Cover Story Archives - https://navatelangana.com/category/cover-story/ Sat, 04 May 2024 17:16:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Cover Story Archives - https://navatelangana.com/category/cover-story/ 32 32 తల్లుల మానసిక అనారోగ్యం గుర్తించబడని విషాదం … https://navatelangana.com/maternal-mental-illness-is-an-underdiagnosed-tragedy/ Sat, 04 May 2024 17:16:34 +0000 https://navatelangana.com/?p=283587 తల్లుల మానసిక అనారోగ్యం గుర్తించబడని విషాదం ...ప్రతి ఐదుగురు స్త్రీలలో ఒకరు గర్భం సమయంలోగాని, ప్రసవం, ప్రసవానంతరం మొదటి రోజుల్లోగాని మానసిక రుగ్మతలకు లోనవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 10 శాతం మంది గర్భిణులు, 13 శాతంమంది బాలింతలు మానసిక అనారోగ్యాలతో, ముఖ్యంగా కుంగుబాటు లేక డిప్రెషన్‌తో సతమత మవుతున్నట్లుగా అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. దిగువ, మధ్యస్ధ ఆదాయ దేశాలలో ఈ శాతం ఇంకా ఎక్కువ. 15.6 శాతం మంది గర్భిణులు, 19.8 శాతం మంది బాలింతలు ఈ అనారోగ్యాల బారిన పడుతున్నారని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ అనారోగ్యాలు ఇంత విస్తృతంగా ఉన్నప్పటికి వాటిని తగినంతగా గుర్తించకపోవడం, అవసరమైన స్ధాయిలో చికిత్స అందకపోవడం విచారకరం. మే 1 నుండి 7వ తేదీ వరకు తల్లుల మానసిక ఆరోగ్య అవగాహన దినోత్సవ వారంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వ్యాసం…

విశ్వ వ్యాధుల భారం అధ్యయనం ప్రకారం మానసిక వ్యాధుల కారణంగా తల్లులు తమ 15 ఏండ్ల విలువైన, ఉత్పత్తిదాయకమైన జీవితాన్ని కోల్పోతున్నారు. ఈ కారణంగా జరిగే ఆర్ధిక నష్టం కూడా తక్కువేమీ కాదు. 2019లో ఈ నష్టం 1.3 ట్రిలియన్ల అమెరికా డాలర్లుగా అంచనా వెయ్యబడింది. ఇది 2030కి 3 ట్రిలియన్లు అవుతుందని అంచనా వేయబడుతోంది.
తల్లి మానసిక ఆరోగ్యం అంటే?
గర్భం, ప్రసవం, ప్రసవం తర్వాత ఏడాది వరకు తల్లి ఉద్వేగ, మానసిక, సాంఘిక స్వస్ధతను తల్లి మానసిక ఆరోగ్యంగా పరిగణింపబడుతుంది. మాతృత్వం సిద్ధించే క్రమంలో తల్లి పొందే అనేక అనుభవాలు, అనుభూతులు, ఎదుర్కొనే వివిధ సవాళ్ళు ఈ పరిధిలోకి వస్తాయి. సంతోషం, సంతృప్తి, ఉత్సాహం మాత్రమేకాక రాగల ఒత్తిడి, ఆందోళన, మానసిక అవాంతరాలు కూడా ఇందులో చేరతాయి. మానసిక అనారోగ్యాల ప్రభావం వారి భావోద్వేగ స్వస్ధత పైనేకాక, వారి రోజువారీ కార్యకలాపాల నిర్వహణపై, తన బిడ్డతో సరైన బంధాన్ని పెంపొందించుకోవడం, బిడ్డ సంరక్షణ, పెరుగుదలపై కూడా పడుతుంది.
గర్భం భావోద్వేగాల రంగుల రాట్నం
ఒక కొత్త జీవిని ఈ ప్రపంచంలోకి తీసుకు వచ్చే క్రమంలో స్త్రీలలో, ముఖ్యంగా మొదటిసారి గర్భందాల్చిన గర్భిణులలో ఎంతో తీవ్రమైన ఆందోళన, అనిశ్చితి, భయం ఉంటాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులు, శారీరక అసౌకర్యం భావోద్వేగ పరిస్ధితిపై మరింత ప్రభావాన్ని చూపుతాయి. తల్లి అవుతున్న క్రమంలో స్వీయ గుర్తింపు, సొంత ఆలోచన, ఆత్మగౌరవం, శరీర ఆకృతిలో మార్పు, తను నిర్వహించవలసిన పాత్రలలో మార్పు ఆమెను అలజడికి గురిచేస్తాయి. ప్రసవం ఎలా అవుతుందో అనే ఆందోళన, ప్రసవ నొప్పుల గురించి భయం, ప్రసవం సమయంలో తనకూ, తన బిడ్డకు ఏ ప్రమాదాలు ముంచుకు వస్తాయోననే భయం గర్భిణిని నలిబిలి చేస్తాయి.
ప్రసవం తర్వాత బిడ్డను సవ్యంగా సంరక్షించుకోలేనేమోననే భయం, బిడ్డసంరక్షణలో కలిగే శారీరక శ్రమ, నిద్రలేమి ఆమె మానసిక స్ధితిని కుదిపేస్తాయి. మానసిక కల్లోలం, కన్నీళ్లు కార్చడం, తల్లిగా తన బాధ్యతల్ని నిర్వర్తించలేనని నిస్పృహ చెందడం (బేబీ బ్లూస్‌) ఉంటాయి.
తల్లి మానసిక ఆరోగ్య లోపాలు
గర్భిణులకు, బాలింతలలో సాధారణంగా కనిపించే డిప్రెషన్‌, ఆందోళనతో పాటు తీవ్రమైన సమస్య ప్రసవానంతర సైకోసిస్‌. ఇలాంటి మానసిక అనారోగ్యాలు వారి రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంటాయి. అంతేకాక వారి జీవన నాణ్యతను కూడా దెబ్బ తీస్తాయి.
పెరినేటల్‌ డిప్రెషన్‌
లక్షణాలు: గర్భం సమయంలో, ప్రసవం తర్వాత ఏడాది వరకు ఉండే కుంగుబాటు లేక డిప్రెషన్‌ని పెరినేటల్‌ డిప్రెషన్‌ అనొచ్చు. నిరంతర విచారం, ఏం చేయాలన్నా ఆసక్తి లోపించడం, దేనిలోనూ ఆనందం లేకపోవడం, నిద్రా భంగం, ఆకలి సక్రమంగా లేకపోవడం, తనని తాను దేనికీ పనికి రాననుకోవడం లేక అపరాధ భావన, తన బిడ్డతో బంధాన్ని ఏర్పరచుకోవడం కష్టమవడం మొదలైనవి ఉంటాయి.
సంకేతాలు: సాంఘిక కార్యక్రమాలకు దూరమవడం, తరచుగా ఏడవడం, ఏకాగ్రతను కోల్పోవడం, విపరీతమైన చిరాకు, బిడ్డతో ఒంటరిగా ఉండడానికి భయం, బిడ్డను సాకడంపై ఆసక్తి లేకపోవడం.
పోస్ట్‌పార్టమ్‌ ఏంగ్జయిటీ డిజార్డర్స్‌
జనరలైజ్డ్‌ ఏంగ్జయిటీ డిజార్డర్‌ (జి.ఎ.డి), పేనిక్‌ ఏంగ్జయిటీ డిజార్డర్‌, అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఒ.సి.డి) పోస్ట్‌పార్టమ్‌ ఏంగ్జయిటీ డిజార్డర్స్‌లో భాగం.
లక్షణాలు: అంతులేని విచారం, బిడ్డ ఆరోగ్యం గురించి, భద్రత గురించి అహేతుక భయాలు, దూసుకు వచ్చే అసంగత ఆలోచనలు, చిరాకు, అస్ధిమితం, నిద్రపట్టడం కష్టమవడం, గుండెదడ, మైకం రావడం, ఊపిరి అందకపోవడం, చెమటలు పట్టడం మొదలైన ఆందోళన తాలూకు భౌతిక లక్షణాలు ఈ మానసిక రుగ్మతలో ఉంటాయి. ఇవి తల్లిగా చెయ్యాల్సిన బిడ్డ సంరక్షణ, ఇతర బాధ్యతల్ని నెరవేర్చడానికి ఆటంకం కలిగిస్తాయి. ఇలాంటి ఒత్తిడి, ప్రతికూలత, భావోద్వేగ సవాళ్ళను తట్టుకోగల మానసిక దృఢత్వాన్ని, శక్తిని పెంపొందించుకోవడం సాధారణ విషయం కాదు. ధ్యానం, దీర్ఘంగా శ్వాసతీసుకోవడం, శారీరక శ్రమ, సాంఘిక సపోర్టును కోరడం, ఆరోగ్య సంరక్షకులను సంప్రదిస్తూ ఉండడం వీటిని తట్టుకోవడానికి తోడ్పడతాయి.
సంకేతాలు: పదే పదే బిడ్డ ఎలా ఉందో చూడడం, ఇంట్లోనుండి బయటికి వెళ్ళకుండా వుండడం, పానిక్‌ ఎటాక్స్‌, కండరాలు బిగిసిపోవడం లేక జీర్ణవ్యవస్ధ సమస్యలు.
పోస్ట్‌పార్టమ్‌ అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌
లక్షణాలు: బిడ్డ భద్రత, శ్రేయస్సు గురించి హృదయాన్ని కకావికలు చేసే ఆలోచనలు, బిడ్డకు హాని సంబంధిత మనోదృశ్యాలు, పదే పదే చేసిన పనినే చెయ్యడం, ఉదా: చేతుల్ని అదే పనిగా కడుక్కోవడం, తీవ్రమైన ఆందోళన.
సంకేతాలు: రోజువారీ కార్యక్రమాల నిర్వహణకు భంగం కలిగేలాగా పదే పదే ఒకే పనిని చెయ్యడం, తనను ముంచెత్తుతున్న ఆలోచనల గురించి తీవ్రమైన కలవరం, నియంత్రణ లేని భావోద్వేగాలు.
పోస్ట్‌ ట్రమాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌
లక్షణాలు: గతంలో జరిగిపోయిన ఘటనలు, అనుభవాలు పదే పదే గుర్తుకు రావడం, బాధాకరమైన ప్రసవ అనుభవం పీడకలలు, మితిమీరిన అప్రమత్తత, భావోద్వేగ జడత్వం.
సంకేతాలు: వైద్యానికి సంబంధించిన స్ధలాలకు దూరంగా ఉండడం, ప్రసవం గురించి చర్చలను నివారించడం, దిగ్భ్రాంతి చెందడం, నిద్రించడం కష్టమవడం, మానసిక కల్లోలాలు.
పెరినాటల్‌ బైపోలార్‌ డిజార్డర్‌:
లక్షణాలు: ఉన్మాదం కొంతసేపు, ఆవెంటనే డిప్రెషన్‌, అలా ఒకదాని వెంట మరొకటి ఉండడం, నిద్ర అవసరం తగ్గడం, ఆలోచనలు దూసుకు రావడం, ఆకస్మిక ప్రతిస్పందన, చిరాకు.
సంకేతాలు: తీవ్రమైన మనో సంచలనాలు, నిర్లక్ష్య ప్రవర్తన, ఇంట్లోను, పని చేసే ప్రదేశంలోనూ సవ్యంగా వ్యవహరించకపోవడం, సైకోసిస్‌ (తీవ్రంగా ఉన్నప్పుడు భ్రాంతులు, భ్రమలు)
పోస్ట్‌పార్టమ్‌ సైకోసిస్‌
లక్షణాలు: భ్రాంతులు, భ్రమలు, తీవ్ర ఆందోళన, గందరగోళం, మతిస్ధిమితం లేకపోవడం, వేగంగా మూడ్‌ మార్పులు, తనకు లేక తన బిడ్డకు హానిని కలిగించే, అత్మహత్య, లేక హత్యను ప్రేరేపించే ఆలోచనలు.
సంకేతాలు: వింత ప్రవర్తన, అస్పష్టత, నిద్రకు తీవ్ర ఆటంకాలు, అర్ధం లేకుండా మాట్లాడడం లేక ఆలోచించడం.
పైలక్షణాలు ఏవైనా కొన్ని ఉన్నంత మాత్రాన మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్టు భావించకూడదు. కానీ అవి దీర్ఘకాలంగా ఉన్నా, వాటి వలన ఆ స్త్రీ దైనందిన కార్యకలాపాల నిర్వహణకు ఆటంకం కలిగిస్తున్నా, అవి ఆమెను బాధిస్తున్నా వెంటనే మానసిక చికిత్సలో అనుభవం ఉన్న వైద్యునికి చూపించి తగిన చికిత్స చేయించాలి. సకాలంలో వైద్యం చేయంచుకోవడం వల్ల త్వరగా కోలుకుని తల్లీ, బిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
తల్లి మీద, బిడ్డ మీద తల్లి మానసిక ఆరోగ్యం ప్రభావం:
భావోద్వేగపరమైనవి: తల్లి మానసిక ఆరోగ్యం సజావుగా లేకపోతే ఆమెకు తీవ్రమైన విచారం, ఆందోళన, నిరాశ కలుగుతాయి. తీవ్రమైన అలసట, తలనొప్పి, జీర్ణ సమస్యలు మొదలైన శారీరక ఇబ్బందులు కలుగుతాయి. ఆత్మ గౌరవం, స్వీయ విలువ లోపించి తనను, తన బిడ్డను సంరక్షించుకునే సామర్ధ్యం దెబ్బతింటుంది. చిరాకు, నిర్లిప్తత కారణంగా ఆమెకు బిడ్డతో సరైన బంధం పెంపొందదు. తల్లి మానసిక ఆరోగ్యం ఆమె పనితీరు పై కూడా ప్రభావం చూపుతుంది. తల్లీబిడ్డల మధ్య ఉండే బంధాన్ని, అనుబంధాన్ని ప్రభావితం చేస్తాయి. ఇంట్లోనూ, పని చేసే చోట తను రోజువారీ చేసే పనుల్ని, నిర్వహించే బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించలేదు. ఈ ప్రభావం భర్త, కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఉండే బంధాన్ని బలహీనపరుస్తుంది.
ఉదాహరణకు తల్లి డిప్రెషన్‌ లేక ఆందోళనకు గురైనప్పుడు తన బిడ్డ అవసరాలకు సున్నితంగా ప్రతిస్పందించలేదు.
మానసిక అనారోగ్యాలు ఉన్న తల్లికి పుట్టిన బిడ్డల ప్రవర్తన, భావోద్వేగం, ఎదుగుదల పరంగా సమస్యల్ని ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
దీర్ఘకాలిక ప్రభావాలు: తల్లి మానసిక అనారోగ్యాలు బిడ్డల భావోద్వేగస్ధితి, బుద్ధి వికాసం పై ప్రభావం చూపుతాయి. తమకు సంరక్షణ చేసేవారితో జరిపే సంభాషణల ద్వారా బిడ్డలు సాంఘిక నైపుణ్యాలను పెంపొందించుకుంటారు. తల్లి మానసిక అనారోగ్యం ఈసంభాషణ తీరును ప్రభావితం చేస్తుంది. ఇది వారి అభివృద్ధిని, బంధాలనేర్పరచుకునే సామర్ధ్యాన్ని బలహీనపరుస్తుంది.
ఆరోగ్యసేవల వినియోగం: మానసిక అనారోగ్యాల వల్ల చికిత్స కోసం హాస్పటల్‌కి వెళ్ళవలసిన అవసరం పెరుగుతుంది. హాస్పటల్లో అత్యవసర వార్డులో చేరి చికిత్స చేయించుకోవల్సి వస్తుంది. ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత అవసరమైన వైద్య సేవల్ని పొందడంపై కూడా తల్లి మానసిక రుగ్మతల ప్రభావం పడుతుంది
మొత్తం జీవిత నాణ్యత: తల్లి మానసిక రుగ్మతలు ఆమె మొత్తం జీవిత నాణ్యతపై, కుటుంబ జీవిత నాణ్యతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది నిరంతర ఒత్తిడికి, జీవితానందాన్ని కోల్పోవడానికి, ఇక బతుకు భరించలేనిదిగా మారడానికి దారితీస్తుంది.
తల్లి మానసిక రుగ్మతలు- బిడ్డ అభివృద్ధి, అనుబంధంపై ప్రభావం
తల్లి మానసిక ఆరోగ్యం సవ్యంగా లేకపోతే ఆమె తన ఉద్వేగాల్ని నియంత్రించుకోలేదు, బిడ్డ ఉద్వేగ సూచనలకు సున్నితంగా ప్రతిస్పందించ లేదు. బిడ్డ ఉద్వేగనియంత్రణ నైపుణ్యాల్ని నేర్చుకోవడానికి తల్లి తగిన ప్రతిస్పందనతో సంరక్షించడం చాలా ముఖ్యం. బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి భద్రతనిచ్చే అనుబంధం చాలా ముఖ్యం. తల్లి మానసిక ఆరోగ్యం సురక్షితమైన అనుబంధాల్ని పెంపొందించుకోవడానికి దోహదం చేస్తుంది. డిప్రెషన్‌, ఆందోళన ఉన్న తల్లులు తమ బిడ్డలు సురక్షిత అనుబంధాన్ని స్ధిరంగా పెంపొందించుకోవడానికి తోడ్పడలేరు. బిడ్డ, తల్లితో గాఢమైన అనుబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి అవసరమైన తల్లీబిడ్డల ఊసుల కలబోతలు తల్లి మానసిక ఆరోగ్యం బావున్నప్పుడే సాధ్యమవుతుంది. బిడ్డల తొలి వయసులో నేర్చుకునే సామర్ధ్యాన్ని, మెదడు అభివృద్ధి చెందడాన్ని పెంపొందించే కార్యక్రమాలలో మానసిక అనారోగ్యాలు ఉన్న తల్లులు లీనమవడం కష్టమవుతుంది. తల్లీబిడ్డలమధ్య జరిగే ముచ్చటైన సంభాషణ బిడ్డ భాష అభివృద్ధి అవడానికి కీలకం. ఆ పిల్లలు దీనికి కూడా దూరమవుతారు. మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయించుకోని తల్లుల బిడ్డలకు ఎదుగుదలలోపాలు, ప్రవర్తన సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
బిడ్డ భావోద్వేగ, సాంఘిక, మేధోపరమైన అభివృద్ధిని కుంటుపరుస్తాయి.
తల్లి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే అంశాలు:
బ గర్భం సమయంలో వచ్చిన డయాబెటిస్‌, ప్రీఎక్లాంప్సియా, నెలలు నిండకమునుపు ప్రసవం
బ భర్త, కుటుంబ సభ్యులు, స్నేహితుల సపోర్ట్‌ లేకపోవడం
బ ఆర్ధికపరమైన ఒత్తిడులు
బ భర్తతో సంఘర్షణలు, గృహహింస
బ కోరుకోకుండా వచ్చిన గర్భం
బ గర్భస్రావం, బిడ్డ ప్రసవ సమయంలో చనిపోవడం, కష్టపు కాన్పు మొదలైనవి.
రక్షణనిచ్చే అంశాలు:
బ భర్త, కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆరోగ్య కార్యకర్తల బలమైన సపోర్ట్‌
బ గర్భం సమయంలో నాణ్యమైన సంరక్షణ లభించడం
బ ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించడం
బ భర్తతో సానుకూల అనుబంధం
బ సమర్ధవంతంగా ఒత్తిడిని తట్టుకునే నైపుణ్యాలను పెంపొందించుకోవడం
బ అర్ధిక సుస్ధిరత
బ విద్య, ఉద్యోగ, వృత్తిపరమైన సాధికారత
బ సంస్కృతీపరమైన, సాంఘిక అంశాలు
బ తల్లి మానసిక అనారోగ్యాల్ని సత్వరం గుర్తించి చికిత్స చెయ్యడం
బ తల్లి మానసిక ఆరోగ్యంపై సానుకూల, ప్రతికూల అంశాలను గర్తించి సానుకూల అంశాలను పటిష్టం చేసి ప్రతికూల అంశాలను తగ్గించడం ద్వారా తల్లి మానసిక ఆరోగ్యాన్ని కాపాడవచ్చు.
తల్లి మానసిక అనారోగ్యాలు-చికిత్స
తల్లికి వచ్చే మానసిక అనారోగ్యాలను తగ్గించడానికి వివిధ చికిత్సలతో పాటు కొన్ని చర్యలు చాలా కీలకమైన పాత్ర వహిస్తాయి. ఇవి తల్లికి ఉండే బాధల్ని నయం చెయ్యడం, తట్టుకునే నైపుణ్యాలను, మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయి.
కాగ్నిటివ్‌ బిహేవిరియల్‌ థిరపి (సి.బి.టి)
ఈ చికిత్స లక్ష్యం ప్రతికూల ఆలోచనల్ని, ప్రవర్తనల్ని మార్చడం. ఈపద్ధతి డిప్రెషన్‌, ఆందోళన, ఇతర మానసిక అనారోగ్యాల్ని నయం చేస్తుంది. అహేతుక ఆలోచనల్ని పక్కకు తోసి అనారోగ్యాన్ని తట్టుకోవడానికి ఈ చికిత్స పని చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆలోచనల్ని పెంపొందించుకోవడానికి, ఒత్తిడులను సక్రమంగా నివారించడానికి ఈ చికిత్స తోడ్పడుతుంది.
ఇంటర్‌ పర్సనల్‌ థిరపీ: వ్యక్తుల మధ్య సమస్యల్ని మనసు విప్పి మాట్లాడుకుని, అనుబంధాలను నెలకొల్పుకునే, నిలుపుకునే నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ చికిత్స తోడ్పడుతుంది. మనుషుల మధ్య ఉన్న సమస్యాత్మక సంబంధాలను పరిష్కరించుకోవడానికి, సానుకూల అనుబంధాలను నెలకొల్పుకోవడానికి ఈ చికిత్స ఉపయోగపడుతుంది.
మైండ్‌ఫుల్‌నెస్‌ ఆధారిత చికిత్సలు: మైండ్‌ఫుల్‌నెస్‌ ఆధారిత ఒత్తిడిని తగ్గించుకునే సద్ధతులు, మైండ్‌ఫుల్‌నెస్‌ ఆధారిత కాగటివ్‌ థిరపీ, మైండ్‌ఫుల్‌నెస్‌ ఆధారిత ధ్యానం, అవగాహన పద్ధతులు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ క్షణంలో జీవించడం, ఆలోచనల్ని, ఉద్వేగాల్ని యధాతధంగా స్వీకరించడం గర్భిణులను, బాలింతలను మానసికంగా దృఢపరుస్తాయి.
కౌన్సిలింగ్‌: సపోర్ట్‌నిచ్చే కౌన్సిలింగ్‌ మానసిక అనారోగ్యాలకు గురైన స్త్రీలకు తమ భావాల్ని, కలతల్ని, అనుభవాల్ని నిర్భయంగా వ్యక్తపరచడానికి వీలు కల్పిస్తుంది. కౌన్సిలింగ్‌ ఉద్వేగాల్ని నియంత్రించుకోవడానికి, ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడానికి ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను అన్వేషించడానికి వీలు కల్పిస్తుంది.
సైకోడైనమిక్‌ థిరపీ: ఈచికిత్స అపస్మారక ప్రక్రియలను, ప్రస్తుత ఆలోచనలను, ప్రవర్తనలను పాత అనుభవాలు ప్రభావితం చేస్తున్నాయా అనేది అన్వేషిస్తుంది. ఇది బాగా గాఢమైన విచారానికి లోనైన, మానసిక గాయాలు మానని స్త్రీలకు ఉపయోగపడుతుంది. అంతర్‌దృష్టిని, స్వీయ అవగాహనను, భావోద్వేగ గాయాల్ని నయం చేసుకోవడాన్ని ఈ చికిత్స ప్రోత్సహిస్తుంది.
మందులతో చికిత్స: బాగా తీవ్రమైన డిప్రెషన్‌, ఆందోళన ఉన్నప్పుడు మందులు పనిచేస్తాయి. గర్భిణులు, బాలింతలు తమ వైద్యులను సంప్రదించి, మందుల వలన కలగబోవు లాభనష్టాల్ని బేరీజు వేసుకుని వాడాలి. మందులతో సాటు సైకోథిరపీతో సమగ్ర చికిత్సనందించడం అవసరం.
పెరినేటల్‌ సపోర్ట్‌ గ్రూపులు: తోటివారి మద్దతును పొందడానికి, తమ అనుభవాలను వెల్లడించి ఆమోదాన్ని పొందడానికి ఈ పెరినేటల్‌ గ్రూపులు అవకాశాల్ని కలిగిస్తాయి. ఈ గ్రూపులు ఒంటరి భావాన్ని తగ్గిస్తాయి, మానసిక ఆరోగ్య సవాళ్ళను తేలికపరుస్తాయి.
ఫ్యామిలీ థిరపీ: ఈ చికిత్సలో కుటుంబ సభ్యులు భాగం పంచుకునేలా చేస్తారు. కుటుంబ సభ్యులతో సంబంధాల్ని మెరుగుపరచడానికి, భావ వ్యక్తీకరణ నైపుణ్యాల్ని పెంపొందించుకోవడానికి, తల్లుల మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఒత్తిళ్ళను తట్టుకోవడానికి ఫ్యామిలీ చికిత్స ఉపయోగపడుతుంది.
జీవన శైలిలో మార్పులు:
తగినంత పోషకాహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సరిపడా నిద్ర, ఒత్తిడిని తగ్గించుకునే పద్ధతులు ఇతర చికిత్సలకు పూరకాలుగా పనిచేసి మొత్తం మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
తల్లుల మానసిక ఆరోగ్య అవగాహన వారం: తల్లులకు వచ్చే మానసిక సమస్యల గురించి అవగాహన కలిగించడానికి ఒక వారం పాటు ప్రచారం చెయ్యడం లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఈవారాన్ని జరుపుతున్నారు.
లక్ష్యాలు: గర్భిణులకు, బాలింతలకు, వారి కుటుంబ సభ్యులకు, ఆరోగ్య సంరక్షకులకు తల్లుల మానసిక ఆరోగ్య అవగాహన కలిగించడం బాధిత స్త్రీలకు, కుటుంబాలకు ఆసరాగా నిలబడడం, వ్యక్తుల వైఖరులను, సమాజ వైఖరులను ఈ అనారోగ్యాలపట్ల సానుకూలంగా మార్చడం. మానసిక సమస్యలు వచ్చిన వారు తిరిగి మామూలు ఆరోగ్యం పొందడానికి అవసరమైన సమాచారాన్ని అందించడం, తగిన సపోర్టును, సంరక్షణను పొందడానికి సహాయపడడం. తల్లుల మానసిక ఆరోగ్య అవగాహన వారం 2024 థీమ్‌ ‘నిన్ను పునరావిష్కరణ చేసుకోవడం’.
గర్భం దాల్చడం, తల్లి అవడం స్త్రీ జీవితంలో ఒక ప్రత్యేక ఘట్టం. ఈదశలో వివిధ భావోద్వేగాలకు గురవడం సహజం. కాని ప్రతి ఐదు గురిలో ఒకరు మానసిక రుగ్మతను అనుభవించడం విచారకరం, నివారించగల విషాదం. స్త్రీలు గర్భిణులుగా, బాలింతలుగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన కొంత మెరుగైనప్పటికి ఇంకా పూర్తి స్ధాయిలో తమ స్వరాల్ని వినిపించడానికి ఆటంకాల్ని ఎదుర్కొంటున్నారు. ‘నువ్వు మానసిక సమస్యల కారణంగా దు:ఖపడుతున్నప్పుడు, ఆ దు:ఖం నీ నిత్య జీవితాన్ని దుర్భరం చేస్తున్నప్పుడు ఆ దు:ఖం నుండి బయటపడడానికి అనేక రకాలుగా ప్రయత్నించవచ్చు, సహాయాన్ని పొందవచ్చు. మౌనంగా ఊబిలో కూరుకుపోవద్దు. పెనుగులాడి బయటకురా. స్ధిరంగా నిలబడి జీవితాన్ని ఆనంద దీపాలతో వెలిగించుకో’.
– డా.ఆలూరి విజయలక్మి
98490 22441 ,గైనకాలజిస్ట్‌, శ్రీ శ్రీ హోలిస్టిక్‌ హాస్పటల్‌, హైదరాబాద్‌

