుస్తకం ద్వారా తెలుసుకున్న అంశాన్ని పిల్లలు తమ అనుభవంలోకి తీసుకున్నప్పుడు మాత్రమే అది జ్ఞానంగా పరిణమిస్తుంది. వారి మనసులో ఇంకిపోతుంది. ఆ ఇంకిన జ్ఞానమే దృఢమైన పునాదిగా ఏర్పడి భవిష్యత్‌ జీవితాలకు పూలబాట పరుస్తుంది. ఇది శాస్త్రీయం.
పిల్లలకు అటువంటి దృఢమైన పునాదిని ఇచ్చేందుకు నర్సరీ, ప్రైమరీ స్కూళ్లతో పాటు వేసవి శిబిరాలు కూడా ఎంతో తోడ్పడతాయి. పిల్లలకు ఆ విధమైన ప్రేమతో కూడిన శిక్షణ, తర్పీదు ఎవరు ఇస్తున్నారో తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు వెళ్లి కనుక్కోవాలి.
కొన్ని శిబిరాల్లో విలువల పేరిట ఆశాస్త్రీయ భావాలను నూరిపోస్తారు. నేర్పేవారికి సైతం తెలియని, పిల్లలకు అర్థం కాని సంస్కృత శ్లోకాలు, ఇంగ్లీష్‌ రైమ్స్‌, ప్రేయర్స్‌ వల్లె వేయిస్తుంటారు. ఇది రాజ్యాంగ విరుద్దం. శాఖాహార, మాంసాహార విద్యార్థులను సైతం విభజించి భోజనాల సమయంలో దూరంగా కూర్చోబెడతారు. కులాల పేరిట మతాల పేరిట పిల్లలను గమనిస్తూ ఒకరిని ఎక్కువగాను, మరొకరిని చులకనగానూ చూస్తుంటారు. పిల్లలకు ఈ బేధభావం తెలియదని అనుకుంటారు. పిల్ల్లలు బయటకు వ్యక్తం చేయకపోయినా వారి లేత హృదయాలపై అవి బలమైన గాయాలయ్యేలా చేస్తాయి.
పిల్లలు సహజంగానే అరమరికలు లేకుండా హాయిగా స్నేహం చేస్తారు. కుల, మత, ప్రాంతీయ, భాష, లింగ బేధాలను సైతం అధిగమించి స్నేహం చేయగల స్వచ్ఛత వారిది. దానిని పెంచి పోషించే బాధ్యత పెద్దలది, టీచర్లది, నిర్వాహకులది.
అందుకే కవి ఆరుద్ర అంటారు… ‘పిల్లలూ దేవుడూ చల్లనివారే, కల్లకపటమెరుగనికరుణామయులే’ అని.
ఆ కరుణామృత సంద్రంలో ఓలలాడేలా పిల్లలకు శిక్షణనీయాలంటే పెద్దలకు ఎంత ఓర్పు, సహనం అవసరం? ప్లిలల స్థాయికి అలా ఎలా ఎదగాలి (దిగడం కాదు)?. తల్లిదండ్రులు పిల్లల అభిరుచిని గమనించి ఆ విధమైన శిక్షణను ఈ వేసవి శిబిరాల్లో ఇప్పించగలిగితే పిల్లలకు మరో కొత్తదారి చూపినవారవుతారు. ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు ఏ పిల్ల/ పిల్లవానిలో ఏ ప్రతిభ దాగుందో ఎవరికి తెలుసు?
పిల్లల అభిరుచికి తగ్గ శిక్షకులు లభ్యమైతే అదే పెద్ద విజయం. ఆసక్తికి శక్తి తోడవుతుంది. ఇక వెనక్కి చూసుకోనక్కర్లేదు. ముందుకే మునుముందుకే పోతారు. ఏ కళ అయినా అనంతం. జీవితమే స్వల్పం.
కళాసాధన ద్వారా ఆత్మసంతృప్తి లభిస్తుంది. పిల్లలకు ఇది అర్థమవుతుంది. ఏ డబ్బుతోనూ ఆత్మ సంతృప్తిని కొలవలేం. కొనలేం. పిల్లలు అలా ఆత్మ సంతృప్తికి లోనవుతున్నప్పుడు ధన వ్యామోహానికి దూరమవుతారు.
అలాగే పిల్లల్లో కరుణ, దయ, జాలి మొదలైన మానవీయ లక్షణాలు అలవడినప్పుడు సేవాతత్పరత కూడా వారి చిరుహృదయాల్లో మొగ్గ తొడుగుతుంది. తత్‌కారణంగా హింసకు, అరాచకానికి చెడు అలవాట్లకు దూరమవుతారు.
ఇవన్నీ మన పిల్లలకు ప్రాథమిక స్థాయిలోనే విద్యావ్యవస్థ కల్పించాల్సి వుంది. కానీ మన వ్యవస్థ నానాటికీ సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. అసలు మాతృభాష విషయంలోనే సరైన దృక్పథం లేకుండా వ్యవహరిస్తున్నది. భాష రాక అభివ్యక్తి, సమాచార నైపుణ్యాలను పిల్లలు కోల్పోతున్నారు. తమను తాము తెలుసుకునే తాత్విక చింతనకు కూడా దూరమవుతున్నారు.
పిల్లల బలాలు ఏమిటో, బలహీనతలేమిటో తల్లిదండ్రులు సహేతుకంగా తెలుసుకోవాలి. ఆ బలహీనతలు పిల్లలు అధిగమించేందుకు తల్లిదండ్రులు సహకరించాలి. అందుకు వేసవి శిబిరాలు ఎలా తోడ్పడతాయో గమనించాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు మూడే పనులు చేస్తుంటారు. 1. పిల్లల్ని చక్కగా ముస్తాబు చేసి టైముకి స్కూల్‌కి పంపించడం, 2. టైమ్‌కి భోజనం చేస్తున్నారా లేదా అని గమనించడం, 3. నిరంతరం చదువుకో చదువుకో అని వెంటబడడం.
ఈ యాంత్రిక పద్ధతిని బద్దలు కొట్టేలా పిల్లలకు వేసవి శిబిరాలు తోడ్పడాలి. అందుకు పిల్లలకు ఓపిగ్గా అన్ని విడమర్చి చెప్పి వారి ఆసక్తిని గమనించి, వారి అభిరుచికి తోడ్పడేవిధంగా పిల్లల్ని నిజంగా ప్రేమించే వేసవి శిక్షణా శిబిరాలకు పంపడం ఉత్తమం. అప్పుడు వారికి ఆ శిబిరం జీవితంలో మరిచిపోలేని మధురానుభూతిని మిగల్చడమే కాదు, ఓ మైలురాయిలా నిలిచిపోతుందని మనం కూడా ఆశించవచ్చు.
– కె.శాంతారావు, 9959745723

]]>
స‌మ‌తా సూర్యుడు https://navatelangana.com/the-sun-is-the-sun/ Sat, 12 Apr 2025 17:45:49 +0000 https://navatelangana.com/?p=544945 Samatha SuryaBe Educated, Be Organized and Be Agitated
ఇప్పటికీ యువతలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపుతున్న మూడు వాక్యాలివి. సమసమాజ నిర్మాణానికి చదువు, వ్యవస్థీకరణ, ఉద్యమతత్వం అనే త్రిసూత్రాలను ప్రతిపాదించి భారతీయుల జీవన చిత్రాన్ని సరికొత్తగా నిర్మించిన మహా జ్ఞాని డా .భీం రావ్‌ రాంజీ అంబేద్కర్‌. అట్టడుగు సామాజిక వర్గంలో జన్మించినప్పటికీ ఆకాశమే హద్దుగా అనంతమైన జ్ఞాన సాధన చేయడం ద్వారా ఎలాంటి వారైనా అద్భుతమైన ప్రగతిని సాధించవచ్చు అని నిరూపించిన నూతన సామాజిక స్వాప్నికుడు డాక్టర్‌ అంబేద్కర్‌.
మహారాష్ట్రలోని ‘మౌ’ అనే గ్రామంలో సామాజిక అసమానతలు అణచివేతకు గురయ్యే దళిత కుటుంబంలోని 14 మంది సంతానంలో ఒకడిగా జన్మించాడు. అక్షరాన్ని ఆయుధంగా నమ్ముకుని, జ్ఞానాన్ని సాధనంగా మలచుకొని, పుస్తకాన్ని మార్గంగా చేసుకొని, తను ఎదుగుతూ, తన ప్రజలను కూడా జ్ఞానమార్గంలో పయనింప చేయాలని నిరంతరం తపించిన జ్ఞాన స్ఫూర్తి డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌. ఆయన రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, సంఘసంస్కర్త, ఆర్థిక నిపుణుడు, భారతదేశ తొట్ట తొలి న్యాయశాఖ మంత్రి కూడా.
అప్పట్లో భారతదేశంలో ఎన్నో రకాల అసమానతలు, కులపరమైన వైవిధ్యతలు, సామాజిక అంతస్తులు అనాది కాలం నుంచి కొనసాగుతూ వచ్చాయి. దాని వల్ల వివిధ రకాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ పరమైన అసమానతలు సమాజంలో నెలకొన్న స్థితి ఒకవైపు, దేశమంతా బ్రిటిష్‌ దాస్య శఖలాలలో మగ్గి పోతుండడం మరొకవైపు, సామాన్య ప్రజలంతా కుల పరమైన అణచివేతలో, సామాజిక దురాక్రమణలో మగ్గిపోవడం ఇంకొక వైపు ముప్పేటగా దాడి చేస్తున్నతీరు ఆనాటి పరిస్థితి. అంటరానితనాన్ని, సామాజిక వెలివేతను, దానిలోని దుఃఖాన్ని, బాధని, కష్టాలను సాటి మానవుల నుంచి వివక్షని నిరంతరం ఎదుర్కొన్న ఆ మహనీయుడు ఒక్కటే కలగన్నాడు. మనుషులంతా సమానంగా గౌరవించబడాలి అనేదే ఆయన స్వప్నం.!
సమతే నిజమైన మతం:
మన దేశంలో అత్యంత ప్రభావవంతమైన భావోద్వేగం మతం అని గుర్తించిన అంబేద్కర్‌ ”»I like the religion that teaches liberty, equality and fraternityµµ” అని భావించారు. అందుకే కుల, మత, ప్రాంత, భాష, వర్గ, లింగ భేదాలకు అతీతంగా మానవులంతా సగౌరవంగా బ్రతకాలి. అలాంటి రోజు రావాలి అని నిరంతరం స్వప్నించిన క్రాంతదర్శి ఆయన. ఆ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా, మార్పుని ఆహ్వానించే దిశగా ప్రయత్నాన్ని తననుంచే మొదలెట్టాలి అనుకున్నాడు. తన జీవితాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకుని సామాజిక నియంత్రణకు అతీతమైన జ్ఞానాన్ని సంపాదించారు. మనిషి నిరంతరం సామాజిక శంఖలాల్లో, వివక్షల సంకెళ్ళలో మగ్గుతున్నప్పటికీ అలాంటి మనిషికి విముక్తి చదువు ద్వారా, అక్షరం ద్వారా, జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యం అని నమ్మి ఆ మార్గాన్ని ఎంచుకుని, ఆ దిశగా ప్రయాణించి, వివిధ దేశాలలో తన ప్రతిభని నిరూపించుకుని, అత్యున్నత న్యాయ నిపుణుడుగా ప్రపంచ మేధావులందరి చేత ప్రశంసలు పొందిన అత్యున్నత మానవుడు అంబేద్కర్‌.
ఒక మనిషి తన జీవితకాలంలో ఎంత చదవవచ్చు, ఎంత విజ్ఞానాన్ని సంపాదించవచ్చు అని చెప్పడానికి సజీవ ఉదాహరణ అంబేద్కర్‌ అధ్యయనం. కొలంబియా, లండన్‌ యూనివర్సిటీలలో అత్యున్నత చదువులు చదివి, ప్రపంచ దేశాల న్యాయశాస్త్రాలన్నింటిని ఔపోశనపట్టిన మేధావిగా, బహు భాషలలో నిపుణుడైన కోవిదుడుగా, తనదైన ప్రత్యేక ముద్రని వేసుకుని ప్రపంచ మానవుడిగా కీర్తించబడిన మహనీయుడు అంబేద్కర్‌.
వ్యక్తిత్వ వికాస పాఠం:
అంబేద్కర్‌ ఆలోచనా విధానం, అధ్యయన శీలత, ఆచరణాత్మక దక్పథం సమస్త మానవాళికి ఆదర్శనీయం అనడంలో సందేహం లేదు. అందుకే ఆయన జీవన ప్రస్థానం అంతా ఒక వ్యక్తిత్వ వికాస పాఠంలా అనిపిస్తుంది. కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఆటంకాలు, ప్రతిబంధకాలు ఎన్ని ఎదురైనా, వాటన్నిటినీ అధిగమించగలిగే సంకల్పం, దీక్ష, పట్టుదల, జ్ఞానాన్వేషణ మనిషిలో కొత్త సూర్యున్ని మేల్కొల్పుతుందని నిరూపించి చూపించి, తర్వాతి తరానికి, ఈ తరం విద్యార్థులకు, యువకులకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా ఉన్న మహనీయుడు ఆయన.
భారతదేశాన్ని ప్రభావితం చేసిన మహనీయులు ఎందరో ఉన్నారు. వేద భూమిగా, జ్ఞానభూమిగా, ఎన్నెన్నో గ్రంథాలు, విజ్ఞానాల సంకలనంగా భారతదేశం ఉంది. ఈ నేల మీద ప్రభవించిన వ్యక్తులలో, సామాజిక సంస్కరణ, సామాజిక స్వాతంత్రం, సమన్యాయం, వివక్ష నుంచి విముక్తి అనే అంశాల పరంగా బి.ఆర్‌. అంబేద్కర్‌ యావత్‌ జాతిని ఎంతగానో ప్రభావితం చేశారు.
సమానత్వ సాధనే గమ్యం:
»»Equality may be a fiction. But nonetheless one must accept it as a governing principl” అని ప్రగాఢంగా విశ్వసించిన అంబేద్కర్‌ భావజాలం, సర్వమానవ సమానత్వాన్ని, సకల జనుల సౌభ్రాతత్వాన్ని, మానవాళి గౌరవనీయమైన జీవన విధానాన్ని ఆకాంక్షించింది. ప్రపంచ వ్యాప్తంగా కార్ల్‌ మార్క్స్‌, మహాత్మా గాంధీ, మార్టిన్‌ లూథర్‌ వంటి వారు ఎంతగా తమ దార్శనికతతో ప్రపంచ గమనాన్ని ప్రభావితం చేశారో, భారత జాతిలోని అట్టడుగు, బలహీన, పీడిత, తాడిత, శ్రామిక, కర్షక, కార్మిక, మహిళా వర్గాలకు చెందిన ప్రజలందరి ఆలోచనా ధోరణిని అంబేద్కర్‌ అంతగానే ప్రభావితం చేశారు.
‘»»So long as you do not achieve social liberty, whatever freedom is provided by the law is of no avail to you” అని మానవ వికాసానికి సామాజిక స్వేచ్ఛ ప్రాధాన్యతను ఎంతగానో చెప్పిన ఆయన వేలాది సంవత్సరాలుగా అణచివేతకు, వివక్షకు గురి అయి, ఆదరణకు నోచుకోని కోట్లాది ప్రజల స్వరంగా మారారు. వారందరి తరఫున సామూహిక బందగానాన్ని తన మేధాశక్తితో ప్రపంచానికి వినిపించారు. అందుకే భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులుగా స్వతంత్ర భారత భవిష్యత్‌ చిత్రపటాన్ని ఆవిష్కరించగలిగారు. ప్రపంచ రాజ్యాంగాలన్నిటికీ స్వర్గధామంగా, మేధావులందరిచేత ప్రశంసించబడ్డ భారత రాజ్యాంగ నిర్మాతగా తనదైన ముద్రను వేశారు. మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు, సమన్యాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వ్యక్తి వికాసానికి ప్రభుత్వ తోడ్పాటు ఎలా ఉండాలో నిర్దేశించారు. రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం ఆమోదించబడిన భారత రాజ్యాంగ రచనలో కీలకమైన పాత్ర పోషించి అన్నివర్గాల ప్రజల హక్కుల పరిరక్షకులుగా మేరునగ ధీరుడిగా చరిత్రలో నిలిచారు.
అంబేద్కర్‌ భావజాలం భారతదేశం అంతటా ఒక నవ్య సామాజిక సంస్కరణకు దారి తీసింది. ఆయన ఆలోచనా విధానం నూతన సామాజిక విప్లవానికి బాటలు వేసింది. రిజర్వేషన్‌ వంటి రక్షణ చర్యల్ని రాజ్యాంగబద్ధంగా రూపొందించడమే కాక, అట్టడుగు వర్గాల ప్రజల వికాసానికి, విద్యనే ఆయుధంగా చేసుకోవాలని వారు ఇచ్చిన పిలుపు ఇప్పటికీ ఎప్పటికీ శిరోధార్యంగా నిలిచింది.
భారతదేశంలో అత్యధిక ప్రజలు నిమ్న స్థాయి ప్రజలే. అలాంటి ప్రజల ఆర్థిక, సామాజిక, మానసిక, విద్యాపరమైన వికాసం కోసం అంబేద్కర్‌ ప్రయత్నాలు, ఏర్పాటు చేసిన సంస్థలు, ప్రచారం చేసిన భావజాలం ప్రజలలో ఎంతో మార్పుని తీసుకొచ్చింది. 135 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ అంబేద్కర్‌ ఆలోచనా విధానం భారతదేశానికి కొత్త వికాస సూచికగా ‘అభివద్ధి నమూనా’గా నిలుస్తోంది. కుల వ్యవస్థ నిర్మూలన దిశగా, సమాజంలో సర్వమానవ సమానత్వ భావన దిశగా వారు చేసిన ప్రయత్నాలు, వారు నాటిన జ్ఞాన విత్తనాలు ఇప్పుడు ఎన్నో ఫలాలని ఇస్తున్నాయి.
అంబేద్కర్‌ – తెలంగాణ:
తెలంగాణ ప్రజలు అంబేద్కర్‌ ఆలోచనా ధోరణి, భావజాలానికి అత్యధికంగా ప్రభావితం అయిన వారిలో ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. అరవై ఏళ్ల పాటు వివిధ దశలలో ప్రజల నిరంతర పోరాటం, నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష, పద్నాలుగేళ్ళ మలిదశ తెలంగాణ ఉద్యమం.. వీటన్నిటి వెనుక ప్రజలను నడిపించిన ఒకే ఒక్క ఆశ అంబేద్కరిజం, అంబేద్కర్‌ ఆలోచనా విధానమే. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించడం వెనక చిన్న రాష్ట్రాల ఏర్పాటు ద్వారా సామాజిక ఆర్థిక, రాజకీయ, ప్రగతి సాధ్యమౌతుందని నొక్కి చెప్పిన అంబేద్కర్‌ ఆలోచనా ధోరణే కారకంగా పనిచేసింది.
అందుకే ప్రతీ ప్రభుత్వం అట్టడుగు, దళిత, బలహీన, బడుగు, పీడిత, తాడిత ప్రజలు, మహిళల సర్వతోముఖ వికాసం కోసం నిరంతరం అంకితభావంతో పని చేయాల్సి ఉంది. దేశంలో వినూత్నమైన, ఆచరణ యోగ్యమైన, స్థానిక మూలాల ప్రతిపదికపై నిర్థారించి అభివద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలందరిలో ఆత్మగౌరవ భావనని, వికాస స్ఫూర్తిని నెలకొల్పవలసిన ఆగత్యం ఉంది.
ఒకానొక సందర్భంలో అంబేద్కర్‌ ”I measure the progress of a community by the degree of progress which women have achieved” అని చెప్పిన మాటలు ప్రతీ ప్రభుత్వానికి, పాలకులకి దారి దీపాలు.
ఆయన విగ్రహం ఓ దిక్సూచి:
అంబేద్కర్‌ ఒక వ్యక్తిగా కనిపించినా, ఆయన ఓ భావజాలం! అందుకే 1991లో ఆయన శత జయంతి సందర్భంలో దేశమంతటా ఆయన ఆలోచనాధార ప్రజలందరిలో వెల్లువలా పెల్లుబికింది. ఒక వైపు ఆర్థిక సంస్కరణలతో సరళీకరణకు ద్వారాలు తెరుస్తూ విదేశీ పెట్టుబడులకు స్వాగతం పలుకుతున్న నేపధ్యంలో, మనదైన భారతీయ మూలాల అస్తిత్వ పతాకగా అంబేద్కర్‌ భావజాలం పల్లె పల్లెకూ విస్తరించింది. దేశమంతటా ‘గ్లోబలైజేషన్‌’ కమ్ముకుంటున్న తరుణంలో ‘అంబేద్కరిజం’ ‘లోకలైజేషన్‌’ సాధించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఆయన విగ్రహాలు వెలిసాయి. అందుకే ‘అంబేద్కర్‌ విగ్రహం’ వ్యక్తి పూజ పరిమితులను దాటి సామాన్య అట్టడుగు భారతీయుల ”సామూహిక పత్రిక” ((Collective symbol)గా పరిణమించింది.
ఆ క్రమంలోనే భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ స్మతిలో దేశంలోని వేర్వేరు ప్రాంతాలలో ఆయన భారీ విగ్రహాలను నెలకొల్పారు. 2023 లో తెలంగాణలో 175 అడుగుల ఎత్తులో, 2024లో అమరావతిలో 206 అడుగుల ఎత్తుతో మరికొన్ని చోట్ల భారీగా అంబేద్కర్‌ విగ్రహాలను నిర్మించారు.
ఇది ఆ మహనీయుడికి సామాన్య ప్రజలందరు సవినయంగా సమర్పించిన నీరాజనం. ఏ తాత్వికుడి దార్శనికత వల్ల రాజ్యాంగం ఏర్పడిందో, ఆ మహనీయుడికి అణగారిన వర్గాల ప్రజలు అర్పిస్తున్న సభక్తికమైన నివాళి!
ఇది కేవలం విగ్రహం మాత్రమే కాదు. ఆయా ప్రాంతాలకు విచ్చేసే ప్రతి పౌరుడికి, ప్రతి పర్యాటకుడికి, మానవాళి మొత్తానికీ నిత్య చైతన్య దీప్తి!
ఆయా నగరాలలో, రాష్ట్రాలలో నివసించే, సంచరించే ప్రజలకి, ప్రభుత్వానికి, ఉద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు, పారిశ్రామికవేత్తలకి అందరికీ నిరంతర స్ఫూర్తి!
అంబేద్కర్‌ మార్గం ప్రజల పట్ల, భారతదేశం పట్ల, సామాజిక బాధ్యత పట్ల మనకు ఉండాల్సిన అనురక్తిని కలకాలం గుర్తు చేసే దిక్సూచి!
అంబేద్కర్‌ జీవితం ఎప్పటికప్పుడు సమాజ అభ్యున్నతికి పునరంకితం కావాలనే దీక్షకు ఒక సందేశం!
(ఏప్రిల్‌ 14 డా. బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 135వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి)