]]>
కార్మికుల ఘ‌న‌ చరిత్ర మేడే https://navatelangana.com/mayday-is-a-solid-history-of-workers/ Sat, 27 Apr 2024 16:38:19 +0000 https://navatelangana.com/?p=278696 Mayday is a solid history of workersమేడే అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యతకు సంకేతం. కార్మిక వర్గ చైతన్యానికి ప్రతీక. శ్రమదోపిడీకి వ్యతిరేకంగా వేలాది గొంతుకలు ఒక్కటైన చరిత్రకు సాక్ష్యం! ఎనిమిది గంటల పనిదినం. కార్మిక హక్కుల కోసం నినదించిన మహోజ్వల ఘట్టం. 138 ఏళ్ల కిందట కార్మికులు సాగించిన వీరోచిన పోరాటాల ఫలితంగానే ప్రపంచ కార్మిక వర్గానికి కొన్ని హక్కులు దక్కాయి. ఆ స్ఫూర్తితో ప్రపంచ దేశాలతో కార్మిక వర్గం సంఘటితమైతే తమ హక్కులు సాధించుకోవచ్చనే నమ్మకంతో ముందుకు కదిలారు. అనేక చట్టాలు రూపొందించుకోగలిగారు! అటువంటి గొప్ప చరిత్ర కలిగిన ప్రపంచ కార్మిక దినోత్సవం గురించి ప్రత్యేక కథనం…
మానవ జాతి చరిత్ర18వ శతాబ్దంలో అభివృద్ధి చెందిన శతాబ్దంగా పేరుగాంచింది. ఈ శతాబ్దంలోనే ఇంగ్లాండ్‌ మరికొన్ని యూరోపియన్‌ దేశాల్లో ఉత్పత్తి రంగంలో ఆవిరి యంత్రాలను ప్రవేశపెట్టడం ద్వారా పారిశ్రామికీకరణ క్రమం ప్రారంభమయింది. 1776 మార్చిలో వాట్సన్‌ కనిపెట్టిన ఆవిరియంత్రాన్ని ఇంగ్లాండ్‌లో ఒక బొగ్గు గనిలో మొదటిసారిగా ఉపయోగించారు. పారిశ్రామిక విప్లవం ప్రారంభ దినాల్లో కార్మికులు బానిసల్లాగ శ్రమ చేసేవారు. పారిశ్రామిక వేత్తలు అధిక లాభాలను గడించాలనే ఆశతో 6,7 సంవత్సరాల వయసు గల పిల్లల చేత, మహిళల చేత ఫ్యాక్టరీలోనూ, గనులలోనూ పనిచేయిస్తూ వుండేవారు. బాలకార్మికులు గనులలో, చీకటి సొరంగాలలో మోచేతులపైన, మోకాళ్లపైన పాకుతూ బొగ్గును లాగేవారు. పొగ గొట్టంపైకి ఎక్కి వాటిని శుభ్రపరుస్తూ వుండేవారు.
Mayday is a solid history of workersకొరడా దెబ్బలతో శిక్షించేవారు
ఇంగ్లాండ్‌లో అనాధ శరణాలయాల్లోని పిల్లలను శరణాలయాధికార్లు పారిశ్రామిక వేత్తలకు పశువుల వలె అమ్మేవారు. ఆ బాలకార్మికులు ఉదయం నుండి సాయంత్రం వరకు యంత్రాల వద్ద నిలబడి పనిచేసేవారు. క్షణం సేపు కన్ను మూసినా వారిని కొరడా దెబ్బలతో శిక్షించేవారు. ఆనాడు కార్మికులపై పనిభారమే కాక పనిగంటల భారం కూడా అధికంగా వుండేది. రోజుకు 16 గంటలు శ్రమించేవారు. కొంతమంది పెట్టుబడి దార్లు రోజుకు 20 గంటలు కూడా పనిచేయించేవారు. 1806లో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో చెప్పులు కుట్టే కార్మికులు సమ్మె చేశారు. కార్మిక నాయకులపై విచారణ జరిగే సందర్భంలో యజమానులు కార్మికులచే రోజుకు 19, 20 గంటలు పని చేయించుకుంటున్నారన్న విషయం వెల్లడైంది.
యంత్రాల ధ్వంసం
పారిశ్రామికాధిపతులు కార్మికులకు అతి తక్కువ వేతనం ఇచ్చేవారు. కార్మికులకు ఎట్టి భద్రతగాని, సౌకర్యాలు గాని వుండేవి కావు. గాలి, వెలుతురు లేని ఫ్యాక్టరీల్లో కార్మికులకు యంత్రాల నుండి రక్షణ వుండేది కాదు. అందుచేత తరచుగా వారు ప్రమాదాలకు గురై మరణిస్తూ వుండేవారు. పైగా కార్మికులు అమానుష శిక్షలకు గురయ్యేవారు. కదలినా, మాట్లాడినా, పాటలు పాడుకున్నా, చివరికి కళ్లు కడుక్కున్నా రెండు షిల్లింగులు జరిమానా కట్టవలసి వచ్చేది. కార్మికులు తాము అనుభవించే పీడనకు, దోపిడీకి కారణం యంత్రాలని భావించి, యంత్రాలను ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఈ విధ్వంసకాండ మొదట బ్రిటన్‌తో ప్రారంభమైంది. దాంతో పారిశ్రామికాధిపతులు ప్రభుత్వ సహాయం కోరారు. నికృష్ణ పరిస్థితుల్లో దోపిడీకి గురవుతున్న కార్మికుల ప్రాణ రక్షణకు చొరవ చూపించని ప్రభుత్వం యజమానుల ఆత్మ రక్షణకు మాత్రం వెంటనే పార్లమెంటును ఉపయోగించింది. యంత్రాలను ధ్వంసం చేసేవారికి మరణశిక్ష విధిస్తూ 1812లో చట్టం చేసింది. అయితే కాలక్రమేణా కార్మికులు యంత్రాలను ధ్వంసం చేయటంలో అర్ధం లేదని, తమ బాధలకు, దుస్థితికి ఫ్యాక్టరీ యజమానులే కారణమని గ్రహించారు. తమ దుస్థితి నుండి బయటపడడానికి సంఘటితంగా దోపిడీ మూకలకు వ్యతిరేకంగా పోరాటం చేయటమొక్కటే మార్గమని అర్ధం చేసుకున్నారు. దానితో బూర్జువా వర్గానికి వ్యతిరేకంగా శ్రామికవర్గం పోరాట పతాకాన్ని ఎగురవేసింది.
కార్మిక సంఘాల నిర్మాణం
అణగదొక్కబడిన కార్మికవర్గం తమ హక్కుల సాధన కోసం చైతన్యవంతంగా పోరాటాలు జరపడానికి వీలుగా కార్మిక సంఘాల నిర్మాణానికి పూనుకుంది. 1764 – 1800ల మధ్య గ్రేట్‌ బ్రిటన్‌ ట్రేడ్‌ యూనియన్ల నిర్మాణం జరిగింది. అమెరికాలో ఫిలడెల్ఫియా నగరంలో పోరాట సంప్రదాయం గల కార్మికులు 1806లో ‘మెకానిక్స్‌ యూనియన్‌’ పేరుతో కార్మిక సంఘాన్ని స్థాపించారు. అదే అమెరికాలోని మొట్టమొదటి కార్మిక సంఘం. 1850- 60 నాటికే యూరప్‌ ఖండంలోని అనేక దేశాల్లోను, అమెరికన్‌ కార్మికులు విప్లవోత్సాహంతో శక్తివంతమైన కార్మిక సంఘాలను నిర్మించారు. తమ హక్కుల సాధన కోసం క్రియాశీల పోరాటంలోకి దూకారు.
మహత్తర ఆయుధం
ట్రేడ్‌ యూనియన్ల మహత్తర సామాజిక శక్తిని చూసి పాలకులు హడలెత్తిపోయారు. ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాల్లో కార్మికులు అధిక జీతాలు డిమాండ్‌ చేయడం కోసం కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకోవడం చట్టవిరుద్దమని ప్రకటించడమే కాదు, అలాంటి ట్రేడ్‌ యూనియన్‌లు నిషేధించబడ్డాయి. సమ్మె చేసే హక్కును, పికెటింగ్‌ హక్కును నిషేధించారు. అయినా ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమం అంతరించలేదు. తమ జీవన పరిస్థితులను మెరగుపరచుకునేందుకు కార్మికులకు గల మహత్తర ఆయుధం అది. దానిని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు. పాలకుల ట్రేడ్‌ యూనియన్లను నిషేధించినా కార్మిక వర్గ పోరాటాలన రక్తసిక్తం చేసినా కార్మిక వర్గం వెనుకంజ వేయలేదు. పనిగంటల తగ్గింపు కోసం, న్యాయమైన వేతనాల కోసం, ట్రేడ్‌ యూనియన్ల గుర్తింపు కోసం, ప్రభుత్వ పరంగా హక్కుల కొరకు కార్మిక వర్గం చైతన్యంతో పోరాటాలను కొనసాగించింది. ఈ పోరాట జ్వాలలు 19వ శతాబ్దం ప్రథమార్ధంలో బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, అమెరికా దేశాల్లోని దోపిడీ శక్తులను చుట్టముట్టాయి. కార్మిక వర్గం బలమైన పోరాటాలు జరపడంతో ప్రభుత్వాలు దిగొచ్చి కార్మిక వర్గానికి అనుకూలంగా కొన్ని చట్టాలు చేశాయి. వాటిలో ముఖ్యమైనవి పని గంటలు, బాల కార్మికులకు సంబంధించినవి. పోరాటాల ఫలితంగా కొన్ని చట్టాలు చేయబడినప్పటికీ అధికారులు మాత్రం వాటిని చిత్తశుద్ధితో అమలు చేయలేదు.
8 గంటల పనిదినం
1870 నాటికే పారిశ్రామిక, వాణిజ్య, బ్యాంకింగ్‌ రంగాల్లో గుత్తాధిపత్యం రూపుదాల్చింది. కొన్ని ఒడిదుడుకులకు గురైనప్పటికీ పెట్టుబడిదారీ వర్గం అధికలాభాలు పోగుచేసుకోవడానికి మంచి అవకాశాలు ఏర్పడ్డాయి. కానీ కార్మికవర్గం జీవితాల్లో మాత్రం ఎటువంటి అభివృద్ధి లేదు. దానితో కార్మిక వర్గం పనిగంటల తగ్గింపు కోసం ఉద్యమించింది. 1881 చికాగో నగరంలోని వివిధ కార్మిక సంఘాలు కలసి ‘అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌’ అనే పేరుతో ఒక సమాఖ్యను ఏర్పాటు చేసుకున్నాయి. 1884 అక్టోబర్‌ 7వ తేదీన ఈ సమాఖ్య నాల్గవ సమావేశంలో 8 గంటల పనిదినం కోసం చారిత్రాత్మకమైన తీర్మానం చేసింది. ఈ హక్కును సాధించడం కోసం 1886 మే మొదటి తేదీన దేశమంతటా కార్మికవర్గం సమ్మె పోరాటాలు నిర్వహించాలని కూడా నిర్ణయించబడింది. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటానికి అమెరికాలోని ఆనాటి భౌతిక పరిస్థితులు కూడా చాలా తోడ్పడ్డాయి. 1880 – 90 మధ్యకాలంలో అమెరికాలో పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. 1884 – 85 మధ్య ఆర్థిక సంక్షోభం రావటంతో అనేక మంది కార్మికుల నిరుద్యోగానికి గురయ్యారు. పనిచేస్తున్న కార్మికుల స్థితిగతులు కూడా అతి దుర్భరంగా తయారయ్యాయి. ఎనిమిది గంటల పనిదినం ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవలసిన అవసరాన్ని కార్మికవర్గం అత్యంత ముఖ్యమైన డిమాండుగా గుర్తించింది. ట్రేడ్‌ యూనియన్‌ల సభ్యత్వం పెరిగింది. మేడే సమ్మె సన్నద్దంగా 1885 – 86 లో మిగిలిన పోరాటాల్లో కూడా లక్షలాది కార్మికులు పాల్గొన్నారు. 1866 సెప్టెంబర్‌లో జనీవాలో జరిగిన మొదటి ఇంటర్నేషనల్‌ మహాసభ కూడా రోజుకి 8 గంటల పనిని చట్టబద్దం చేయాలని కోరుతూ తీర్మానం చేసింది.
చారిత్రాత్మకమైన మేడే
చికాగో కార్మిక వర్గం అమెరికన్‌ కార్మికవర్గంలో ఒక భాగమే అయినా అక్కడ కార్మిక వర్గానికి ఒక ప్రత్యేకత వుంది. సమ్మెకు కొన్ని రోజుల ముందుగానే అనేక రాజకీయ దృక్పథాలు గల వారితో ‘8 గంటల పనిదినం’ సంఘం ఒకటి ఏర్పడి పనిచేయసాగింది. ఆ సంఘం నాయకత్వంలో మే 1వ తేదీకి ఒక రోజు ముందు ఆదివారం నాడు 25 వేల మంది కార్మికులతో బ్రహ్మాండమైన ప్రదర్శన జరిగింది. మే ఒకటిన నగర వీధులన్నీ ఉత్సాహవంతులైన కార్మికులతో నిండిపోయాయి. నగరంలో బ్రహ్మాండమైన సార్వత్రిక సమ్మె జరిగింది. ఫ్యాక్టరీలన్నీ మూతబడ్డాయి. అదివరకెన్నడూ కనీవినీ ఎరుగని ఐకమత్యంతో మూడు లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. 8 గంటల పనిదినాన్ని సాధించి తీరుతాం అనే దృఢ విశ్వాసం వారందరిలోనూ కన్పించింది. విజృంభిస్తున్న ఈ కార్మికోద్యమాన్ని ఏ విధంగానైనా నాశనం చేయాలని కార్మిక వర్గ శతృవులు, పెట్టుబడిదారులు నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం వారికి అండగా నిలబడింది. మే 3వ తేదీన శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులపై పోలీసులు కాల్పుల జరిపి ఆరుగురి ప్రాణాలను బలిగొన్నారు.
రక్తంతో తడిసిన హే మార్కెట్‌
ఈ దారుణ హత్యాకాండకు నిరసనగా 4వ తేదీన చికాగో నగరం మధ్యలో వున్న ఈ మార్కెట్‌లోకి కార్మికులు పెద్ద సభ జరిపారు. ప్రశాంతంగా జరుగుతున్న ఆ సభ మీద కూడా పోలీసులు విరుచుకుపడ్డారు. పోలీసు యంత్రాంగం కుట్రలో భాగంగా పోలీసులపై వారి ఏజంటుతో బాంబుదాడి చేయించారు. ఆ దాడిలో ఒక పోలీసు మరణించగా, దానిని సాకుగా చూపి పోలీసులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో అనేకమంది కార్మికులు మరణించారు. హే మార్కెట్‌ ప్రాంగణం కార్మికుల రక్తంతో తడిసిపోయింది. బాంబు పేలుడుపై ఎనిమిది మంది కార్మికులపై తప్పుడు కేసులు బనాయించారు. వారిలో ఏడుగురికి దిగువ కోర్టు మరణశిక్ష విధించింది. కార్మికులు పై కోర్టుకు అప్పీలు వేయగా శిక్షలను ఖరారు చేసింది. 1887 నవంబర్‌ 10న ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. మరుసటి రోజు అనగా 1887 నవంబర్‌ 11న ఆగస్ట్‌స్పైస్‌, ఆల్బర్ట్‌ పార్సన్స్‌, అడాల్ఫ్‌ ఫిషర్‌, జార్జి ఏంగెల్స్‌ నలుగురిని ఉరితీశారు. ఆ తరువాత ఆరేండ్లకు మిగిలిన ఇద్దరిని ఇల్లినాయిస్‌ గవర్నర్‌ క్షమాభిక్షతో వురిశిక్షను రద్దు చేశారు. ఆ విధంగా 1886 మే మొదటి తేదీ ప్రపంచ కార్మిక వర్గ విప్లవ చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించదగిన తేదీగా మారిపోయింది.
త్యాగాన్ని స్మరించుకుంటూ
ఆనాటి పోరాటోద్యమానికి చికాగో నగరమే కేంద్రం అయినప్పటికీ దేశంలోని అనేక ముఖ్య నగరాలకు ఆ ఉద్యమం వ్యాపించింది. 1889 జులైన పారిస్‌లో సమావేశమైన అంతర్జాతీయ సోషలిస్ట్‌ ప్రతినిధుల రెండవ ఇంటర్నేషనల్‌ సమావేశం చికాగో నగరంలో హే మార్కెట్‌ అల్లర్లలో జరిగిన కాల్పుల్లో మరణించిన కార్మికుల త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది మే ఒకటవ తేదీన కార్మికుల దీక్షా దినంగా పాటించాలని తీర్మానించింది. 1890 నుంచి ప్రపంచవ్యాప్తంగా మేడే జరుగుతోంది. మనదేశంలో 1923లో మొట్టమొదటిసారిగా అప్పటి మద్రాసు నగరంలో లేబర్‌ కిసాన్‌ పార్టీ ఆధ్వర్యంలో మే డేను జరుపుకున్నాం. మద్రాస్‌ మెరీనా బీచ్‌లో కామ్రేడ్‌ సింగారవేలు ఎర్రజెండా ఆవిష్కరించారు. ఎనిమిది గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వ్యక్తిగత జీవితం కోసం చేసిన పోరాటానికి చిహ్నం మేడే. గరిష్టంగా రోజుకి 8 గంటల పని. వారానికి 48 గంటల పని వుండాలని 1919లో జరిగిన అంతర్జాతీయ కార్మిక సంస్థ మొదటి సమావేశం నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గం మేడే జరుపుకుంటున్న ఈ సందర్భంలో పెట్టుబడిదారీ దేశానికి 8 గంటల పనిదినంతో పాటుగా కష్టపడి సాధించుకున్న హక్కులన్నీ దాడికి గురవుతున్నాయి. కార్మిక సంఘాల హక్కులపై, మరీ ముఖ్యంగా సమ్మె చేసే హక్కులపై దాడి జరుగుతోంది.
నిర్ణీత సమయం లేకుండా
2020లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకువచ్చింది. వాటిలో ఒకటైన ఉపాధి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించిన నిబంధనల విషయంలో ఆయా సంస్థలకు మినహాయింపునిచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తున్నది. ఆ వెంటనే కర్ణాటక వంటి పలు రాష్ట్ర ప్రభుత్వాలు పని గంటలను 8 నుండి 12కు పెంచుతూ ఫ్యాక్టరీ చట్టాన్ని సవరించాయి. నిజానికి చట్టప్రకారం 8 గంటల పని అన్నమాటే కానీ నేడు ఇంచుమించు అన్ని రంగాలలో కార్మికులు, ఉద్యోగులు అనధికారికంగా 10-12 గంటలు పనిచేస్తున్నారు. ముఖ్యంగా కరోనా అనంతరం ‘వర్క్‌ ఫ్రం హోమ్‌’ తప్పనిసరి అయిన పరిస్థితుల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు, వైద్య ఆరోగ్య రంగంలో పనిచేసే స్టాఫ్‌ నర్సులు, హౌస్‌కీపింగ్‌ సిబ్బంది తదితర ఉద్యోగులకు నిర్ణీత సమయం లేకుండా పోయింది. పారిశ్రామిక కార్మికుల పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది. ఏండ్ల తరబడి కనీస వేతనాలలో పెంపుదల లేకపోగా, మరోవైపు 10-12 గంటలు పని చేయక తప్పని పరిస్థితి.
70 గంటలు పని చేయాలంటూ
ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ రంగంలో ట్రక్‌ డ్రైవర్స్‌ రోజుకి కనీసం 14 గంటలు పనిచేస్తున్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి. ఎటువంటి చట్టాలు, హక్కులు లేని పరిస్థితుల్లో లక్షలాది యువత గిగ్‌ వర్కర్లుగా, స్కీం వర్కర్‌లుగా, షాప్స్‌, మాల్స్‌లో సేల్స్‌ పర్సన్స్‌గా 12 గంటలకు మించి పనిచేస్తున్నారు. వారు పని సమయంలో, విధి నిర్వహణలో ప్రమాదాల బారి పడినా యాజమాన్యాలు పట్టించుకునే పరిస్థితి లేదు. వాస్తవ పరిస్థితి ఈ విధంగా వుంటే ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి వంటి పారిశ్రామిక వేత్తలు మాత్రం వారానికి 70 గంటలు పని చేయాలంటూ దేశ యువతకు పిలుపునిస్తున్నారు. అంటే వారాంతపు సెలవు కూడా లేకుండా రోజుకి 10 గంటలు, వారంలో ఏడు రోజులూ పని చేయాలని, లేకపోతే సోమరుల కింద లెక్కేనని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కార్మిక వర్గం నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది.
పని ప్రదేశాలు సురక్షితంగా
దశాబ్దాల తరబడి పోరాడి సాధించున్న కార్మిక హక్కులు నీరుకారిపోతున్నాయి. కార్మిక చట్టాలకు రక్షణ లేకుండా పోతోంది. దేశ, విదేశ బహుళజాతి సంస్థలు అధిక ఉత్పత్తి, సుదీర్ఘ పనిగంటలు, తప్పనిసరి ఓవర్‌టైం వంటి డిమాండ్లను ముందుకు తెస్తున్నాయి. మనదేశంలో కార్మికులు గౌరవప్రదమైన, ఆరోగ్యకరమైన జీవనం సాగించాలంటే వారికి రోజుకు 8 గంటల పని మాత్రమే కల్పించాల్సిన అవసరం ఉంది. పని ప్రదేశాలను సురక్షితమైనవిగా ఉంచాల్సిన బాధ్యత కూడా యాజమాన్యానిదే. ప్రభుత్వాలు ఆ దిశగా చట్టాలు రూపొందించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
శ్రామిక వర్గ ఐక్యత కీలకం
పేదరికం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ప్రభుత్వాలు అదుపు చేయలేని అధిక ధరలు, నిరద్యోగం, ఉద్యోగాల తొలగింపులు, పెన్షన్‌, ఆరోగ్య సంరక్షణ, శ్రామిక మహిళల హక్కులు, ధనిక పేద అంతరాలు, నేటి ప్రధాన సమస్యలు. వీటిని పరిష్కరించుకోకుండా శ్రామిక వర్గానికి పేద ప్రజల జీవితాలకు విముక్తి రాదు. లక్ష్య సాధనకు శ్రామిక వర్గ ఐక్యత కీలకం! మేడే రగిలించిన పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకుని అమరుల ఆశయాల అడుగుజాడల్లో కార్మికవర్గం కదం తొక్కాలి. మేడే గతించిన చరిత్ర కాదు. గర్జిస్తున్న కార్మికుల ఘనచరిత్ర అని నినదించాలి.

]]>
పుస్త‌కం స‌మ‌స్త జ్ఞాన ప్ర‌వాహం https://navatelangana.com/a-book-is-a-stream-of-knowledge/ Sat, 20 Apr 2024 16:39:49 +0000 https://navatelangana.com/?p=273707 పుస్తక పఠనం లేకపోతే సమాజం కలంలేని, కాగితం లేని, మేధస్సు లేని విధంగా నిర్జీవ సమాజంగా సాగుతుంది. సమాజం పునర్జీవం పొందాలంటే పుస్తకాలను చదవాల్సిందే. పుస్తకాలు మనిషిలోని భావాలకు, ఊహలకు అక్షర రూపం ఇస్తాయి. మనల్ని కవులుగా, రచయితలుగా, శాస్త్రవేత్తలుగా, సాహితీ వేత్తలుగా, మేధావులుగా తీర్చిదిద్దుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పుస్తకాలు ప్రపంచాన్ని చూపించే గవాక్షాలు. మనం కాలు కదపకపోయినా, ఇల్లు దాటకపోయినా కొత్త ప్రపంచలో విహరింపచేసి కొత్త కొత్త అనుభవాలను, అనుభూతులను పంచి, మన పరిణతికి, మనో వికాసానికి దోహదం చేసే అద్భుత మార్గదర్శకాలు. మనకు సంతోషాన్నిచి, మన బాధను పంచుకునే చక్కని నేస్తాలు పుస్తకాలు. అటువంటి పుస్తక పఠనం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ఏప్రిల్‌ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తక గొప్పతనాన్ని తెలియజేసే వ్యాసం మీ కోసం…

యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్‌, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ ప్రతి ఏడాది చదవడం, ప్రచురించడం, కాపీరైట్లను ప్రోత్సహించడానికి ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని జరుపుతున్నారు. సెవాంతెస్‌, షేక్సిపియర్‌, ఇన్కా గర్సిలాసో, వేగా అనే ప్రఖ్యాత రచయితలు 1616లో ఇదే రోజు మరణించారు. అంతేకాదు జోసెఫ్‌ ప్లా, వ్లాదిమర్‌, మారిస్‌ ద్రువాం ఇలా చాలా మంది ప్రపంచ ప్రఖ్యాత రచయితలు ఇదే రోజు మరణించడమో, జన్మించడమో కూడా పుస్తక దినోత్సవం చేసుకోవడానికి ఓ కారణం. ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు తేదీల్లో పుస్తక మహౌత్సవాలు నిర్వహించినా ఇన్ని ప్రత్యేకతలున్న ఏప్రిల్‌ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం పాటించాలని 1955లో యునెస్కో ప్రకటించింది. అంతేకాకుండా ప్రపంచ పుస్తక, కాపీ హక్కుల దినంగా జరపాలని, రచయితలు, ప్రచురణకర్తలు, పాఠకులు, ఉపాధ్యాయులను ఈ రోజున గౌరవించాలని సూచించింది. అలాగే ఏటా ప్రపంచంలోని ఒక ప్రముఖ నగరాన్ని ‘ప్రపంచ పుస్తక రాజధాని’గా ప్రకటిస్తూ వస్తోంది.
రీడ్‌ యువర్‌ వే
ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. 2024 థీమ్‌ ”రీడ్‌ యువర్‌ వే”. పుస్తక పఠనను ప్రోత్సహించడం, పెంపొందించడం అదేవిధంగా పుస్తక పఠనమనే అలవాటుగా మార్చడమే ఈ థీమ్‌ లక్ష్యం. అలాగే పిల్లలు, పెద్దలను ప్రోత్సహిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఫార్మాట్‌ లేదా జానర్తో (కథల, నవలల, పోయెట్రీనా, జీవిత చరిత్రలా, జానపద కథల) సంబంధం లేకుండా పుస్తకాలతో నిమగమయ్యే మార్గాలను సూచిస్తుంది. ఈ నాటిలా పుస్తకాలకు నిగనిగలాడే కవర్లు, మృదువైన పేజీలు అప్పట్లో ఉండేవి కావు. వేల ఏండ్ల కిందట చరిత్రపూర్వ నాగరికతలలో రాత వ్యవస్థలు అభివృద్ధి చెందనప్పుడు మట్టి పలకలను ఉపయోగించారు. పాపిరస్‌ తరువాత అనేక మందపాటి వెదురు పేజీలతో కుట్టిన ఆధునిక పుస్తకాలను పోలి ఉండేలా రూపొందించిన పుస్తకాలు ఉండేవి.
చదవడం ఓ కళ
శ్రవణం, భాషణం, పఠనం, లిఖితం అనే నాలుగు అభివ్యక్తి నైపుణ్యాలలో పఠన కళ ఒకటి. పుస్తకాలను చదవడం ఒక కళ. వేగంగా చదవాలి. అర్థం చేసుకుంటూ చదవాలి. ప్రారంభించి కొన్ని పేజీలు చదవగానే అది ఉపయోగపడేదేనా, కాలక్షేపానికా అన్నది గ్రహించగలగాలి. ఏది చదవాలి, ఎలా చదవాలి, ఏవి చదవకూడదు అనేది తెలిసి వుండటం కూడా పఠన కళలో భాగమే! ఎన్ని పుస్తకాలు చదివాము అన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా చదివాం, ఎంత లోతుగా చదివామన్నది ముఖ్యం. చదివిన ఒక వాక్యమైన క్షుణ్ణంగా, లోతుగా చదవాలి. అపుడే మన మనసులో అవి నిలిచిపోతాయి.
విద్యకు ప్రాతిపదిక పుస్తకం
ఒక ప్రపంచ ప్రసిద్ధ విశ్వవిద్యాలయ ప్రవేశద్వారం వద్ద ఈ కింది సందేశం రాయబడి ఉంది. ‘ఏ దేశాన్నైనా నాశనం చేయాలంటే, ఆ దేశంపై అణు బాంబులు లేదా క్షిపణులు ప్రయోగించనవసరం లేదు. ఆ దేశ విద్యా విధానంలోని నాణ్యతను తగ్గించడం, పరీక్షల్లో విద్యార్థులు మోసం చేయడాన్ని అనుమతించడం చేస్తే చాలు. ఆ దేశ అభివృద్ధిని నాశనం చేయవచ్చు. అయితే ఆ దేశ అభివృద్ధి కొలమానంలో పుస్తక పఠనం, గ్రంథాలయాలు ఉన్నయన్న సంగతి మరవకూడదు. అభివృద్ధికి విద్య ప్రాతిపదిక అయితే విద్యకు ప్రాతిపదిక పుస్తకం. విజ్ఞానాన్ని సంరక్షించుకుని తరతరాలకు అందించటానికి ఎంతో ఉపయోగపడతాయి పుస్తకాలు. వైజ్ఞానిక, సంస్కృతిక, సాహితి రంగాలలో అభ్యుదయానికి పుస్తక పఠనం ఎంతో దోహదం చేస్తుంది. పుస్తకాలకు బూజు పట్టకుండా ఉంచగలిగితే జాతి విజ్ఞానవంతమైన మేధోవంతమైన సమాజంగా వెలుగుతుంది.
ప్రపంచానికి వెలుగును చూపిస్తుంది
పిల్లలకు చిన్నతనం నుండే చదవడం అలవాటు చేయాలి. వారికి పుస్తక పఠనం పట్ల ఆసక్తిని రూపొందించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సాయశక్తుల ప్రయత్నించాలి. పుస్తకం అక్షర కృతి దాల్చిన ఆలోచనల సముదాయం. మూసిన పుస్తకపు అరలలో మరకతమణిలా, మిణుగురు పురుగులా ప్రపంచానికి వెలుగును చూపిస్తుంది. సామాజిక పరిస్థితుల దృష్య్టా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, అవసరాల దృష్ట్యా పాఠకుడు పుస్తకం దగ్గరికి రానప్పుడు పుస్తకం పాఠకుని వెతుక్కుంటూ వెళ్ళాలి. పౌర గ్రంథాలయాల రూపంలో కానీ, పాఠశాల గ్రంథాలయాల రూపంలో కానీ లేదా పుస్తక ప్రదర్శన రూపంలో కానీ ఇది జరగాలి. కత్తికి పదును నిలిచి ఉండాలంటే అప్పుడప్పుడు దానికి పదును పెడుతూ ఉండాలి. లేకపోతే మొద్దు బారిపోతుంది. అదేవిధంగా నిత్యం చదువుతూ ఉన్న మనసు ఉత్తేజం కలిగించే ఆలోచన శక్తిని నిరంతరం పెంపొందించుతూ ఉంటుంది. లేకపోతే మనసు మందగతిగా మారి తెలివితేటలు లేకుండా పోతాయి. పుస్తక పఠనం మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలతో ముడిపడి ఉంది. ఇది మెదడును నిమగం చేయడానికి, మానసిక కార్యకలాపాలను ప్రేరేపించడానికి సహాయపడుతుంది.
పుస్తకం వినోదానికా, వికాసానికా
పుస్తకాలు వికాసానికే చదవాలని కొందరు, వినోదానికే చదవాలని మరికొందరు వారి వారి అభిప్రాయాలు వెలువరిస్తూ ఉంటారు. అయితే రెండు అభిప్రాయాలు సరికాదు. పుస్తకాలు చదువుకోవడం మనోవికాసానికో, వినోదానికో కాక విజ్ఞానానికి ఉపయోగపడతాయి. మానవ జీవితంలో వినోదం ఒక భాగమై పెనవేసుకున్నది. అయితే అది సభ్యమైనదై ఉండాలి. అన్నం తినేటప్పుడు నంచుకోవడానికి పచ్చళ్ళు అవసరమే. అయితే అన్నానికి మించి పచ్చళ్ళు ఉండరాదు. అందుచేత వికాసం మధ్య వినోదం నంజుకునేదిగా ఉండాలి. అంతేగాని అంతకు మించింది కారాదు. మనసు విశ్రాంతికి వినోదం కొంత పాలు అవసరమే. అయితే వినోదం కోసం చదివే పుస్తకాలు మన వికాసానికి కూడా దోహాదం చేసేవిగా ఉండాలి. కానీ మనసు ఉద్రిక్త పరిచేవిగా, మనసును బండ బారించేవిగా ఉండరాదు. ప్రస్తుత కాలమాన పరిస్థితిలలో అకాడమిక్‌ పుస్తకాలే కాకుండా మన చుట్టూ ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల పురోభివృద్ధిలో, మనం చదువుకునేటువంటి విభాగంలో నూతన పోకడలు ఏమైనా వస్తున్నాయా, నూతన పరిణామాలు, నూతన ఆవిష్కరణలు వస్తున్నాయా అనే విషయాలు తెలుసుకోవాలంటే పుస్తకాలను చదవాల్సిందే, వాటిని అవగతం చేసుకోవాల్సిందే.
ఎటువంటి పుస్తకాలు చదవాలి
ప్రచురించబడిన ప్రతి పుస్తకం ప్రతి మనిషికి అవసరం లేదు. ‘కొన్ని పుస్తకాలను స్పృశించి వదిలేయాలి. కొన్ని జీర్ణించుకోవాలి. కొన్ని నెమరు వేసుకోవాలి’ అన్నాడు ప్రసిద్ధ ఆంగ్ల రయిత బేకన్‌. పుస్తకాలు ఎలా చవాలో మహాకవులు, మేధావుల జీవిత చరిత్రలు, డైరీల నుండి గ్రహించవచ్చు. ‘చిరిగిన చొక్కానైనా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో’ అనే సూక్తి మనందరకు తెలుసు. కానీ నేటి యువత పద్ధతి దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. బాగా చదవివే అలవాటున్న వారిని పుస్తకాల పురుగు అంటారు. అలాంటి వారు నిజంగానే తమ డబ్బును బట్టలకు కాకుండా పుస్తకాలు కొనడానికి ఖర్చు చేస్తారు.
శాశ్వతమైన స్నేహితులు…
పుస్తకాలు చదవడం శ్వాస పీల్చటం లాంటిది. శ్వాస ఆడకపోతే ప్రాణం నిలవదు. పుస్తకాలు అంతే! ఒక పుస్తకం, ఒక కలం, ఒక ఉపాధ్యాయుడు… ఇవి ప్రపంచాన్నే మార్చగలవు. ఆస్తులు, భవనాలు కూలిపోవచ్చు. కాని పుస్తకాలు నశించవు. అశాంతియ క్షణాల్లో, నిరాశా నిస్పృహల్లో, ఒంటరితనంలో పుస్తకమే మనకు నిజమైన నేస్తం. ప్రాణ స్నేహితులు కూడా ఒక్కొక్కసారి విభేదాలు వచ్చి మనతో విడిపోవచ్చు. కాని పుస్తకాలు అనే స్నేహితులు మన సుఖ దు:ఖాలలో మనకు తోడు. ఎంతో వెన్ను దన్ను. ముఖ్యంగా మన బాధలో, మనని ఎప్పుడూ విడిచి పెట్టవు. మనలోని లోపాలను దిద్ది మంచి దారిలో పెడతాయి. మనలో మంచి ప్రవర్తనను ప్రోది చేసే అద్భుత సాధనాలు.
మంచి పుస్తకం మానవునికి ఎనలేని ఓర్పును అలవరుస్తుంది. లేని ఉల్లాసాన్ని వనగూర్చును. పుస్తకం అనేది ఊహాశక్తిని రేకెత్తించే పరికరం అని బెన్నెట్‌ మహాశయుడు చెప్పినట్లు గొప్ప వ్యక్తుల, రచయితల, సాహిత్యకారుల మదిలో వెలిగిన అక్షర రూపమే పుస్తకం. అటువంటి పుస్తకం అనేక ప్రశ్నలకు సమాధానాలను ఇస్తుంది. సిద్ధాంతాలను ప్రశ్నిస్తుంది, విలువలను కాపాడుతుంది, సమాజ మనుగడను, ప్రపంచ పోకడలను గ్రహించి, నూతన పరిణామాలను ఆవిష్కరించి సమాజానికి అందజేస్తుంది. మీ సహనానికి అనుగుణంగా ఎంత విజ్ఞానం ఉంటే అంత విజ్ఞానాన్ని జుర్రుకోవచ్చు. జ్ఞాన తృష్ణను పెంచే పుస్తకాలు చదివిన కొలది విజ్ఞత పెరిగి, ఆలోచన శక్తిని తీవ్రతరం చేస్తాయి.
క్రమం తప్పకుండా చదివితే…
పుస్తకం చదవడం వల్ల మనిషికి ఎన్నో లాభాలు ఉంటాయి. పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానం పొందడమే కాకుండా నడవడిక కూడా అలవడుతుంది. క్రమం తప్పకుండా పుస్తకం చదివే వ్యక్తి మానసిక ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉంటారని అనేక పరిశోధనలలో తేలింది. కొంతమంది దృష్టిలో పుస్తకం చదవడం ఒక రకమైన కంఫర్ట్‌. అందుకే వారు ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా తమ స్నేహితుడిని (పుస్తకాన్ని) తీసుకువెళతారు. పుస్తక పఠనం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పుస్తకం చదవకుండా రోజు గడవని వారు చాలామంది ఉన్నారు. శరీర పోషణకు ఆహారపానీయాలు ఎలా అవసరమో అట్లే మెదడు పెంపొంది సమస్థితిలో ఉండాలంటే దానికి కూడా సరైన ఆహారం అవసరం అన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తించాలి. శరీరాదరణకు అవసరమైన నిత్యక్రియలు ఏ విధంగా మన నిత్య జీవిత విధానాల్లో భాగమైపోతాయో అట్లే గ్రంథ పఠనం కూడా నిత్యజీవిత విధానంలో ఓ భాగమై పోవాలి. పది పూటలు గడగడ చదవడం కంటే ఒక పూటను చక్కగా అర్థం చేసుకొని చదవడం వలన ఎక్కువ విజ్ఞానం లభిస్తుంది.
ఊహాశక్తిని ప్రేరేపిస్తాయి
పుస్తకాలను చదవడం అనేది మీరు తాదాత్మ్యతను, భావోద్వేగ మేధస్సును పెంపొందించుకోవడానికి, విభిన్న దృక్కోణాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. విభిన్న పాత్రలు, కథాంశాలలో మిమ్మల్ని మీరు బహిర్గతం చేయడం ద్వారా, మీరు మానవ స్వభావం, భావోద్వేగాల గురించి మరింత అవగాహన పెంచుకోవచ్చు. ఇది మీ వ్యక్తిగత, వృత్తి జీవితంలో రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది. పుస్తకాలు మీ ఊహాశక్తిని ప్రేరేపిస్తాయి. దృశ్యాలు, పాత్రలను, అదృశ్యమానం చేయడంలో మీకు సహాయపడతాయి. ఇది పిల్లలకు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వారి సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. పఠనం మీ సొంత రచనను మెరుగుపరచడంలో కూడా సహాయం చేస్తుంది. కమ్యూనికేషన్‌ గురించి మరింత అవగాహన పెంచుకోవచ్చు. అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. వయసు సంబంధిత అభిజ్ఞా క్షీణత ఆగమనాన్ని ఆలస్యం చేస్తుంది.
దృష్టిని, శ్రద్ధను మెరుగుపరచడంలో…
పుస్తకాలను చదవడం వల్ల విమర్శనాత్మక ఆలోచన, విశ్లేషణ నైపుణ్యాలు వృద్ధి చేసుకోవచ్చు. చదవడం ద్వారా వ్యక్తిగత, వృత్తి జీవితంలో వచ్చే సంక్లిష్ట సమస్యలను పరిష్కరించుకోవచ్చు. విభిన్న దృక్కోణాలను అన్వేషించడానికి, ఇతరుల అనుభవాలను బాగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు మీ దృష్టిని, శ్రద్ధను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చదివే చర్య మెమరీలో సమాచారాన్ని ఎన్కోడ్‌ చేయడానికి కూడా సహకరిస్తుంది. ఇది తర్వాత గుర్తుకు తెచ్చుకోవడం సులభం చేస్తుంది. వేగంగా పెరిగిపోతున్న వయసులో ఒత్తిడులు నుంచి తప్పించుకోవడానికి గొప్ప ఆధారం పుస్తకాలు.
మనిషిని శిల్పంలా మారుస్తుంది
భౌతిక పుస్తకాలతోనే కాదు డిజిటల్‌ పుస్తకాలతో కూడా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే భౌతిక పుస్తకాలు స్పర్శ అనుభవాన్ని అందిస్తాయి. డిజిటల్‌ పుస్తకాలు సౌకర్యవంతంగా, సులభంగా మనకు అందుబాటులో ఉంటాయి. అంతిమంగా అన్ని పుస్తకాలు ప్రయోజనాలను అందిస్తాయి. కానీ నాన్‌-ఫిక్షన్‌, ఎడ్యుకేషనల్‌ బుక్స్‌ వంటి కొన్ని శైలులు నేర్చుకోవడానికి, లోతైన ఆలోచన కోసం మరిన్ని అవకాశాలను అందిస్తాయి. ఈ రకమైన పుస్తకాలు పాఠకులకు కొత్త నైపుణ్యాలను పెంపొందిస్తాయి. పుస్తకాన్ని మించిన ఉలి మరొకటి ఉండదు. రాయిలాంటి మనిషిని శిల్పంలా మారుస్తుంది. కనుక చదవడం అన్ని తరాలవాళ్లు అలవాటు చేసుకోవాలి. ప్రతి వారికి సొంత గ్రంధాలయం ఉండాలి. ఇది విలాసం కోసం, ప్రదర్శన కోసం కాదు. జీవితంలో ఇదీ ఒక అవసరం. మండల, జిల్లా, పాఠశాలల్లో పుస్తక పఠన(రీడథాన్‌) నిర్వహించాలి. పుస్తక పఠనం అనేది పాఠశాలల నుండి, గ్రంథాలయాల నుండి ఇంటికి ఎగబాకే సంస్కృతిని అలవరచాలి. పుస్తక పఠనం జీవితంలో నిత్యావసరంగా మారిపోవాలి. జీవితంలో మమేకమైనప్పుడు పుస్తకం ప్రధాయినగా వెలుగొందుతుంది.