డా||మామిడి హరికష్ణ,
8008005231 

]]>
భానుడి భ‌గ‌భ‌గ‌లు https://navatelangana.com/bhanu-bhagabhagala/ Sat, 05 Apr 2025 17:15:48 +0000 https://navatelangana.com/?p=540079 Bhanu's blessingsభానుడి ప్రతాపానికి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వేసవి కాలం మొదటిలోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇలా వుంటే ముందు ముందు ఇంకా ఎండలు తారాస్థాయికి చేరే అవకాశం ఉంది..దీంతో మే నెలలో వేసవిని ఎలా ఎదుర్కోవాలన్న భయాందోళన ప్రజలను వెంటాడోతుంది. మరి ఈ వేసవి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.
గత ఏడాది ఇదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు మించలేదు. అయితే ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలు నమోదైంది. దీంతో ఇంట్లోంచి బయటకి రావాలంటే జనం భయపడిపోతున్నారు. ఇళ్లలో కూడా ఉక్కపోతకు గురవుతున్నారు. ఎండ తీవ్రత సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుండటంతో రోడ్లపై జనం పలచబడుతున్నారు. రోజువారి పనులు సైతం కొందరు ప్రజలు ఉదయమే వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ఇళ్లకు పరిమితమవుతున్నారు.
వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ, వ్యాధులు, వాటి లక్షణాలు, నివా రణ పై అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాంతకంగా మారవచ్చు. పరిస్థితికి అనుగుణంగా ఆహారం, తాగునీరు తీసుకోవాలి. వడదెబ్బ బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి…
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
– ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో గొడుగు తప్పనిసరిగా వాడాలి
– దూదితో నేయబడిన తెలుపు / లేత రంగు గల పలుచటి వస్త్రాలను ధరించాలి.
– తల పై టోపి లేదా రుమాలు పెట్టుకోవాలి.
– ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నీరు ఎక్కువగా సేవించాలి.
– ఉప్పు కలిపిన మజ్జిగ / చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజు నీరు / ఓరల్‌ రీహైడ్రేషన్‌ ద్రావణము తాగవచ్చును.
– వడదెబ్బకు గురైన వారిని శీతల ప్రాంతానికి వెంటనే చేర్చాలి.
– వడదెబ్బకు గురైన వారివి చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం అంతా తుడుస్తూ ఉండాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి వచ్చేవరకు ఈ విధంగా శరీరాన్ని తుడుస్తూ ఉండాలి. ఫ్యాన్‌ క్రింద ఉంచాలి.
– వడదెబ్బకు గురైన వారి ఆరోగ్య పరిస్థితిలో ఆశించిన మార్పు లేనిచో శీతల వాతావరణంలో దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు చేయకూడనివి.
– సూర్య కిరణాలకు, వేడి గాలికి ఎక్కువ గురి కాకూడదు.
– వేడిగా ఉన్న సూర్యకాంతిలో గొడుగు లేకుండా తిరగరాదు.
– వేసవిలో నలుపు/ ముదురు రంగు దుస్తులు మందంగా ఉండే దుస్తులు ధరించరాదు.
– నెత్తిన టోపీ లేక రుమాలు లేకుండా సూర్యకాంతిలో తిరగరాదు.
– వడదెబ్బకు గురైన వారిని వేడినీటిలో ముంచిన గుడ్డతో తుడవరాదు.
– దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చుటలో ఏ మాత్రం ఆలస్యం చేయరాదు.
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పలు రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దాహం, డీహైడ్రేషన్‌, వడదెబ్బ, జీర్ణ సమస్యలు, చర్మ వ్యాధులు వంటి సమస్యలు వేడికి సంబంధించిన ప్రతికూల ప్రభావాలుగా కనిపిస్తాయి.
వేసవి కాలంలో ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్యలు
డీహైడ్రేషన్‌, వడదెబ్బ :
అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది, దాంతో శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్‌ లోపించి వడదెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది.ఎండలో ఎక్కువసేపు ఉన్నప్పుడే కాకుండా, తగినంత నీరు తాగకపోయినా డీహైడ్రేషన్‌ సమస్య ఏర్పడుతుంది.
వడదెబ్బ లక్షణాలు :
తలనొప్పి, తల తిరగటం, తీవ్రమైన జ్వరం కలిగియుండటం, మత్తునిద్ర, కలవరింతలు, ఫిట్స్‌, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి
ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు :
వేసవిలో గాలి పొల్యూషన్‌ ఎక్కువగా ఉండడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. ధూళి, పొగ, పొల్యూషన్‌ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉండటాన్ని నివారించాలి. ఆస్తమా ఉన్నవారు తమ వెంట ఇన్హేలర్‌, మెడిసిన్స్‌ తప్పనిసరిగా ఉంచుకోవాలి.
చర్మ సమస్యలు, అలర్జీలు :
చెమట అధికంగా కారడం వల్ల చర్మం మురికితో ముడిపడి ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, రాషెస్‌ ఏర్పడతాయి. శోభి మచ్చలు (తినియా వెర్సికలర్‌) వేసవిలో అధికంగా ప్రబలతాయి.యూవీ రేడియేషన్‌ కారణంగా చర్మం కమిలిపోవడం, సన్‌బర్న్‌, మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంది.
విరేచనాలు, కలరా :
వేసవిలో భోజనం త్వరగా పాడవడం, నీటి కాలుష్యం పెరగడం వల్ల విరేచనాలు, కలరా వంటి సమస్యలు వస్తాయి. రహదారి పక్కన ఉన్న ఆహారం, కలుషితమైన నీరు తాగడం వల్ల బాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది.
మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ సమస్యలు:
వేసవిలో నీటి తగ్గుదల వల్ల మూత్రంలో మలినాలు పేరుకుని యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది.తగినంత నీరు తాగకపోతే కిడ్నీ రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఎక్కువ.
వేసవి జాగ్రత్తలు, నివారణ చర్యలు :
– రోజూ కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి.
– ఒకసారి ఉడికించిన లేదా ఫిల్టర్‌ చేసిన నీరు తాగాలి.
– పొడిగా, వేడిగా ఉండే ఆహారాన్ని తగ్గించి, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి.
– పొల్యూషన్‌ ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్క్‌ ధరించడం ఉత్తమం.
– ఊపిరితిత్తుల సమస్యలున్నవారు వైద్యుల సూచనల ప్రకారం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.
– కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ నీరు తాగాలి, ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి.
– ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల సన్‌బర్న్‌, డీహైడ్రేషన్‌ సమస్యలు వస్తాయి, కాబట్టి సన్‌స్క్రీన్‌ వాడడం, హాట్‌ టైమ్‌లో బయటికి వెళ్లకుండా ఉండటం మంచిది.
– హైడ్రేటింగ్‌ ఫుడ్స్‌ (కాకర, దోసకాయ, మజ్జిగ, కొబ్బరి నీరు) తినడం వల్ల వేడి తగ్గుతుంది.
వేసవిలో ప్రకతి :
వేసవి కాలం ప్రకతిలో కూడా అనేక మార్పులను తీసుకొస్తుంది. చెట్ల ఆకులు పచ్చగా ఉండి, పశువులు నీటి ప్రదేశాలకు చేరుకోవడం, పక్షులు చెట్ల కింద విశ్రాంతి తీసుకోవడం వంటి దశ్యాలను మనం చూస్తాం. వేసవిలో ప్రజలు ప్రకతి ప్రేమను మరింత అనుభూతి చెందుతారు, అదే సమయంలో ప్రకతిని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలి.
సూర్యుడి వేడి ప్రభావం వేసవిలో మానవుని ఆరోగ్యానికి పెద్ద ముప్పు కావచ్చు. దీన్ని నివారించేందుకు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన జాగ్రత్తలు పాటించడం, సురక్షితమైన వేళల్లో బయటకు వెళ్లడం చాలా ముఖ్యం. అలాగే ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకండి.
శరీరాన్ని కాపాడుకోండి, ఆరోగ్యంగా ఉండండి!
ఆరోగ్యమే మహాభాగ్యం..!

భానుడి ప్రతాపం మాతృమూర్తుల సంరక్షణ

గర్భవతిగా ఉన్నప్పుడు, ప్రసవం తరువాత శిశువుకు పాలిస్తున్నప్పుడు తల్లి కొంత ఒత్తిడిలో ఉంటుంది. దానికి వేసవి తోడయితే అది ఆమె శక్తికి వరీక్షే. కానీ అవగాహన, సంరక్షణ, చిన్ని, చిన్ని జాగ్రత్తలు, సర్దుబాట్లు ఉంటే ఈరుతువు లో సంతోషంగా గడపగలుగుతారు.
ద్రప పదార్థాలు: 10-12 గ్లాసుల నీటిని తాగాలి. నీటికి నిమ్మ, పుదీన, కీరదోసను కలవండి. కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, తాజా పండ్ల రసాలను తాగండి. నోరు ఎండిపోవడం, ముదురు రంగు మూత్రం, తల తిరగడం లాంటి లక్షణాలు ఉన్నాయేమో గమనించండి.
ఆహారం: తక్కువ తక్కువ ఆహారాన్ని ప్రతి 2-3 గంటల కొకసారి తినండి. రాగిజావ, ఆవిరిలో ఉడకబెట్టిన కాయగూరలు, పప్పన్నం తినండి. నీరు ఎక్కువగా ఉండే వుచ్చకాయ, బత్తాయి, కర్బూజా లాంటి పండ్లను తినండి. కారం, మషాలా, పచ్చళ్ళు, నూనె పదార్థాల్ని తినకండి.
దుస్తులు: వదులుగా వుండే, మెత్తటి, తేలిక రంగు, నూలు దుస్తుల్ని వేసుకోండి. బిగుతుగా వుందే దుస్తుల్ని, సింథటిక్‌ దుస్తుల్ని వేసుకోకండి. వేడి వలన వచ్చే దద్దుర్లను తగ్గించుకోవడానికి చల్లగా ఉండే టవల్ని, తేలికగా వుండే టాల్కమ్‌ పౌడర్‌ని వాడండి.
బయట తిరగడం: తవ్వనిసరిగా బయటకు వెళ్లవలసి వస్తే నీరు, గొడుగు, సన్‌గ్లాసెస్‌, టవల్స్‌ని మీతో తీసువెళ్ళండి. వీలయినంతవరకు నీడలో ఉండండి. జనం ఎక్కువ ఉన్న ప్రదేశాలకు వెళ్ళకండి.
చర్మ సంరక్షణ: చాలా తేలిక సబ్బును ఉపయోగించండి. అలోవేరా జెల్‌ లేక వ్రకృతి సహజమైన మాయిశ్చరైజర్‌ని ఉపయోగించండి. రోజుకు రెండు సార్లు స్నానం చెయ్యండి.
ఈకింది లక్షణాలు కనిపిస్తే వెంటనే మీ డాక్టర్ని సంప్రదించండి :
– కళ్ళు మసకగా కనిపిస్తుననుడు లేక తీవ్రమైన తలపోటున్నప్పుడు, చేతులు, ముఖం వాచినప్పుడు, బిడ్డ కదలికలు తగ్గినప్పుడు, తీవ్రమైన అలసట ఉన్నప్పుడు లేక ఊపిరి సరిగ్గా అందనప్పుడు.
బాలింతరాలు తీసుకోవలసిన జాగ్రత్తలు
– ఓట్లు, మెంతికూర, వెల్లుల్లి, వచ్చటి ఆకుకూరల్ని తినండి.
– ఇంట్లో వండిన, తేలిగ్గా జీర్ణమయే ఆహారాల్ని తినండి. వాము నీటిని తాగొచ్చు.
– మషాలా, కారం, నూనె, పులిసిన పదార్థాల్ని తినకండి.
-10-12 గ్లాసుల నీటిని తాగండి, ఉప్పు, కరివేపాకును మజ్జిగలో కలిపితే మంచిది.
– ఉదయం జీలకర్ర నీటిని తాగండి. తాజా పండ్ల రసాల్ని, బెల్లం కలిసిన నిమ్మ నీటిని తాగండి.
పరిశుభ్రతను పాటించండి: నర్శింగ్‌ బ్రాలను ఉపయోగిస్తూ వుంటే రోజుకు రెండు సార్లు మార్చుకోండి. ఫంగల్‌ దద్దుర్లు రాకుండా నివారించుకోవడానికి పాలిచ్చాక రొమ్ముల్ని శుభ్రంగా తుడుచుకోండి.
ఇవి చెయ్యకండి: ఒక పూట ఆహారాన్ని తినకుండా ఉండడం లేక అతిగా తినడం బాగా నూనె పదార్థాలు, బయటి పదార్థాలు, లేక పాడైపోయిన పదార్థాల్ని తినడం, బిగుతుగా ఉన్న, నిందటిక్‌ దుస్తుల్ని వేసుకోవడం, ఉక్కగా ఉన్న, గాలి తగలని చోట ఉండడం, ఓపిక లేకపోయినప్పటికి పని చేస్తూ ఉండడం.
– డా.ఆలూరి విజయలక్ష్మి, గైనకాలజిస్ట్‌
శ్రీ శ్రీ హౌలిస్టిక్‌ మల్టీ స్పెషాలిటీస్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌

వేసవిలో పిల్లలు జాగ్రత్త
చలికాలం దగ్గులు, తుమ్ములు పోగానే మండే వేసవి జడిపిస్తుంది. వేడికి, దాహానికి ఆగలేక ఎక్కడ దొరికితే అక్కడ చల్లటి నీళ్లు, లేదా కూల్‌ డ్రింక్స్‌, ఐస్‌క్రీం తీసుకోవడం పరిపాటి. ఆ నీళ్లు ఎక్కడివో, ఆ డ్రింక్‌లో వేసిన ఐసు ఎక్కడిదో ఆలోచించడం జరగదు. వేసవిలో ఈ కలుషితమైన నీటివల్ల, వాటినుంచి తయారు చేసిన ఐసు వల్ల కలరా, జాండిస్‌, టైఫాయిడ్‌, అతిసారవ్యాధి వంటివి సోకితే జ్వరం, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి వంటివే కాక ఒంట్లో నీటి శాతం తగ్గిపోవడం వల్ల వేగంగా డీహైడ్రేషన్‌ బారిన పడతాం. అందుకే పిల్లలకి వేసవిలో ఇచ్చే ఆహారం, నీరు చాలా శుభ్రంగా వుండాలి. పైగా ఈ కాలం ఆహారం చాలా త్వరగా చెడుతుంది. అందుకని బయట తినే ఆహారాన్ని, నీటిని నియంత్రిస్తే పిల్లలు ఆరోగ్యంగా వుంటారు.
ఇవి కాక వేడి వల్ల తీవ్రమైన జ్వరానికి దారితీయవచ్చు. ఉదయం పది తర్వాత పిల్లలు సాయంత్రం వరకు నీడ పట్టున వుండేలా ఆటపాటలతో, కథలతో పుస్తకాలతో అందరూ కలిసి చేసే కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తే మంచింది. కాకపోతే హీట్‌ హైపర్‌ పైరెక్సియాతో శరీర ఉష్ణోగ్రతని, నియంత్రించే మెదడు సెంటర్‌ దెబ్బతిని పోయి ప్రాణాంతకమయ్యే ప్రమాదంవుంది. నీరసం, చెమటలు పట్టకపోవడం, మూత్రం ఆగిపోవడం వంటి వేడి తగ్గకపోవడం, కళ్లు తేలేయడం, ఎమర్జెన్సీ లక్షణాలు. జ్వరంతో వచ్చే ఫిట్స్‌ ఆరేళ్ల లోపు పిల్లల్లో సర్వ సాధారణం.
ఎప్పటి కప్పుడు చన్నీళ్లతో కాళ్లూ, చేతులూ ముఖం కడుక్కోవడం వల్ల వేడి వల్ల వచ్చే చర్మవ్యాధులని నియంత్రించవచ్చు.
టీకాలు సరిగా వేయించుకోని పిల్లలకి వేసవిలో ఆటలమ్మ సోకవచ్చు. ఇది ఒకరినుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. అందుకని ఆ పిల్లల్ని ఐసోలేషన్‌లో వుంచి చికిత్స చేస్తే మంచిది.
నీళ్లు సరిగా తాగకపోతే డీ హైడ్రేషన్‌ అవక మూత్రం ఇన్‌ఫెక్షన్‌ కూడా సంభవించవచ్చు. అందుకే శుభ్రమైన నీరు, ఆహారం, నీడపట్టున ఆటలు, తగిన నిద్ర వేసవిలో అవసరం.
డా|| నళిని

 

]]>
తెలుగువారి సంవత్సరాది https://navatelangana.com/the-year-of-telugu-people/ Sat, 29 Mar 2025 16:10:10 +0000 https://navatelangana.com/?p=535187 Telugu New Yearతెలుగు వారికందరికీ మొట్టమొదటి పండుగ ఉగాది. ఎంత ఆంగ్ల సంవత్సరపు మొదటిరోజున హ్యాపీ న్యూ ఇయర్‌ అని చెప్పుకున్నా ఉగాదితోనే మన సంవత్సరం మొదలవుతుంది. కొత్త బట్టలు, పిండి వంటలు ప్రతి పండుగకి ఉన్నా, ఉగాది అంటే గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి, మామిడికాయలు, పంచాంగ శ్రవణాలు… ఇంకా మరెన్నో!
చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకుంటాం. పురాణాలలో కథ ప్రకారం సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మ దేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది అమలులోకి వచ్చిందని చెబుతారు.
మనకు ఉన్న ఆరు ఋతువులలో మొదటి ఋతువు అయిన వసంత ఋతువు కూడా చైత్రమాసం శుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. వసంత ఋతువులో చెట్లు చిగురిస్తాయి. ప్రకతి చాలా అందంగా ఉంటుంది. అందువల్ల నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటాం. ఉగాది అంటే కొత్త శకం.
ఉగాది అనే పదంలో ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. జన్మ ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటి రోజు. అందువల్ల ఉగాది అంటారు. మరో అర్థంలో యుగం అంటే రెండు లేక జంట అంటే ఉత్తరాయణం, దక్షణాయమని అనబడే ద్వయం సంయుతం. యుగాదికి ఆది కనుక ఉగాది అంటారు. దీనిని సంవత్సరాదిగా కూడా మనం భావిస్తాం.
చరిత్రలో ఉన్న మరో కథనం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున శాలివాహన చక్రవర్తి పట్టాభిశక్తుడై శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగ కర్తగా భాసిల్లాడు. అతని స్మతితో ఉగాది ఆచరింపబడుతుంది.
ఉగాది పండుగను తెలుగువారు జరుపుకుంటే, ఇదే రోజును మరాఠీ వారు ‘గుడి పడ్వా’గా, తమిళులు ‘పుత్తాండు’ అనే పేరుతో, మలయాళీలు ‘విషు’ అనే పేరుతో, సిక్కులు ‘వైశాఖి’ గాను, బెంగాలీలు ‘పోయి లా బైసాక్‌’గా జరుపుకుంటారు.
ఏ భాష ఏ ప్రాంతం వారు ఎలా జరుపుకున్నా తెలుగు వారు మాత్రం ఖచ్చితంగా చేసుకునేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి లేకుండా ఉగాది పండుగ లేదంటే అతిశయోక్తి కాదు. గమ్మత్తు ఏమిటంటే ప్రపంచంలో ఏ పచ్చళ్లకు లేని ప్రత్యేకత ఈ ఉగాది పచ్చడికి ఉంది!
సంవత్సరంలో ఋతువులు ఆరు , అలాగే ఉగాది పచ్చడిలో రుచులు ఆరు ఉంటాయి. ఉగాది పచ్చడి చేసే విధానం… ఒక శుభ్రమైన పాత్రలో తీయదనం కలిగించేందుకు బెల్లం వాడతారు. ఉప్పుని జీవితంలో రుచికి ఉత్సాహం కలిగించడం గుర్తుగా ఉపయోగిస్తారు. చేదు కోసం వేప పువ్వు శుభ్రం చేసుకొని రేఖల్ని పాత్రలో వేస్తారు. చేదు బాధ కలిగించే అనుభవాలకి సంకేతం. పులుపు కోసం చింతపండు కొంచెం నానబెట్టి గుజ్జు తీసి పాత్రలో కలుపుతారు. జీవితంలో నేర్పరితనంగా ఉండడానికి ఈ పులుపు చిహ్నం. వగరు కోసం పచ్చి మామిడికాయ ముక్కలను లోపల ఉండే లేత జీడి తీసేసి చిన్న ముక్కలుగా కానీ తురిమి కానీ వేసుకుంటారు. మామిడికాయ లేతదనంలో కాస్త వగరుగా ఉంటుంది. ఇది మన జీవితంలో ఎదుర్కొనే కొత్త సవాళ్లకు ప్రతీక. కొంచెం కారం వేస్తేనే పచ్చడి సంపూర్ణమవుతుంది. సహనం కోల్పోయే పరిస్థితులకు సూచిక కారం.
ఇవన్నీ రంగరించి కలుపుకొని ఉగాది పచ్చడిగా సేవిస్తారు. అయితే ఇవి ప్రధానంగా వేసి, ఎవరెవరి రుచి ఇష్టం ప్రకారం ఆ పచ్చడిలో అదనంగా నచ్చినవి ముక్కలు గాను, తురిమి గాని కలుపుకుంటారు. అంతా కలిపి ఒక గిన్నెలో దేవుడికి సమర్పించి ఆ తర్వాత ఉగాది పచ్చడిని సేవిస్తారు. చలికాలం నుంచి వేసవి కాలంలోకి ప్రవేశించినప్పుడు ఈ ఉగాది పచ్చడి రోగనిరోధక శక్తిని కలిగిస్తుందని ప్రజల విశ్వాసం.
మన పెద్దవారు చెప్పే దాని ప్రకారం ఉగాది రోజున వేప పువ్వు వేసిన ఉగాది పచ్చడి సేవించి, పంచాంగ శ్రవణం చేయాలి. మిత్రులను కలుసుకోవాలి. పెద్దలను పూజించాలి, గోపూజ చేయాలి. ఏరువాక అనే ఆచారం కూడా పాటిస్తారు.
ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయడం ద్వారా కొత్త సంవత్సరంలో గ్రహాల స్థానాలు ఎలా ఉన్నాయి? ఏ యే రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఈ కొత్త సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది… అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే కాకుండా, పంచాంగ శ్రవణం ద్వారా దేవుని అనుగ్రహం కూడా కలుగుతుందని ప్రజల విశ్వాసం!
ఉగాది రోజున కవి సమ్మేళనాలు నిర్వహిస్తారు. కవులందరూ ఒకచోట సమావేశమై, ఉగాది పండుగ గురించి, సమకాలిన అంశాలను గురించి తమ తమ కవితలను వినిపిస్తారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాలను నిర్వహించి కవులను సత్కరిస్తుంది. ఆకాశవాణి దూరదర్శన్లు వీటిని ప్రసారం చేస్తాయి. తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా, దేశీయంగా అంతర్జాతీయంగా ఉన్న తెలుగు వారందరూ ఆనందంగా కవి సమ్మేళనాలు జరుపుకుంటారు. ఉగాది సందర్భంగా సాహితీ పురస్కారాలను కూడా అందజేస్తారు.
మనకున్న 60 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం పేరు ప్రకారం ఆ సంవత్సరాన్ని ఆ పేరుతో పిలుచుకుంటాం. క్రోధి నామ సంవత్సరం పూర్తి చేసుకొని ఈ ఉగాదితో మనం ‘విశ్వావసు’ నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ‘విశ్వావసు’ అంటే ప్రపంచానికి సంబంధించిన వాడు లేదా ప్రపంచం యొక్క సంపదలు కలిగిన వాడు అని అర్థం.
కొమ్మపై కోయిల కమ్మగా పాడుతున్నట్లుగా ఉగాదిపై కోయిలపై అనేక రకాల లలిత గీతాలు, సినీ గీతాలు, భక్తి గీతాలు రచించబడి, పాడి ఉన్నాయి. ఉగాది పండుగ రోజున దేవాలయాలను సందర్శిస్తారు. ఉగాది పచ్చడితోపాటు పులిహోర, బొబ్బట్లు మరికొన్ని ఎవరి ఇష్టానుసారం వారు రకరకాల పిండి వంటలు తయారు చేసుకుంటారు. తలకి స్నానం చేయడం, కొత్త బట్టలు వేసుకోవడం, పంచాంగం వినడం, వింటూ వింటూ ఆదాయ వ్యయాలను చూసి నాకన్నా నీకు ఎక్కువ.. నాకు తక్కువ ఆదాయం అంటూ అంచనాలు వేసుకోవడం సరదాగా జరిగిపోతుంది.
ఆనందాలన్నీ మూటగట్టుకొని మామిడాకుల తోరణాల గడపను దాటుకొని కొత్త సంవత్సరంలోకి కొంగొత్తగా అడుగుపెట్టిన విశ్వాసుని ఆహ్వానించి ఈ సంవత్సరం అంతా ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుందాం. కొందరు ఈ సంవత్సరం ఏమేం చేయాలో ప్రణాళికలు వేసుకుంటారు. మరికొందరు తమని అంటిపెట్టుకొని ఉన్న పాత అలవాట్లు ఇకపై మానేయాలనే ఆశాభావంతో సంసిద్ధమవుతారు.
శుభాలను కలిగించమని కోరుకుంటూ విశ్వావసు సంవత్సరానికి మనమంతా కలిసికట్టుగా ఆహ్వానం పలుకుదాం. మావిచిగురులతో కోయిల పాటలతో మంగళ వాయిద్యాలతో స్వాగతం పలుకుదాం!
డా. సమ్మెట విజయ
9989820215