]]>
దార్శనిక శిఖరం… https://navatelangana.com/he-is-the-pinnacle-of-vision/ Sat, 13 Apr 2024 16:36:53 +0000 https://navatelangana.com/?p=269020 dr br ambedkarభారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన పేరు అది. వేలయేండ్ల అణిచివేతపై మడమతిప్పని పోరాటం సలిపిన యోధుడు అతడు. అంటరానివాడని అవమానించిన జాతికి దిక్కుమొక్కు అతడే అయ్యాడు. ప్రపంచం గర్వించదగిన మేధావిగా ఎదిగాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా తాను పుట్టిన నేలను నిలిపినవాడు. కోట్లాదిమంది గుండెల్లో కొలువున్న జ్ఞానశిఖరం అతడే. ఔను, ఆ స్ఫూర్తిప్రదాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మహాశయుడే. ఏప్రిల్‌ 14 భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా ఆ దార్శనికుని అజరామరమైన కషిపై రేఖామాత్రపు పరిచయ ప్రయత్నం…
తనపట్ల వివక్షతను, అసహనాన్ని ప్రదర్శించిన జాతిని క్షమించిన అభినవ బుద్ధుడు. ఈ దేశం బాగుండాలని తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తనను నమ్ముకున్న జాతులకు ఒక దిశానిర్దేశం చేసిన వేగుచుక్క. ‘ఎంతకాలం జీవించామన్నది కాదు, ఎట్లా జీవించామన్నదే ముఖ్యమని’ తలిచిన తాత్వికుడు. ఇవాళ ఆయన ఇచ్చిన రాజ్యాంగమే ఈ దేశానికి రక్షణ కవచం. హక్కుల ముఖం చూడని కోట్లాదిమందిని మనుషులుగా తలెత్తుకునేలా చేసింది అతని కలమే. అతడే ఫాదర్‌ ఆఫ్‌ మోడరన్‌ ఇండియాగా కొలంబియా విశ్వవిద్యాలయం చేత కొనియాడబడిన దార్శనికుడు బాబా సాహెబ్‌ డా.బి.ఆర్‌.అంబేద్కర్‌.
The pinnacle of vision...that is himఅవమానాలకు ఎదురీది…
అది బ్రిటీష్‌ ఇండియా. అప్పటికి అగ్రకులాలకు తప్ప నిమ్న కులస్తులకు కనీస హక్కులు లేని కాలం. చాతుర్వర్ణ కులవ్యవస్థ ఇంకా బుసలు కొడుతూ ఊరికి దూరంగా వెలివాడలను నిలిపిన తరుణం. అలాంటి రోజుల్లో పుట్టిన ఒక దళితుడు చదవడం కాదుగదా కనీసం స్వేచ్ఛగా జీవించగలడా? ఆత్మగౌరవంతో అడుగు వేయగలడా? లేదు. నిత్యం కులం చేత అవమానించబడుతూ ఛీత్కారాల మధ్య మాత్రమే బతకాల్సిన రోజులవి. ఆ సమయంలో 1891 ఏప్రిల్‌ 14న మధ్యప్రదేశ్‌లోని రత్నగిరి జిల్లా అంబవాడ గ్రామంలో జన్మించాడు భీంరావ్‌ రాంజీ అంబేద్కర్‌. గంపెడు సంతానం కలిగిన ఆ కుటుంబంలో అంబేద్కర్‌ కడుపేదరికాన్ని అనుభవించాడు. తండ్రి బ్రిటీష్‌ సైన్యంలో సుబేదారుగా పనిచేస్తున్నా కనీస అవసరాలకు కష్టమైన కుటుంబం. పైగా పంచములంటే, అంటరాని వారంటే ఆ రోజుల్లో కులసర్పం ఇంకా బుసలు కొడుతూనే ఉంది. దీంతో బాబా సాహెబ్‌ సైతం బాల్యం నుండే అనేక అవమానాలు ఎదుర్కోక తప్పలేదు. బడిలో చివరన కూర్చోబెట్టడం, అగ్రవర్ణ పిల్లలు కసురుకుంటే గురువులే తరగతి బయటపెట్టి చదువు చెప్పడం వంటి ఎన్నో అవమానాలు అంబేద్కర్‌ బాల్యంలోనే అనుభవించాడు. కనీసం తాగడానికి గుక్కెడు మంచినీళ్లు సైతం ఇవ్వని సమాజం ఆనాడు ఉంది. అయినా సరే అంబేద్కర్‌ మాత్రం ఏనాడూ ధైర్యాన్ని కోల్పోయింది లేదు. బాబా సాహెబ్‌ పుట్టిన రోజు కానుకగా తన మేనమామ బహుమతిగా ఇచ్చిన గౌతమబుద్దుని జీవిత చరిత్ర పుస్తకం తనను ఎంతో ప్రభావితం చేసింది.
చదువే లోకంగా…
ఈ అంటరాని లోకంలో అట్టడుగు వర్గాలకు చదువు తప్ప మరో ఆస్తి, ఆయుధం లేదు. చదువుకుంటేనే బాగుపడతాం. ఈ మనువాద వ్యవస్థను జ్ఞానంతోనే గెలవాలనే పట్టుదల క్రమంగా బాబా సాహెబ్‌ అంబేద్కర్‌లో పెరుగుతూ వచ్చింది. అందుకే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చదువును మాత్రం వదిలిపెట్టింది లేదు. ఉన్నత చదువులు చదివి జ్ఞానవంతుడై నిలబడితేనే ఈ సమాజం మనకు విలువ ఇస్తుందని బలంగా నమ్మాడు బాబా సాహెబ్‌. అట్లా లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌తో పాటు అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో సైతం చదువుకున్నాడు. అది కూడా కేవలం ఒక ఉద్యోగం కోసమో, భద్రమైన జీవితం కోసమో కాదు. ఆయన చదివిన చదువంతా భారత సమాజానికి ఉపయోగపడే చదువులే చదివాడు.
ముఖ్యంగా ఆయన లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ‘ది ప్రాబ్లెం ఆఫ్‌ రూపీ’అనే అంశంపై రాసిన గ్రంథం అత్యంత విలువైనది. అదే మన దేశంలో ఆర్‌బిఐ వంటి జాతీయ బ్యాంకులు నెలకొల్పడానికి ప్రధాన ఆధారంగా నిలిచింది. అట్లా అష్టకష్టాలు పడి చదివిన చదువును, జ్ఞానాన్ని ఈ దేశ అభ్యున్నతి కోసం వెచ్చించిన ఆదర్శనీయుడు బాబా సాహెబ్‌. విదేశాల్లో చదువుకోవడానికి తన ఆర్థిక స్తోమత సరిపోని సమయంలో బరోడా మహారాజ్‌ శాయాజీరావ్‌ గైక్వాడ్‌ 1912లో అందించిన ఆర్థిక సహాయం బాబా సాహెబ్‌ చదువు ఆగిపోకుండా కాపాడగలిగింది. అలాంటి పెద్దపెద్ద చదువులు అంబేద్కర్‌ చదవడం వల్లనే 545 సంస్థానాలుగా ఉన్న మన దేశాన్ని ఏకతాటి మీదికి తెచ్చేందుకు ఆయన రచించిన భారత రాజ్యాంగమే ఉపయోగపడింది. అట్లా చదువుకు, జ్ఞానానికి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. అదే స్ఫూర్తి స్వాతంత్య్రానంతర భారత దేశంలో కోట్లాదిమంది అట్టడుగు కులాల ప్రజలు చదువుల బాట పట్టేందుకు దారులు వేసింది. ఆయన అందించిన స్ఫూర్తితోనే పలు తరాలు విద్యావంతులు కాగలిగారంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో 50వేలకు పైగా పుస్తకాలు చదివిన ఆరుగురు మేధావుల్లో బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ కూడా ఒకరు. అలాగే ప్రపంచ ప్రసిద్ధి పొందిన లండన్‌ లైబ్రరీలోని పుస్తకాలన్నీ చదివిన ఒకరిద్దరిలో అంబేద్కర్‌ కూడా ఒకరు. అట్లా ఆరులక్షల పేజీలు చదివి, లక్ష పేజీల సాహిత్యాన్ని సష్టించడం బాబా సాహెబ్‌కు ఉన్న జ్ఞానతష్ణకు నిదర్శనమని చెప్పవచ్చు.
రాజ్యాంగ నిర్మాత
భారత దేశానికి స్వతంత్య్రం లభించిన తరువాత ఈ దేశాన్ని పాలించడానికి ఒక సమగ్ర రాజ్యాంగం కావాలని రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేశారు. అలా ఒక బందం విదేశాల్లో ఉన్న మేధావులను సైతం సంప్రదించింది. అప్పుడు ఆ విదేశీ మేధావులు నెహ్రూ అండ్‌ టీమ్‌కు చెప్పిన మాట ‘మీ దేశంలోనే ప్రపంచ జ్ఞానాన్ని చదువుకున్న అంబేద్కర్‌ వంటి స్కాలర్‌ ఉండగా మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారని’ ప్రశ్నించారు. దీంతో రాజ్యాంగ రచన డ్రాఫ్టింగ్‌ కమిటీకి బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ను ఎన్నుకున్నారు. ఇవాళ భారత రాజ్యాంగానికి ఇంతటి విలువ, గౌరవం కలుగడానికి బాబా సాహెబ్‌ అంబేద్కరే కారణం. డ్రాఫ్టింగ్‌ కమిటీలో కొంతమంది సభ్యులు ఉన్నప్పటికి వారంతా అగ్రకులాలకు చెందిన వారు కావడంతో ఒక అంటరాని వాడు డ్రాఫ్టింట్‌ కమిటీకి ఛైర్మన్‌గా ఉంటే మేమేందుకు రాజ్యాంగం కోసం పని చేయాలని కక్షగట్టారు. రాజ్యాంగ రచనను ముందుకు పోకుండా ఆరోగ్యాలు బాగోలేవని అబద్దాలు చెప్పారు. అయినా సరే బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మాత్రం అకుంఠిత దీక్షతో రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులలో రాజ్యాంగం మొదటి డ్రాఫ్ట్‌ను తయారు చేశారు. ఇందుకోసం ఆయన తన ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోలేదు. ప్రపంచ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేశారు. భారత దేశ సామాజిక, భౌగోళిక, ఆర్థిక పరిస్థితులకు సరిపోయే రాజ్యాంగాన్ని బాబాసాహెబ్‌ రూపొందించారు. ఈ రాజ్యాంగం దేశంలో సమూల మార్పులకు కారణమైంది.
బ్రిటీష్‌ ఇండియా పాలనలో ఎన్నికలు జరిగితే అందులో ఓటు హక్కు కేవలం అగ్రవర్ణాలకు మాత్రమే ఉండేది. దీనిని మార్చుతూ అంబేద్కర్‌ కుల, మత, ప్రాంత, ఆర్థిక, పేద భేదాలకు అతీతంగా వయోజనుడైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కును కల్పించాడు. ‘ఒక ఓటు ఒకే విలువ’ అనే చారిత్రాత్మక నినాదాన్ని అమలు చేశారు. ఇందుకోసం 1932లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో అటు బ్రిటీష్‌ వారితో పాటు ఇటు గాంధీ వంటి నేతలతో సైతం అంబేద్కర్‌ ఎంతో పోరాడారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలన్న బాబా సాహెబ్‌ తీర్మానాన్ని గాంధీ తప్పుబట్టారు. నిరసనగా ఎర్రవాడ జైలులో ఆమరణ దీక్షకు దిగారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న అగ్రవర్ణ నాయకత్వం అంతా బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ను ఒత్తిడి చేశారు. గాంధీ ప్రాణాలకు ఏమైనా అయితే అది మీ మీదికే వస్తుందంటూ బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలకు పాల్పడ్డారు. అట్లా దళితులకు తాము మాత్రమే ఓటేసుకునే నియోజకవర్గాలు లేకుండా చేసిన ఒప్పందమే ‘పూనా ఒప్పందం’. బాబా సాహెబ్‌ కలలుగన్న దళిత రాజ్యాధికారాన్ని గాంధీ అండ్‌ కంపెనీ ఆ విధంగా ఆరోజు అడ్డుకోగలిగారు. అయినా సరే బాబా సాహెబ్‌ మాత్రం తన ప్రజాస్వామిక స్ఫూర్తిని ఎక్కడా వదులుకున్నదే లేదు. రాజ్యాంగ రచన ద్వారా ఈ దేశానికి ఒక దిశానిర్దేశం చేశారు. లేకుంటే ఈ దేశం ముక్కలు చెక్కలై అగ్రవర్ణ ధనికుల చేతిలో తోలుబొమ్మగా మారేది. అలాంటి పటిష్ట రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌.
హక్కుల ప్రదాత
అంబేద్కర్‌ భారత రాజ్యాంగం రాయడానికంటే ముందు మనువాదమే రాజ్యాంగంగా ఈ దేశంలో అమలులో ఉండేది. ఓటు హక్కు కేవలం అగ్రవర్ణాలకే ఉండేది. అలాంటి సమయంలో అందరికీ హక్కు ఉండాలన్న ప్రతిపాదనను రాజ్యాంగ పరిషత్‌లో బాబా సాహెబ్‌ తీసుకొచ్చారు. అది నచ్చని జాతీయ నాయకులు అనేకమంది ఆనాడు సభలో ఉన్నారు. ముఖ్యంగా సర్దార్‌ వల్లభారు పటేల్‌, బాలగంగాధర్‌ తిలక్‌ వంటి నేతలు ‘పొలం దున్నేవాడికి ఓటెందుకు… వారేమైనా పార్లమెంట్‌కు వచ్చి దున్నుతారా?’ అంటూ ఎద్దేవ చేశారు. అయినా సరే బాబా సాహెబ్‌ మాత్రం ఈ దేశంలో ఉన్న ప్రజలకు పాలకులను ఎన్నుకునే అవకాశం ఉండాలి, అప్పుడే అది ప్రజాస్వామ్య దేశం అవుతుంది. లేకుంటే మళ్లీ రాజరిక పాలనే కొనసాగుతుందని గట్టిగా వాదించాడు. అట్లా బాబా సాహెబ్‌ చేసిన అద్వితీయమైన కషి వల్లనే ఇవాళ సామాన్య ప్రజలు సైతం ధైర్యంగా తమకు నచ్చిన పాలకుడిని ఎన్నుకుంటున్నారు.
అంబేద్కర్‌ అంటే చాలామంది అగ్రవర్ణాలతో పాటు విద్యావంతులు సైతం ఆయన కేవలం దళిత నాయకుడనే ప్రచారం చేస్తారు. మరి ఈ దేశ ప్రజలందరికీ ఓటు హక్కు ఉండాలని కొట్లాడిన విషయాన్ని మాత్రం విస్మరిస్తారు. అంతే కాదు అంబేద్కర్‌ కార్మిక శాఖామంత్రిగా ఉన్నప్పుడే ఈ దేశంలో ఎనిమిదిగంటల పని విధానం ఉండాలని పోరాడి సాధించారు. అంతే కాదు ప్రతీ ఒక్కరికి స్వేచ్ఛగా జీవించే హక్కు, ఆస్తి కూడబెట్టుకునే హక్కు, రాజ్యాన్ని పాలించే హక్కు ఉండాలని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో పొందుపరిచాడు. అంతకు ముందు శూద్రులకు, అతిశూద్రులకు ఈ హక్కులేవి లేనే లేవు. అలాంటి దారుణమైన పరిస్థితుల మీద ఒకే ఒక్క కలంపోటుతో తిరగబడి తలరాతలు మార్చిన మహాశయుడు డా.బి.ఆర్‌.అంబేద్కర్‌. ఇట్లా ఈ దేశ ప్రజలందరికీ హక్కులు ప్రసాదించిన బాబా సాహెబ్‌ను, ఆ హక్కులు పొందుతున్నవారు ఏనాడో విస్మరించారు. చరిత్రను తెలుసుకోకపోవడం వల్ల అంబేద్కర్‌ను కేవలం దళితులకు పరిమితం చేసి కుదించి మొక్కుబడిగా గౌరవిస్తున్నారు తప్ప ఆయన ఈ దేశానికి చేసిన మేలును మరిచిపోతున్నారు.
వజ్ర సంకల్ప వ్యక్తిత్వం!
మహారాష్ట్రలోని చైత్యభూమిలో బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ దర్జాగా ఒక కుర్చీలో కూర్చున్న విగ్రహం ఉంది. దాని మీద ‘నా జీవిత సంఘర్షణే నా సందేశం’ అనే కొటేషన్‌ ఉంటుంది. ఆ ఒక్కమాట చాలు అంబేద్కర్‌ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి. ఆయన చేసిన యుద్ధం మామూలు యుద్ధం కాదు. ఈ దేశంలో నోరులేని కోట్లాదిమంది తరుపున ఒకే ఒక్కడై గర్జించాడు. తనను ఎందరు ఎన్ని తీర్ల ఇబ్బందుల పాలు చేసినా, ఎంతగా అవమానించినా బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ పంటి బిగువన అన్నింటినీ భరించాడు. తన వల్ల అయ్యే ప్రతీ పనిని చేసుకుంటూ వెళ్లాడు. అంతేతప్ప ఏనాడు రాజీ పడ్డదే లేదు. అలాంటి లొంగని తనం, దఢమైన వ్యక్తిత్వం ఆయన సొంతం.
నీకు నీ ప్రయోజనాలు ముఖ్యమా? నీ దేశ ప్రయోజనాలు ముఖ్యమా అంటే ఆయన నిస్సందేహంగా దేశప్రయోజనాల వైపే నిలబడ్డాడు. అట్లా ఈ దేశం కోసం ఎంతో చేసినా సరే సంకుచిత మెదళ్ల పరదాలు బాబా సాహెబ్‌ విశాల గుణాన్ని చూడలేకపోతున్నాయి. కష్టకాలాల్లో కంగిపోవడం, అవకాశాల కోసం అర్రులు చాచడం బాబా సాహెబ్‌కు తెలియవు. సమయం వచ్చినప్పుడు జాతి ప్రయోజనాల వైపు నిలబడడం, అనుకున్నది సాధించేందుకు అహరహం శ్రమించడం మాత్రమే ఆయన నమ్ముకున్నాడు. అంతేతప్ప పదవులు, అధికార దర్పం, భద్రజీవితం వంటి వాటికి లొంగిపోలేదు. ముఖ్యంగా నైతిక విలువల విషయంలో ఒక జీవన తాత్వికతను చాటి చెప్పేలా జీవించాడు. స్వార్థం అన్నమాటను కించిత్‌ కూడా దరిచేరనివ్వకుండా ప్రజాసంక్షేమమే పరమ ధ్యేయంగా జీవించాడు. అందువల్లనే ఆయన ఇవాళ కోట్లాదిమంది ప్రజలకు స్ఫూర్తిగా మారాడు. పాత విలువల స్థానంలో ప్రత్యామ్నాయ విలువలను ప్రభోధించాడు. బోధించడమే కాదు ఆచరించి చూపించాడు.
చారిత్రక పోరాటాల స్ఫూర్తి ప్రదాత!
బాబా సాహెబ్‌ తన జీవిత కాలమంతా కులవ్యవస్థ మీద పోరాడుతూనే జీవించాడు. కులాన్ని నిర్మూలిస్తే తప్ప ఈ దేశం బాగుపడదనేది ఆయన ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆయన ఎక్కడున్నా పేదల విముక్తే ధ్యేయంగా పని చేశారు. వందేళ్ల క్రితమే మూక్‌ నాయక్‌ పత్రికను స్థాపించి నోరులేనివారి తరుపున గళమెత్తాడు. కులాన్ని నిర్మూలించడానికి ఏం చేయాలో తానే స్పష్టంగా చెప్పి వెళ్లాడు. రాజ్యాధికారం కంటే ముందు ఈ దేశ ప్రజలకు మానసిక పరివర్తన అవసరమని చాటి చెప్పాడు. అందుకోసం ఎన్నో ఆత్మగౌరవ పోరాటాలు చేశాడు. వాటిలో 1927లో చేసిన మహర్‌ చెరువు పోరాటం అన్నింటికంటే ముఖ్యమైంది. దళితులు కనీసం చెరువు నుండి తాగునీరు ముట్టరాదన్న బ్రాహ్మణీయ మనువాద సంస్కతిపై ఇది తిరుగుబాటు పోరాటం. దీనికి నాయకత్వం వహించింది బాబా సాహెబే. ‘మనల్ని అంటరాని వారు అంటున్నారు కదా, సామూహికంగా వెళ్లి మహర్‌ చెరువులోని నీరుతాగుదాం రండి’ అంటూ పిలుపునిచ్చాడు. వేలాదిగా తరలివచ్చారు జనం. అట్లా బాబా సాహెబ్‌ నేతత్వంలో జరిగిన ఈ ఆత్మగౌరవ పోరాటం చరిత్ర నుదుటన చెరగని సంతకంగా మిగిలింది. ఈ దేశ ఛాందస మనువాద ఫాసిజం సిగ్గుతో తలదించుకునేలా బాబా సాహెబ్‌ ఆ పోరాటాన్ని ముందుండి నడిపించారు. విషాదం ఏమిటంటే ఆ పోరాటం జరిగి వందేళ్లు దగ్గరవుతున్నా ఇంకా కొన్ని గ్రామాల్లో దళితులను ఊరుమ్మడి బావి లేదా చెరువు నీరు కూడా తాగనివ్వని కులవివక్షత ఇంకా రాజ్యమేలుతూనే ఉంది. ఏది ఏమైనా న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం ఆత్మగౌరవంతో పోరాడి సాధించుకోవాలన్న బాబా సాహెబ్‌ స్ఫూర్తి ఇక్కడ గమనించదగింది. ఆచరించదగింది.
అలాగే బహుజనుల బానిసత్వానికి మూలం వైదిక మత గ్రంధాల్లో ఉందన్నాడు బాబా సాహెబ్‌ అంబేద్కర్‌. అందుకే వాటిని తగలబెట్టాలని కూడా పిలుపునిచ్చాడు. సమస్యకు మూలం కనుగొనాలి. పరిష్కారం అక్కడి నుండి రాబట్టాలి. ఇది బాబా సాహెబ్‌ పని విధానం. ఆయన చేసిన సుదీర్ఘ అధ్యయనంలో ఈ దేశానికి వలసొచ్చిన ఆర్యులు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసమే ఈ హిందూ పురాణ ఇతిహాసాలను రచించారని గుర్తించాడు. అందుకే ఆ ఆర్యన్‌ దేవుళ్లను పూజించవద్దని, వారి గ్రంధాలను పఠించి ఆచరించొద్దని సమాజానికి పిలుపునిచ్చాడు బాబా సాహెబ్‌. అందులో భాగంగా తాను ఎంచుకున్న పోరాటమే ‘మనుస్మతి దహనం’. మనిషిని మనిషిగా చూడనివ్వని మూర్ఖపు అమానవీయ విలువలకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న మనుస్మతిని తగలబెడితే తప్ప ఈ దేశంలో మార్పు రాదని చాటిచెప్పాడు బాబాసాహెబ్‌. 1927 డిసెంబర్‌, 25న తన అనుచరులతో కలిసి మనుస్మతిని తగలబెట్టి ఈ దేశ బహుజనులు చేయాల్సిన పని ఏమిటో చేసి చూపించాడు. అట్లా ఆత్మగౌరవ సాంస్కతిక పోరాటాల ద్వారానే ఈ దేశంలో మార్పు వస్తుంది, కులవ్యవస్థ కూలిపోతుందని బాబా సాహెబ్‌ ఎలుగెత్తి చాటాడు. దానిని ఆచరణలో చేసి చూపించాడు. ఇలా ఒకటేమిటి బాబా సాహెబ్‌ జీవితమంతా పోరాటాలతోనే గడిచింది. న్యాయంగా దక్కాల్సిన హక్కులకు అడ్డుపడుతున్న మనువాద కులవ్యవస్థను అడుగడుగునా తిరస్కరిస్తూనే ముందుకు సాగాడు. భావి పోరాటాలకు అతడు వేగుచుక్కలా నిలిచాడు.
త్యాగాల చిరునామా అతడే!
బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ భౌతిక రూపాన్ని చూస్తే చాలా గంభీరంగా ఉంటుంది. పైగా సూటు, బూటుతో కూడుకున్న ఆహార్యం మరింత హుందాతనాన్ని ఇస్తుంది. దీనిని చూసి చాలా మంది బాబా సాహెబ్‌ గోల్డెన్‌ స్పూన్‌తో పుట్టి పెరిగినట్టు భ్రమిస్తారు. కానీ, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ జీవితమంతా కష్టాల కన్నీటిమయం. ఆయన బాల్యంలో కుల అవమానాలు ఎన్ని ఎదుర్కొన్నాడో ఆర్థిక ఇబ్బందులు కూడా అంతే ఎదుర్కొన్నాడు. కనీసం ఇంట్లో పడుకోవడానికి జాగ కూడా లేకుంటే రాత్రంతా చదువుతూనే కూర్చుండే వాడు. తెలతెల్లవారుతుండగా వారి తండ్రి లేదా కుటుంబ సభ్యులు పనులకు వెళ్తే ఖాళీ అయిన ఆ జాగాలో బాబా సాహెబ్‌ నిద్రించేవాడు. అలాగే లండన్‌తో పాటు కొలంబియా యూనివర్సిటీలో మంచినీళ్లు తాగి కడుపు నింపుకొని చదివేవాడు. ఒక సందర్భంలో పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. తన భార్య రమాబాయికి ఉత్తరం రాశాడు. తన దగ్గర ఏమైనా డబ్బులుంటే పంపమన్నాడు. ‘నా దగ్గర కొద్ది డబ్బులే ఉన్నాయి. పైగా మన అబ్బాయి జ్వరంతో ఉన్నాడు, హాస్పటల్‌కి తీసుకువెళ్లకపోతే మన కొడుకు దక్కడండి’ అని ప్రత్యుత్తరంలో తెలిపింది రమాబాయి. అందుకు బాబా సాహెబ్‌ మరో ఉత్తరంలో ‘రమా… నువ్వు మన అబ్బాయిని హాస్పటల్‌కు తీసుకెళ్లకుంటే పోయేది మన కొడుకు ప్రాణమే. అదే నా చదువు ఆగిపోతే ఈ దేశంలో రేపు చాలా మంది బిడ్డలు చచ్చిపోతారు’అని రాశాడు. అలా ఈ సమాజంలో అట్టడుగున ఉన్నవారి కోసం సొంత బిడ్డలను చంపుకున్న త్యాగం బాబా సాహెబ్‌ది.
అంతేకాదు తాను మినిస్టర్‌ అయ్యాక ఈ దేశంలో మహిళలకు అన్నింట్లో పురుషుడితో సమానంగా హక్కులు ఉండాలని పోరాడాడు. పార్లమెంట్‌లో అందుకోసం ‘హిందూకోడ్‌ బిల్లు’ తెచ్చాడు. కానీ, అది అగ్రవర్ణ నేతల కారణంగా వీగిపోయింది. దీంతో కలత చెందిన బాబా సాహెబ్‌ ఏకంగా తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేశాడు. ప్రజలే ముఖ్యమని భావించి కేంద్ర మంత్రి పదవిని సైతం తణప్రాయంగా వదిలేసిన త్యాగశీలి బాబా సాహెబ్‌. ఎందుకంటే ఏ దేశ అభివద్ధి అయినా ఆ దేశ మహిళల చైతన్యం ద్వారానే కొలుస్తాను అన్నాడు బాబా సాహెబ్‌. అందుకే తాను మహిళా పక్షపాతిగా నిలబడ్డాడు. ఇవాళ మహిళా బిల్లు మేమే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నవాళ్లు, బాబా సాహెబ్‌ హిందూకోడ్‌ బిల్లు తెచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారనేది ప్రశ్న. ఇట్లా బాబా సాహెబ్‌ జీవితమంతా త్యాగాలతోనే గడిచింది. ప్రజా సంక్షేమమే ముఖ్యమని భావించినప్పుడు తాను తన కుటుంబాన్ని సైతం లెక్కచేయలేదు. అందుకే ఆయన త్యాగం ముందు ఈనాటి రాజకీయ నేతలు ఎవ్వరూ కూడా సాటి రారనేది పచ్చి వాస్తవం.
చరిత్రను తిరగరాసిన మేధావి
అంబేద్కర్‌ చేసిన మేధో శ్రమ అన్నింటికంటే ముఖ్యమైన విషయం. ఇదే అంబేద్కరిజం. ఆయన ఈ దేశవిముక్తి కోసం ఎంతో దూరదష్టితో ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చాడు. ముఖ్యంగా తన రచనలు, ప్రసంగాల ద్వారా ఈ జాతులను చైతన్య పరచాలని సంకల్పించాడు. అందుకు ఎంతో నిబద్ధతతో అనేక విషయాలను అధ్యయనం చేసి పరిశోధనాత్మకంగా చరిత్రను పునర్‌ వ్యాఖ్యానించాడు. సింధూ హరప్ప నాగరికత నుండి భారత స్వాతంత్య్రోద్యమ ఘట్టాల దాకా ప్రతీ సామాజిక, రాజకీయ సందర్భాన్ని తనదైన దష్టికోణంతో విశ్లేషించాడు. అయితే ఈ విలువైన రచనలను బ్రాహ్మణ మేథో వర్గం అంతగా వెలుగుచూడకుండా చేయాల్సిన కుట్రలన్నీ చేశాయి. ఇక ఇప్పుడు గడిచిన రెండు మూడు దశాబ్దాలుగా మాత్రం అంబేద్కర్‌ రచనలు చదవడం అనేది ప్రతిష్టాత్మక పనిగా మారింది. ప్రతీ సమస్యకు బాబా సాహెబ్‌ ఆనాడు ఏం చెప్పాడని చూడాల్సిన అనివార్యత ఆయన రచనలు కలిగిస్తున్నాయి. అందుకే అరుంధతీరాయి అంబేద్కర్‌ కులనిర్మూలన గ్రంథానికి ముందుమాట రాస్తూ ”ఒక్క అంబేద్కర్‌ చాలు.. ఈ భారత దేశానికి” అంది. అంటే అంతటి లోతైన అధ్యయనం బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ది. కాలాతీతంగా నిలబడగల శక్తి ఆయన రచనలకు ఉన్నాయన్నది కాదనలేని సత్యం. అందుకే ఆయన రచనలు చదువుకున్న వారెవ్వరూ ఆయనను విస్మరించలేరు. అట్లా బాబా సాహెబ్‌ను చదువుకున్న ప్రపంచ దేశాలు ఇవాళ ఆయన కషిని వేనోళ్ల కొనియాడుతున్నాయి. కొలంబియా యూనివర్సిటీలో ఏకంగా ఆయన విగ్రహం నెలకొల్పారు. ఇది అరుదైన ఘనత. అమెరికా వంటి ఒక అగ్రరాజ్యంలో బాబా సాహెబ్‌ అంబేద్కర్‌కు దక్కిన సమున్నదత గౌరవం. ఇక ఆయన పుట్టిన ఏప్రిల్‌ 14ను సైతం ‘వరల్డ్‌ నాలెడ్జ్‌ డే’గా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటు ఐక్యరాజ్య సమితి సైతం పేర్కొంది. ఆయన జయంతి వేడుకలను అధికారికంగా పలు దేశాలు నిర్వహిస్తున్నాయంటే దానికి ఆయన మేధో సంపత్తి, జ్ఞాన ఉత్పత్తే కారణం. బాబా సాహెబ్‌ 1956 అక్టోబర్‌ 29నాడు ఐదు లక్షల మందితో బౌద్దాన్ని స్వీకరించాడు. అందుకు కారణం స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతత్వం విలువలకు నిలయంగా బౌద్ధమతం వర్థిల్లడమే.
ఏది అసలైన నివాళి..?
బాబా సాహెబ్‌ ఈ దేశం కోసం ఎంతో చేశారు. ముఖ్యంగా గొప్ప రాజ్యాంగాన్ని అందించారు. ఇవాళ అది ప్రమాదంలో పడే పరిస్థితులు దాపురించాయి. క్రమంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్రలు నిత్యకత్యం అవుతున్నాయి. కావున ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవాలి. మన ఇళ్లల్లో పవిత్ర మత గ్రంథాలు ఉన్నట్టు రాజ్యాంగం కూడా ఉండాలి. ఇక బాబా సాహెబ్‌ రచనలను, ప్రసంగాలను చదవాలి. ఆయన స్ఫూర్తిని గడపగడపకు తీసుకెళ్లాలి. పాలకులు విగ్రహాలు పెట్టి చేతులు దులుపుకోవచ్చు. పౌర సమాజం మాత్రం ముందు బాబా సాహెబ్‌ను గురించి లోతుగా తెలుసుకునేందుకు కషి చేయాలి. ఆయన అందించిన స్ఫూర్తితో ఈ దేశాన్ని ముందుకు నడపాలి. అందుకు లౌకిక ప్రజాస్వామిక శక్తులంతా ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైంది. కలిసికట్టుగా ఒక గొప్ప భరోసాను బాబా సాహెబ్‌ మార్గంలో రేపటి తరాలకు అందించాల్సిన చారిత్రక అవసరం మన ముందు ఉంది. సనాతనం పేరుతో ఈ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఓట్ల కోసం మతాన్ని రాజకీయంగా మార్చే దుష్టశక్తులను ప్రతిఘటించడమే బాబా సాహెబ్‌ అంబేద్కర్‌కు మనం అందించే నిజమైన నివాళి. ఆ మహా త్యాగ శిఖరానికి జేజేలు. పూలే, అంబేద్కర్ల స్ఫూర్తితో ఆత్మగౌరవ పోరాటాలు వర్థిల్లాలి.
– డా||పసునూరి రవీందర్‌
77026 48825 
మహా జ్ఞాని బాబాసాహెబ్‌

ఆలోచన ఆకాశమంత
జ్ఞానం అందనంత
ఎవరికైనా సాధ్యమా
బాబాసాహెబ్‌ అంత…

నిచ్చెన మెట్ల కులపీడన
సర్వం బ్రహ్మ సష్టియన్న
కుహనా సంస్కతుల ఎదురు దాడులు

సిద్ధార్థ, ఫూలే, పెరియార్‌, నారాయణగురు…
అడుగు జాడలు
మార్క్స్‌, హెగెల్‌, గెలీలియో, డార్విన్‌…
నిత్య సత్య శోధన

దోపిడీ దురహాంకార దుష్టుల
గుండెలు పిండంగా…

సర్వశక్తులొడ్డి
సాటి లేని, పోటి లేని
ధీటైన సమాధానం
మా బాబా సాహెబ్‌

జ్ఞానానికే ప్రతీక
సపరిత్యాగ సంఘసంస్కర్త
సామాజిక న్యాయ నిర్ణేత
ప్రపంచ అగ్ర రాజ్యాంగ నిర్మాత
ఇజం నేర్పిన భారతరత్న
మా బాబా సాహెబ్‌

విశ్వ సత్యమెరిగిన విశ్వంభర
అవని మెచ్చిన అవనీష
సహదయ భాష్కర
సర్వే జన భవదీయ
సమైక్య స్వరాగ
సుజ్ఞాన చిరాగ
మా బాబా సాహెబ్‌

ఓ స్వరాజ్య స్వాప్నిక!
మీ అడుగు జాడలే మా జ్ఞాపిక
మిము విడిచి మేము లేమిక
మిము విడిచి మేము లేమిక
– మహేష్‌ దుర్గే, 9700888972

]]>
న‌వ వ‌సంతాన్ని కొత్త‌గా ఆహ్వా‌నిద్దాం https://navatelangana.com/lets-invite-a-new-spring/ Sat, 06 Apr 2024 18:11:18 +0000 https://navatelangana.com/?p=263913 Let's invite a new springకుటుంబ జీవితంలో మనిషి రోజూ బతకడానికి తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది. ఈ ఆహారం తీసుకునే విధానం ఒక్కో ప్రాంతానికి, ఒక్కో మనిషికి ఒక్కో విధంగా ఉంటాయి. కొందరు రొట్టె, కూర, పప్పు తింటారు. కొందరు అన్నం పచ్చళ్ళు కూరలు, పప్పు వంటి రకరకాల పదార్థాలతో తింటుంటారు. అట్లాగే ఆచార వ్యవహారాలు కూడా మనిషి జీవితంతో ముడిపడి ఉంటాయి. ఒక్కో మతంలో ఒక్కో తీరు, ఒక్కో కులంలో ఒక్కో తీరు పద్ధతులను ఆచరిస్తూ ఉంటారు. ఈ ఆచారాల ప్రభావం… అవి పాటించేపుడు ఎలాంటి విషయాలు ఎదురవుతాయి, కొత్తగా వస్తున్న మార్పులు ఏమిటి? పూర్వపు ఆచారాలు, ఆలోచన ఎలా ఉండేవో చూడాలి. ఇవన్నీ కుటుంబ విషయాలలో ఎలాంటి ప్రాధాన్యత సంతరించుకొని ఉంటాయో చూడాలి. ప్రవర్తన, విధానాలు, పరిణామాల వంటివి ఈ ఉగాదితో సమన్వయం చేసుకుంటూ సాగుదాం.

ఐన్‌ స్టీన్‌ ఒక మాట అన్నాడు, »»Science without religion is lame, religion without science is blind” అని. నిత్య జీవితానికి విస్తృత అర్థం చెప్పే ఉద్దేశం కాదు కానీ, కొంతనైనా భౌతిక శాస్త్ర దృష్టి, కొంతనైనా తత్త్వజ్ఞానమూ, ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నటువంటి మననుషులు కాస్త ప్రత్యేకంగా ఉంటారు. విశాలభావాలు కలవారికి ఈ పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుంది. భారతీయ సంప్రదాయంలో తెలుగువారికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. భారతీయ శాస్త్రవేత్తలు భారతీయ కాలమాన ప్రకారం, అంతరిక్ష, ఖగోళ, భూగోళ శాస్త్ర విజ్ఞానంతో వాళ్ళ జీవన విధానానికి కొన్ని పద్ధతులు, నియమాలు ఏర్పరుచుకున్నారు. ఏడాదికి 360 రోజులని అరవై ఏళ్ల చక్రాన్ని ఏర్పాటు చేశారు. ఏడాదికి 12 నెలలు అని, ఇది సూర్య శక్తి రూపానికి నెలవైన ‘కాలం’ అని అన్నారు. నెలకు 30 రోజులని, 24 గంటలు ఒక రోజు అనీ 60 నిమిషాలు 1 గంట అనీ ఇలా చెప్తూ, వాటికి పేర్లు కూడా పెట్టారు. విశ్వంలో కోటానుకోట్ల నక్షత్రాలున్నా, చంద్ర గమనంతో 27 ముఖ్యమైన నక్షత్రాలను గుర్తించి, పేర్లనుపెట్టి, ఆ పేర్లను రోజులకు తిథులు’గా అన్వయించి సూత్రీకరణ చేసుకున్నారు. ఈ వివరాల్లోకి పోకుండా, కొన్ని విషయాలను స్పృశిస్తూ సాగుదాం.
వసంత, గ్రీష్మ, వర్ష, శరత్‌, హేమంత, శశిర ఋతువులు ఆరు అని, సంవత్సరానికి 12నెలలలో రెండేసి నెలలు ఒక ఋతువు అని పేర్లు నిర్ణయించారు. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం నెలల పేర్లు పెట్టారు. పాడ్యమి నుండి అమావాస్య వరకు 15 రోజులను కృష్ణపక్షం అని, మళ్ళీ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు 15 రోజులు శుక్లపక్షం అని అన్నారు. పదిహేను రోజులను పక్షం అంటారు. నెలకు 2 పక్షాలు. రెండు చంద్రోదయాల మధ్య కాలాన్ని తిథులతో లెక్కిస్తారు.
ఈ రోజుల నడక అంతా ఇలా పేర్కొన్నారు. మరి కాస్త వివరాల్లోకి వెళ్తే, సూర్యగమనంతో ఏర్పడే వాతావరణాన్ని బట్టి ఋతువులు ఏర్పడతాయి కాబట్టి, వసంత ఋతువు, (Spring) ఉండే చైత్ర, వైశాఖ మాసాల్లో చెట్లు చిగురించి పూలుపూసి ఆహ్లాద వాతావరణం ఉంటుంది. గ్రీష్మ ఋతువు(Summer) జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో ఎండలు బాగా కాస్తాయి. వర్ష ఋతువు (Monsoon) శ్రావణ, భాద్రపద మాసాల్లో వానలు ఎక్కువగా కురుస్తాయి. శరదతువు (Autumn) ఆశ్వయుజ, కార్తీకమాసాల్లో వెన్నెల బాగా ఉంటుంది. హేమంత ఋతువు (Winter) మార్గశిర, పుష్య మాసాల్లో మంచు బాగా కురుస్తూ చల్లగా ఉంటుంది. శిశిర ఋతువు (Fall) మాఘ, ఫాల్గుణ మాసాల్లో చెట్లు ఆకులు రాల్చి మోడు వారి పోతాయి. ఈ ఋతువులనే మూడు కాలాలుగా నిర్ణయించారు. 1. వేసవి కాలము, 2. వర్షాకాలం, 3. శీతాకాలం అంటూ ఒక్కొక్క కాలం నాలుగు నెలలు. ఇవన్నీ ప్రకృతి ధర్మాలను అనుసరించి శాస్త్రవేత్తలు నిర్ణయించిన పేర్లు. తెలుసుకోవడానికి అయినా చెప్పడానికైనా సులువైన మార్గంగా ఉండేలా నిర్ణయించారు. ఇలా ఋతువులు, తెలుగు నెలలు, తెలుగు సంవత్సరాలు అంటూ పేర్లు పెట్టారు. మొదటి ఆరు నెలలకు ఉత్తరాయణం, తర్వాత ఆరు నెలలకు దక్షిణాయణం అంటూ పేర్లు పెట్టారు. వాతావరణ, జీవావరణ శాస్త్రాలను పరిగణించి ఇటువంటి విభజన చేశారు. ఇదంతా కూడా ప్రకృతిలో వాతావరణ మార్పులు సూర్యచంద్రుల గమనాల వలన ఏర్పడినవిగా గుర్తించారు. సూర్యచంద్రుల అక్ష సంబంధ విషయాల ఈ సౌరమాన విషయాలన్నీ భూ పరిగ్రహ ఆధారంగా వైవిధ్యమైన కాలానుగుణం మార్పులను బట్టి నిర్ణయించారు. ఈ కొలతలు, పరిస్థితులు అన్నీ కూడా భూ ఉపరితలం మీద ఉండే భూమధ్య రేఖ ఉత్తర దక్షిణ ధ్రువాల ఊహారేఖ వంటివన్నీ సశాస్త్రీయంగా చెప్పినవే. అంతరిక్షంలో ఉండే ఇతర గ్రహాలకు, నక్షత్రాలను, ఖగోళ వస్తువులను, కక్ష్యలో తిరిగే భూ భ్రమణాన్ని గణిత పరంగా నిర్ధారించి చెప్పినవే. వీటినే ప్రజలు వాతావరణంలో వచ్చే ఆయా మార్పులకు అనుగుణంగా ఆచారాలను, సంప్రదాయాలను ఏర్పరచుకున్నారు. ఈ కోణంలో కూడా ఉగాది పండగ చరిత్ర తెలుసుకోవాలి.
ఓ 450 కోట్ల సంవత్సరానలకు పూర్వం భూగోళం పుట్టిందని అంటారు. జలచరాలు జంతువులు, మనుషులలో ఎన్నో పరిణామాల జరిగాయి. ఆది మానవులు ఎన్నో దశలను దాటుకుంటూ ఆధునిక మాడవుడై రాతియుగం నుండి రాకెట్‌ యుగం వరకు చేసేదే నిరంతర ప్రయాణం. ఎన్నో అభ్యసనలతో, ఎన్నో ప్రయోగాలతో ముందుకు సాగుతున్న జీవనమిది. అన్నీ తెలిసినా మరోసారి తలుచుకోవాలి, ఉగాది గురించి తెలుసుకోవాలి.
ఉగస్య ఆది ఉగాది. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం అనీ, జన్మ అని, ఆయుష్షు అని అర్థాలున్నాయి. మనందరికీ తెలిసిందే ‘ఆది’ అంటే మొదలు అని.
ఉగం+ఆది=ఉగాది. హిందూ ఆచారాలలో ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు ఈ ఉగాది, యుగాది సంవత్సరం మొదటి రోజు, చైత్ర పాడ్యమి రోజున ఉత్సవంగా జరుపుకోవడం ముఖ్య ఆచారం. యుగాదే ఉగాది. ఈరోజున్నే సృష్టి జరిగిందని నమ్ముతూ ఏర్పరచిన విశేషమైన రోజు. మార్చ్‌ నెల చివరలోనో, ఏప్రిల్‌ నెల మొదట్లోనో ఉగాది వస్తుంది.
ఆకాశంలో గాలి లోపల చలనాంశాణువులు ఉంటాయి. అగ్నిలో తేజోంశాణువులు ఉంటాయి. అలాగే ద్రవంశ్యాణువులు నీరులో ఉంటాయి. కఠినాంశాణువులున్న భూమి వీటికి ధీటుగా ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి ఉండడం వలన నిశ్చలత్వంతో తన చుట్టూ తాను తిరుగుతూ ప్రాణులకు నిలయమై ఉన్నది భూమి. ఈ పంచభూతాలు సకల జీవకోటికి నిలయం. ఇదో ఎండ్‌ లెస్‌ జర్నీ. పరస్పర విరుద్ధంశాలను మనిషి తనదైన యుక్తితో సమన్వయం చేశాడు కాబట్టే బ్రహ్మాండ జ్ఞానాన్ని అక్షర రూపంలో నిక్షిప్తం చేశాడు. ఆకాశంలో బుద్ధి, చిత్రం, గ్యాత, అహంకారం, మనస్సు అనే ఐదింటిని కలిపి పంచాకాశం అంటుంటారు. నీటిలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఉన్న జల పంచకంగా చెప్తూ ఉంటారు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం అనే పంచకాలను జ్ఞానేంద్రియాలు చెప్పేదే అగ్ని పంచకాలు. ప్రాణ, అపాన, ఉదాన, జ్ఞాన సమానాలకే వాయు పంచకాలుగాను, ప్రాణ పంచకాలుగాను చెప్తారు.
ఇలాంటివి తెలుసు కోవాలి. ఇవన్నీ కూడా విజ్ఞానాన్ని అందించేవే. ఈ పంచభూతాలు ప్రతి జీవికి అవసరం. పరస్పర విరుద్ధాంశాలను మనిషి తనదైన యుక్తితో సమన్వయం చేసాడు.
అట్లాగే కాళ్లు, చేతులు, వాక్కు, మల, మూత్ర ద్వారాలైన కర్మేంద్రియాలను పంచభూతాలుగా చెప్తారు. మనస్సు ప్రత్యేకమైనది. ఇట్లా అన్ని విషయాలు చెప్తూ, సమస్త జ్ఞాన ప్రకాశాన్ని తనదైన తెలివిడితో ప్రకృతికి, వాతావరణానికి జతచేసి, తన ఆరోగ్యానికి, ఉనికికి, అవసరాలకి సంబంధించిన విషయాలను పండుగలుగా పేర్లు పెట్టి, ఉత్సవ నియమాలతో ఉత్సవ క్రియలను జరుపుకునే విధానాన్ని ఏర్పరిచాడు మనిషి. ఏ పండగ తీసుకున్నా వాటికి సంబంధించిన ఆహార విషయాలు, ఆచరణ విషయాలు ఇవే చూపిస్తాయి. దీన్నే ఇంటలిజెన్స్‌ అంటారు. అంటే మహాతత్వం అన్నట్టు! ఇదే విద్యా విజ్ఞాన లక్షణమన్నట్టు! వీటితో అరిషడ్వర్గాలుగా నిర్ణయించిన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జతచేసి ఆరు రుచులు అంటే షడ్రుచులకు పోలికను చెప్పి మనిషి గుణాలకు రుచులకు సమన్వయం చేశారు. కోరిక, కోపం, వ్యామోహం, అనురక్తి, కండకావరం, ఓర్వలేని తనం అనే ఆరు గుణాలు అంత: శత్రువులుగా పనిచేస్తూ మనిషిని నడిపిస్తుంటాయి. ఇవి సత్వ, రజో, తమో గుణాలతో చెప్పి మనిషిలోని ఇంద్రియాలకు అధ్యక్షస్థానంలో ఉన్న మనసుని మొట్టమొదలు చెప్తారు. ఈ మనస్సుకు చంద్రుని ప్రభావం ఉండడానికి కారణాలను చెప్తారు. కఠినత్వం, గర్వితం కలగల్సిన అహంకారం ఆధారంగా అరిషడ్వర్గాలు పనిచేస్తుంటాయి. భావ వికారాలు, భావ వినోదాలు ఉంటాయి. ఇవి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల ప్రేరణతో ప్రభావం చూపుతాయి.
భూమ్యాకర్షణ భూతాకాశ శక్తికి, చిత్తాకాశానికి చంద్రునికి, చిదాకాశం సూర్యునికి, నిరాకాశం గెలాక్సీ (Galaxy) అని పేరుతో పిలువబడే నక్షత్రం మండలానికి నిర్ణయించారు. సూర్యుని ఉష్ణ శక్తి, చంద్రుని శీతోష్ణ శక్తి అన్ని ప్రాణులపైన ప్రభావం చూపుతాయి కాబట్టే ప్రకృతి సంబంధితమైన వస్తు గుణ విశేషాలను లెక్కలోకి తీసుకున్నారు. వీటన్నింటి అనుసంధానమే ‘ఉగాది’. Gravitational force, Nuclear force, Electromagnetic force అనేవి శక్తి ప్రేరకాలు. ఇవి దేశ, కాలాలకు సమన్వయించి ఒక సూత్రంలోకి తెచ్చిన భౌతికశాస్త్ర జ్ఞానానికి అద్దం రూపే ఈ ‘ఉగాది’. ప్రాణం మనస్సు ఇంద్రియాల కూడికనే ‘ఉగాది’.
ఫాల్గుణ మాసం వెళ్ళగానే చైత్రమాస ప్రథమ తిథి అయిన పాడ్యమి రోజున సంవత్సరానికి మొదటి రోజుగా పరిగణిస్తారు. ఇదే వసంత ఋతువు ప్రారంభం. వసంత ఋతువు కంటే ముందు శిశిర ఋతువు ఉంటుంది. చెట్లన్నీ ఎండిపోయి ఉన్న పరిస్థితి నుండి ఒక్కసారిగా చిగురులెత్తి ప్రకృతి మొత్తం అందంగా కనిపించే ఋతువు వసంత ఋతువు. పక్షి సంతతి, జంతు సంతతి పరవశించిపోతుంది. పచ్చని మామిడి చెట్లను చూసి కోయిలలు రాగాలెత్తుతాయి. మనుషులు ఈ శోభాయమానంగా సిద్ధమవుతున్న ప్రకృతిని చూసి చైతన్యాన్ని పొందుతారు. ఈ చైతన్యం అంకురించి ఆశయాలకు దారి చూపే ఋతువు అవుతుంది. అందుకే ఉగాదిని చాలా శ్రద్ధగా నిర్వహిస్తారు.
ఉగాది పచ్చడి:-
మనుషులు ఆశా జీవులు. ఏడాది మొత్తం ఏమేమి జరుగుతుందో తెలుసుకోవాలని కుతూహల పడుతుంటారు. తెలుసుకొని ఏం చేస్తారు? జరిగేది జరుగుతుందని ఊరుకోరు. మానవ ప్రయత్నం కొంతైనా చేయాలనంటారు. ఇది ఓ సాధారణ విశ్వాసం. అందుకే ఆరు రుచులతో ఉగాది పచ్చడిని చేసుకొని తినడంతోపాటు పంచాంగ శ్రవణం చేయడమూ చూస్తాం.
ఉగాది పచ్చడిలో ‘మాధుర్యం’ అంటే తీపి- చెరుకు, బెల్లం. ‘ఆమ్లం’ అంటే పులుపు – కొత్త చింతపండు రసం. ‘లవణం’ అంటే ఉప్పు. ‘కటు’ అంటే కారం- మిరియాలు. ‘తిక్త’ అంటే చేదు- వేప పువ్వు. ‘కషాయం’ అంటే వగరు – లేత మామిడికాయలు. ఇవే ఉగాది పచ్చడికి కావలసిన మూల పదార్థాలు. పలుచని కొత్త చింతపండు రసంలో వేప పువ్వు రెక్కలు, చిన్ని మామిడికాయ ముక్కలు, కాసింత మిరియాల పొడి, సరిపడేంత కొత్త బెల్లం, చెరుకు గడల ముక్కలు, చిటికెడంత ఉప్పు వేసి కలిపి చేసిన ‘పచ్చడిని’ నైవేద్యంగా పెట్టి తర్వాత అందరూ ఈ ‘ఉగాది పచ్చడి’ని సేవిస్తారు. తెల్లవారుజామునే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని తల స్నానాదులు చేసి, కొత్త బట్టలు కట్టుకొని దైవ ప్రార్థన ముగించుకొని, రకరకాల పిండి వంటలను వండుకొని కుటుంబ సభ్యులందరూ కూర్చొని ఆనందంగా భుజిస్తారు. సాయంకాలం గుడికి వెళ్లి దైవ దర్శనం చేసుకుని పంచాంగ శ్రవణం విని మంచి చెడులను తెలుసుకుంటారు. ఇష్టమైన వాళ్ళను కలుసుకోవడం, పెద్దవాళ్లకు కాళ్లకు మొక్కి దండం పెట్టుకోవడం, గోపూజ చేయడం వంటివి ఆనవాయితీ! ‘ప్రభవ’ నుండి ‘అక్షయ’ వరకు ఉన్న 60 సంవత్సరాల పేర్లలో ‘క్రోధి’ 38 వది. 1965లో క్రోధి నామ సంవత్సరం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది. మనుషులలో క్రోధాన్ని కలిగిస్తుందన్న అర్థంతో ఉన్న ఈ పేరు లోని పరమార్ధాన్ని గ్రహించాలి. క్రోధం ఎందుకు వస్తుంది? ఎవరిపై వస్తుంది? క్రోధం వస్తే లాభాలేంటి, నష్టాలేంటి అనేది ఎవరికి వారే ప్రశ్నలు వేసుకొని ఒక మంచి అవగాహనకు రావాలి. క్రోధాల వల్ల ఏ ఉపయోగాలు ఉండవు. అనారోగ్యాలు వస్తాయి! అలసటలు తెస్తాయి!! ఆనందాలను పోగొడతాయి!!! ఇది అర్థమైతే చాలు. ‘ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దాన్‌ క్యూర్‌’ అని మన పెద్దలు ఎందుకు అన్నారు? ఇందుకే! ఏదో చెడు రాబోతుంది అని తెలిసినప్పుడు జాగ్రత్త పడితే ఆ చెడు నుంచి కొంతనైనా మనల్ని మనం రక్షించుకుంటాం. రక్షించుకునే ప్రయత్నం చేయాలి. కాస్త ఓపిక, మరికాస్త మంచితనం జత చేసామంటే అన్ని చికాకులను అధిగమించవచ్చు అనేది ‘ఉగాది’ నేర్పించే పాఠం.
2024 ఏప్రిల్‌ 9న ఉగాది పండుగ. మనసుపై స్వీయ నియంత్రణ లేకపోవడం, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అత్యాశ, ఆత్రుత వంటివి విషయాసక్తులుగా ఉండడం వలన మనుషులు అధ:పతనానికి పడిపోతుంటారు. ఇది గుర్తెరిగితే చాలు. పర్యావరణాన్ని పాడు చేసుకోవడం వలన ప్రకృతి ప్రకోపిస్తుంది. ఎండలు అధికమైనా, వానలు అతిగా కురిసినా. అత్యధిక చలి పెరిగిన పర్యావరణాన్ని పాడుచేసే మనుషులే కారణం. ఇదే తమస్సు. అంటే చీకటి. ఆ చీకటి నుంచి వెలుగులోకి పయనిద్దాం.
పిల్లాపాపలతో తల్లిదండ్రులతో హాయిగా ఉండే కుటుంబ జీవితాలను హదయపూర్వకంగా ఆచరిద్దాం. పండగలలో కుటుంబ సభ్యులంతా కలిసిమెలిసి పని చేసుకునే సామరస్య జీవితానికి గొప్ప హేతువులు పండుగలు. శోభకృత్‌ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి ‘క్రోధ’ నామ సంవత్సరానికి ఈ ‘ఉగాది’ పండుగ నాడు ఆహ్వానిద్దాం. ఈ నవవసంతాన్ని కొత్తగా ఆహ్వానిద్దాం.

– డా|| కొండపల్లి నీహారిణి,
9866360082

నిండైన పండుగ!
ఉరుకుల పరుగుల రణగొణ ధ్వనుల్లో
మనల్ని మనం మరచిన వేళ
చెట్టు చెట్టుకీ ఎవరో పిలుస్తూ ఉంటే
అప్పుడు గుర్తొస్తుంది ఆ స్వరమధురం!
ప్రకతి ధర్మానికి పలికే కోయిల రాగం
అర్థమయ్యేక తీయటి ఆలోచనలతో
గుండెల్లో ఆనందానుభూతి ప్రవహిస్తుంది
సూర్యుడే చెబుతాడు వెచ్చగా గిచ్చి మరీ
పూత పరదా కప్పుకొని వేపచెట్టు
పిందె సరదా చెప్పుకొని మామిడిచెట్టు
నూతన వత్సర ఆగమనంగా కనబడగానే
మనసుల్లో పండుగ కళ వెలుగుతుంది
మధుమాసంలోని మాధుర్యమంతా
పుణికి పుచ్చుకొని ఆబాలగోపాలాన్ని
పులకాంకితుల్ని చేసేదే ఉగాది!
పచ్చదనం చిగుర్లు తొడిగిన కొమ్మకొమ్మన
కోకిలమ్మలు సన్నాయి పాడుతుంటే
ఇళ్ల ముంగిట రంగవల్లులు ఒద్దికగా ఒదిగితే
ద్వారాలు మామిడి పత్రహారాలతో
మంగళద్వానాలు పలుకుతుంటే
క్రోధి ఉవ్వెత్తున ఎగసే కడలి తరంగంలా
తెలుగు వాళ్ళ జీవితాల్ని ఆనందాబ్ధిలో
ముంచి ఓలలాడిస్తుంది..
కొత్త వస్త్రాలు పిండి వంటలు ఓ పక్క
జీవన పార్శ్వాల్ని జిహ్వకు పరిచయం
చేసేటి షడ్రుచుల పచ్చడి మరో పక్క
తెలుగు వారి జీవితాల్లో తెలిరేకయై
విచ్చుకొని వికసింపచేస్తుంది ఉగాది!
– భీమవరపు పురుషోత్తమ్‌, 9949800253

యాది
ఉగాది.. నాకు బాగా యాది
కుమ్మరి బాలయ్య తాత
కుండిచి పోయేది
మా ఊరి సిక్కులోని తొట్ల
మామిడి కాయలు తెచ్చెది
ఇంటేనుక ఉన్న యపచెట్టుకు
పువ్వు తెంపేది
సంతన్న దుకడ్ల
సరుకులు తెచ్చది
పచ్చడి కమ్మగా జేసేది
వడకట్టు అంతా పంచేది
దో స్తుగాల్లు అడిగి మరీ తాగేది
గిప్పుడు ఏది గా ఉగాది..
ప్లాస్టిక్‌ డబ్బాల
రుచి లేని పచ్చడి
వడకట్టు అంతా వెతికినా
తగేటో ల్లేరి
పండగకు ఊరికి
వచ్చేదే మరిచిరి
వాళ్ళు ఇప్పుడు
పట్నంలో వలస
పక్షులు మరీ
గాప్పటి ఉగాది
మరచిపోని యాది…!

– ఏ. అజయ్‌ కుమార్‌

]]>
మేమూ మ‌నుషుల‌మే… https://navatelangana.com/we-are-human-too/ Sat, 30 Mar 2024 17:42:19 +0000 https://navatelangana.com/?p=259132 We are human too...2010 దశకం లో అమెరికా ట్రాన్స్‌ రైట్స్‌ కార్యకర్త రేచెల్‌ క్రాండల్‌, మిచిగాన్‌ నుండి ఇచ్చిన పిలుపు మేరకు నవంబర్‌ 31 అంతర్జాతీయ ట్రాన్సజెండర్‌ విజిబిలిటీ దినంగా పాటించే సంప్రదాయం మొదలయింది. సమాజంలో ట్రాన్సజెండర్‌ వ్యక్తుల పట్ల జరిగే వివక్షత, హింస, అసమానత, అస్పశ్యతలకు వ్యతిరేకంగా ఒక బలమయిన సమిష్టి స్వరంతో పాటుగా సమాజంలో ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల పై ఉన్న అనుమానాలు, భయాలు, భ్రాంతులు పారద్రోలి వారికి కూడా సమానంగా స్వేచ్ఛ స్వాతంత్రాల వాతావరణం సష్టించాలి అనే దక్పథంతో ఈ రోజును పాటించటం ప్రారంభమయింది.
ఈ నేపధ్యంలో తెలంగాణ లో ప్రవిఢవిల్లిన LGBTQIH ఉద్యమంలో ట్రాన్స్‌ విప్లవం యొక్క అభివద్ధి దాని పుట్టుక, ట్రాన్సు సముదాయ జీవనం, సామాజిక, ఆర్ధిక, రాజకీయ సాంస్కతిక అభివద్ధికి సంబంధించిన మార్పులు చేర్పులు సర్దుబాట్లు ఇవన్నీ ఈ వ్యాసంలో విశ్లేషించటానికి ప్రయత్నించాను…
ధర్నా చౌక్‌, స్వాభిమాన సభ అక్టోబర్‌ 10, 2015
2014 సుప్రీమ్‌ కోర్ట్‌ అఫ్‌ ఇండియా నల్సా వెర్సెస్‌ యూనియన్‌ అఫ్‌ ఇండియా తీర్పు – వెలువడిన తర్వాత 2014 లోనే తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం గా ఆవిర్భవించడం, తెలంగాణ పోరాటం లో పాలుపంచుకున్న అనేకమంది ట్రాన్స్‌ హిజ్రా వ్యక్తులు అందరిలాగే వారికి బంగారు రోజులు వొస్తాయని ఆశించటం జరిగింది … దశాబ్దం కన్నా ఎక్కువ కాలం నడిచిన వారి తెలంగాణ పోరాట భాగస్వామ్యం మరియు సుప్రీమ్‌ కోర్ట్‌ అఫ్‌ ఇండియా వెలువరించిన తీర్పు అధికారంలోకి వొచ్చిన కొత్త రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా ఆ తీర్పును అమలు చేస్తారనే ఆశతో స్వాభిమాన సభకి విచ్చేసిన 3000 పైగా ట్రాన్స్‌ హిజ్రా కార్యకర్తలు ఒక మెమోరాండం అప్పటి రాష్ట్ర మంత్రి అయినా ఈటెల రాజేంద్రకి సమర్పించటం జరిగింది స్వాభిమాన సభ ఒక విధంగా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రతిఫలాలలో ట్రాన్సువారి ఉనికిని చాటి చెప్పే ఒక సామూహిక కూటమి ఏ కాదు సుప్రీమ్‌ కోర్ట్‌ యొక్క జడ్జిమెంట్‌ ను అమలు చేయాలనీ కొత్త ప్రభుత్వానికి గుర్తు చేసే ఒక సందర్భం కూడా. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర వాసులయిన ట్రాన్స్‌ హిజ్రా వారే కాకా వారికీ సంఘీభావం తెలిపే ఇతర అణగారిన వర్గాల ప్రజా సంఘాలు, కూటములు, కలెక్టివ్‌లు, అనేక సివిల్‌ సొసైటీ సంస్థలు అడ్వొకేట్లు, అక్టీవిస్ట్స్‌, విద్యార్థి సంఘాలు అందరూ విచ్చేయటమే కాకుండా కచ్చితంగా కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర అభివద్ధిలో టాన్స్‌ హిజ్రా వారిని కూడా భాగస్వాములు చేయాలనీ చెప్పటం జరిగింది.
తెలంగాణ హిజ్రా ఇంటర్సెస్‌ ట్రాన్స్‌జెండా సమితి: స్వాభిమాన సభ జరిగిన తరువాత తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా బిక్షాటన మరియు సెక్స్‌ వత్తిలో ఉన్న ట్రాన్స్‌ హిజ్రా వారు ఎదుర్కునే రోజు వారి హింస మరియు వివక్షను ఎదుర్కోవటానికి సుప్రీంకోర్ట్‌ ఇచ్చిన తీర్పును ఒక ఆయుధంగా చేసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం జరిగింది. ఆ క్రమంలో ఏర్పడిన ఒక కలెక్టివ్‌ ఏ తెలంగాణ హిజ్రా ఇంటర్‌ సెక్స్‌ ట్రాన్స్‌జెండర్‌ సమితి. తెలంగాణ హిజ్రా ఇంటర్‌ సెక్స్‌ ట్రాన్స్‌జెండర్‌ సమితి ఒక కలెక్టివ్‌ మాత్రమే, దీనిని కావాలనే రిజిస్టర్‌ చేయటం కానీ ఈ పనిని చేయటానికి కావలసిన ఫండ్స్‌ని కానీ ఎక్కడనుండి ఎవ్వరినుండి తీసుకోవడం జరగలేదు.. కేవలం అవరసరం అయిన చోట చందాల రూపంలో డబ్బును పోగుచేసి ఈ కలెక్టివ్‌లోని కార్యకర్తలు పని చేయటం జరిగింది. ఈ కలెక్టివ్‌లో పేరుకు తగ్గట్టే ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులు, హిజ్రా సమాజం నుండి కొందరు, ట్రాన్స్‌ మెన్‌/ మాస్క్యూలై వ్యక్తులు, ఇంటర్‌ సెక్స్‌ వ్యక్తులు ఇంకా కోతి/ జెండర్‌ ఖ్వీర్‌ వ్యక్తులు వంటి విభిన్న మైన ఐడెంటిటీలతో కార్యకర్తలు ఉండటమే కాకుండా పని చేయటం కూడా జరిగింది. రోజు వారి జరిగే హింసను అడ్రస్‌ చేసుకుంటూ ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థలు తమ విధివిధానాలు, చట్టాలను ట్రాన్సు వ్యక్తుల శ్రేయస్సు కొరకు వర్తింపచేసేలా పని చేయటం ఈ కూటమి యొక్క పనులలో ఉండేది.
హైదరాబాద్‌ యునాక్స్‌ యాక్ట్న్‌ సుప్రీం కోర్ట్‌ అఫ్‌ ఇండియా నల్సా వర్సెస్‌ యూనియన్‌ అఫ్‌ ఇండియా తీర్పు అమలు పబ్లిక్‌ ఇంటెరెస్ట్గ్‌ లిటిగేషన్‌ ఈ క్రమంలోనే ఈ పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్‌ వ్యాజ్యాలు కొంతమంది ట్రాన్స్‌, హిజ్రా జెండర్‌ ఖ్వీర్‌ కార్యకర్తలు తెలంగాణ హైకోర్ట్‌లో వేయటం జరిగింది. దానికి సంబంధించిన నోటీసులు వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్స్‌కి చేరటంతో వారు ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తుల కోసం ఏయే విధానాలు రూపొందించాలి వారి శ్రేయస్సు, అభివద్ధి, ఇంకా బాగోగుల కొరకు ఏం పని చేయాలని ఆలోచించేలా చేయటమే కాకుండా ఆ దిశలో పని చేయించే విధంగా కూడా అవి పనికొచ్చాయి
ట్రాన్స్‌ బిల్‌ 2016 / హిజ్రా తెహజీబ్‌ బచావో ఆందోళన్‌
ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ (ప్రొటెక్షన్‌ అఫ్‌ రైట్స్‌) యాక్ట్‌ 2019 రూల్స్‌ 2020 పబ్లిక్‌ ఇంటెరెస్ట్గ్‌ లిటిగేషన్‌ – కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి సారిగా ఈ బిల్లు తయారు చేసేటప్పటికే తమిళనాడు రాజ్య సభ మెంబెర్‌ తిరుచ్చి శివ యొక్క ప్రైవేట్‌ మెంబెర్‌ బిల్‌ ట్రాన్స్‌ వ్యక్తుల కొరకు ప్రవేశపెట్టబడి ఆమోదం కూడా పొందింది కానీ ఆ బిల్లు ఎప్పుడూ లోక్‌ సభ చూడలేదు. ఈ లోపు కేంద్ర ప్రభుత్వం ఇంకొక పర్సనల్‌ బిల్లు మినిస్ట్రీ అఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్మెంట్‌ అధ్వర్యంలో మంత్రి థావర్‌ గెహ్లాట్‌ ప్రైవేట్‌ మెంబెర్స్‌ బిల్‌ లా ట్రాన్స్‌జెండర్‌ బిల్లు 2016 ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లులో ఎన్నో సైద్ధాంతిక లోపాలే కాక ముఖ్యంగా 2014లో సుప్రీం కోర్ట్‌ అఫ్‌ ఇండియా చెప్పినట్టు ట్రాన్స్‌జెండర్‌ వారిని సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన సముదాయాలుగా గుర్తించమని చెప్పిన ఉత్తర్వులను దష్టిలో పెట్టుకొని ఈ బిల్లు రచించలేదు పైగా భిక్షాటనం నేరంగా ప్రకటించి అడుక్కునే ట్రాన్స్‌ వారికీ అలాగే వారు ఎవరినైనా అడుక్కుని రమ్మని చెప్పిన అటువంటివారికి రెండు ఏళ్ళ జైలు శిక్షను సిఫార్సు చేయటం జరిగింది. అంటే ఈ బిల్లు ద్వారా ట్రాన్స్‌జెండర్‌ వారికి ఎటువంటి ఉపయోగం ఉండక పోగా వారిని శిక్షించే విధంగా ఉండడం అమానవీయం. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ మొట్టమొదటి సారిగా పోరాటానికి దిగింది తెలంగాణ గడ్డపై ఉన్న హిజ్రా పెద్దలు ..’హిజ్రా తెహజీబ్‌ బచావో’ అన్న నినాదంతో హైద్రాబాద్‌ నుండి మొదలు పెట్టిన ఈ విప్లవం ఎంతో తక్కువ సమయంలోనే అన్ని రాష్ట్రాలకు పాకటమే కాకుండా జాతీయ అంతర్జాతీయ ఉద్యమంగా రూపాంతరం చెందటం జరిగింది. WPATH ది వరల్డ్‌ ప్రొఫెషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ ట్రాన్స్‌జెండర్‌ హెల్త్‌ సంస్థ భారత ప్రభుత్వానికి రాయటం జరిగింది. ఈ బిల్లులో చాలా లోపాలు ఉన్నాయి. సవరించాల్సిందిగా కోరింది. 1000 పైగా సలహాలు సూచనలు మినిస్ట్రీ అఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్మెంట్‌ని తాకటం జరిగింది. దానికి అనుగుణంగా 2019 నాటికి ఈ బిల్లు చట్టం అయ్యేటప్పటికి కొన్ని మౌలిక మార్పులు డిపార్ట్మెంట్‌ చేయటం జరిగింది. కానీ ట్రాన్స్‌జెండర్‌ వారికి జరిగే వివక్షతను అభివర్ణించకపోవటం, అలానే చదువులో, ఉపాధిలో ట్రాన్స్‌జెండర్‌ వారికి ఎటువంటి రిజర్వేషన్‌ లేకపోవటం చాలా బాధాకరం. ఆ విషయం పైన రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరిగిందని కొంతమంది ట్రాన్స్‌ అక్టీవిస్ట్‌లు ఈ చట్టాన్ని సుప్రీం కోర్ట్‌ అఫ్‌ ఇండియాలో ఛాలెంజ్‌ చేశారు. చట్టం వచ్చాక 2020లో రూల్స్‌ కూడా గవర్నమెంట్‌ గెజిట్‌లో ప్రచురించారు. ఆ రూల్స్‌ కచ్చితంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించవలసి ఉంది. కానీ ఆయా రాష్ట్రాలు ఇంకా దానికి సంబందించిన తయారీలోనే ఉన్నాయి. తెలంగాణలో మాత్రం 2022లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక జీ.ఓ ద్వారా రాష్ట్ర ట్రాన్స్‌జెండర్‌ వెల్ఫేర్‌ బోర్డు ను స్థాపించటం జరిగింది.
తెలంగాణ ట్రాన్స్‌జెండర్‌ వెల్ఫేర్‌ బోర్డు : 2022 అక్టోబర్‌ మాసం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జి ఓ ద్వారా కొంత మంది ట్రాన్స్‌ హిజ్రా అక్టీవిస్ట్స్‌ తో తెలంగాణ ట్రాన్స్‌జెండర్‌ వెల్ఫేర్‌ బోర్డు స్థాపించటం జరిగింది. ఆ సమయంలో ఉన్న బోర్డు మెంబర్స్‌ మరికొంతమందిని బోర్డులో తీసుకొంటామని ప్రార్ధించగా, వేరే కమ్యూనిటీ బేస్డ్‌ ఆర్గనైజేషన్స్‌ని కూడా అందులో జోడించమని అడుగగా కలపటం జరిగింది. తెలంగాణ కాబినెట్‌ నిర్ణయించిన 2 కోట్లు ట్రాన్సు హిజ్రా అభివద్ధి కొరకు కేటాయించాలని నిర్ణయించటం జరిగింది. తెలంగాణ ట్రాన్స్‌జెండా వెల్ఫేర్‌ బోర్డు ఆ దిశగా ప్రభుత్వానికి సహాయం చేయటం మొదలు పెట్టింది. ఈ రెండు కోట్లు కేవలం బిక్షాటన మీద, సెక్స్‌ వర్క్‌ మీద ఆధారపడి జీవించే ట్రాన్స్‌ హిజ్రా వ్యక్తులకు వేరే జీవన నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చి వారికి, వ్యాపార నిమిత్తం అప్పులు ఇవ్వటం కోసం, నివసించడానికి గూడు లేని ట్రాన్స్‌ హిజ్రా వారికి ఒక హోమ్‌, ట్రాన్స్‌ హిజ్రా వారిపై వివక్షతను పోగొట్టటానికి ప్రచారం నిమిత్తం కొంత బడ్జెట్‌, అలానే ఆరోగ్యం, వివిధ ఐడెంటిటీ కార్డ్స్‌ తయారు చేయటానికి నిమిత్తం కొంత బడ్జెట్‌ కేటాయించటం జరిగింది.
ఉస్మానియా ట్రాన్స్‌ క్లినిక్‌ ట్రాన్స్‌ ఖ్వీర్‌ వెల్నెస్‌ సెంటర్‌ డ ట్రాన్స్‌ లీగల్‌ క్లినిక్‌ – 2021 లో యు యెన్‌ ఎయిడ్స్‌ సంస్థ అధ్వర్యం మిత్ర్‌ అనే పేరుతో కేవలం ట్రాన్స్‌జెండర్‌ వారికి సమగ్ర ఆరోగ్య విషయాలకు సంబంధించిన వైద్యం, సూచనలు సలహాలు కౌన్సిలింగ్‌ సేవలతో హైదరాబాద్‌లో ప్రారంభించబడింది. ఆ క్లినిక్‌ పనితీరు ట్రాన్స్‌ వారి ఆరోగ్య విషయాలలోనే కాక ఇతర అవసరాలు, ఆధార్‌ కార్డ్స్‌ చేపించటం, ట్రాన్స్‌ జెండర్‌ ఐడెంటిటీ కార్డ్స్‌ చేపించటం, వివిధ వ్యాపారాలు చేసుకోవటాని లోన్స్‌కి ట్రాన్స్‌ హిజ్రా వారికి సహాయం చేయటం, హింస, వివక్షకు సంబంధించిన విషయాలలో తక్షణ సహాయం వంటి క్రైసిస్‌ మానేజ్‌మెంట్‌ వంటి కొన్ని ప్రభావంతమయిన పనుల వలన వేరే సంస్థలు ట్రాన్స్‌ హిజ్రా వారి సహాయార్ధం కొన్ని వినూత్న ప్రాజెక్ట్స్‌ ఇవ్వటం జరిగింది. ఆ వరుసలో ప్రభుత్వ ఆసుపత్రి ఉస్మానియాలో వారానికి ఒక రోజు ట్రాన్స్‌ క్లినిక్‌ కొరకు కేటాయించటం, జ్యూట్‌ బ్యాగ్స్‌ కుట్టటంలో శిక్షణ ఇచ్చి అందులో శిక్షణ పొందిన వారితో ట్రాన్స్‌ జ్యూట్‌ బ్యాగ్‌ ప్రొడక్షన్‌ యూనిట్‌ స్వాభిమాన స్ఫూర్తి అన్న పేరుతో ప్రారంభించి, అందులో 8 మంది ట్రాన్స్‌జెండర్‌ వారికి జీవనోపాథి కలిపించటం, అలానే ఇంటి నుండి తరిమి వేయబడిన ట్రాన్స్‌ వ్యక్తుల కొరకు తాత్కాలిక షెల్టర్‌ వాలే ఖ్వీర్‌ ట్రాన్స్‌ వెల్‌ఫేర్‌ సెంటర్‌, అదే సెంటర్‌లో వారానికి ఒక రోజు ట్రాన్స్‌జెండర్‌ హిజ్రా వారు ఎదుర్కొనే గహ హింస, హక్కుల ఉల్లంఘన వంటి పరిస్థితులలో ఉచిత న్యాయపరమయిన సహాయం కొరకు ప్రత్యేక ట్రాన్స్‌జెండర్‌ లీగల్‌ క్లినిక్‌ కూడా అదే ఖ్వీర్‌ ట్రాన్సు జెండర్‌ వెల్నెస్‌ సెంటర్‌లో ప్రారంభించారు. ఒక తెలంగాణ ట్రాన్స్‌ ఉద్యమంలోనే అమోఘమైన ఘట్టంగా అభివర్ణించొచ్చు. ఈ స్వాభిమాన స్ఫూర్తి ప్రత్యేక ట్రాన్స్‌ హిజ్రా జ్యూట్‌ బ్యాగ్‌ మేకింగ్‌ ప్రొడక్షన్‌ యూనిట్‌ స్ఫూర్తితో నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌, గౌరవ్‌ ఫౌండేషన్‌ సుమారు 200 ట్రాన్స్‌ హిజ్రా వారిని వేర్వేరు శిక్షణా కార్యక్రమాలలో… ఉదాహరణకు మేకప్‌, బట్టలు, జ్యూట్‌ బ్యాగ్‌లు కుట్టటంలో శిక్షణ పొందారు. 2024 సిడీబీ సంస్థ అదనంగా మరో 200 మందికి శిక్షణా కార్యక్రమాలు రాబోయే రోజులలో చేయనున్నారు.
ట్రాన్స్‌ మార్చ్‌ కలెక్టివ్‌ – 2014 నాటి నుండి సుప్రీం కోర్ట్‌ జడ్జిమెంట్‌ అమలు మొదలు ఇప్పుడు చదువులో, ఉద్యోగాలలో సమాంతర రిజర్వేషన్స్‌ కొరకు తెలంగాణ ట్రాన్స్‌ ఉద్యమం మిగిలిన ప్రజా ఉద్యమాలతో మమేకమై చాలా రూపాంతరం చెంది ఆ సముదాయాలకు అనేక లబ్ది చేకూర్చే పనుల సాధన కొరకు ఆ కమ్యూనిటీ అక్టీవిస్ట్‌లు కార్యకర్తలు నిరంతరం కోర్టు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ ప్రక్రియలో LGBTQIH సముదాయాలలో మిగిలిన జెండర్‌ మైనారిటీలు కానీ సెక్సువల్‌ మైనారిటీలు కానీ అందరి పోరాటాలు కలిసి ఏక శక్తిగా పొందుతూ వొచ్చేవి. కానీ కాలక్రమేణా అణగారిన, ముఖ్యంగా భిక్షాటన, సెక్స్‌ వత్తిపై ఆధారపడి ట్రాన్స్‌ మహిళలు, హిజ్రా మహిళల పట్ల ఒక విధమయిన వేర్పాటు భావజాలం, వారిపట్ల అలసత్వం, దూరం పెట్టటం వంటి భావాలు ఆ సముదాయాలను లోపల లోపల సంఘటితమయ్యే ఒక వాతావరణం కల్పించాయి. దీని పర్యావసానమే LGBTQIH వారందరూ ప్రతీ సంవత్సరం కలిసి చేసుకొనే ప్రైడ్‌ మార్చ్‌ 2022 ట్రాన్స్‌ హిజ్రా జెండర్‌ క్యూర్‌, శివ శక్తి, కిన్నెర సముదాయాలను వేర్వేరు కమ్యూనిటీ బేస్డ్‌ సంస్థలుగా ఆవిర్భవించి, వారి సముదాయాలకు వారే పని చేసుకునే దిశలో తెలంగాణ ట్రాన్స్‌ ఉద్యమం ముందుకు పోతుంది.