]]>
స‌మ‌స‌మాజం కోరిన భ‌గ‌త్‌సింగ్ https://navatelangana.com/bhagat-singh-sought-by-the-samasam/ Sat, 22 Mar 2025 17:06:13 +0000 https://navatelangana.com/?p=529766 Bhagat Singh demanded a just societyటీవీ ఛానళ్లు, సోషల్‌ మీడియా వంటి ప్రచార సాధనాలు ఏవీ లేవు. రేడియో బ్రిటిష్‌ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అయినా ఉరితీసిన కొద్ది గంటల్లోనే ఆ సమాచారం దేశమంతా దావానలంలా వ్యాపించింది. ప్రజల్లో ఆవేశం, ఆగ్రహం కట్టలు తెంచుకొంది. లహోర్‌కు వేలమైళ్ల దూరంలో ఉన్న మద్రాసు నగరంలోనూ ప్రజలు రాత్రికిరాత్రే వీధుల్లోకి వచ్చారు. పెద్ద నిరసన ప్రదర్శన చేశారు. అప్పటికి బాలుడిగా ఉండిన తమిళనాడు సిపిఎం నాయకుడు ఎన్‌. శంకరయ్య తన జ్ఞాపకాల్లో ఆనాటి ప్రజా ప్రతిస్పందనను వివరిస్తూ ”మద్రాసు నగరంలో ఉన్నట్లుండి ఏదో కల్లోలం జరిగినట్లు జనం స్పందించారు. ఎవరి పిలుపూ లేకుండానే ప్రజలు తమ ఇళ్లలోంచి వీధుల్లోకి వచ్చారు. భగత్‌సింగ్‌ త్రయం ఉరితీతను, బ్రిటిష్‌ పాలనను నిరసిస్తూ ఏ వీధికి ఆ వీధిలో చిన్న చిన్న పాయలుగా మొదలైన ప్రదర్శనలు మహాప్రదర్శనగా మారి మద్రాసును కుదిపేసాయి” అని చెప్పారు. వంటిపై చొక్కా కూడా ధరించకుండా వీధుల్లోకి పరిగెత్తుకొచ్చిన తాను చేతికి అందిన కాంగ్రెస్‌ జెండాను పట్టుకొని మహా ప్రదర్శనలో భాగమైనట్లు శంకరయ్య నాటి ఘటనను పేర్కొన్నారు.
విప్లవం అంటే తుపాకులు, బాంబులు కావు
– భగత్‌సింగ్‌
(ఈ రోజు భగత్‌సింగ్‌ వర్థంతి)
సమతావాది, స్వాతంత్రవీరుడు, షహీద్‌ భగత్‌సింగ్‌ దేశంకోసం ప్రాణాలిచ్చిన త్యాగశీలి మాత్రమే కాదు, గొప్ప దార్శనికుడు కూడా. ఆయనతో పాటు ఆయన సహచరులైన సుఖదేవ్‌, రాజ్‌గురులను ఆనాటి బ్రిటిష్‌ పాలకులు మార్చి 23, 1931 ఉరితీసి చంపేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం తెల్లవారుజామున కాకుండా ముందురోజు సాయంకాలం, జైలు సాంప్రదాయానికి విరుద్ధంగా లహోర్‌ జైల్లో ఉరితీశారు. కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను ఏమార్చి గుట్టుచప్పుడు కాకుండా ఉరితీస్తే ఏ గొడవా ఉండదని బ్రిటిష్‌ ప్రభుత్వం తప్పుడు అంచనా వేసింది.
భగత్‌సింగ్‌కు కీర్తి ప్రతిష్టలు కేవలం ప్రాణత్యాగం వల్ల లభించినవి కావు. ఆయన సల్పిన పోరాటాల వల్ల, చేసిన ప్రసంగాల వల్ల, పత్రికల్లో తాను రాసిన వ్యాసాల వల్ల లభించినవి. ఆయన నిజానికి యవ్వన దశ ఆరంభంలోనే చనిపోయారు. ఆ కొద్ది సమయంలో తరతరాలకు తరగని కీర్తి ప్రతిష్టలను, గౌరవాదరాలను అర్జించారు. ఆయన స్వాతంత్య్ర యోధులైన త్యాగధనుల కుటుంబంలో పుట్టారు. ధైర్యసహసాలతో పాటు త్యాగశీలతను ఆ కుటుంబం బాల భగత్‌సింగ్‌కు ఉగ్గుపాలలో రంగరించి పట్టించిందేమో! కాలేజీ దశలో ఒక అధ్యాపకుడి ద్వారా మార్క్సిజానికి పరిచయమయ్యాడు. మార్క్సిస్టు సాహిత్యంతో పాటు ప్రపంచ ఉద్యమాలను, ఇంగ్లీషు హిందీ, ఉర్దూ సాహిత్యాలను అధ్యయనం చేశారు. క్రమం తప్పకుండా ఇంగ్లీషు, హిందీ, పంజాబీ పత్రికలకు ముఖ్యమైన రాజకీయ అంశాలపై వ్యాసాలు రాశారు. జైల్లో ఉండగా తన పూర్తి సమయాన్ని అధ్యయనానికి, వ్యాసరచనకు ఉపయోగించారు. మారుపేర్లతో ఆయన వ్యాసాలు ప్రచురితమయ్యేవి. జైల్లో కూడా బ్రిటిష్‌ పోలీసుల అమానవీయ ధోరణికి వ్యతిరేకంగా రాజకీయ ఖైదీలను సమీకరించి సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేసి కొన్ని డిమాండ్లు సాధించారు. పోలీసులు పెట్టే బాధలను భరించలేక నీరు కారిపోయే తన సహచరులకు ధైర్యం చెప్పి నిలబెట్టారు. తనతోపాటు ఉరిశిక్షకు గురైన సుఖదేవ్‌ ఆత్మహత్యకు ప్రయత్నిస్తే బీరువులా మరణిస్తే లోకం హర్షించదు. ధైర్యంగా ఉరికంబం ఎక్కి ప్రాణాలను అర్పించిన వారినే అది గౌరవిస్తుందని, అలాంటి వారిని దేశం ఆరాధిస్తుందని వివరించి సుఖదేవ్‌ చేత ఆత్మహత్యా ప్రయత్నాన్ని మాన్పించారు. భగత్‌సింగ్‌ క్షమాభిక్ష కోరుతూ లెటర్‌ పెట్టకోమని చెప్పిన తండ్రి మాటను నిరాకరించారు. ఆ పని తర్వాతి కాలంలో విడి సావర్కర్‌ చేశాడు. క్షమాభిక్ష కోరడంతో పాటు బ్రిటిష్‌ పాలకుల షరతులను అంగీకరించి ఆచరించాడు.
భగత్‌సింగ్‌ లాహోర్‌ సమీపంలోని ఒక గ్రామంలో పుట్టారు. నాన్న కిషన్‌సింగ్‌ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించినవాడు. చిన్నాన్న అజిత్‌సింగ్‌ బ్రిటిష్‌ పాలనకు ఎదురు తిరిగాడు. అతను రైతులను రెచ్చగొడుతున్నారని పోలీసు అరెస్ట్‌ చేస్తే తప్పించుకుని కెనడాకు వెళ్లారు. అక్కడి నుండి స్వాతంత్ర పోరాటానికి సహకరించారు. భగత్‌సింగ్‌ బాలుడిగా ఉన్న సమయంలో జలియన్‌వాలా బాగ్‌లో ప్రపంచం కనీవిని ఎరగని రీతిలో నిరాయుధులపై పిల్లలు, వద్దులు, మహిళలు అన్న విచక్షణ లేకుండా బ్రిటిష్‌ పోలీసులు కాల్పులు జరిపారు. వందల మందిని హతమార్చారు. ఇంట్లో చెప్పకుండా బాలభగత్‌ జలియన్‌వాలా బాగ్‌కు చేరుకొని అమరులకు నివాళులు అర్పించారు. బ్రిటిష్‌ పాలకులను దేశం నుండి తరిమేసే దాకా పోరాడాలని తనకు తాను తీర్మానించుకొన్నారు. ఆ నిర్ణయానికి చివరిదాకా కట్టుబడ్డారు.
తన అధ్యాపకుడి సూచనపై కాన్పూర్‌కు వెళ్లి చంద్రశేఖర్‌ ఆజాద్‌ను కలిశారు. విప్లవ చర్యల్లో పాల్గొన్నారు. విప్లవం అంటే తుపాకులు, బాంబుల సంస్కృతి కాదని అర్థం చేసుకొన్నాడు. తాను చేరిన హిందుస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ పేరును హిందుస్థాన్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ అసోషియేషన్‌గా మార్చారు. తన మాతృదేశాన్ని బ్రిటిష్‌ పాలననుండి విముక్తి చేస్తే సరిపోదని, స్వతంత్ర భారతదేశంలో సమసమాజాన్ని సాధించాలని ఆశించారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే సహచరులను ఢిల్లీ ఫిరోజ్‌ కోట శిధిలాల దగ్గర రహస్యంగా సమావేశ పరిచి సోషలిజం ఆవశ్యకతను అందరి చేత ఒప్పించి తన సంస్థ పేరులో సోషలిస్టు అన్న పదాన్ని చేర్చారు.
మతం కులం ప్రాంతం తదితర అస్తిత్వాల పేర ప్రజలను విభజించడానికి భగత్‌సింగ్‌ గట్టి వ్యతిరేకి. ఆయన విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకొన్నారు. ఒక మనిషికి మరో మనిషికి పరాయి వాడుగా కనిపించని సమాజాన్ని ఆకాంక్షించారు. అంటరానితనాన్ని గట్టిగా వ్యతిరేకించారు. 40 కోట్లు భారతీయుల్లో 6 కోట్ల మందిని అంటరానివారంటూ దూరంగా ఉంచడం దుర్మార్గమని చెప్పారు. మన దేశంలో సోదర భారతీయులను హీనంగా చూసే విదేశాల్లో మన ఇండియన్లను హీనంగా చూస్తున్నారని ఫిర్యాదు చేసే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఆనాటి స్వాతంత్ర పోరాట నాయకులైన మదన్మోహన్‌ మాలవ్య, లాలా లజపతిరాయి గొప్ప నాయకులు ‘అంటరానివారి’తో బహిరంగ స్థలాల్లో పూలదండలు వేయించుకోవల్సివస్తే ఇంట్లోకి వెళ్ళకముందు బట్టలు విప్పకుండానే నెత్తిన బకెట్లతో నీటిని గుమ్మరించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. స్వాతంత్రోద్యమంలోని ముస్లిం నాయకులు కూడా అదే పని చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు.
భగత్‌సింగ్‌ తాత ఆర్యసమాజం అనుచరుడు. మనవడి చేత బాల్యంలో ప్రార్థనలు చేయించేవాడు. అధ్యయనం, పరిశీలన వల్ల యుక్తవయస్సులోనే భగత్‌సింగ్‌ నాస్తికుడిగా మారారు. నాస్తికవాదాన్ని సమర్థిస్తూ వ్యాసాలు రాశారు. జైల్లో ఉండగా తనపై సానుభూతి గల పోలీసులు ఆయన్ని దైవప్రార్థనలు చేయమని కోరేవారు. ఆ సూచనలను ఆయన సున్నితంగా తిరస్కరించేవారు. జైల్లోని దుర్భర పరిస్థితుల మధ్య దైవం అనే భావన సాంత్వన కల్పించే మాట నిజమే అయినా, అశాస్త్రీయమైన భావనకు తాను లొంగిపోవడం ఏమిటని తనను తాను ప్రశ్నించుకొన్నాడు. ఆయనలో ధైర్యం సడలలేదు. శాస్త్రీయ దక్పథం వైపే నిలబడ్డారు. దేశంలో అప్పుడప్పుడే పెరుగుతున్న మతోన్మాద ప్రమాదాన్ని ఆయన సరిగ్గా అంచనా వేశారు. మతం పట్ల అశాస్త్రీయ ఆలోచనల పట్ల కాంగ్రెస్‌ నాయకుల దృక్పథాన్ని ఆయన దునుమాడే వారు. ఆనాటి కాంగ్రెస్‌లో రెండు భిన్నమైన ఆలోచనగల నాయకులున్నారు. జవహార్‌ లాల్‌ నెహ్రు ఆధునికుడు, శాస్త్రీయవాది, అభ్యుదయగామి కాగా, సుభాష్‌ చంద్రబోస్‌ తిరోగమన వాది. దేశాన్ని తిరిగి వేదకాలం నాటికి తీసుకెళ్లాలని భావించేవారు అని విమర్శించారు. వీరు గాక స్వాతంత్య్రోదమం వెలుపల మరో ఆలోచనా స్రవంతి ఉంది. భారతదేశంలో హిందువుల పాలన నెలకొల్పాలన్న మతోన్మాద స్రవంతి అది. ప్రమాదకరమైంది. ఉత్తరోత్తర భారతదేశంలో వారు పరిపాలనలోకి రావచ్చు అని హెచ్చరించారు. భగత్‌సింగ్‌ ఎంతటి దూరదృష్టి గలవాడో దాన్ని బట్టి చెప్పొచ్చు.
భగత్‌సింగ్‌ కుటుంబం లాలాలజపతి రారుని పెద్దదిక్కుగా భావించేది. ఆయన మాటకు ఎదుర్లేదు. అలాంటి లాలా హిందుమహాసభకు అనుకూలంగా మారినప్పుడు భగత్‌సింగ్‌ సహించలేదు. ఆయనను ఘాటుగా విమర్శించారు. రష్యాలో 1917లో సోషలిస్టు విప్లవం జయప్రదమైనప్పుడు చాలా మంది కాంగ్రెస్‌ నాయకుల్లో భయం పుట్టుకువచ్చింది. అలాంటి వారిలో లాలా ఒకరు. ఆయన భగత్‌సింగ్‌ ప్రమాదకరమైన బొల్షివిక్‌ బాటలో వెళ్తున్నాడని హెచ్చరించారు. తనకు భగత్‌సింగ్‌కు మధ్య పత్రికల ద్వారా సంవాదం జరిగేది. భగత్‌సింగ్‌ నన్ను లెనిన్‌లా మార్చాలనుకొంటున్నాడు కాని అది జరగని పని అని లాలా వ్యాఖ్యానించారు. భగత్‌ కూడా దానికి గట్టి సమాధానాలే చెప్పారు. సైమన్‌ కమిషన్‌ వెనక్కి వెళ్లిపోవాలని దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి. లాహోర్‌లో జరిగిన ప్రదర్శనకు లాలా నాయకత్వం వహించి ముందు వరుసలో నడిచారు. పోలీసులు ప్రదర్శకులపై విచక్షణ లేకుండా లాఠీచార్జి చేశారు. వృద్ధుడు పేరెన్నిక గల నాయకుడైన లాలా ను కూడా కొట్టారు. ఆయన తలకు బలమైన గాయాలు తగిలాయి. ఆ దెబ్బలకు చికిత్స పొందుతూ లాలా మరణించారు. లాలా మరణానికి ప్రతీకారం తీర్చుకొని బ్రిటిష్‌ పోలీసులకు బుద్ధిచెప్పాలని చంద్రశేఖర్‌ ఆజాద్‌, భగత్‌సింగ్‌ మిగతా సహచరులు నిర్ణయించుకొన్నారు. ఒక ఆంగ్లేయ పోలీసు అధికారిని కాల్చి చంపారు. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురులతో మరికొందరు సహచరులను అరెస్టు చేశారు. వారిలో భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజగురులకు బ్రిటిష్‌ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈలోగా చంద్రశేఖర్‌ ఆజాద్‌ పై ఝాన్సీలో పోలీసులు కాల్పులు జరిపారు. బ్రిటిష్‌ బుల్లెట్‌తో మరణించిడం ఇష్టంలేని ఆజాద్‌ తన పిస్టల్లో మిగిలిన చివరి బులెట్‌తో తనను తాను కాల్చుకొని మరణించారు.
ఆ ఘటనకు ముందు బ్రిటిష్‌ పాలకులు కార్మిక వ్యతిరేక బిల్లులను ప్రవేశపెడ్తున్న సమయంలో విజటర్స్‌ గ్యాలరీలోంచి జాతీయ అసెంబ్లీలోకి పొగ బాంబులు విసిరారు. ఠారెత్తిన పోలీసులు తమను అరెస్టు చేసేదాకా గ్యాలరీలోనే నిలబడ్డారు. ‘తాము ఎవరినీ చంపాలని బాంబులు విసరలేదని బ్రిటిష్‌ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికే ఆ పని చేశామని ప్రకటించారు. మేము ఎవరినైనా చంపాలనుకొంటే ప్రజాకటంకులైన బ్రిటిష్‌ అధికారులు ఆ సమయంలో సభలో ఉన్నారు. మేము వారి పైకి నేరుగా బాంబులు విసిరేవాళ్లం. అలా కాకుండా ఎవరూలేని ప్రదేశంలోకి బాంబులు విసిరాం. మేము విప్లవం కోరుకొంటున్నాం. సమ సమాజాన్ని అకాంక్షిస్తున్నాం అందుకే కార్మిక వ్యతిరేక బిల్లు ప్రవేశపెట్టే సమయాన్ని మా చర్యకు ఎంచుకొన్నాం. విప్లవం అంటే తుపాకులు, బాంబులు కాదు. విప్లవం అంటే మౌలికమార్పు. అలాంటి మార్పును కోరుకొంటున్నాం. కుల మతాలకు అతీతమైన ప్రభుత్వం కావాలనుకొంటున్నాం ఒక న్యాయమైన ప్రణాళికపై ఆధారపడి నూతన సమాజాన్ని నిర్మించడం మా లక్ష్యం’ అని విస్పష్టంగా వారు కోర్టులో ప్రకటించారు. తద్వారా హిందుస్తాన్‌ సోషలిస్టు రిపబ్లిక్‌ అసోసియేషన్‌ లక్ష్యాలు ఏమిటో దేశం ముందుంచారు.
జైల్లో ఉండగా ఆయన విస్తృత అధ్యయనంతో పాటు మారు పేర్లతో పత్రికలకు వ్యాసాలు రాసి పంపడమే కాక తన దగ్గర 200 పేజీల నోట్‌బుక్‌ ఉంచుకొని ప్రముఖులు చెప్పిన ముఖ్యమైన విషయాలను ఆ నోట్‌బుక్‌లో రాసుకొన్నారు. మొదట్లో టెర్రరిస్టు కార్యకలాపాలవైపు మొగ్గినా త్వరలోనే ఆ పంథానుండి వెనక్కి వచ్చారు. నూతన సమాజ నిర్మాణంకోసం కార్మికుల్ని, రైతులను విశాల ప్రజానీకాన్ని సమీకరించడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకొన్నారు. మొదటి నుండి కూడా భగత్‌సింగ్‌ విశ్వమానవ సాభ్రాతృత్వాన్ని కోరుకొన్నారు. 1924లో ఆయన ఆ విషయంపై ఒక వివరమైన వ్యాసం రాశారు. అప్పటికి ఆయన వయస్సు 17 ఏళ్లు మాత్రమే. కాంగ్రెస్‌ నాయకత్వం మతాతీతంగా వ్యవహరించడం లేదన్న అసంతృప్తి ఆయనలో ఉండేది. నలుపు – తెలుపు, నాగరికులు – అనాగరికులు, పాలకులు – పాలితులు, ధనికులు – పేదలు, సవర్ణలు – అంటరాని వాళ్లు అన్న పదాలు ఉనికిలో లేని సమాజాన్ని ఆయన కోరుకొన్నారు.
ఆనాటి పత్రికలను, పాత్రికేయులను కూడా ఆయన దుయ్యబట్టారు. పత్రికలు ప్రజల ఆలోచనల్లోని కల్మషాన్ని కడిగేయ్యాలి. అది వదిలేసి అజ్ఞానాన్ని, ఒంటెత్తుతనాన్ని మతతత్వ దురభిమానాలను పత్రికలు పెంచుతున్నాయి. భారతదేశపు సమ్మిళిత సంస్కృతిని, ఉమ్మడి వారసత్వాన్ని ధ్వంసం చేస్తున్నాయని ఘాటుగా పత్రికలను ఏకిపారేశారు. భగత్‌సింగ్‌ ఆయన సహచరులు 1926లో నౌజవాన్‌ భారత్‌ సభ అనే సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థ అనుసరించాల్సిన నిర్ధిష్ట ప్రణాళికను భగత్‌సింగ్‌ రాశారు. ఆ ప్రణాళికలో ‘మతపర మూఢాచారాలు, మతోన్మాదం మనకు అడ్డుగోడలుగా నిలిచాయి. మనం ఆ భావనలను వదిలెయ్యాలి. స్వేచ్ఛాయుత ఆలోచనకు అడ్డుపడేదల్లా నశించాల్సిందే’ అని విస్పష్టంగా ఆ ప్రణాళికలో పేర్కొన్నారు. భగత్‌సింగ్‌పై వచ్చిన సినిమాలు పుస్తకాలు పూర్తిగా ఆయన ఆలోచనలను మన ముందు ఉంచవు. ఆయన రాసిన వ్యాసాల ద్వారా మాత్రమే భగత్‌సింగ్‌ను అర్థం చేసుకోగలం, కనుక నేటి యువతరం భగత్‌సింగ్‌ రచనలను తాముగా చదివి ఆయన ఆలోచనలను, అంకుఠిత త్యాగాన్ని అర్థం చేసుకోవాలి.
– ఎస్‌. వినయ కుమార్‌ ,
99897 18311