– రచన, 9866717712

]]>
అవును. అంతా నాటకమే. https://navatelangana.com/yes-its-all-drama/ Sat, 23 Mar 2024 17:12:39 +0000 https://navatelangana.com/?p=255206 అవును. అంతా నాటకమే.(మార్చి 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం)
అవును. అంతా నాటకమే. లోపల ఒకటి. బయటకు ఒకటి. అబద్దం బ్రతుకు అవుతున్నప్పుడు నాటకం విస్తరిస్తుంది. జీవితంలో జీవితం లుప్తమై పోతున్నప్పుడు జీవితాన్ని నాటకం ఆక్రమిస్తుంది. బ్రతకనేర్వడం అంటే ఇదేనేమో! ఉదరపోషణార్ధం బహుకృత వేషం అని ఏనాడో చెప్పారుగా మన పెద్దలు.
అబద్దం ఎంతగా విస్తరిస్తున్నదంటే, కళాశాలకు వెళ్లకుండానే, ఆ చదువులతో ఎలాంటి సంబంధం లేకుండానే డిగ్రీలు సాధిస్తున్న రోజులివి. ఎవరో సాధారణ మనుషులే కాదు, దేశాధినేతలు సైతం ఈ అక్రమాలకు వడిగడుతున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా మరి. యాధారాజా తథా ప్రజా అన్నారు కదా అదే పెద్దలు.

ప్రతి రోజూ అబద్దాలు తింటూ, అబద్దాలు తాగుతూ, అబద్దాల గాలి పీలుస్తూ వుంటే నిజం ఎక్కడ మిగులుతుంది? కచ్చితంగా చస్తుంది. కాదు మనకు మనమే సత్యాన్ని హత్య చేస్తున్నామా? అనే భయం వెంటాడుతుంది. ‘జీవన్నాటకం అంటే ఇదేకదా!’ అని సమర్ధించుకునేవారికి కొదవే లేదు. జీవితాన్ని నాటకాన్ని వేరు చేయలేం. రేయి పగలులాగ, చావూ పుట్టకల్లాగ కలిసే వుంటాయని కితాబు ఇచ్చుకునేవారూ లేకపోలేదు.
అయితే ఇక్కడ జీవితంలో అంతర్లీనంగా ప్రవహించే నాటక మౌలిక లక్షణాన్ని మనం గ్రహించాలి. సహజమైన మానవీయ సంబంధాలతో పెనవేసుకు పోయిన జీవన రసభావాలు సత్యం శివం సుందరంలా ఆవిష్కృతమవుతాయి. అందుకే మహాకవి శ్రీశ్రీ ”అందమె ఆనందం – ఆనందమే జీవిత మకరందం” అని తేల్చి చెప్పాడు. సత్యాన్వేషణే కాదు, ఆ సత్యాన్ని అంటే నిజాన్ని నిర్భయంగా చూపడమే నాటకం కర్తవ్యంగా అనాదిగా ముందుకొచ్చింది. భవిత పట్ల, మానవజాతి పట్ల, ప్రకృతి పట్ల, పురోగతి పట్ల అచంచల విశ్వాసం పాదుకొల్పేందుకు నాటకానికి వున్న చరిత్ర అపారం. అంతటి అత్యున్నత స్థానం అధిష్టించింది కనుకనే భరతముని నాట్యశాస్త్రాన్ని పంచమవేదంగా అభివర్ణించాడు.
నాటకం సర్వకళల సమాహారంగా విరాజిల్లి, జీవితానికి ప్రతిరూపంగా నిలవడానికి తార్కాణమిదే.
అయితే నేడు మన ప్రజాస్వామ్య దేశంలో ఫాసిస్టు మతోన్మాద పెట్టుబడిదారీ వ్యవస్థ సకల రాజ్యాంగ విలువలతో పాటు మానవ విలువలను సైతం ధ్వంసం చేస్తున్న తరుణంలో మనం జీవిస్తున్నాం. ఈ దశలో నాటకంపై ఎంతో జాగరుకత, శ్రద్ధ, అవశ్యం. ఎందుకంటే నాటకం నడుస్తున్న కాలానికి ప్రతినిధి అని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. అందుకే విశ్వకవి రవీంద్రుడు నాటక కళాభ్యుదయం ఆధారంగానే ఒక జాతి యొక్క సాంస్కృతిక ఔన్నత్యం నిర్ణయించవచ్చని పేర్కొంటాడు.
ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని 1961లో తొలుత ఇంటర్నేషనల్‌ థియేటర్‌ ఇస్టిట్యూట్‌ (ఐ.టి.ఐ) నిర్వహించింది. ఆ తర్వాత ప్రతి ఏడాది మార్చి 27ను దేశదేశాల్లోని నాటక ప్రియులు, నాటక స్రష్టలు, నాటక కార్యకర్తలందరూ దీనిని ఒక ఆనవాయితీగా శ్రద్దగా జరుపుకుంటున్నారు.
సమకాలీన ప్రపంచంలో మన నాటకం స్థానం ఏమిటి? మనం ఎక్కడ వున్నాం? ఎటువైపుకు దిగజారుతున్నాం? అసలు మనం ఎటువైపుకు వెళ్ళాలి. మన రంగస్థలానికి తగులుతున్న ఆటుపోట్ల మాటేమిటి? నాటకకర్తలుగా మనం నిజాన్ని నిర్భయంగా చెప్పగలుగుతున్నామా? కట్టెలూ, శవాలు మాదిరి ఏట్లో కొట్టుకుపోతున్నామా? లేదా ఏటికి ఎదురీదుతున్నామా? జాతిని జాగృతం చేయాలంటే ముందు మనం జాగృతం కావాలి గదా..? ఇలాంటి ప్రశ్నలన్నింటిని ఆత్మవివేచనాపూర్వకంగా ఈ సందర్భంలో నాటక కర్తలు తమపై తాము సంధించుకుంటారు. విమర్శించుకుంటారు. చర్చించుకుంటారు. ఎన్నెన్నో నాటక పరమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఆ ఏటికాయేడు ప్రస్తుతం ఉన్నదశలో ఓ దిశానిర్దేశం చేసుకోవడానికి ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవం తప్పక ఉపయోగపడుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఓ ప్రపంచ ప్రఖ్యాత రంగస్థల వ్యక్తి విశ్వశాంతి, విశ్వశ్రేయస్సు కాంక్షించేలా మానవత్వ పరిమళాలు జగమంతా పరుచుకోవడానికి నాటకంగా ఏం చేయవలసి వుంటుందో ఒక సందేశం ఇస్తారు.
అలా ప్రప్రధమంగా ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని 1962లో జీన్‌కోక్ట్‌ ఇచ్చారు. ఆ తర్వాత అదో సత్సంప్రదాయంగా మారింది. కనుకనే ప్రపంచ నాటక ప్రియులందరూ ఆ సందేశం కోసం ఎదురు చూస్తూ వుంటారు. ఎక్కడికక్కడ ఎవరికి వారు సోత్కర్షలతో గొప్పలకు పోకుండా ప్రపంచం పట్ల, యావత్‌ మానవాళి పట్ల నాటక ప్రియులు ఓ కర్తవ్య పథ నిర్దేశం చేసుకోవడానికి ఈ దినం అలా ఎంతగానో తోడ్పడుతుంది.
మరో విషయం ఈ సందేశం 50 భాషల్లోకి తర్జుమా అవుతుంది. అన్ని ఖండాల్లోని కోట్లాదిమంది ప్రజానీకానికి ప్రత్యక్ష, పరోక్ష ప్రసారాల ద్వారా ఏకకాలంలో చేరువవుతుంది. ఇదంతా మన రంగస్థలం సజీవంగా ఉండేందుకే కాక మానవ సమాజానికి బాధ్యతగా వుండేందుకు కూడా ఉపకరిస్తుంది.
రంగస్థలం (థియేటర్‌) – నాటకం (డ్రామా)ను సమానార్ధంలో వాడుతున్నప్పటికీ వేర్వేరుగానే పరిగణించాలి. నాటకం సర్వకళల సమాహారమైనప్పటికీ, నాటకం రంగస్థలంలో ఒక ప్రధాన భాగమే. రంగస్థలం అంటే ప్రదర్శనా కళలు. నాటకం, నాట్యం, జానపద కళలు శ్రవ్య దృశ్యరూపకాలు సమస్తం రంగస్థలంలో భాగంగా వుంటాయి. కాగా మరల నాటకం వేరు, నాటక రంగం వేరు. నాటకాన్ని ఓ ప్రదర్శనగా చూస్తాం. శ్రవ్య నాటకమైతే రేడియోల్లోనూ, ఆడియో రూపంలోనూ వింటాం.
‘వీడు వట్టి నాటకాలోడ్రా..’ అంటే జీవితంలో వాస్తవం కంటే అవాస్తవం, అతిశయోక్తులు ఎక్కువ వుంటాయని అర్ధం. నాటక రంగం అంటే ఆ రంగాన్ని ఓ శాస్త్రంగా అధ్యయనం చేయడం ముందుకు కొనిపోవడం, రంగస్థల శాస్త్రం ఇప్పుడు పాఠశాల స్థాయినుండి ఇంటర్‌, డిగ్రీ పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ స్థాయివరకు విద్యార్థులు అభ్యసిస్తున్నారు.
ఇందులో భాగంగానే ఎడ్యుకేషన్‌ త్రూ థియేటర్‌ (రంగస్థల మాధ్యమం ద్వారా విద్యాబోధన) అనేది నేడు కేవలం సాధారణ విద్యాసంస్థలకే పరిమితం కాక పెద్ద పెద్ద ఐ.ఐ.టిల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. నాసా (నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌, అమెరికా), ఎం.ఐ.టి. (మాసాచ్యుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కేంబ్రిడ్జ్‌) వంటి సంస్థల్లో కూడా అమలుపరుస్తున్నారు. కారణం అక్కడ పనిచేస్తున్నవారు శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో క్షణం తీరిక లేకుండా స్పందనా శక్తిని కోల్పోవడం. జడత్వానికి లోనౌతూ యంత్రంలో యంత్రంగా మారిపోతున్నామేమోనన్న భయం. మరల వారిలో మానవత్వ పరిమణాలు, స్పందనలు చిగురించి వికసించాలంటే రంగస్థల కళ అనివార్యమవుతుంది.
‘చెప్తే వినపడుతుంది. చూస్తే కనపపడుతుంది. కానీ చేస్తేనే అర్ధమవుతుంది’. ఇది మానవ జీవన సామెత. అందుకే మనిషికి మానవీయ స్పందనలు అవసరం అవుతున్నాయి కనుకనే రంగస్థలం ఓ శాస్త్రంగా ముందుకొస్తున్నది. తెలుగు నాట దాదాపు 144 ఏళ్ల క్రితం ఆధునిక నాటకం ఆవిర్భవించింది. వాడుక భాషలో ప్లీడర్‌ నాటకాన్ని (వ్యవహార ధర్మబోధిని) వీరేశలింగం పంతులు రాజమండ్రిలో తన యువ శిష్యగణం 1880లో ప్రదర్శించినప్పటి నుండి తెలుగు ఆధునిక నాటకం మొదలైనట్లు లాక్షణికులు చెప్తున్నారు. బ్రిటీష్‌ వారి ఏలుబడిలో న్యాయం ఎంతగా అన్యాయం అయిపోతన్నదో చాలా వ్యంగ్యంగా, చమత్కారంగా పంతులుగారు రూపొందించారు. మనవ వ్యవహార జీవితం ఎంత కపటంగా, నాటకీయంగా పరిణమించిందో నాడే కళ్లకు కట్టారు. ఆ తర్వాత గురజాడవారి ‘కన్యాశుల్కం’ ఓ నాటక రాజంగా ఆధునిక మహా కావ్యమైంది. ఆ తర్వాత ఆ వరవడిలో ఎన్నో… ఎన్నెన్నో నాటకాలు, ప్రయోగాలు రంగంలోకి వచ్చాయి. నాటకం కేవలం అలరించడమే కాదు, ఆలోచింపజేయడం అనే విషయం కూడా అవగతమైంది.
సమాజం ఎట్లున్నదో చూపడమే కాదు, ఎట్లుంటే బాగుంటుందో కూడా చూపాల్సిన బాధ్యతను నాటకం భుజాన ఎత్తుకున్నది. ఆ సోషలిస్టు వాస్తవికత రంగంలోకి వచ్చింది. ముందడుగు, మా భూమి వంటి నాటకాలకు తెరదీసింది.
ఒకప్పుడు ప్రాచీన వీధినాటకం, అదే వీధిబాగోతం, యక్షగానం, బయలు నాటకం వగైరా… పద్యాలు, పాటలు, వచనం, దరువులతో వర్ధిల్లింది. పౌరాణిక గాధలేగాక జానపద కథలు కూడా ఇతివృత్తాలై బాలనాగమ్మ వంటి జానపద నాటకాలూ వచ్చాయి. ఇక పద్యనాటకాలు సరేసరి. పద్యం తెలుగువారి హృద్యం. చిలకమర్తి వారి గయోపాఖ్యానం నాటకం అప్పట్లోనే లక్ష ప్రతులు అమ్ముడయ్యాయట. ఎంతటి భాషా ఔన్నత్యం, భావ ఔన్నత్యం, రాగ ఔన్నత్యం పండిత పామరులకు ఆ నాటకాల ద్వారా సమకూరాయో ఆలోచించుకుంటే చాలు గుండె వుబ్బితబ్బిబ్పై అబ్బురపరుస్తుంది.
బలిజేపల్లి వారి సత్యహరిశ్చంద్ర నాటకం చూడని ముందుతరం ప్రజానీకం వుండరంటే అతిశయోక్తి కాదు. ‘విధి అవశ్య ప్రాస్తంబు, రాజే కింకరుడగు, కింకరుడే రాజగు, కాలానుకూలంబుగా’ అన్న జీవన పరిణామ తాత్వికతతో పద్యమాలపిస్తుంటే, సామాన్యజనం భావోద్వేగ భావనతో రసప్లావితులవుతారు. ఇది కదా నాటకం శక్తీ, నాటకం ప్రతిభ, నాటకం జ్ఞానం నాటకం ప్రాణం అని సమ్మోహితులవుతారు. గాంధీజీ అంతటివాడనే ‘సత్యహరిశ్చంద్ర’ నాటకం సత్య సంధునిగా, మహాత్మునిగా మార్చగలిగింది. ఆధునిక, సాంఘిక నాటకాలు మొదలైన తర్వాత నాటకం జీవితానికి సమాంతరంగా నడిచింది. నడుస్తున్నది. జీవితంలోని కల్మషాన్ని కడిగి పారేయడానికి గొప్ప సాధనమైంది. అక్కడితో ఆగకుండా ఆధునిక వీధి నాటకమై శ్రామిక వర్గానికి పోరాటాయుధమైంది. నాటకం వర్గపోరాటంలో ఓ మిస్సైల్‌లా ఎలా దూసుకుపోగలదో తెలియజెప్పింది.