]]>
కవితా ఓ క‌వితా నీకుజేజేలు https://navatelangana.com/poetry-2/ Sat, 15 Mar 2025 16:39:15 +0000 https://navatelangana.com/?p=524281 Poetry, a poem for you.ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరుపుకోవాలనే నిర్ణయాన్ని మొదటిసారిగా యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్యా శాస్త్రీయ మరియు సాంస్కతిక సంస్థ) 1999 వ సం”లో ప్యారిస్‌ లో జరిగిన 30వ సర్వసభ్య సమావేశంలో ఆమోదించింది. ఆనాటి నుండి ప్రతి ఏడాది మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రతి ఏటా యునెస్కో ఒక థీమ్‌ తో ముందుకెళ్తుంది. మార్చి 21, 2025 న ”శాంతి మరియు సమ్మిళితత్వానికి వంతెనగా కవిత్వం” అనే థీమ్‌ ను ఎంచుకుంది. ఇటువంటి కవితా దినోత్సవాలు కవిత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడానికి, కవులను గౌరవించడానికి, కవిత్వ పఠన సంప్రదాయాలను పునరుద్ధరించడానికి, కవితా వ్యక్తీకరణ ద్వారా భాషా వైవిధ్యానికి మద్దతు ఇవ్వడానికి, కవిత్వం చదువడం, రాయడం బోధించడాన్ని ప్రోత్సహించడానికి ఇది ఒక అనుకూల సందర్భం. ఇటువంటి దినోత్సవ వేళ కవిత్వం అంటే ఏమిటి? దాని పూర్వాపరాలు-వర్తమానంలో తీరుతెన్నులు గురించి సంక్షిప్తంగా అవలోకనం చేసుకుందాం.
”అక్షరానికి పాలు తాపి పదం చేయాలి
పదానికి అన్నం పెట్టి వాక్యం చేయాలి
వాక్యానికి శిక్షణ ఇచ్చి కవిత్వం చేయాలి
కవిత్వానికి జీవితాన్నిచ్చి ఆయుధం చేయాలి” అంటూ కవి శక్తిని, కవిత్వం యొక్క ప్రాశస్త్యాన్ని ప్రకటిస్తాడు కవి త్రిపురనేని శ్రీనివాస్‌. సహజంగానే కవులందరికీ కవిత్వంపై ఎనలేని ప్రేమ, నిబద్ధత, అంకిత భావం, సామాజిక బాధ్యత ఉంటాయి. తద్వారా కవి కలం సజించే కవిత్వం పసిపాపను ఊరడించగలదు. ప్రియురాలిని కవ్వించగలదు. మూలనున్న ముసలమ్మను ఉరికించగలదు. మసి బారిన మనసులను మెరిపించగలదు. కన్నీటి బాధలను కడిగేయగలదు. అజ్ఞానపు మెదళ్ళలలో చైతన్యాన్ని రగిలించనూగలదు. అది కవిత్వ శక్తి. అందుకే ప్రఖ్యాత కవి బాలగంగాధర్‌ తిలక్‌ ”కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహస్యం కవికే తెలుసు” అని తేల్చి చెప్పాడు. ఆల్కెమీ అంటే లోహాన్ని బంగారంగా మార్చేది, రసవిద్య. తిలక్‌ మాటల్ని బట్టి కవి, కవిత్వ బంగారాన్ని సష్టించగల శక్తిమంతుడు. ఈ సందర్భంగా అందరికీ మార్చి, 21 ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలు.
కవిత్వం ఒక సజనాత్మక సాహితీ ప్రక్రియ. పురాతన ప్రక్రియ. పద్యం, పదం పాట,గేయం, వచనం అనేవి కవిత్వరూపాలు. రూపం ఏదైనా కవి తాను ఎంచుకున్న రూపంలో పఠితలను వారి వారి కవితా లోకాలకు తీసుకుని పోతుండడం పరిపాటి. నిర్వచన రూపంలో కవిత్వాన్ని తెలపటం నిజానికి కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే కవిత్వం అనుభూతి ప్రధానమైనది. అందువల్ల నిర్వచనం ద్వారా కవిత్వాన్ని అందుకోవడం, అర్థం చేసుకోవడం మామూలు విషయం కాదు. భారతీయ సాహితీవేత్తలు, పాశ్చాత్యులు అనేక విధాలుగా కవిత్వాన్ని నిర్వచించే ప్రయత్నం చేశారు. ”తీవ్రమైన అనుభూతుల స్వచ్ఛంద విజంభణమే కవిత్వము” అంటాడు పాశ్చాత్య సాహితీవేత్త వర్డ్స్‌ వర్త్‌. ”వచనం లాగా భాసించే మాటల్లో కవితా స్వభావమైన భావానుభూతిని కలిగించే ప్రయత్నం వచన కవిత్వం. ఛందోరహితమైన, కేవలం వచనంలో భావ,లయ ప్రధానంగా పలికే కవిత్వాన్ని వచన కవిత్వమని” స్థూలంగా నిర్వచించారు కవి ఆరిపిరాల విశ్వం. ఈ నిర్వచనాలను బట్టి కవిత్వంలో వస్తువు, రూపం,శైలి,రీతి, వర్ణన,ధ్వని మొదలైనవి ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కవి హదయాన్ని కదిలించిన భావం కవిత్వవుతుంది. ఒక కాలానికి చెందిన కవిత్వం ఆనాటి సంస్కతికి, వ్యక్తుల ఆలోచనారీతులకు, సామాజిక పరిస్థితులకు చారిత్రక ఆనవాలుగా నిలుస్తుంది. గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును కాన్వాస్‌ గా చేసుకొని కవులు కవిత్వాన్ని అల్లుతుంటారు. నన్నయ, పాల్కురికి సోమనలు మొదలుగా నేటి వరకు సజీవ స్రవంతిగా సాగుతున్న తెలుగు సాహిత్య పరిణామక్రమంలో కవిత్వం ఒక జీవనది.
ప్రాచీన కాలంలోని పద్యం, పదం, పాట, గేయమైనా, ఆధునిక వచన కవిత్వమైనా అందులోని కవిత ప్రధానంగా మానవ జీవితాన్నే చిత్రిస్తూ వస్తుంది. కాకపోతే ప్రాచీన కాలానికి చెందిన కవిత్వంలో వర్ణన పాత్ర ఎక్కువ. కవి కావ్యం రాసినా, కవిత రాసినా దానికి ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించడం సహజం. అయితే కవులంతా సంఘ భాగస్వాములే. కాబట్టి సంఘ స్థితిని తమ తమ కవిత్వంలో ప్రతిబింబిస్తూ సజనలు చేసినప్పుడు ఆ కవితా ప్రయోజనం గొప్పగా ఉంటుంది. ఎన్నో సమస్యలకు పరిష్కారాలను అందిస్తుంది. ఆ విధంగా కవిత్వ పరిణామ క్రమంలో పద్యం, పదం, పాట, గేయం, వచనం వాహిక ఏదైనా ఒక కాలానికి చెందిన ప్రజల జీవిత గమనానికి సూచికగా కవిత్వం నిలిచింది. తర్వాత తరాలకు అనుభవ పాఠాలనెన్నింటినో అందించింది.
ఈ క్రమంలో ప్రాచీన సాహిత్యంలోని కవిత్వం ప్రేమ, ఆదర్శాలు, విలువలు, మానవతా స్ఫూర్తి సంబంధిత అంశాలను చిత్రించినప్పటికీ తెలుగు కవిత్వంలో ఛందస్సులనే ఇనుప తొడుగులను నిరసిస్తూ వాడుక భాష ప్రాధాన్యత పెరిగింది. తద్వారా ఆధునికాంధ్ర కవిత్వంలో కొత్త భావనలకు అంకురార్పణ జరిగింది. 20వ శతాబ్దం ఆరంభం నాటికి కందుకూరి వీరేశలింగం సంఘసంస్కరణోద్యమం, గిడుగు రామ్మూర్తి భాషా సంఘసంస్కరణోద్యమం, గురజాడ అప్పారావు సాహిత్య సంస్కరణ ఉద్యమాలు తెలుగు సాహిత్యంలో కొత్త బాటలు వేశాయి. సామాజిక, భాషా సాహిత్య, ఛాందసవాదాలను కేవలం నిరసించడంతో ఆగిపోని ఈ వైతాళికుల కషి తెలుగు సాహిత్యంలో భావ విప్లవాన్ని, భాషా విప్లవాన్ని ప్రజ్వలించింది. ఫలితంగా కొత్త కొత్త సాహిత్య ప్రక్రియలలో, భిన్న అభివ్యక్తులతో కవిత్వం సామాన్యుడిని సైతం చేరగలిగింది. నిర్బంధాల నడుమ నుండి స్వేచ్ఛా ప్రియత్వం ఆధునిక కవిత్వ లక్షణమైంది. ఈ ధోరణి క్రమంగా ఆంగ్ల కవిత్వ ప్రభావంతో, ముఖ్యంగా షెల్లీ, కిట్సు ,బైరన్‌ మొదలైన పాశ్చాత్యుల రచనల ప్రభావం వల్ల, ప్రాచీన సాహిత్య అంతస్సారాన్ని గ్రహించడం వల్ల, తెలుగు సాహిత్యంలో రాయప్రోలు సుబ్బారావు వంటి కవుల ద్వారా కాల్పనికోద్యమంగా పరిణమించింది. 1910 వ సం” నాటికి ఒక విలక్షణమైన పంథాలో సాగిన తెలుగు సాహిత్య పునరుజ్జీవనం చైతన్యమే భూమికగా ఎన్నో కవిత్వ ఉద్యమాలకు వేదిక అయింది. తద్వారా వచన కవిత సర్వతోముఖ వికాసం చెందింది.
ఆంగ్లభాషాసంపర్కం వల్ల ఆధునిక కవిత్వంలో ప్రాణం పోసుకున్న ప్రక్రియ లిరిక్కు. దీని భావ కవిత్వం(లిరికల్‌ పోయెట్రీ) అని సాహితీవేత్తలు పేర్కొంటారు. ఆధునిక కవిత్వంలో అన్నింటికంటే ముందు ఒక ఉద్యమ రూపం దాల్చి ఎంతో మంది కవులను ప్రభావితం చేసిన సాహిత్య ఉద్యమం భావ కవిత్వోద్యమం.
”సౌరభములేల చిమ్ము పుష్ప వ్రజంబు!
చంద్రికల నేల వెదజల్లు చందమామ!
ఏల సలిలంబు పారు! గాడ్పేల విసరు
ఏలనా హయంబు ప్రేమించు నిన్ను”అంటూ దేవులపల్లి కష్ణశాస్త్రి ప్రకతి పరిణామాల సహజత్వంతో ప్రేయసి ప్రేమ సహజత్వాన్ని కవిత్వీకరించారు.
ఈ విధంగా భావకవిత్వంలో ప్రకతి, శంగారం, విరహం-వేదన, భక్తి, దేశభక్తి సంఘసంస్కరణ, సామాజిక స్పహ ఇత్యాదులతో వచన కవిత జయకేతనం శాఖోపశాఖలుగా విస్తరించింది. క్రమంగా ప్రజల జీవితమే ప్రమాణంగా సాహిత్య గమనం ఉండాలనే మానవాభ్యుదయ స్పహతో మార్క్సిజం ప్రభావంతో అభ్యుదయ కవితకు దారులు తెరుచుకున్నాయి.
”నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వవష్టికి అశ్రువొక్కటి ధారపోశాను”అంటూ శ్రీశ్రీ జయభేరిలో కవితా ఘంటిక మ్రోగించాడు. వ్యక్తి చైతన్యం తద్వారా సమూహ చైతన్యం కోరుకుంటూ ప్రజా ప్రయోజనం కోసం అభ్యుదయ కవిత్వం పాటుపడింది.
కాలానుగుణంగా కవితా లోకంలో ఏర్పడిన నైరాశ్యం, స్తబ్దతలను తొలగిస్తూ కొంత చైతన్యాన్ని కలిగించడానికి దిగంబర కవులు రంగ ప్రవేశం చేశారు.
”అడుగు అడుగులో సహారా ఎడారి
ప్రపంచంలో ప్రతి ఒక్కడి శిరస్సు మీద ఒక్కొక్క హిమాలయం
నీ ఆశయం సూర్యున్ని మాత్రం పిడికిట్లోంచి జారవిడవకు
ప్రాణాన్ని పణం పెట్టయినా ఈ జగతికి మానవతాభిక్షపెట్టు”అంటూ చెరబండ రాజు వంటి దిగంబర కవులు సమాజంలోని అక్రమాలపై అన్యాయాలపై విరుచుకుపడ్డారు.
సామాజిక,రాజకీయ, ఆర్థిక పరిణామాల క్రమంలో సమాజంలో అంతకంతకూ పెరుగుతున్న దుర్మార్గాలు, అసమానతలను, అమానవీయతను, ప్రతిఘటిస్తూ విప్లవించక తప్పని పరిస్థితులు ఉన్నప్పుడు విప్లవాభిముఖంగా ప్రజలను చైతన్య పరచడం అనివార్యమని భావిస్తూ విప్లవం కవిత్వం వచ్చింది. ”ఆగ్రహం కొరడాని చేబూని
సాయుధ విప్లవ బీభత్సుని సారథినై
భారత కురుక్షేత్రంలో నవయుగ భగవద్గీత ఝంఝని ప్రసరిస్తాను
మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయిస్తాను”అంటూ శ్రీశ్రీ ప్రజల హక్కుల కోసం ఉద్భవించిన విప్లవ కవిత్వంలో శివసాగర్‌, సుబ్బారావు పాణిగ్రాహి, గద్దర్‌, కె.శివారెడ్డి, విజయలక్ష్మి వంటి ఎంతోమంది కవుల కవిత్వం ప్రజలను చైతన్యపరిచింది.
తర్వాత కాలంలో సమాజంలోని అన్ని రంగాలలో స్త్రీలకు సమాన భాగస్వామ్యం ఉండాలని, స్త్రీల జీవితాలు కొందరి చెప్పు చేతలకు లోబడి ఉండే పరిస్థితులు మారాలని, పురుషాధిపత్య భావజాలం అంతరించాలని ఫెమినిజం పేరుతో స్త్రీవాద కవిత్వం మహిళాలోకాన్ని చైతన్య పరిచింది.”ఇన్నాళ్లూ గలగల మాట్లాడితే/ నే చెప్పాల్సిందేమీ లేనందున/ నేనేం చెప్పినా విన్నారు/ఇప్పుడేమో నాకు చెప్పాల్సిందేదో ఉండి/మాట్లాడబోతే ఎవరూ వినిపించుకోరు/అందుకో మరెందుకో ఈ గొంతు మూగవోయింది”- శిలాలోలిత.
పితస్వామ్యం, జెండర్‌, అణచివేతలు, ఇంటి చాకిరి స్వభావం మొదలైన విషయాలపై ఓల్గా, పాటిబండ్ల రజని, రజియా బేగం, జయప్రభ అంటే ఎంతో మంది కవయిత్రులతోపాటు కవులు కూడా తమ నిరసనను కవిత్వంతో తెలిపారు.
పంచమ కులస్థులుగా ముద్ర వేసి, ఊరికి దూరంగా నెట్టి, వారి పట్ల అస్పశ్యతను చూపుతున్న పరిస్థితులకు చరమగీతం పాడుతూ దళిత కవిత్వం వచ్చింది.
”నా కవితా వధూటి వదనంబు నెగాదిగ జూచి, రూపురేఖాకమనీయ వైఖరుల గాంచి బళిబళి యన్నవాడె, నీదే కులమన్న ప్రశ్న వెలయించి చివుక్కున లేచిపోవుచో”అంటూ గుర్రం జాషువా కులపు వెక్కిరింతలపై ఆవేదన చెందుతూ వర్ణ వ్యవస్థ క్రూరత్వాన్ని కవితా అక్షరాలతో కడిగిపారేసాడు. కుసుమ ధర్మన్న, బోయి భీమన్న, కొలకలూరి ఇనాక్‌, ఎండ్లూరి సుధాకర్‌ మొదలగు కవులెందరో దళిత సమస్యలను తమ కవితల ద్వారా ఎండగట్టారు. ఆలోచనాత్మక చర్చలను కవిత్వం ద్వారా లేవనెత్తారు.
ఇదే క్రమంలో బీసీలు కూడా తమకూ సమస్యలు ఉన్నాయని తమ పరిస్థితుల గురించి కవితాగానం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
”అగ్గిపెట్టెలు ఆరున్నర గజాల పద్యాన్ని/మడత పెట్టిన ఆదిమకళాకారుడువి.. అంటూ ఎన్‌ .గోపి,
నేను గొర్రెల్ని కాస్తుంటాను/మంద నా గురుకులం అంటూ బెల్లి యాదయ్య ఒంటి కవులు బీసీల సమస్యలను కవిత్వంలో ఏకరువు పెట్టారు.
”ఇక ఎలాంటి కుట్రా చెల్లుబాటు కాదు”అంటూ యాకూబ్‌ పాషా ఒంటి కవులు మైనార్టీల సమస్యలను కవిత్వంలో ప్రకటించారు. ఇలా కవిత ఒక్కటేమిటి ప్రాంతీయ, అస్తిత్వ, అనుభూతి, జాతీయత, మానవత, స్మతుల జలపాతమై తన హౌరును ఆనాటి నుండి నేటి వరకు వినిపిస్తూనే ఉంది. తెలుగు కవిత రాశిలోనూ, వాసిలోనూ తన ప్రత్యేకతను చాటుతూనే ఉంది. అత్యాధునిక వస్తువులతో అలరారుతూనే ఉంది. ”కవి ఎప్పటికప్పుడు కొత్తగా పలకటానికి/ ఆత్మా రణ్యంలో అజ్ఞాతవాసం చేస్తాడు” అని నందిని సిద్ధారెడ్డి అన్నట్లుగా కవులు నిరంతర విద్యార్థులై కవిత్వంలో కొత్త కొత్త వ్యూహాలతో ఎప్పటికప్పుడు సమాజ కన్నీళ్లను కలంతో నరుకుతూ, జనం గుండెల్లో కవిత్వంతో చైతన్య దీపాలను వెలిగిస్తూ సాగుతున్నారు. అయితే నేటి కొందరు వర్తమాన కవులు కవిత్వంలో ఎంచుకుంటున్న వస్తువులను మినహాయిస్తే, సమకాలీనతను ప్రతిబింబించడం, కవిత్వ రూపాన్ని గురించి పట్టించుకోవడం ఆవశ్యకం అనిపిస్తుంది. అప్పుడే కవిత్వం శతాబ్దాలు దాటినా జనం నాలుకలపై నర్తిస్తుంది. ఏది ఏమైనా ప్రపంచం నలుమూలలా కవిత్వం పరిమళభరితమై వర్ధిల్లుతూ తన పతాకను ఎగురవేస్తూ ఉంది. ప్రపంచ కవితా దినోత్సవమా! నీకు జేజేలు.
– డా. ఉప్పల పద్మ
9959126682

]]>
ఎగ్జామ్‌ ఫియర్‌ https://navatelangana.com/exam-fier/ Sat, 08 Mar 2025 16:32:09 +0000 https://navatelangana.com/?p=519485 Fear Of examsఎగ్జామ్‌ ఫియర్‌ అనేది ప్రతి విద్యార్థి ఏదో ఒక దశలో ఎదుర్కొనే అతి సాధారణమైన విషయం. దీన్నే ‘ఎగ్జామ్‌ ఫోబియా’ అని కూడా అంటారు. హేతుబద్దమైన కారణం లేకుండా కలిగే భయాన్నే ‘ఫోబియా’ అంటారు కానీ విద్యార్థుల్లో ఏర్పడే ఎగ్జామ్‌ ఫోబియా అనేది కేవలం సందర్భాన్ని బట్టి కలిగే భయం మాత్రమే.
భయాన్ని కూడా కొన్ని సందర్భాల్లో పాజిటివ్‌ ఎమోషన్‌గానే చెప్పుకోవాలి. మనం మన లక్ష్యాన్ని చేరుకోవటంలో భయం అనేది ఒక హెచ్చరికగా పనిచేస్తుంది. లేకుంటే మనలో వుండే అతి విశ్వాసం, అశ్రద్ధ, వాయిదా వేసే మనస్తత్వం అనే లక్షణాలు మన లక్ష్యాన్ని దూరం చేస్తుంటాయి. భయం వాటన్నింటికి చెక్‌ పెడుతుంది. పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఏర్పడే భయం కూడా అలాంటిదే.
అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి. అందరు విద్యార్థుల్లో భయమనేది ఒకే స్థాయిలో వుండదు. అది వాళ్ల వ్యక్తిత్వం, సిట్యువేషన్‌ని వాళ్లు తీసుకునే విధానం మీద ఆధారపడి వుంటుంది.
భయానికి కొన్ని కారణాలు :
– ప్రిపరేషన్‌లో లోపం
– గ్రేడ్స్‌కి ప్రాముఖ్యత ఇవ్వడం
– ఏకాగ్రత లేకపోవడం, తక్కువ జ్ఞాపకశక్తి… ఈ కారణాల వల్ల చదివింది గుర్తుండకపోవడం
– కొన్ని సబ్జెక్ట్ల్‌ల పైన ఆసక్తి లేకపోవడం లేదా కష్టంగా అనిపించడం.
– తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఎక్స్‌పెక్టేషన్స్‌
– తమపై తమకి నమ్మకం లేకపోవడం
– ఒకవేళ ఫెయిల్‌ అయితే జూనియర్స్‌తో కలిసి మళ్లీ అదే క్లాస్‌ చదవాల్సి వస్తుందేమో అన్న ఊహ
– క్లాస్‌రూంలో తరచుగా ఉపాధ్యాయులు చేసే నెగెటివ్‌ కామెంట్స్‌.
– ప్రిపరేషన్‌ సమయంలో ఆటంకం కల్పించే ఆరోగ్య సమస్యలు
– కుటుంబ వాతావరణం.
వీటితో పాటుగా మరొక ప్రధానకారణం ఏంటంటే.. నెక్స్ట్‌ చేయాలనుకునే కోర్సులు ప్రత్యేకంగా టాప్‌ ఫైవ్‌, టాప్‌ టెన్‌ వంటి విద్యాసంస్థల్లోనే చేయాలని చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు కలలు కంటూ వుంటారు. అందుకు అవసరమైన పర్సంటేజ్‌ ఈ పరీక్షల్లో సాధించగలమో లేదో అనే ఆందోళన కూడా విద్యార్థుల్లో వుంటోంది.
భయాన్ని అధిగమించడం ఎలా?
మనసుని చదువుపై కేంద్రీకరించడం, కష్టపడి పనిచేయడం… ఈ రెంటింటిలోనే మీ విజయం ఆధారపడి వుంది. అందుకు మీరు ఒక చక్కని ప్రణాళికని రూపొందించుకోవాలి.
మనం సక్సెస్‌ఫుల్‌ పీపుల్‌గా చెప్పుకుంటున్న వాళ్లంతా తమ కేరీన్‌ని ప్రణాళికా బద్ధంగా ప్లాన్‌ చేసుకున్నవాళ్లే.
కాబట్టి పరీక్షల విషయంలో మీరు కూడా అదే పంధా అవలంభించాలి. అప్పుడే సక్సెస్‌ అనేది మీ సొంతం అవుతుంది. పరీక్షలకి కొద్ది నెలల ముందునుంచే మీరు ప్రణాళికని సిద్ధం చేసుకోండి. పరీక్షలకు వున్న గడువుని, మీ మొత్తం సిలబస్‌ని దృష్టిలో పెట్టుకుని మీ షెడ్యూల్‌ని తయారు చేసుకోండి.. ఇది మొదటి మెట్టు. దాన్ని ఆచరణలో పెట్టగలిగినప్పుడే మీకు సక్సెస్‌ లభిస్తుంది. ఆ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోవాలి.
మీరు ఎంత పట్టుదలగా షెడ్యూల్‌ని ఫాలో అయినా ఒక్కోసారి అనుకోని ఆటంకాలు మీ ప్రిపరేషన్‌కి అడ్డంకులు కావచ్చు. అడ్డంకులు ఏర్పడినంత మాత్రాన మనం ఆగిపోవాల్సిన అవసరం లేదు. మనం ప్రణాళికని రూపొందించుకునేప్పుడు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ‘ప్లాన్‌ బి’ని కూడా సిద్ధం చేసుకుని వుండాలి. అంటే ఏమైనా చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడినా ప్రిపరేషన్‌కి ఆటంకం కలగకుండా ఎలా మేనేజ్‌ చేసుకోవాలి అన్న దానికి కూడా మీరు ముందుగానే ప్రిపేర్‌ అయి ఉండాలి. దానివల్ల సమయం వృథా కాదు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా వుండదు.
ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాత ప్రతివారం మీ ప్రోగ్రెస్‌ని కనుక మీరు గమనించుకోగలిగితే మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ‘మనం విజయానికి మరింత దగ్గర అవుతున్నాం’ అన్న ఆలోచన మీలో మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. పరీక్షలకి ఒక వారం ముందుగానే మీ రివిజన్‌ అంతా కంప్లీట్‌ అయ్యేలా ప్లాన్‌ చేసుకోవడం మంచిది. దానివల్ల కంగారు పడాల్సిన అవసరం వుండదు. ఇవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపించినా మంచి ఫలితాలు పొందడానికి ఎంతగానో తోడ్పడతాయి.
ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుకోవాలి :
విజయం సాధించడానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా కలలు కంటూ కూర్చుంటే మీ మెదడుకు వున్న శక్తిని వృధా చేస్తున్నట్టే. మీ తెలివితేటల్ని ఎప్పుడూ తక్కువగా లేదా ఎక్కువగా అంచనా వేసుకోవద్దు. రెండూ మంచిది కాదు.
పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని. మీలో వున్న ప్రతిభని గుర్తించి, మెరుగుపరుచుకోవడం. విషయాన్ని బట్టీ పట్టడం కన్నా ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుకోగలిగితే పరీక్షల్లో ప్రశ్నలకి సమాధానం రాయటం సులభం అవుతుంది. విషయం మీద పూర్తి అవగాహన వుంటుంది కాబట్టి, ఒకవేళ సమయానికి పుస్తకంలోని విషయం గుర్తురాకపోయినా కంగారు పడకుండా మీకున్న పరిజ్ఞానంతో సమాధానం రాయగలుగుతారు. కాబట్టి బట్టీ చదువుల కన్నా అవగాహనతో చదివే చదువు మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది.
ఇటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవటానికి టీం వర్క్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ మైండ్‌ సెట్‌కి మ్యాచ్‌ అయ్యే మిత్రులతో కలిసి సబ్జక్ట్‌ డిస్కస్‌ చేయడం, నాలెడ్జ్‌ షేర్‌ చేసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అవసరం అనిపిస్తే పరీక్షల ముందు మీరే చొరవ తీసుకుని ఉపాధ్యాయుల సలహాల్ని, సహాయాన్ని తప్పకుండా తీసుకోవాలి.
సాకులు చెప్పకండి :
‘మిమ్మల్ని మీరు నమ్మండి. మంచి ఫలితాలు తప్పకుండా లభిస్తాయి’ : ఇది విద్యార్థుల్ని వుద్దేశించి స్వామీ వివేకానంద చెప్పిన మాటలు.
నమ్మకం అనేది మనం పనిచేసే తీరులో వుంటుంది. అదేదో మహాద్భుతమైన రహస్య శక్తి కాదు. ‘నేను చెయ్యగలను’ అన్న దృఢమైన ఆలోచనే మీరు చేసే పనికి అవసరమైన శక్తినీ, నేర్పునీ మీలో ఉత్పన్నం చేస్తుంది. ఆ నమ్మకం మనలో వుంటే మార్గం అదే కనిపిస్తుంది.
మీపై మీకు ఆ నమ్మకం లేనప్పుడే సాకులు చెప్పటం మొదలు పెడతారు. సాధారణంగా విద్యార్థులుచెప్పే సాకులు నాలుగు రకాలుగా వుంటాయి.- నాకు చదివే మూడ్‌ లేదు
– సబ్జెక్ట్‌ చాలా కష్టంగా వుంది లేదా ఆ సబ్జెక్ట్‌ అంటే నాకు ఇంట్రస్ట్‌ లేదు
– నాకు అన్ని తెలివితేటలు లేవు
– నాకు చదువు మీద ఇంట్రస్ట్‌ లేదు. స్కూలింగ్‌ అయ్యాక నేను వేరే ప్రొఫెషన్‌కి వెళ్లాలనుకుంటున్నాను.
నిజానికి వాళ్ల మాటల్లో కూడా వాస్తవం లేకపోలేదు. అలా అని ‘కష్టం అనిపించగానే వదిలివేయటం’ అనే ప్రాక్టీస్‌ మంచిది కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రంగంలోకి వెళ్లాలన్నా మినిమమ్‌ ఎడ్యుకేషన్‌ అనేది చాలా అవసరం. అంతేకాదు, మీరు ఏ రంగంలో అయినా సరే నెం.1 గా నిలబడాలంటే ఎన్నో ఛాలెంజెస్‌ని ఎదుర్కోవాల్సి వుంటుంది. దానికి పునాదులు వేసుకోవాల్సింది స్కూలింగ్‌ దశలోనే. కాబట్టి సాకులన్నీ పక్కన పెట్టేయండి. రిజల్ట్‌ మీద కన్నా సబ్జెక్ట్‌ మీదే ఎక్కువ పట్టుదల, దృష్టి సారించండి. ఫలితం అదే వస్తుంది. ఫలితం ప్రయత్నంలోనే దాగి వుంటుందనే విషయాన్ని విద్యార్థులు గ్రహించాలి.
పరీక్షల సమయంలో విద్యార్థుల్లో కలిగే భయాందోళనలకి ఇది కూడా ఒక ప్రధాన కారణం అవుతోంది. కంపారిజన్‌ ఎప్పుడు, ఎక్కడ, ఎలా వుండాలో తెలియకపోవటమే దానికి కారణం. పిల్లల్లో దీనిపై అవగాహన కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపైనే వుంది. పిల్లలందరి ఐక్యూ ఒకేలా వుండదు. అందరూ ఒకే రకమైన నైపుణ్యాన్ని కలిగి వుండరు. అందువల్ల విద్యార్థుల మధ్య పోలిక అన్నది సరైనది కాదు.
ఇతరులతో పోటీ పడడం కన్నా మనతో మనం పోటీ పడడంలోనే నిజమైన విజయం దాగి వుంటుంది. ఈ విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవాలి. అంటే గడిచిన పరీక్షల్లో సాధించిన ఫలితాలకన్నా రాబోయే పరీక్షల్లో ఇంకా మెరుగైన ఫలితాల్ని సాధించాలన్న పట్టుదల మిమ్మల్ని సక్సెస్‌కి మరింత దగ్గర చేస్తుంది.
మెదడుకి విశ్రాంతి అవసరం :
మీ జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెదడుపైనే ఆధారపడి వుంటాయి. కాబట్టి పరీక్షల సమయంలో మెదడుకి విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. మీ షెడ్యూల్లో దీనిక్కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రిపరేషన్‌ మధ్యలో ఒక గంట లేదా అరగంట పుస్తకాన్ని పక్కనపెట్టి మనసుకి హాయిగా వుండే పనులు చేయండి. అలా అని టీవీ ముందు కూర్చోవద్దు. పిల్లల మెదడుని ప్రభావితం చేసే శక్తి టీవీకి వుంది. అది మీ ఏకాగ్రతని దెబ్బతీసే అవకాశం వుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో, స్నేహితుతో కలిసి సరదాగా వుండే గేమ్స్‌ ఆడడం లేదా చల్లగాలికి బయటికి వెళ్లి కాసేపు వాక్‌ చేసి రావడం, మంచి మ్యూజిక్‌ వినడం లాంటివి మీ మెదడుకి, శరీరానికి కూడా ఆహ్లాదాన్ని ఇస్తాయి.
పోటీ తప్పు కాదు – పోలికతోనే ముప్పు :
మనం లక్ష్యాన్ని సాధించటంలో పోటీ అనేది డ్రైవింగ్‌ ఫోర్స్‌లా ఉపయోగపడుతుంది. అయితే అది హెల్దీ కాంపిటీషన్‌ అయి వుండాలి. కాంపిటీషన్‌ వున్నచోట కంపారిజన్‌ కూడా వుంటుంది.
మరికొన్ని టిప్స్‌ :
– పరీక్షల సమయంలో కనీసం ఆరు గంటలు నిద్ర పోవడం చాలా అవసరం.
– మంచి పోషకాహారం తీసుకోవాలి.
– పరీక్షలు ఎండాకాలంలో మొదలవుతాయి. కాబట్టి శరీరం డీహైడ్రేట్‌ అవకుండా ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకుంటూ వుండాలి.
– పరీక్షలు అయ్యేదాకా జంక్‌ ఫుడ్‌కి దూరంగా వుండాలి.
– హాల్‌టికెట్‌ జిరాక్స్‌ తీయించి దగ్గర పెట్టుకోవడం మర్చిపోవద్దు. అలాగే స్పేర్‌ పెన్స్‌ కూడా. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్‌ హాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
ముగింపుగా :
– పరీక్షలు మనం ఎదుర్కోలేని సంఘటనలేమీ కాదని గుర్తుంచుకోండి.
– పాజిటివ్‌ థింకింగ్‌ని అలవర్చుకోండి.
– ‘గెలుపు మీదే’ అన్న నమ్మకంతో మిమ్మల్ని మీరు ముందుకు తీసుకువెళ్లండి.
ఆల్‌ ద బెస్ట్‌…

– గోపాలుని అమ్మాజి, 7989695883
హ్యూమన్‌ సైకాలజిస్ట్‌,
ఫ్యామిలీ కౌన్సిలర్‌

]]>
భ‌ద్ర‌త మా హ‌క్కు https://navatelangana.com/security-is-our-hack/ Sat, 01 Mar 2025 16:37:10 +0000 https://navatelangana.com/?p=514292 Security is our rightమార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ప్రతి మహిళని భావోద్వేగానికి గురి చేసే రోజు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 నాడు జరుపుకుంటున్నారు. అంతర్జాతీయ కార్మిక ఉద్యమంలోనే మార్చి 8 పునాదులు ఉన్నాయి. మెరుగైన వేతనాల కోసం, పని ప్రదేశాల్లో భద్రత కోసం, శాంతి కోసం మహిళలు 100 ఏండ్లకు పైగా పోరాడుతూ వస్తున్నారు. ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. ఈ పోరాటంలో అనేక హక్కులు సాధించారు. మరికొన్ని చోట్ల ఉన్న హక్కులు కోల్పోతున్నారు. కాబట్టి ఇదేదో ఉత్సవాలు చేసుకునే రోజు కాదు. ఇంటాబయట గౌరవప్రదమైన జీవితం కోసం సాగే పోరాటానికి మార్చి 8 ఒక సంకేతం.
1908లో న్యూయార్క్‌ నగరంలో వేల మంది మహిళలు కనీస వేతనాల కోసం, పని ప్రదేశాల్లో భద్రత కోసం సమ్మె చేశారు. ఈ సమ్మె చేసిన మహిళల్లో అప్పటికే ఐరోపా దేశాల నుండి అమెరికాకు వలసపోయి పని చేస్తున్న కార్మిక స్త్రీలు ఉన్నారు. వాళ్ళల్లో అనేక భాషలు మాట్లాడే వారున్నారు. వారి ప్రాంతాలు, జాతులు, భాషలు మర్చిపోయి అందరూ ఏకమై వేలాదిమంది మహిళలు సమ్మె చేశారు. ఇది అమెరికా కార్మిక ఉద్యమాన్ని ఉత్తేజపరిచింది. అప్పటి అమెరికన్‌ సోషలిస్టులు ఒక అడుగు ముందుకు వేసి 1909లో ఫిబ్రవరి నెలలో ఆఖరి ఆదివారం జాతీయ మహిళా దినోత్సవం జరిపారు. రొట్టె కోసం, శాంతి కోసం నినాదాలు ఇచ్చారు. బతకటానికి సరైన పోషకాహారం కావాలి. ఎటువంటి భయాలు లేని భద్రతతో కూడిన సమాజం కావాలి. అందుకే రొట్టె- శాంతి అనే నినాదాలతో అమెరికా మహిళలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేశారు.

దుర్భరమైన జీవితాల నుండి పుట్టిందే…

ఆనాడు ప్రపంచవ్యాప్తంగా ఐరోపా, అమెరికా ఖండాల్లో, మన దేశంలో కూడా లక్షల సంఖ్యలో మహిళలు బట్టల మిల్లులోను, తేయాకు, కాఫీ తోటల్లోనూ, పొగాకు పరిశ్రమల్లోనూ పనిచేసేవారు. వీరి జీవితాలు చాలా దుర్భరం. సరైన వేతనాలు లేవు. భద్రత ఉండేది కాదు. ఫ్యాక్టరీల్లో తరచూ ప్రమాదాలు జరిగేవి. న్యూయార్క్‌ నగరంలోని ఒక ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో సుమారు 150 మంది మహిళలు కాలి బూడిద అయిపోయారు. ఈ పరిస్థితులన్నిటిని అంతర్జాతీయ కార్మిక సంస్థ పరిశీలిస్తూ వచ్చింది. క్లారా జెట్కిన్‌, రోజా లగ్జంబర్గ్‌ వంటి నాయకులు అంతర్జాతీయ కార్మిక సభల్లో చర్చించారు. 1910 సెప్టెంబర్‌లో డెన్మార్క్‌ లోని కోపెన్‌హెగెన్‌ నగరంలో 17 దేశాల నుండి వంద మందికి పైగా ప్రతినిధులు సమావేశం అయ్యి, అన్ని దేశాల్లోనూ మహిళల కోర్కెల దినం జరపాలని నిర్ణయించారు. అప్పటినుండి అనగా 1911 నుండి అన్ని దేశాల్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మహిళల కోర్కెల దినం జరుపుతున్నారు. కనీస వేతనాలు, పని ప్రదేశాల్లో భద్రత, ప్రపంచ శాంతి ప్రధానమైన డిమాండ్స్‌.

మార్చి 8కి ప్రముఖ పాత్ర

మార్చి 8 కి మరో ప్రాముఖ్యత ఉన్నది. అక్టోబర్‌ విప్లవం ప్రాముఖ్యతను మన అందరం తెలుసుకోవాలి. రష్యన్‌ విప్లవాన్నే అక్టోబర్‌ మహా విప్లవం అని కూడా అంటారు. అందరికీ తెలిసిందే కదా. చక్రవర్తి పరిపాలన అంతమై కార్మిక కర్షక రాజ్యం ఏర్పడటంలో మార్చి 8కి ప్రముఖ పాత్ర ఉన్నది. రష్యన్‌ మహిళలు 1917లో మార్చి 8 జరపాలనుకున్నారు. పాత క్యాలెండర్‌ ప్రకారం ఫిబ్రవరి 28, కొత్త క్యాలెండర్‌ ప్రకారం మార్చి 8 రోజున లక్షల సంఖ్యలో మహిళలు వీధిలోకి వచ్చారు. వారి నినాదం రొట్టె, శాంతి. అప్పటికే రష్యాను జార్‌ చక్రవర్తి పరిపాలిస్తున్నాడు.

అంతమైన జార్‌ చక్రవర్తి పరిపాలన

మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతోంది. లక్షల సంఖ్యలో గ్రామీణ రైతు యువకులు బలవంతంగా యద్ధరంగంలోకి పంపబడ్డారు. చనిపోయిన యువకుల మతదేహాలు, కాళ్లు చేతులు విరిగిన సైనికులు గ్రామాలకు చేరుతున్నారు. ఈ దుస్థితిలో యుద్ధమేఘాల వల్ల పనులు కోల్పోయి పేదరికంలో మగ్గుతున్న ప్రజల ఆకలి కేకలు ఎక్కువయ్యాయి. పిల్లలకు తిండి పెట్టుకోలేని దుస్థితిలో మహిళలు ఉన్నారు. ఈ స్థితిలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు లక్షల సంఖ్యలో మహిళలు ఉద్యమంలో భాగస్వాములయ్యారు. వారిలో బేకరీలో పనిచేసేవారు, లాండ్రీల్లో పని చేసే వారితో సహా రోడ్లపైకి వచ్చారు. రొట్టె-శాంతి వారి నినాదం. సైనికులకు కూడా వారు పిలుపిచ్చారు. ‘సైనికులారా మాతో చేతులు కలపండి, మీ తుపాకులు మావైపు కాదు, పరిపాలకుల వైపు ఎక్కుపెట్టండి’ అని ఉద్భోదించారు.. యుద్ధాన్ని విరమించమని విజ్ఞప్తి చేశారు. ఆ మహిళలు చేసిన పోరాటం వల్ల జార్‌ చక్రవర్తి పరిపాలన అంతమయ్యింది. వందల ఏండ్ల జార్‌ చక్రవర్తి పరిపాలన అంతమైన రోజు. ఇది 1917 అక్టోబర్‌ విప్లవానికి నాంది పలికింది.

మన దేశ మహిళల పాత్ర

మనదేశంలో శ్రామిక వర్గ మహిళలు, రైతాంగ స్త్రీలు కూడా చారిత్రాత్మక పోరాటాలు సాగించారు. చరిత్రలో వారి పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయే పద్ధతుల్లో పనిచేశారు. కేరళ నుండి అస్సాం వరకు ఉన్న కాఫీ, తేయాకు తోటల్లో లక్షలాది మహిళా కార్మికులు గాని, బొంబాయి నుండి మద్రాసు వరకు బట్టలు మిల్లు కార్మికులు, పొగాకు కార్మికులు గాని లక్షల సంఖ్యలో ఉధతమైన సమ్మెలు చేశారు. ఇకపోతే ఆంధ్ర ప్రాంతంలో జమీందారు వ్యతిరేక పోరాటాలు, తెలంగాణ ప్రాంతంలో సాయుధ రైతాంగ పోరాటం మరుపురానివి. ఈ పోరాటంలో మహిళల తెగింపు సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గది. శ్రీకాకుళం జిల్లా మందస జమీందారీ వ్యతిరేక పోరాటంలో నాయకత్వం వహించి ప్రాణాలు కోల్పోయిన వీర వనిత గున్నమ్మ, చల్లపల్లి జమీందారీ వ్యతిరేక పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన బావిరెడ్డి వియ్యమ్మ, తెలంగాణలో రైతాంగ పోరాటానికి అంకురార్పణ చేసిన వీరనారి ఐలమ్మ మన కళ్ళెదుటే ఉన్నారు కదా.. ఆ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచారి విముక్తి కోసం రైతు, వ్యవసాయ కార్మిక మహిళలు బానిసత్వానికి వ్యతిరేకంగా, కూలిరేట్ల పెంపు కోసం చాలా గొప్ప త్యాగాలు చేశారు. వారిలో అగ్ర వర్గాల స్త్రీల నుండి దళిత, ఆదివాసి మహిళల వరకు అనేకమంది ఉన్నారు. ఆ పోరాటం స్త్రీ సమస్యను కూడా ముందుకు తెచ్చింది. కులాంతర, మతాంతర వివాహాలు అనేకం జరిగాయి. వితంతు పునర్వివాహాలు జరిగాయి. ఇది మన చరిత్ర.

మీకు తెలుసా?

ఇక ఇప్పటి పరిస్థితికి వద్దాం. మన దేశంలో మహిళల జీవితాలు పరిశీలిద్దాం. మాటలు కోటలు దాటుతున్నాయి. ప్రభుత్వాల చేతలు గడప దాటడం లేదు. మనదేశం ఆకలికేకల్లో ముందున్నది. ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం (గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌) ప్రపంచంలోని 127 దేశాలలో 105వ స్థానంలో ఉన్నాం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. జనాభాలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్న దేశం. విశ్వగురు పరిపాలనలో ఉన్నాం. కానీ ప్రజలకు కనీసం తిండి కూడా పెట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. ప్రధానమంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన బాగా పేరొందిన పథకం. ఈ పథకం కింద వాళ్ల కన్నీళ్లు తుడవడానికి అన్నట్లు 81 కోట్ల మందికి పైగా నెలకి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తున్నారట. అంటే ప్రభుత్వం ఇచ్చే ఐదు కిలోల బియ్యం తీసుకుంటే తప్ప బతకలేని స్థితిలో కోట్లాది ప్రజలు ఉన్నారన్నమాట. ప్రజల్లో అంత ఆరోగ్యం ఉంటే పుచ్చు పట్టిన పురుగు పట్టిన, ఉడికిస్తే ముద్దయిపోయే బియ్యానికి కూడా ఈ దేశంలో కోట్ల ప్రజలు ఆశపడుతున్నారంటే పరిస్థితి అర్థం అవుతుంది. అయితే ఆదాయానికి కూడా ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు తగ్గించేస్తుంది. గత ఏడాది బడ్జెట్లో కేటాయించిన దానికన్నా 8394 కోట్లు తక్కువ ఖర్చు పెట్టారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది 2050 కోట్లు తక్కువ కేటాయించారు. ద్రవ్యోల్బణం 7, 8 శాతానికి పెరిగిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కనీసం పోషకాహారం కూడా తినే స్థితిలో జనం లేరు. చికెన్‌, మటన్లు అలా ఉంచండి. పప్పు దినుసులు, నూనె, ఆఖరికి వెల్లుల్లి, ఉల్లిగడ్డ కూడా రేట్లు చుక్కలు అందుతున్నాయి. మనకన్నా చిన్నాచితకా దేశాలు స్త్రీలు, పిల్లలకి సరైన పోషకాహారం అందించడంలో ముందున్నాయి. వాళ్ళ కన్నా మనం వెనకబడి ఉన్నాం. బాధగా లేదూ… నూటికి 35 మంది పిల్లలు తిండి లేక ఎదుగు బొదుగు లేకుండా ఉన్నారు. మరోవైపు స్త్రీలు, పిల్లల్లో పోషకాహార లోపం ఊహించనంతగా ఉంది.

చదువులెట్లున్నాయో చూద్దాం…

తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల బడులు ఈ రెండు మూడేండ్ల కాలంలో మూతపడ్డాయి. మూడో క్లాస్‌ చదవాలంటే ఊరికి రెండు కిలోమీటర్ల పైనున్న హైస్కూల్‌కు పోవాలి. చిన్నపిల్లలు ఎట్లా నడుస్తారో, ఆడపిల్లలకి భద్రత ఏమిటో అని ఇంగిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వాలకు లేదు. పేరుకు మాత్రం భేటీ పడావో – బేటి బచావో. 2022-23 లెక్కల ప్రకారం దేశంలో పదివేలకు పైగా స్కూళ్ళు మూతపడ్డాయని లెక్కలు చెబుతున్నాయి. పిల్లల చదువులు ఇలా ఏడుస్తున్నాయి..! ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు పెంచకపోగా మొక్కుబడిగా మొత్తం బడ్జెట్లో 2.5% కేటాయించింది. కనీసం మొత్తం బడ్జెట్లో 6% అయినా కేటాయించాలని నిపుణులు చెప్తున్నారు.

ఆరోగ్యం విషయంలో…

మన ఊర్లో లేదా బస్తీలో ఉన్న ఆశా వర్కర్‌ తప్పితే, అంగన్వాడీ అక్కలు, ఏఎన్‌ఎంలు… ఇవేవీ కాకపోతే మంత్రగత్తెలు. అందుబాటులో ఆసుపత్రి ఉండదు. గవర్నమెంట్‌ ఆసుపత్రుల్లో సౌకర్యాలు ఉండవు. మోడీ గారి ఉపన్యాసాలు, నిర్మల అక్కయ్య గారి బడ్జెట్‌ ఉపన్యాసాలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మరి మనమేమో తలరాత అనుకుంటూ సరిపెట్టుకుంటున్నాం. గత ఏడాది 2.26% బడ్జెట్లో కేటాయింపులు ఉంటే ఈ ఏడాదికి 2.05 శాతానికి పడిపోయింది. కొండనాలుక్కు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా ఉంది. రోగులకు సరిపడా డాక్టర్లు గాని, నర్సులు గాని ఉండరు. ప్రభుత్వం వారి పోస్టుల్లో ఖాళీలు నింపదు. ఆఖరికి ఎక్స్‌రే మిషన్లు కూడా పనిచేయవు. రక్త పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు ఉండవు. వైద్యం వికటిస్తే అందుకు డాక్టర్లు, నర్సులదే బాధ్యత అన్నట్లుగా ఉంటుంది. అనేక సందర్భాల్లో రోగుల తాలూకు బంధువుల ఆగ్రహావేశాలకు నర్సులు, డాక్టర్లు బలి అవుతుంటారు. కనీసం ఆరోగ్య రంగానికి స్థూల జాతీయోత్పత్తిలో 2.5% అయినా కేటాయించాలని నిపుణులు చెప్తున్నారు. ప్రసూతి సౌకర్యాలు అందుబాటులో లేక తల్లి పిల్లల మరణాల సంఖ్యను మనం నిత్యం చూస్తున్నాం కదా.. అంటే తల్లి పిల్లల ఆరోగ్యం కోసం సరైన చర్యలే లేవు. సర్వసాధారణంగా ప్రజలకు వచ్చే అంటూ వ్యాధులు, పుట్టు క్షయ వంటి వ్యాధుల నిరోధానికే జాతీయ ఆరోగ్య విధానాన్ని ఆర్భాటంగా ప్రకటించారు. మరి బడ్జెట్లో డబ్బులు కేటాయించకుండా ఇవన్నీ ఎట్లా సాధ్యం. ప్రైవేట్‌ రంగానికి మాత్రం నిధులు కట్టబెడుతున్నారు. పెద్దపీట వేస్తున్నారు. వైద్య ఆరోగ్య రంగంలో 100% విదేశస్తులు పెట్టుబడులు పెట్టవచ్చని గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. అది హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పేరుతో, అంటే మనకు పైకి కనిపించే ఆరోగ్య శ్రీ వగైరాలు ప్రైవేట్‌ పెట్టుబడిదారులకు వెళ్తాయి కానీ ప్రభుత్వాసుపత్రి నిర్వహణకు ఉపయోగపడేది శూన్యం. ప్రభుత్వాసుపత్రి నిర్వహణను మెరుగుపరిచి ప్రజలకు ఆరోగ్య సౌకర్యాలు మెరుగుపరచడం మర్చిపోయారు.

ఉద్యోగ కల్పన ప్రస్తావనే లేదు

ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నది. ఉద్యోగాల కల్పనకు ఎటువంటి ప్రస్తావన లేదు. సరైన పని దొరక్క చదువుకున్న ఆడపిల్లలు కూడా ఇళ్లల్లో వృద్ధులను చూడడానికో, వంట చేయడానికి, కేర్‌ టేకర్లుగా ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి. వంద రోజులు పని కల్పిస్తానన్న ప్రభుత్వం 42 రోజులకు మించి పని ఇవ్వడం లేదు. అక్కడ కూడా రూ.600 రూపాయలు వేతనం కావాలని డిమాండ్‌ చేస్తుండగా రు.250 రూపాయలు కూడా ఎక్కడా గిట్టుబాటు కావడం లేదు. పట్టణాల్లో పట్టణ ఉపాధి గ్యారెంటీ పథకం కావాలని చేస్తున్న డిమాండ్‌ గురించి ప్రస్తావన లేదు.

అప్పుల్లో కూరుకుపోయి

కుటుంబాలను పోషించుకోలేని స్త్రీలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. తాగుబోతు భర్తల బాధ్యతారాహిత్యం పుండుమీద కారం చల్లినట్టుగా ఉన్నది. ఇటీవల ఐద్వా చేసిన సర్వేలో మైక్రో ఫైనాన్స్‌ అప్పుల్లో కూరుకుపోయిన మహిళల గాధలు వర్ణనాతీతం. సుమారు 60శాతం మహిళలు మైక్రో ఫైనాన్స్‌ అప్పుల్లో కూరుకుపోయారని అనధికార సర్వేలు చెబుతున్నాయి. వారం వడ్డీలు, నెల వడ్డీలు వసూలు చేస్తున్నారు. 24శాతం నుండి 80శాతం వరకు వడ్డీలు వసూలు చేస్తున్నారు. అంటే నెలకు రు.2/- నుండి రు.8/- వరకూ వడ్డీలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అదానీ వంటి కోటీశ్వరులకు 20లక్షల కోట్ల రూపాయలు కట్టబెట్టింది. కానీ సాధారణ మహిళలకు వడ్డీలేని రుణాలు, కనీసం పావలా వడ్డీ రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు.

విపరీత పరిస్థితి…

ఎన్ని సమస్యలతో సతమతమవుతున్నా తమ జీవితాల్లో వెలుగుల కోసం పోరాడవలసిన మహిళలు కుంభమేళాలు, తీర్థయాత్రలతోనే బొందితో కైలాసానికి పోవచ్చు అనుకుంటున్నారు. ఇది ఒక విపరీత పరిస్థితి. ప్రజల్లో బతుకుపట్ల, తోటి ప్రజల పట్ల విశ్వాసం, నమ్మకం సడలుతోందా..? పోరాడితే సాధించగలం అన్న నమ్మకం విశ్వాసాలు లేకనేనా ఈ పరిస్థితి. ఇహలోకంలో ఎట్లాగు సుఖపడలేం… పైలోకంలోనైనా సుఖపడదామని అనుకుంటున్నారా..? ఈ పరిస్థితి అభివద్ధి నిరోధక భావాలకు చక్కని భూమిక. ఏ గడ్డమీదైతే ప్రజలు దొరల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారో ఆ గడ్డ మీదే పరువు హత్యల పేరుతో కులదురహంకార హత్యలకు పాల్పడుతున్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతుల్ని చంపుతున్నారు, విడదీస్తున్నారు. ఇది విపరీత కాలం అనక ఏమనాలి..? ఏమన్నా అంటే ‘మా కులం, మా మతం, మా పరువు’ అని అనుకుంటున్నారు. కేంద్రంలో ఉన్న పాలకులు పరోక్షంగా ఈ ధోరణికి వంతపాడుతున్నారు. ప్రజల్లో శాస్త్రీయ భావాలను పెంపొందించాల్సిన ప్రభుత్వాలు ప్రజల మనసుల్లో మూఢనమ్మకాలు, కులం, మతం పిచ్చిని నింపుతున్నారు.

పోరాటమే శరణ్యం

మనం మూఢత్వంలో కూరుకునిపోయి ఉంటే మార్చి 8 లేదు, మన హక్కులు లేవు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు – మన ముందు తరం నాయకులు పోరాటమే శరణ్యం అనుకున్నారు. అందుకే కనీస వేతనాల కోసం, భద్రత కోసం పోరాడారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోరాటమనే అంకుశంతో మదమెక్కిన ఏనుగు లాంటి ప్రభుత్వాలను లొంగదీయాలని మనకు దిశా నిర్దేశం చేశారు. ఆ పిలుపుని సార్ధకం చేద్దాం.