– కె.శాంతారావు, 9959745723

]]>
నిద్ర విష‌యంలో నిద్ర లేవండి https://navatelangana.com/wake-up-in-the-matter-of-sleep/ Sun, 17 Mar 2024 01:34:45 +0000 https://navatelangana.com/?p=250657 Wake up in the matter of sleepకాలమనేదే డబ్బుగా, పనియే ముఖ్యంగా మారిన ప్రపంచంలో ప్రతీక్షణం అందిపుచ్చుకోవాలనీ పనిచేయకపోవడం మహాపాపమనీ భావింపబడుతున్న తరుణంలో ఏ పనినీ చేయనీయని, ఏ ఉత్పాదకతా కలుగనీయని మూడొంతుల జీవితంలో ఒకవంతుపైగా ఆక్రమించే ఒక పనికిరాని చర్యగా నిద్రను పరిగణించే దశలో మనం నిద్రగురించి మాట్లాడుకుంటున్నాం. అసాధారణంగా వేగవంతమైన జీవితంలో పెద్ద పెద్ద జీవితలక్ష్యాలు అందుకోవాలని మనిషి పరుగులిడే ఈ కాలంలో నిద్ర అంత ముఖ్యమైన విషయంగా కనబడకపోవడం సర్వసాధారణం ఐపోయిందన్నది వాస్తవం. పగలు రాత్రి అని ఒక రోజును రెండు భాగాలుగా అనుభవించిన జీవజాతులతో పాటు పరిణామం చెందుతూ వచ్చిన మానవుడు అకస్మాత్తుగా రాత్రి ఆనేదే లేని థామస్‌ అల్వా ఎడిసన్‌ అనంతర (post Edison era) యుగంలోకి అడుగుపెట్టి నిద్ర యొక్క అవసరం ఏంటని ఈరోజు ప్రశ్నించుకుంటున్నాడు. అభివద్ధి అనబడే పరుగుపందెంలో దూసుకుపోతున్న సమాజాలకు నిద్ర ఒక పనికిరాని అనవసరమైన అడ్డుగోడగా, జీవితోన్నత శిఖరారోహణకు ప్రధానమైన శత్రువుగా కనిపించడం మొదలైంది. కాసేపు కళ్ళు మూసుకుని పడుకోవడం సోమరితనంగా పరిగణించబడుతోంది.
మానవుడిని అలసట అనేది ఎరుగని యంత్రంగా, అతడి ఆత్మస్థైర్యంతో, కాఫీవంటి నిర్నిద్ర పానీయాలతో నిద్రని శాశ్వతంగా దూరంపెట్టగలడనే కొత్త భావాలు ఉబికివస్తున్నాయి. ఈ వింత పోకడలను వాటినుండి మానవ సమాజం ఎదుర్కోబోయే పెను ప్రమాదాలను గమనించిన సైంటిఫిక్‌ సమాజం ‘నిద్రవిషయంలో నిద్రలేవండి’ అనే అలారం మోగించాల్సిన సమయం వచ్చింది. ప్రపంచంలో ఈరోజు నిద్రలేమి అన్నది కేవలం జబ్బు మాత్రమే కాదు. ఒక నూతన సామాజిక అలవాటు. ఈ రెంటినీ వేరు చేసి చూడటం అవసరం. అభివృద్ధి చెందిన దేశాలలో ముప్పైశాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారని WHO లెక్కలు చెబుతున్నా, మొత్తానికి చూసుకుంటే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నిద్రలేమితో బాధపడేవాడు తనకు నిద్రకావాలని కోరుకుంటాడు. కానీ నిద్ర అనవసరం అనుకునే ధోరణి పెరిగిన సందర్భంలో మొత్తానికి నిద్రలేనివారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. ఒకవైపు మారుతున్న సామాజిక పరిస్థితుల కారణంగా పెరుగుతున్న శారీరక మానసిక సమస్య వలన నిద్రలేమి insomnia కలుగుతుండగా మరోవైపు గ్లోబలైజేషన్‌ లో భాగంగా తమ పనులు పూర్తి చేసుకోవడం కోసం రాత్రంతా డ్యూటీలు చేస్తూ నిద్రను బలవంతంగా అణుచుకుంటూ సొంతగా నిద్రలేమిని కోరుకుని తెచ్చుకుంటున్న తరమే ఏర్పడింది. ఐతే కారణం ఏదైనా నిద్రలేమి అనేక దీర్ఘకాలిక జబ్బులకు కారణమౌతోందని నూతన పరిశోధనలు చెబుతున్నాయి.
జీవులసలు ఎందుకు నిద్రపోవాలి. భూమి మీద జీవం మొదలైనప్పటినుండి పగలు రాత్రి ఉన్నట్లే నిద్ర మెలకువలు ఉన్నాయి. క్షీరదాల్లో సరీసృపాల్లో పక్షులలో ఉభయచరాల్లో నిద్ర స్పష్టంగా కనిపిస్తుంది. చేపల్లో కనురెప్పలు లేకున్నా అవి నిద్రలాంటి విశ్రాంతిని తీసుకుంటాయని తెలుస్తోంది. డాల్ఫిన్లు మెదడులోని ఒక భాగాన్ని నిద్రపుచ్చి మరో భాగంతో అలెర్ట్‌గా ఉండగలిగిన వింతైన జీవులు. పురాతన కాలం నుండి మనిషి నిద్రపై వివిధ వర్ణనలు ఆలోచనలు పరిశీలనలూ చేస్తూనే ఉన్నాడు. గ్రీకులు hypnos దేవతను కొలిచారు. ఈజిప్షియన్లు నిద్రలో మనిషి పరలోకానకి వెళ్తాడని భావించి నిద్రలో మరణానికి జారుకోకుండా ప్రార్థనలు చేసేవారు. మెసపటోమియన్లు నిద్రను ఇహ పరలోకాలకు వారధిగా తలిచి దేవుళ్ళు కలల ద్వారా మాట్లాడతారని నమ్మారు. నిద్ర మెలకువలను యిన్‌ -యాంగ్‌ లుగా భావించి ఇవి రెండూ తటస్థంగా ఉండాలని చైనీయులు అనుకున్నారు. భారతదేశంలో పూర్తి స్పృ‌హతో నిద్రపోవడాన్ని యోగనిద్రగా అభివర్ణించారు. ఆయుర్వేదంలో ఆహార విహారాదులతోపాటు నిద్రకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఐతే ఇరవైయవ శతాబ్దంలో నిదురను మొదటిసారి శాస్త్రీయంగా అవగాహన చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. నిద్ర-మెలకువ చక్రం (sleep awake cycle) యొక్క పనితీరు అర్థమవడం మొదలైంది. తర్వాత టెక్నాలజీ పెరిగేకొద్దీ మెదడు ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్‌, పాలీసోమ్నోగ్రఫీ వంటివి అందుబాటులోకి రావడంతో నిదురను మరింత శాస్త్రీయంగా లోతుగా అధ్యయనం చేయడం సాధ్యపడింది. నిదుర గురించి అర్థమయ్యే కొద్దీ మానవజీవితంలో నిద్ర మనమనుకున్న దానికంటే ఎక్కువ ప్రాధాన్యత కలదని అర్థమవడం మొదలైంది. నిద్రలేమి మధుమేహం, రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం, కాన్సర్‌ వంటి భయంకరమైన దీర్ఘకాలిక రోగాలకు కారణమని అర్థమైంది. నిద్రలేమి కొన్ని మానసిక జబ్బులకు లక్షణంగా మాత్రమే కాకుండా, కారణం కూడా పరిణమించింది. జన్యువులలోనుండి నిదురకు సమాధానాలు దొరుకుతాయా అనే పరిశోధనా మొదలైంది. డిఎన్‌ఏను కనుక్కున్న వారిలో ఒకరైన క్రిక్‌ నిదురలోని రహస్యాలను డిఎన్‌ఏలో కనుక్కోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. అరుదైన జన్యు వ్యాధిగా progressive insomnia అనే జబ్బు ఒకటుందని అర్థమైంది. ఈ జబ్బు మధ్యవయసు వారిలో కనబడుతుంది. ఈ జబ్బు ఉన్న పేషంట్లకు నిద్ర రావడం పూర్తిగా ఆగిపోతుంది. పూర్తినిద్రలేమితో వీళ్ళు శల్యమై ఒకటి రెండు సంవత్సరాలలో మరణిస్తారు. అంటే నిద్రలేమి మరణానికి కూడా కారణమౌతుంది. అందుకే ఇంత ప్రాముఖ్యత కలిగిన నిద్రను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం అయింది. 1950 లో REM stage sleep అనేది ఒకటుంటుందని తెలుసుకున్నాక నిదురను మరింత అర్థం చేసుకోవడం మొదలైంది.
మానవ వైజ్ఞానిక వికాసంలో నిదురది కూడా కీలకమైన పాత్ర. నిద్ర అనేదే లేకపోతే మనిషి మెదడు ఇంతగా వికసించేది కాదు. అసీమిత తారా గగనాలను, సముద్రలోతులనూ, సృష్టి రహస్యాలనూ అసలు ఛేదించేదే కాదు. కోట్ల సంవత్సరాలుగా పరిణామంలో నిదురను నిలుపుకుంటూ వచ్చాడే తప్ప నిదుర అనే ప్రక్రియ అంతరించిపోలేదంటే నిదుర మనకు తెలియని ఏదో అత్యంత అవసరమైన పని చేస్తోందని అర్థం. నిదురలో మనిషి మెదడు అభివృద్ధి చెందుతుంది. మన నిదురలో NREM దశ (75-80 min) REM (10-15min) దశలని రెండు దశలుగా ఉంటాయి. ఈ రెండు కలిస్తేనే తొంభై నిమిషాల నిడివి గల ఒక సైకిల్‌ పూర్తవుతుంది. వీటికనుగుణంగా మెదడు తరంగాలను కొలవవచ్చు. మనం మెలకువతో ఉన్నపుడు బీటా తరంగాలు ఉంటాయి. నిదురకు ఉపక్రమించి కాసేపు రిలాక్స్‌ కాగానే ఆల్ఫా తరంగాలు మొదలవుతాయి. అపుడు మగతనిద్ర అనబడే stage 1 నిద్ర మొదలౌతుంది. ఈ దశలో తీటా తరంగాలుంటాయి. ఇది ఒక ఐదు నిమిషాలుంటుంది. ఆ తర్వాత stage 2లో sleep spindles లేదా k complexes అనబడే తరంగాలుంటాయి. ఇది చాలా ముఖ్యమైన దశ. ఇది పది నిమిషాలుంటుంది. ఆ తర్వాత ఐదునిమిషాల కంటే తక్కువగా stage 3 దశలో డెల్టా తరంగాలుంటాయి. అప్పుడు stage 4 తీటా తరంగాలతో గాఢనిద్రలోకి మనిషి జారుకుంటాడు. ఇది దాదాపు 45 నిమిషాలుంటుంది. ఆ తర్వాత మళ్ళీ రివర్స్‌లో 10 నిముషాలు స్టేజి 3 దశకు చేరుకుంటాడు. అపుడు ఆల్ఫా, బీటా, తీటా తరంగాలతో కలగలిసిన REM stage ఉంటుంది. Rapid eye movement దశ. ఈ దశలో మనం గమనిస్తే మనిషి తన కను గుడ్లను కదుపుతూ ఉంటాడు. ఈ దశలోనే మనిషి కలలను కంటాడు. ఇలా ఒక NREM, REM దశలు కలిస్తే ఒక సైకిల్‌. ఒక రాత్రిలో 5 నుండి 6 సైకిల్స్‌ జరుగుతుంటాయి.
ఐతే మనిషి శరీరంలో NREM దశ ఒకపని చేస్తే REM మరో పని చేస్తుంది. NREM దశలో శరీరం తన శక్తిని భద్రపరుచుకుంటుంది. మెదడులోని వివిధ న్యూరానుల మధ్య చలనాలు ఆగి ప్రశాంతత లభిస్తుంది. అంటే కండరాలు మెదడు అన్నీ విశ్రాంతిని పొందుతాయి. REM దశలో మెదడు కొంత యాక్టివ్‌గా ఉంటుంది కానీ శరీర కండరాలు ఇంతకుముందు దశలాగే నిస్సత్తువగా ఉంటాయి. ఐతే వృద్ధాప్యంలో లేదా పార్కిన్సన్‌ వంటి జబ్బులలో REM దశలో మెదడుతో పాటు కండరాలు కూడా యాక్టివ్‌ గా ఉండటంతో వీరు నిదురలోనే నడవడంవంటివి చేస్తుంటారు. అంటే వీరు తమ కలను తమకు తెలియకుండానే యాక్ట్‌ చేస్తారు. REM దశలో వచ్చే కలలు అణచివేసి ఉంచిన కోరికలను తీర్చేవిగా ఉంటాయని సైకో అనలిస్టులు చెబితే, ఈ దశ కంటి కండరాల ఆక్సిజెనేషన్‌ కి పనికి వస్తుందని అనటమిస్టులు చెబుతారు. పిల్లల నిద్రలో REM దశ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, పిల్లల మెదడు వికసించేది ఈ దశలోనే. పిల్లల మొత్తం నిద్రలో ఎనభైశాతం REM దశనే ఆక్రమిస్తుందంటే వారి మెదడు ఎదుగుదలలో దీని ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. ఐతే పెద్దలలో ఇది చాలా తక్కువ సమయం ఆక్రమిస్తుంది. పెద్దలలో ఈ దశ మెదడు రిపేర్‌ కి పనికివస్తుంది. ఐతే ముఖ్యంగా మనం గమనించవలసిన అంశం ఒకటుందిక్కడ. రాత్రి పడుకుని పొద్దున అయ్యేకొద్దీ ఒక నిదుర సైకిల్‌ లో REM దశ సమయం పెరుగుతూ పోతుంది. అందుకే మనకు ఉదయం పూట వచ్చే కలలు గుర్తుండిపోతాయి. ఉదయం పూట త్వరగా లేచే అలవాటు లేని వ్యక్తిని ఉదయమే లేపామనుకోండి అతడు చాలా మటుకు REM నిద్రను కోల్పోతాడు. అదే పిల్లలైతే వారి మెదడును శక్తివంతం చేసే ఈ REM దశను మరింతగా కోల్పోతాడు.
మనుషులలో నిద్రవిషయంలో రెండు రకాల వ్యక్తులుంటారు. మామూలు ఇంగ్లీషు భాషలో Early larks and late owls అని, Early bird, late bird అని కూడా అంటారు. రాత్రి ఎనిమిది తొమ్మిదికల్లా నిద్రపోయేవారిని early lark అనీ, రాత్రంతా మేలుకుని ఏ మూడు నాలుగు గంటలకో నిదురపోయే వాళ్ళను late owl అనీ అంటారు. ఐతే ఇవి వ్యక్తుల అలవాట్లకు సంబంధించినవి మాత్రమే కాక ఇవి జెనెటికల్లీ కూడా నిర్మితమై ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఒక వ్యక్తి లేటుగా పడుకోవడానికి అతడి అలవాట్లు కారణమా లేక అది జెనిటికల్‌ గా నిర్మితమైన అంశమా అని చెప్పడం కష్టం. కానీ సాధారణంగా యుక్తవయసులో late owl గా ఉన్నవారు కూడా వయసు పెరిగేకొద్దీ early lark గా మారడం కూడా గమనించవచ్చు. ఐతే సమాజం లేటుగా పడుకోవడాన్ని తప్పుగా చూస్తుంది. సమాజం మొత్తం తొందరగా నిద్రలేచి పనుల్లోకి పోయేవిధంగానే నిర్మించబడ్డది. ఒక స్టడీ ప్రకారం జనాభాలో 40 శాతం early larks 30శాతం late owls మిగిలిన 30% ఈ రెంటికీ మధ్యలో ఉంటారు. ఐతే దీర్ఘకాలిక జబ్బులు late owlsలో కలగటానికి కారణం వారికి సరైన నిద్రను సమాజం కలిగించకపోవడమే. ఏ మూడు నాలుగ్గంటలకు పడుకున్న late owl ఐనా మళ్ళీ ఉదయమే లేచి స్కూలుకో, కాలేజీకో, ఆఫీసుకో పోవలసిందే. ఉదయమే లేవకపోతే అతడిని బద్ధకస్తుడిగా మనం గుర్తిస్తుంటాం. పైగా తొందరగా పడుకోవచ్చు కదా అని వొత్తిడి చేస్తుంటాం. అతడికి జెనెటికల్‌ మేకప్‌ ప్రకారం నిద్రరాదు అని అంటే డాక్టర్‌ దగ్గరనుండి నిద్ర ట్యాబ్లెట్లు అలవాటు చేస్తాం. పసిపిల్లలలో రోజుకి 16 గంటల నిద్ర అవసరం. స్కూలు వయసు పిల్లలకు పదిగంటల నిద్ర అవసరం. పెద్దవారికి ఎనిమిది గంటలు ముసలివారికి ఏడు గంటల నిద్ర అవసరం. ఐతే ఒక స్కూలు పిల్లగాడు late owl అనుకుందాం. ఏ రాత్రి పన్నెండు గంటలకో ఒంటిగంటకో పడుకుంటే ఉదయం ఆరుగంటలకు లేచి అతడు స్కూలుకి రెడీ కావలసి ఉంటుంది. అంటే అతడు తనకు అవసరమైన నిద్రను కోల్పోతున్నాడు. అంతమాత్రమే కాదు ఇందాకా చెప్పినట్టు ఉదయం పూట REM SLEEP STAGE ఎక్కువ గా ఉంటుంది. అది మెదడు పనితీరును అభివృద్ధి పరుస్తుంది అనుకుంటే ఉదయం పూట లేచిన late owl విద్యార్థి తనకు చాలా ముఖ్యమైన REM STage నిద్రను కోల్పోతాడు. దీనితో అతడిలో నిస్సత్తువ పెరిగి, చదువులో వెనుకబడతాడు. మన సమాజంలో నిదురకు సంబంధించిన అవగాహన పెరగలేదు కాబట్టి మన జీవితాన్ని బ్రహ్మ ముహూర్తంలోనే లేవడం వంటి ఆదర్శ భావనలతో మరింత కఠినతరంగా చేసుకుని నిదురను విస్మరిస్తుంటాం. శాస్త్రీయ దక్పథం పెరిగేకొద్దీ అందుకు తగ్గ మార్పులను మనం చేసుకోవలసి ఉంటుంది.
దీర్ఘకాలిక జబ్బులకే కాకుండా రోడ్‌ యాక్సిడెంట్లకూ నిద్రలేమి ప్రధాన కారణం. ఆల్కాహాల్‌ కంటే నిద్రలేమివలన జరిగే యాక్సిడెంట్లే ఎక్కువగా ఉంటాయంటే అతిశయోక్తి కాదు. చెర్నోబైల్‌ వంటి సంఘటనలు జరగడానికి కూడా అక్కడ పనిచేసేవారి నిద్రలేమి కూడా కారణమనే వాదన ఒకటుంది. ఫ్లైట్‌ యాక్సిడెంట్లకూ పైలెట్ల నిద్రలేమినే కారణమమనీ, వారు సుదూర ప్రాంతాలకు తిరుగుతూ ఉండటంతో బయలాజికల్‌ గడియారం పనిచేయక వారి పనితీరులో లాజికల్‌ థింకింగ్‌ తగ్గి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందనీ పరిశోధనలు చెబుతున్నాయి. పైలట్లనే కాదు సాధారణ మనుషులు సైతం నిద్రలేమి వలన సరైన నిర్ణయాలు తీసుకొలేరు. పరీక్షలలో సరిగ్గా నెగ్గలేరు. ముఖ్యంగా విద్యార్థులకూ, కఠినమైన పనులు చేసేవారికీ, ట్రక్కు డ్రైవర్లు, పైలెట్లు వంటివారికి నిదురకు సంబంధించిన కచ్చితమైన షెడ్యుల్‌ ఉండవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ర్యాంకుల వెంట పరిగెట్టే యువత నిదురను అలక్ష్యం చేస్తూ చదవడం వలన మెదడు పనితీరును బండబారుస్తున్నారనే విషయం తెలుసుకోవాలి. సరైన నిదురలేకుండా చదివే extra time చదువు వలన లాభం లేకపోగా నష్టమే ఎక్కువ అని గుర్తెరగాలి. నిదుర రాకూడదని కాఫీ, టీల మీద అధారపడుతూ చదివే చదువు శ్రేయస్కరం ఏవిధంగాను కాదు.
ఐతే నిద్రలేమితో పాటు ఈ మధ్య పెరుగుతున్న మరో సమస్య OSA (OBSTRUCTIVE SLEEP APNEA). డ్రైవర్లలో డెభ్భైశాతం మందికి ఈ సమస్య ఉందని, దానిలో పది శాతం మందికి తీవ్రంగా ఉందని ఒక సర్వే చెబుతోంది. గొంతు కండరాలలోపల కొవ్వు పెరగడంవలన నిదురలో వీరి నాలుక నోటి కుహరంలో వెనుకకి పడిపోవడం గురకవస్తుంది. దాని వలన గాలి నోటిలోనే ఆగిపోయి సరైన ఆక్సిజన్‌ శరీరానికి అందదు. అప్పుడు శరీరంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ శాతం పెరిగి దాని ప్రభావంతో మెదడు సడెన్‌గా యాక్టివ్‌ కావడంతో ఆ వ్యక్తి నిదురనుండి లేస్తాడు. దీనిని apnea cycle అంటారు. ఐతే ఈ లేవడం తనకు గుర్తు ఉండదు. ఇలా గంటలో 40 నుండి 100 apnea cycle జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి టాన్సిల్స్‌, లింఫ్‌ గ్రంధుల వాపు, చిన్న గాలి గొట్టాల వలన కూడా ఇలా జరగవచ్చు. ఐతే దీనిని పూర్తిగా అలక్ష్యం చేస్తారు. OSA బీపికి, గుండెజబ్బులకు, సడెన్‌ కార్డియాక్‌ డెత్‌ లకూ కారణం ఔతుంది. దీనిని సకాలంలో గుర్తించి CPAP వంటి మిషిన్ల సహాయంతో చికిత్స తీసుకోవాలి. లేకపోతే ఉదయం పూట ఎపుడంటే అపుడు పనులు చేస్తూ కూడా నిద్రపోవడం దీని ప్రధాన లక్షణం. డెభ్భైశాతం డ్రైవర్లలో ఈ లక్షణం గుర్తించారంటే మనం దీనిని ఎంతగా అలక్ష్యం చేస్తున్నామో రోడ్‌ ట్రాఫిక్‌ యాక్సిడెంట్లకు ఏది ప్రధానమైన కారణమో అర్థం చేసుకోవచ్చు. ఐతే. ఈ సమస్యలేవీ గుర్తించకుండా నిదుర రాకుండా ఉండేందుకు అలర్ట్‌ గా ఉండేందుకు కాఫీ, టీ వంటి పదార్థాలని తీసుకుంటూ ఉంటారు. సుదూర ప్రాంతాలకు నడిపే డ్రైవర్లు నిదుర వచ్చినపుడల్లా వాహనం పక్కకు తీసుకుని కాఫీ తాగుతూ ఉంటారు. కాఫీ ఎఫెక్ట్‌ పోగానే బలవంతంగా ఆపుకున్న నిద్ర ఆపుకోలేని దశకు చేరి వాహనం నడుపుతుండగానే నిద్రపోతుంటారు. పరిణామం మనకు తెలిసినదే.
మనిషి ఎక్కువ సమయం పని చేసే కొద్దీ మెదడులో ఇంక చాలు అని చెప్పేందుకు అడినోసిన్‌ అనే పదార్థం నిండుతూ ఉంటుంది. అంటే సాయంత్రం దాటి రాత్రి సమీపించే కొద్దీ మెదడులో ఎడినోసిన్‌ ఎక్కువగా చేరుతుంది. కానీ సాయంత్రం తాగే కాఫీ, టీలలోని కెఫిన్‌ పదార్థం అడినోసిన్‌ రిసెప్టర్‌ లను నింపేసి నిదురను తాత్కాలికంగా నిలుపుదల చేస్తుంది. కానీ కెఫిన్‌ half life ఏడు గంటలు. సాయంత్రం ఒక కప్పు కాఫీ తాగితే దాని ప్రభావం పూర్తిగా తొలగిపోవడానికి అర్ధరాత్రి దాటి ఉదయానికి కూడా సమీపించవచ్చు. వృద్ధులలో కెఫిన్‌ పూర్తిగా తొలగడానికి మరింత సమయం పడుతుంది. ఐతే విపరీతంగా కెఫిన్‌ పదార్థాలకు (కొన్ని చల్లని పదార్థాలలో కూడా) ప్రజలు అలవాటు పడ్డారు. దీనితో సరైన నిద్ర లేక రాత్రులలో ఇబ్బంది పడుతూ పొద్దున లేవలేక, లేచినా సరిగా ఏకాగ్రత నిలపలేక సతమతమౌతూ ఉంటారు. ఇవే మెల్లిగా దీర్ఘకాలిక జబ్బులకు దారి తీస్తాయి. ఉదయం పూట మీరు బలవంతంగా నిద్ర ఆపుకోవలసి వస్తున్నదా? నిదురపోకుండా ఉండేందుకు యాక్టివ్‌ గా ఉంటుందని కాఫీ తాగుతున్నారా లేదా సాయంత్రం వరకు మరోసారి లేదా పదే పదే కాఫీ లేదా టీ తాగకపోతే మీకు మగతగా నిస్సత్తువగా అనిపిస్తుందా..? ఐతే మీరు తప్పక అర్థం చేసుకోవలసిన అంశం మీకు సరైన నిద్ర లేదని. చాలా ఆఫీసులలో పని క్షేత్రాలలో యేళ్ళ తరబడి ఇదే రొటీన్‌ ని అలవాటు చేసుకున్నవారు, తాము తక్కువగా నిదుర పోతున్నామని గుర్తించరు. Sleep debt (నిద్ర బాకీ) అని ఒక భావన ఉంది. ఒక వ్యక్తి తనకు కావలసిన నిద్ర పోకపోతే ఆ మిస్సైన నిద్ర మెదడులో Sleep debt గా స్టోరై ఉంటుంది. అవసరం వచ్చినపుడు ఆ వ్యక్తి ఆ మిగిలిన నిద్రను తీర్చుకుంటూ ఉంటాడు. సాధారణంగా మనిషిలో ఎనిమిది నుండి పదిగంటల Sleep debt ఉంటుంది. ఐతే ఎపుడైతే ఇది యాభై గంటలను దాటుతుందో అది తీవ్రదశకు చేరుకున్నట్టు. వీళ్ళకు రక్తపోటు, గుండెపోటు, సడెన్‌ డెత్‌, పక్షవాతం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఆదివారాలో లేక పండగ సెలవు దినాలకో వీలైనంత నిద్రపోవడం వలన చాలామటుకు Sleep debt తగ్గించుకోవచ్చు. కానీ అందుకు భిన్నంగా కాఫీ, టీలతో మన శరీరాలను ఆరోజే ఎక్కువగా నింపుతుంటాం.
కాఫీ ఫుడ్‌ సప్లిమెంట్‌ కాదు. ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వాడబడుతున్న సైకో యాక్టివ్‌ సబ్స్టెన్స్‌ కాఫీ. పెట్రోలియం తర్వాత అతి ఎక్కువగా వాణిజ్యమౌతున్న పదార్థం కాఫీ. మనం కృత్రిమ సైకో యాక్టివ్‌ సమాజాన్ని సృష్టించుకున్నాం. అందుకే నిద్రలేమి ఒక పాండెమిక్‌ గా మారింది. ఐతే నిద్రలేమికి విరుగుడుగా నిద్రమాత్రలను వాడటం సరైన పద్ధతి కాదు. చాలామంది డాక్టర్లు కూడా నిద్ర శుభ్రతను (sleep hygiene) పేషంట్లకు వివరించడంలో సఫలీకృతం కాలేకపోతున్నారు. పేషంట్‌ సాటిస్ఫాక్షన్‌ కోసమని నిదుర మాత్రలు రాయడం తప్పని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. పేషంట్లతో పాటు డాక్టర్లు కూడా నిద్ర శుభ్రతను అర్థం చేసుకుని పేషంట్‌కి తగ్గట్టు కష్టమైజ్‌ చేయగలగాలి. Late owls ని గుర్తించి వారు మరీ త్వరగా నిదుర లేవడం వలన వారిని బద్ధకస్తులని వారిపై బలవంతంగా ఆదర్శాలను రుద్దడంవలన లాభం ఉండదనీ గుర్తించాలి. విద్యార్థులలో నిదుర ప్రాముఖ్యత గురించి కార్పోరేట్‌ స్కూళ్ళల్లో, కాలేజీల్లో సెమినార్లు నిర్వహించి అవగాహన పెంచాలి. నిద్రకు సంబంధించి నిర్థారణ కాని జబ్బులు వందకు పైగా ఉన్నాయి. సరైన సమయంలో వ్యాధి నిర్ధారణ జరగాలంటే ముందు నిద్రపైన అవగాహన పెరగాలి. నిద్ర సులువుగా కొట్టివేయవలసిన అంశం కాదనీ, నిర్లక్ష్యం వహించవలసిన అంశం అసలే కాదనీ గుర్తెరగాలి. నిద్రకు ఆల్టర్నేటివ్‌ ఏదీ లేదు. అన్నానికి బదులు ఆకులు, అలములు, పళ్ళు తిని బతకవచ్చు. కానీ నిద్రకు బదులుగా మరేది లేదు. నిద్రపోవాల్సిందే. World sleep Society అందుకే నిదురపై అవగాహనను పెంచడంకోసం ప్రతిసంవత్సరం మార్చి 15 ను sleep day గా గుర్తించి అవగాహన కోసం ప్రయత్నిస్తోంది. 2024 సంవత్సరానికి గాను అందరికీ సమానమైన నిద్ర అవసరాన్ని గుర్తు తెస్తుంది. కొందరు ‘మాకు చాలా తక్కువ సమయం నిద్ర సరిపోతుంది’ అని గొప్పలు పోవడం చూస్తుంటాం. అది ఏమాత్రం గొప్ప కాదనీ, అది తెలియని ఒక నిద్రసంబంధ జబ్బని గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి. అందుకే ఈ oxymoron ‘మేలుకోండి.. సరైన నిద్ర అవసరమని గుర్తించండి’.
– విరించి విరివింటి, 9948616191

]]>
రుచికి రుచి… ఉపాధికి ఉపాధి… https://navatelangana.com/a-taste-for-a-taste-for-a-job-for-a-job/ Sat, 09 Mar 2024 16:47:37 +0000 https://navatelangana.com/?p=245296 Taste for taste... employment for employment...ఎక్కడికివెళ్లినా రోడ్డుపై టిఫిన్‌ సెంటర్ల నుంచి మినీ ‘స్ట్రీట్‌ హోటళ్ల’ దాకా ఎన్నో .. ధరలు తక్కువ.. ఉన్నంతలో రుచీ ఎక్కువే. అయితే స్ట్రీట్‌ ఫుడ్‌కు.. చాలా చరిత్రే ఉంది. ఎప్పటి నుంచో నగరాల్లోని వీధుల్లో ‘వేయించిన గింజలు, రొట్టెలు’ వంటివి అమ్మేవారట. పాత రుచులపై మొహం మొత్తిన కొద్దీ, జనం పెరిగిన కొద్దీ.. మెల్లగా కొత్త కొత్త రుచులు పుట్టుకొచ్చాయి. స్థానిక ఆచారాలు, ఆహార అలవాట్లను బట్టి ఎక్కడికక్కడ కొత్త వెరైటీలు మొదలయ్యాయి. అందుకే వీటిలో దొరికే రుచి పెద్దపెద్ద ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లోనూ లభించదు. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఆహార పద్ధతులు మారుతూ ఉంటాయి. ఇక మన దేశంలో ఎన్నో రకాల ప్రత్యేకమైన, విభిన్నమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో స్ట్రీట్‌ఫుడ్‌కి ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వీటి వద్ద కనిపించే జససందోహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ మధ్య బీటెక్‌ చారువాలీ దగ్గర్నుంచి, గ్రాడ్యుయేట్‌ పానీపూరీ వరకు.. ఎంతోమంది యువత సైతం స్ట్రీట్‌ ఫుడ్‌ అమ్ముతూ తమకంటూ సొంత గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఏ వీధి చూసినా స్ట్రీట్‌ఫుడ్‌ వద్ద జనం కిటకిటలాడుతుంటారు.
వీధిలో నిలబడి ఓ కప్పు చారు, ఓ సాయంత్రం నాలుగు ప్లేట్ల పానీపూరీ విత్‌ ప్యాజ్‌, కాసింత చాట్‌.. బాగా వేయించిన ఫిష్‌ ఫ్రై.. గరం గరం మిర్చి బజ్జీలు, వేడివేడి ఇడ్లీలు, వావ్‌ అనిపించే వడాపావ్‌లు.. తినని సగటు జీవి ఉండడు. మన రోడ్లన్నీ ఘుమ ఘుమలాడే రెస్టారెంట్లే కదా.. మన కడుపు నింపి, వారి కడుపు నింపుకొనే నలభీములు తిరుగాడే ప్లేస్‌లే కదా.. పల్లె, పట్నం తేడా లేదు. వెజ్‌, నాన్‌ వెజ్‌ తేడాల్లేవు.
హైదరాబాద్‌ అనగానే గుర్తుకు వచ్చేది చార్మినార్‌, హుస్సేన్‌ సాగర్‌. అదే ఫుడ్‌ విషయానికి వస్తే.. ధమ్‌ బిర్యానీకి భాగ్యనగరం ఎంతో ఫేమస్‌. అలానే స్ట్రీట్‌ ఫుడ్‌ కు కూడా హైదరాబాద్‌ నగరం పెట్టింది పేరు. రోడ్డు సైడ్‌ ఫుడ్‌ సెంటర్లు ఎక్కువగా ఏర్పాటయ్యాయి. ఇదే సమయంలో సోషల్‌ మీడియా యూజర్లకు ‘కుమారి’ అనే పేరు ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. నెటిజన్లంతా ఆమెను అభిమానంగా కుమారి ఆంటీ అని పిలుస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఆమె బాగా ఫేమస్‌ అయ్యారు. ఇన్‌ స్టాగ్రామ్‌, ట్విట్టర్‌, ఫేస్‌ బుక్‌ యూజర్లకు కుమారి ఆంటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె చేతి వంటకు హైదరాబాద్‌లో చాలామందే ఫ్యాన్స్‌ ఉన్నారు. మరి మన దేశంలో తప్పకుండా రుచి చూడాల్సిన స్ట్రీట్‌ఫుడ్స్‌ ఏంటన్నది చూసేద్దామా..
షాజహాన్‌ చాట్‌ …
మొఘలుల కాలం నాటికి స్ట్రీట్‌ ఫుడ్‌ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందట. షాజహాన్‌ ఆగ్రా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చినప్పుడు.. వర్తకులు, రోజువారీ పనిచేసుకునేవారు మధ్యాహ్నం కడుపు నింపుకోవడానికి వీలుగా ‘చాట్‌’ స్టాల్స్‌ను ఏర్పాటు చేయించాడని అంటారు. అలా మొదలైన ‘చాట్‌’ ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.
గ్రీస్‌ .. ఫ్రై ఫిష్‌..
ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. గ్రీస్‌ సామ్రాజ్యంలో పదివేల ఏళ్ల కిందే ‘స్ట్రీట్‌ ఫుడ్‌’ అమ్మకాలు మొదలయ్యాయట. ప్రధాన రహదారుల పక్కన ఫ్రై చేసిన చేప ముక్కలను అమ్మేవారట. తర్వాత ఇది రోమ్‌కు విస్తరించిందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే నాడు ‘స్ట్రీట్‌ ఫుడ్‌’ ధనవంతులకేనని, వారు ఇళ్లలో వండుకోకుండా తెప్పించుకుని తినేవారని అంటున్నారు. తర్వాత నగరాలకు విస్తరించి, జనాభా పెరిగే కొద్దీ.. ‘స్టాల్స్‌’ పెరిగిపోయి పేదల ఫుడ్‌గా మారింది.
ఈజిప్ట్‌ బ్రెడ్‌..
క్రీస్తుపూర్వం 1200వ సంవత్సరం సమయంలోనే ఈజిప్ట్‌లోని సిర్సా నగర వీధుల్లో గోధుమ రొట్టెలను అమ్మినట్టు పురాతత్వ తవ్వకాల్లో గుర్తించారు.
స్టూడెంట్స్‌కు నంబర్‌ వన్‌
స్ట్రీట్‌ ఫుడ్‌ ఏనాడో భారత సంస్కతిలో, చరిత్రలో ఓ భాగమైపోయింది. మెల్లగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకూ విస్తరించింది. కాలేజీ స్టూడెంట్లు, ఉద్యోగులు, రోజువారీ పనిచేసుకునేవారు, ఏదో ఓ పనిపై బయటికి వెళ్లేవారు.. ఇలా అందరికీ ‘స్ట్రీట్‌ స్టాల్స్‌’తోనే కడుపు నిండేది. ఇలాంటి వారు ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటారో.. అలాంటి ప్రాంతాలన్నీ స్ట్రీట్‌ ఫుడ్‌కు అడ్డాలే.
ఇటీవల వారణాసిలో నిర్వహించిన అధ్యయనంలోనూ ఈ విషయం స్పష్టమైంది. 25 – 45 ఏళ్ల మధ్య వయసువారిలో 42 శాతం, 14 -21 ఏళ్ల మధ్య వయసువారిలో 61 శాతం మంది ఉద్యోగులు, విద్యార్థులు మధ్యాహ్నం పూట ‘స్ట్రీట్‌ ఫుడ్‌’తోనే బండి లాగించేస్తామని చెప్పడం గమనార్హం.
రాజస్థాన్‌లోని ఉదరుపూర్‌లో ఉన్న మహారాణా ప్రతాప్‌ వ్యవసాయ, సాంకేతిక వర్సిటీ విద్యార్థుల ‘స్ట్రీట్‌ ఫుడ్‌’ అలవాటుపై ఇటీవల ఓ సర్వే జరిగింది. రుచిగా, ధర తక్కువగా ఉండటం, త్వరగా తినేయగలగడం, స్నేహితులతో కలసి సరదాగా వెళ్లి తినడం వల్ల ‘స్ట్రీట్‌ ఫుడ్‌’కు ప్రాధాన్యత ఇస్తామని 88.3 శాతం మంది యువకులు, 90 శాతం మంది యువతులు వెల్లడించారు.
ఫుడ్‌ పెట్టే… స్ట్రీట్‌
స్ట్రీట్‌ఫుడ్‌ విక్రయించేవారు.. అందరి కడుపు నింపుతూ, తామూ పొట్ట పోసుకుంటున్నారు. మన దేశంలో స్ట్రీట్‌ ఫుడ్‌తో ఉపాధి పొందుతున్నవారు కోటి మంది వరకు ఉంటారని అంచనా. ఇందులో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి పెద్ద నగరాల్లోనే 60 లక్షల మంది దాకా ఉన్నారు. ఈ నగరాల్లో రోజూ ఓ పూట బయటే తిని బతుకు వెళ్లదీస్తున్నవారూ లక్షల మంది ఉన్నారు.
ఇలా అమ్మేవాళ్లు, తినేవాళ్లు కలసి దేశ ఆర్థిక వ్యవస్థ అభివద్ధికీ ఓ చెయ్యి వేస్తున్నారు. దేశంలో స్ట్రీట్‌ఫుడ్‌ రోజువారీ వ్యాపారం విలువ రూ.8 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. అంటే ఏడాదికి రూ.30 లక్షల కోట్లపైమాటే.
దేశంలో ప్రాంతాన్ని బట్టి 2 శాతం నుంచి 10 శాతం మంది జనాభా స్ట్రీట్‌ ఫుడ్‌, దానిపై ఆధారపడిన పనులతోనే ఉపాధి పొందుతున్నారు.
సాటి లేని వెరైటీ..
దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలనే తేడా లేదు.. సమోసాలు, మిర్చీలు, బజ్జీలు, పానీపూరీ, చాట్‌, ఇడ్లీ, దోశ వంటివాటితోపాటు కబాబ్‌లు, ఫ్రైడ్‌ రైస్‌లు, బిర్యానీల దాకా ‘స్ట్రీట్‌ స్టాల్స్‌’లో దొరకని వెరైటీలంటూ లేవు.
జిలేబీ వంటి స్వీట్లనూ అలా రోడ్డుపక్కన నిలబడి లాగించేయొచ్చు. స్ట్రీట్‌ ఫుడ్‌లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం.. ఏ నగరానికి ఆ నగరమే ప్రత్యేకం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పోహా, జిలేబీ కాంబినేషన్‌ ఊరిస్తే.. ముంబైలో వడాపావ్‌ నోరూరిస్తుంటుంది. యూపీలో ఆలూ టిక్కీ ఆకర్షిస్తే.. కోల్‌కతా నగర వీధుల్లో చేపల ఫ్రై, కబాబ్‌ రోల్స్‌ రారమ్మని పిలుస్తుంటాయి.
ఒక అంచనా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోకెల్లా ఇండియాలో ఫుడ్‌ వెరైటీలు ఎక్కువ. పదో, ఇరవయ్యో కాదు.. స్ట్రీట్‌ఫుడ్‌లోనే వందల రకాలు ఉన్నాయి మరి.
స్ట్రీట్‌ ఫుడ్‌ పండుగే..
ఢిల్లీ శివార్లలోని నోయిడాలో ఏటా ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు జరిగే ‘నోయిడా ఉత్సవ్‌’ స్ట్రీట్‌ఫుడ్‌కు వెరీ స్పెషల్‌. ‘నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ స్ట్రీట్‌ వెండార్స్‌ ఆఫ్‌ ఇండియా (నస్వీ) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవంలో.. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన విభిన్నమైన స్ట్రీట్‌ ఫుడ్‌లన్నీ అందుబాటులో ఉంటాయి.
ఆహా.. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా..!
కోటీ విద్యలు కూటి కోరకే అన్నది సామెత. ఆ కూడె డబ్బు సంపాదించి పెడితే అంతకన్న ఇంకా ఏం ఉంటది. హైదరాబాద్‌ మహానగరంలో ఎంతో మంది ఆకలి తీర్చుతున్నాయి స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లు. అతి తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందిస్తున్నాయి. సామాన్యుడి నుంచి సెలబ్రెటీ దాకా ఫుడ్‌ సెంటర్లకు క్యూ కడుతున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంత మంచి భోజనం లభిస్తుందో. ఇటీవల సోషల్‌ మీడియాలో వీటి హవానే నడుస్తుంది. స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్ల నిర్వహకులు సైతం సెలబ్రెటీలు అయ్యారంటే వీటి క్రేజ్‌ ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఎంతో చరిత్ర కలిగిన హైదరాబాద్‌ నగరంలో బిర్యానీ, ఇరానీ చారు, ఉస్మానియా బిస్కెట్స్‌, హలీం, చార్మినార్‌ వద్ద దొరికే గాజులకు ఎంతో పేరుంది. ఇపుడు వాటి సరసన స్ట్రీట్‌ ఫుడ్‌ వచ్చి చేరింది. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలైన కూకట్‌పల్లి, తార్నాక, సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, యూసఫ్‌గూడ, ఫిల్మ్‌నగర్‌, మోహిదీపట్నం, ఇలా మహానగరంలోని అనేక ప్రాంతాల్లో ఈ సెంటర్లు వెలుస్తున్నాయి. ముఖ్యంగా ఐటీి హాబ్‌ ప్రాంతమైన మాదాపూర్‌, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, శేరిలింగంపల్లి, మియాపూర్‌ ప్రాంతాల్లో ఉదయం టిఫిన్‌ లతో ప్రారంభమై ఇపుడు భోజనం, సాయంత్రం స్నాక్స్‌, నైట్‌ డిన్నర్‌ల వరకు 24 గంటలు భోజన ప్రియుల కోసం రకరకాల స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లు పుట్టుకొచ్చాయి. ఉద్యోగాలు చేసుకునే వారు, ఉద్యోగాల కోసం వచ్చేవారు, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, వివిధ రకాలైన డెలివరీ బార్సు ఇలా అన్ని వర్గాల వారు స్ట్రీట్‌ ఫుడ్‌ టెస్ట్‌ చేయడమే కాదు, వాటితోనే ఓ పూట కడుపు నింపుకుంటున్నారు.
నమ్మకమే పెట్టుబడి..
స్ట్రీట్‌ ఫుడ్‌ నిర్వహకులు తమ ఇండ్లలోనే వంట చేసుకుని వచ్చి రోడ్లపై చిన్న టెంట్‌ మాదిరి కవర్లు కట్టి, నాలుగైదు కుర్చీలు వేసి ఫుడ్‌ సెంటర్లను నిర్వహిన్నారు. చదువు రాని వారే కాకుండా, పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కూడా ఈ రంగాన్ని ఎంచుకొని స్వయం ఉపాధితో పాటు లక్షలు గడిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అయితే ఫుడ్‌ సెంటర్ల నిర్వహకులకు కస్టమర్ల నమ్మకమే పెట్టుబడి. కస్టమర్‌ ఒకసారి ఫుడ్‌ సెంటర్‌కు వచ్చి తిన్నప్పుడు టెస్ట్‌ బాగుంటే చాలు ఇక ప్రతీ రోజు అక్కడికే వచ్చి తింటారు. తను తినడమే కాకుండా ఇతరులకు చెప్పుతారు. దాంతో మౌత్‌ టాక్‌ ద్వారా ఫుడ్‌ సెంటర్లకు ప్రచారం జరుగుతోంది. అదే వారికి కస్టమర్లను తెచ్చి పెట్టడమే కాకుండా లాభాలను చేకూర్చుతోంది. ఇదిలా ఉంటే ఈ సెంటర్ల నిర్వహణకు పెద్దగా డబ్బులు కూడా ఖర్చు కావు. అద్దెలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే కరెంట్‌ బిల్లుల ఇబ్బంది ఉండదు. పెద్ద, మధ్యతరగతి హోటల్‌కు వెళ్లినా భోజనం రేట్లు ఎక్కువగా ఉంటాయి. పైగా వెరైటీ ఫుడ్‌కు ఇంకాస్త ఎక్కువ రేట్లుంటాయి. దీనికి తోడు బిల్లుతో పాటు సెంట్రల్‌, స్టేట్‌ జీఎస్టీ బిల్లు కూడా కట్టాల్సి ఉంటుంది. అదే స్ట్రీట్‌ ఫుడ్‌ వద్ద అయితే ఇవేవి ఉండవు. పైగా అదనంగా పెట్టినా అదనపు బిల్లు అడగరు. కాబట్టే స్ట్రీట్‌ ఫుడ్స్‌కు అంత డిమాండ్‌ ఉంది. అలాగే నిర్వహకులకు కూడా కొంత డబ్బు ఆదా అవుతోంది.
ఫుడ్‌ సెంటర్లలో లభించే వంటకాలు..
స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లలో ముఖ్యంగా వెజ్‌తోపాటు నాన్‌వెజ్‌ లభిస్తోంది. వెజ్‌లో పప్పు, చారు, టమట, ఇతర వంటకాలు ఉంటాయి. అలాగే నాన్‌వెజ్‌లో చికెన్‌, మటన్‌, తలకాయ, ఫిష్‌తోపాటు లీవర్‌ ఫ్రై, బొటీ ప్రై వంటకాలు లభిస్తాయి. వెజ్‌ అయితే రూ.70 నుంచి 80వరకు ఉంటుంది. నాన్‌ వెజ్‌ అయితే రూ.100 నుంచి 150 వరకు కర్రీలను బట్టి ఛార్జి చేస్తారు.
ఎందరికో ఉపాధి
స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. యువత, సాధారణ గృహిణులు, చదువుకొని ఒకరి కింద పనిచేయలేక స్వయం ఉపాధితో బతకాలనుకునే వారు ఈ రంగంలోకి వస్తున్నారు. మంచి లాభాలతో పాటు గుర్తింపు పొందుతున్నారు. వ్యాపారం బాగా నడిస్తే వారు మరికొందరికీ ఉపాధి కల్పిస్తున్నారు. ఇలా స్వయం ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించడానికి స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లు ఉపయోగపడుతున్నారు.
సామాన్యుడి నుంచి సెలబ్రెటీ దాకా…
ఇటీవల కాలంలో స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్ల పేర్లు మారుమోగాయి. ఎక్కడ మంచి ఫుడ్‌ లభిస్తుందని సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం వస్తుందో ఆ ప్రాంతానికే సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు ఫుడ్‌ సెంటర్లకు వస్తున్నారు. పెద్ద సంఖ్యలో సెలబ్రెటీ ఇక్కడికి వచ్చి మరీ వారికి కావాల్సిన ఫుడ్‌ను తింటున్నారు. వారు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో అవి వైరల్‌గా మారుతున్నాయి. దాంతోపాటు ఫుడ్‌ సెంటర్ల నిర్వహకులకు ప్రచారం జరుగుతోంది. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో చూసిన వారు ఫుడ్‌ టెస్ట్‌ చేయడం కోసమైనా ఇతర జిల్లాలు, హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఫేమస్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్ల వద్దకు వస్తున్నారు.
సోషల్‌ మీడియాలో కుమారీ అంటీ హల్‌చల్‌
ఐటీ హబ్‌ ప్రాంతంలోని మాదాపూర్‌లో కుమారీ అంటీ ఆమె మహిళా స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఆమె వద్ద ఫుడ్‌ చాలా బాగుంటుంది. అనేక ఫుడ్‌ ఐటెంలు ఆమె వద్ద ఉంటాయి. అయితే ఇటీవల ఆమె సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారారు. ఆమె ఫుడ్‌ సెంటర్‌కు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు వచ్చి తింటుంటారు. సెలబ్రెటీలు రావడంతో కుమారీ అంటీ క్రేజ్‌ మరింత పెరిగింది. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో సామాన్యులు సైతం ఫుడ్‌ సెంటర్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆమె సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో యూట్యూబ్‌ ఛానల్స్‌తో పాటు ఇతర మీడియా ఛానల్స్‌ సైతం ఆమెను ఇంటార్వ్యులు చేయడం, ఆమె ఫుడ్‌ కోర్ట్‌ గురించి మీడియాలో పెట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ ట్రాఫిక్‌ సమస్య తలెత్తడంతో పోలీసులు ఆమె సెంటర్‌ను మూసి వేశారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి ఆమెకు అండగా ఉంటామని, ఆమె ఫుడ్‌ సెంటర్‌కు వచ్చి భోజనం చేస్తానని ప్రకటించాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆమె ఫుడ్‌ సెంటర్‌కు ఎంత క్రేజ్‌ ఉందో. స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్లు ఎంతో మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఎందరివో ఆకలి తీర్చుతున్నాయి. తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందిస్తున్నాయి. ఇప్పటి వరకు స్ట్రీట్‌ ఫుడ్‌ టెస్ట్‌ చేయకుంటే ఒకసారి వెళ్లి మీరు కూడా స్ట్రీట్‌ ఫుడ్‌ సెంటర్‌లో భోజనం చేయండి.
– ఎ. అజయ్ కుమార్‌,
8297630110 