ఇదే మార్చి 8 సందేశం

ఇటీవలే నవంబర్‌ 25 నుండి డిసెంబర్‌ 10 వరకు మహిళల భద్రత కోసం, హింసలేని సమాజం కోసం చాలా సభలు జరిపాం. మహిళల హక్కులు మానవ హక్కులే అని నినాదాలు చేశాం. ఈ మార్చి 8 సందర్భంగా కూడా అదే వారసత్వాన్ని కొనసాగించాలి. గౌరవంగా జీవించే హక్కు మనది కావాలి. భద్రత, గౌరవప్రదమైన ఉపాధి – ఉద్యోగం, పోషకాహారం, అప్పుల ఊబి నుండి బయటపడటం… ఇవి మన హక్కు. ఈ హక్కులు సాధించుకోవడం కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి పెట్టాలి. ఈ హక్కులు సాధించాలంటే మనకెందుకులే అనే మహిళల్ని మనం చైతన్యపరచాలి. కుంభమేళాలు, తీర్థయాత్రలకు పోయి గంగలో మునిగితే పోయేది సర్వపాపాలు కాదు. వచ్చేవి అంటు రోగాలు అని అర్థం చేసుకోవాలి. మనం కాస్త నోరు విప్పి మాట్లాడి, కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూసి మనం ఏంటో, మన అవసరాలు ఏంటో మన హక్కులు ఏంటో మనం గమనించాలి. భద్రత మా హక్కు – ఉపాధి మా హక్కు – తిండి మా హక్కు – వడ్డీ లేని రుణం మా హక్కు. ఇదే మార్చి 8 సందేశం కావాలి.
– పుణ్యవతి

]]>
అలనాటి అందాల నటి కృష్ణవేణి https://navatelangana.com/krishnaveni/ Sat, 22 Feb 2025 18:39:34 +0000 https://navatelangana.com/?p=509557 A beauty actress of yesteryear
Krishnaveniతెలుగు సినిమా నడక నేర్చుకుంటున్న కాలంలో వెండితెరని దేదీప్యమానం చేసిన నటీమణుల్లో కష్ణవేణి ఒకరు. 1924 డిసెంబర్‌ 24న ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లాలోని పంగిడి గ్రామంలో కష్ణవేణి జన్మించారు. ఆమె తండ్రి వత్తి రీత్యా వైద్యులు. చిన్నతనం నుంచి కష్ణవేణికి కళలంటే ఆసక్తి. అందుకే రంగస్థల నటిగా కెరీర్‌ ప్రారంభించారు. స్వాతంత్య్రానికి పూర్వం ఓ స్త్రీ రంగస్థల నటిగా రాణించడం అంటే పెద్ద సాహసం. చిన్నతనం నుంచి కష్ణవేణిలో తెగువ, పట్టుదల, ఆత్మవిశ్వాసం మెండు. అందుకే అవేమీ పట్టించుకోలేదామె. తన దారితో తాను సాగిపోయారు.
ఎన్‌.టీఆర్‌, ఘంటసాల వెంకటేశ్వరరావు, గాయని పి లీలా వంటి ఎంతోమందిని సినీ పరిశ్రమకు పరిచయం చేసిన తెలుగు సినిమా తొలి తరం నటి, గాయనీ, స్డూడియో అధినేత్రి కష్ణవేణి (101) అనారోగ్యంతో బాధపడుతూ ఫిబ్రవరి 16 వ తేది ఆదివారం ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు.
తెలుగు సినిమా నడక నేర్చుకుంటున్న కాలంలో వెండితెరని దేదీప్యమానం చేసిన నటీమణుల్లో కష్ణవేణి ఒకరు. 1924 డిసెంబర్‌ 24న ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లాలోని పంగిడి గ్రామంలో కష్ణవేణి జన్మించారు. ఆమె తండ్రి వత్తి రీత్యా వైద్యులు. చిన్నతనం నుంచి కష్ణవేణికి కళలంటే ఆసక్తి. అందుకే రంగస్థల నటిగా కెరీర్‌ ప్రారంభించారు. స్వాతంత్య్రానికి పూర్వం ఓ స్త్రీ రంగస్థల నటిగా రాణించడం అంటే పెద్ద సాహసం. చిన్నతనం నుంచి కష్ణవేణిలో తెగువ, పట్టుదల, ఆత్మవిశ్వాసం మెండు. అందుకే అవేమీ పట్టించుకోలేదామె. తన దారిలో తాను సాగిపోయారు.
1936లో దిగ్గజ దర్శకుడు సి. పుల్లయ్య దర్శకత్వం వహించిన ‘సతీ అనసూయ’తో బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేశారు. ‘మోహినీ రుక్మాంగద, కచదేవయాని, మళ్లీ పెళ్లి’ చిత్రాలు కష్ణవేణికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. 1939లో నూజివీడు సంస్థానాధిపతి మీర్జాపురం జమీందార్‌ని ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. 1941లో తన భర్తతో కలిసి ‘శోభానాచల పిక్చర్స్‌’ అనే చిత్రరంగ సంస్థని స్థాపించి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి మహిళా నిర్మాతగా అవతరించారు కష్ణవేణి. ఆ సంస్థలో ఆమె నిర్మించిన తొలి సినిమా ‘ధక్షయజ్ఞం’ (1941). తన సొంత బ్యానర్‌లో ఆమె నటించిన ‘గొల్లభామ’ (1947) కష్ణవేణిని స్టార్‌ హీరోయిన్‌ని చేసింది. ఈలపాట రఘరామయ్య కథానాయకుడిగా వచ్చిన ఆ సినిమా ద్వారానే మహానటి అంజలీదేవి చిత్రసీమకు పరిచయం అయ్యారు. ఇక శోభనాచల స్టూడియోస్‌ నిర్మించిన మరో క్లాసిక్‌ ‘కీలుగుర్రం’ (1949). ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి, అక్కినేనిని మాస్‌ హీరోగా నిలబెట్టింది. ఇక కష్ణవేణి జీవితంలో మరపురాని చిత్రం ‘మనదేశం’ (1949). ఆ సినిమా ద్వారానే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ నందమూరి తారకరామారావు వెండితెరకు పరిచయమయ్యారు. అందులో ఆయన పోలీసాఫీసర్‌గా చిన్న పాత్ర చేశారు. దేశం గర్వించదగ్గ ఆ మహానటుడ్ని వెండితెరకు పరిచయం చేసి, చరిత్రలో చెరగని స్థానాన్ని దక్కించుకున్నారు కష్ణవేణి. గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శకునిగా పరిచయమైంది కూడా ‘మనదేశం’ సినిమాతోనే కావడం మరో విశేషం. ఈ సినిమా ద్వారానే పి.లీల గాయనిగా పరిచయమయ్యారు. ఆ విధంగా తెలుగు సినిమా లెజెండ్స్‌ ఎన్టీఆర్‌, ఘంటసాల, అంజలీదేవి, గాయని పి.లీల.. వీరందరికీ తొలి అవకాశాలిచ్చి ప్రోత్సహించారు కష్ణవేణి. అక్కినేని ‘శ్రీలక్ష్మమ్మకథ’, కష్ణవేణి టైటిల్‌ పాత్రతో వచ్చిన ‘లక్ష్మమ్మ’ ఈ రెండు సినిమాలు.. 1950లో ఒకేసారి విడుదలయ్యాయి. వీటి కథ కూడా ఒకటే. అయితే.. అక్కినేని ‘శ్రీలక్ష్మమ్మ కథ’ పరాజయం చవిచూడగా, కష్ణవేణి ‘లక్ష్మమ్మ’ విజయాన్ని సాధించింది. అలాగే భీష్మ (1944), మదాలస (1948), పేరంటాళ్లు (1951) తదితర చిత్రాల్లో కూడా కష్ణవేణి నటించారు.

హీరోయిన్‌ గా తొలి చిత్రం ‘కచదేవయాని’
కష్ణవేణి హీరోయిన్‌ గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ 1938లో వచ్చింది. ఆ తర్వాత ఆమె దాదాపు ఇరవై సినిమాలలో నటించారు. 1939లో ‘మహానంద’ చిత్రంలో నటిస్తుండగా ప్రసిద్థ దర్శకనిర్మాత మీర్జాపురం రాజా ను వివాహం చేసుకున్నారు. వివాహానంతరం కష్ణవేణి భర్త కోరిక మేరకు బయటి చిత్రాలలో నటించలేదు. సొంత చిత్రాలలో నటించారు. అలానే తమ శోభనాచల స్టూడియోస్‌ వ్యవహారాలను పర్యవేక్షించారు. అదే బ్యానర్‌లో పలు చిత్రాలను నిర్మించారు. ఈ బ్యానర్‌ లో వచ్చిన తొలి సాంఘీక చిత్రం ‘జీవనజ్యోతి’ ద్వారానే చదలవాడ నారాయణరావు హీరోగా పరిచయం అయ్యారు. ‘మనదేశం’తో నిర్మాతగా మారిన కష్ణవేణి తెలుగు, తమిళ, కన్నడలో కథానాయికగా 15కుపైగా చిత్రాల్లో నటించారు. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించింది. ‘కీలుగుర్రం’, ‘బాలమిత్రుల కథ’ చిత్రాలకు గాయనిగా పనిచేశారు.

ఎన్టీఆర్‌ను పరిచయం చేసిన కష్ణవేణి
నందమూరి తారక రామారావు.. తెలుగువాడి ఆత్మగౌరవానికి నిలువెత్తు విగ్రహంలా కనిపిస్తారు. సినీ రాజకీయరంగంలో తనదైన ముద్రవేసిన నటసౌర్వభౌముడు ‘మనదేశం’ చిత్రంతో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి.. తారక రాముడిని మనకు పరిచయం చేశారు కష్ణవేణి.
తెలుగు సినిమా చరిత్రలో ఆమెది ప్రత్యేక ప్రస్థానం. బాలనటిగా అడుగుపెట్టిన ఆమె… ఓ గొప్ప నటుడ్ని తెరకు పరిచయం చేసే అదష్టాన్ని పొందింది. పారితోషికంగా రూ.250 చెక్కును ఆమె చేతుల మీదుగానే రామారావు తీసుకున్నారు.

కష్ణవేణిది లక్కీ హ్యాండ్‌
నాడు నటీనటులకు జీతం రూపంలో డబ్బులిచ్చేవారు కష్ణవేణి. మనదేశం చిత్రానికి ఎల్వీ ప్రసాద్‌కు 15 వేల రూపాయలిచ్చిన ఆమె ‘చక్రధారి’ చిత్రానికి నాగయ్యకు అత్యధికంగా 90 వేల రూపాయలు జీతంగా ఇచ్చారు. అలాగే ‘కీలుగుర్రం’ సినిమాకు అక్కినేనికి 10 వేలు ఇచ్చారు. ఆ డబ్బుతో నాగేశ్వర్‌రావు తొలిసారిగా కారు కొనుక్కోవడం విశేషం.

గాయనిగా
కష్ణవేణికి గుర్తింపు తెచ్చిన చిత్రాలు ‘లక్ష్మమ్మ, గొల్లభామ’. నటిగా కెరీర్‌ ప్రారంభించినప్పుడే కష్ణవేణి తన పాటలను తానే పాడుకున్నారు. విశేషం ఏమంటే ఆమె ‘కీలుగుర్రం’ సినిమాలో అంజలీదేవికి ప్లేబ్యాక్‌ పాడారు. కష్ణవేణి పలు చిత్రాలలో నటించినా… ఆమెకు గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టిన సినిమాలు ‘లక్ష్మమ్మ, ‘గొల్లభామ’. త్రిపురనేని గోపీచంద్‌ ‘లక్ష్మమ్మ’ సినిమాని మొదట మాలతీతో మొదలు పెట్టినా ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. దానిని శోభనాచల స్టూడియోస్‌ టేకోవర్‌ చేసింది. దాంతో అందులో కష్ణవేణి నాయికగా నటించింది. ఈ సినిమాకు పోటీగా అంజలీదేవి నాయికగా ‘శ్రీ లక్ష్మమ్మ కథ’ మొదలైంది. రెండూ పోటాపోటీగా జనం ముందుకు వచ్చాయి. అయితే కష్ణవేణి నటించిన ‘లక్ష్మమ్మ’కే జనం ఓటు వేశారు. ఇక 1947లో వచ్చిన ‘గొల్లభామ’ నటిగా కష్ణవేణికి అఖండ కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెట్టింది. విశేషం ఏమంటే… కేవలం కథానాయిక పాత్రలే కాకుండా భిన్నమైన పాత్రలను చేయాలని కష్ణవేణికి ఉండేది. ఆమె ‘తిరుగుబాటు’ అనే సినిమాలో వ్యాంప్‌ పాత్రను పోషించారు.

నిర్మాణ సంస్థలు
భర్త స్థాపించిన సంస్థ – జయా పిక్చర్స్‌ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్‌ గా నామకరణం చేశారు. సొంత సంస్థ – తన కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్‌.ఏ.ప్రొడక్షన్స్‌ సంస్థను ఏర్పాటు చేసి చిత్రాలను నిర్మించారు.

పురస్కారాలు
తెలుగు సినిమా పరిశ్రమకు కష్ణవేణి చేసిన జీవితకాలపు సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించారు. 2021 లో సాక్షి ఎక్సలెన్స్‌ పురస్కారాలలో భాగంగా లైఫ్‌ టైమ్‌ ఎఛివ్‌మెంట్‌ అవార్డును ఆమె అందుకున్నారు. 2022లో ఆకతి సంస్థ ఆధ్వర్యంలో ఆకతి- ఘంటసాల శతాబ్ది పురస్కారాన్ని సి. కష్ణవేణికి అందచేశారు.
ఇటీవల విజయవాడలో జరిగిన ‘మనదేశం’ వజ్రోత్సవ వేడుకల్లోనూ కష్ణవేణి పాల్గొన్నారు. చక్రాల కుర్చీలోనే విజయవాడకు వెళ్ళిన ఆమెను ఆ వేదికపై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సత్కరించారు. కష్ణవేణి మరణంతో తెలుగు సినిమా రంగం తొలితరం ధవతార రాలిపోయినట్టయ్యింది.

– డా. పొన్నం రవిచంద్ర,
9440077499

]]>
మాతృ భాష‌ను స‌జీవంగా నిలుపుదాం https://navatelangana.com/lets-keep-the-mothers-tongue-alive/ Sat, 15 Feb 2025 16:03:10 +0000 https://navatelangana.com/?p=504803 Let's keep the mother tongue aliveభావవ్యక్తీకరణ వారధియే భాష
భాష వికాసం ఒక నిరంతర ప్రక్రియ. సమాజపు అలవాట్లు, పరిస్థితులను బట్టి భాషా పరిణామం వేగంగా పంచుకుంటుంది. అది ఎప్పుడూ ఆగదు. భాష ఒక జీవనది లాంటిది. నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. భాష ఆవిర్భావం ఏ ఒక్క వ్యక్తి చేతగానీ, ఏ ఒక్క కాలంలో గాని జరగలేదు. భాష తరతరాలుగా ఎందరో వ్యక్తుల కషిచే ఏర్పడిన ఒక వ్యవస్థ. భాష నాగరికతలో ఒక ముఖ్యమైన అంశం. ఇది మనిషి పాశవిక స్థాయి నుంచి అత్యుత్తమైన మానవుని స్థాయికి చేరుకోవడానికి తోడ్పడుతుంది. భాష లేకుంటే మనిషి మనిషిగా సంపూర్ణ మనగడ పొందలేడు. వ్యక్తుల మధ్య ప్రసారమాధ్యంగానే కాకుండా భాష వ్యక్తి మూర్తిమత్యానికి ప్రతిబింబంగా నిలుస్తుంది. శిశువుగా వున్నప్పటినుండి భాష ద్వారానే ప్రాపంచిక విషయాలను తెలుసుకోగలుగుతాడు. మనిషి జీవితంలో ఇంతటి బహుముఖ ప్రాముఖ్యత కలిగిన భాష విద్యారంగంలో ప్రధానమైన భూమిక వహిస్తుంది. విద్య బోధన, అభ్యాసనకు సంబంధించిన అన్ని వ్యవహారాలు భాష ద్వారానే నిర్వర్తించబడతాయి. భాష లేకుంటే విద్యా ప్రక్రియ సాధ్యం కాదు. విద్యార్థి జ్ఞాన సముపార్జనకు, మూర్తిమత్వ వికాసానికి భాషయే ఆధారం. సమాజపు గుర్తింపుకు భాష ప్రాథమిక వ్యక్తీకరణ. నేడు ప్రపంచం అన్ని రంగాల్లో అభివద్ధి చెందుతున్నప్పటికీ ఆంగ్లం లాంటి పరభాషల మోజులో అనేక దేశాలు తమ మాతభాష పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వలన క్రమక్రమంగా మాతభాషలు మత భాషలుగా మారిపోతున్నాయి. ఈ మత భాష జాబితాలో తెలుగు భాష ఉండడం అత్యంత బాధాకరమైన విషయం. ఏ మాతభాష అయితే నిర్లక్ష్యానికి గురవుతుందో అనగా మాతభాష విద్యా బోధన జరగనట్లయితే ఆ భాష 40 సంవత్సరాలలో నశించిపోతుందని యునెస్కో తెలిపింది.
ప్రమాద అంచున మాతభాషలు:
మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతభాష. ”తల్లి ఒడి బిడ్డకు తొలి బడి” తన తల్లి అని ఎవరు చెప్పకుండానే అప్రమయంగా అమ్మ అని బిడ్డ ఎలా పిలుస్తుండో మాతభాష కూడా సహజంగా అలాగే వస్తుంది.
యునెస్కో కు చెందిన సాంస్కతిక విభాగం ప్రపంచంలోని అల్పసంఖ్యాక భాషల పరిరక్షణకై సభ్య దేశాలలో జాగతిని కలుగజేయాలన్న ఉద్దేశంతో ప్రపంచ భాషల స్థితిగతులను, వాటి మనుగడలను గురించిన అధ్యయనాన్ని 1994 సంవత్సరం లో మొదలుపెట్టింది. ఈ అధ్యయనంలో భాగంగా అంతరించిపోయే అవకాశం ఉన్న భాషలను గుర్తించి అట్లాస్‌ రూపంలో ప్రచురిస్తుంది. దీనినే ‘ప్రమాదంలో ఉన్న ప్రపంచ భాషల అట్లాస్‌’ అంటారు. ప్రపంచంలో సుమారు 7 దేశాల్లో 230 భాషలు పూర్తిగా అంతరించాయి. ఇంకా 2500 భాషలు అంతరించే దశలో ఉన్నాయని యునెస్కో ప్రకటించింది. ఒక భాషను మాట్లాడే జనాభాలో 30% మంది చదవకుండా మాతభాషకు దూరమైతే కాలక్రమంలో ఆ భాష మత భాషగా మారిపోతుందని యునెస్కో ఇటీవలే ప్రకటించింది. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు వారాలకు ఒక భాష కనుమరుగైపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే భారతదేశంలో 40 భాషలు, మాండలికాలు అంతరించిపోయే జాబితాలో ఉన్నాయి. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన గదబ, నైకి, అనే గిరిజన తెగల భాషలు ఉండడం ఎంతో బాధాకరం. ప్రతి పౌరుడు అమ్మను కాపాడుకున్నట్టే అమ్మలాంటి మాతభాషను కూడా కాపాడుకోవాలి. మనిషి మనగడ కోసం పరభాషలను నేర్చుకోవడం తప్పేం కాదు. కానీ అమతం లాంటి అమ్మభాషను నిర్లక్ష్యం చేయకుండా పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి ప్రథమ కర్తవ్యం. అందుకే అంతర్జాతీయ మాతభాషా దినోత్సవం జరుపుకుంటారు.
అంతర్జాతీయ మాతభాషా దినోత్సవ నేపథ్యం:
అమ్మలాంటి మాతభాషను పరిరక్షించుకోవాలని భావనతోనే 1999 సంవత్సరంలో నవంబర్‌ 17న యునెస్కో 30వ మహాసభలో ఫిబ్రవరి 21 తేదీన అంతర్జాతీయ మాతభాషా దినోత్సవంగా ప్రకటించింది. దీని వెనక పెద్ద సంఘటన దాగి ఉంది. బంగ్లాదేశ్‌హొ(అప్పటి తూర్పు పాకిస్థానీలు) చేసిన భాషా ఉద్యమానికి నివాళిగా ప్రతి ఏటా ఈ అంతర్జాతీయ మాతభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1947 లోహొభారతదేశం, పాకిస్తాన్‌ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్‌ రెండుహొభౌగోళికంగాహొవేర్వేరు భాగాలు ఏర్పడింది. ఒకటిహొ తూర్పు పాకిస్తాన్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌ అని పిలుస్తారు) రెండవదిహొపశ్చిమ పాకిస్తాన్‌ (ప్రస్తుతం పాకిస్తాన్‌ అని పిలుస్తారు).హొసంస్కతి, భాషహొమొదలైన వాటిలో రెండు ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉండేవి. ఈ రెండు భాగాలను భారతదేశం వేరు చేసింది. తూర్పు పాకిస్తాన్‌ (ఇప్పుడు బంగ్లాదేశ్‌), పశ్చిమ పాకిస్తాన్‌ (ఇప్పుడు పాకిస్తాన్‌) కలిపి మెజారిటీ ప్రజలుహొబెంగాలీహొలేదా బంగ్లా భాష ఎక్కువగా మాట్లాడేవారు.1948 లో అప్పటి పాకిస్తాన్‌ ప్రభుత్వంహొఉర్దూహొపాకిస్తాన్‌ జాతీయ భాషగా ప్రకటించింది. దీనికి తూర్పు పాకిస్తాన్‌ ప్రజలు అభ్యంతరం తెలిపారు. తూర్పు పాకిస్తాన్‌ జనాభాలో ఎక్కువ భాగం బెంగాలీ మాట్లాడుతారు. ఉర్దూతో పాటు బెంగాలీ కూడా జాతీయ భాషలలో ఒకటిగా ఉండాలని వారు డిమాండ్‌ చేశారు. భాష సమాన హోదా కోసం ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమం 1952 సంవత్సరం నుండి 1956 వరకు కొనసాగింది. ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం మేధావులను, అధ్యాపకులను జైల్లో వేసింది. ఫిబ్రవరి 21న వారిపై కాల్పులు కూడా జరిపింది మాతభాష కోసం మొదలుపెట్టిన ఈ ఉద్యమంలో యువకుల నెత్తురు ఏరులై పారింది. దాని పర్యవసారం ప్రభుత్వం దిగివచ్చింది. 1953 నుండి బంగ్లాదేశ్‌ ప్రజలు ఫిబ్రవరి 21 తేదీని మాతభాష కోసం పోరాడి, అసువులు బారిన యువకుల త్యాగాలకు గుర్తుగా అంతర్జాతీయ మాతభాషా దినోత్సవంగా ప్రకటించింది. తరువాత 2000 సంవత్సరం నుండి ప్రతి ఏటా చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కతిక, వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మనమందరం జీవవైవిద్యాన్ని కాపాడుకోగలమని, బహు భాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దష్టిని, శాస్త్రీయ దక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో తెలిపింది. అమ్మలాంటి మాతభాషను కాపాడుకుంటూనే దానితోపాటు ఇతర భాషలన్నింటినీ నేర్చుకోవడం అనంత విజ్ఞానాన్ని పొందడానికి సరైన మార్గం.
బహు భాషా విద్య ప్రాముఖ్యత
బహుభాషా విద్య సమ్మిళిత సమాజాలను ప్రోత్సహించడం, స్వదేశీ భాషలను సంరక్షించడంలో సహాయపడుతుంది. అందరి వ్యక్తులకు విద్య సమ ప్రాప్యత, జీవితాంతం నేర్చుకునే అవకాశాలను సాధించడానికి ఇది ఒక మూల స్తంభం అని చెప్పవచ్చు. 2024 అంతర్జాతీయ మాతభాషా దినోత్సవ వేడుకల ఇతివత్తం ‘బహుభాషా విద్య అభ్యాసానికి, తరాల తరబడి అభ్యాసానికి మూల స్తంభం’. యునెస్కో ఇలా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ఒక థీమ్‌ ను ప్రకటిస్తుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ల మంది పిల్లలు చదువుకోవడం లేదు, ప్రాథమిక అక్షరాస్యత నైపుణ్యాలు నేర్చుకోవడం లేదు. అంతర్జాతీయ మాతభాషా దినోత్సవం 2024 సంవత్సరంలో సమ్మిళిత నాణ్యమైన విద్య, జీవితకాల అభ్యాసంపై సుస్థిర అభివద్ధి లక్ష్యం, దేశీయ భాషలపై అంతర్జాతీయ (2022 -2032) లక్ష్యాలకు మద్దతు ఇవ్వడం యునెస్కో లక్ష్యంగా పెట్టుకుంది. బహుభాషా విద్య తరతరాలుగా అభ్యసించడానికి, సంస్కతి, వారసత్వాన్ని కాపాడుకోవడానికి, భాషల పునర్జీవనానికి ద్వారాలు తెరవడానికి ఎంతో దోహదం చేస్తుంది. డిజిటల్‌ అక్షరాస్యతకు బహు భాషా విద్య చాలా అవసరం. బహు భాషా విద్య జీవిత నైపుణ్యాలు సంపాదించడంలో ఎంతో సహాయపడుతుంది. భాషా సాంస్కతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవవైవిద్యాన్ని కాపాడుకోగలుగుతాం. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించడం వలన అది విశాల దష్టిని, శాస్త్రీయ దక్పథాన్ని పెంపొందిస్తుంది.
మాతభాషల మాధుర్యం
మాతభాష చక్కని మాధుర్యానికి, పలుకుబడులకు, నుడికారములకు పుట్టినిల్లు. ‘దేశ భాషలయందు తెలుగు లెస్స’ అని శ్రీకష్ణ దేవరాయలు చెప్పిన మాట మాతభాషాభిమాననికి మేలుకొలుపు లాంటిది. ‘తేనేతేటల నవకుంపు సోనలకును సాటియగును మా తెలుగు భాషమ తల్లి’ అని సురవరం ప్రతాపరెడ్డి కీర్తించినారు. పాశ్చాత్య మేధావులు సైతం ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ అని మన తెలుగుభాష గొప్పతనాన్ని ప్రశంసించారు. నిజానికి మాతభాష మమకారం మానవ సంబంధాలను బలంగా ముడి వేస్తుంది. ప్రాశ్చాత్య సంస్కతి, నాగరికత, భాషా ప్రభావాల వల్ల ప్రాంతీయ బేధాల్లో చక్కగా ఉన్నప్పటికీ అంతుచిక్కకుండా పోతున్నాయి. వ్యక్తుల మధ్య దూరం పెరుగుతుంది. మాతభాష మూలాలు కలిగిన కుటుంబాల్లో మాత్రం మాతభూమిపై వికసిస్తున్నాయి. తల్లి వంటి తెలుగు భాష తల్లడిల్లి పోతుంది. తనయులమైన తెలుగు వాళ్లమంతా అమతం లాంటి అమ్మ భాషను రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంది.