]]>
మ‌హిళా..శ్ర‌మ..విలువ‌… https://navatelangana.com/the-value-of-womens-labor/ Sat, 02 Mar 2024 19:20:34 +0000 https://navatelangana.com/?p=240315 రంగురంగుల చీరలు…
కళకళలాడే కళాశాలలు…
‘ఒరేరు ఈ రోజు వంట మనమే చేద్దాం, అమ్మకి రెస్ట్‌ ఇద్దాం’…
గిఫ్టులు, బొకేలు.. ఎర్ర గులాబీలు, మల్లెపూలు, దండలు, దండాలు, ముగ్గులు, మాటలు, మాటలతో ముగ్గులు, సమావేశాలు, సందేశాలు, సన్మానాలు. స్కూళ్లల్లో, కాలేజీలలో, ఆఫీసులలో ఆడవారి అద్భుతాల బావుటాను ఎగరవేసే రోజు. ఆమె శ్రమను, ఘనంగా కీర్తించే రోజు. భలే మాంచి రోజు. పసందైన రోజు. ఓం ప్రధమంగా అసలు ఈ రోజు ఎలా ఏర్పడిందో చూద్దాము.
8 మార్చ్‌ 1908న, న్యూయార్క్‌ నగరంలో సూదుల ఫ్యాక్టరీలో పనిచేసే మహిళా కార్మికులు బాలకార్మిక వ్యవస్థను, ప్రమాదకర పని పరిస్థితులను వ్యతి రేకిస్తూ అలానే మహిళలకు ప్రాథమిక హక్కులు కావాలని వీధుల్లోకి వచ్చి నినదించారు. ఆ తరువాత 1910 నుండి, మార్చ్‌ 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తించారు. అదే సంవత్సరం ఆగస్టు 26వ తేదీన క్లారా జెట్కిన్‌(1857-1933) ఆ వార్షిక మహిళా దినోత్సవ సందర్బంగా మహిళల ప్రాథమిక హక్కులను మొట్టమొదటి డిమాండ్‌గా కోపెన్‌ హాగెన్‌లో జరిగిన సోషలిస్ట్‌ మహిళల రెండవ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ముందు ఉంచింది. ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన సామజిక, ఆర్ధిక, సాంస్కృతిక, రాజకీయ విజయాలను వేడుక చేసుకొనేందుకు ఏర్పడింది.
వారి నిరంతరం శ్రమతో…
ఈ రోజు జెండర్‌ సమానత్వం కోసం చేసే ప్రయత్నాలను వాస్తవంలోకి తీసుకు రాగలిగే ప్రయత్నాలను మరింత ప్రభా వితంగా ముందుకు నడిపే ఒక ప్రత్యేక దినంగా చూస్తారు. ఈ వందేళ్లలో ఇందరు నిరంతరం శ్రమ పడితేనే ఈ రోజు మనకి ఉద్యోగాలు, వాహనాలు, చట్టాలు, గొంతుక, ప్రశ్న, బాధ్యత వచ్చింది. మన దేశాన్ని ఇందిరా గాంధీ పరిపాలించింది, కల్పనా చావ్లా విశ్వమంతా తానై రెక్కలుసాచి ఎగిరింది, పూర్ణ మాలావత్‌ ప్రపంచంలో అన్ని ఖండాలలోకి ఎత్తైన పర్వతాలను అధిరోహించింది. పల్లెటూరిలో ఒక అడుగు భూమి లేని మహిళల కూతుర్లు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలను సాధిస్తున్నారు. కానీ మహిళ అని ప్రస్తావించినప్పుడల్లా మనకై మనం పదేపదే వేసుకోవలసిన ప్రశ్న ఒకటి ఉంది. మనం ప్రస్తావించే మహిళ- ఏ మహిళ, ఎటువంటి మహిళ?
మహిళంటే…
మన దేశపు మహిళ ఒక్కరని కాదు… ఆదివాసీ మహిళ, దళిత మహిళ, శారీరక లేదా మానసిక వైకల్యం ఉన్న మహిళ, ట్రాన్స్‌ మహిళ, వలస మహిళ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళ, వివక్షకు గురయ్యే మహిళ, విజయాలు సాధించే మహిళ, ఇంటికి పరువు అంటే బరువును మోస్తున్న మహిళ… ఇలా అందరు మహిళలు వస్తారు కదా! వీరందరికి సాధికారత రావడమే మన లక్ష్యం కదా! ఐతే మహిళా సాధికారత గురించి మాట్లాడినప్పుడల్లా మనం సాధారణంగా చేసే పొరపాట్ల నుండి నేర్చుకుందాం రండి.
మహిళలు లేకుండా ఊహించలేం
మహిళల హక్కుల గురించి జరిపే పోరాటంలో తక్కువ వేతనాలపై పోరు ఒక వర్గానికి మాత్రమే చెందినది కాదు. ఇది పల్లెటూర్లలో పని చేసే మహిళా రైతు కార్మికుల నుండి గొప్ప గొప్ప కార్పొరేట్‌ ఉద్యోగుల వరకు సాగుతోంది. ఈ పోరాటం ఆపకూడదు. పోరాటానికి ఆవల జరుగుతున్నా అన్యాయాన్ని కూడా గుర్తించడం అవసరం. మనం కుటుంబం అన్నా ఇల్లు అన్నా మహిళలు లేకుండా ఊహించలేము. మహిళలు ఉంటేనే ఆ కుటుంబం సుభిక్షంగా ఉంటుంది. డబ్బుని ఆహారంగా తినలేము కదా! అంతర్జాతీయ మహిళా హక్కుల కార్యకర్త కమల భాసిన్‌ అన్నట్టు, ఆ డబ్బుని ఆహారంగా మార్చేది మహిళలే. మాసిన బట్టలను పువ్వుల్లా మార్చి తిరిగి మనం వేసుకునే స్థితికి తీసుకు వచ్చేది మహిళలే. అలానే వంట పని, ఇంటి పని… ఇంతేనా? ఇంట్లో ఎవరికీ జబ్బులు వచ్చినా వారిని చూసుకోవడం, మందులు, పత్యాలు, నీరసాలకు రకరకాల ద్రవాలు, కాళ్ళు నొక్కడాలు, తల పట్టడాలు, వాంతులు, విరోచనాలు… ఆగండాగండి. ఇంకా ఉన్నాయి ఇంట్లో ఒకరి మూడ్‌ బాగా లేకపోతే సర్దడాలు, సర్ది చెప్పడాలు, సరైన వాతారణం ఇంట్లో ఉండేలా శ్రమపడడాలు, దానికోసం మాటలు పడడాలు, శ్రమ, ఒత్తిడి వీటికి ఇవ్వవలసిన విలువ మాటేమిటి?
ఇదొక్కటే కాదు ఇలాంటివెన్నో.
మన చేతుల్లోనే ఉందా..?
మనం తెలుసుకోవాలనుకుంటే స్త్రీ జీవితం ఒక సమాజపు రాజకీయ పరిస్థితికి నిదర్శనం. ఇటువంటి కొన్ని విస్మరించే విషయాలను తరచి తరచి చూసి అర్థం చేసుకోవలసింది ఎంతో ఉంది. మనం చెయ్యలేదు కాబట్టి మరెవరు చేయలేదు. ఇదే మాట మరొకలా చెప్పొచ్చు. మనకు జరగలేదు కాలేదు కాబట్టి మరెవరికి జరగలేదు. ‘నన్నెవరూ బాధ పెట్టలేదు కాబట్టి ఏ మహిళా బాధ పడలేదు. నేనెప్పుడూ వివక్షకు గురికాలేదు కాబట్టి, మరే మహిళా వివక్షకు గురి కాలేదు. నాకు నా తల్లిదండ్రులు, భర్త ఆంక్షలు పెట్టలేదు కాబట్టి, అందరూ తల్లిదండ్రులు, భర్తలు పెట్టరు. సమాజం ఇప్పుడు మారింది. ఇంతగా మనం ఫిర్యాదు చేయవలసిన పనిలేదు’ ఇందాక చదువుకున్నట్లు సమాజంలో ఒక వర్గపు మహిళ మాత్రమే లేదు. ఒక్కొక్క కుటుంబం ఒక్కో చిన్న ప్రపంచం. ఆ కుటుంబ పోకడలను ఏ ఒక్కరం అంచనా వేయలేము. మన కుటుంబంలో జరిగే పద్ధతులను విశ్వజనీయం చేయలేము. మనకు అవకాశం రాగానే అందరికి వచ్చినట్లుగా భ్రమిస్తారు చాలామంది. మగవారు కూడా మీకేంటి అన్నట్టు మాట్లాడతారు. కానీ ఒక ఇంజనీరింగ్‌ సీట్‌ సంపాదించడమో లేక ఒక ఉద్యోగాన్ని వెలిగించడమో కాదు. మన సమయం, ఆరోగ్యం, సంపాదన, శ్రమ మన చేతుల్లోనే ఉందా లేక సమాజపు తర్జనికి భయపడి చేతుల నుండి జారిపోతుందా?
హింసను ఉపేక్షించలేక
నేను చేయను కాబట్టి మరెవరు చేయరు, మాకు వివక్ష లేదు కాబట్టి, ఈ రోజుల్లో వివక్ష లేదు అంటారు. వివక్ష ఉందని తెలియడానికి వార్తలు చదివితే చాలు. మనలో కూడా వివక్ష పూర్వపు వాసనలు దాటి వచ్చి ఉండొచ్చు కానీ కొన్ని శతాబ్దాలుగా జీర్ణించుకుపోయిన ఆలోచనలను నిజాయితీగా తరచి చూసుకుంటే మనలోనూ వివక్ష బయటపడుతుంది.
మనం నమ్మినవే విలువలు కావు. కొత్త తరానికి వారి కంటూ వారి విలువలు ఉన్నాయి. పాత త్రాసుతో కొత్త తరాన్ని తూచి తప్పుడు అంచనాలకు రాకూడదు. ఈ రోజుల్లో త్వరగా బ్రేకప్పులు, డివోర్స్‌లు అవుతున్నాయంటే దానికి పూర్తి కారణం అర్థం చేసుకోలేకపోవడమో, సర్దుపోలేకపోవడమో కాదు. వారికి హింసను ఉపేక్షించే తత్త్వం లేదని. అంటే వారు సమాజపు కోరలు దాటి స్వేచ్ఛగా ఆలోచించగలుగుతున్నారని. పెళ్లి లేదా యే బంధమైనా జైలు కాదు. హింసను ఉపేక్షించకపోవడం, ఉపేక్షించకుండా ఉండేదుకు వనరులు, విద్య, ఉద్యోగం, తల్లిదండ్రుల సహకారం ఉండడం సంతోషించే విషయమేగా. ఒక మాట చెప్పినట్లు ‘ఆత్మహత్య చేసుకున్న కూతురి కన్నా హింసించే భర్తను వద్దనుకున్నా కూతురు నయం కాదు?’.
ఆచారాలా… అవమానాలా?
మన ఆచారాలు ప్రకృతితో మమేకమయి ఉన్నాయి. అవి మనిషి-ప్రకృతిలా సహజీవనాన్ని తెలియజెప్పేవి. ఉదాహరణకు సంక్రాతి పండగ ప్రకృతిలో పాడి పంటలకు, మనుషులకు, ఆహారానికి ఉన్న సంబంధాన్ని ముందుకు తెస్తుంది. అది ఒక అందమైన వేడుక. గతించి పోయిన పెద్దలను తలుచుకోవడం, పాత సామాను భోగి మంటలలో విసిరేసి కొత్త ఆలోచనలను ఆహ్వానించడం. ఇటువంటి అద్భుతమైన ప్రతీకలు మన సంస్కృతిలో చూడవచ్చు. కానీ ఇదే సంస్కృతి పితృస్వామ్యంతో కలగలిసి ఉంది. అది అసమానతలను పెంచుతోంది. అక్కడ మనం ప్రశ్నించాలా వద్దా? ఇక్కడ రెండు ఆచారాల పేరుతో జరిగే హింసను, అవమానాన్ని గమనిద్దాం.
బహిష్టు సమయంలో జరిగే వేర్పాటు
ఇది ఆడవారిని వారి శరీరాల్ని, శారీరకమైన ప్రక్రియలను అవమాన పరచడం గాక మరేమిటి? తమ శరీరాలు తప్పు అని, ఇందులో పాపం ఉందని, ఇది పవిత్రము, అపవిత్రము అని నేర్పుతున్నాం మన ఆడపిల్లలకు. తమని తాము వివక్షకు గురి చేసుకుంటూ ఇది ఆచారం అని నమ్మే పిచ్చి తల్లులకు తమ శరీరాన్ని ప్రేమించడం, గౌరవించడం కూడా ముఖ్యమనే విషయం తెలియజేయొద్దా? ఆడవారి శరీరంపైన, ఆరోగ్యం పైన ఉంచవలసిన ధ్యాసను ఏ స్థితిలో శరీర ధర్మాల వలన జరిగే చర్యలను బట్టి తమ శరీరం పవిత్రమో కాదో నిర్ణయించే చట్రంలో బంధించడం సాధికార మార్గమేనా? నిజానికి ప్రకృతిలో ఎవరి శరీరమైనా ఒక అద్భుతం. అందులో జరిగే శారీరక ప్రక్రియలు మహాద్భుతం. ఒక జీవి నుండి మరొక జీవి ప్రాణం పోసుకోవడం ప్రపంచాన్ని కొనసాగించే మహాద్భుత క్రియ. అది ఆడవారి శరీరంలో జరగడం వలన ఆ శరీరం పట్ల ఇంకా గౌరవం పెరగాలి. ఆ దిశగా అందరం ఆలోచించగలగాలి. భర్త చనిపోయాక జరిగే తంతు భర్త చనిపోయిన ఇల్లాలిని అందరి మధ్యలో బొట్టు చెరిపి వేయడం, గాజులు తీయమనడం, తెల్ల చీర కట్టడం ఇదంతా వ్యవస్థాపక నిర్మాణాత్మక హింసే. ఆమె ఆత్మను ముక్కలు చేసి రేపటి నుండి శుభకార్యాలకు నువ్వు పనికి రావు అంటూ ఆమెను అవమానించడం సదాచారం ఎలా అవుతుంది? భార్య చనిపోయిన మగవారికి ఈ ఆచారాలనన్ని ఎందుకు లేవు? పై రెండు విషయాలు మనం ఆచారం అని నమ్ముతున్నాం. అవమానం అని మర్చిపోతున్నాం. ఘోరం ఏంటంటే ఒక ఆడమనిషి చేత మరో ఆడమనిషిని అవమానిస్తున్నాం. ఇటువంటి వేర్పాటు ఒక పితృస్వామ్య కుట్ర మాత్రమే.
ఇదా సాధికారతకు దారి?
సంస్కృతిని దుయ్యబట్టడం వలన మహిళా సాధికారత రాదు. కానీ ఆచారాల పేరుతో మహిళలపై జరిగే హింసను కొనసాగిస్తే మహిళా సాధికారత రాదు. వారి శరీరంపైనే వారికి హక్కు లేనప్పుడు, ఇక సమాజంలో ఏ హక్కులుంటేనేమి?
మనలను మనం ప్రేమించుకొవడం స్వార్థమా?
మన గురించి మనం పట్టించుకోవడం. మన మేధ, మన ఆరోగ్యం, ఆనందం, సమయం, ప్రశాంతత వీటి గురించి పాటుపడడం తప్పుగా వ్యవస్థ మనలను మార్చింది. మహిళలు మొదటగా వారి పిల్లల గురించి, తరవాత భర్త గురించి, ఆ తరవాత ఉద్యోగం, అత్తమామలు, వీలయితే తల్లిదండ్రుల గురించి ఆలోచించాకే వారి గురించి వారు ఆలోచిస్తారు. ఇక్కడిదాకా వచ్చే అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఉన్నా కూడా మళ్ళీ వెనుక నుండి ఒక గిల్ట్‌ తినేస్తూ ఉంటుంది. ఈ సమయం పిల్లలకు ఇచ్చి ఉంటే బావుండేది. వారిని చదివించినా, వండిపెట్టినా, ఇల్లు చూసుకున్నా బావుండేది అనుకుంటూనే ఉంటారు. ఒకవేళ కాసేపు సరదాగా బయటకు వచ్చినా పిల్లల గురించో, ఇంటి గురించో ఆలోచిస్తూ ఉంటారు. లేదా ఇంటి నుండి వీరికి ఫోన్‌ చేస్తూ ఉంటారు. అందరికి అమర్చిపెట్టాకే వారు బయటపడగలిగేది, అయినా ఈ బెంగలూ ఆరాలు తప్పవు. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమంటారు. మహిళలు వారిని వారు పట్టించుకోకపోవడాన్ని, త్యాగాలు చేయడాన్ని కొనియాడుతారు. త్యాగం చేసిన మహిళ మంచి భార్య, తల్లి లేక కోడలు అవుతుంది. తనకు ఇది కావలి అని స్పష్టంగా కోరుకున్న మహిళను విచిత్రంగానే చూస్తారు. త్యాగం చేయాలనీ లేకపోయినా చేసినట్టు కనిపించినా ఆ మహిళలకు ఆదర్శ మహిళలుగా సమాజంలో గౌరవం దక్కుతుంది. మనలను మనం ప్రేమించుకోవడం అంటే అందం ఒక్కటే గుర్తుకు వస్తుంది అందరికి. కాని మహిళలకు కావలసిన శారీరక, మానసిక విశ్రాంతి, చల్లని మాటలు, అందరికి సేవచేయలేకపోయామన్న న్యూన్యత నుండి కాస్త సాంత్వన, మంచి భోజనం, ఆరోగ్యంపై శ్రద్ధ, ఒత్తిడిని తగ్గించుకోవడం ఇది కూడా ప్రేమించుకోడమే. అంతే కాదు తమను తాము లాలించుకుని, ఓదార్చుకుని, గర్వపడడం, అచ్చంగా పిల్లలతో ప్రేమించే తల్లి వ్యవహరించినట్లు మహిళలు వారితో వారు ఏ రోజైన ఉంటారా? చాలా సార్లు వారిని వారు విమర్శించుకోవడమో లేక అడ్డగోలుగా సమర్ధించుకోవడమో చూస్తాము. కానీ వారితో వారు దయగా ఉండడం ఎప్పుడైనా చూశామా?
స్త్రీవాదం అంటే ఇదే కాదు, కానీ ఇది కూడా స్త్రీవాదమంటే పురుష ద్వేషమనుకుంటారు చాలామంది. కానీ కాదు. స్త్రీ వాదం అందరికి సమాన హక్కులు ఉండాలని కోరుకుంటుంది. నువ్వు స్త్రీవాదివా అని ప్రశ్నిస్తే, ‘కాదు నేను మానవతా వాదిని’ అంటారు చాలామంది. మానవులలో స్త్రీలు లేరా? వారికి హక్కులు వద్దా? మరి స్త్రీవాదులమే అని చెప్పడానికి భయమెందుకు? ఎందుకంటే స్త్రీవాదులనగానే వారు పురుష ద్వేషులు అనుకుంటారు. నిజానికి పురుషులలో కూడా ఎందరో స్త్రీవాదులు ఉన్నారు. స్త్రీవాదం స్త్రీలకు మాత్రమే సొంతం కాదు. ఎవరైతే మనుషులందరికి సమాన హక్కులు ఉండాలి అని కోరుకుంటారో వారందరు స్త్రీవాదులే.
స్త్రీ వాదం… స్త్రీ పురుషలకు మాత్రమే కాక అన్ని జెండర్లకు సమాన హక్కులు, అవకాశాలు ఉండాలని పోరాడుతుంది. సమాజం అసమానతలతో నిండి ఉన్నది కాబట్టి, ఆ అవకాశాలలో స్త్రీలు వెనుకబడి ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా స్త్రీల గురించే ఈ పోరాటం సాగుతోంది. సమయం గడుస్తున్నా కొద్దీ వేరే జెండర్లను కూడా గుర్తిస్తున్నాము. అలా మహిళలు మాత్రమే కాక వేరే జెండర్లను కూడా కలుపుకు సాగిపోయే ఈ పోరాట లక్ష్యం పురుషులను ద్వేషించడం కాదు, పితృస్వామ్యం సృష్టించిన అసమానతలను తొలగించడం.
మహిళా దినోత్సవంలో పురుషుల పాత్ర
మహిళా దినోత్సవం స్త్రీల కొరకు జరిగినా అది స్త్రీలకు మాత్రమే పరిమితమైన రోజు కాదు. సమాజంలో సమానత్వం రావాలంటే ప్రత్యేకంగా ఒక్క వర్గంతో మాత్రమే పని చేస్తే రాదు. మహిళా దినోత్సవ రోజున మగవారు కూడా కలగలుపుకుని సాగాలి. పువ్వులు, బొకేలు, పొగడ్తలు కాదు. మహిళా హక్కులపై, వారి శ్రమపై, వారు సాధించవలసిన విజయాలపై మగవారు కూడా దృష్టి సారించి ఆ దిశగా నడవాల్సి ఉంటుంది. ఇది ఒక సహప్రయాణమని గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. సమాజంలో సమానత్వం కోసం ఒకరి పట్ల మరొకరికి సహానుభూతి, సౌహార్ద్రత, సహజీవన విలువలు పెంపొందించుకుంటే, మహిళా సాధికారత లక్ష్యం మహిళలొక్కరిదే కాదు, మనుషులందరిది అని తెలుసుకుంటాం.

ఇంతటితో తృప్తి పడదామా..?
మహిళలపై వివక్ష అనగానే కాలం మారింది. ఇప్పుడు పరిస్థితులలా లేవు అంటారు. నిజమే చాలా మంది పరిస్థితి మారింది. మీ ఇంటి పరిస్థితి మారి ఉండొచ్చు. కానీ భారత దేశంలో ప్రతి మహిళ పరిస్థితి మారిందా? నగరాల్లోనేకాదు, పట్టణాలలో, గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాలలో, మీ ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లో? మీ ఇంట్లో పని చేసే మనిషి, మీ ఊరిలో కూలి పనికి వచ్చే మహిళా రైతు వీరందరి పరిస్థితి ఒకలానే మారిందా? స్వేచ్ఛా పరిమితులు ఒక్కో తరానికి ఒక్కొక్క రకంగా మారుతాయి. మీ అమ్మలనాడు అనుకున్న స్వేచ్ఛ మీ తరానికి మామూలయిపోయి ఉండొచ్చు. కానీ ఇంతటితో తృప్తి పడి ముందుకు సాగకుండా ఆగిపోదామా? అలా వీలు కుదరదు కదా! మనం సాధించ వలసింది ఇంకా ఎంతో ఉంది. సాధికారత ఒక వర్గం మహిళకు మాత్రమే సొంతం కాదు. అందరు మహిళలకు అన్ని అవకాశాలు రావాలి. అందుకు అందరం అందరికి తోడ్పడాలి. మహిళలందరిపై సహానుభూతి మహిళా సాధికారతకు దారి. సహానుభూతి లేని అభివృద్ధి వలన అందరికీ న్యాయం జరగదు. అది స్వార్థానికి, హ్రస్వదృష్టికి నిదర్శనం.

– అపర్ణ తోట
[email protected]

]]>
సైన్స్‌… ఒక సామాజిక నైతికత https://navatelangana.com/science-is-a-social-ethic/ Sat, 24 Feb 2024 16:44:14 +0000 https://navatelangana.com/?p=235097 సైన్స్‌... ఒక సామాజిక నైతికత ప్రపంచంలో మనుగడ సాగిస్తున్న ప్రతి సమాజానికీ తనకంటూ ప్రత్యేకమైన విశ్వాసాలు, ఆచరణలు ఉంటాయి. తమ చుట్టూ ఉన్న ప్రాకతిక అంశాలని పరిశీలించటం వల్ల ప్రధానంగా వారికీ ఈ విశ్వాసాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. భిన్న సమాజాలు, భిన్న సంస్కతులు ఉన్న నేలమీద ఈ విశ్వాసాలు కూడా బిన్నంగానే ఉంటాయి. కాని ఈ విశ్వాసాలతో ఎటువంటి సంబంధం లేకుండా, సష్టిని నడిపించే కొన్ని నిజాలు ఉంటాయి. ఆ నిజాల మీద ఆవిర్భవించిందే సైన్సు. ఇది కాలక్రమంలో పరిణితి చెందుతూ ఉంటుంది. కాని విశ్వాసాలు పరిణితి చెందవు. ఘనీభవించిన శిలాసాదశ్యాలుగా మిగిలిపోతాయి. అవి హేతువుకి లొంగవు. కాని సైన్సు హేతువు మీద ఆధారపడి వద్ధి చెందుతుంది. అలా ప్రపంచ వ్యాప్తంగా పరిఢవిల్లిన సైన్సు ప్రస్థానం భారతదేశంలో కూడా అప్రతిహతంగా సాగింది. సర్‌ సి.వి. రామన్‌ వంటి అనేకమంది శాస్త్రవేత్తలు అపారమైన ప్రజ్ఞాపాటవాలతో భారతదేశ విజ్ఞాన శాస్త్ర ఖ్యాతిని దిగంతాల వరకు విస్తరింప చేసారు. ‘విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు, నిరంతర పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవత్తే విజ్ఞానశాస్త్ర అభివద్ధికి బాటలు వేస్తాయని’ భారతరత్న అందుకున్న సమయంలో సర్‌ సి.వి. రామన్‌ చేసిన ప్రసంగం కాలాలను దాటుకుని, నేటికి యువతకు కావలసినంత ప్రేరణను ఇస్తుంది.
సీవీ రామన్‌గా పేరుగాంచిన చంద్రశేఖర్‌ వెంకటరామన్‌ భారత దేశ విజ్ఞాన రంగానికి భౌతికశాస్త్రంలో అందించిన సేవలను స్మరించుకుంటూ, ప్రతి సంవత్సరం ఆయన రామన్‌ ఎఫెక్ట్‌ ను కనుగొన్న ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్‌ దినోత్సవంగా జరుపుకోవాలని 1986లో భారత ప్రభుత్వం ప్రకటించింది. నాటి నుండి ఏటా ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్‌ దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం బిన్నమైన థీమ్‌ లతో విద్యార్ధులు, పరిశోధకుల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల జిజ్ఞాసని పెంపొందించడానికి జాతీయ సైన్స్‌ దినోత్సవం పేరుతో ప్రభుత్వం అనేక కార్యక్రమాల్ని నిర్వహిస్తుంది. 2024 సంవత్సరానికి సంబంధించిన జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని ‘వికసిత భారత్‌ కోసం స్వదేశీ సాంకేతికతలు’ అనే నినాదంతో జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. ఈ మేరకు కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖా మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ ఫిబ్రవరి 6న న్యూ ఢిల్లీలో ‘విక్షిత్‌ భారత్‌ కోసం స్వదేశీ సాంకేతికతలు’ పేరుతో ‘నేషనల్‌ సైన్స్‌ డే 2024’ థీమ్‌ను విడుదల చేశారు.
సైన్సు పుట్టుక, ప్రస్థానం…
సైన్సు అనేది ప్రపంచంలో మనకు తెలిసిన లేదా తెలియని అనేక అంశాలని, విషయాల్ని ఒక పరిశోధనా పద్ధతి ప్రకారం వివరించే శాస్త్రం. సైన్సు ద్వారా ఆవిష్కతమయిన అనేక ఆవిష్కరణలు వ్యవసాయ, మెడికల్‌, కాలుష్య నివారణ, మిలటరీ రంగాలలో అనేక విప్లవాత్మక మార్పులకి కారణమైయ్యాయి. ‘అల్‌ హజెన్‌’ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా కాంతిశాస్త్రంపై ఒక పుస్తకాన్ని ప్రచురించడం ద్వారా ప్రయోగ పూర్వక విజ్ఞాన శాస్త్రానికి నాంది పలికాడని చెప్పాలి. ఆదిమ కాలంలో విజ్ఞానశాస్త్రాన్ని సైన్సులా కాకుండా తత్వశాస్త్రంలో ఒక భాగంగా భావించేవారు. పాశ్చాత్య దేశాల్లో ప్రకతి తత్వశాస్త్రం అనే పేరుతో ప్రస్తుతం విజ్ఞానశాస్త్రాలుగా భావించబడుతున్న ఖగోళ శాస్త్రం, వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం వంటి రంగాల మీద విస్తతంగా పరిశోధన చేసేవారు. ప్రాచీన భారతీయులు, గ్రీకు శాస్త్రవేత్తలు భౌతిక ప్రపంచాన్ని నేల, గాలి, నిప్పు, నీరు, నింగి అని వర్గీకరిస్తే, మధ్యప్రాచ్యానికి చెందిన శాస్త్రవేత్తలు మాత్రం పరిశోధనలు, ప్రయోగ పూర్వక విధానాల ద్వారా ప్రకతిలోని వివిధ అంశాలని వివిధ రకాలకి చెందిన పదార్థాలుగా వర్గీకరించడం ప్రారంభించారు. అలా ప్రారంభమయిన ప్రపంచ శాస్త్రీయ విజ్ఞానశాస్త్ర పురోగతి 19వ శతాబ్దానికి పూర్తి పక్వదశకి చేరుకుంది. 19వ శతాబ్దం గడిచేకొద్దీ విజ్ఞాన శాస్త్రం అంటే పరిశోధనల ద్వారా, హేతుబద్దంగా భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమేనన్న భావన బలపడింది. దీంతో 19వ శతాబ్దంలోనే జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం వంటి శాస్త్రాలు ఒక సమగ్రమయిన రూపాన్ని సంతరించుకున్నాయి. ఇదే శతాబ్దంలోనే శాస్త్రవేత్త, శాస్త్రీయ సమాజం, శాస్త్ర పరిశోధనా సంస్థ అనే భావనలు కూడా పుట్టుకొచ్చాయి.
ఆధునిక మానవుడు నేడు అనుభవిస్తున్న సకల సౌకర్యాలు ప్రపంచస్థాయిలో శాస్త్ర, సాంకేతిక రంగాలు సాధించిన ప్రగతి ద్వారానే సాధ్యమైనది అన్నది వాస్తవం. మానవుడు సాధించిన ప్రగతికి అంతా ప్రకతే ప్రేరణనిచ్చింది. పక్షిని చూసి విమానం కనిపెట్టిన మానవుడు, చేపని చూసి పడవని నిర్మించాడు. ఇలా ప్రపంచం సాధించిన సాంకేతిక ప్రగతిలో ప్రకతి అందించిన ప్రేరణే అంతఃసూత్రంగా కనిపిస్తుంది. మానవునిలో శాస్త్రీయ ఆలోచనా దక్ఫదం, పరిశోధనా దష్టి ఫ్రారంభం కాక ముందు సకల చరాచర సష్టికి కంటికి కనిపించని అతీంద్రియ శక్తులే కారణం అని విశ్వసించేవారు. కాలక్రమేణా ఈ విశ్వాసాల పునాదుల మీదనే మత భావజాలం విస్తరించింది. ఇది చాలాకాలం మానవులలో శాస్త్రీయ ఆలోచనా దక్పథాన్ని వద్ధి చెందకుండా అడ్డుకుంది. మానవ మేధస్సు వికాసం పొందిన తరవాత సష్టిలోని ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, అది ప్రకతి ద్వారా ప్రభావితమవుతుందని కొంతమంది శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అప్పటి వరకు భూమి బల్లపరుపుగా ఉంది అని ప్రభోదించిన మత గ్రంథాల్ని ధిక్కరిస్తూ కోపర్నికస్‌ భూమి గుండ్రంగా ఉంటుంది, అది సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని ఒక నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దీనినే సూర్యకేంద్రక సిద్ధాంతం అంటారు. సరిగ్గా అటుఇటుగా ఈ సూర్యకేంద్ర సిద్ధాంతాలను, కోపర్నికస్‌ కన్నా ముందు కొంతమంది ప్రతిపాదించినప్పటికీ, గ్రహాల కదలికల ఆధారంగా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని మొట్టమొదట నిరూపించింది మాత్రం కోపర్నికసే. భూమి తన అక్షం పైన తాను తీరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుందని, తత్ఫలితంగానే రాత్రి పగలూ ఏర్పడుతున్నాయని ఆయన స్పష్టం చేసాడు. భూమి యొక్క భ్రమణ, పరిభ్రమణాల వల్లే శీతోష్ణ స్థితులు, ఋతువులు ఏర్పడుతున్నాయని తేల్చి చెప్పాడు. అయితే కోపర్నికస్‌ ప్రతిపాదనలు ఆ కాలంలో పెను ప్రకంపనాలు సష్టించాయి. అప్పటికే మత గ్రంథాలు, జ్యోతిష్య గ్రంథాలు సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని బోధిస్తున్నాయి. మత భావనలతో నిర్మితమయిన ”ఖగోళ శాస్త్రాన్నే తలక్రిందులుగా చెయ్యాలని చూస్తున్న మూర్ఖుడు కోపర్నికస్‌” అంటూ మత పెద్దలు ఆయన మీద విరుచుకు పడ్డారు. ఈ సూత్రీకరణలతో కోపర్నికస్‌ రచించిన గ్రంథాన్ని విజ్ఞాన గ్రంధంగా నాటి సమాజం ఒప్పుకోలేదు. ఆ తరవాత వివిధ కాలాల్లో వచ్చిన ఎంతోమంది శాస్త్రవేత్తలు మత పెద్దల నుండి ఇంతకన్నా తీవ్రమయిన దాడినే ఎదుర్కున్నారు. ఇదే క్రమంలో నమ్మిన సిద్ధాంతాల్ని నిలబెట్టుకోవటం కోసం ఎంతోమంది తమ విలువైన ప్రాణాలను ఫణంగా పెట్టారు. జాతీయ సైన్సు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో వారి త్యాగాలని గుర్తు చేసుకోవటం మన కర్తవ్యం.
‘సత్యం వధ… సైన్సు చెర…’
కోపర్నికస్‌ 16వ శతాబ్దం ప్రారంభంలోనే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆ తరవాత కాలంలో వచ్చిన గెలీలియో కూడా ఇతర గ్రహాల పరిశీలనలు వల్ల భూమి కదలికలో ఉందని, అంతరిక్షంలో ఒక బిందువు వద్ద స్థిరంగా లేదని ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదానికి గెలీలియో, కోపర్నికస్‌ సూర్యకేంద్రక సిద్ధాంతాన్నే ప్రాతిపదికగా తీసుకున్నాడు.
అప్పటికే పవిత్ర మత గ్రంధాలు బోధిస్తున్న భూకేంద్రీయ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ గెలీలియో, కోపర్నికన్‌ సిద్ధాంతాన్ని బలపరచటం మతాధికారులకి అంతులేని ఆగ్రహాన్ని కలిగించింది. ఆధునిక వైజ్ఞానిక పితామహుడిగా ప్రపంచానికి టెలిస్కోప్‌ అందించిన గెలీలియో రాజ్యం చేతిలో అనేక హింసలు అనుభవించి మరణించాడు. కాలాన్ని కొలవడానికి ఏ రకమయిన గడియారాలూ లేని సమయంలో వేలాడుతున్న చర్చి దీపాల కదలికలతో డోలనా కాలాలను గణించి సమయాన్ని అంచనా వేసిన ప్రతిభావంతుడు గెలీలియో. ఈ పరిశీలన ఆధారంగానే ఆయన ‘పల్స్‌ మీటరు’ని రూపొందించాడు. ఆయన రచించిన యాంత్రిక శాస్త్రం అనేక నూతన ఆవిష్కరణలకి ఉపిరి పోసింది. టెలిస్కోప్‌ ని తయారు చేయటం గెలీలియో పరిశోధనలో అత్యంత కీలకమైనది. కటకాలను ఉపయోగించి దూరపు వస్తువులను తలకిందులుగా చూడగలుగు తున్నారని తెలిసి, ఆరు నెలల స్వల్ప కాలవ్యవధిలో టెలిస్కోపును ఆవిష్కరించిన గొప్ప శాస్త్రవేత్త. దీనిద్వారా ఎన్నో విశ్వ రహస్యాలను కనుగొనటానికి సాధ్యమైంది. గెలీలియో కోపర్నికస్‌ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని బలపర్చటం, మత సిద్ధాంతాల అధీనంలో నడుస్తున్న రాజ్యానికి, మతాధికారులకి నచ్చలేదు. అందువల్ల మతాధికారులు గెలీలియో చేస్తున్న ప్రయోగాలు మత వ్యతిరేకమైనవని తీర్మానించి, ఆ ప్రయోగ ఫలితాలు ఎన్నటికీ వెల్లడి చేయకూడదని ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షల్ని ఏ మాత్రం ఖాతరు చేయకుండా గెలీలియో తన ప్రయోగాల సారంతో 1632లో ‘డైలాగ్స్‌ కన్సర్నింగ్‌ ది టూ ఛీఫ్‌ వరల్డ్‌ సిస్టమ్స్‌’ అనే గ్రంథాన్ని ప్రచురించాడు. దీంతో ఆగ్రహించిన మతాధికారులు గెలీలియోకు యావజ్జీవ కారాగార శిక్ష విధించటంతో పాటు, అతని పుస్తక ప్రచురణను అడ్డుకున్నారు. ఈ శిక్ష అనుభవిస్తున్న కాలంలోనే ఆయన తన కంటిచూపు కోల్పోయి, ఆ తర్వాత అత్యంత దీనస్థితిలో గెలీలియో మరణించారు. తను నమ్మిన సత్యాన్ని నిర్భయంగా చాటటంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా గెలీలియో వెనకడుగు వేయలేదు. మానవుని కన్ను చూడలేని ఎన్నో ఖగోళ దశ్యాల్ని వీక్షించడానికి కారణమయిన టెలిస్కోప్‌ ని ప్రపంచానికి అందించిన ఆధునిక వైజ్ఞానిక పితామహుడు ఆఖరికి కంటిచూపు కోల్పోయి మరణించటం విషాదం.
కోపర్నికస్‌ సిద్ధాంతాన్ని సమర్ధించినందుకు, అదేవిధంగా తన భావాలని స్వేచ్చగా ప్రకటించినందుకు మరొక ప్రఖ్యాత శాస్త్రవేత్త కూడా తన ప్రాణాలని కోల్పోయాడు. అతనే గియోర్డానో బ్రూనో. ఈయన కూడా అప్పటికి సమాజంలో చెలామణిలో ఉన్న మతవిశ్వాసాలకి విరుద్ధంగా కోపర్నికస్‌ ప్రతిపాదించిన సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని సమర్థించాడు. రాజ్యం నుండి ఎన్ని ఇబ్బందులు ఎదురయినా బ్రూనో తుదికంటూ, తను నమ్మిన సిద్ధాంతంపైనే నిలబడ్డాడు. దానికోసమే తన విలువయిన ప్రాణాల్ని కోల్పోవలసి వచ్చినా ఆయన వెనుదీయలేదు. చివరిగా తనకి ఉరిశిక్ష విధించిన అధికారుల్ని సైతం ధిక్కరిస్తూ, ”నా శిక్షను ఉచ్చరించేటప్పుడు, అది వింటున్న నా కన్నా, శిక్ష విధిస్తున్న మీకే ఎక్కువ భయం కలుగుతుంది” అంటాడు. ఇలా సత్యాన్ని నిలబెట్టటానికి, మానవ జాతికి శాస్త్రీయ ఆలోచనా దక్ఫథాన్ని అందివ్వటానికి ఎంతోమంది శాస్త్రవేత్తలు తమ ప్రాణాలను కోల్పోయారు. సమాజంలో చెలమణిలో ఉంది కాబట్టి దేన్నీ గుడ్డిగా విశ్వసించకూడదు, తార్కికదష్టితో అన్ని అంశాలను పరిశిలించి హేతుబద్ధమైన వాటినే సత్యాలుగా అంగీకరించాలని భోధించిన సోక్రటీసు కూడా రాజ్యం విధించిన శిక్షకి బలై పోయాడు. ఇలా ఎంతోమంది ప్రాణ త్యాగాలతో ప్రపంచంలో విజ్ఞాన శాస్త్ర వికాసానికి దారులు పడ్డాయి.
భారత దేశ విజ్ఞాన శాస్త్ర ప్రగతికి దారులేసిన ఆధునికుడు ‘రామన్‌’.
ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయస్థాయిలో దేదీప్యమానం చేసిన శాస్త్రవేత్తల్లో సర్‌ సీవీ రామన్‌ అగ్రగణ్యుడు. వైజ్ఞానిక ఆవిష్కరణల్లో భారతీయులకు నోబెల్‌ రావడం గగనం. అలాంటిది సర్‌ సీవీ రామన్‌ ఆ ఘనత సాధించి చరిత్ర పుటల్లో నిలిచారు. అంతేకాదు, విజ్ఞాన శాస్త్రంలో నోబెల్‌ అందుకున్న ఏకైక ఆసియా వాసిగా కూడా ఆయన చరిత్ర సష్టించారు. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో అయినా ‘నా మతం సైన్సు, దానినే నేను జీవితాంతం ఆరాధిస్తా’ అని ప్రకటించిన నిజమయిన శాస్త్ర విజ్ఞాన శిఖరం సర్‌ సీవీ రామన్‌. 1888 నవంబరు 7న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో శ్రీమతి పార్వతి అమ్మాళ్‌, చంద్రశేఖర్‌ అయ్యర్‌ దంపతులకు జన్మించిన రామన్‌, చిన్ననాటి నుంచే విజ్ఞాన శాస్త్ర విషయాలపై అమితాసక్తిని ప్రదర్శించేవారు. తండ్రి కూడా భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు కావడంతో ఆయన జిజ్ఞాస మరింత పెరిగింది. చిన్ననాటి నుండే తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్‌ తన ప్రాథమిక విద్యను విశాఖపట్నంలో పూర్తి చేసారు. అనంతరం రామన్‌ 12 ఏళ్లకే మెట్రిక్యులేషన్‌ పూర్తి చేసి ఫిజిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించారు. ఆ తర్వాత మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి భౌతిక శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసి, భౌతిక శాస్త్రంలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి వ్యక్తిగా చరిత్ర సష్టించారు.
తొలినాళ్ళలో శబ్దశాస్త్రంపై ఎక్కువగా పరిశోధనలు జరిపిన రామన్‌, ఆ తర్వాతి కాలంలో కాంతిశాస్త్రం వైపు తన పరిశోధనా దష్టిని మళ్లించారు. ఇంగ్లాండు నుంచి తిరిగొస్తూ ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండూ నీలిరంగులో ఉండటం ఆయన్ని అమితంగా ఆకర్షించింది. సముద్రపు నీలం రంగుకు కారణం ఆకాశపు నీలిరంగు ప్రతిబింబంగా ఏర్పడటం కాదని, సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే దానికి కారణమై ఉంటుందని ఆయన ఊహించారు. ఈ ఊహే భారత దేశం యొక్క ఖ్యాతిని నోబెల్‌ వరకు నడిపించింది. అప్పటి నుండి రామన్‌ తన ప్రాకల్పనలను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాల కాంతి పరిక్షేపణం చెందటం గురించి విస్తతంగా పరిశోధనలు చేశారు. 1927 ఏడాదికి భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్‌ బహుమతి పొందిన కాంప్టన్‌ ఎక్స్‌ కిరణాల పరిశోధన నిజమైనపుడు, కాంతి విషయంలోనూ అది నిజం కావాలంటూ ఆలోచనలో పడ్డాడు. ఈ ఆలోచనే రామన్‌ ఎపెక్ట్‌ కి దారులేసింది. అధునాతనమైన పరికరాలు అందుబాటులో లేకపోయినా ఆయన తన ప్రయత్నాన్ని ఆపలేదు. మొక్కవోని దీక్షతో ఆయన జరిపిన పరిశోధన ఫలితంగా 1928 ఫిబ్రవరి 28 న రామన్‌ ఎఫెక్ట్‌ ను కనుగొన్నారు. పారదర్శకంగా ఉన్న ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కాంతి ప్రసరించినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుందని రామన్‌ తన పరిశోధన ద్వారా నిరూపించారు. ఈ దగ్విషయాన్ని 1928 మార్చి 16న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో వెల్లడించారు. దీనికి గుర్తింపుగా నాటి బ్రిటీష్‌ ప్రభుత్వం 1929లో నైట్‌ హుడ్‌ బిరుదుతో రామన్‌ ను సత్కరించింది. రామన్‌ ఎఫెక్ట్‌ అసామాన్యమైందని కేవలం రూ.200 కూడా విలువలేని పరికరాలతో దగ్విషయ నిరూపణ జరగడం అద్భుతమైందని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ కొనియాడారు. ఈ పరిశోధనను గుర్తించిన రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ భౌతికశాస్త్రంలో రామన్‌ అందించిన సేవలని గుర్తించి 1930లో నోబెల్‌ బహుమతి ప్రధానం చేసింది. విజ్ఞాన రంగానికి రామన్‌ అందించిన సేవలకు గుర్తుగా భారత దేశం 1954లో దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్నతో రామన్‌ని సత్కరించింది. భౌతికశాస్త్రంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిని సంపాదించుకున్న సీవీ రామన్‌ 1970 నవంబర్‌ 21న కన్నుమాశారు.
భారత్‌లో శాస్త్ర సాంకేతిక రంగాల పురోగతి
సర్‌ సివి రామన్‌ అందించిన రామన్‌ ఎపెక్ట్‌ తో భారతదేశంలో కొత్తపుంతలు తొక్కిన విజ్ఞానశాస్త్ర ప్రగతి, ఆ తర్వాతి కాలంలో అతున్నత స్థాయికి చేరుకుంది. సీవీ రామన్‌, అన్నామణి, ఎపిజె అబ్దుల్‌ కలాం, ఎం.ఎస్‌.స్వామినాథన్‌ వంటి అనేక జగద్విఖ్యాత శాస్త్రవేత్తలు భారతదేశం యొక్క పరిశోధనా పటిమను ప్రపంచ దేశాలకి తెలిసేలా చేసారు. స్వాతంత్య్రం తర్వాత భారతదేశం ప్రధానంగా శాస్త్ర సాంకేతిక రంగాల అభివద్ధికి అనేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే 1951లో దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశ పెట్టిన ప్రణాళిక ముసాయిదాలో ‘శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనల’పై ఒక ప్రత్యేక అధ్యాయాన్ని పొందు పరిచారు. తద్వారా దేశంలో శాస్త్రీయ పరిశోధనలకు పునాది పడింది. అనంతరం దేశంలో అనేక పరిశోధన సంస్థల ఏర్పాటు జరిగింది. నేషనల్‌ ఫిజికల్‌ లాబొరేటరీ ఆఫ్‌ ఇండియా (ఢిల్లీ), నేషనల్‌ కెమికల్‌ లాబొరేటరీ (పూణే, మహారాష్ట్ర), సెంట్రల్‌ ఎలక్ట్రోకెమికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (కరైకుడి, తమిళనాడు) వంటి 11 జాతీయ స్థాయిలో పరిశోధనా సంస్థలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత రేడియో అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్స్టిట్యూట్‌, సెంట్రల్‌ సాల్ట్‌ రీసెర్చ్‌ స్టేషన్‌లకు కూడా ప్రతిపాదనలు జరిగాయి. ఇదేకాలంలో అంతరిక్ష పరిశోధనలకు కూడా భారత దేశంలో అడుగులు పడ్డాయి.
1957లో రష్యా తన మొదటి శాటిలైట్‌ స్పుత్నిక్‌ను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది. దాని నుండి స్ఫూర్తి పొందిన హోమీ భాభా, అప్పటి ప్రధాని నెహ్రూ సహకారంతో 1962వ సంవత్సరంలో ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌ (ఇంకార్ప్‌) అనే సంస్థని ఏర్పాటు చేసారు. భారత దేశంలో ఏర్పాటైన మొదటి అంతరిక్ష కేంద్రం ఇదే. 1969లో ఇంకార్ప్‌ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)గా రూపాంతరం చెందింది. 1975నాటికి భారత దేశం సొంతంగా నిర్మిచుకున్న ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ని ప్రయోగించే స్థాయికీ ఎదిగింది. అనేక వైఫల్యాల అనంతరం 1980లో విజయవంతంగా ప్రయోగించిన ఎస్సెల్వీతో రోహిణి-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. భారతదేశం ప్రయోగించిన తొట్టతొలి ఉపగ్రహంగా రోహిణి-1 చరిత్రలో నిలిచిపోయింది. అప్పటినుండి అప్రతిహతంగా సాగిన భారత్‌ అంతరిక్ష పరిశోధన ప్రయోగాల ప్రస్థానం చంద్రుని మీదికి ఉపగ్రహాలను విజయవంతంగా పంపించే స్థాయికీ వద్ధి చెందింది. భారత్‌ మూన్‌ మిషన్‌లో భాగంగా.. 2008 అక్టోబర్‌ 22న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్‌-1 ప్రయోగం చేపట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో చంద్రుడి ఉపరితలంపై కాలు మోపిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించింది. ఈ విజయం అందించిన స్పూర్తితో మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌కు భారత్‌ శ్రీకారం చుట్టింది. 2013 నవంబర్‌ 5వ తేదీన మంగళ్‌ యాన్‌-1ను అంతరిక్షంలోకి ప్రయోగించారు. 2014 సెప్టెంబర్‌ 24వ తేదీన ఇది అంగారక గ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. 2023 సంవత్సరంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌-3ని విజయవంతంగా సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయటం ద్వారా ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో తిరుగులేని శక్తిగా అవతరించింది. ఒక్క అంతరిక్ష పరిశోధనల్లోనే కాదు, వైద్య రంగం, బయోటెక్నాలజీ, అణు పరిశోధన రంగాల్లో సాంకేతిక పరంగా భారత దేశం ఎనలేని ప్రగతిని సాధించింది.
తిరోగమనంపైపు పయనం..
నిజానికి ప్రపంచ విజ్ఞాన శాస్త్ర ప్రస్థానం తొలినాళల్లో ఎంతటి గడ్డు స్థితిని ఎదుర్కొందో, సరిగ్గా అదే గడ్డు స్థితిని ఎదుర్కునే రోజులు వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇది అక్షర సత్యం. భారత దేశంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే అంశాన్ని బలపరుస్తున్నాయి. మానవ పరిణామక్రమాన్ని తిరుగులేని సాక్ష్యాలతో సిద్ధాంతీకరించిన డార్విన్‌ పరిణామవాదాన్ని పాఠ్యాంశాల నుండి తొలగించటమే దీనికి నిదర్శనం. డార్విన్‌ సిద్ధాంతం సష్టివాదాన్ని తిరస్కరిస్తుంది. పరిణామ వాదాన్ని బలపరుస్తుంది. జీవుల చుట్టూ ఉన్న ఆవరణ వ్యవస్థల ప్రభావం జీవుల మనుగడని నిర్దేశిస్తుంది అని డార్విన్‌ తేల్చి చెప్పాడు. అతని సహజ ఎంపిక సిద్ధాంతం కొత్త జాతుల ఏర్పాటుపై గొప్ప తార్కిక, హేతుబద్ధమైన వివరణను అందించింది. అందుకే డార్విన్‌ని పరిణామశాస్త్ర పితామహుడిగా కొనియాడతారు. వనరుల కోసం జీవుల మధ్య జరిగే పోరాటం, పర్యావరణ ప్రభావం వంటి అనేక అంశాలతో పాటు, జీవులు అంతరించిపోవటం వంటి కీలక అంశాల మీద కూడా డార్విన్‌ జరిపిన పరిశోధన అసాధారణమైనది. డార్విన్‌ శాస్త్రీయ సిద్ధాంతం, అజ్ఞానంతో కూడిన మూఢనమ్మకాలను తిప్పికొట్టింది. మతం పేరుతో రాజకీయాలు చేస్తూ అధికారాన్ని నిలబెట్టుకొవాలని భావిస్తున్న పాలకపక్షాలని భయపెడుతున్న అంశం బహుశా ఇదే కావచ్చు. సమాజాన్ని అంధకారంలోకి నెట్టే సష్టివాదాన్ని తిరస్కరిస్తూ, పరిణామవాదంతో సమాజాన్ని విజ్ఞానపు వెలుగు తీరాలవైపు మళ్లించిన డార్విన్‌ సిద్ధాంతాన్ని పాఠ్యాంశాల నుండి తొలగించటం ఆదిమకాలానికి చెందిన మూర్ఖపు ఆలోచనగానే పరిగణించాలి.
ఏ సమాజమైనా వాస్తవాల మీద, శాస్త్రీయత మీద ఆధారపడే అభివద్ధి చెందుతుంది. కేవలం వ్యక్తిగత నమ్మకాలు, విశ్వాసాల మీద ఆధారపడి ఏ రకమైన సాంకేతిక, సామాజిక అభివద్ధి సాధ్యం కాదు.
ఆశాస్త్రీయమైన ఆలోచనలపై ఆధారపడితే సమాజం తిరోగమనం వైపు పయనిస్తుంది. శాస్త్రీయతతో కూడిన ఆలోచనా విధానాల ద్వారా మాత్రమే సాంకేతిక అభివద్ధి సాధ్యమయి సమాజం ముందుకు పోతుంది. భారత రాజ్యాంగం కూడా శాస్త్రీయ దక్ఫధాన్ని బలపరుస్తుంది. అంధ విశ్వాసం, మూఢనమ్మకాలు నుండి సమాజం విముక్తి కావాలంటే శాస్త్రీయ ఆలోచనా దక్ఫదం ఒక్కటే మార్గం. సహజ వనరులు, ప్రత్యేకించి శక్తి, వాతావరణ మార్పుల వినాశకరమైన ప్రభావాలను ప్రపంచం తీవ్రంగా ఎదుర్కొంటున్నది. ఇలాంటి తరుణంలో, దేశంలోని కోట్లాది మంది ప్రజలకు మెరుగైన జీవితాలను అందించాలంటే సైన్స్‌, శాస్త్రీయ దక్పథం తప్పనిసరి. హేతుబద్ధమైన, వాస్తవాధారిత ఆలోచనా క్రమంతో సర్వ మానవ సంక్షేమాన్ని కాంక్షించే శాస్త్రీయ దక్పధాన్ని ఈ జాతీయ దినోత్సవం భావి తరాలకి వాగ్దానం చేస్తుందని ఆశిద్దాం…

డా|| కె. శశిధర్‌ ,
9491991918 

]]>
మేడారం జాతర ధిక్కార స్వరానికి ప్రతీక … https://navatelangana.com/medaram-jatara-symbolizes-the-voice-of-defiance/ Sat, 17 Feb 2024 17:07:41 +0000 https://navatelangana.com/?p=230437 మేడారం జాతర ధిక్కార స్వరానికి ప్రతీక ...మదమెక్కిన అధికారానికి ధిక్కార స్వరంగా నిలుస్తుంది. ఆ ధిక్కార స్వరంలో సంపూర్ణ ధైర్యం తప్ప అణుమాత్రమైనా పిరికితనం ఉండదు. న్యాయాన్ని అణచివేయాలని చూస్తే మహా సామ్రాజ్య కోటలైనా బీటలు వారుతాయి. అకారణ కయ్యానికి కాలుదువ్వితే చక్రవర్తులైనా పశ్చాత్తాపానికి గురికాక తప్పదు. అమాయక ప్రజల పక్షాన నిలిచిన సామంతరాజుపై అసూయాద్వేషాలతో రాజ్యాధినేతే సమరానికి దిగిన వైనం… తన ప్రాణాలను తృణప్రాయంగా భావించిన ఆ సామంత రాజు, ఆయన బంధుగణం వీరోచిత పోరాటం సాగించి దేవేరీ సమరాంగనాన నిలిచి శతృసైన్యాన్ని చీల్చి చెండాడారు. అనంతరం అమరవీరులయ్యారు. ఆ వీరులు కుంకుమ భరిణ రూపంలో దర్శనమిచ్చారు అనే నమ్మకంతో ప్రజలు జరుపుకునే ఘట్టమే మేడారం సమ్మక్క, సారక్క జాతర అని చరిత్ర చెబుతుంది.
చరిత్ర ఎలా ఉన్నా ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క, సారక్కల జాతర పేరు సంతరించుకుంది. 2014లో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించారు. ప్రతి రెండేండ్లకోసారి మేడారంలో నాలుగు రోజులపాటు ఈ వేడుకలు అద్భుతంగా నిర్వహించడం ఆనవాయితీ. ఉత్తర భారతదేశంలో జరిగే కుంభమేళాకు ఎంత పేరు ప్రఖ్యాతులున్నాయో, దక్షిణ భారతాన తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఈ జాతరకు అంతకు రెట్టింపు పేరు ప్రఖ్యాతులున్నాయి. దేశ, విదేశాల నుంచి కోట్ల సంఖ్యలో ఈ జాతరకు తరలివచ్చే ప్రజలే ఇందుకు నిదర్శనం. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రస్తుత ములుగు జిల్లాలోని ములుగుకు సుమారు 44 కిలోమీటర్ల దూరంలో మేడారం గ్రామం ఉంది. తాడ్వాయి మండలం మారుమూల అటవీ ప్రాంతంలో ఈ కుగ్రామం నెలకొని ఉంది.
ప్రజలకు అండగా నిలబడి
శతాబ్దాల చరిత్ర కలిగిన మేడారం జాతరకు సంబంధించి ఎన్నో కథనాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన కథనం ప్రకారం… కరువు కాటకాల వల్ల కప్పం కట్టలేకపోయిన సామంత రాజుపై ఆ రాజ్య చక్రవర్తి రాజ్యాధికార దర్పం ప్రదర్శించి సమరానికి దిగుతాడు. అడవిబిడ్డల సంక్షేమం కోసం ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఆ సామంత రాజు, ఆయన బంధుగణం వీరోచిత పోరాటం చేసి ప్రాణాలు కోల్పోతారు. ఆ సామంత రాజు సతీమణి సమరాంగనాన దూకి శత్రుసంహారం చేసి అదృశ్యమై కుంకుమ భరిణిగా దర్శనమిస్తుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి అప్పటి నుండి ప్రజలు ఆమెను వీరనారిగా, దేవతగా ఆరాధించడం మొదలుపెట్టారని చరిత్ర చెబుతున్నది.
మేడారం, సమ్మక్క సారలమ్మలను ఆదివాసీ, గిరిపుత్రులు వనదేవతలుగా ఆరాధిస్తారు. ప్రతి రెండేళ్ల కోసారి నాలుగు రోజులపాటు జాతర వేడుకలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి మరో గాథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వకాలంలో కోయదొరలు వేట కోసం దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్లగా అక్కడో అద్భుత దృశ్యం కనిపించింది. పెద్ద పులులు, సింహాలు, ఏనుగులు చుట్టూ ఉండగా… ఆ మధ్యలో ఓ పెద్ద పాము పుట్ట మీద… దివ్యతేజస్సుతో మిలమిల మెరిసిపోతూ ఓ పసిపాప కనిపించింది. ఈ వింత దృశ్యాన్ని తిలకించిన కోయ పెద్దలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఆ పసిబిడ్డ మానవ మాత్రురాలు కాదని, దైవాంశ సంభూతురాలు, కారణ జన్మురాలు అని కోయదొరలు భావించారు. అసాధారణ రీతిలో, అద్భుత శక్తి సంపన్నురాలిగా కనిపించిన చంటి పాపను ఎంతో సంతోషంతో తమ గూడేనికి తెచ్చుకున్నారు. పాప కోయగూడేనికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో కొండ దేవతే పాప రూపంలో వచ్చిందని అందరూ విశ్వసించారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ అందాల పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంత కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు.
చారిత్రక ఆధారాలను బట్టి 12, 13 వ శతాబ్ద మధ్య కాలంలో కాకతీయుల సామ్రాజ్యంలో ఉన్న పొలవాసను గిరిజన దొర మేడరాజు పాలించేవాడు. 1260, 1320 శతాబ్ది కాలంలోని పొలవాస గ్రామం ఇప్పటి జగిత్యాల జిల్లా ప్రాంతంలో ఉంది. కాకతీయుల సామంతరాజైన పగిడిద్దరాజు, మేడరాజుకు మేనల్లుడు మేడారం పాలకుడు. మేడరాజు, తాను పెంచి పెద్ద చేసిన సమ్మక్కను పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. పగిడిద్దరాజు, సమ్మక్క దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగినట్టు మేడారం చరిత్ర చెబుతోంది. అయితే పగిడిద్దరాజు, సమ్మక్కల వివాహానికి సంబంధించిన ఓ కథనం ప్రాచుర్యంలో ఉంది.
అయోనిజ… అంటే సాధారణ జననానికి సంబంధం లేకుండా, అసాధారణ రీతిలో కారణ జన్మురాలిగా ఉద్భవించిన సమ్మక్క.. బాల్యంలో చేసిన చేష్టలన్నీ మన్యంవాసులకు అమిత ఆశ్చర్యం కల్గించాయి. దీర్ఘ కాల రోగగ్రస్తుడు సైతం ఆమె అమృత స్పర్శతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారినట్టు మేడారం చరిత్ర చెబుతోంది. గ్రామస్థులందరికీ పసిబిడ్డలా పరిచయమైన సమ్మక్క అందరినీ చల్లగా చూసే కల్పవల్లిగా పేరు పొందింది. వన దేవతగా సమ్మక్క అందరికీ ఆశీర్వాదాలు అందించేది. మేడరాజు పెంపకంలో బయ్యక్కపేటలో బాల్యంలో ఉన్న సమ్మక్క ప్రకృతి, మూగజీవాల చెంతన తనకు ఉండాలని ఉందని, దేవరగుట్ట కొండపై తనను ఒంటరిగా వదిలేయాలని కోరుతుంది. గుట్టకొండపై ఒంటరిగా సమ్మక్కను వదలడానికి మేడరాజు, ఇతర గ్రామస్థులు ఇష్టపడరు. అయితే కారణ జన్మురాలైన సమ్మక్క ఆజ్ఞను శిరసావహించాలని భావిస్తారు. ఆమె కోరిక ప్రకారం దేవర గుట్ట కొండపై వదిలేస్తారు. అక్కడ మంచినీటి వసతి ఎక్కడ కనిపించకపోవడంతో మేడరాజు ఒక బావిని తవ్వించి, ఆమెకు జాగ్రత్తలు చెప్పి బయలుదేరతాడు. ఆ ప్రాంతాన్ని పగిడిద్ద రాజు పాలించడం, కొన్నాళ్ల అనంతరం పగిడిద్ద రాజుకు సమ్మక్క పరిచయం అవ్వడం, మాఘ పౌర్ణమి నాడు వీరి వివాహం జరగడం తదితర ఘట్టాలు సాగుతాయి.
ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు కదా…! అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఆకస్మికంగా కరువు తలెత్తుతుంది. తిండికి పాట్లు పడాల్సిన పరిస్థితుల్లో ఉన్న మేడారం గ్రామస్థులకు పూట గడవడం గగనంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు కప్పం చెల్లించలేకపోయారు. సామంత రాజు పగిడిద్దరాజు శిస్తు కట్టకపోవడంపై కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు అసహనం చెందుతాడు. ఈ పరిస్థితుల్లో ప్రతాపరుద్రునికి, పగిడిద్దరాజుపై కొందరు వ్యక్తులు తప్పుడు ఫిర్యాదులు చేస్తారు. తన మామ మేడరాజుకు కాకతీయ పాలకుల ఆజ్ఞ లేకుండా ఆశ్రయం కల్పించినట్టు, కొండ కోయలను తిరుగుబాటుకు పగిడిద్దరాజు ప్రేరేపిస్తున్నట్టు వాస్తవ విరుద్ధమైన ఫిర్యాదులు కాకతీయ చక్రవర్తికి చేరినట్టు, దీంతో ఆగ్రహం చెందిన ప్రతాపరుద్రుడు మేడారంపై దండయాత్రకు దిగినట్టు చరిత్ర చెబుతోంది.
కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడు ఆకస్మికంగా యుద్ధానికి దిగడంతో ఆదివాసీలు అవాక్కయ్యారు. అసలే కరువుతో అల్లాడుతుంటే, ముందూ వెనకా ఆలోచించకుండా పాలించే పాలకుడే అకారణ సమరానికి దిగడంతో మన్యవాసులు తిరుగుబాటుకు సిద్ధమవుతారు. మాఘ శుద్ధ పౌర్ణమి రోజున కాకతీయ సేనలు మేడారంపై మూకుమ్మడిగా దాడికి దిగుతాయి. లక్నవరం సంపెంగ వాగు వద్ద అడవి బిడ్డలకు, కాకతీయ సేనలకు మధ్య భీకర పోరు సాగుతుంది. ప్రస్తుత ములుగు జిల్లాలోని లక్నవరం గ్రామమే అది. కాకతీయ సేనను మేడారం పాలకుడు పగిడిద్దరాజు తీవ్రంగా ప్రతిఘటిస్తాడు. ఈ సంగ్రామంలో పగిడిద్దరాజు కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మతో పాటు కుమారుడు జంపన్న, అల్లుడు గోవింద రాజులు వీరోచిత పోరాటం చేస్తారు. ఆ కుటుంబీకులు సాగించిన వీర పోరాటానికి కాకతీయ సేనలు బెంబేలెత్తాయి. అయితే సంప్రదాయ ఆయధాలతో పోరు సాగించిన పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు ప్రాణాలు కోల్పోతారు. దీంతో ఆగ్రహం చెందిన జంపన్న కాకతీయ సేనలను చీల్చి చెండాడతాడు. ఆ పోరులో జంపన్న శరీరమంతా రక్తసిక్తమవుతుంది. యుద్ధం చేస్తూనే సంపెంగ వాగులో పడి మరణిస్తాడు. ఆ నాటి నుంచి సంపెంగ వాగు జంపన్న వాగుగా మారింది.
సమ్మక్క కుమారుడు జంపన్న కాగా, కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మగా మేడారం చరిత్ర చెబుతోంది. కాకతీయ సైన్యంతో భీకర పోరాటం సాగించిన సమ్మక్క ఇద్దరు కుమార్తెలు కాకతీయ సేనలను గడగడలాడించి చివరకు ఆ మహా సంగ్రామంలో అమరులవుతారు. ఈ ప్రాంతంలో పూర్వకాలంలో ఒక చెట్టు ఉండేదని, ఆ చెట్టు వద్దకు ఓ సర్పం వచ్చి నాగదేవతగా ఆశీర్వాదాలు అందజేసేదని మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఆ నాగసర్పం నాగులమ్మ అని ప్రజలు నమ్ముతున్నారు. ఇక యుద్ధంలో తన కుటుంబీకులను కాకతీయ సేనలు హతమార్చారనే విషయం తెలుసుకున్న సమ్మక్క అపరకాళిలా విజృంభించింది. కాకతీయ సేనలను కకావికలం చేసి, పరుగులు పెట్టించింది. కాకతీయ సేనలపై సమ్మక్క సాగిస్తున్న భీకర పోరును, వీరత్వాన్ని చూసి కాకతీయ రాజు ప్రతాప రుద్రుడే ఆశ్చర్యపోయాడు. సమ్మక్క ఎదుట నిలబడి గెలవగల్గిన వీరుడెవరూ కాకతీయ సైన్యంలో లేకపోయారు. ధర్మయుద్ధంలో నిలవలేక, గెలవలేక పోతున్న సమయంలో ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా వెనుక వైపు నుంచి బల్లెంతో సమ్మక్కపై దాడిచేస్తాడు. దాంతో సమ్మక్క ఆ సైనికుడిని చీల్చి చెండాడి, శతృసైన్యం నలుదిశలా పరుగులు పెట్టేలా చేస్తుంది. ఆ తర్వాత ఒంటి నిండా గాయాలతో, రక్తసిక్త శరీరంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్ట వైపు వెళ్లి సమ్మక్క కనబడకుండా పోతుంది. ఆమె మాయమైన చోటు నెమలి నార చెట్టు కింద ఓ కుంకుమ భరిణ దర్శనమిస్తుంది. ఇది సమ్మక్క తల్లే అని నమ్మిన గిరిపుత్రులు ఆ కుంకుమ భరిణనే సమ్మక్కగా ఆరాధిస్తున్నారు. తమ సంక్షేమం కోసం సమ్మక్క జీవితాన్ని త్యాగం చేసిందని, ఆమె సామాన్య మానవురాలు కాదని ఆదివాసీలు సమ్మక్క ఖ్యాతిని కొనియాడతారు. అప్పటి నుంచి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి నుంచి నాలుగు రోజులపాటు సమ్మక్క-సారలమ్మ జాతరను కోయ పూజారులు, గిరిపుత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు.
సమ్మక్క కుంకుమ భరిణగా దర్శనమిచ్చిన మరుసటి దినం కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రునికి, తమ కులదేవత కాకతీదేవి స్వప్నంలో కనిపించి అతని చర్యలపై ఆగ్రహం చెందుతుంది. పాప పరిహారం చేసుకోమని తెలియజేస్తుంది. దీంతో పశ్చాత్తాపానికి గురైన ప్రతాపరుద్రుడు వెంటనే యుద్దాన్ని నిలిపి వేసి మేడారం వాసులకు క్షమాపణలు చెబుతాడు. స్వేచ్ఛా రాజ్యంగా మేడారాన్ని ప్రకటించి కోయ రాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేస్తాడు. సమ్మక్క తల్లిని ఆరాధిస్తూ, రెండేళ్ల కోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలిస్తాడు. అప్పటి నుంచే మేడారం జాతర జరుగుతోందనే మరో కథ సైతం ప్రచారంలో ఉంది.
ప్రాచీన ఆచార వ్యవహారాలు, పురాతన పద్ధతులు పాటించడంలో అడవి బిడ్డలు అగ్రభాగంలో ఉంటారు. మంచి, మానవత్వాలను మంట కలిపే దుర్మార్గులపై పోరు సాగించి వీర మరణం పొందిన వారు ఎందరో మనకు ప్రాచీన చరిత్రలో కనిపిస్తారు. ఒక్కో గ్రామానికి ఒక్కో కథ ఉంటుంది. గ్రామ దేవతలకు సంబంధించిన ఎన్నో ధీర, వీర కథనాలు మనం వింటూ ఉంటాం. కొండ, కోన ప్రాంతాల్లోని తాడిత, పీడిత, బాధిత ప్రజల పక్షాన నిలబడి ఆ పోరాటంలో అసువులు బాసిన ఎందరో మహనీయులు ఉన్నారు. ఆ మహనీయులను ఆ ప్రాంత ప్రజలు దేవతామూర్తులుగా భావించి పూజలు, జాతరలు చేయడం ఆనవాయితీ. ప్రతి ఏటా నిర్దిష్ట రోజుల్లో ఆ త్యాగశీలురను తమ సంప్రదాయ పద్ధతిలో విశేషరీతిలో ఆరాధించడమే జాతర.
నాలుగు రోజుల జాతర తీరు పరిశీలిస్తే….
మాఘ పౌర్ణమి రోజున కన్నెపల్లి నుంచి సారక్క, కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజు విగ్రహరూపాలను భక్తులు తీసుకొచ్చి మేడారం గద్దెపై ఉంచుతారు. మొత్తం వేడుకలో అత్యంత ప్రధానమైన రోజు రెండో రోజు. చిలకల గుట్ట నుంచి సమ్మక్క తల్లికి ప్రతిరూపంగా ఉన్న కుంకుమ పెట్టె తీసుకొస్తారు. కోయ పూజారుల బృందం పలు పూజాకార్యక్రమాలు నిర్వహించి కొండపైకి చేరుకుంటారు. అక్కడ ప్రధాన పూజారి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాడు. సమ్మక్క త్యాగాన్ని కీర్తిస్తూ రెండో రోజు అమ్మవారిని తీసుకొచ్చి గద్దెపై ఉంచుతారు. సకల దేవతామూర్తులు గద్దెపై కొలువుదీరిన ఘట్టం అయ్యాక తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. చీరెలు, సారెలు, బియ్యం కొందరు సమర్పించగా, చాలామంది వారి బరువుకు సమానమైన బెల్లం (బంగారాన్ని) సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. చివరి రోజున చిలకల గుట్టపై కుంకుమ భరిణెను ఉంచడంతో ఈ మహత్తర కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది.
– గాడేపల్లి రామకృష్ణ, 9949815121

]]>