]]>
స‌ముద్ర‌మంత ప్రేమ‌ https://navatelangana.com/love/ Sat, 08 Feb 2025 17:22:38 +0000 https://navatelangana.com/?p=500611 Love is like an oceanఎనిమిదో క్లాసు చదివే వినయ్ గత మూడు రోజులుగా స్కూలుకు వెళ్ళట్లేదు. ఇంట్లో వాళ్ళు అడిగితే, వొంట్లో బావుండటం లేదనీ, వెళ్ళాలి అనిపించడం లేదని చెప్తూ వస్తున్నాడు.
కానీ అసలు కారణం అది కాదు. రెండక్షరాల ఫీలింగ్‌, మూడక్షరాల పేరున్న అమ్మాయి.
”అబ్బే, పన్నెండేండ్లకు ప్రేమేంటి, వెర్రి కాకపోతేనూ, మహా అయితే అట్రాక్షన్‌ అయి ఉంటది, ఈ మాత్రం దానికి స్కూల్‌ మానేయాలా? నాలుగు తన్ని స్కూలుకి తరమండి” అనే వాళ్ళకి వినయ్ దగ్గర బయటకి చెప్పని సమాధానం/ ప్రశ్న ఒకటి ఉంటుంది.
వాళ్ళ క్లాస్‌లో, అదే సెక్షన్‌లో ఇంకా పద్నాలుగు మంది అమ్మాయిలున్నారు. ‘వాళ్ళెవరిమీదా కలగని ఆ ఫీలింగ్‌, ఆ అమ్మాయి మీదే ఎందుకు కలిగింది?”
వినయ్ అడిగింది నిజంగా చాలా అవసరమైన ప్రశ్నే. చాలా సినిమాల్లో సరదాగా అడిగేసినా, ఇప్పుడు అదొక జోక్‌గా మారిపోయినా సమాధానం చెప్పాల్సిన ప్రశ్న అది.
మనకి తెలీదు. తెలిసినా చెప్పే ప్రయత్నం చేయము. చేసినా ‘అద్దంలో కొండను చూపించి చిన్నగా ఉంది’ అన్నట్లే ఉంటుంది ఆ యవ్వారం.
”ఆ, ఇలాంటివి ఎంకరేజ్‌ చేయండి, ఆ మూడో వీధి చివర్న ఉండే పండుగాడు, హేమ నో చెప్పిందని చేసిన అఘాయిత్యమే అందరు పిల్లలూ చేస్తారు” అని అరిచేవాళ్ళు చాలా మంది ఉంటారు.
అఫ్‌ కోర్స్‌! వాళ్ళు అరవడంలోనూ పెద్ద ఆశ్చర్యమేమీ లేదనుకోండి. మనల్ని మనం హింసించుకోవడం కూడా మర్డర్‌ తో సమానమే మరి.
అయితే ఆ అరిచే వాళ్ళకి ఆపోజిట్‌గా పండు తరఫున వాదించే వాళ్ళున్నారండోయ్!

వాళ్ళు ఒకటే అంటారు, ”సమస్య గురించి మాట్లాడకుండా, విషయం గురించి అవగాహన కలిగించకుండా, పరిష్కారమో, జ్ఞానోదయమో ఎలా కలిగిస్తామండీ” అని.
ఓ రకంగా అది నిజమే కావొచ్చు. పదిహేడేండ్ల తన జీవితంలో లేని అమ్మాయి, తన జీవితంలోకి రానని చెప్పినదానికి తనని తాను శిక్షించుకోవడం వెర్రితనమే,
కానీ అంత వెర్రితనానికి ఉసిగొల్పిన ఆ ఫీలింగ్‌ ఏంటనే విషయం గురించి కదా మనం ఎక్కువ మాట్లాడాల్సింది?
ప్రేమనే దానికి వయసుతో సంబంధం ఉండదు. మొగుడు ఒకరోజు కండ్ల ముందు కనబడకపోయేసరికి కన్నూ మిన్నూ తెలియకుండా బస్సెనక పరిగెత్తుకుంటూ పుట్టింటి నుంచి అత్తింటికి పరిగెత్తుకుపోయిన నరసమ్మ కావొచ్చు, శిరీషతో మాట్లాడడానికే భయం పుట్టి స్కూలు మానేసిన వినయ్ కావొచ్చు, నో చెప్పిందని కొంచెం ఘాటుగా ప్రవర్తించి గాట్లు పెట్టుకున్న పండుగాడు కావొచ్చు, అందరి కామన్‌ ఎజెండా ప్రేమనే.
ప్రపంచంలో ఎన్నో బంధాలుండగా ప్రేమ మాత్రమే ఎందుకు గొప్పదై కూర్చుంది? ఎందుకు ప్రేమ పాటలు రాగానే ప్రేమలో లేని వాడు కూడా ప్రేమించిన వాడికంటే ఎక్కువ బాధపడిపోతూ ఉంటాడు? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలు కావు. వీటికి సమాధానాలు ఉన్నాయి. కాసేపు వెతికే ప్రయత్నం చేద్దాం.
చాలా మంది చెప్పినట్లుగా, ప్రేమనేది ఒక స్పెషల్‌ ఫీలింగ్‌. ప్రేమ తాలూకు ప్రతి భావం, అంటే ప్రేమ ద్వారా కలిగే ప్రతీ ఉద్వేగం – సంతోషం, భయం, బాధ దుఃఖం, అన్నీ మన మనసుని ఎంతగానో ప్రభావితం చేస్తాయి.
మనకు నచ్చిన వాళ్ళ పక్కన ఉన్నప్పుడు కలిగే ఆనందం కాస్త ఎక్కువ మోతాదులో ఉంటే, ఆ నచ్చిన వాళ్ళు మనకు ఎక్కువ నచ్చేస్తున్నారని అర్థం. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికీ మనమేమీ ఆనందపడిపోము. వీళ్లతో ఉండటం బావుంది అనిపించిన వాళ్ళతోనే ఆ ఆనందమైనా, సంతోషమైనా.
ఇంత ఆనందం, మనం పొందలేము అనే అనుమానం వచ్చినా, పొందే అవకాశం మనకు లేదని తెలిసినా, పొందటానికి మన అహాన్ని ఒకరి ముందు పణంగా పెట్టాలి అనే చేదు నిజం అవగతమైనా, ఆ నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడతాం.
దీన్నే Fear of Losing అంటారు. వినయ్ స్కూలుకెళ్ళక పోవడానికి కారణమదే. శిరీషను తను ఫేస్‌ చేయలేడు.
ఎంతో ఆశతో చేతిలో రోజా పువ్వు, గ్రీటింగ్‌ కార్డు పట్టుకెళ్ళి ధైర్యంగా ప్రపోజ్‌ చేసినా, అవతలి వాళ్ళకి భయం వల్లనో, ఈ ప్రేమ మీద నమ్మకం లేకనో, అసలు ఈ రిలేషన్స్‌ మీద ఆసక్తి లేకనో నో చెప్తే, తీసుకోలేం అనే భయం కూడా చాలా మందికి ఉంటుంది.
దీన్ని Fear of Rejection అంటారు. చాలా ప్రేమ కథలు వన్‌ సైడెడ్‌గా మిగిలిపోవడానికి కారణం ఈ భయమే.

ధైర్యం చేసి చెప్పాలనుకున్నా, ఏమనుకుంటారో అని భయం, చెప్పాక నో చెప్తే రేపట్నుంచి ఎలా బతకాలో అనే భయం, ఈ భయాలన్నింటినీ కలిగించేది ఒక్క ”ప్రేమే”.
ఈ భయం తాలూకు మోతాదు ఎక్కువైనా పర్లేదు గానీ, భయం కోపమూ, బాధగా మారినప్పుడే పండుగాడు లాంటివాళ్ళు అలాంటి పనులకి పాల్పడతారు.
అయితే ఇప్పటిదాక మనం మాట్లాడింది ప్రేమల్లో ఒకవైపు ప్రేమల గురించే.
ఇద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగే సంఘటనలు, సంఘర్షణలు ఇవన్నీ ఇంకో రకమైన కోవకు చెందినవి.
షోయబ్‌, జెన్నాలు ప్రేమలో ఉన్నారు. పెద్దల్ని ఒప్పించి పెండ్లి చేసుకుందాం అనుకున్నారు. మొదట్లో ఇద్దరూ బానే ఉండేవాళ్ళు. మెల్ల మెల్లగా ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. గొడవ పడినపుడు ఎందుకు పడ్డాం అని ఆలోచించే వాళ్ళు కాస్తా, ఎవరు మొదలెట్టారు అని ఆలోచించడం ప్రారంభించారు. అలా ఆలోచిస్తే చివరకు ఏం మిగులుతుంది, సరిగ్గా ఆరు నెలల తర్వాత ఎవరి దారి వాళ్ళదే.
వీళ్ళు విడిపోతారని చుట్టూ ఉన్న ఎవ్వరూ అనుకోలేదు. మెల్లగా షోయబ్‌ను ప్రశ్నిస్తే, ఇంకా ప్రేమ అయితే ఉందని, అదెప్పటికీ పోదని అంటాడు. చిత్రంగా జెన్నా కూడా అదే మాట అంటుంది. మరి అంత ప్రేమ ఉన్నప్పుడు చెరో పెండ్లి చేసుకోకుండా ఇద్దరూ ఒక్కటవ్వొచ్చుగా అని అడిగితే, షోయబ్‌ ఏమో, దూరంగా ఉన్నప్పుడే బావుంది ఈ ప్రేమలో అంటాడు. జెన్నా అయితే మూవ్‌ ఆన్‌ ఐపోయాను అంటుంది గానీ, ప్రతిరోజూ ఫేస్‌బుక్‌లో మెమోరీస్‌ను చూస్తూ ఆనందిస్తూ ఉంటుంది.
ఇద్దరు మనుషులు ఒకరి మీద ఒకరు ఇష్టం పెంచుకోవడానికి కారణమైన అంశాలు, మెల్లగా ఒకరితో ఒకరు సమయం ఎక్కువ గడపడానికి కారణమైనవిగా మారుతుంటాయి. లేదా ఒకరిమీద ఒకరికి వెగటు పుట్టించడానికి కూడా కారణాలవుతాయి.
ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రేమల గురించి కూడా మాట్లాడాలి.
ఒక మనిషి ఒకేసారి ప్రేమలో పడుతాడు అని ఎవరైనా అంటే ఆమె/ అతనికి వీలైనంత దూరంగా పారిపోండి. ఎందుకంటే ప్రేమనేది ఒక ప్రాసెస్‌. ఒకరితో బ్రేకప్‌ అయ్యాక ఇంకొకరి మీద ప్రేమ కలిగేందుకు అస్సలు అవకాశమే లేదంటే అది అక్షరాలా అసత్యం.
ప్రేమ ఇంత విశ్వవ్యాప్తమైనది అయినప్పుడు దాన్ని ఒకరికి మాత్రమే పంచి సచ్చిపోతాం అంటే దాన్ని పిచ్చిగాక ఇంకేమంటారు?
నమ్మకం లేని చోట ఏ రిలేషన్‌ ఉండనట్లే ప్రేమ కూడా ఉండదు. ఒకే సమయంలో ఇద్దరితో ప్రేమలో ఉండటం లాంటి నమ్మక ద్రోహాలు కాకుండా, జీవితంలో ఒకరి తర్వాత ఒకరి మీద ప్రేమ కలగటం అనేది చాలా మామూలు విషయం. ఒకవేళ అలా మనకు ఎవరి మీదా ప్రేమ కలగట్లేదంటే విపరీతమైన ప్రేమ రాహిత్యంలో ఉండాలి మనం. అది ఎవరికీ అంత మంచిది కాదు.
ప్రేమలో ఉన్నప్పుడు అవతలి వాళ్ళ తప్పుల్ని కూడా చాలా సులభంగా క్షమించేయాలి అనిపిస్తుంది. ప్రపంచం మొత్తాన్ని మనకు నచ్చిన వాళ్ళకోసం ఎదిరించొచ్చు అనిపిస్తుంది.
అందుకేనేమో ప్రేమలో ఉన్నోల్లని పిచ్చోళ్ళు అంటుంటారు.
జోసెఫ్‌ పాతికవేల జీతం అతను అరెంజేడ్‌ మేరేజ్‌ చేసుకున్న కొత్తలో, కవితను సంతోషంగా ఉంచడానికి సరిపోయేది. ఎప్పుడైతే కొడుకు పుట్టాడో అప్పట్నుంచి కాస్త ఇబ్బందులు మొదలయ్యాయి.
సరదాగా టీ కొట్టు దగ్గర టీ తాగుతూ ఉన్న జోసెఫ్‌ ను ఇప్పుడు పలకరిస్తే, నవ్వాడు. ఏంటా నవ్వని అడిగితే ప్రేమలో ఉన్నానన్నాడు. ఆశ్చర్యం వేసింది,పెళ్ళయ్యాక ప్రేమేంటని. ఏ పడకూడదా? ఇవాళే మా ఆవిడకి ప్రొపోజ్‌ చేసాను అన్నాడు. అరెంజేడ్‌ మ్యారేజ్‌ చేసుకున్నాక రెండేండ్లకు భార్యపై ప్రేమ కలిగిందా అని ఎగతాళి చేస్తే, ప్రేమకు పర్ఫెక్ట్‌ డెఫినిషన్‌ అతని దగ్గరే దొరికింది.
ప్రేమనేది, మనకు నచ్చిన అలవాటుకు ఇంకా ఎక్కువ అలవాటుపడటం. ఒక మనిషి సాహచర్యాన్ని నువ్వు బాగా కోరుకుంటున్నావ్‌, ఇంకా ఎక్కువ కావాలి అనిపిస్తోందనుకో, ఇదే సాహచర్యాన్ని జీవితాంతం కొనసాగించాలి అనిపిస్తే అదే ప్రేమన్నాడు జోసెఫ్‌.


నేను జోసెఫ్‌ తో ఏకీభవిస్తాను. ఎనిమిదో క్లాస్‌ లో ప్రేమనేది ఆకర్షణకి కాస్త ఎక్కువ కావొచ్చు, టీన్స్‌లో హార్మోన్ల ప్రభావం కావొచ్చు, ఇరవైలలో అవసరం కావొచ్చు. ముప్పైకి చేరువలో ఉన్నవాళ్ళని అడిగినా, ఆపైన ఎవ్వరని అడిగినా ఈ మధ్య మూకుమ్మడిగా చెప్తున్నా మాట అయితే, ప్రేమనేది ఒక కంపానియన్‌ షిప్‌. నా వరకు ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్‌ షిప్‌ కి హద్దులు లేకుండా చెరిపేస్తూ కలిసి బతికితే అదే ప్రేమ, వ్యక్తుల్ని వాళ్ళ ప్లస్సులూ, మైనస్సులుగా విడగొట్టకుండా మొత్తంగా ఇష్టపడి, ప్లస్సుల నుంచి నేర్చుకుంటూ, మైనస్సుల ని కూడా ప్లస్సులుగా మార్చుకునేలా చేయగలిగినదే ప్రేమంటే.
ఇదే ఇంకొకర్ని అడగండి, కచ్చితంగా వేరే సమాధానం లభిస్తుంది. లభించాలి కూడా, లేకపోతే ప్రేమనేది ఇన్నిరోజులు ఒక టాపిక్‌గా ఉండేదే కాదు.
ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ ప్రేమను అర్థం చేసుకోవాలంటే, దాన్ని గౌరవించాలి, దాని తీరును అర్థం చేసుకోవాలి. గౌరవం అంటే పరస్పరం ఇచ్చిపుచ్చుకునేది.
ప్రేమలో గౌరవం ఏంటి కామెడీగా అనుకుంటే చివరికి మన ప్రేమకథే కామెడీ అవుతుంది.
ప్రేమ గురించి మాట్లాడుతూ విరహం గురించి మాట్లాడకపోతే అది తప్పే అవుతుంది. దూరం మనుషుల మధ్య పెరిగితే ప్రేమ తగ్గుతుందా? అని ఎవరైనా అడిగితే యస్‌ ఆర్ నో అనే రెండు సమాధానాలూ లభిస్తాయి. ఈ విరహంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు, సాహచర్యాన్ని మిస్‌ అవుతున్నాం అనే బాధతోనే ఉంటాయి. కాబట్టి ఈ ప్రేమ వల్ల కలిగే బాధ తట్టుకోవడం చాలా ముఖ్యం.


ఎందుకంటే ప్రేమ అనే అనుభూతిని సరిగ్గా అర్థం చేసుకుంటే, దాని వల్ల నష్టపోకుండా, ఆనందాన్ని పొందే మార్గం కనుక్కోవచ్చు.
నరసమ్మ వెతుక్కుందిగా?
జోసెఫ్‌ కనుక్కున్నాడుగా?
జెన్నా అలవాటు పడుతోందిగా?
మీరూ వెతకండి ప్రేమను, దొరకొచ్చు, ఏమో ఎవరికి తెలుసు? మీకు ఆల్రెడీ దొరికి ఉండొచ్చు !
(ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా..)

– సుదర్శన్‌ బూదూరి
9550816625

]]>
క్యా‌న్స‌ర్ వర్ణ‌న‌లు https://navatelangana.com/cancer-descriptions/ Fri, 31 Jan 2025 18:54:17 +0000 https://navatelangana.com/?p=495620 Descriptions of Cancerమన సమాజంలో అన్యాయం లంచగొండి తనం క్యాన్సర్‌లా పెరిగిపోయిందనీ, దానిని తగ్గించడం అసాధ్యమనీ ప్రతీకాత్మకంగా వర్ణనలు చేసేవారు చేస్తూనే ఉన్నారు. ఈ వర్ణనలన్నీ pre modern thought కి ఊతమిచ్చేలా ”అసలు క్యాన్సర్‌ తగ్గదు. క్యాన్సర్‌ వస్తే తప్పనిసరిగా మరణమే గతి” అనే భావజాలాన్ని పలురకాలుగా సింబాలిక్‌గా ప్రజలు మెదళ్ళలోకి ఎక్కిస్తూనే ఉన్నాయి. సైంటిఫికల్‌గా ఇది పూర్తిగా అబద్ధం. ఐతే ఇంత సైన్స్‌ అభివద్ధి చెందినా ఎందుకు ఈ వర్ణనలు అలాగే ఉండిపోయాయి అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. మన మోడర్నిటీ మన హేతుబద్ధతలో మనం జబ్బును చూసే విధానంలో, అర్థం చేసుకునే విధానంలో ఎలాంటి మార్పులూ తీసుకురాలేదా?. క్యాన్సర్‌ భూతమనీ, మహమ్మారి అనీ ఈరోజుకీ ఎందుకు వర్ణిస్తున్నాం?. ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ కాన్సర్‌ అవగాహన దినోత్సవం సందర్భంగా తెలుసుకుందాం..!
కరోనా మొదటి వేవ్‌ సమయంలో అప్పుడప్పుడే కరోనా తీవ్రత అర్థమౌతున్న తరుణంలో ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికలో మధ్య పేజీలో main article ఒకటి వచ్చింది. దానిని ప్రముఖ సీనియర్‌ జర్నలిస్టు రాశారు. కరోనాను ‘మహమ్మారి’ అంటూ అది మత్యు ఘంటికలు మోగిస్తోందనీ, శవాల మీద కరాళ నత్యం చేసేస్తోందనీ ఆ వైరల్‌ జబ్బును అద్భుతమైన విశేషణాలతో కవితాత్మకంగా వర్ణించారు. పైగా ఇన్ని శవాలను చూస్తూ సత్యహరిశ్చంద్రుడు కాటికాపరిగా స్మశాన వైరాగ్యం పొందినట్లుగా సామూహిక ఎలిజీలు రాసి ఆయన శోకోధతుడయ్యాడు. అది చదివి అప్పట్లో నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. సర్క్యులేషన్‌ అధికంగా ఉండే ఒక పేపర్‌ని చేతిలో పట్టుకుని ఒక మెడికల్‌ ఎమర్జెన్సీ కాలంలో దినపత్రికను ఒక అవేర్నెస్‌ కోసం, ఒక నమ్మకం కోసం, ఒక ప్రాగ్మాటిక్‌ టోన్‌తో కాకుండా శోకతప్త హదయాలను కవితాత్మకంగా చెప్పేందుకు చూపిన ఆ అత్యుత్సాహం ఔచిత్యం ఏంటో నాకేం అర్థం కాలేదు. ”Gravity of the situation” ని చెప్పేందుకు ఏమైనా అతిశయోక్తులు వాడారా అని చూశాను. అవీ కనబడలేదు. మన సమాజంలో నాటకీయతకు ఉండే మాస్‌ అప్పీల్‌ని ఉపయోగించుకుని మంచి రక్తి కట్టించే ఏకపాత్రాభినయానికి తగ్గ కంటెంట్‌ అలా ఊది పడేశారాయన. జబ్బులూ మరణాలు విధిరచితమనో, దేవుని/ అతీత శక్తి శాపమనో, కర్మఫలితమనో అనుకునే ఒక ప్రిమోడర్న్‌ ఆలోచనని ఈయన వదులుకోలేక పోవడం ఆ వ్యాసంలో స్పష్టంగా కనిపించింది. 3rd grade సెన్ససేషనలిజం తాలుకు వాసనలు వ్యాసంలో లేకున్నా ఇలాంటి సందర్భంలో వ్యక్తిగా తన బాధ్యతను, జర్నలిజం ఎథిక్స్‌ని తీసి పక్కకు పెట్టారా అనిపించింది. ఇలాంటి సమయాల్లో వార్తల్లో ”సెన్సేషనలిజం” అనేది నిజంగా ఆ జబ్బు బారినపడిన వారిని తప్పుదారి పట్టిస్తుంది.
సమాజంలో జబ్బుకి సంబంధించిన అనవసర భయాల్ని వందల రెట్లు పెంచుతుంది. అపోహలు కూడా అందుకు తగ్గట్టుగానే పుట్టుకువస్తాయి. ఇక పుకార్లకు కొదువే ఉండదు. దీన్నే మనం కరోనా సమయంలో మన సమాజంలో కళ్ళారా చూశాం. ఆ రకంగా ఆ మెడికల్‌ అత్యవసర సమయంలో వచ్చిన ఈ వ్యాసం కూడా జబ్బులకు సంబంధించిన ఒక పాపులర్‌ ప్రిమోడర్న్‌ పోయెటిక్‌ నరేటివే తప్ప అసలు ఏం జరుగుతుందో అర్థం కాని అశేష ప్రజానీకానికి ఈరకమైన వ్యాసాలు చేసే ఉపకారం అంటూ ఏదీ ఉండదు. అసలు మన దేశంలో ఎంతటి చదువుకున్న వారికైనా ఈ ప్రీ మోడర్న్‌ థాట్‌ ప్రాసెస్‌ని వదులుకోవడం ఎంతో కష్టమైన విషయంగా ఉంటుందనిపిస్తుంది. ఈ థాట్‌ ఇక్కడి నేలలో ఇంకి ఉంటుంది. అంతేకాకుండా జగన్మిథ్యత్వం, జీవిత అశాశ్వత్వం ఈ నేల ఫిలాసఫీలో ముఖ్యమైన అర్కాటైపులు. సోషల్‌ మీడియా వచ్చాక తాము హాస్పిటల్‌లో జాయిన్‌ ఐన విషయం చివరికి వెంటిలేటర్‌ మీద ఉన్న విషయం కూడా ఫొటోలుగా పెట్టుకునే వారు ఉన్నారు. రొమాంటిక్‌ యుగంలో మహాకవి బైరన్‌ టీబీతో బాధపడుతున్నప్పుడు అతడి మిత్రుడు చూడటానికి వస్తాడు. అప్పుడు బైరన్‌ అద్దంలోకి చూసుకుంటూ ”నేను టీబీతో చచ్చిపోవడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఆడవాళ్ళందరూ అయ్యో పాపం బైరన్‌ చూశావా! ఎంతలా పాలిపోయాడో! అతడు ఎలా చనిపోతాడో! అని నా మీద ఆసక్తి చూపడానికి ఉబలాటపడుతున్నారు” అని చమత్కరిస్తాడు. రొమాంటిక్‌ యుగపునాటి ఈ క్రూరత్వంలో ఉండే అలంకారాన్నీ మరణంలో ఉండే అందాన్నీ ఈ సోషల్‌ మీడియా కాలం కూడా ఒడిసిపట్టుకుందేమో అనిపించకమానదు.
ఐతే ఈ మధ్య కాలంలో చూస్తున్న ట్రెండ్‌ జబ్బులను ”వర్ణించడం”. కరోనా సమయంలో చూశాం. మహమ్మారి, రక్కసి, రాక్షసి వంటి విశేషణాలు జోడించి పేపర్లలో మీడియాలో కథనాలు ”విపరీతంగా” రావడం చూశాం. సినిమాల్లో దయ్యాలూ, మీడియాలో జబ్బులు దాదాపు అన్నీ స్త్రీ రూపాలే ఐవుండటం చూస్తుంటాం. అప్పట్లో ”కరోనా రాక్షసుడు” అని అనరెందుకు? ”రాక్షసి” అనే ఎందుకంటారు? అని కొందరు స్త్రీ వాదులు ప్రశ్నించారు కూడా. చాలా న్యాయమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిందే. ఐతే జబ్బుకు సంబంధించిన వర్ణనలు ఒక్క కరోనా విషయంలోనే కాకుండా డయాబెటిస్‌, గుండె పోటు, ఒబెసిటీ, క్యాన్సర్‌ వంటి జబ్బుల విషయంలో కూడా మన మీడియాలో విపరీతంగా పెరిగిపోయాయి. వాటిని ‘భయంకరమైన జబ్బులు’ గా వర్ణించడం పెరిగింది. మత్యు ఘంటికలు, మరణ మదంగం, కరాళ నత్యం వంటి సంగీత పదాలు కూడా జబ్బులకు తగిలించి ”జబ్బు సంగీతం” వినిపించే పనిలో మీడియా తలమునకలై ఉంది. ఒకానొక కాలంలో disease అంటే ఏమిటో ఇంకా పూర్తిగా అర్థం కాని కాలంలో జబ్బు రావడాన్ని మరణంతో సమానంగా భావించేవారు. ఎందుకంటే సరైన ట్రీట్మెంట్‌ లేని ఆ కాలంలో ఏదైనా ఒక జబ్బు రావడం అంటే మరణంతో సమానంగా ఉండిన కాలం అది కాబట్టి. ఇప్పుడు మీడియాలో దాదాపు అటువంటి pre modern thoughts ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తున్నాయి. ఒక జబ్బును గురించి తెలపడం వేరు, ఆ జబ్బును వర్ణించడం వేరు. మొదటిది సైన్స్‌. రెండవది ఆర్ట్‌. వర్ణనకి భాషా పటిమ కావాలి. విశేషణాలు (adjectives)కావాలి. అతిశయోక్తులు కావాలి. ఐతే ఈ వర్ణనలు మీడియాకే పరిమితం కాలేదు. దురదష్టవశాత్తు మెడికల్‌ టెక్ట్స్‌ బుక్స్‌లో కూడా అక్కడక్కడా ఈ విశేషణాలు కనిపించడం కద్దు. Harrison text book of internal medicine లో మలేరియా జబ్బును గురించిన అధ్యాయంలో భయంకరమైన / dangerous అనే పదం ఉంది. ఒక మెడికల్‌ text book లో ఈ పద విశేషణం అవసరం ఏంటి?. ఇప్పటికి పదిలక్షల కాపీలు అమ్ముడుపోయిన ఒక్క హారిసన్‌ టెక్స్ట్‌ బుక్‌లోనే కాదు తరచి చూస్తే మరిన్ని లీడింగ్‌ మెడికల్‌ టెక్ట్స్‌ బుక్స్‌లో ఈ విశేషణాలతో కూడిన జబ్బు వర్ణనలు దొరకవచ్చు. Severe, grave, critical, advanced, malignant, fulminant, debilitating, life – thratening, dangerous వంటి పదాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి ఇంగ్లీష్‌ భాషా విశేషణాలను మెడికల్‌ పదాలుగా మార్చవచ్చు. ఉదాహరణకు severe అనే పదానికి బదులు high risk అనే పదం వాడవచ్చు. You have ‘severe inflammation’ అనే బదులు you have ‘significant inflammation’ that requires close attention అని అనవచ్చు. రాయవచ్చు. కానీ ఇప్పటికీ ఇవే విశేషణాలతో కూడిన పదాలు వాడబడుతున్నాయి. అంతే కాకుండా చాలా జబ్బుల వర్ణనలకు war terminology ని వాడుతుంటారు మెడికల్‌ టెక్ట్స్‌ బుక్స్‌లో కూడాHeart attack, Bacterial invasion, Immune defence mechanism, resistant strains, combating drugs, eradication, battle against cancer , targetting cancer cells, colonization, cancer encroachment of adjacent tissues వంటి పదాలు పదబంధాలు విస్తతంగా వాడబడుతున్నాయి. ఇటువంటి యుద్ధ సంబంధ పదాలు మెడికల్‌ టెర్మినాలజీలో ఎందుకొచ్చాయో తెలియదు. కానీ జబ్బులు వచ్చినవారి సైకాలజీ మీద చాలా తీవ్రంగా ఈ పదాలు ప్రభావాన్ని చూపుతుంటాయి. తమ వాళ్ళు జబ్బుతో యుద్ధం చేయలేక పోయారనీ, చివరికి ఓడిపోయారనీ ఎలిజీలలో వర్ణించేవారు ఉంటారు. కొందరు డాక్టర్లు కూడా తమ పేషంట్లతో మాట్లాడేటపుడు కూడా ఇలాంటి విశేషణాలు వాడుతూ ఉంటారు. జబ్బులపై అవగాహన లేని సామాన్య ప్రజలు ఆ విశేషణాలతో కూడిన వర్ణనలు విని జడుసుకోవడం చూస్తుంటాం. కొందరు సూడో మెడికల్‌ మేధావులు జబ్బులను వాటి లక్షణాలను విపరీత విశేషణాలతో వర్ణిస్తూ ప్రజలను విపరీతంగా భయపెడుతుంటారు. జబ్బులనూ ట్రీట్మెంట్‌ లోనూ వర్ణనలతో భయపెట్టడం చాలా పెద్ద రాబడి మార్గంగా మారిన దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ”కాన్సర్‌ కంటే కాన్సర్‌ ట్రీట్మెంట్‌ భయంకరమైనది” అనే వర్ణన అలాంటిదే. ఒకసారి సరిగ్గా ఆలోచిస్తే నిజంగా కాన్సర్‌ పేషెంట్‌ పై ఇటువంటి వర్ణన ఎంత నష్టాన్ని కలగజేస్తుందో అనిపిస్తుంది.
1881 లో రాబర్ట్‌ కోచ్‌ Tubercle bacillus అనే బ్యాక్టీరియానే టీబీకి కారణం అని కనుగొనంత వరకూ స్టాండర్డ్‌ మెడికల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ ఈ జబ్బు హెరెడిటరీ అని, విషపురితమైన వాతావరణంలో వస్తుందనీ, ఇంట్లోనే కదలకుండా sedentary lifestyle ఉంటే వస్తుందనీ, గాలి వెలుతురు సరిగ్గా లేని గదుల్లో వస్తుందని, last but not least వ్యక్తి డిప్రెసివ్‌ ఎమోషన్స్‌ కలిగి ఉంటే వస్తుందని వర్ణించాయి. రాబర్ట్‌కోచ్‌ పరిశోధన ఫలితాలు మెడికల్‌ టెక్ట్స్‌ బుక్స్‌లో ఎప్పటికీ వచ్చి చేరాయో తెలియదు కానీ, ఈ విధంగా వ్యక్తి మానసిక పరిస్థితే టీబీ జబ్బుకు కారణంగా చెప్పడం తర్వాత చాలా కాలంపాటు కొనసాగింది. ఎందుకంటే మోడెర్న్‌ మెడికల్‌ నాలెడ్జ్‌ ప్రభావం కంటే ఆ కాలపు మేధావుల మీద రొమాంటిక్‌ యుగపు ధోరణుల, విలువల ప్రభావం ఎక్కువ. రొమాంటిక్‌ యుగంలో ఉన్న ఒక ప్రముఖమైన భావన ఏంటంటే- వ్యక్తి ప్రవర్తనయే జబ్బును కలిగిస్తుందని. అందుకే జబ్బు ఆ వ్యక్తి ప్రవర్తనకు బాహ్య రూపమని. ప్లేగు వ్యాధిని అప్పట్లో pestilence అనేవారు. ఆక్స్‌ఫర్డ్‌ ఇంగ్లీషు డిక్షనరీ ప్రకారం pestilence అంటే ”మతానికి ప్రమాదకరమైన” అనేది అర్థం. మత – నీతి బాహ్యమైన వ్యక్తులకు ప్లేగు వస్తుందనేది అప్పటి వారి అవగాహన.
ఐతే ఆధునిక యుగానికి కాఫ్కా తనకు 1917లో టీబి జబ్బు నిర్ధారణ జరిగాక అతడు ఏమన్నాడో చూడండి ”I donµt believe this illness to be tuberculosis but rather a sign of my general bankruptcy” అని. ముఖ్యంగా ఫ్రాయిడ్‌ వచ్చి unconscious mind ని వివరించాక, మనుషులలో unconscious mindలో దాగివున్న లేదా అణచివేయబడి ఉన్న భావోద్వేగాలే ఆ తర్వాత మానసిక జబ్బులకు దారి తీస్తాయని అతడు వివరించాక, దానిని శరీరంపైకి కూడా project చేయడం పెరిగింది. మనసులోని అంశాలు శరీరం మీద ప్రభావం కలిగిస్తాయనే స్పహ వచ్చింది. ఐతే అది అంతకుముందు నుండే పాతుకుని ఉండిన ”పాపాత్ములకే జబ్బులు వస్తాయి” అనే మత పరమైన వివరణకు ఊతమిచ్చినట్టుగా తయారైంది. అందుకే మోడెర్న్‌ రైటర్‌ ఐన కాఫ్కాలో ఆ రొమాంటిక్‌ యుగపు వాసనలు కనిపిస్తాయి. టీబి జబ్బు రావడానికి ఇదమిత్థమైన కారణం తెలిసాక, ఇదమిత్థమైన చికిత్సా విధానం వచ్చాక ఈ విధమైన మానసిక స్థితి వలననే టీబీ వస్తుందనే వర్ణన క్రమంగా తగ్గింది. కానీ అది ప్రస్తుత కాలంలో టీబీ నుండి కాన్సర్‌కి బదిలీ అయింది. ఇపుడు కాన్సర్‌ విషయంలో ఈ వర్ణనలు మళ్ళీ మొదలయ్యాయి. ఏ జబ్బుకైతే వ్యాధి కారకాలు ఎక్కువగా ఉంటాయో (multifactorial), ఇదమిత్థమైన ఏక కారణం ఇదే అని ఎస్టాబ్లిష్‌ కాలేదో, ఆ జబ్బు చుట్టూ ఊహాగానాలు ఎక్కువగా చెలరేగడమే కాకుండా అవన్నీ దాదాపుగా ”ఆ వ్యక్తి ప్రవర్తనే కారణం” అనేలాగా moral point of disease causation వైపు వెళుతూ victim blaming ని పెంచుతుంటాయి. విపరీతమైన కోరికలు కలిగి ఉండటమే జబ్బులకు కారణం అని pre modern society అవగాహన. Well balanced ప్రవర్తన ఆ సమాజపు ఐడియల్‌.
తత్వవేత్త ఇమాన్యువల్‌ కాంట్‌ అసలు ఈ విపరీతమైన కోరికలనే క్యాన్సర్‌ అన్నాడు. “Passions are cancers for pure practical reason and often incurable. The passions are unfortunate moods that are pregnant with many evils” (Kant – Anthropologic 1798)అని కోరికలను క్యాన్సర్‌తో పోల్చాడు. పైగా కోరికలు అన్ని రకాల కష్టాలను పుట్టిస్తాయని గర్భంతో లింక్‌ చేశాడు. ఇప్పటికి కూడా జబ్బులను బూచిగా భయంకరమైన విధంగా చూపడంలో TV మీడియా వాడే పదాలు, ఆ వర్ణనలప్పుడు వచ్చే background music ఇవన్నీ ఎందుకు?. జబ్బుల విషయంలో ప్రజలను భయపెట్టడంలో ఉండే శాడిస్టిక్‌ ఆనందానికి గల ముఖ్య కారణం ఏమిటి?. సర్వైకల్‌ క్యాన్సర్‌ వంటి వాటిల్లో స్త్రీల లైంగిక కోరికలకు సంబంధించిన అంశాన్ని చేర్చి క్యాన్సర్‌ రావడానికి ఆయా వ్యక్తుల ప్రవర్తననే ముఖ్య కారణం చేసేస్తున్నారు. కొందరు బాహాటంగా చెబుతున్నారు. గమనించి చూస్తే సైన్స్‌ అభివద్ధి చెందని కాలంలో ఉండిన ప్రీ మోడర్న్‌ థాట్‌ అయినా ఈనాటి మోడర్న్‌ థాట్‌ అయినా క్యాన్సర్‌ కారణాలను కనుగొంటూ చివరికి victim blaming దగ్గరికి వచ్చేస్తున్నాయనేది నిర్వివాదాంశం. ఈ ధోరణి మారకపోతే మనం ఆబ్జెక్టివ్‌గా సైంటిఫిక్‌గా ఏమాత్రం అభివద్ధి చెందనట్టుగా రూఢ చేసుకోవాలి. సామాజిక ఆలోచనలో తప్పక మార్పు రావాలి. జబ్బులను జబ్బులుగా వివరించాలి. వర్ణనలు ఆపాలి. ఇప్పుడున్న మెడికల్‌ విద్యార్థులకు సైన్స్‌ జ్ఞానం అందుతున్న ధోరణిలోనే, అంటే సైంటిఫిక్‌ జ్ఞాన సిద్ధాంతంలోనే కొంత అవకతవకలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ Epistemological issues.
ముఖ్యంగా ఈ ధోరణి 1990ర నుండి మొదలైంది. 1960, 70 లలో ఒక క్యాన్సర్‌ జబ్బు రావడానికి geographical & environmental factors కారణమై ఉంటాయని ఆ రంగాల్లో పరిశోధనలు జరిగేవి. వివిధ రకాలైన carcinogens ఏ విధంగా మానవునికి హానికారకాలో ఎలాంటి ఇండిస్టియల్‌ వాతావరణం ఎలాంటి క్యాన్సర్‌ని కలగజేస్తుందో పరిశోధనలు జరిగేవి. కానీ 90s లో గ్లోబలైజేషన్‌ లిబరలైజేషన్‌ జరిగాక ఈ పరిశోధనల రూపం మారిపోయింది. కొత్తగా వచ్చిన టెక్నాలజీ, మాలిక్యులార్‌ బయాలజీ వైపు పరిశోధనలు జరిగేలా చేసింది. పరిశోధనల్లో టెక్నాలజీ ప్రముఖ పాత్ర వహించింది. చాలా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో నడిచే ఖరీదైన మెషీన్లు రావడం, తద్వారా ఖరీదైన పరిశోధనలు విపరీతంగా జరగడం మొదలైంది. ఈ రెండు దశాబ్దాలలో మెడికల్‌ /సైంటిఫిక్‌ జర్నల్స్‌ లో మాలిక్యులార్‌ బయాలజీ & జెనెటిక్స్‌ మీద వచ్చిన పరిశోధనల పబ్లికేషన్స్‌ 500 శాతం పెరిగాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒకరకంగా జీవితమే మాలిక్యులరైజేషన్‌ చేయబడింది. ఈ పరిశోధనలు కణంలో, కణ కేంద్రకంలో DNA, RNA లలో జీన్స్‌లో వచ్చే మార్పులను పసిగట్టే పనిలో పడ్డాయి. దానితో తక్కువ మోతాదు టెక్నాలజీ అవసరమయ్యే పరిశోధనలు మూలన పడ్డాయి ఈ మాలిక్యులార్‌ లెవెల్‌ కారకాలకే పట్టంకట్టి క్యాన్సర్‌ కి అవే కారణాలుగా చెప్పడం మొదలైంది. 2013 లో ప్రముఖ హాలీవుడ్‌ హీరోయిన్‌ ఆంజెలీనా జోలీ జెనెటిక్‌ టెస్టింగ్‌ చేయించుకుని, తన కణాల్లో BRCA1 జీన్‌ మ్యుటేషన్‌ జరిగిందని తనకు రాబోయే భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు breast cancer వచ్చేస్తుందనీ భావించి ముందుగానే preventive గా ఆపరేషన్‌ ద్వారా తన రొమ్ములు తొలగించుకుంది (preventive double mastectomy) అంటే జీవితం ఎంతగా molecularization జరిగిందో ఆలోచించకతప్పదు. BRCA1 gene mutation ఉన్నంత మాత్రాన తప్పని సరిగా క్యాన్సర్‌ వచ్చేస్తుంది అని కాదు. జaఅషవతీ Cancer susceptibility పెరుగుతుంది. అంటే వచ్చే ఛాన్స్‌ మామూలుగా కంటే కొంత పెరుగుతుంది. ఐతే అలా ఉన్నప్పుడు mammogram వంటి టెస్ట్‌లను రెగ్యులర్‌గా చేసుకోండి అని మాత్రమే సైన్స్‌ చెబుతుంది తప్ప ఈ జీన్‌ మ్యుటేషన్‌ ఉంటే రొమ్ములు తొలగించుకోవాలని చెప్పదు. అందుకు ఆధారాలు లేవు. ఐతే ఆంజలీనా జోలీ తన పర్సనల్‌ ఛాయిస్‌గా రొమ్ములను తొలగించుకోవడాన్ని మాత్రం మన సమాజం క్యాన్సర్‌పై కలిగించిన విపరీత విశేషాలతో కూడిన భయాలే కారణం. ఆధునిక మాలిక్యులార్‌ బయాలజీ పరిశోధనలు తప్పని కాదు కానీ అవి అసలు కారకాలైన social determinants of cancer ని పూర్తిగా మరుగున పడవేశాయి. ఈ social determinants of cancer పై పరిశోధనలు దాదాపు సున్నాకు చేరుకున్నాయి. మూగబోయాయి. తమ వాయిస్‌ని వినిపించడం ఆపేశాయి. ఇపుడు ఏ హెల్త్‌ కేర్‌ ప్రొఫెషనల్‌ని అడిగినా కాన్సర్‌ కారణాలు ఏవి అంటే మనిషి ప్రవర్తనకు అతడి జీవిత విధానానికి సంబంధించిన సమాధానాలు చెబుతారు. ఒబెసిటీ కారణమని, అతిగా పలానా ఆహారం తినడంవలననే అనీ, ప్రతిరోజూ ఎక్సర్సైజు చేయక పోవడమేననీ, మల్టిపుల్‌ సెక్స్‌ పార్టనర్ల ఉండటం వలననే అనీ etc. గమనించి చూస్తే ఈ etiology మొత్తం పేషెంట్‌ బంధువులు చేస్తున్నట్టే పేషెంట్‌ వైపే తమ వేళ్ళని చూపిస్తాయి. ఒకవ్యక్తికి కాన్సర్‌ రావడానికి అతడి ప్రవర్తన, అతడి తిండి, అతడి జీవిత విధానమే కారణమనేంతగా రిడక్షన్‌ చేయబడుతుంది. ఈ కారణాల వలనే అతడి జన్యువులలో మార్పు వచ్చిందనో మ్యుటేషన్‌ జరిగిందనో వైరస్‌ లోడ్‌ పెరిగిందనో చెప్పడం మొదలైంది. ఈ మధ్య పెరుగుతున్న కాన్సర్‌ జబ్బులు విషయంలోకి ఇటువంటి మోరల్‌, victim blaming అంశాలు విపరీతంగా వచ్చి చేరాయి. క్యాన్సర్లు పెరగడానికి ప్లాస్టిక్‌ బ్యాగ్‌ లలో ఆహారం తినడమే కారణమని ఒకాయన చెబుతాడు. కానీ ఆ ప్లాస్టిక్‌ బ్యాగ్స్‌ కల్చర్‌ ఎలా వచ్చింది. ఎవరు తెచ్చారు అనేది ఎవరూ చెప్పరు. పెస్టిసైడ్స్‌ ఉన్న ఆహారం తిని కాన్సర్‌ తెచ్చుకుంటున్నారు అని మరో పెద్దమనిషి చెబుతాడు. కానీ ఏ వాణిజ్య పంటల వ్యవసాయ పద్ధతులకోసం ఎక్కువ ఎరువులు వాడాల్సి రావడం జరిగిందో, ఈ వాణిజ్య పంటల చుట్టూనే దేశ రాజకీయాలు అల్లుకుని సాగుతున్నాయో ఎవరూ చెప్పరు. హైదరాబాద్‌లో రోజురోజుకూ క్యాన్సర్లు పెరుగుతున్నాయని ఒకాయన వాపోతాడు. కానీ హైదరాబాద్‌లో industrial development జరిగిన పద్ధతి, industrial wastes ని డిస్కార్డ్‌ చేసే పద్ధతులు ఎలా ఉన్నాయో ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో ఎవరికీ పట్టట్లేదు. అభివద్ధికి పర్యాయపదంగా వేల కోట్ల పెట్టుబడులు పెట్టబడుతున్న చోట, క్యాన్సర్‌ కారణాలు ఇవే అని చెప్పాల్సిన చోట గంభీరమైన మౌనం అలముకొని ఉంది. మానవాభివద్ధి అనే పదం విపరీతంగా exploitation కి గురైంది. అసలు వీటిపై సామాజిక పరిశోధనలు కూడా మనదేశంలో దాదాపు శూన్యం. ఈ కాలం అమ్మాయిలు ఎక్కువ మందితో శారీరక సంబంధాలు పెట్టుకోవడం వలననే క్యాన్సర్‌ బారిన పడుతున్నారని ఒకావిడ ఇంటర్వూ ఇస్తుంది. కానీ డబ్బు చుట్టూ పరిగిత్తే వేగవంతమైన జీవితాల్లో pulverize అవుతున్న కుటుంబాలు, విపరీతమైన ఫ్రిక్షన్‌కి గురౌతున్న మానవ సంబంధాలు అసలు కారణమని ఎవరూ చెప్పడంలేదు. క్యాన్సర్‌ కారకాలుగా మనిషి కణంలో జరిగే సూక్ష్మ ప్రక్రియలలో లోటుపాట్లు అని గుర్తించడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. సందేహమూ లేదు. కానీ ఈ లోటుపాట్లు సమాజంలోకి ఏ కారణం చేత వచ్చాయో ఎవరు వివరిస్తున్నారు. క్యాన్సర్‌ వచ్చిన వ్యక్తిని ఎన్ని రకాలుగా అనుమానపు దక్కులతో ఈ సమాజం చూస్తుంటుందో వారిని ఎంతలా స్వీయ వ్యతిరేకతకు లోనుచేసి మానసికంగా కంగదీస్తుందో ఎవరూ మాట్లాడరు. ఎందుకని?. నెపాన్ని చివరకు పేషెంట్‌ మీదనే పెట్టడం వలన అది పేషెంట్‌ మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా అతడిని క్యాన్సర్‌ ట్రీట్మెంట్‌ అంటేనే భయపడి దూరం జరిగే పరిస్థితిని తీసుకువస్తుంది. Cancer causing personality అనే దానిని ఒకటి తయారు చేసి, ఎవరికి క్యాన్సర్‌ వచ్చినా పేషెంట్‌కి ఉన్న ఈ పర్సనాలిటీనే కారణం అనే దశకు చేరుకున్నాం. ఈ ప్రాసెస్‌లో భాగంగా ట్రీట్మెంట్‌ పై నమ్మకం ఉంటే కాన్సర్‌ తగ్గుతుందని చెప్పేవారూ మొదలయ్యారు. నమ్మకం ఉంటే, పాజిటివ్‌ దక్పథం ఉంటే, పాజిటివ్‌ వైబ్రేషన్‌ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుందనీ క్యాన్సర్‌ని జయించే (మళ్ళీ యుద్ధానికి చెందిన పదం) శక్తి వస్తుందని చెబుతున్నారు. ఇవన్నీ మళ్ళీ emotions are the reason for disease ని తెలివిగా డైవర్ట్‌ చేసి emotions are the reason for successful treatment అనే భావనను తెచ్చేవే. ఇది కూడా మనలో పెరిగిపోయిన, పాతుకుపోయిన pre modern thought గా అర్థం చేసుకోవాలి. జబ్బులు రావడానికి భావోద్వేగాలే కారణం అన్న ప్రి సైన్స్‌ యుగం నుండి సైంటిఫిక్‌ యుగంలోకి వచ్చిన మనం ఈ రోజు జబ్బు తగ్గడానికి వ్యక్తి will power కారణం అంటున్నామంటే మనం మానవ శారీరక ధర్మ శాస్త్రాన్ని ఏమాత్రం సైంటిఫిక్‌గా అర్థం చేసుకోలేదని అర్థం. ఈ ధోరణులు డాక్టర్లలో కూడా కాన్సర్‌ ట్రీట్మెంట్‌ల పట్ల pessimism ని పెంచేలా చేస్తాయి. కాన్సర్‌ వచ్చేసరికి ఆ పేషెంట్లు అప్పటికే కాన్సర్‌ గురించిన సకల భయంకరమైన వర్ణనలూ వినేసి ఉంటారు. అది మరణానికి దారి తీస్తుందని కుంగిపోతుంటారు. అందుకే క్యాన్సర్‌కి సంబంధించిన, ఒక రకంగా జబ్బులకు సంబంధించిన పదాలు మంచి వైపు పరిణామం చెందాలి. వర్ణనలు ఆగాలి. పాత వర్ణనలను తుడిచి పెట్టాలి. ఇది ఒక సమాజంగా కలిసి కూడబలుక్కుని చేస్తే గానీ సాధ్యంకాదు. Informed decision making వ్యక్తులను ఎంపవర్‌ చేస్తుంది. కానీ జబ్బుల కవితాత్మక రొమాంటిక్‌ వర్ణనలు, రచయితల అతిశయోక్తి అత్యుత్సాహాలు, మీడియా సెన్సేషనలిజాలు ప్రజలను తప్పు దారి పట్టిస్తాయి. కాబట్టి క్యాన్సర్‌ పై యుద్ధాలను ఆపి అటువంటి పదాలను వాడటం ఆపి ఈ అతిశయోక్తి అలంకారపు వర్ణనలపై మూకుమ్మడిగా దాడి చేయాలి. వాటిని మన మెదడు డిక్షనరీలో సంపూర్ణంగా విలుప్తం చేయాలి.

]]>